విరాట్ పురుషుని స్థూల రూప ధ్యాన ప్రక్రియ
Meditation on the Universal Cosmic Form
శ్రీమద్ భాగవతం ద్వితీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, శుకదేవ మహర్షి పరీక్షిత్ మహారాజుకు విరాట్ పురుషుని స్థూల రూపాన్ని ధ్యానించే అద్భుతమైన ప్రక్రియను వివరిస్తున్నారు. పరమాత్మ యొక్క విశ్వరూపంలో — శిరస్సు నుండి పాదముల వరకు — స్వర్గలోకాలు, భూలోకాలు, పాతాళలోకాలు అన్నీ నిక్షిప్తమై ఉన్నాయని శాస్త్రం తెలియజేస్తోంది. ఈ ధ్యాన విధానం సాధకుడిని స్థూల దృష్టి నుండి సూక్ష్మ చింతన వైపు నడిపించి, చివరకు శుద్ధ భక్తిలో స్థిరపరచే ఉత్తమ మార్గంగా భాగవతం ప్రబోధిస్తోంది.
In this sacred episode from Canto 2 of Srimad Bhagavatham, Shukadeva Goswami guides King Parikshit through the profound practice of meditating on the Virat Purusha, the magnificent cosmic form of the Supreme Lord. Each part of the universal body is revealed as a divine abode — from the heavenly realms in His head to the netherworlds at His feet — offering the seeker a structured and awe-inspiring path of contemplation. This meditation serves as a stepping stone for sincere devotees, helping the mind gradually rise from the gross to the transcendent, ultimately resting in pure devotion to the Lord.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యన్నాభి పద్మ భవనాదహమాసమీడ్య లోకత్రయోపకరణో యదనుగ్రహేణ తస్మై నమస్త ఉదరస్త భవాయ యోగా నిద్రావసాన వికసన్నలినే క్షణాయ ఓ కొనయాగ దగినవాడా, ముల్లోకముకు సృష్టి కాయము ద్వారా ఉపకరించే నేను, నీ అనుగ్రహముచే నీ నాభ్యందలి పద్మము అనే ఇంటి నుండి జన్మించితిని. ఈ ప్రపంచమంతయు నీ ఉదరమునందు నిలిచి ఉన్నది. ఇప్పుడిప్పుడే నీ యోగ నిద్ర అంతమగుచున్నది. కలువల వంటి నీ కన్నులు తెరుచుకొనుచున్నవి అట్టి నీకు నమస్కారము. థర్డ్ క్యాంటో నైన్త్ చాప్టర్ 21స్ట్ ప్రేయర్. భవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వదీపిక ద్వితీయ స్కంధం రెండవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితం మనం విరాట్ పురుషుని యొక్క వర్ణన చేస్తున్నాం. దానిలో ఇంకొంత భాగం ముందు ఇప్పుడు అనుభవించబోతున్నాం. అశ్వములు, అశ్వతరులు, ఒంటెలు, ఏనుగులు ఆ విరాట్ పురుషుని గోళ్ళు గాడిదకు ఆడు గుర్రమునకు పుట్టిన జంతువును అశ్వతరి యందురు మృగములు, పశువులు మొదలగునవన్నియు ఆ పురుష్ణి శ్రోణి దేశము అనగా పిరుదులు. పక్షులు అతని వ్యాకరణము అనగా వింగడింపు అనగా విచిత్రమగు శిల్ప నైపుణ్యము. మంత్రం అతని బుద్ధి, మనుష్యులు ఈ పురుషుని నివాస స్థానము. ఆ పురుషుని షడ్జాది స్వరములే గంధర్వులు, విద్యాధరులు, చారణులు, అప్సరసలు. అసుర సమూహములో శ్రేష్టుడగు ప్రహ్లాదుడు ఆ పురుషుని స్మృతి. వేదాధ్యయన పరులు ఆ పురుషుని ముఖము, క్షత్రియులు భుజములు, వైశ్యులు ఊరువులు తొడలు, నల్లని వర్ణము గల చతుర్ధ వర్ణము వారు ఆ పురుషుని పాదస్థానము, అనేకములగు పేర్లతో యజ్ఞములో ఆయా దేవతలకు అర్పించడి హవిస్సు మొదలగు ద్రవ్యము ఆ భగవానుని క్రియా కలాపము. అదియే ఆ పురుషుని ఆరాధన రూపమై ఉండును. ఆ విరాట్ పురుషుని దివ్య దేహం యొక్క అవయవ సంస్థానమును నీకు వివరించితిని. ఆ పరమ పురుషుని శరీరముగా భావించి ఆ స్థూల రూపముకు విశ్వమును ధ్యానించుటయే కర్తవ్యము.
