దేవాసుర సంగ్రామం, మోహిని వృత్తాంతం మరియు శివునిపై విష్ణుమాయ ప్రభావం

Deva-Asura War, Mohini Episode, and Shiva's Encounter with Vishnu's Maya

bhagavatam

క్షీరసాగర మథనంలో అమృతం దేవతలకు లభించగా, దానవులు ఓర్వలేక దేవతలపై యుద్ధం చేశారు; బలి నాయకత్వంలో మాయావి మయుడు నిర్మించిన విమానంతో అసురులు దేవతలను ఇబ్బంది పెట్టారు. దేవతలు మనసులో భగవానుని ధ్యానించగా అష్టభుజుడైన శ్రీహరి ప్రత్యక్షమై కాలనేమి, మాలి, సుమాలి మొదలగు రాక్షసులను సంహరించాడు. ఇంద్రుడు నురగను వజ్రానికి పూసి నముచిని సంహరించాడు, ఆ తర్వాత నారదుడు యుద్ధాన్ని విరమింపచేశాడు. మోహిని రూపాన్ని చూడాలని పరమశివుడు శ్రీహరిని ప్రార్థించగా, ఆ రూపానికి శివుడే మోహితుడయ్యాడు, ఇది నన్ను ఆశ్రయించినవారే మాయను దాటగలరని విష్ణువు నిరూపించాడు.

Following the churning of the ocean and distribution of amrita, the demons—denied their share—launched a war against the gods at the shore of the Kshira Sagara. Led by Bali with a magical aerial vehicle built by Maya, the asuras used illusions to overwhelm the devas, until Lord Vishnu appeared with eight arms and destroyed key demons including Kalanemi, Mali, and Sumali. Indra ultimately defeated Namuchi using foam—neither wet nor dry—to circumvent his boon. Lord Shiva, hearing of Vishnu's Mohini form, requested to witness it, and was so enchanted by the illusion that even he, the conqueror of Manmatha, lost composure, demonstrating that none can overcome Vishnu's maya except by surrendering to Him.

← Prev Next →
Deva-Asura War, Mohini Episode, and Shiva's Encounter with Vishnu's Maya bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః వ్యామోహ ప్రశమౌషధం ముని మనోవృత్తి ప్రవృత్యౌషధం దైత్యేంద్రార్తికరౌషధం త్రిభువనీ సంజీవనైకౌషధం భక్తాత్యంత హితౌషధం భవభయ ప్రద్వంసనైకౌషధం శ్రేయః ప్రాప్తి తి కరౌషధం పిబ మనః శ్రీకృష్ణ దివ్యౌషధం ఓ మనసా శ్రేయస్సును కలిగించు శ్రీకృష్ణ దివ్యౌషధమును సేవింపుము ఆ ఔషధము మోహమును శమింపజేయును మునుల మనోవృత్తులను ప్రవర్తింపజేయును. రాక్షసేంద్రులకు బాధలను కలిగించును. మూడు లోకములను మరణము నుండి కాపాడును. భక్తులకు అత్యంతము హితము చేకొరుచును. సంసార భయమును బాపును. ముకుందమాల ప్రేయర్ 25. భవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వ దీపిక. అష్టమ స్కంధం ఏడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు గజేంద్ర మోక్షణము పూర్తి చేసుకొని క్షీరసాగర మథనాన్ని చేసుకుని అక్కడ వచ్చినటువంటి అమృతాన్ని అందరికీ పంచి ఆ తరువాత జరిగినటువంటి వృత్తాంతాన్ని మనము తెలుసుకుందాం. దేవాసుర సంగ్రామం. దైత్యులు కర్మ చేయుటలో పూనిక గలవారు. పట్టుదలతో చేయువారు కూడా కానీ వారు వాసుదేవుని వైపు మనసు నిలపని వారు. అందుచే వారికి అమృతము లభింపలేదు. దేవతలు అమృతము పానము చేసి ఆనందించుట చూచి ఓర్వలేని వారై వారిపై దండెత్తిరి. దేవతలు అమృత పానము చేసి నారాయణ పదాశ్రయులై ఆయుధములతో యుద్ధము చేసిరి. దేవతలకు, రాక్షసులకు క్షీర సాగర తీరమున జరిగిన ఈ యుద్ధమున దేవాసుర సంగ్రామని పేర్కొందురు. యుద్ధమును రెండు సముద్రముల వలె దేవ సైన్యము, అసుర సైన్యము విజృంభించి పోరాడసాగెను.

