ద్వీపములు మరియు సముద్రాల వర్ణన - భాగం 1

Description of Islands and Oceans (Part 1)

bhagavatam

శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలో శుకదేవ గోస్వామి వర్ణించిన విశ్వ నిర్మాణం గురించి ఈ ఎపిసోడ్‌లో చర్చిస్తున్నాం. బ్రహ్మాండమైన ద్వీపములు మరియు వాటిని చుట్టుముట్టిన సముద్రాలు వలయాకారంలో అమర్చబడి ఉన్న అద్భుతమైన విశ్వ రచన ఇక్కడ వివరించబడింది. సర్వ సృష్టిని సమర్థంగా నిలబెట్టే పరమాత్మ యొక్క అనంతమైన వైభవాన్ని ఈ వర్ణన మనకు స్పష్టంగా చాటి చెప్తుంది.

In this episode of our Srimad Bhagavatham podcast, we explore the magnificent cosmological vision presented in Canto 5, as Shukadeva Goswami begins describing the structure of the universe through its islands and surrounding oceans. The narrative reveals how the world is arranged in concentric rings of dvipas and seas, each filled with divine wonder and sacred significance. This profound description invites us to contemplate the infinite glory and creative power of the Supreme Lord, who upholds all of creation in perfect order.

← Prev Next →
Description of Islands and Oceans (Part 1) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమామిత్వానంత శక్తిం పరేశం సర్వాత్మానం కేవలం వ్యక్తి మాత్రం విశ్వోత్పత్తి స్థాన సంరోధ హేతుం యత్తద్ బ్రహ్మ బ్రహ్మ లింగం ప్రశాంతం మహేశ్వర జ్వరమిట్లు పలికెను. అనంతమగు శక్తి గల సర్వేశ్వరుడవు నీవే. సర్వమునకు ఆత్మవగు నీ స్వరూపము అద్వయమగు శుద్ధ చైతన్యము. జగత్తు యొక్క సృష్టి స్థితి లేయములకు కారణమైనది అని వేదములచే సూచించబడే పరబ్రహ్మ ఏది గలదో అది నీవే. వికార రహితుడవగు నీకు నమస్కారము. టెన్త్ క్యాంటో 63rd. చాప్టర్ 25th ప్రేయర్. భవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వ దీపిక పంచమ స్కంధము 22వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం భూగోళ వర్ణనాన్ని ప్రియవర్త యొక్క వృత్తాంతాన్ని తెలుసుకున్నాం. భూగోళ వర్ణనలో తొమ్మిది వర్షములు, ఎనిమిది వర్షములు ఇలా వర్షముతో కలిపి తెలుసుకుంటూ చివరగా భరత వర్షం గురించి తెలుసుకున్నాం. మనం నిత్య సంకల్పంలో చెప్పేటువంటి భరత వర్షే భరత ఖండే అంటాం కదా ఆ భరత వర్షం యొక్క విభాగం విషయాన్ని మనం చక్కగా అనుభవించాం. అందరూ కూడా 21వ పాడ్కాస్ట్ విని ఆ విషయాన్ని తెలుసుకోవాలని. తెలుపుతూ ఇప్పుడు మనం ద్వీపాల వర్ణమును తెలుసుకుందాం. ద్వీపములు. తొమ్మిది ఖండములుగా ఏర్పడి ఉన్నది జంబూ ద్వీపం. ఆ ఖండములు అన్నిటినీ ఇంతవరకు వర్ణించినారు. ఈ జంబూ ద్వీపనకు ఉపద్వీపములు ఎనిమిది ఉన్నవని పెద్దలు చెప్పుదురు. ఆ ఉపద్వీపములు పూర్వము సగరపుత్రుడు అశ్వమేధాశ్వమును వెదకుటకు భూమిని తవ్వినప్పుడు ఏర్పడినవి. స్వర్ణప్రస్థము, చంద్రశుక్లము, ఆవర్తనము, రమణకము, మందేహారుణము, పాంచజన్యము, సింహళము, లంక అని ఆ ఎనిమిది ద్వీపముల పేర్లు.

