ప్రాచేతసుల ముక్తి ప్రాప్తి - నారద కీర్తన వైభవము
The Ultimate Elevation and Liberation of the Pracetas
శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్‌లో ఈ అద్భుతమైన ఎపిసోడ్‌లో, సముద్రగర్భంలో దీర్ఘకాలం తపస్సు చేసిన పది మంది ప్రాచేతసులు శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొంది మోక్షప్రాప్తి పొందే దివ్యఘట్టాన్ని వివరిస్తాము. పరమశివుని ఆశీస్సులతో నడచిన వారి భక్తిమార్గం, భగవంతుని కారుణ్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుంది. మహర్షి నారదుడు ఈ పవిత్ర సందర్భంలో తన దివ్యగానంతో భగవంతుని మహిమలను కీర్తిస్తూ భక్తి యొక్క సర్వోన్నత ఫలాన్ని లోకానికి చాటి చెప్పారు.
In this profound episode of the Srimad Bhagavatham podcast, we explore the glorious conclusion of the Pracetas' spiritual journey, as these ten royal sages attain liberation through their unwavering devotion to Lord Vishnu. Blessed by Lord Shiva's guidance and purified through years of deep penance within the ocean's depths, the Pracetas finally emerge to receive the Lord's divine grace and the ultimate gift of moksha. The great sage Narada then glorifies this extraordinary event through his celestial hymns, extolling the supreme power of bhakti and the mercy of the Lord upon sincere devotees.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః ప్రళయ పయసి ధాతుహు సుప్త శక్తేర్ముఖేభ్యః శ్రుతి గణమపనీతం ప్రత్యుపాదత్త హత్వా దితిజమకధయద్యో బ్రహ్మ సత్యవ్రతానాం తమహమహిల హేతుం జిహ్మామీనం నతోస్మి బ్రహ్మగారు తన సృష్టి శక్తిని ఉపసంవరించి ప్రళయ కాలమునందలి నీటిలో నిద్రించుచుండగా ఆయన ముఖము నుండి బయలుబడిన వేదములను రాక్షసుడు హయగ్రీవుడు అపహరించెను. అప్పుడు శ్రీహరి ఆ రాక్షసుని సంహరించి వేదములను తీసుకువచ్చి బ్రహ్మగారికి అప్పజెప్పెను. సకర జగత్ కారణుడగు ఆ శ్రీహరి మాయచే లీల కొరకై చేపరూపు దాల్చి సత్యవ్రతునకు మహర్షులకు పరబ్రహ్మ స్వరూపమును బోధించెను. అట్టి శ్రీహరికి నేను నమస్కరించుచున్నాను. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 38వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పురంజనోభాఖ్యానము ప్రాచీన బర్హికి నారదుడు ఉపదేశించినటువంటి ఉపదేశము అనుభవించాము. ముందు భాగాన్ని మనం తెలుసుకుందాం. ఇట్లు భాగవత శ్రేష్టుడగు నారదుడు జీవ పరమాత్ముల యొక్క స్వరూపమును ప్రాచీన బరిహి ఉపదేశించి అతనితో వెళ్లి వచ్చేదనని చెప్పి బ్రహ్మలోకమున కేగెను. రాజర్షి అగు ప్రాచీన బర్హి ప్రజారక్షణమునందు తన కుమారులకు ప్రచేతస్సులను నియమించి కపిలాశ్రమమునకు తపస్సు చేసుకొనుటకేగెను. అచట గోవింద పాదపద్మములను ఏకాగ్రముగు మనస్సులతో ధ్యానించుచు సంఘము వీడిన వాడై భగవత్ సాయుజ్యమును పొందెను. ఇట్లు పరోక్షముగా ఆత్మకథను వివరించెను.
ఈ పురంజనోపాఖ్యానమును ఎవడు వినునో వినిపించునో వాడు బహు దుఃఖములకు కారణమైన మనస్సుతో సంబంధమును వీడును. భగద్వైభవను ప్రతిపాదించును. ఈ లోకములో పవిత్రము చేయును. ఈ లోకములను పవిత్రము చేయును అని నారదుడు చెప్పిన ఈ కథను. ఎవడు మనసును నిలుపుకొనునో వాడు సమస్త బంధములను వీడి సంసారములో భ్రమించును. ఆధ్యాత్మికతను పరోక్షముగా వివరించిన ఈ ఉపాఖ్యానమును వినినచో ఈ లోకములో పై లోకములో ఫలము అనుభవించవలెనని కోరికలు విడిపోవును. విదురుడు ఈ వృత్తాంతమునంతను విని ప్రాచీన బర్హి పుత్రులగు ప్రచేతస్సులు రుద్రగీతముచే శ్రీహరిని స్తుతించి ఏ సిద్ధిని పొందిరి? మోక్షమును సంగు శ్రీహరికి ప్రియుడగు రుద్రునిచే అనుగ్రహింపబడిన ప్రచేతసులు మోక్షమును పొందుటలో సందేహము లేదు కానీ వారు ఈ లోకములో మోక్షమును పొందుటకు ముందు ఎట్టి సిద్ధులను పొందిరో వివరించమని ప్రార్థించెను. ఇట్లు మైత్రేయుడు చెబుతున్నాడు. తండ్రి ఆజ్ఞను అనుసరించి ప్రచేతసులు తపస్సుచే పరమపురుషుని సంతోషింపచేసిరి. పరమ పురుషుడు పది వేల సంవత్సరముల తరువాత వారి యొక్క తప క్లేశమును తన కాంతిచే క్షమింపచేయుచు ప్రశాంతమగు శరీరముతో వారి ఎదుట ఆవిర్భవించెను. అతడు గరుడునిపై అధిరోహించి ఉండెను. మేరు పర్వత శిఖరముపై నీల మేఘం ఆక్రమించినట్టు ఉన్నట్లు ప్రకాశించుచుండెను. పీతాంబరము దాల్చెను. కౌస్తుభ మణిని దాల్చి దిక్కుల చీకట్లను పారద్రోలుచుండెను. బంగారు ఆభరణములతో ప్రకాశించుచుండెను. కిరీటముతో శంఖ చక్ర పద్మ గదా శాంగ బాణ ఖడ్గ ఖేటములను ఎనిమిది హస్తములతో ధరించి ఉండెను. తన సేవకులకు బ్రహ్మాదులు వెంటనంటి గానము చేయుచుండిరి. వేదములే గరుడుగా మారి కిన్నరుల వలె వానిని కీర్తిని గానము చేయుచుండెను. విశాలమగు ఎనిమిది భుజముల మధ్య దేశమున లక్ష్మీదేవి ప్రకాశించుచుండెను. జగత్కారణమగు పరమ పురుషుడు గంభీరమగు నాదముతో ఉరుముచున్నట్టు దయతో మాట్లాడెను. ఓ రాజకుమారులారా, మీ అందరి సౌహార్దముచే నేను సంతసించి వచ్చినాను. మీకు మంగళము.