అసురులకు సేనానాయకుడు బలి. అతనికి మయుడు ఆశ్చర్యకరమైన ఒక వాహనము నిర్మించి ఇచ్చినాడు. ఆ విమానము ఎట్లు నడవవలెనైనా అట్లే పోవుచుండును. దానియందు సకల యుద్ధ సాధనములు అమర్చబడినవి. చాలా విశాలమైనది. ఒక చోట ఉండునని చెప్పుటకు వీలు కాదు. కనపడుచునే కనపడకుండా పోవును. ఆ విమానమున సకల యోధపతులు ఛత్ర చామరాధారులైన పరివారము కూడా ఉండును. బలికి నముచి, శంబరుడు, బాణుడు, హయగ్రీవుడు, శంభుడు, నిశుంభుడు, నివాత కవచాదులు మొదలగు వారెందరో యోధులుగా నుండిరి. వీరందరూ అమృతంలో భాగము లభింపక దేవతల చేత ఓడింపబడిన వారే. వారందరితో కలిసి బలి ఇంద్రునితో యుద్ధమునకు తలపడెను. ఇంద్రుడు ఐరావతమును దిగ్గజమును అధిరోహించి రాక్షసులపై యుద్ధమును వచ్చెను. నానా విధములగు వాహనములు, ఆయుధములు, ధ్వజములు గల లోకపాలురు వరుణ అగ్ని వాయువా దేవతలు ఇంద్రుని వెంటనే వెంటనేంటి యుద్ధమునకు వచ్చిరి. ఇంద్రుడు బలిని, కుమారస్వామి తారకుని, వరుణుడు హేతిని, మిత్రుడు ప్రహేతిని, యముడు కాలనాభుని. విశ్వకర్మ మయుని, శంబరుడు త్వష్టని, సవిత విరోచనుని ఎదిరించి యుద్ధము చేయుచుండిరి. తరువాత అసురులు అసురమగు మాయను ఆశ్రయించి పర్వతములను, సముద్రములను, మేఘములను కల్పించి దేవతలకు గోచరము కాకుండా భయమును కల్పించుచు యుద్ధము చేయుచుండిరి. ఇంద్రాదులు అసుర మాయకు ప్రతిక్రియ చేయలేక భేదము నొంది ఖేదము నొంది మనసులో భగవానును ధ్యానించిరి. అప్పుడు అష్టభుజములతో ఆయుధమును దాల్చి భగవానుడు యుద్ధమును ఆవిర్భవించెను. నిద్ర నుండి తెలియ వచ్చిన వెంటనే కల కనపడకుండా పోయినట్లు శ్రీహరి ఆవిర్భవించగానే వాని మహిమచే మాయలన్నియు అంతరించిపోయెను. అప్పుడు కాలనేమి తన శూలముతో భగవాను ఎదిరించి గరుడునిపై శూలము ప్రయోగించెను. శ్రీహరి ఆ శూలమునే తీసుకొని కాలనేమిని సంహరించెను.

