భరత వంశానుకీర్తనం - ముగింపు
Glorification of the Bharata Dynasty — Conclusion
శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని భరత వంశానుకీర్తనం యొక్క ఈ ముగింపు భాగంలో, భారతవర్షానికి పవిత్రమైన నామాన్ని అందించిన భరత వంశపు మహిమాన్విత చరిత్రను వివరిస్తారు. రాజర్షి భరతుని వారసుల దివ్యగుణాలు మరియు ఆధ్యాత్మిక సాధనలు ఈ వంశానికి చిరస్థాయిగా కీర్తిని తెచ్చిపెట్టిన విధానం ఇందులో ప్రతిబింబిస్తుంది. ఈ పవిత్ర వంశ చరిత్రను శ్రద్ధగా శ్రవణం చేయడం వల్ల మనసు నిర్మలమై శ్రీహరి పాదపద్మాల వైపు భక్తి పెంపొందుతుందని శాస్త్రం చాటుతోంది.
In this concluding episode on the glorification of the Bharata dynasty from Canto 5 of the Srimad Bhagavatham, we explore the magnificent lineage that gave Bharatavarsha its sacred name and eternal glory. The episode traces the noble descendants of King Bharata, highlighting the divine virtues and spiritual achievements that distinguished this illustrious dynasty. The concluding passages reveal how meditating upon this holy lineage purifies the mind and draws the devotee closer to the lotus feet of Lord Vishnu.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో భగవతే తుభ్యం వాసుదేవాయ విష్ణవే పురుషాయాది బీజాయ పూర్ణ బోధాయతే నమః విష్ణు భగవానుడవగు నీవు వసుదేవ పుత్రుడవై అవతరించితివి పూర్ణ బ్రహ్మవైన నీవే జగత్కారణం. దేశకార పరిచ్ఛేదము లేని చైతన్యమే నీ స్వరూపము. నీకు అనేక నమస్కారములు. టెన్త్ క్యాంటో, ఫిఫ్టీనైత్ చాప్టర్, ట్వంటీ సెవెంత్ ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము. 20వ పాడ్కాస్ట్ లో స్వాగతం. మనం ప్రియవల చరితాన్ని పూర్తి చేసుకొని భూగోళ వర్ణనంలో ఇలావృతము, భద్రాసు వర్షము, తరువాత కేతుమాల వర్షము, తరువాత హరి వర్షము. వాటిలో ఉన్నటువంటి అధిష్టాన దేవత విషయాలన్నీ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు రమ్యక వర్షాన్ని తెలుసుకుందాం. రమ్యక వర్షమునందు భగవానునకు అత్యంత ప్రియమైన మత్స్యమూర్తి ఆరాధ్యుడై ఉండును. ఈ మత్స్య రూపమును మనువు ఈ వర్షమునందు గొప్ప భక్తితో ఆరాధించుండును. వాడు జపించు మంత్రం. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణాయ ఓజసే సహసే బలాయ మహామత్స్యాయ నమః ఓ మత్స్యమూర్తి, నీవు జ్ఞానాది గుణములు ఆరును గలవాడవు. అవతారములలో మొదటివాడవు నీవు. అందరికీ ప్రాణమై ఉజ్జీవింపజేయువాడవు. ఇంద్రియ శక్తిని నియమించువాడవు నీవు. శరీర శక్తిని నియమించువాడవు నీవు. అటువంటి మహాత్మ్యమగు నీకు నమస్కారము. నీవు లోకపాలులచే లోపల గాని వెలుపల గాని చూచుటకు శక్యము గాని గుణములు గలవాడవు. నీ నుండియే వేద నాదము వెలువడినది. ఒక స్త్రీమూర్తిని కర్రతో తయారు చేసి తన ఇష్టం వచ్చినట్లు ఎట్లు ఆడించుచుందురో అట్లు నీవు ఈ చేతనా చేతనాత్మకము సర్వ జగత్తును నీ వశమునందుంచుకొని వేదములు అనేటి తాడుతో కట్టి పట్టుకొని నడిపించుచున్నావు. లోకపాలులు నాకంటే అధికులు లేరనేటి గర్వం వీడి అందరూ కలిసి ప్రయత్నించి కూడా ఈ ప్రపంచమును రక్షించుటకు సమర్థులు కాజాలరైరి.