స్వప్నములో కర్మానుగుణముగా సుఖమును దుఃఖమును అనుభవించును కానీ నిర్వికారుడగు పరమ పురుషుడు అన్నిటిలో తానున్నను వాని వలన తాను వికారమునందడు. ఆనందమే కలవాడై ఉండును. అట్టి సత్య ఆనంద స్వరూపుడై ఆనంద నిధియగు ఆ పురుషునే సేవించవలెను. కానీ పరిమిత జ్ఞానానందములు గల జీవులను సేవింపరాదు. వారిని ధ్యానించుటచే జీవుడు సంసారంలోను పడును. పూర్వము చతుర్ముఖుడు ప్రళయములో తమతో కూడా నశించిన ఈ ప్రపంచమునంతను మరల సృష్టించుటకు ముందు ధారణచే మనసులో విశ్వరిత శరీరకుడగు పరమాత్మను నిలుపుకొనెను. అట్లు ధారణచే సృష్టి చేయుటకు తగిన స్మృతి అతనికి కలిగెను. దానిచే అతనికి అమోఘముగు జ్ఞానము కలిగి ప్రళయమునకు ముందు ఈ విశ్వం ఎట్లున్నదో అట్లే ఈ విశ్వమును సృజించినాడు. శ్రద్ధ స్వరూపముగు భేదము విచిత్రముగు స్వభావము కలది. పరమ పురుషార్ధములు కాని అర్థములను ప్రతిపాదించు స్వర్గాది శబ్దములు ఎన్నియో ఉన్నవి. ఆ శబ్దములచే ఆ స్వర్గాది ఫలములను వినగానే బుద్ధి దానియందు లగ్నమగును. కానివి పరమార్థము కానివి. నామమాత్రమునకు సారభూతం వలె కనపడుతును. అట్టి శబ్దములచే అపార్థములగు విషయములందు ఆసక్తుడై తిరుగుడు జీవుడు అనాది కర్మ వాసనచే. మాయామయమగు ప్రపంచములో సంచరించుండును. దానిచే పరమార్థమగు మోక్షమును దాని ఉపాయములను ఎరుంగడు. భగవత్ స్వరూపమును ఎరుంగెడి వేదములో సత్వరజస్తమో గుణములు కలవారికందరకు అవశ్యకములైన విషయములన్నియు ప్రతిపాదింపబడియుండును. రజస్తమస్సులను అతిక్రమించి సత్వగుణమే ప్రధానముగా గల మనుష్యులు అందలి విషయమనన్నిటినీ గ్రహింపరాదు. కేవలము సాత్వికుడగు మోక్షేచ్ఛ గలవాడు దేహధారణ కొరకు స్వీకరింపదగిన అన్నాదులయందు ఆసక్తి లేనివాడై స్వర్గాదులు నశించెడివనియు వానికంటే గొప్పవి ఉన్నవనియు వానిని సాధించు కర్మలయందు వేదము ప్రతిపాదించినవైనను ప్రవర్తింపరాదు. తాను చేయు భగవద్ ఉపాసనము సిద్ధించునంతవరకు దేహము నిలుపుకొనవలెను కనుక దానికి కావలసినంతవరకు అన్నాదులను కూడా యత్నించి పొందవలెను. అవి తనకు పూర్వ కర్మానురూపమున అప్రయత్నముగా లభించునవి. కావున వాటి కొరకు కూడా తాను ప్రయత్నించుట మానియుండవలెను. ప్రయత్నం అక్కర లేకుండానే అవి లభించును. అవి సాధించుటకు తాను ప్రయత్నము చేయుట శ్రమయే.
