బ్రహ్మదేవుని సృష్టి విస్తరణ - మానస పుత్రుల సాధన

Expansion of Creation & Brahma's Mind-Born Sons

bhagavatam

ఈ ఎపిసోడ్‌లో, సమస్త జీవులకు పితామహుడైన బ్రహ్మదేవుడు తన దివ్యమైన సంకల్పశక్తితో సృష్టిని విస్తరింపజేసే అద్భుతమైన వృత్తాంతాన్ని తెలుసుకుంటాము. బ్రహ్మదేవుడు మొదట తన మానస పుత్రులైన సనకుడు, సనందనుడు, సనాతనుడు మరియు సనత్కుమారుడు అనే మహర్షులను సృష్టించగా, వారు వైరాగ్యంతో సంతానోత్పత్తిని విడిచి మోక్షమార్గంలో నడిచారు. అయినప్పటికీ బ్రహ్మదేవుడు నిరుత్సాహపడక, ఇతర ప్రజాపతులను మరియు జీవరాశులను సృష్టించి త్రిలోకాలను జీవకళతో నింపాడు. ఈ ఎపిసోడ్ సృష్టి కేవలం భౌతిక ప్రక్రియ మాత్రమే కాదు, పరమాత్మ సంకల్పం చేత నడిపించబడే పవిత్రమైన ఆధ్యాత్మిక విస్తరణ అని మనకు స్పష్టంగా తెలియజేస్తుంది.

In this episode, we explore the wondrous expansion of creation as Brahma, the grandfather of all beings, begins populating the universe through the power of his divine will. Brahma first gives rise to his mind-born sons — the great sages Sanaka, Sanandana, Sanatana, and Sanatkumara — who, deeply absorbed in spiritual wisdom, renounce the duty of procreation and turn their hearts toward eternal liberation. Undeterred, Brahma continues his sacred mission by bringing forth other progenitors and forms of life, weaving the vast tapestry of existence across the three worlds. This episode beautifully illuminates how divine creation is not merely a physical process but a profound spiritual unfolding guided by the Lord's supreme will.

← Prev Next →
Expansion of Creation & Brahma's Mind-Born Sons bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యస్మిన్ అసంఖ్యేయ విశేష నామ రూపాకృతౌ కవిభిః కల్పితేయం సంఖ్యాయ యా తత్వదృశాపనీయతే తస్మై నమః సాంఖ్య నిదర్శనాయతే లెక్కించ శక్యము గాని వేరు వేరు పేర్లు, రంగులు, ఆకారములు గల ఈ జగత్తు రూపముగా నీవే ప్రకటనమై ఉన్నావు. అట్టి నీ అద్వయ స్వరూపమునందు సాంఖ్యాచార్యులు తత్వములను కల్పించి లెక్కించుచున్నారు. నీ యధార్ధ స్వరూపమును తెలుసుకున్నప్పుడు ఆ భేద దృష్టి తొలగిపోవును. ఆ సాంఖ్య సిద్ధాంతము కూడా నీ స్వరూపమే. నీకు నా నమస్కారము అని ఆర్యముడు స్తుతిస్తున్నాడు. ఫిఫ్త్ క్యాంటో 18th చాప్టర్ 33rd ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక 29వ పాడ్కాస్ట్ లో స్వాగతం. తృతీయ స్కంధంలో ఇంతవరకు కర్దమ ప్రజాపతి. దేవహుతిని వివాహమాగటం తరువాత స్వయంభువు ఆ బరిష్మతి నగరంలో తన జీవితాన్ని గడుపుతూ ఉండటం. తర్వాత దేవముని దేవోది చరిత్ర యొక్క చరిత్రను వివరించడానికి కోసమని మైత్రేయుడు విదునికి చెప్పబోతున్నాడు. ఆ విషయాన్ని మనం ఈ యొక్క పాడ్కాస్ట్ లో అనుభవిద్దాం. తల్లిదండ్రులగు మను శతరూపులు దేవహూతుని కర్దముని సన్నిధిలో వదిలి వారి దేశమునకేగిరి. తాను భర్త అభిప్రాయం ఎరింగి పార్వతి పరమశివుని ఆరాధించినట్లుగా ఆ ప్రజాపతిని సేవించుచుండెను. ఆమె మనస్సున పవిత్రములగు భావములతో ఉండెడిది. ఇంద్రియ నిగ్రహము గలది. భర్తను గౌరవముతో చూచెడిది. బాహ్యేంద్రియముల నిగ్రహము గలది. భర్త చెప్పే మాటలందు శ్రద్ధ గలది, మంచి మనస్సు, మధుర వాక్కు గలది, గర్వము లేనిది, ఎప్పుడునో పరాగు చెంది ఉండేడిది కాదు, కామము, దంభము, ద్వేషము, లోభము, పాప కర్మాచరణము లేనిది.

