మాతృదేవి సునీతి ఓదార్పు - ధ్రువుని వనగమన నిశ్చయము
Suniti's Counsel & Dhruva's Journey to Forest
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, సవతి తల్లి సురుచి చేత అవమానింపబడిన బాల ధ్రువుని తల్లి సునీతి ప్రేమతో ఓదారుస్తుంది. మాతృహృదయంతో కూడిన ఆధ్యాత్మిక దృష్టితో సునీతి, శ్రీహరిని శరణు వేడుకోవడమే జీవితానికి సర్వోత్తమ మార్గమని తన పుత్రునకు బోధిస్తుంది. తల్లి వాక్కులతో స్ఫూర్తిపొందిన ధ్రువుడు భగవంతుని సాక్షాత్కారం కోసం వనగమనానికి దృఢంగా నిశ్చయించుకుంటాడు, పురాణ చరిత్రలో అత్యంత ప్రసిద్ధమైన భక్తియాత్రకు నాంది పలుకుతాడు.
In this sacred episode from Canto 4 of Srimad Bhagavatham, we witness the tender yet profound moment where Queen Suniti consoles her heartbroken son Dhruva after he is turned away from his father King Uttanapada's lap by the jealous queen Suruchi. With deep maternal wisdom and unwavering devotion, Suniti guides young Dhruva to seek refuge in Lord Vishnu as the only true solace and the highest goal of life. Inspired by his mother's counsel, the determined young prince resolves to leave for the forest in pursuit of the Lord's direct vision, setting the stage for one of the most celebrated devotional journeys in all of scripture.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః ఓం నమో భగవతే తస్మై యతయే తచ్చిదాత్మకం పురుషాయాది బీజాయ పరేశాయాభిధీమహి గజేంద్రుడు ఇట్లు పలికెను. పూర్ణుడు, సర్వ జగత్కారణుడు, సర్వేశ్వరుడు అగువ ఆ భగవానుని కొరకు నమస్కారం. చైతన్య పూర్ణమగువ ఈ జగత్తు ఆయన నుండియే ఆవిర్భవించినది. మేము ఆయనను ధ్యానించెదము. ఈత్ క్యాంటో థర్డ్ చాప్టర్ సెకండ్ ప్రేయర్. భగత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపికా చతుర్ధ స్కంధం పదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా ఇంతవరకు దక్షిణ యొక్క వృత్తాంతము పూర్తిగా మనం అనుభవించాం. ఇప్పుడు ధ్రువోపాఖ్యానంలో మనం అడుగు పెడుతున్నాం. శ్రద్ధగా అలికిద్దాం ధ్రువ చరిత్ర. ఉత్తానపాదునకు సునీతి, సురుచి అను ఇద్దరు భార్యలు ఉండిరి. అందు సురుచి ఉత్తానపాదునకు మిక్కిలి ప్రియమైనది. సునీతి యందు ప్రేమ లేదు ఆ సునీతి కుమారుడే ధృవుడు ఇందలి పేర్లు అన్నియు సార్ధకములు సురుచి మంచి రుచి గలది సునీతి మంచి నీతి గలది రుచి యందు ఉన్న ప్రేమ నీతి యందు ఉండదు అవును కదా ఒకనాడు సురుచి కుమారుడు ఉత్తముడు తండ్రి ఉత్తానపాదుని తొడపై కూర్చునెను. ఉత్తానపాదుడు అతనిని లాలించుచుండెను. సునీతి కుమారుడు ధ్రువుడు వచ్చి తాను కూడా తండ్రి తొడను ఎక్కవలెనని కోరెను. కానీ తండ్రి అంగీకరింపలేదు. తండ్రి తొడను ఎక్కవలెనని కోరుచున్న ధ్రువుని చూచి సురుచి ఉత్తానపాదుడు వినుచుండగా అతి గర్వముతో ఈర్ష్యతో ఇట్లు అనెను. నీవు నా కుమా కడుపున పుట్టలేదు. నీకు రాజు తొడను ఎక్కడి భాగ్యం ఎట్లు వచ్చును? పసివాడవు నీకు తెలియదు. నీకు పొంద వీలు కాని స్థానమును కోరుచున్నావు. తపస్సు చేసి భగవానుని ఆరాధింపుము. అతని అనుగ్రహం పొంది నా గర్భమున జన్మించినచో నీవు రాజాసనమును అధిరోహింపగలవు. సవతి తల్లి మాటలు ధృవుని మనసును బాధ పెట్టినవి. పాము కర్ర దెబ్బ తిని ఎట్లు బుసకొట్టుచుండునో అట్లు అతడు గట్టి నిర్పూర్పు నిట్టూర్పు వదులుచుండెను.