పరుండుటకు పాన్పు కొరకు ప్రయత్నించుట వేరు ఒక చోట పరుండుటకు అవకాశం ఉన్నప్పుడు అక్కర్లేదు కదా? ఈ శరీర విశ్రాంతికి స్థానము భూమి ఉండగా పాన్పులను సంపాదించుకునే ప్రయత్నం ఎందుకు? తల క్రింద ఎత్తుగా పెట్టుకొనుటకు తన చేయి ఉండగా తలగడికే ప్రయత్నించుట ఎందుకు? తాను భోజనము చేయుటకు దోసిలి ఉండగా కంచములు సంపాదించుకొనుట ఎందుకు? అడుగున నార బట్టలు కట్టుకొని పైన ఏమి వేసుకునకుండా తాను సంచరించున దగియుండగా వస్త్రములకై ప్రయత్నించుట వ్యర్థము కదా? పట్టు బట్టలు కట్టినను నార బట్ట కట్టినను ఆచ్ఛాదనం సమానమే కదా? నార బట్టలు దొరకకపోయినను చినిగిన బట్టలు వీధులలో పారవైతురు కదా? వానిని ధరించునను శరీరమునకు చాలును. వృక్షములు తాము కాచిన కాయలతో, పండ్లతో పరులకు ఆహారములు కల్పించుటకు నిలిచి ఉన్నవి కదా. అవి కావలసిన ఆహారములు కల్పించుండగా ఒకరిని యాచించుట ఎందుకు? దప్పికను తీరుచుటకు ఎండక నదులు పారుచుండగా మంచి నీటికై పాత్రలను ఆర్జించుకొని నిల్వ చేసుకొనుట ఎందుకు? ఎవ్వరు నిరోధింపకుండా హాయిగా పరుండుటకు గుహలు ఉండగా ఇల్లు ఎందుకు? రక్షణకై ఆర్జించి ధన మధాందులను కవులు ఆశ్రయించుట వివేకము అవివేకము. శరణు పొందిన వాడు ఆపదలను తొలగించి రక్షించు భగవానుడు ఉండంగా అన్నము కొరకు వస్త్రముల కొరకు ఇతరులను ఆశ్రయించి వివేకము గలవారు తమ జీవితము వ్యర్థము చేసుకొనరు. శ్రీహరి ఒక్కడే సేవింపదగినవాడు. ఈ విధంగా భావించి మనస్సు భవద్గుణములను అనుభవించుచు ఇతర విషయములని మరల్పదగును. అతడే ప్రియమైనవాడు. అతడే జీవునిలో ప్రవేశించి ధరించి నియమించువాడు. అందుచే భగవానుడు జీవునకు ఆత్మ. ఆత్మ అన్నింటికంటే ప్రియమైనది. దేహము, బిడ్డలు, భార్య ఆత్మ సంబంధము చేతనే ప్రియమైనదిగా కనుపడుచున్నవి. అట్టి ఆత్మకు కూడా ఆత్మ అయిన పరమాత్మ నిరతిసే సుఖస్వరూపుడు అత్యంత ప్రియుడు. అతడే శరీరము గల పురుషునిచే కోరతగినవాడు. అతని స్వరూపము గుణములు కూడా అనంతములు. అట్టి సుఖరూపుడగు పరమాత్మను ఉపాసించుట వలన సుఖము గలవాడగును. నియతమగు ప్రయోజనమును పొందినవాడగును. అందుచే అట్టి శ్రీహరినే సేవింపవలెను. దానిచే సంసారమునకు కారణమైన అవిద్యాదులు అంతముందను. జ్ఞానహీనులైన పశువులు తప్ప సర్వేశ్వరుని విడిచి అశుభమగు ఇతర విషయములను కూర్చిన ఆలోచనము ఎవరు చేయుదురు? యమలోకమునకు సమీపమునున్న
వైతరణి నది ఎంత దుఃఖమును కలిగించునదో ఈ సంసారం అంత దుఃఖప్రదమైనది. ఇందు పడిన జీవులు ఆధ్యాత్మికాది దుఃఖములను అనుభవించుందురు. అట్టి వారు భగవత్ చింతనము చేయక ఎట్లుండుదురు? కొందరు తమ దేహములోని మధ్య భాగమునగు హృదయమునందు సూక్ష్మము ఆకాశమునందు ఉపాసకులను అనుగ్రహించు కొరకు ప్రాదేశ మాత్ర శరీరకుడైన పరమాత్మ యుండునని ఎరింగి వానిని ఉపాసింతురు. అచట స్వామిని శంఖ చక్రములను దాల్చిన పురుషునిగా నిలుపుకొని స్మరింతురు. ప్రసన్నమగు ముఖము గలవాడు, ప్రసన్నములు దీర్ఘములు అగు నేత్రములు గలవాడు, కదంబ పుష్పములోని పుప్పడి వలె పచ్చగా నుండు వస్త్రమును దాల్చినవాడు, మహారత్నములతో ప్రకాశించుచున్న కిరీటములను కుండలములను దాల్చినవాడు, వికసించిన హృదయ కమలమునందలి దుద్దును తనకు నివాస స్థానముగా ఏర్పరచుకొని ఉండువాడు, యోగీశ్వరుల