తరువాత మాలి, సుమాలి అను ఇద్దరు రాక్షసులు గద పట్టుకొని స్వామి వాహనము గరుణిపై పరుటకు రాగా శ్రీహరి తన చక్రముతో వారిరువురిని అంతమొందించెను. దేవాసుర సంగ్రామములో బలితో ఇంద్రుడు యుద్ధము చేయుచు తన వజ్రమును అతనిపై ప్రయోగించుటకు సిద్ధపడి బలితో ఇట్ల అనుచుండెను. మూఢా, క్రింది లోకముల నుండి పై లోకములను మాయచే ఆక్రమించవలెనని కోరిన నీ శిరస్సును ఈ వజ్రముతో ఛేదించెదను. జ్ఞాతులతో కలిసి నీ పరాక్రమమును చూపించుము. ఆ మాట విని బలి కాలముచే సుఖ దుఃఖములు, జయాపజయములు, కీర్తి అపకీర్తులు కర్మానుగుణముగా కలుగుచుండును. అందుచే తెలియగలవారు అపకీర్తి, పరాజయము, మృత్యువు కలిగిన నాడు కృంగరు. దానికి విరుద్ధముగా జరిగినను పొంగరు. ఈ కీర్తి మొదలగు వానికి ఈ దేహమే సాధనమును భావించువారము కాము. అందుచే మాకు అపకీర్తి కలిగినను, అపజయము కలిగినను, మృత్యువు కలిగినను శోకము లేదు అని బలి పలికి ఇంద్రుని బాణములతో కొట్టెను. ఇంద్రుడు వజ్రమును బలిపై ప్రయోగించెను. ఆ వజ్రముచే విమానముతో కూడా బలి నేలపడెను. అప్పుడు జంభుడు సింహ వాహనుడై ఇంద్రుడిపై దూకి గదతో ఇంద్రుని వాహనమైన ఐరావతమును కొట్టెను. ఆ దెబ్బకు ఓర్వలేక ఐరావతము మోకాళ్ళపై పడెను. అప్పుడు మాతలి వెయ్యి గుర్రములు వెయ్యి గుర్రములు పూంచిన రథమును తెచ్చి ఇంద్రునిపై దాని ఇంద్రుని దానిపై అధిరోగించినట్టు చేసెను. ఇంద్రుడా రథము ఎక్కి జంబుని శిరమును వజ్రముచే నరికెను. జంబుని జ్ఞాతులు నముచి, బలుడు, పాకుడు అనువారు ముగ్గురును జంబుడు చనిపోయినట్లు నారదుని వలన విని ఇంద్రునిపై యుద్ధమునకు వచ్చిరి. వారితో ఇంద్రుడు చాలాసేపు యుద్ధము చేసి బలుని, పాకుని చంపెను. కానీ నముచిపై అతని వజ్రము పనిచేయలేదు. తిరిగి వచ్చెను. దానిచే ఇంద్రుడు ఖిన్నుడయ్యెను.

అప్పుడు అశరీర వానిట్లు పలికెను. ఈ నముచికి తడిగానున్న వాటిచే గాని పూర్తి తడి లేని వాటిచే గాని చావు లేకుండునట్లు వరమున్నది. వజ్రము శుష్కము అందుచే అతడు దానిచే చావడు అని ఇంద్రుడు ఆ మాటలు విని ఆద్రము కాక శుష్కము కాక రెండు ఉండు వస్తువు రెండు ఉండు వస్తువు నురగ అని భావించెను. నీటిపై వచ్చిన నురగ తడిగా ఉండును పొడిగా ఉండదు అని భావించి దానిని తెచ్చి వజ్రమునకు పూచి పూసి నముచిని సంహరించెను. ఈ విధముగా దానములను దేవతలను అంతమొందించుట చూచి నారదుడు బ్రహ్మ ఆజ్ఞచే అచటకు వచ్చి వారిని యుద్ధం విరమించునట్లు చేసెను. అచ్చట పడియున్న రాక్షసులను శుక్రాచార్యులు మృత సంజీవిని విద్యచే మరల జీవింప చేసెను. నేలపడిన బలి కూడా మరల లేచినాడు. కానీ జ్ఞానము కలవాడగుటచే అపజయమునకు ఖేదము పొందలేదు. శ్రీ మహావిష్ణువు మోహిని రూపమును దాల్చిన దాల్చి దానవులను మోహపెట్టి దేవతలకు అమృతమసంగినాడన్న వార్తను రుద్రుడు విని శ్రీహరి స్త్రీ రూపమును చూడవలెనని ప్రమధ గణములతో శ్రీహరి వద్దకు వచ్చి శ్రీహరిని ఇట్లు స్తోత్రము చేసెను. సకల జగత్తునకు నీవు కారణము నీవే సకల జగత్తు నిలుచుటకు హేతువు. జగత్తును నీలో నిలుపుచున్నావు. ఈ లోకములో పై లోకములో దేనియందును కోరికలేని ముముక్షువులు మునులు శ్రేయస్సును కోరువారు నీ పాదపద్మములనే సేవింతురు. ప్రకృతి పురుషుల కంటే భిన్నుడవైన వేదాంత వేద్యుడవైన సర్వవ్యాపివి అయిన నీవు స్త్రీ రూపమును దాచుట నమ్మశక్యముగా లేదు. నీ అవతారము ఎన్నిటిలో నిన్ను దర్శించితిని. దానవులను మోసబుచ్చి దేవతలకు అమృతమును వసంగిన నీ మోహిని రూపమును నేను ఒక్కసారి చూచునట్లు అనుగ్రహింపుము అని పరమశివుడు ప్రార్థించెను. ఆ మాట విని శ్రీ మహావిష్ణువు దైత్యులను వంచించి దేవతలకు అమృతము సంగుటానికి ఆ రూపమును స్వీకరించితిని కాముకులను వంచించుటకు ఆ రూపము తగినదని స్వీకరించితిని చూడవలెనని కోరిక కోరినచో చూపించెదను అని అంతర్ధానమాయెను. ఎచ్చటికి వెళ్ళినాడు అని రుద్రుడు అన్ని చూపుల అన్ని వైపులా చూచుచుండెను. సమీపమునందే ఉన్న ఒక ఉద్యానవనమున బంతి ఆడుకొనుచు ఒక యువతి కనబడెను. బంతిని ఆడుటలో ఆమె కదలికలు, ఆమె చూపులు.