వారి ఆజ్ఞలను పాటించుచు భర్తను సంతోషింప చేసేడిది. తనను అనువర్తించుచున్న ఆ మనుపుత్రియకు దేవహుతిని ప్రేమతో కృపతో అతడు చూచుండెడివాడు. ఆమె పురుషార్ధమగు సత్సంతానమును దైవ సమానుడగు తన భర్త నుండియే పొందవలెనని వ్రతనీయం పాలనముచే కృషించినదై ఉండెను. ఆమెను చూచి కర్దముడు ఇట్లు పలికెను, ఓ భామిని నీ సుశ్రూషకు నీ గౌరవమునకు నేను సంతుష్టినందితిని. ప్రాణులకు అన్నింటికంటే ప్రియమైనది శరీరము. అట్టి శరీరమును కూడా లెక్కచేయక కృషింపచేసి నాకు నీవు సేవలను చేయుచున్నావు. నేను సధర్మమునందు శ్రద్ధ గలవాడను. కర్మ యోగము, ధ్యాన యోగము, భగవత్ భక్తి యోగము. ఆత్మ యోగము అనుసరించువాడను. వీనిచే నాకు భగవత్ అనుగ్రహం లభించినది. ఈ భగవత్ అనుగ్రహముచే అనుభవింపదగిన విషయములు, అనుభవించడి సాధనములను, అనుభవించడి స్థానములను నా వశమునందు ఉన్నవి. అవి అనుభవించుచున్నను భయము గాని శోకము గాని నాకు కలగవు. నీవు నీ సేవచే నా మనస్సును ఆకర్షించితివి. అందుచే నీకు దివ్యమగు జ్ఞానమును ప్రసాదించెదను. అందరూ అనుభవించడి భోగములు నీచములు. అవి దుఃఖమును శోకమును కలిగించడివి. భగవాను యొక్క కనుబొమ్మ కదలికచే అవి క్షణకాలములో నశించునవి. నేను తపస్సుచే ఆర్జించిన ఉత్తమ భోగములను నీ ధర్మమును నీవు ఆచరించి పొందగలుగుచున్నావు. ఆ భోగములు మహారాజులు కూడా పొందజాలరు. ఇట్లు కర్దముడు పలకగానే తన భర్త విచిత్రములగు శక్తులు గలవాడని జ్ఞానము గలవాడని ఎరింగిన దేవహుతి వినయముతో ప్రేమతో గద్గదమగు మాటలు పలుకుచు మందహాసం ముఖమున ప్రసరించుచుండగా ఇట్లు పలుకుచుండెను. ప్రభు మీరు సమస్త యోగ శక్తులు కలవారు. మీరు అనుగ్రహించిన నాడు నాకు అన్నీ సిద్ధించినట్లే. సంతానము కలుగు వరకు మీతో నాకు సంబంధం ఉండునని మీరు మొదల కట్టుబాటు చేసిరి. శ్రేష్టుడగు భర్త నుండి యోగ్యముగు సంతానమును పొందుటయే స్త్రీకి మహా లాభము. మీ శరీర సంబంధము పరిపూర్ణముగా అనుభవింపవలెనన్న కోరికను దానికి తగిన నేర్పును మీరే నాలో కలిగించితిరి. ఆమె అట్లు కోరగని ఆమెకు ప్రియమైన దానిని నెరవేర్చవలెనని కర్దముడు తన యోగ బలముచే ఇచ్చ వచ్చినట్లు తిరుగుగల విమానం వంటి ఒక భవనమును ఆవిర్భవింప చేసెను.

