కంసుని బెదిరింపు, వసుదేవుని వివేకం మరియు బలరాముని గర్భసంక్రమణం

Kansa's Threat to Devaki and Vasudeva's Wisdom — Bhagavatam Canto 10

bhagavatam

ఈ ప్రవచనంలో శూరసేనుని వంశం, వసుదేవ దేవకీ వివాహం మరియు అశరీరవాణి కంసునికి హెచ్చరిక చేసిన సందర్భం వివరించబడింది. వసుదేవుడు ఆత్మతత్వం, కర్మ మరియు మృత్యువు అనివార్యత గురించి తాత్వికంగా వివరించి కంసుని శాంతపరచి దేవకిని రక్షించాడు. నారదుడు కంసునికి యాదవులు దేవాంశులని, భగవానుడు దేవకీ గర్భమున జన్మించనున్నాడని చెప్పగా కంసుడు వారిని బంధించి పుట్టిన బిడ్డలను చంపసాగాడు. చివరగా భగవానుని ఆజ్ఞచే యోగమాయ దేవకీ గర్భంలోని శేషాంశమును రోహిణి గర్భమున ఉంచగా అతడే బలరాముడుగా జన్మించాడు.

This discourse covers the lineage of Shurasena and the marriage of Vasudeva and Devaki, followed by the divine voice warning Kamsa that Devaki's eighth child would be his death. Vasudeva wisely pacifies Kamsa with philosophical teachings on the soul, karma, and the inevitability of death, ultimately promising to hand over their children. Narada later reveals to Kamsa that the Yadavas are divine beings and that the Lord will incarnate through Devaki, prompting Kamsa to imprison the couple and kill their children. The session concludes with the account of Balarama's miraculous transfer from Devaki's womb to Rohini's womb through Yogamaya, setting the stage for Krishna's birth.

← Prev Next →
Kansa's Threat to Devaki and Vasudeva's Wisdom — Bhagavatam Canto 10 bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః చారిత్ర నిర్మల జలః సత్పురుషనదోక్షయో భవతు నిత్యం యస్య విభవారవిందే విద్వద్భ్యమరాకృత వినోదాః సత్పురుషులు సెలేళ్ల వంటి వారు. వారి విశదవర్తనమే బురద లేని తేట నీరు. ఆ సెలేట చక్కగా వికసించి తావులీను తేనెలూరు పద్మాలు వారి ఐశ్వర్యం. ఆ వాసనలకు ఆకర్షింపబడి, ఆ తేనెలకు లోభపడి, తుమ్మెదలు చేరి ఆనందిస్తున్నట్లుగా విద్వాంసులు వారి చెంత చేరి చక్కటి వినోదాన్ని పొంది ఆనందిస్తూ ఉంటారు. ఆర్యోక్తి 24. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక దశమ స్కంధం రెండో పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు పరీక్షిత్ మహారాజు శుక్రుని అడిగినటువంటి ప్రశ్నలు, ఆ ప్రశ్నలో భాగంగా ఒక ఉపోద్ఘాతంలో బ్రహ్మ రుద్రాదులు వెళ్లి విష్ణుమూర్తిని కలవటం, వారు వారికి ఆదేశాలు అందించడం మనం విన్నాం. తర్వాత భాగాన్ని తెలుసుకుందాం. శూరసేనుడను రాజు యదువంశమున జన్మించి మధురా పట్టణమును తన రాజధానిగా చేసుకొని మధుర రాజ్యమును పాలించుచుండెను. మధుర యాదవ రాజధాని. మధురతో అన్ని యుగములందును భగవాను సంబంధం ఉండును. కావున అది పవిత్రమైన పట్టణం. శ్రీహరి అచట సన్నిహితుడై ఉండును. యదువంశమున శూరుని పుత్రుడు వసుదేవుడు దేవకిని పెండ్లాడెను. ఉగ్రసేనుడి కుమారుడు కంసుడు. దేవకుని కుమార్తె దేవకి. వారిరువురు అన్నదమ్ముల పిల్లలు. కంసుడు ఆమెను తోబుట్టువుగా ప్రేమించి అత్తవారింటికి తానే స్వయముగా రథము నడుపుచు తీసుకొని పోవలెనని బయలుదేరెను. వారి వెంట వందలాది రథములు, నాలుగు నూరుల ఏనుగులు, కొన్ని వేల గుర్రములు, దాసీ పరివారము అరణముగ దేవకునిచే వసంగబడినవి. వాద్యములు మ్రోగించుచుండగా బయలుదేరెను. వధువరులగు దేవకీ వసుదేవులు రథమును అధిరోహింపగా కంసుడు పగ్గం పట్టి గుర్రములను నడపసాగెను.