తరువాత లక్షద్వీపము యొక్క వర్షముల విభాగము పరిణామము లక్షణము వర్ణింపబడుచున్నవి. లక్షద్వీపము జంబూద్వీపమంత విస్తారము కలది. లక్ష యోజనముల విస్తీర్ణము అయిన లవణ సముద్రము జంబూ ద్వీపముకు చుట్టూను ఉన్నది. ఈ జంబూ ద్వీపము మధ్యమునందు మేరు పర్వతం ఉన్నది. అట్లే ఈ సముద్రము కంటే అధికమగు రెండు లక్షల యోజనము గల విస్తీర్ణము ప్లక్షద్వీపము ఉన్నది. ఈ ద్వీపము మధ్యభాగమందు ప్లక్షము అను వృక్షము కలదు. జంబోద్వీప మధ్యలో జంబో వృక్షము ఉన్నట్లే ప్లక్షము అనేటి వృక్షము ఆ ద్వీపమునందు ఉండుటచే దీనికి ప్లక్షద్వీపము అని పేరు వచ్చినది. ఆ ప్లక్ష మూలమునందు జిహ్వల వంటి సప్త జ్వాలలు గల అగ్ని బంగారు కాంతితో ప్రకాశించుచుండును. అగ్నియే ఆ ద్వీపమునకు అధిపతి. ప్రేవ్రతుని కుమారుడగు యుధ్వజ్జిహ్వుడు తాను పరిపాలించుచున్న ఆ ద్వీపమును ఏడు వర్షములుగా విభజించినాడు. ఆ వర్షములను తన కుమారుల పేర్లతో ఏడుగురికి పంచి ఇచ్చి తాను భక్తి యోగముచే విరమించి ముక్తినందెను. శివము, యవసము, సుభద్రము, శాంతము, క్షేమము, అమృతము, అభయము అని ఆ ఏడు వర్షముల పేర్లు. ఆ వర్షములలో ఏడు పర్వతములు, ఏడు నదులు ఉన్నవి. వర్షములకు సరిహద్దుగా పర్వతములు ఉండును. మణికూటము, వజ్రకూటము. ఇంద్రసేనము, జ్యోతిష్మంతము, సుపర్ణము, హిరణ్యష్టివము, మేఘమాల అనునవి ఈ వర్షములకు సరిహద్దులుగా ఉన్న పర్వతములు. అరుణ, సుర్వణ, అంగీరస, సావిత్రి, సుప్రభాత, రుతంభర, సత్యంభర అను నదులు ఏడును ఈ ఏడు వర్షములలో ప్రవహించుచుండును. ఆ నదీ జలములను పానము చేసి, స్నానము చేసి, రజస్తమస్సులు తలగిన వారలై భారత వర్షమున బ్రాహ్మణాది వర్ణముల వలె నాలుగు వర్ణముల వారుందురు.

హంస, పతంగ, ఊర్ధ్వాయన, సత్వాంగ అని నాలుగు వర్ణముల వారికి పేర్లు. వారు వెయ్యి సంవత్సరములు ఆయుర్దాయము గలవారై ఉందురు. దేవతల వంటి సౌందర్యము గలవారై దేవతల వంటి సంతానము గలవారై ఉందురు. వారు వేద విద్యను అధికరించి వేద ప్రతిపాద్యుడగు భగవాను సర్వాంతర్యామిగా ఉండువానని ఆరాధించుసుందురు. వారు ఈ మంత్రమును జపించుదురు. ప్రత్నస్య విష్ణో రూపం యస్యత్యస్త యస్య బ్రహ్మణః అమృతస్య చ మృతోశ్చ సూయమాత్మానమీమహి జగత్కారణమును పురాణ పురుషుడు నిర్వికారుడును నిరదిశేయ సుకృతి ఫలము అయినవాడును అంతరాత్మగా ఉండి పుణ్య కర్మలను చేయించువాడును బంధ మోక్షములు కలిగించువాడును అగు బ్రహ్మ. బ్రహ్మ స్వరూపుడగు విష్ణువు యొక్క శరీర భూతుడగు సూర్యుని శరణముగా ధ్యానించుచున్నాను. ప్లక్షము మొదలగు ఐదు దీపములలో సామాన్యముగా పురుషులందరుకు ఆయువు, ఇంద్రియములు, ఓజస్సు, సహస్సు, జలము, బుద్ధి. విక్రమం అనునవి జన్మసిద్ధముగా ఉండును. ప్రక్షద్వీపమునకు ముందు జంబూద్వీపమునకు మధ్య లవణ సముద్రము ఉన్నట్లు ప్రక్షద్వీపమునకు శాల్మలీ ద్వీపమునకు మధ్యలో ఇక్షురస జలముతో నిండిన ఇక్షురస సముద్రము 2 లక్షల యోజనముల విశాలమైనది. అట్లే శాలమలి దివ్యము కూడా 4 లక్షల యోజనము గల సురా సముద్రముచే ఆవరింపబడినది. ఈ శాల్మలి ద్వీపమునందు శాల్మలి వృక్షము ప్లక్ష ద్వీపమంత విస్తీర్ణము గలదై ఉండును. ఆ వృక్షమునందు వేదములే అవయవములుగా గల గరుత్మంతుడు నివసించి ఉండును. ఈ శాల్మలి వృక్షము పేరుతో ఈ ద్వీపము పిలువబడుచుండును. ఈ ద్వీపమునకు ప్రియవర్తుని కుమారుడు యజ్ఞబాహు పాలకుడు. అతడు కుమారులు ఏడుగురికి వారి పేర్లతో ఏడు వర్షములను విభజించి ఇచ్చెను. సురోచనము, సౌమనస్యము, రమణకము, దేవబర్హము, పారిబర్హము, అప్యాయనము, అభిజ్ఞాతము అని ఏడు వర్షములు వివరింపబడుచుండును. ఆ వర్షములలో సరిహద్దు పర్వతములు ఏడును, నదులు ఏడును ఉండును. స్వరస, శతశృంగ, వామదేవ, కుముద, ముకుందము.