ఆ భవనము సమస్తములు కోరికలను తీర్చునదై యుండెను. దేవతలకు మనుష్యులకు ఉండెడి సకల సంపదలు ఆ భవనమున యుండెను. మణిమయములగు స్తంభములతో ఆ భవనం ప్రకాశించుచుండెను. అందు పరికరములు దివ్యములు. ఆ భవనము సర్వకాలముల యందు సుఖమునే కలిగించునది. విచిత్రముగు పట్టు జెండాలతో ఆ భవనము అలంకరింపబడి ఉండెను. విచిత్రముగు పుష్పములతో కూర్చబడిన మాలికలు ఆ భవనము నిండా అలంకరించబడెను. ఆ పుష్పముల యందలి మకరందమునకు తుమ్మెదలు మూగి సంతతం వృద్ధ చేయుచుండెను. అలంకారమునకు పట్టు వస్త్రములు అంతటా వ్రేలాడదీయబడెను. ఆయా ప్రదేశములందు ఆయా భోగములకు తగినట్లు పాన్పులు ఆసనములు కలిపింపబడి ఉండెను. గోడలపై వివిధములగు శిల్పములు విరాజిల్లుచుండెను. ఇంద్రనీల మణులతో ఇంటిలో వేల వేల ఇంటిలో నేల నిర్మింపబడి ఉండెను. దానిపై పగడపు వేదికలు కల్పింపబడెను. పగడములతో ద్వారములు, వజ్రములతో తలుపులు ఏర్పాటు చేయబడి ఉన్నవి. భవనమునకు పై భాగమున బంగారు కలశలు అమర్చబడి ఉన్నవి. వజ్రపు గోడలపై పద్మరాగ మణులు అచట అచట అమర్చబడి ఉన్నవి. ఇంటి నిండా మేలుకట్లు అనగా చాందినీలు కట్టిరి. బంగారు తోరణములు అమర్చిరి. కృత్రిమములగు హంసలు, నిజమగు హంసలు, పావురములు ఆ భవనమును కోలాహలము చేయుచుండెను. భోగమును అనుభవించుటకు తగినట్లు విహార స్థానములు కల్పింపబడినవి. క్రీడా ప్రదేశము, శయనాగారము, భోగస్థానము, గృహమునకు వెలుపల కూర్చుండుటకు ప్రాంగళము, ప్రాకారమునకు వెలుపల విశాలముకు స్థలము ఉండెను. ఈ విధమగు భవనమును చూచుచు ఆమె ఏదో లోపమున్నట్లే మనసున పూర్తి సంతృప్తి లేక ఉండెను. అప్పుడు కర్దముడు. భగవానుడు నిర్మించిన ఈ మడుగులో స్నానము చేయుము అప్పుడు కోరికలన్నీ నెరవేరును. ఆ సరస్సు భగవానుని ఆనంద భాష్ప బిందువులచే ఏర్పడినది. అందుచే ఇది బిందు సరస్సు. ఇందు స్నానము చేసి నీవు ఈ విమానమును అధిరోహించుము అని అనేను. అప్పుడు దేవహుతి ఇంతకాలము నియమ పాలనముచే మలిన వస్త్రముతో జడలు కట్టిన కేశములతో కేశములతో మట్టి పట్టిన ఒడలతో ఉండినది. జలాశయమున ప్రవేశించెను. ఆ సరస్సులో ఆమె స్నానము చేసి లేవగానే ఆమెకు భవనములో వెయ్యి మంది సౌందర్య రాశులగు కన్యకలు కనపట్టిరి. వారు నమస్కరించుచు ఎదురు వచ్చి మేము మీ దాసీలము ఏమి చేయవలెనో ఆజ్ఞాపింపుడు అనిరి.