అప్పుడు అశరీరవాణి కంసా ఈ ఎనిమిదవ ఈమె ఎనిమిదవ సంతానము నీకు మృత్యువు కాబోవునున్నది నీవు దానిని ఎరుగక సంతసముతో రథము నడుపుచున్నావు అని వినబడెను. అది వినిన కంసుడు కోపము గలవాడై కత్తి దూసి జుత్తు పట్టుకొని దేవకిని చంప సిద్ధపడెను. మహానుభావుడగు వసుదేవుడు అతనిని అనునించుచు ఇట్లు పలికెను. బావా నీవు భోజ వంశమున పేరు పొందిన శూరుడవు అశరీర వాణికి అదిరి అదరి పెళ్లి అయిన చెల్లెలిని చంపుట తగదు. చావుకు భయపడవలెదా అంటావేమో. ఈమెను చంపిన చావు తప్పు తప్పుననుకొనుట పొరపాటు. పుట్టినప్పుడు దేహముతో పాటే మృత్యువు కూడా ఈ దేహమును మ్రింగుటకు ఆవిర్భవించును. నేడో నూరేళ్ల నాడో జన్మనెత్తిన వారికి చావు తప్పదు. దేహములోనున్న జీవుడు కర్మను అనుసరించి వేరొక శరీరమును ప్రవేశించి ఈ శరీరమును విడుచును. ఆకుపురుగు ముందుకు సాగి కాళ్ళతో పట్టుకొని కదలక నిలిచిన వెనక భాగమును ముందుకు లాగునట్లే వెనక శరీరమును చేరిన పిదపని జీవుడు వెనుకటి శరీరమును వదలును. నిద్ర పోవునప్పుడు కలలు వచ్చుచుండును. వెనక ఈ లోకములో చూచినవి వినినవి మనసునందు కావలెననిపించినవి కలలు అనుభవించుచుందురు. అప్పుడు పడుకొనిన శరీరం వంటి శరీరమునే వాని వాసనలను గుణములను అనుసరించి భగవానుడు సృజించును. అందు జీవుడు జ్ఞానముచే ప్రవేశించి ఈ పడుకొనిన శరీరము యొక్క స్మృతి లేని వాడై ఆ శరీరముతో సుఖములను దుఃఖములను అనుభవించుచుండును. కలలో ఈ శరీరములో ఉండి వేరొక శరీరమును పొంది కష్ట సుఖమును అనుభవించుచుందుము. కావున ఆ సుఖ దుఃఖములకు కారణము ఇప్పుడు మనము కోరెడు విషయముల వాసనలు మన మనసున పట్టుటయే. మన మనసు కర్మవశమున విషయములందు ప్రవర్తించుచుండును. సత్వరజస్తమో గుణములు మారి మారి సాగుచుండును. శరీరమును వదులు సమయమున ఏ గుణము పైకి లేచి మనసున తలచుచుండునో అట్టి శరీరమును జీవుడు పొందుచున్నాడు. కావున రాబోవు జన్మలకు ఈ జన్మలో చేయు కర్మలు సత్వరజస్తమో గుణముల ప్రభావమే కారణం. ఒకప్పుడు కర్మ ఫలము వేగము అనుభవమునకు వచ్చును. ఒకప్పుడు ఆలస్యముగా అందుకొనును.