ఈ ప్రపంచమునందున్న ద్విపదములు, చతుష్పదములు ప్రాకునవి, కదలక నడుచునవి మొదలగునవి అన్నియు నీ చేతనే రక్షింపబడుచున్నవి. ఒక ప్రళయములో ఔషధులతో, లతలతో, గుల్మములతో నిండిన భూమి సముద్రములో మునగక ఆ భూమిని దానిని పాలించు మనువును కూడా నీవే ధరించి కాపాడితివి. అట్టి జగత్ప్రాణ గణము నీ శరీరముగా ఉండును. నీ వలననే ప్రాణము కదులుచున్నది. ఇప్పుడు మరొక వర్షం నేర్చుకుందాం. హిరణ్మయ వర్షం. హిరణ్మయ వర్షములో భగవానుడు కూర్మము రూపం వసించి ఉండును. ఆ రూపం భగవానుకు ప్రియతమము. అతడు సముద్రమున విశాలముగా జలములతో నిండిన చోట వసించి ఉండును. అతడు ఎచటనున్నాడో ఎవ్వరును గుర్తింపజారరు. అతనికి ప్రాకృత రూపము లేదు. అప్రాకృత దివ్య దేహము గలవాడు శ్రేష్టుడు. కాలముచే పరిచ్ఛేదించుటకు శక్యము గాని మహిమ గలవాడు. అన్నిటికీ ఆధారమైనవాడు అట్టివానికి నమస్కారము. అతడే సమ్యజ్ఞానమును ప్రవర్తింపజేయువాడు. ఈ జగత్వంతయు అతని రూపము. మాటలతో వివరింపదగిన దేవ మనుష్యాది ప్రపంచం అంతయు అతని రూపమే అయి ఉండును. అతడు చేతనుని వలె ఇట్టి వాడని నిర్దేశించుటకు వీలు కానివాడు. ఆ జగత్తు అతని సంకల్పము చేతనే నిలుచున్నది. చేతనులకు యోగ్యముగా గోచరించుచున్నది. బ్రహ్మ ఆత్మగా గలది అయ్యు బ్రహ్మాత్మకముగా ఎవరికినీ భాసింపకుండెడి జగత్తు అతని సంకల్పము చేతనే అట్లు నిలచి ఎవరికినీ ప్రకాశింపక ఉండును. ఈ ప్రపంచములో చరములు, అచరములు అనగా కదలునవి, కదలలేనివి అనే రెండు విధములుగా శరీరములు ఉన్నవి. అవి అన్నియు జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భిజములు అని నాలుగు విధములు. గర్భమున మావిలో ఉండి బయల్పడునవి జరాయుజములు. చెమటచే పుట్టునవి శ్వేదజములు. గర్భములో గుడ్డుగా ఉండి వెలికి వచ్చి పగిలిన కదలాడునవి అండజములు.