ఆమె, ఆమెకు సుగంధ తైల అభ్యంగనము చేసిరి. నిర్మలములగు కొత్త బట్టలు ధరింపచేసిరి. శ్రేష్టములు, కాంతిమంతములునగు ఆభరణములు ధరింపచేసిరి. షడ్రసోపేతములగు భోజనమును అమృతం వలె మధురాతి మధురములగు ఒడలు మరిపించు పానములు వసంగిరి. అట్లు అలంకరించిన తరువాత తన ప్రతిబింబమును తాను చూచుకొనునట్లు ఆమెకు ఎదురుగా అద్దము పట్టిరి. ఆమె చూచుకొని ఆనందించెను. ఆమెను చూచిన కన్యకలు ఎంతో ప్రశంసించిరి. ఇట్లు స్నానమై ఆభరణములు దాల్చి ధరించుచున్న నూపురములతో ఆమె మనోహరముగా ఒప్పుచుండెను. ఆమె సౌందర్యము చూచిన వారి మనసులు దోచుకొనుచుండెను. ఇట్లు అలంకరించుకొనిన తరువాత భర్తయు కర్దముని మనసులో స్మరించెను. వెంటనే ఆమె చెలికత్తెలచే భర్త వద్ద కూర్చుండ చేయబడెను. భర్త ఎదురుగా వేల మంది చెలికత్తెలతో కూర్చొని ఉన్న తనను చూచి తన భర్త యొక్క యోగ ప్రభావమును ఎరింగి ఆశ్చర్యము కలదాయెను. ఆమె వివాహమునకు ముందు ఉండెడి రూపముతో ప్రకాశించుచుండెను. అప్పుడు విద్యాధర స్త్రీలచే సేవింపబడుచు దివ్య శరీరాధారి అయి కర్దముడు ఆ విమానమును ఆమెకు కనబట్టెను. అప్పుడు ఆ విమానము నల్లని ఆకాశం వలె అందరి స్త్రీలు నక్షత్రముల వలె వారి నేత్రములు కలవల వలె విలసిల్లుచుండెను. లోకపాలురు ఎనిమిది మంది అనుభవించెడి భోగములను అనుభవించదగిన విహార స్థానమగు మేరు పర్వత చర్యలో కర్దముడు దేవహుతితో విహరించుటకు ఏగెను. అచర చల్లని పరిమళములు గల వాయువు వీచుచుండెను. గంగా నది జలము మీద నుండి పడుచునుటచే ధనులు వచ్చుచుండెను. అనేకమంది సుందరులతో పరివేష్టితురాలైన దేవహుతితో కర్దముడు దేవోద్యానములందు మానస సరస్సునందు విచిత్రములకు భోగములను దేవహూతిని అనుభవింపజేయుచు తాను అనుభవించుచుండెను. ఆ విమానము ఎట్లు కోరినట్లు నడుచుచు ఆ విమానముతో ఎచటకు కావలెన అచటికి వెళ్ళవచ్చును. ఇట్లు అన్ని లోకముల్లో సంచరించుచు విమానములతో తిరిగెడి వారి లోకములన్నింటిని తిరుగుచు వారు ఆనందించుచుండిరి. కర్దమ ప్రజాపతి భగవంతుని చరణారవిందములను ఆశ్రయించిన వాడు. అందుచే అతనికి యోగ సిద్ధిచే తాపత్రయములు లేకుండా పోయినవి. భగవానుని చరణారవిందములను ఆశ్రయించిన వారికి పొందుటకు శక్యము కానిది ఏముండును?