పుష్ప వర్షము, శతక్రతు అనునవి ఏడు పర్వతములు. అనుమతి, సినీవాలి, సరస్వతి, కుహువు, రజని, నందరాక అనునవి ఏడు నదులు అందు ప్రవహించుచుండెను. ఆ వర్షములో ఉండు పురుషులు నాలుగు వర్ణములుగా విభజించి ఉందురు. శృతధర, వీర్యధర, వసుంధర, విద్యాధర అను నాలుగు వర్ణములుగా అచట మనుష్యులు వ్యవహరింపబడుదురు. వేద ప్రతిపాద్యుడు భగవదాత్మకుడు అగు సోముని వారు యధోత్తముగా ఆరాధించుందురు. ఆ సోమని ధ్యానించు మంత్రం స్వగోభిహి పితృదేవేభ్యో విభజన్ కృష్ణ శుక్లయో నమః శుక్లయోహో ప్రజానాం సర్వాసాం రాజాంధ సోమోన ఆస్తితి తన కిరణములచే శుక్ల పక్ష కృష్ణ పక్షములలో శుక్ల పక్షములో దేవతలకు కృష్ణ పక్షములో పితృ దేవతలకు అన్నమును విభజించిన వాడును స్వధా స్వాహా అను శబ్దములతో వారికి హవిస్సును వసంగునట్లు చేయువాడును సర్వ ప్రజలకు అట్లే అన్నము కలిగించుటచే రాజువుగు సోముడు మాకు సుఖమును వసంగువాడు అగుగాక. శాల్మలి ద్వీపమునకు ఆవల కుశద్వీపమున్నది. శాల్వలి ద్వీపము తరువాత సురా సముద్రమునకు ఆవల దానికి రెట్టింపు అనగా ఎనిమిది లక్షల యోజనముల వైశాల్యము గల ఘృత సముద్రముండును. దానియందు కుశద్వీపము ఉన్నది. ఆ ద్వీపమునందు బ్రహ్మ నిర్మితమగు కుశస్తంభము అగ్ని వలె ప్రకాశించుచుండును. దాని ఆకులు అగ్నిహోత్రము వలె తన కాంతిచే దిక్కులను ప్రకాశింపజేయుచుండును. ఆ కుశస్తంభము పేరుతో కుశద్వీపము అని పేరు కలిగెను. ప్రియవృతుని కుమారుడు అగు హిరణ్యరేతసుడు కుశద్వీపమునకు అధిపతి. అతడు ఆ ద్వీపమును తన కుమారుల ఏడుగురి పేర్లతో ఏడు వర్షములు వ్యవరింపబడుచుండును. వసు, వసుదేవ, రూఢరుచి, నాభిగుప్త, సత్యవ్రత, వివ్యక్త, వామదేవములను వర్షం కుమారుల పేర్లతో వారికి వసంగి హిరణ్యరేతుడు తపస్సుకేగెను. ఆ వర్షములలో సరిహద్దు పర్వతములు ఏడు కలవు. చక్రము, చతుశ్శృంగము, కపిలము, చిత్రకూటము, దేవానీకము, ఊర్ధ్వరోమము, ద్రవిణము అని పర్వతముల పేర్లు.