తండ్రి చూచుచు మాట్లాడక ఊరుకున్నాడు. ధ్రువుడు బాధపడి తండ్రిని వదిలి ఏడ్చుచు తల్లి వద్దకేగెను. గట్టిగా ఊపిరి వదులుచున్నాడు. పెదవి వణికిపోవుచున్నది. ఏడ్చుచున్నాడు. ఆ పసివానిని తల్లి చూచినది. కారణం అతడు చెప్పకపోయినాడు. అంతఃపుర పరివారం వచ్చి జరిగిన దానిని చెప్పినారు. దానితో ఆమె చాలా బాధపడినది. దావాగ్నితో దహింపబడిన లత వలె సవతి మాటలకు ఆమె కాంతి తరగిపోయెను. కన్నీరు కార్చుచుండెను. దీర్ఘముగా ఊపిరి వదులుచు అంతులేని దుఃఖమును పొందెను. కుమారుడితో ఇట్లు అనెను, నాయనా ఒకరు తప్పు చేసినారని బాధపడకుము. ఒకరి విషయంలో నీవు తప్పు చేయకుము. ఒకరికి దుఃఖము కలిగించినచో మనమే దుఃఖమును అనుభవింతుము. మా మంగళం బాల పరేషు మంస్థాః భుంగ్తే జనో యత్పర దుఃఖదస్తత్ ఒకరికి దుఃఖమును కలిగించిన వాడు ఆ దుఃఖమును తాను అనుభవించును కనుక బాలక ఒకరికి బాధను కలిగించరాదు. సురుజి చెప్పినది నిజము. దురదృష్టవంతురాలనగు నా గర్భమున నీవు పుట్టితివి. నా పాలు తాగి పెరిగితివి. నన్ను భార్య అనుకొనుటకు కూడా రాజు సిగ్గుపడుచుండును. నీ సవతి తెలి చెప్పినట్లు చేయుము. తపస్సు చేసి పరమ పురుషుని సంతోష పరుచుము. అప్పుడు నీవు కూడా ఉత్తము వలె రాజాసనమును ఎక్కెదవు. అధోక్షడు, అధోక్షజుడు ఆ లోక పాలనమునకు సకల కళ్యాణ గుణములతో కూడిన దివ్య మంగళ విగ్రహం కలవాడై ఉన్నాడు. అతనిని తన మనస్సును, ప్రాణమును జయించి ఆరాధించి సర్వోత్కృష్టమగు సత్యలోకమును చతుర్ముఖ బ్రహ్మ పొందెను. మీ తాతగారు స్వయంభువ మనువు అనన్య భక్తితో అధికమగు దక్షిణలు ఇచ్చి యజ్ఞములు చేసి భగవానుని ఆరాధించి ఇతరులు పొందజాయని దివ్య సుఖమును సార్వభౌమత్వమును పొందినాడు. అంతేకాదు. మోక్ష సుఖమును కూడా ఆ పరమ పురుషుని నుండి పొందినారు. నాయనా ఆ శ్రీహరి భృత్య వత్సలుడు. మనలోని దోషములను ప్రీతితో ఆదరించునే గానీ దోషములను చూసి దూరము చేయడు. మోక్షమందు ఇచ్చగలవారు.