ఈ విధంగా విమానంతో సంచరించుచు భూగోళమందున సకల ద్వీపములను వర్షములను భార్యకు చూపించి మహాయోగియు కర్ధముడు మరల తన ఆశ్రమమునకు చేరెను. ఆమెతో రమించి ఆమె యందు తొమ్మిది మంది సంతానం పొందవలెని కల్పించెను. ఆమె భర్తతో భోగములను అనుభవింప ఉత్సాహము గలదై ఉండెను. అనేక సంవత్సరములు ఒక ముహూర్తం వలె గడిచిపోయెను. ఆమె ఆనంద జనకముగు భోగములను అనుభవించుచు భర్తను అనుభవించుటలో కాలమునే గుర్తింపలేకపోయెను. కామ లాలసతతో భోగమును అనుభవించుచున్న ఆ దంపతులు 100 సంవత్సరములు గడిచినను అత్యల్ప కాలము అనుభవించినట్లు ఉండెను. కర్దముడు ఆత్మ పరమాత్మ యదార్ధ జ్ఞానము కలవాడు. ప్రియురాలిని తన దేహముతో సగభాగమున ప్రేమతో మనసులో భావించెను. ఆమె సంతాన వాంఛను అతడు గుర్తించెను. తన వీర్యమును తొమ్మిది విధములుగా విభజించి ఆమె యందు ఉంచెను. ఆమె వెంటనే సుందర రూపములకు తొమ్మిది మంది ఆడపిల్లలను కనెను. సంతానము కలగగానే కర్దముడు ఆమెను వదిలి వెలుటకు సిద్ధపడెను. ఆమె పైకి నవ్వుచు లోపల బాధపడుచు కన్నీరు కార్చుచు ఎట్లో దుఃఖమును ఆపుకొని ముఖము వంచి బొటనవేలుతో బొటనవేలి గేటు గోటితో నేల వ్రాయుచు సుకుమారముగా ఇట్లు పలికెను. తర్వాత పాడ్కాస్ట్ లో ఆమె ఏమి పలికింది కర్దవమునితో తెలుసుకుందాం. ఓం అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Asmad Gurubhyo. In this countless, special, name, form, and structure, the poets have created. In number, that which reveals the essence, salutations to that. For the sake of demonstrating the Sankhya, different names, colors, which cannot be counted, You are the form in which this world with forms exists. In that unique form, the Sankhya acharyas are calculating the elements. When you know your true form, that difference will disappear. The Sankhya philosophy is none other than your manifestation. Aryamu is praising you. Fifth Canto, 18th Chapter, 33rd Prayer. Devotees of God, welcome to the 29th podcast of Srimad Bhagavata Tatva Deepika. In the third book, until now, Kardama Prajapati. After marrying Devahuti, Swayambhu spent his life in the city of Barhishmati. Then, Maitreya is about to tell Vidu that he is going to explain the history of Devamuni Devodi. Let’s take this topic into our own hands.. Parents are the hundred forms They left Devahuta in the presence of Kardamuni and went to their country. She, like Parvati, who worshipped Parameshwara, served that king. Her heart was filled with sacred emotions. One who has control of his senses. She respected her husband. One who has mastery over her external senses. She is attentive to the words of her husband, has a good heart, a sweet tongue, is not arrogant, never has been separated, is free from lust, arrogance, hatred, greed, and sinful actions.

She obeyed their commands and pleased her husband. He used to look at the goddess Manuputriya with love and grace, who was following him. She was determined to obtain the virtuous progeny, which is the fruit of righteousness, from her husband, who is like God, through the practice of vows. Seeing her, Kardamudu spoke thus, Oh Bhamini, I am pleased with your service and your honor. The body is the most precious thing in the life. Without considering the body, you are making me work and serving you. I am a pious man. Karma Yoga, Dhyana Yoga, Bhagavad Bhakti Yoga. I am one who practices yoga. It is through him that I have received the grace of God. These things that can be experienced by the grace of God, the means to be experienced, and the places to be experienced are in my possession. While experiencing them, I do not feel fear or sorrow. I am attracted to your service. Therefore, I will grant you divine knowledge. The pleasures of all men are base. Those are sorrow and grief They are destroyed. By the movement of the eyeballs of the Lord, they perish in an instant. I am able to attain the best pleasures earned by penance, by practicing your dharma. The luxuries are beyond the reach of a common man. Thus, as Kardamudu spoke, Devahuti, knowing that her husband had powers of strange kinds and was wise, spoke with humility and love, her words choked with emotion, and her smile spread across her face as she spoke thus. Lord, you are the master of all yogic powers. It's like you have already arranged everything for me. You made a promise to me that you would be with me until I had children. It is a great benefit for a woman to have a worthy offspring from a superior husband. You have instilled in me the desire to fully experience your physical connection and the appropriate skill for it. To fulfill what she did not desire, Kardamudu, with his yogic strength, created a building like a flying chariot that came as if given.