ఆమె విలాసములు మోహజనకములుగా ఉండెను. ఆడుచుండగా బంతి చేయి జారి దూరము పోవుచుండగా ఆ యువతి పరిగెత్తుచు బంతిని పట్టుకొనబోయెను. గాలికి ఆమె పైట ఎగిరిపోయెను. దూరము నుండి రుద్రుడు చూసుచుండెను. ఆమె సౌందర్యమునకు మోహితుడాయెను. మోహపడిన శివుడు పార్వతి ప్రక్కనే ఉన్నదని కూడా సిగ్గుపడక ఆమె వెంటపడెను. వివస్త్రై సిగ్గుచే పరిగెత్తుచున్న ఆమెను బలాత్కారముగా పట్టుకొని కౌగలించుకొయెను. ఆమె పట్టు వదిలించుకొని పారిపోవుచుండగా వృద్ధుడు ఆమె వెంటపడెను. ఆయన రేతస్సు స్ఖలనమై నేలపడెను. నేలపడిన ఆ వీర్యము భూమిపై బంగారము, వెండి గనులుగా ఏర్పడినది. నదులలో, పర్వతములపై, వనములలో కూడా ఆ రేతస్సు పడెను. ఆ స్థలములే పురుషులు తపస్సు చేసుకొనుటకు పవిత్రముగా భావించి సేవించుచుందురు. రుద్రుని మనసుకు మాయ అనుటకు అవకాశము లేదు కానీ కామినీ మోహము మన్మధుని జయించిన పరమశివునకు కూడా దాట శక్యము కానిదని నిరూపించినది వృత్తాంతం. అప్పుడు విష్ణువు తన రూపముతో రుద్రునికి కనపడి ఇట్లు చెప్పినాడు. సత్తరజస్తమో గుణములతో కూడిన నా మాయ కాలముచే ప్రేరేపించబడి ఆవరించిన నాడు జయింపగలవాడు ఎవడునూ లేడు. నీ వంటి వానికి తెలుసుకుంటకు శక్యము కానిది అయిన మాయను ఇతరులెవ్వరూ దాటగలరు. నన్నే ఉపాయముగా స్వీకరించిన వారు మాత్రమే దానిని దాటగలరు. ఇట్లు విష్ణుమాయను దర్శించి దాని ప్రభావమును పార్వతికి ప్రమధ గణములకు రుద్రుడు వివరించినాడు. ఈ అమృత మథన వృత్తాంతము వృత్తాంతమును మోహినీ వృత్తాంతమును శ్రవణము చేయు వారలకు సంసారములో క్లేశములు ఉండవు. తాము చేయు ప్రయత్నములు ఫలవంతములగును. మాయ వారికి దరిచేరదు. ఇంతటితో మనకు క్షీర సాగర మథనము దేవాసుర సంగ్రామము దానితో కలిసిన భాగంగా ఉన్న పూర్తవుతుంది. దీని తరువాత మరొక అవతారం యొక్క వృత్తాంతాన్ని మనము తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Guru. Vyamoha Prashamoshadham, the medicine that removes delusion, the medicine that improves the mind's tendencies, the medicine that removes the suffering of demons and gods, the medicine that is life-giving to the three worlds, the medicine that is the greatest benefit to devotees, the medicine that removes the fear of worldly existence, the medicine that brings about the attainment of supreme good, the medicine that is pleasing to the mind Srikrishna Divyoushadham, O, may it bring mental well-being. Serve Srikrishna Divyoushadham. That medicine pacifies delusion and inspires the minds of sages. It causes suffering to the demons. Death to the three worlds. Will do the most good to the devotees. Bapu, fear the world. Mukundamala Prayer 25. Devotees, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the seventh podcast episode of Ashtama Skandam. Until now, after completing the salvation of Gajendra, after churning the ocean of milk, distributing the nectar that came there to everyone, let us know the story that happened after that. The battle between the gods and demons. The Daityas are zealous and are very active in doing misdeeds. Even those who do with determination, but those who do not keep their minds towards Vasudeva. Therefore, they did not receive nectar. Seeing the gods drinking the nectar and rejoicing, they could not bear it and attacked them. The gods drank the nectar and took refuge in Narayana, and fought with weapons. In this war that took place on the banks of the milky ocean between the gods and the demons, it is referred to as Devasura Sangrama. The war, like two oceans, the army of gods and the army of demons, raged and began to fight.