ఆయన పాద ఛాయనే ఆశ్రయింపవలెను. అందుచే నీవు మరొక దానిని కోరక తలంపక నీవు ఆచరింపవలసిన ధర్మములను ఆచరింపుము. నీ మనసున ఆ పరమ పురుషుని భజింపుము. పుండరీకాక్షుని కంటే వేరొకరు ఎవ్వరూ దుఃఖమును తొలగించువారు ఈ లోకములో లేరు. లోకములో అందరి చేతను ఆశ్రయింపబడి లక్ష్మీదేవి కూడా చేతితో పద్మమును దాల్చి ఆ పుండరీకాక్షునే సేవించుచున్నది. ఇట్లు తల్లి చెప్పిన మాటలను ధ్రువుడు విని తాను కోరిన కోరికను సాధించుటకు ఉపాయమును ఎరింగెను. తన మనస్సును కోరిక నుండి ద్వేషము నుండి దూరము చేసుకొనెను. పట్టణము నుండి వెలికిపోయెను. వెలికిపోయెను. ఎంత ఆశ్చర్యమో చూడుడు. క్షత్రియ కులమున జనియించిన పసివాడైనను అవమానమును సహింపలేడు. బాలుడై ఉండియు సురుచి ఆడిన మాటలకు బాధపడి తాను కోరిన పదవిని పొందుటకు సహనముతో బయలుదేరినాడు. కొంత దూరం నడుచుసరికి నారదుడు కనిపించినాడు. నాయనా ఒంటరిగా ఎక్కడికి వెళుతున్నావు? ఐశ్వర్యము నిండిన ఇల్లు వదిలిపోవుచున్నావే, నీ వారు నిన్ను అవమానము చేయుటచే నీ మనసు బాధపడినట్లు నాకు కనిపించుచున్నది అనెను. ధ్రువుడు, స్వామి, నా మనస్సులో కలిగిన బాధను మీరు ఎట్లు ప్రభావము చేత తెలుసుకునినారు? మా సవతి తల్లి సురుచి మాటలు నా మనస్సును గాయపరిచినవి. నేను సర్దుకొని ఉండజాలను. నారదుడు అతని మాటలు విని ఇట్ల అనుచున్నాడు. నాయనా, నీవు పసివాడవు. ఆటలు ఆడుకొను వయస్సు నీది. ఈ వయస్సులో నీకు సన్మానము, అవమానము ఏమి? జ్ఞానము గల పెద్దలు కూడా దేవతలు, మనుష్యులు అను భేదము శరీరములో ఉండుటచే. మోహముచే శరీరమే నేనని వారి వారి కర్మలచే కలిగిన సుఖ దుఃఖములకు అసంతుష్టిని పొందుదురు. అందుచే ఈ అసంతోషమునకు కారణము దేహము తాను అనిడి భ్రమ. దానికి కారణము దేవుడు. మనుష్యుడు అను శరీరములలో భేదమును చూచుట. దానిచే శరీరమును కలిగిన సన్మానము, అవమానము తనకే కలిగినవని భ్రమించుచుందురు. అంతేగాని ఆత్మకు అవమానము లేదు, సన్మానము లేదు.
జ్ఞానము గలవారు ఏ మాత్రము సుఖమైనను భగవంతుడు ఇచ్చినదని దానితో సంతోషింతురు. అంతకంటే అధికముగా కాంక్షింపరు. కావలెనని కోరి ప్రయత్నించినను ఈశ్వరుడు అనుకూలముగా ఉన్ననాడు గాని అవి లభింపవు. నీవు మీ తల్లి చెప్పినట్లు భక్తి యోగముచే భగవానును అనుగ్రహముచే పొందవలెనని కోరి బయలుదేరినావు. అతని సంతుష్టి పరచి అనుగ్రహమును పొందుట చాలా కష్టమని నేను ఎరుంగుదును. మునులు కూడా కర్మ యోగ జ్ఞాన యోగములతో ఆ భగవానుని వెదికి వెదికి అనేక జన్మలకు కూడా ఎరుంగలేకున్నారు. అందుచే నీ పట్టుదల వీడుము. ఇది నిష్ఫలము. వెనుకకు మళ్ళుము. దైవము అనుకూలించి మంచి కాలం వచ్చినప్పుడు ప్రయత్నించెదవు కాక. దైవము నిర్ణయించిన సుఖదుఃఖములను తాను అనుభవించుచు మనసులో సంతుష్టి నందుచుండవలెను. అధికము కావలెనని కోరుట అవివేకము. అట్టు అనుభవించుచున్న వారు చివరకు ఈ అజ్ఞానము దాటి విష్ణు సదమును పొందురు పొందును. లోకములో కొందరు మనకంటే గుణములచే అధికులు ఉండురు. వారిని చూచి సంతోషించవలెను కానీ అసూయ పడరాదు. కొందరు తక్కువ వారు ఉండురు. వారిని చూచి జాలి పడవలెను కానీ తిరస్కార భావముతో నీచముగా చూడరాదు. తనతో సమానమైన వారిని మైత్రితో ఆదరింపవలెను. కానీ వారితో పోటీ పడరాదు. ఇట్టి ప్రవర్తన గలవాడు ఎన్నడును తాపమును పొందడు. గుణాధికాన్ముదం లిప్సేత్ అనుక్రోశం గుణాధమాత్ మైత్రీం సమానాదన్విచ్చేత్ నతాపైరభిభూయతే తనకంటే గొప్పవారిని చూచి అసూయపడక సంతసించుట, తనకంటే తక్కువవారిని చూచి జాలిపడుట, తనతో సమానులను చూచి స్నేహముతో చూచుట చేయనేర్చినవాడు ఎన్నడూ బాధనందడు. కావున నీ ప్రయత్నము మాని వెనకకు ఏగుము. నారదుడు చెప్పిన మాటలను విని ధృవుడు ఇట్లనుచున్నాడు. మీరు మనశ్శాంతిని పొందు ఉపాయమును కృపతో తెలియజేసిరి. సుఖ దుఃఖములతో బాధపడుచున్న మా వంటి వారలకు అది పొంద అంత సాధ్యమైనది కాదు కానీ నేను ఘోరమైన క్షత్రియ స్వభావమును కలిగిన వాడను అందుచే మనస్సును నియమింపజాని వాడను సురుచి తీవ్రమైన మాటలచే నా మనస్సు చిలులు పడినది అందుచే నీ ఉపదేశముచే కలిగెడి శ్రమము నా మనస్సున నిలుచుట లేదు మూడు లోకములో ఉన్నతమైన స్థానమును నేను పొందవలెను కోరుచున్నాను. ఇంతకుముందు మా పూర్వులు ఎవ్వరును పొందని స్థానమును పొందవలెను. మీరు దానికి మార్గమును చూపవలెను.
మీరు బ్రహ్మ శరీరము నుండి జన్మించినారు. వినిను మ్రోగించుకొనుచు లోక హితమునకై సూర్యుని వలె సంచరించుచుందురు అని ద్రువుడు చెప్పగానే నారదుడు ఆ బావినిపై ప్రేమ కలిగి దయతో ఇటు పలికినాడు. కుమారా. నీ తల్లి చెప్పిన మార్గమే నీకు శ్రేయస్సును కలిగించును. వాసుదేవుని ఏకాగ్రమైన మనస్సుతో ధ్యానింపుము. మానవుడు ధర్మ అర్థ. కామ మోక్షములనే నాలుగు పురుషార్ధములలో దేనిని కావలెనని కోరినను శ్రీహరి పాద సేవ చేయుట తప్ప వేరొక మార్గము లేదు. కావున యమునా తీరమునకు ఎగుము. అచట పవిత్రముగు మధువనమున్నది. అచట ఎల్లప్పుడూ భగవాన్ని సన్నిధి చేసి ఉంటాడు. యమునలో స్నానము చేయుము. ఆ యమునా నది జలములు పవిత్రములు. స్నానము