భూమిని పొడుచుకొని వెలికి వచ్చినవి ఉద్భుజములు. ఇవి అన్నియు భగవానుడే అయి ఉన్నాడు. లోకములు దేవతలు, ఋషులు, పితృ దేవతలు, భూతములు, భూమి, పర్వతములు, నదులు, అంతరిక్షము, జలోకము. భూమి, సముద్రములు, ద్వీపములు, గ్రహములు, నక్షత్రములు అన్నియు భగవాను శరీరములే అగుటచే వాటి అన్నిటి పేర్లతో పిలువదగిన వాడు భగవానుడు ఒక్కడే. లెక్కించుటకు శక్యము గాని నామరూప భేదములు అన్నియు ఆ భగవాని యందే కల్పించబడినవి. అతడు అన్నిటికీ ఆత్మయే ఉండును. అవి ఇట్టివని ఇన్ని అని పరిచ్ఛేదించుటకు శక్యము కానివాడు తత్వములు ఇన్ని అని నిర్దేశించుట ఆ భగవాను సంకల్పము చేతనే. ఉత్తర కురు వర్షమున భగవానుడగు యజ్ఞ పురుషుడు వరాహ రూపముగా ఉండును. ఇది నెక్స్ట్ వర్షము ఉత్తర కురు వర్షం. ఆ మూర్తిని భూదేవి అచడనుండు వారందరితో కలిసి అస్ఖరితమగు భక్తి యోగముతో సేవించుచు ఈ మంత్రమును జపించుచు ధ్యానించుచుండును. ఇది ఉత్తర కురువర్షంలో ఓం నమో భగవతే మంత్ర తత్వ లింగాయ యజ్ఞ క్రతవే మహా ధ్వరావయవాయ మహా పురుషాయ నమః కర్మ శుక్లాయ త్రిగుణాయ నమః భగవానుడు ఆయా మంత్రములతో ప్రతిభామింపబడిన శరీరములచే ఆయా దేవాంతర్యామి అయి ఉండి గుర్తింపబడుచుండును. యజ్ఞములు, యాగములు అనే వేద ప్రతిపాదితమగు క్రతువులచే ఆ భగవానుడు ఆరాధింపబడుచుండును. సోమరసము లేని యాగములు, క్రతువులు, సోమరసంతో కూడినవి యజ్ఞములు అనబడును. ఆ రెండింటి చేతనే ఆరాధింపబడి ఫలమును వసంగువాడు ఆ వరాహమూర్తియే.
ఆ యజ్ఞ యాగములలో ఉపయోగించు శృక్, శృవము మొదలగు పరికరములన్నియు ఆ వరాహ రూపి అవయవములే. అతడు అనంత కళ్యాణ గుణ విశిష్టుడు. సర్వాంతరాత్మ అయినవాడు. విశుద్ధమైన కర్మ గలవాడు. జ్ఞాన శక్త్యాది గుణములు ఆరు గలవాడు. అట్టి మహాపురుషునకు నమస్కారము. ప్రకృతి పురుషుల యధార్త స్వరూపమును ఎరింగిన వారు సర్వజ్ఞుడగు ఆ భగవానుని ఒక్క స్వరూపమును దర్శింప కోరిన వారలే కర్రలో మరుగుపడి ఉన్న అగ్నిని మధించి దర్శించినట్లు వివేకము గల మనసుచే మధించి. ప్రకృతి భేదములగు 25 తత్వముల కంటే వేరుగా దర్శింతురు. కొందరు ఆత్మజ్ఞానము గలవారు నిరూపించుటలో నైపుణ్యము గల బుద్ధిచే ఆ తత్వము ప్రకృతి పురుషుల కంటే విలక్షణమని గుర్తింతురు. ప్రకృతి వికారములు లేనివాడు అతడు. పంచభూతములు వాగాది కర్మేంద్రియములు, జ్ఞానేంద్రియములు అనువానితో ఉన్న శరీరమునందు ఉన్నవాడై వేరుగా గుర్తింపబడినవాడు భగవానుడు. భగవానుడు ప్రధానము అనగా ప్రకృతి యొక్క గుణములను సప్తరజస్తమో గుణములచే ఈ విశ్వం యొక్క సృష్టి స్థితి లయములను చేయుచున్నాడు. ఈ జీవుల కొరకే చేయుచున్నాడు. జీవులు పొందదగిన ధర్మార్థ కామ మోక్షములు పొందుటకు సాధనముగా కరుణ కళేబరమును వసంగుటకే సృష్టిని చేయుచున్నాడు. అతడు సంకల్ప రూప జ్ఞానము కలవాడు. అతడు శరీరం వలె ధరించి తనను అనుసరించి తిరుగునట్లు చేసిన ఈ జగత్తు అంతయు భగవత్ సంకల్పానుసారముగా తిరుగుచుండును. ప్రకృతి అచేతనమైనను భగవత్ సంకల్పముచే సృష్టి చేయు శక్తి గలదై సృష్టిని చేయుచున్నది. అతడు ఈ ప్రకృతికి ప్రకృతి గుణములకు సప్తరజస్తమో గుణములకు పుణ్య పాప కర్మలకు సాక్షిగా ఉండును గాని తాను ఏమి చేయడు. ఓ వరాహ స్వరూపా, నీవు జగత్తులకు మూల కారణము. భూమిని కోరపై నిలిపి రసాతలము నుండి ప్రళయ సముద్రములో నుండి ఏనుగు ఏనుగుతో యుద్ధము చేసినట్లు హిరణ్యాక్షుని ఎదిరించి చంపి క్రీడించితివి. అట్టి నీకు నమస్కారము. సర్వజ్ఞుడగు వరాహ భగవానుని స్వరూపమును మహాపురుషులగు జ్ఞానులు సర్వాంతర్యామి అయి ఉండుటచే కరలలో అగ్నిహోత్రము మధించి వెలికి తీసినట్లు మనసుచే మధించి వేరుగా దర్శించుచుందురు. భగవానుడు సత్వరజస్తమో గుణములచే ఏర్పడిన దేవాది శరీరములయందు కర్మ ఫలములచే మరుగుబడి ఉండును. అట్టి భగవానుని దర్శింపవలెనని కోరిక గలవారు దర్శించుచుందురు. భగవానుడు సర్వ జగత్తుకు అంతరాత్మ అయి ఉండును. ఆత్మ పరమాత్మ
విషయకమగు బుద్ధి గల పురుషులు నిపుణముగా నిరూపించి పంచభూతముల కంటే ఇంద్రియముల కంటే అన్నిటితో కూడిన శరీరము కంటే వేరుగా భగవాను దర్శింతురు. కింపురుష వర్షము తర్వాత వచ్చింది మనకి కింపురుష వర్షము. కింపురుష వర్షమునందు భగవానుడగు ఆది పురుషుడు సీతా లక్ష్మణులతో శ్రీరామచంద్రుడై సన్నిధానము చేసి ఉండును. వాని పాద సేవనమే పరమ ప్రయోజనముగా పరమ భాగవతుడగు హనుమ కింపురుషులతే ఉపాసించుచుండును. శ్రీరాముని సన్నిధిలో గంధర్వులతో కూడి అరిష్ణిశేనుడు అనేటి గంధర్వుడు గానము చేయుచుండగా శ్రీరామచంద్ర ప్రభువు కథను హనుమ వినుచుండును. స్వయముగా తాను కూడా గానము చేయుచుండును. ఈ వర్షమునందు అంటే కింపురుష వర్షమునందు ఈ మంత్రమును అనుసంధానం చేయిస్తుంటారు. ఓం నమో భగవతే ఉత్తమ శ్లోకాయ నమో ఆర్య లక్షణ శీల వ్రతాయ నమః ఉపశిక్షితాత్మని ఉపాసిత లోకాయ నమః సాధువాదనికషణాయ నమో బ్రహ్మణ్య దేవాయ మహాపురుషాయ మహారాజ్ఞే నమః భగవానుడు శ్రీరామునకు నమస్కారము. ఇతడు ఉత్తమము కీర్తి గలవాడు. ఆర్య యొక్క లక్షణములు శీలము వ్రతము గలవాడు. నియమించుకొనబడిన చిత్తము గలవాడు. లోకమందరిచే సేవింపబడినవాడు. బ్రహ్మవేత్తలగు బ్రాహ్మణులను దేవతల వలె ఆరాధించువాడు. మంచితనమునకు గీటురాయి వంటివాడు మహాపురుషుడు. మహారాజు అట్టి శ్రీరామునకు నమస్కారము. అతడే పరబ్రహ్మము. రాగాదులతో చేరి కలుషితము జ్ఞాని జ్ఞాన స్వరూపుడు. అతడు తన ప్రకాశముచే తేజస్సు గల సకల వస్తువుల తేజస్సును అనగజేసినవాడు. ప్రశాంతమగు మనస్సు గలవాడు. ఆనంద స్వరూపుడు. తనంత తనకు ప్రకాశించు జ్ఞానమే తన ధర్మముగా గలవాడు. నామ రూపములు గల ప్రకృతి పురుషులతో చేరనివాడై వేదాంతములలో ప్రసిద్ధుడగు పురుషోత్తముడే ఆ శ్రీరాముడు. అట్టి బ్రహ్మ స్వరూపమగు శ్రీరామచంద్రుని ఉపాయముగా దృఢముగా నముచున్నాను.