ఇదంతయు ప్రకృతి యొక్క సంబంధముచే ఏర్పడిన శరీర సంబంధముచే కలుగునవే కానీ ఆత్మకు సుఖ దుఃఖములు ఉండవు. ఒక జ్యోతి నీటిలో ప్రతిఫలించును, అద్దంలోనూ ప్రతిఫలించును. అద్దములో చిన్నదిగా కదలక ఉండును, నీటిలో గాలికి కదిలిన నీటి కదలికచే కదులుచు పొడువుగా కనుపట్టుచుండును. అట్లే శరీర సంబంధముచే అందలి గుణముల తారతమ్యముచే సుఖదుఃఖములు అధికముగా ఉన్నట్లు తక్కువగా ఉన్నట్లు అనిపించుచుండును. ఇది తెలియక మనకు దుఃఖము కలుగునని వేరొకరికి ద్రోహమాచరించిన దానిచే తనకే తాను ద్రోహము చేసుకునవాడగును. తన క్షేమమును కోరుకొనువాడు ఇతరులకు ద్రోహము చేయరాదు. ఈమె నీ చెల్లెలు దీనురాలు నీ పుత్రికతో సమానురాలు. ఇప్పుడే కళ్యాణమై వచ్చుచున్నది. నీవు దీనవత్సలుడవు. అందుచే చంపుట నీకు తగదు. ఇట్లు వసుదేవుడు ఎంత అనునయముతో పలికినను అసుర స్వభావము కలవారితో సహచర్యము గల కంసుడు తన క్రూరమగు నిర్ణయము నుండి మరలలేకపోయెను. అతని పట్టుదలను చూచి వసుదేవుడు ఆమెను మృత్యువు నుండి ఎట్లైనను తప్పించవలెనని తనలో తాను ఇట్లు ఆలోచింపసాగెను. బుద్ధిమంతుడైన వాడు తన శక్తిని అనుసరించి, తన బుద్ధిని అనుసరించి మృత్యువును తొలగించుకొనుటకు ప్రయత్నించవలెను. ఎంత ప్రయత్నించినను మృత్యువు తొలగనిచో అది తన దోషము కాదు. ఈమెకు పుట్టిన పిల్లలను చంపుటకు అంగీకరించునని ఈమెను మృత్యువు నుండి తప్పింప ప్రయత్నింతును. అది తప్పు కదా అనినచో పిల్లలు కలగకపోవచ్చును. కలిగిన ఆనాటికి కంసుడు లేకుండా పోవచ్చును. అశరీరవాని తప్పునా? అనిన చనిపోవున నిర్ణయింపబడిన మార్కండేయుడు బ్రతకలేదా? చావు లేదని వరం పొందిన హిరణ్యకశిపుడు చనిపోలేదా? దైవ నిర్ణయము దాట శక్యము కాదు. అగ్ని ఒకచోట ఉన్న వస్తువులలో ఒక వస్తువునే ఒక వస్తువును వెంటనే కాల్చును. వేరొక వస్తువును కాల్చదు.

కారణమేమి? అదృష్టమే అనవలెను. అట్లే పుట్టుటకు గాని, చనిపోవుటకు గాని, దైవమే కారణము గాని వేరొకటి కాదు అని ఆలోచించి చాలా గౌరవముతో, ప్రసన్నమగు ముఖముతో వసుదేవుడు, నృశంసుడు, సిగ్గుమాలినవాడు అగు కంసునితో లీలగా నవ్వుచు ఇట్లు అనెను. బావా, అశరీర వాణి ఈమెకు పుట్టిన పిల్లవాని వలన నీకు మృత్యువని పలికెను కదా. ఈమె నీకు మృత్యువునకు కారణము కాదు. మృత్యువును కలిగించు ఈమెకు పుట్టిన పిల్లలను నీకు సమర్పించెదను. వారిని చంపి నీ మృత్యువు నివారించుకొనవచ్చును. ఈమెను వదలుము. వసుదేవుడు ఇట్లు చెప్పగానే కంసుని మనసు మారినది. ఈమెను చంపుట మానెను. వారిని మధుర చేర్చి వారింట ప్రవేశపెట్టి తాను గృహమునకేగెను. కొంత కాలము గడిచిన తరువాత దేవకీ వసుదేవులకు సంతానము కలిగెను. మొదటివాడు కీర్తిమంతుడు అను పేరు గల కుమారుడు. సత్యమునకు జంకి వసుదేవుడు ఆ కుమారుని కంసునకు సమర్పించెను. సాధువులకు సహించుటకు శక్యము గాని క్లేశము ఏదీయు కాదు. ఆత్మతత్వజ్ఞానము కలవారికి కోర తగినది ఏమియు ఉండదు. క్షుద్రమైన స్వభావము గలవారికి చేదగని పని ఉండదు. దృఢమైన మనసు గలవారికి వదలలేనిది ఏదియు కాదు. కావున వసుదేవుడు ధైర్యముతో సత్యమునే పాటించి కుమారుని కంసునకు అర్పించెను. సత్య వాక్యమునకు సంతసించి కంసుడు ఆ పిల్లవానిని చంపక తిరిగి తీసుకోమని చెప్పెను. వసుదేవుడు ఆ మాటకు సంతసించలేదు. అవ్యవస్థిత చిత్తుల యొక్క అనుగ్రహము కూడా భయంకరమే. ఒకనాడు నారదుడు కంసుని వద్దకు వచ్చి వసుదేవుడు మొదలగు యాదవులందరూ దేవతాంశము గలవారని. కంసుడు కంసుని అనుచరులు అసురాంశ సంభవులని భగవానుడు భూభారమగుచున్న అసురులను చంపుటకై దేవకీ గర్భమున జన్మించుచున్నాడని చెప్పారు. దానిని విని కంసుడు దేవకీ వసుదేవులు తనకు శత్రువులని భావించి