చేసిన తరువాత ఒకచోట స్థిరముగా కూర్చునుము. ప్రణవము అనగా ఓంకారముతో లోపల ఉన్న ప్రాణవాయువును బయటకు వదులుట, లోపలికి పీల్చుట. నిలుపుట అనడి రేచక పూరక కుంభకములను చేయుము. దానిచే ఇంద్రియములు మనస్సు విచ్చలవిడిగా పరిగెత్తవు. మనస్సు నిర్మలమగును. అట్టి మనస్సుతో భగవానుని ధ్యానింపుము. అప్పుడు ఎల్లప్పుడూ అనుగ్రహ పూర్ణమైన ప్రసన్నమైన ముఖము చూపులు కలిగిన భగవానుని ముఖమును ధ్యానింపుము. ఆ ముఖమునందు సుందరమైన నాసిక కనుబొమ్మలు అందమైన చెక్కిళ్ళు నీవు దర్శింపుము. బాలుడుగా కాక, వృద్ధుడుగా కాక, యువకుడుగా భగవానుని ధ్యానింపుము. సుందరమైన అవయవములు, ఎర్రని పెదవి, నేత్రములు కలవానిగా దర్శింపుము. అతడే అతడే భక్తులచే ఆశ్రయింపబడువాడు. సుఖరూపముకు ధనము అతడే రక్షణను వసంగుటలో సమర్ధుడు అతడే అతడు కరుణానిధి పక్షస్థలమున శ్రీవత్సమును చిహ్నము ఉండును నీరు నిండిన మేఘం వలె అతని శరీర ఛాయ ఉండును పుష్పమాలికచే అతడు అలంకరింపబడి ఉండును నాలుగు బాహువులతో శంఖమును, చక్రమును, గదను, పద్మను ధరించి ఉండును. శరీరం శిరమున కిరీటము ప్రకాశించుచుండును. కుండలములు, భుజకీర్తులు, కంకణములు మెరయుచుండును. కౌస్తభము అనేటి మణి కంఠసీమను అలంకరించి ఉండును. పచ్చని వస్త్రము ధరించి ఉండును. మొలనూలు ఆ పీతారంబరముపై అందముగా అలంకరింపబడి ఉండును.
పాదములకు బంగారు అందెలుండును. అటువంటి చూడముచ్చటగా ఉండడి శాంతమైన చూపులతో మనసును ఆనందింపజేయి భగవాను రూపమును మనసుచే దర్శించి ధ్యానింపుము. ఆ స్వామి పాదముల నకకాంతి మణికాంతి నవలె విస్తరించుచుండును. అతడు హృదయ మణిడి పద్మం యొక్క మధ్యస్థానమును అధిష్టించి ఉండును. అనురాగముతో చూచుచు చిరునవ్వు నవ్వి నవ్వుచుండును. హృదయ పద్మములో వేంచేసి ఉన్న అట్టి మూర్తిని మరియొక విషయమును తలంచకుండా తలంచుచుండుము. అట్లు ఆ రూపమును ధ్యానము చేయగా నీకు సాటిలేని గొప్ప సుఖము మనసున తోచును. అది చెదరక నిలుచును. అది నిశ్చయంగా నిలుచునట్లు ఆ రూపమును ఎడతెగక ధ్యానించుచుండుము. నీకు ఒక మంత్రమును చెప్పెదను. అది రహస్యము. అది ఏడు రోజులు ఎడతెగక నీవు జపించినచో దేవతలను దర్శింపగలవు. భగవాను సాక్షాత్కారము అగును. ఆ మంత్రమే 12 అక్షరములు కలది. నమో భగవతే వాసుదేవాయ ఓంకారముతో. ఈ మంత్రమును ఎడతెగక జపించుటచే శరీరము దైవమయమగును. ఆ మంత్రముతోనే ఆ దేశమున ఆ కాలమున లభించెడి ద్రవ్యములతో. ఆ వాసుదేవుని అర్చింపుము. పవిత్రములగు జలములు, మాలికలు, అడవిలో దొరికే మూలములు, ఫలములు, ప్రశస్తములగు దూర్వ. మొదలగు మొలికలు, మొలకలు, ఆయా చెట్ల నుండి తీసిన పట్టలు మొదలగు వానితో ఆరాధింపవలెను. అన్నిటికంటే తులసి స్వామికి చాలా ప్రియమైనది. ఆ ద్రవ్యములతో స్వామిని అర్చింపుము. ఒక మండలమునందు గాని జలములలో గాని ఆ స్వామి ఉన్నట్లు భావించి ఆరాధించవలెను. మనసులో ఆ మూర్తిపై ఆదరము ఉండవలెను. ఆ మూర్తినే తలంచుచుండవలెను. ఇతర విషయములను గూర్చిన కోరిక రారాదు. నియమముతో ఉండవలెను. మాటలో ఆహారములో మితముగా ఉండవలెను. స్వామి