That building was full of desires. All the wealth that the gods and humans possessed was in that building. The building was shining with beautiful pillars. And the instruments are divine. That building brings happiness in all times. The building was decorated with strangely patterned flags. Garlands adorned the entire building with strange flowers. The bees were silently collecting nectar from those flowers, and it was increasing for a long time. Silk clothes were hung all around for decoration. In those places, according to the respective pleasures, paan paals and asanas were added. Various sculptures were adorning the walls. With Indranila beads, the floor was built in thousands of houses. Coral platforms were provided on it. The doors are made of coral and the windows of diamond. Golden pots are fixed on the upper part of the building. Padmaraga gems are studded on the diamond walls. The house is full of lights, meaning they have put up chandeliers. Bangaru The toranas are decorated. Artificial swans, real swans, and pigeons were making a noise in that building. Pavilions have been provided for enjoyment of the feast. There was a playground, a bedroom, a dining room, a courtyard for sitting outside the house, and a spacious area outside the enclosure. Seeing this kind of building, she felt as if there was some defect in her mind, and she was not completely satisfied. Then came Kardam. Take a bath in this pond built by God, then all your desires will be fulfilled. The lake was formed by the spout of a divinely inspired teardrop. So this is Bindu Lake. Having bathed in this, you ascend this plane, he said. Then Devahuti, for so long, with discipline, with impure clothes, with braids tied, with hair, with hair, with soiled waists, was there. Entered the reservoir. As soon as she bathed in that lake and got up, she saw a thousand beautiful maidens in the palace. They came forward and bowed down, saying, "We are your servants; please command us what we should do."

She and her perfume were massaged. They made them wear new clothes that were pure. They adorned themselves with the finest and brightest ornaments. They have settled the drinks that are like nectar, sweet and very sweet, to make the food that is a combination of six tastes like nectar. After decorating like that, they placed a mirror in front of her so that she could see her reflection. She watched and enjoyed herself. The virgins who saw her praised her very much. Thus, having bathed and adorned herself with ornaments, she was beautifully adorned with the anklets she was wearing. Her beauty was captivating to those who saw it. After decorating like this, the husband also remembered Kardamuni in his mind. Immediately, she was made to sit with her maids by her husband. Seeing her sitting in front of her husband with thousands of maids, she was surprised to see the effect of her husband's yoga. She shone with the form she had before her marriage. Then, being served by the women of Vidyadhara, Kardamudu, becoming the embodiment of divinity, showed that plane to her. Then that plane Like a black sky, all the women, like stars, their eyes, like kalavalu, were shining. The eight worldly people, in the action of Mount Meru, which is a recreational place where the enjoyable pleasures of experiencing can be enjoyed, Kardamudu agreed to enjoy with Devahuti. A cool, fragrant breeze was blowing. The rains were falling from the Ganges river water. Kardamudu, surrounded by many beautiful women, was making Devahuti experience various pleasures in the gardens, in the Manasa lake, and was experiencing himself. How does that plane behave as it wishes? With that plane, wherever it wants, it can go. Thus, they were rejoicing, wandering in all the worlds, traveling in airplanes, wandering through all the worlds of those who roam. Kardama Prajapati is the one who has taken refuge in the lotus feet of the Lord. Therefore, he attained Yoga Siddhi, and his anxieties disappeared. What is it that is not possible for those who have taken refuge in the lotus feet of the Lord to attain?

In this way, traveling with the plane, showing all the islands and rains in the globe to his wife, the great Yogi Kardhamudu again reached his ashram. He made a promise to her to enjoy with her and have nine children. She was eager to experience pleasures with her husband. Many years passed like an eon. She, experiencing the bliss and pleasures, could not recognize time in experiencing her husband. Those couples who are enjoying pleasure with lust, even after 100 years have passed, it would be as if they had experienced very little time. Kardamudu is a person who has self-realization and self-knowledge. He loved his beloved with half his body, with love in his heart. He recognises her desire for children. He divided his semen into nine parts and placed it in her. She immediately had nine daughters with beautiful forms. As soon as they had children, Kardamudu left her and got ready to go out. She smiled upwards, felt sad inside, and shed tears. Somehow, she suppressed her sorrow, bowed her face, and closed the gate with her thumb Writing on the ground with a stick, he spoke softly like this. Let's find out what she said in the podcast later. Om Asmadgurubhyo Namah Jai Srimannarayana.