రసకుల్య, మధుకుల్య, మిత్రవింద, శృతవింద, దేవగర్భ, శృతశ్యుచ, మంత్రమాల అని ఇక్కడ నదులు ప్రవహించుచుండును. అందుండు జనులు కుశల, కోవిద, అభియుక్త, కులక అను వర్ణ విభాగముతో వరింపబడుదురు. జాతవేదసుడు అనడి అగ్ని శరీరముగా గల భగవానుని కర్మాచరణములోని నేర్పుతో ఆరాధించుందురు. వారు ఆరాధించు మంత్రము. పరస్య బ్రాహ్మణః సాక్షాత్ జాతవేదోసి హవ్యవాట్ దేవానాం పురుషాంగానం యజ్ఞేన పురుషం యజ ఓ జాతవేదుడా నీవు సాక్షాత్ పరబ్రహ్మమునకు శరీరభూతుడవై ఉన్నావు. భగవదాత్మవులగు ఇంద్రాదులకు హవ్యమును వహించి చేర్చుకున్నావు. పరమ పురుషునకు శరీర భూతులగు దేవతలకు ఆరాధనగా యజ్ఞము చేసిన వారికి అంతరాత్మగా ఉండు పరమ పురుషులగు భగవానుని యజ్ఞములచే ఆరహించునట్లు చేయుము. దేవతలందరూ భగవానునకు అంగములు, భగవానుడు ఆత్మ యజ్ఞములలో యజ్ఞభూతులగు దేవతలకు నివేదించిన హవిస్సు ఆత్మయగు పరమపురుషునికే చెందును. ఇంతవరకు మనం శాల్మలి ద్వీపాన్ని తరువాత ప్లక్ష ద్వీపాన్ని మనం తెలుసుకున్నాం. ఇంకా ముందు భాగాల్లో మిగతా ద్వీపాల గురించి తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. I bow to the infinite power, the supreme soul, the only individual, the cause of the creation of the universe. That is Brahma, the lingam of Brahma, peaceful, Maheshwara, the fever. Thus he spoke. You are the almighty God, the one with infinite power. Your form, which is the soul of everything, is the pure consciousness that is non-dual. You are that supreme being, which is indicated by the Vedas as the cause of the creation, preservation, and destruction of the universe. Salutations to you, who are free from all distortions. The tenth canto is 63rd. Chapter 25th Prayer. Dear devotees, welcome to the 22nd podcast of Srimad Bhagavata Tattva Deepika Panchama Skandham. Until now, we have learned about the geographical description and the history of Priyavrata. In geographical description, we learned about nine rains, eight rains, and so on, combining rains, and finally learned about the Bharata rain. We call Bharat Varsha, Bharat Khande, which we say in our daily resolve, right? We have nicely experienced the division of that Bharat Varsham. Everyone also listened to the 21st podcast and that matter To know. Explaining, now let's learn about the description of islands. Islands. Jambudvipa is formed into nine continents. All those continents have been described so far. The elders say that there are eight sub-peninsulas to this Jambudvipa. Those peninsulas were formed when the son of Sagara dug the earth to search for the Ashwamedha horse. Swarnaprasthamu, Chandrasuklaamu, Aavartanamu, Ramanakamu, Mandeharunamu, Panchajanyamu, Simhalamu, Lanka, these are the names of those eight islands.

Next, the evolution and characteristics of the rainfall division of Lakshadweep are being described. Lakshadweep is as vast as the Jambudweep. The lava ocean, which is the size of a lakh yojanas, surrounds the Jambu Dwipa. In the middle of this Jambudvipa is Mount Meru. Similarly, there is a Plakshadweep, an area larger than the ocean, with a size of two lakh yojanas. In the middle of this island, there is a tree called Plakshamu. Just as there is a Jambo tree in the middle of Jambo Dweepa, the tree called Plaksha is on that island, hence it is named Plakshadweepa. In that plaksha tree, there are seven flames like tongues, and the fire shines with golden light. Agni is the ruler of the island. Yudhajit, the son of Pravaratu, divided the island he ruled into seven rains. He distributed those rains to seven people with the names of his sons, and he retired through devotion and attained liberation. Shiva, Yavasa, Subhadramu, Shantamu, Kshemamu, Amrutamu, Abhayamu, these are the names of those seven rains In the rainy season, there are seven mountains and seven rivers. Mountains form a barrier to the rains. The ruby, the diamond. Indrasena, Jyotishmanta, Suparna, Hiranyastiva, Meghamala, these are the mountains that border these rains. Aruna, Surva, Angiraasa, Savitri, Suprabhaata, Rutambhaara, Satyambhara are the seven rivers that flow in these seven rains. Those who drink the water of the river, bathe, and have their impurities cleansed, are of four castes in the Indian rain, like Brahmins and other castes.