తనంత తానుగా లోక రక్షణముకై అవతరించిన ఆయా అవతారముల చరిత్రను ధ్యానింపుము. ఇవి చేయునప్పుడు ఏ విధముగు పరిచర్య చేసినను ఏ ద్రవ్యము సమర్పించినను వెనక చెప్పిన మంత్రం మనసులో తలంచుచు ఆ మూర్తిని ధ్యానించుచు చేయవలెను. ఈ విధముగా శరీరముచే, మనసుచే, వాక్కుచే భక్తితో స్వామిని సేవింపుము. ధర్మార్థ కామ మోక్షములందు దేనినైనను మాయ లేకుండా భక్తితో తనను సేవించెడి వారికి భగవానుడు తప్పక వసంగును. ఇంద్రియములతో నీ విషయములను
అనుభవించవలెనని కోరిక తగ్గి విరక్తితో నుండి ప్రేమతో పరిపూర్ణము భక్తితో విచ్ఛేదము లేక ఆరాధించిన వారికి మోక్షమును కూడా అతడు ప్రసాదించును. ఈ విధంగా నారదుడు ఉపదేశించాడు తరువాత భాగాన్ని మనం తరువాత సేవిద్దాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Om Namo Bhagavate, I meditate on that which is the self, the seed of the first being, the supreme. Gajendra said thus. Salutations to the complete one, the cause of all the worlds, the supreme lord. This world, which is full of consciousness, has emerged from Him. We meditate on Him. Eighth Canto, Third Chapter, Second Prayer. Dear devotees, welcome to the fourth episode of Srimad Bhagavata Tattva Deepika, the tenth podcast. As part of the conversation between Vidura and Maitreya, we have so far fully experienced the story of Daksha. Now we're entering into the legendary stuff. Let's carefully read the Dhruva Charitra. Uttanapada had two wives, Suniti and Suruchi. Therefore, it is very dear to Suruchi Uttanapadu. There is no love in Suneeti, that Suneeti's son is Dhruva. All the names in this are meaningful. Suruchi has a good taste. Suneeti has good morality. The love that is in taste will not be in morality. Isn't it? Once upon a time, Suruchi's son was excellent Father He sat on Uttanapada. Uttanapada was licking him. Suniti's son Dhruva came and wished that he too should climb his father's thigh. But the father did not agree. Seeing Dhruva, who wished to climb his father's thigh, Suruchi Uttanapada, while listening, said thus with great pride and envy. "You weren't born of my beloved daughter. How did you get the fortune to ride on the king's thigh? You are a child, you don't know. You are asking for a place that is not accessible to you. Do penance and worship God. If you are born in my womb by receiving his grace, you can ascend the throne of a king. Dhruva was hurt by what his stepmother said. Just as a snake, after being struck by a stick, hisses, similarly, he was letting out a deep, stern sigh.