Bali was the commander of the Asura army. He was given a wonderful vehicle by Mayudu. That plane, however it is supposed to run, is going on like that. It was equipped with all kinds of war instruments. It's very spacious. It's not possible to say for sure where it will be. It will disappear without being seen. That aircraft will have all the warriors, along with their retinue, who are adorned with umbrellas and flywings. Namuchi, Shambarudu, Bānudu, Hayagrivudu, Shambhudu, Nishumbhudu, Nivātakavāchāradulu, and many others were warriors. All of them, not getting a part in the nectar, were defeated by the gods. Together with all of them, he fought against the war with Bali Indra. Indra mounted Airavata and came to war against the demons. Varuna, Agni, Vayu, the gods, with various vehicles, weapons, and flags, came to Indra's immediate war. Indra is Bali, Kumaraswamy is Taraka, Varuna is Heti, Mitra is Prahethi, and Yama is Kalanabhu. Vishwakarma, Mayuni, Shambarudu, and Savita were fighting against Virochana. After that, the demons, taking refuge in the demonic illusion, created mountains, seas, and clouds, and, creating fear without being visible to the gods, were waging war. Indradu and others, unable to react to the demonic illusion, were distressed and saddened, and meditated on the Lord in their minds. Then, assuming a weapon with eight arms, the Lord manifested himself in the battle. As soon as Srihari appeared from sleep, as if a dream had vanished, all the illusions were destroyed by his glory. Then Kalanemi, with his trident, confronted the Lord and threw his trident at Garuda. Srihari took that spear and killed Kalanemi.