పరబ్రహ్మయే ఈ లోకములో శ్రీరాముడుగా అవతరించినాడు. స్వభావమున మార్పు చెందకుండా మనుష్య రూపమును స్వీకరించినాడు. అహంకారము లేనివాడు. మర్త్యులకు వాని ధర్మమును నేర్పుటకును రావణ వధ కూడా అనుషంగికముగా నెరవేర్చి దుష్ట శిక్షణమునకు అవతరించినాడు. మర్త్యులకు ధర్మమును శిక్షించుటకే తానే దిగి వచ్చినాడు. మర్చులకు దిద్దుబాటు చేయుటకే తానే తన బాధలను అనుభవించినవాడు. అతడు ఆత్మారాముడు, అతనికి దుఃఖములు అంటవు. రావణుడు సీతను అపహరించుకొని పోవుట, రాముడు శోకించుట నటనమే గానీ వాస్తవము కాదు. అందుచే సీతా లక్ష్మణులు కూడా మానవులకు ఆయా ధర్మములను నేర్పుటకే అవతరించినారు. పరమాత్మ స్వరూపుడగు భగవానుడు. సామాన్య మానవుని వలె స్త్రీ కొరకే శోకమును అనుభవించుట, సీతను విడుచుట మున్నగునవి సంభవింపనేరవు కదా. ఈ అవతారములో భగవానుడు శరణాగతుడను అని వచ్చినవాడు. ఎట్టి నడవడి కలవాడైనను, ఏ పాము పాపము చేయువాడైనను, ఎట్టి జన్మను ఎత్తినవాడైనను రక్షించుటకు దీక్ష పూనినాడు. జన్మ గాని, అధ్యయనము గాని, జ్ఞానము గాని భగవాను సంతోషపరచుటకు అవశ్యకములు కావు. శరణాగతుడు అగుటయే భగవత్ అనుగ్రహమును పొందుటకు ప్రధాన సాధనమని శ్రీరాముడు నిరూపించినాడు. జన్మ గాని, సౌందర్యము గాని, వాక్కు గాని, బుద్ధి గాని, జాతి గాని భగవానుని వశపరుచుకొన చాలవు. అట్టివి ఏవియు లేకున్నను అడవిలో తిరిగే తిర్యక్ జంతువులను కూడా మైత్రి భావముతో శ్రీరామచంద్రుడు చేర్చుకొని కాపాడినాడు. దేవుడే అయినను, రాక్షసుడే అయినను, నరుడే అయినను, వానరుడే అయినను సరే రామునకు ఆ భేదము తెలియదు. నీ వాడను నేను అని అనిన వారందరినీ వారి జ్ఞానమును, కర్మను, భక్తిని చూడక తనను ఆశ్రయించిన వాడు అని అనుగ్రహించువాడు. ఉత్తర కోసల దేశములో ఉన్న చరాచరములన్నియు రాముని అవతార కాలమున మోక్షమునందినవని పెద్దలు చెప్పుదురు. దీని తర్వాత భాగంలో భరత వర్షాన్ని గురించి మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to you, the Lord, to Vasudeva, to Vishnu, to the seed of the first being, to the complete enlightened one. Salutations to you, Vishnu, the Lord. You, being the son of Vasudeva, have incarnated. You, the complete Brahman, are the cause of the world. The consciousness without the limitations of the country is your form. Many salutations to you. Tenth Canto, Fifty-fifth Chapter, Twenty-seventh Prayer. Oh, relatives of Bhod, Srimad Bhagavata Tattva Deepika, fifth book. Welcome to episode 20. We will complete the story of Priyavala and in the geographical description, like this, Bhrutvam, Bhadrasu Varsham, then Ketumala Varsham, then Hari Varsham. We have learned about all the presiding deities in them. Now, let's learn about the Ramya K. Varsha. In the beautiful rain, the fish-idol, which is very dear to the Lord, will be worshiped. Manu worshipped this fish form with great devotion in this rain. He is chanting a mantra. Om Namo Bhagavate, salutations to the supreme one. Salutations to the life force, the energy, the strength, the great fish. O Matsyamurthy, you are the qualities of knowledge and other virtues You are a sixer. You are the first among the avatars. You are the life and reviver of all. You are the controller of the senses. You are the one controlling the body's energy. Salutations to you, who are so great. You are capable of seeing the world, whether inside or outside, and have qualities. From you, the Vedas, the sound of the Vedas, emerged. How they make a female idol with a stick and make her dance as they please, similarly, you, with this hand, are the instrument, the instrument, holding the entire world in your control, tying it with a rope called the Vedas, and leading it. The pride that the world's protectors are no greater than me, even after everyone has tried together, they are not capable of saving this world.