The father, watching, remained silent without speaking. Dhruva, distressed, left his father and went to his mother crying. He's puffing away. The baby's lips were trembling. He was crying. The mother saw the baby. The reason he didn't tell. The palace staff came and told what had happened. She was devastated by it. Like a creeper burnt by the fire, her light faded to the words of her sister-in-law. Crying. He/She breathed deeply and experienced endless sorrow. He said this to his son, son, don't be sad that someone made a mistake. Do not judge someone based on your own judgment. If someone causes sorrow, we ourselves experience the sorrow. Our auspicious child, the one who is born, should not cause pain to anyone. Because the one who causes pain to someone will experience that pain himself, a child should not cause pain to anyone. What Suruji said is true. You were born of my unfortunate womb. You drank my milk and grew up. Even the king would be ashamed to consider me his wife. As your stepmother told you Do it. Do penance and please the Supreme Being. Then you too will ascend the royal throne like a rightful king. Adhokshadu, Adhokshajudu, is the one who possesses the divine auspicious idol with all the virtues of welfare for the governance of that world. Having conquered his mind and life, worshiping him, the four-faced Brahma attained the supreme truth world. Your grandfather, a self-existent man, with unwavering devotion, gave abundant offerings, performed yagnas, worshiped the Lord, and attained divine happiness and sovereignty that others could not attain. Not only that. They also received the happiness of liberation from that Supreme Being. Oh, Srihari is a devoted servant. He loves to embrace the flaws within us, but he does not distance himself from seeing the flaws. The one who is given liberation.
One should take refuge in his feet. Therefore, without desiring or thinking of another, practice the dharmas that you must practice. Meditate on the Supreme Personality of Godhead, O Lord. No one in this world is there to remove the sorrow except Pundarikaksha. Having taken refuge in everyone in the world, Goddess Lakshmi also holds a lotus in her hand and serves that Pundarikaksha. Thus, Dhruva, having heard the words spoken by his mother, devised a way to fulfill the desire he had. He turned his mind from desire to hatred. It was extracted from the town. It was extracted. See how surprising it is. Even though he is a child born into a Kshatriya clan, he cannot bear insult. Being a child, he was saddened by the words of Suruchi, and he set out with patience to obtain the position he desired. After walking some distance, Narada appeared. Where are you going alone, my son? You are leaving a house full of wealth, your husband, because he is insulting you, your mind seems to be hurt, he said. Dhruvudu, Swami, na How did you understand the pain in your heart through influence? My stepmother's words have hurt my heart. I don't want to settle. Narada, hearing his words, thought thus. You're a kid. You are of age to play. At this age, what is honorable and dishonorable for you? Even the wise elders have a distinction between gods and humans in their bodies. They become dissatisfied with the pleasures and pains caused by their respective actions, thinking that the body is theirs. Therefore, the reason for this unhappiness is the illusion that the body is oneself. The reason for that is God. The seeing of the differences in the bodies of the human being. They are deluded into the illusion that the honor and dishonor that the body possesses is for them. But the soul has neither dishonor nor honor.
Those who have knowledge are happy that God has given them happiness. You don't want more than that. Even if you try desirously, they will not be obtained unless God is favorable. You have set out, desiring to attain the Lord through devotion and yoga, as your mother has commanded. I understand that it is very difficult to please him and receive his blessings. Even the sages, with Karma Yoga and Jnana Yoga, searched for that Lord and could not understand him even after many births. Therefore, let your determination be firm. This is futile. Turn back. Do not try when good times come, God will favor you. One should experience the joys and sorrows ordained by God and be content in their heart. It is foolish to wish for more. Those who are experiencing it, will eventually cross this ignorance and attain Vishnu Sadam. In the world, some are superior in qualities than us. We should be happy to see them, but we should not be jealous. There will be some people who are less. Seeing them, I felt pity, but rejection Do not look down on them with malice. One should respect those who are equal to oneself with kindness. But you can't compete with them. He who is of this conduct will never suffer. Gunadhikamamudam lipseet anukrosham gunadhamat maitriam samanadhanvicheet natapairabhubhooyate, not being jealous seeing someone greater than oneself, being pity seeing someone less than oneself, He who has learned to see his equals with friendship will never be sad. Therefore, give up your efforts and go back. Hearing the words of Narada, Dhruva says this. You have shown the way to peace with grace. For those like us who suffer with happiness and sorrow, it is not possible to attain it, but I am a terrible Kshatriya by nature, therefore I cannot control my mind. My mind was captivated by the intense words of Suruchi Therefore, the suffering caused by your teachings does not stay in my mind. I desire to attain a high position in the three worlds. Before this, our ancestors should attain a position that no one has ever attained. You for that Show me the way.