వారిని బంధించెను. వారికి పుట్టిన బిడ్డలను చంపుచుండెను. రాజులు హృదయము లేని వారై ఒకరి ప్రాణములతో తమ ప్రాణములు నిలుపుకొన ప్రయత్నించు లోభులు. వెనకటి జన్మమున విష్ణువుతో విరోధించి చనిపోయిన కాలనేమియే తానని కంసునకు తెలిసెను. ఉగ్రసేనుడు దేవాంశ కలవాడని తెలియగానే అతనిని బంధించి తానే శూరసేన దేశములను పాలించుచు మధురకు రాజై ఉండెను. ప్రలంబుడు, బకుడు. చానూరుడు, తృణావర్తుడు మొదలగువారు అతని అనుచరులకు అసురులు. రాజులలో బాణుడు, జరాసంధుడు మొదలగువారు అతనిని అనుసరించుచుండెడివారు. వీరితో కలిసి కంసుడు. యదువులను కురుపాంచాలాది దేశములను జయించి తన అధీనమున ఉంచుకొనెను. ఇట్లు అసుర ప్రాబల్యముచే దైవ వర్గము బంధములో నుండెను. ఇప్పుడు స్వామి సంకల్పముచే దేవకీ దేవి ఏడవసారి గర్భవతి ఆయను. ఇంతకుముందు ఆరుగురు కుమారులను కంసుడు చంపినాడు. ఈసారి ఆమె గర్భమున అనంతుడు భగవన్ నియమనచే ప్రవేశించినాడు. శ్రీహరి తన అధీనములోనున్న మాయాధిష్ఠాన దేవతను నందవ్రజమునకు ఏగుమని ఆజ్ఞాపించింది. అచట కంసుని భయముచే చాలామంది తలదాచుకొని ఉండిరి. నందవ్రజము యమునకు ఆవలి ఒడ్డున ఉన్నది. వసుదేవుని భార్య రోహిణి అచటనే ఉన్నది. భగవానుని ఆజ్ఞచే దేవకీ గర్భమున శేషాంశమున ఆవిర్భవించనున్న గర్భమును ఆకర్షించి పురోహిణి గర్భమున ఉంచుమని స్వామి నియమించెను. యోగమాయ నందుని యోగమాయ నందుని భార్య అయిన యశోదయందు జన్మించును. ఆమె దుర్గా, కాళీ, విజయ, వైష్ణవి, కుముద, చండిక, కృష్ణ, మాధవి, కన్యక, మాయ, నారాయణి, ఈశాని, శారద, అంబిక అను పేర్లతో లోకమును ఆరాధించుచొందురు. యోగమాయ దేవకి గర్భమును వెలికి తీసి రోహిణి గర్భమున ఉంచును. గర్భము నుండి వెలికి లాగబడిన నాడు లాగబడిన వాడు కనుక సంకర్షణుడు అనియు