Hansa, Patanga, Urdhvayana, and Satvanga are the names given to four types of people. They will be able to live for a thousand years. They are beautiful like gods, they have children like gods. They, having mastered the Vedic knowledge, worship Bhagavan, who is the presiding deity of the Vedas, as the all-pervading one. They will be chanting this mantra. Whose form is Vishnu, whose is the immortal, whose is the mortal, whose is the living, whose is the non-living, I praise that self. The cause of the world, the ancient being, the formless, the un-directed, the fruit of good deeds, being the inner self, he makes us do good deeds, bondage Brahma is the one who grants salvation. I am meditating as a refuge to the Sun, the embodiment of Brahma, the embodiment of Vishnu. Among the five lamps starting with Plaksha, generally, for all men, life, senses, strength, courage, water, intellect. Vikramam and such are innate. Before Prakṣadvipa, there was a salt sea between Jambudvipa, and between Prakṣadvipa and Shalmali Island, filled with ink-like water The Ikshurasamudram is as vast as 2 lakh yojanas. Similarly, the divine Salamali is also surrounded by a sura ocean with a length of 4 lakh yojanas. On this Salmali island, the Salmali tree is as large as the Plaksha island. In that tree, Garuda, with the Vedas as its limbs, resides. This island is called by the name of Salmali tree. Priyavarta's son, Yajnabaahu, was the ruler of the island. He divided and gave seven rains to his seven sons by their names. Surochanamu, Soumanyasamu, Ramanakamu, Devabarhamu, Paribarhamu, Apayanamu, Abhijnathamu, thus seven varshas are described. In those rains, the border mountains are seven, and the rivers are seven. Swaras, Shatasrunga, Vamadeva, Kumuda, Mukundamu.

Pushpavarsham, Shatakruta, these are seven mountains. Permission, Cinivali, Saraswati, Kuhu, Rajani, Nandaraka, these are seven rivers flowing together. The men who are in that rain are divided into four castes. Shrutadhara, Veeryadhara, Vasundhara, Vidyadhara, these four castes are considered as humans there. The Vedic reciter, the divine self, Somuni, is worshiped with utmost reverence. Meditate on that Somani, mantra, Swagobhihi, Pitrudevaabhyo Vibhajan Krishna Shuklaayo Namaha Shuklaayoho Prajanamam Sarvasam Rajandha Soonamona Astiti. By his rays, in the Shukla Paksha and Krishna Paksha, in the Shukla Paksha, to the gods, in the Krishna Paksha, to the ancestors May Somudu, the king, who provides food to all people, just as the one who divides food for the gods, with the words 'Anna' (food) and 'Swadha Swaha', may he grant us happiness. Kushadweep is located just across the shoal from Shalmali Island. After the Shalavali island, beyond the Sura sea, double that, meaning eight lakh yojanas in area, Ghrita There is a sea. In it, there is Kushadvipa. On that island, the Kusha pillar, created by Brahma, shines like fire. Its leaves shine in the direction with its light like a firebrand. That pillar became known as Kushadvipa by the name of Kushastambha. Hiranyareta, the son of Priyavrata, was the ruler of Kushadvipa. He will divide that island into seven parts, each named after the seven sons of his son. Vasu, Vasudeva, Rudharuchi, Nabhigupta, Satyavrata, Vivyakta, Vamadeva, with the names of the rain-born sons, Vasangi Hiranyarethudu went to penance. In those rains, there are seven border mountains. Chakramu, Chatushrungamu, Kapilamu, Chitrakootamu, Devanikamu, Urdhvoromamu, Dravinamu are the names of the mountains.

Rasakulya, Madhukulya, Mitravinda, Shrutavinda, Devagarbha, Shrutashyucha, and Mantramala are the rivers flowing here. The people there are classified into castes such as Kushala, Kovida, Abhiyukta, and Kulaka. Jatavedasudu, they worship the Lord, who has a body of fire, with skill in the performance of his actions. The mantra they worship. Parasyam Brahmanah, you are directly a knower of the Vedas, the sacrificer of oblations, the lord of the gods, the embodiment of the Purusha, the sacrifice of the Purusha. O knower of the Vedas, you are directly the embodiment of the Supreme Brahman. You have accepted the offering to Indra and others, who are the embodiments of the divine. O Lord, who is the Supreme Being, who is the inner self of those who perform sacrifices as worship to the gods who are the embodiments of the Supreme Being, make them attain Him by performing sacrifices. All the gods are parts to the Lord, and the offering offered by the Lord to the gods who are the sacrificial places in the sacrifices of the soul, belongs to the Supreme Being who is the soul. Until now, we have learned about Shalmali Island and then Plaksha Island. Let's learn about the other islands in the next part. Jai srimannarayana asmad Gurubhyo Namah