You are born from a Brahma body. As soon as Druva said that they would roam like the sun for the good of the world, Narada, filled with love for that well, spoke kindly. Son. The path your mother has told you will bring you prosperity. Meditate with a steady mind on the Lord Vishnu. Manavadharma. Among the four Purusharthas, which one should one desire for liberation from desire? There is no other way but to serve the feet of Sri Hari. Therefore, go to the banks of the Yamuna. There is a sacred grove. There he always had the presence of God. Take a bath in the Yamuna. The waters of Yamuna are sacred. After taking a bath, sit still in one place. Pranavam means releasing the life air inside with Omkara and inhaling it. Do the retention anadi rechaka and puraka kumbhakas. The senses and mind do not run wild because of it. The mind becomes pure. Meditate on the Lord in such a way that. Then always a gracious, pleasant face Meditate on the Face of the Lord. Oh, in that face, beautiful nostrils, beautiful eyebrows, beautiful cheeks, you are visible. Instead of being a boy, instead of being an old man, meditate on the Lord as a young man. Beautiful limbs, red lips, and eyes, see him as a person. He is the one who is protected by the devotees. He is the embodiment of happiness, he is capable of protecting, he is the treasure of compassion, in the side, there will be a symbol of Srivatsa, his body will have a shadow like a filled cloud, he will be adorned with a garland of flowers, with four arms Conch, He is holding a discus, mace, and lotus. The body, the crown, shines on the head. Necklaces, shoulder ornaments, and bangles are shining. Kausthabham, a gem, adorns the necklace. She wears a green dress. The pearls are beautifully decorated on the pearl necklace.
The feet have golden anklets. Such a pleasing form, with peaceful gazes, delight the mind, and meditate on the form of the Lord. The light of the Lord's feet spreads like a new light. He is seated on the lotus, the heart jewel, in the lotus center. With affection, looking at it, smiling, smiling. Meditate on that form, which is situated in the lotus of the heart, without thinking of any other matter. When you meditate on that form, you will experience unparalleled great happiness in your mind. It will stand firm. Meditate on that form without ceasing, so that it may stand firm. I will tell you a mantra. It's a secret. If you chant continuously for seven days, you will be able to see the gods. There will be a vision of the Lord. The mantra is said to have 12 syllables. Salutations to Lord Vasudeva with Om. By constantly chanting this mantra, the body becomes divine. With that mantra, with the wealth that was available in that country at that time. Offering to Vasudeva. Pure waters, garlands, and roots found in the forest, Fruits, and the prestigious Durva. Starting with sprouts, sprouts, and the leaves plucked from those trees, one should worship with them. Tulasi is the most beloved goddess. Offer those materials to the Lord. One should worship, believing that the Lord is present in a mandalam or in the waters. The mind should be filled with reverence for the form. One should keep that idol in mind. There is no desire regarding other matters. Must be regulated. Moderation in speech and food is important. Swami, meditate on the history of those incarnations who have incarnated for the protection of the world. When doing these, whatever kind of service is done, whatever substance is offered, the mantra mentioned earlier should be remembered in the mind, and that idol should be meditated upon and performed. In this way, with body, with mind, with speech, serve the Lord with devotion. In the world of dharma, artha, kama, and moksha, the Lord will surely grant those who serve Him with devotion without any illusion. With the senses, your subjects
He who desires to experience, reduces desire, and from detachment, with love, with completeness, with devotion, without severance, and by worshiping, he also bestows salvation upon them. In this way, Narada preached. We will serve the next part later. Jai Srimannarayana. Salutations to the Asmadgurus