చేత ధ్యానింపబడు పాదపద్మములు కలవాడు, శ్రీదేవి తనకు అసాధారణముగు చిహ్నముగా కలవాడు, కంఠమున కౌస్తుభ రత్నమును దాల్చినవాడు. ఎన్నడును వీడని కాంతి గల వైజయంతి అనడి వనమాలచే ప్రకాశించువాడు మొలనూలు విలువైన ఉంగరములు కంకణములు నూపురములు దాల్చినవాడు నల్లని నిగనిగలాడు సుడులు తిరిగిన కుంతలములతో ప్రకాశించు ముఖము కలవాడు సుకుమారము మందహాసముచే ప్రకాశించు ఆసనము కలవాడు చూపులలో ఉదారము మందహాసము తొణికిసలాడువాడు కనుబ మలచి అత్యధికమగు అనుగ్రహమును వెదదల్లువాడు ఇట్టి రూపము గల సర్వేశ్వరుని ధ్యాన గోచరుని చేసుకొని మనస్సు ఆ రూపముని తనలో నిలుపుకొని ఉండునంతవరకు చూచుండవలెను. తర్వాత చేసేటువంటి ధ్యానం ఎలా చేస్తారనే విషయాన్ని మనం మనం పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మత్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Gurus. When I was in the lotus-like abode, I was the one who provided the three worlds. By your grace, I am devoted to that. Salutations to that one who is the end of the yoga sleep, the one who is the end of the blossoming stream of the lotus-like abode. Oh, one who is worthy of being sacrificed I, who benefit the three worlds through the creation of the body, was born from the house called the lotus in your navel by your grace. The whole world is in your belly. Now, your yoga nidra is ending. Your eyes, like the windows, are opening. Salutations to you. Third Canto Ninth Chapter 21st Prayer. Dear devotees, welcome to the second podcast of Srimad Bhagavata Tattvadipika, Second Canto. So far we have described Virat as a man. We're gonna be a little secret, you know. Horses, Ashwatarus, camels, elephants, that Virat Purusha's nails, donkeys, mules, the animals born to horses, Ashwataris, animals, cattle, and all such things, that Purushni Sroni country, that is, the hips. Birds, his grammar, that is, his pronunciation Unusual sculptural skill. The mantra is his intellect, humans are the abode of this man. Those men's Shadja, Madhyamaka, and Gandhara notes are Gandharvas, Vidyadharas, Charanas, and Apsaras. Prahlada, the best among the demon clan, remembers that man. Those who study the Vedas, that man's face; Kshatriyas, shoulders; Vaishyas, thighs; those with a dark complexion, the fourth color, that man's feet With many names, the offering made to the respective deities in the Yagnya, the substance like Havisu, that is the divine play. That itself is the form of worship of that man. I have explained to you the organization of the divine body of that Virat Purusha. Considering that as the body of the Supreme Being, it is the duty to meditate on the universe for that gross form.