After that, two demons named Mali and Sumali came with a mace to place the Swami's vehicle on Garuni, but Srihari killed them both with his Chakra. In the Devasura Sangramam, Indra, while fighting with Bali, was ready to use his Vajra on him, and Bali was saying this. Fool, I will sever your head, which desired to seize the upper worlds from the lower worlds, with this diamond. Show off your manners. Hearing that, due to the time of sacrifice, happiness, sorrow, victory and defeat, fame and disgrace will occur according to karma. Therefore, those who know will not be discouraged when they face dishonor, defeat, and death. It happened contrary to fame. Those who consider this body as the means to achieve this fame and so on, are not Kamas. Therefore, even if we have disgrace, even if we have defeat, even if we have death, he sacrificed and struck with Indra's arrows, saying that there is no sorrow. Indra threw his Vajra. The sacrifice also fell on the ground with the diamond. Then Jambhudu, riding a lion, jumped on Indra with a mace He hit the Airavata, the mount of Indra. Unable to bear the blow, Airavatam fell on its knees. Then Matali brought a chariot filled with a thousand horses, and placed it upon Indra, making it ride upon Indra. Indra mounted his chariot and struck Jambunya's head with a diamond. Jambuni's relatives, Namuchi, Baludu, and Paduku, hearing that Jambudu had died, came to Indra for war. Indra fought with them for a long time and killed Bala and Pani. But his diamond did not work on Namuchi. He returned. Indra was enraged by it.

Then the unborn one spoke. This Namuchi has a boon that it will not die from being wet or completely wet. The diamond is dry, therefore he will not die by it, Indra heard those words and thought that it would be neither wet nor dry, but a thing that is neither wet nor dry, a thing that is foamy. Thinking that the foam that came on the water would be wet and not dry, he brought it, applied it to the diamond, smoked it, and destroyed the snake. Seeing Narada destroying the donations and the gods in this way, Brahma commanded him to come there and make them stop the war. Shukracharya revived the demons who had fallen there through the medicine of Mruta Sanjeevani. The slain also rose again. But being wise, he did not suffer from failure or sorrow. Sri Maha Vishnu, having assumed the form of Mohini, deceived the demons and made the gods drink the nectar. Rudra heard this news and wanted to see Srihari in his female form. He came to Srihari with the Pramadha Ganas and praised Srihari thus I did. You are the cause of all the world You are the cause of the entire universe standing. You who encompass the universe. In this world, in the higher world, those who are without desire, the ascetics, the sages, those who desire well-being, serve your lotus feet. It is impossible for you, who are the Vedanta knower, who is different from nature and men, and who is omnipresent, to hide the form of a woman. In how many things have I seen your incarnation? Please grant me a glimpse of your enchanting form, who deceived the demons and brought nectar to the gods, so that I may witness it once, thus prayed Parameshwara. Hearing that, Sri Maha Vishnu, after deceiving the demons, accepted that form to give nectar to the gods. He accepted that form, saying that it was appropriate to deceive the Kamukas, and that he would show it if asked. He disappeared. Where did he go? Thus, Rudra looked in all directions. Nearby, in a garden, a young woman was seen playing with a ball. Her movements and her gazes as she played with the ball.

Her luxuries were no longer luxuries. While playing, the ball slipped from the hand and went far away. The young woman ran and was about to catch the ball. The wind blew her skirt up. Rudra was watching from a distance. He was enchanted by her beauty. The enchanted Shiva, not being ashamed that he was beside Parvati, followed her. He grabbed her, who was running shamefully naked, and embraced her. As she was about to escape, the old man chased her. He ejaculated and it fell to the ground. That fallen semen formed gold and silver mines on the earth. The semen fell in the rivers, on the mountains, and in the forests. Those places are considered sacred and are served by men who perform penance there. There is no chance of Rudra's mind being considered illusory, but the story proves that even Parama Shiva, who conquered Kamini's infatuation, could not overcome it. Then Vishnu appeared before Rudra in his form and said thus. My illusion, filled with the qualities of the seventy-six elements, was inspired by time and spread There was nobody to help him. No one else can surpass the illusion that is impossible for someone like you to understand. Only those who accept me as a means can overcome it. Thus, having seen Vishnu's illusion, Rudra explained its effect to Parvati and the Pramadha Ganas. Those who listen to this nectar churning story, the story of Mohini, will not have suffering in their lives. And those who make efforts will be successful. The illusion cannot reach them. With this, our churning of the ocean of milk, the battle between the gods and demons, is completed as part of it. After this, let us know the story of another incarnation. Jai Srimannarayana and salutations to the Ashmadguru.