లోకమును ఆనందింపజేయువాడు గనుక రాముడు అనియు బలము కలవాడు గనుక బలభద్రుడు అనియు అతనికి పేర్లు కలుగును. ఇట్లు భగవానుడు ఆదేశింపగా యోగమాయ నందవ్రజమునకేగెను. ఆమె శక్తిచే దేవకీ గర్భము స్రవించెను. గర్భస్రావమైనదని అందరూ అనుకొనుచుండిరి. కానీ యోగమాయ రోహిణి గర్భమున ఆ బిడ్డనుంచెను. ఈ విధముగా ఏడవ సంతతి బలరాముడు ఎనిమిదవ బిడ్డడుగా తాను జన్మించవలెనని భగవానుడు సంకల్పించి వసుదేవుని మనసున తాను ఆవేశించెను. దీని తర్వాత భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. May the pure water of history be for the sake of good people, may the play of the Vedas be for the sake of the virtuous, may the play of the Vedas be for the sake of the virtuous. The virtuous are like schools. Their explanation is like clear water without mud. That salata beautifully bloomed, and the wealth of Tavelinu, Teneeluru, and Padmalu. Attracted by those smells, greedy for those nectars, like bees gathering and enjoying, scholars gather near them, enjoying themselves by having a good time. Aarooki 24. Devotees of God, welcome to the second podcast of Srimad Bhagavata Tatva Deepika, Dasham Skandam. Until now, the questions asked by King Parikshit to Shukra, as part of that question, in an introduction, Brahma, Rudra, and others went and met Lord Vishnu, and we heard them giving orders to each other. Let's move on to the next part. Shurasena was born in the Yadu dynasty, made Madhura city his capital, and ruled the Madhura kingdom. Mathura is the Yadava capital. With sweetness, there is a relationship with the Lord in all ages. Therefore, it is sacred Town. Srihari is close by. In the Yadu dynasty, Vasudeva, the son of Shura, married Devaki. Kamsa, the son of Ugrasena. Devaki, the daughter of the Lord of Gods. They were siblings. Kamsa, loving her as his sister, decided to take her to her in-laws' house himself, driving the chariot. Hundreds of chariots, four hundred elephants, thousands of horses, and a retinue of maids were brought by the goddess from the forest. The musical instruments began to play. As the bride and groom, Devaki and Vasudeva, mounted the chariot, Kamsa took the reins and began to drive the horses.

Then a divine voice said, "Kansa, this eighth, this eighth offspring, death is about to befall you. Without knowing it, you are driving the chariot with joy," it was heard. Hearing that, Kamsa, filled with anger, drew his sword, took his hair, and prepared to kill Devaki. The great Vasudeva, praising him, spoke thus. Brother-in-law, you are a brave man known in the Bhoja dynasty. It is not right to kill a sister who is married to a spirit. You're not afraid of death, are you? It is a mistake to think that the death that killed her was a wrong death. When born, along with the body, death also emerges to swallow this body. For those born in the last hundred years, death is inevitable. The being in the body, following karma, enters another body and leaves this body. The leaf insect moves forward, holds onto its legs, and as it stops, it pulls the back part forward. After reaching the back part, the creature releases the back part. I used to have dreams when I fell asleep. Behind, in this world, what we have seen and heard is in our hearts They experience the dreams that they want. Then, the Lord creates a body like the body that is lying down, according to its smells and qualities. And the being, entering through knowledge, without the memory of this lying body, experiences pleasures and sorrows with that body. In a dream, being in this body, we obtain another body and experience hardship and happiness. Therefore, the reason for those pleasures and sorrows is that we hold the scents of the things we desire in our minds. Our mind acts according to the karma of the subjects. The qualities of Sattva, Rajas and Tamas change and continue. The body, at the time of leaving, whatever quality rises and is thought of in the mind, such a body is attained by the living being. Therefore, the karma performed in this birth is the reason for the influence of the qualities of Sattva, Rajas, and Tamas in the coming births. Once upon a time, the fruits of karma came to experience the speed. Once upon a time, it used to come late.