All the duality and quadrality in this world, those that move and those that do not, are protected by you alone. In a deluge, without sinking into the earth and the sea filled with medicines, vines, and creepers, you yourself held and protected that earth and the man who rules it. Such a world-soul group will be your body. It is because of you that life is moving. Now, let's learn about the rain. The rain of gold. In the rain of Hiranyamaya, the Lord resides in the form of a tortoise. The form is beloved of the Lord. He will dwell in the sea, in a place filled with water, vast and wide. Nobody knows where he is. He has no native form. The one with the unadulterated divine body is supreme. He is mighty, beyond the power of time to be cut off. Salutations to the one from whom all things are originated. He is the one who imparts the Samyak knowledge. This universe is his form. The world, which can be described in words, including gods, humans, and other beings, is his form. He is such a person that it is impossible to determine whether he is a cheetah or not The world stands by his will. It is visible to the eyes. That which is the self of Brahma, being the embodiment of Brahma, the world, which does not shine to anyone, stands by his will, and does not shine to anyone. In this world, there are bodies that move and those that do not, meaning those that move and those that do not move, in two ways. They are all four types: Jarayujamulu, Andajamulu, Swedajamulu, Udbhijamulu. Those that are in the womb, in the womb, and are born outside are Janayujas. Sweat glands are present. The ones that are in the womb as eggs, come out, break, and move around are ovules.
The earth's crust is broken open and revealed. These are all Gods. The worlds are gods, sages, ancestors, ghosts, earth, mountains, rivers, space, and water. The earth, the oceans, the islands, the planets, the stars, all are the body of God, therefore, the one who is called by all their names is only God. It is possible to calculate, but all the differences in name and form are created in that God. He is the soul of all. Those are like this, so many, it is not possible to enumerate them, those are the principles, so many, it is determined by the will of that God. In the northern Kuru rain, the Lord, the Yagna Purusha, will be in the form of a boar. This is the next rain, the northern Kuru rain. That idol, along with Bhudevi Achadanu, serves with unrestrained devotion, chanting this mantra and meditating. This is in the northern Kuruvarsham, Om Namo Bhagavate, the essence of the mantra, the linga, the sacrifice, the great sound, the body, the great being, salutations. Salutations to the auspiciousness, to the three qualities. The Lord with those mantras By the bodies that have been empowered, they are being recognized as being the Gods who are beyond. By the sacrifices and yagas, which are the Vedic prescribed rituals, that Lord is worshipped. Sacrifices without Somarasa (honey) are called Krutas (sacrifices), and those with Somarasa are called Yajnas (sacrifices). He who is worshiped by both and who gives the fruit is that Varahamurthy.