In a dream, one experiences happiness and sorrow according to their karma, but the Supreme Being, who is without change, remains in everything, yet He does not become distorted by them. Joy reigns alone. One should serve that man, who is the embodiment of truth, bliss, and treasure. But beings with limited knowledge are not to be served. By meditating on them, the being sleeps in the world. In the past, the four-faced one, before creating the entire world that was destroyed with him in the deluge, held the Supreme Soul, who is the embodiment of the universe, in his mind. Thus, he attained the memory appropriate for creating the universe. By that, he gained immense knowledge and, before the apocalypse, he created this universe just as it was. It is the nature of the form of attention, which is unique and different. There are many heavenly sounds that propose meanings other than the supreme being. Upon hearing those sounds and the fruits of heaven, the intellect is fixed in it. But they are not the ultimate. It appears to be the essence of nominalism. By such sounds Being interested in things that are misunderstood, the wandering soul is due to the smell of eternal karma. It is wandering in the world of illusion. He does not understand the ultimate goal, liberation, and its means. In the Vedas that do not understand the form of God, all the subjects that are necessary for everyone with the qualities of Sattva, Raja, and Tama are presented. Those who transgress the Rajasic and Tamasic qualities, and possess the quality of Sattva, cannot understand all the matters in it. Only one who is virtuous and desires liberation, who is not interested in the offerings that are acceptable for embodiment, that heaven and other things will perish, and that there are greater things than him, even if the Vedas propose in the actions to achieve him It's not acceptable. Until the devotion to God that he does is fulfilled, the body must be sustained, therefore, as much as is needed for that, one should strive and obtain the words. Those are obtained effortlessly, as a result of his past karma. Therefore, one should also stop trying for them. They are available without any effort. It is the effort that he makes to achieve them.
Trying to spread out is different from spreading out in one place. When there is an opportunity to spread out, it is not necessary, right? Why try to acquire beds while the earth is the place of rest for this body? Why try to lift your head up when you have your hand to support it? Why is he collecting plates while there is a plate to eat? While he is wandering around without wearing any clothes on his feet and without wearing anything on top, isn't it useless to try for clothes? Whether you wear silk clothes or cotton clothes, the covering is the same, isn't it? Even if cotton clothes are not available, torn clothes are thrown on the streets, aren't they? Wearing it is enough for the body. Trees, with the fruits they bear, are there to provide food for others, aren't they? While providing the necessary food, why beg for someone? Why do we collect and store water in vessels for drinking water when rivers flow abundantly to quench our thirst? Why a house when there are caves to sleep in peace without anyone disturbing you? For protection It is wise or foolish to seek shelter with poets who have earned wealth. One who seeks refuge, while the Lord is there to remove dangers and protect, those who are wise do not waste their lives relying on others for food and clothes. Sri Hari is the only one worthy of being served. Thinking in this way, the mind experiences the qualities of existence and other things. He's the dear. He is the one who enters the being, assumes it, and appoints it. Therefore, the Lord is the soul of the living being. The soul is dearer to him than all else. The body, children, and wife appear dear only because of their spiritual connection. Even for such a soul, the supreme soul who is also the soul is extremely pleasant and beautiful. He is the one who is worthy of being desired by a man with a body. His form and qualities are also infinite. By worshipping the supreme being, who is the embodiment of happiness, one becomes happy. He is the one who received the appointed benefit. Therefore, one should serve such Sri Hari. By that, the ignorance that caused the world is also the end. Except for the ignorant animals, other things that are inauspicious, except for the Lord of all Who is the one who thinks of putting things together? Near Yama's world
How much sorrow does the Vaitarani river cause? This world is so sorrowful. The beings who fall into this state experience spiritual sorrows. How can those who do not contemplate the Lord be? Some, in the heart, which is the middle part of their body, in the subtle sky, to grant the devotees, they worship the Supreme Soul, who is the body of space. There, they remember the Lord as a man holding the conch and the discus. One with a cheerful face, one with cheerful and long eyes, one who wears a garment that is as green as pollen in a kadamba flower, one who wears crowns and earrings that shine with great jewels, He who has established the lotus of a blooming heart as his abode, he who has lotus feet to be meditated upon by the yogis, Sridevi is with him as an extraordinary sign, He who wears the Kaustubha jewel around his neck. He who is always shining with light, the radiant Vaijayanti, is the one who shines with the garland of flowers. He wears valuable rings and bracelets One who wears a garland, is dark and shiny, with a face shining with twisted hair, one who has a delicate and gentle smile, one who has a seat that shines with a gentle laugh, generous in appearance, one who smiles faintly, with a face that is exceedingly He who seeks grace, having made the all-pervading Lord of such form a meditator, should keep watching until the mind keeps that form within itself. Let's learn in our podcast about how to do the meditation that is done next. Salutations to the Guru of the Universe, Jai Srimannarayana.