All of this is due to the relationship with nature, due to the relationship with the body, but the soul does not have happiness and sorrow. A ray of light reflects off water and also off a mirror. It remains small in the mirror, and appears long due to the movement of water, which moves in the water due to the movement of air. Similarly, due to bodily relations, due to the disparity of qualities, happiness and sorrow seem to be more or less. This, not knowing, causes us sorrow, and by betraying another, he betrays himself. He who desires his own good will not cause his own evil. She is your sister, the poor thing, your daughter-in-law. It's just getting married. You're a miser. Killing is not your thing. Thus, even though Vasudeva spoke with so much humility, Kamsa, who had a demonic nature and was associated with them, could not refrain from his cruel decision. Seeing his determination, Vasudeva began to think to himself that he must somehow save her from death. A wise man his power Following, following one's intellect, one should try to overcome death. No matter how much one tries, if death does not depart, it is not one's fault. I will try to save her from death, accepting that I will agree to kill her children. If that's the case, then children may not be born. Kamsa might have been destroyed at that time. Is it the spirit's fault? Markandeya, who was destined to die, did he not live? Hiranyakashipu, who received a boon that he would not die, did he not die? Divine Decree is not something that can be pushed against. Fire will immediately burn one object among the objects in one place. It doesn't burn anything else.

What's the reason? You've got luck. Likewise, thinking that neither birth nor death is the cause, nor is God different, with much respect and a pleasant face, Vasudeva said thus, laughing playfully with Kamsa, who was cruel, shameless. Brother-in-law, the unborn voice spoke to you that you are death because of the child born to her, didn't it? She's not the cause of your death. I will offer you the children born to her who causes death. By killing them, you can prevent your own death. Let her alone. As soon as Vasudeva said this, Kamsa's mind changed. He did not stop killing her. He brought them to the honey house, put them in the house, and went home. After some time had passed, Devaki and Vasudeva had children. The first one is the son named Kirtimanthu. Vasudeva, who was faithful to the truth, offered that son to Kamsa. For the saints, there is no suffering that is not possible to endure. Those who have self-knowledge will not have any desires. Those with a wicked heart need no introduction. Strong willed Nothing is unattainable for the greedy. Therefore, Vasudeva, with courage, followed the truth and offered his son to Kamsa. Satisfied with the truthful statement, Kamsudu told him to take back the child without killing it. Vasudeva was not convinced by this statement. Even the grace of unorganized minds is terrifying. Once upon a time, Narada came to Kamsa and said that all the Yadavas, starting with Vasudeva, were divine beings. Kamsa, Kamsa's followers are the descendants of demons, and the Lord said that he was born in Devaki's womb to kill the demons who were on the earth. Hearing this, Kamsa thought that Devaki and Vasudeva were his enemies

They were arrested. He was killing their babies. Kings are without heart, and are greedy who try to save their lives with the lives of others. Kansa learned that he was the one who died in a previous birth by opposing Vishnu. As soon as it was known that Ugrasena was a divine being, he was captured and he himself ruled Madhuraka, ruling the countries of Shurasena. Prelab, buddy. Chanurudu, Trunavartudu and others were demons to his followers. Among the kings, Bana, Jarasandha, and others followed him. Kamsa along with his servant. He conquered the Yadus, the Kuru, and the Panchala kingdoms and brought them under his control. Thus, due to the dominance of demons, the divine class was in bondage. Now, by the will of the Lord, Devaki Devi is pregnant for the seventh time. Kansa had earlier killed six sons of Kamsa. This time, the infinite God entered her womb by divine ordinance. Srihari ordered the Mayaadhishthana deity, who was under his control, to ascend to Nandavraj. There, many people hid out of fear of Kansa. Nandavrajamu to Yamuna It is on the other shore. Vasudeva's wife, Rohini, is right there. By the order of the Lord, attract the womb that is about to be born in Devaki's womb, in the form of a remnant, and place it in the womb of the Purohini, thus the Lord ordained. Yogamaya is born in Yashoda, the wife of Nandu, Yogamaya. She is worshiped by the world with the names Durga, Kali, Vijaya, Vaishnavi, Kumuda, Chandika, Krishna, Madhavi, Kanyaka, Maya, Narayani, Ishani, Sharada, Ambika. Yogamaya takes Devaki's womb and places it in Rohini's womb. Because he is the one who was pulled out of the womb, he is called a 'sankarshanudu'

Because he is the one who makes the world happy, he is called Rama, and because he is strong, he is called Balabhadra. Thus, as the Lord commanded, Yogamaya went to Nandavraj. By her power, the womb of Devaki was opened. Everyone thought it was a miscarriage. But Yogamaya gave birth to that child in Rohini's womb. In this way, the seventh descendant Balarama, Bhagavan resolved that he should be born as the eighth child, and he stirred Vasudeva's mind. We will learn about the next part in another podcast. Jai Srimannarayana and salutations to the Ashram Guru.