Those instruments like Shruk, Shruvamu etc. used in Yagnya Yagas are all organs of Varaha Rupa. He is the one with the infinite auspicious qualities. The one who is omnipresent. The one with the pure karma. One who has the six qualities of knowledge, power, etc. Salutations to such a great personality. Those who have understood the true form of nature and men, those who desired to see the one form of that omniscient God, have subdued the fire that is boiling in the stick, as if subdued by a mind of wisdom. They see it differently than the 25 elements that are different from the nature. Some self-realized people, with a mind skilled in proving, recognize that that principle is unique compared to nature and men. He is one who is free from all natural distortions. The five elements, the organs of action and knowledge, and the body with which they are present, the Lord is distinctly recognized as being present in that body. The Lord, the main one, means that the qualities of nature, by the qualities of the seven metals, are creating the creation, preservation, and destruction of this universe. He is doing it for these creatures. Possible for living beings He creates the universe to instill compassion and to attain dharma, artha, kama, and moksha. He is the one who has the knowledge of the form of resolve. This entire world, which is made to follow him, as if he were wearing a body, revolves according to the will of God. Even though nature is unconscious, it is capable of creating through the will of God and is creating the universe. He is witness to the qualities of nature and the qualities of the elements, as well as to the merits and sins of karma, but he does nothing himself. Oh, embodiment of the boar, you are the root cause of the universe. Having placed the earth on the shoulders, you fought with the elephant from the depths of the ocean, from the ocean of destruction, and you killed and played with Hiranyaksha. Greetings to you. The form of the omniscient Varaha Bhagavan, as the wise men of the great men are all-pervading, they are like pouring fire into the hands and taking it out, pouring it into the mind and seeing it differently. The Lord is hidden in the divine bodies formed by the qualities of Sattva, Rajas, and Tamas, and is obscured by the fruits of karma. To have a vision of such a God Those who have desires will have a vision. The Lord is the Spirit, and it is the within of all creation. Atma Paramatma
Men with discerning intellect expertly prove that they see God differently than the five elements, more than the senses, and more than a body composed of everything. After the Kimpurusha rain, we got the Kimpurusha rain. In the rain of Kimpurusha, the first being, the Lord, with Sita and Lakshmana, will be present as Sri Ramachandra. His service at his feet is the ultimate benefit. The supreme devotee Hanuman worships the Kimpura Rishis. In the presence of Sri Rama, along with the Gandharvas, while a Gandharva named Arishnishenudu was singing, Hanuman was listening to the story of Sri Ramachandra Prabhu. He himself also sings. In this rain, that is, in the Kimpurusha rain, this mantra is being connected. Om Namo Bhagavate, salutations to the best verse. Salutations to the one who is well-behaved and virtuous. Salutations to the one who is worshiped by the disciplined. Salutations to the one who is worshiped by the virtuous. Salutations to the great man, the great king. Salutations to Lord Rama. He is a great and glorious man. Arya is characterized by his/her qualities, character, and vows. The one who is appointed has the law. He who is served by all. He is worshipped like a Brahmin, a knower of Brahman. A great man is one who is like a hammer to the good. Greetings to Lord Rama. He is the Absolute. Associated with the ragas, contaminated, the wise, the embodiment of knowledge. He is the one who illuminated all things with his brilliance. The one with the peaceful mind. The joyous one. He who is enlightened by his own wisdom is his own righteousness. That Sri Rama is the supreme being who, being united with the nature and the embodied forms, is famous in the Vedanta scriptures. I firmly and repeatedly chant the name of Sri Ramachandra, who is the embodiment of Brahma.
The Supreme Being has incarnated in this world as Sri Rama. He accepted the human form without changing his nature. One without pretense. To teach the dharma to mortals, Ravana was also killed as a consequence, and he incarnated for the training of the wicked. He himself has descended to punish the mortals. He himself, to correct the mistakes, experienced his own sufferings. He is the soul, and he does not suffer sorrow. Ravana abducting Sita and Rama grieving over it is just an act, not the truth. Therefore, Sita and Lakshmana also incarnated to teach the respective dharmas to humans. The Supreme Soul is the Lord. Like a common man, experiencing grief only for a woman, leaving Sita, etc., will not happen, right? In this incarnation, the Lord came as a refuge seeker. Even if one is skilled in any behavior, even if one who sins is a snake, even if one who is born is determined to protect. Birth, study, or knowledge are not necessary to please God. Refugee That is the main means to attain God's grace, as proved by Sri Rama. Birth, beauty, speech, intellect, or caste are not enough to subdue God. Even without such things, Sri Ramachandra welcomed and protected the wild animals that roamed in the forest with a sense of friendship. Whether he is God, or a demon, or a human, or a monkey, Rama does not know that difference. He is the one who blesses all those who said, "I am not yours," without seeing their knowledge, actions, and devotion, and the one who relies on them. The elders say that all the moving and non-moving things in the Uttara Kosala country attained salvation during the time of Rama's incarnation. In the next part, we will learn about Bharata Varsham. Jai Srimannarayana, salutations to the Gurus