నా నుండి ఒక వరము కోరుడు. నిత్యము సంధ్యా సమయములో మిమ్ములను ఎవరైనాను స్మరించినచో వారికి సోదరుల యందు తమ యందు తమకు ప్రీతి ఉన్నట్లు ప్రీతి కలుగును. సర్వ భూతముల యందు ప్రీతి కలుగును. సర్వ భూతముల యందు సౌహృదయం ఏర్పడును. ఈ రుద్రగీతముతో ఉదయము సాయంకాలముల యందు నన్ను ప్రార్థన చేసినచో నేను వారి కోరికలన్నిటినీ తీర్చెదను. మంగళ కర్మకు బుద్ధిని వసంగెదను. మీ తండ్రి ఆజ్ఞను మీరు పాలించి సముద్రములో తపస్సు చేసిరి. కావున మీ కీర్తి లోకములో విస్తరింపగలదు. బ్రహ్మతో సమానము గుణములు కల కుమారును మీకు కలుగును. అతడే లోకములో కీర్తిమంతుడగును. తన సంతతిచే లోకమునంతను నిలుపును. విశ్రుద్ధుడను వాని యొక్క కుమారుడు కండువు. అతడు తపస్సు చేయుచుండగా ఇంద్రుడు అతని తపస్సును భంగపరచురకు ప్రమ్లోచన అను అప్సరసను పంపెను. ఆమెకు తామర పువ్వుల వంటి నేత్రములు గల ఒక కన్య జనించెను. కండు వలన ఆమెయందు కలిగిన ఆ కన్యను మరల స్వర్గమునకు వెడలిపోవుచు ఇచడనే వదిలిపోయెను. ఆమెను వృక్షమును కుమార్తెగా స్వీకరించెను. ఆమె తల్లి వదిలిన తరువాత ఆకలిచే ఏడుచుండెను. అప్పుడు వనస్పతులు అనగా వృక్షములకు రాజగు సోముడు అమృతమును వర్షించుచు తన బొటని వేలిని ఆమె నోటిలో ఉంచెను. ఆమె అప్సరస వలన జన్మించినది, చంద్రుడి సంగిన అమృతమును పానము చేసినది కావున ఆమె శరీరము లావణ్యముతో చెమట, దుర్గంధము మొదలగునవి లేక ప్రకాశించుచుండెను. ఆమె వలన మీరు తండ్రియై సంతానములు కని లోకమును సంతతిని వృద్ధి పొందించవలెనని కోరెను. అందుచే ఓ ప్రచేతసులారా మీరా కన్యను భార్యగా స్వీకరింపుడు. ఇంతమందికి ఒక ఆమె భార్యగా ఉండుట దోషమని భావింపకూడదు. శీలము, ధర్మము మీకందరుకు సమానమే కనుక ఆమె మిమ్ములందరును ఒకరుగానే భావించును కానీ భేదభావముతో చూడదు.
వేయి దివ్య వర్ష సహస్రములు మీరు ఈ లోకములో ఆమెతో కలిసి భూమియందు ఉండెడి భోగములు అనుభవింతురు. నా అనుగ్రహముచే దివ్య భోగములు అనుభవింతురు. ఈ భూమియందలి భోగములయందు ఆసక్తి గలవారై ఉన్నచో మీ యందు మాకు ఎట్లు భక్తి కలుగును అని శంకింపకుడు. మీరు గృహస్థాశ్రమమును ఉన్నను ఫలాభి ఫలాభిసంధి లేకుండా నా ఆరాధనగా కర్మలు ఆచరింపుచుండుడు. కాలమును నా కథలను వినుచు గడుపుచుండుడు. ఇట్లు ఉన్నచో మీకు గృహస్థాశ్రమం కూడా బంధకము కాదు. సంసారము బిడ్డలు మిమ్ములను బంధింపరు. భగవత్ కథలనే విన్నచో ఆ కథలను చెప్పెడి బ్రహ్మజ్ఞానులు చెప్పుచున్నప్పుడు ఆ పరబ్రహ్మ స్వరూపుడగు భగవానుడు మీ హృదయమున ప్రవేశించి నిత్య నూతనముగా ప్రకాశించుచుండును. అట్టి యజ్ఞమునందు నిరంతరం ఉన్నవారు మోహమునందరు. శోకమును హర్షమును పొందుదురు. ఈ విధంగా జనార్ధనుడు చెప్పగా వినిన ప్రాచేతసులు చేతులు జోడించి నిలిచిరి. భగవత్ దర్శనముచే వారి రజస్తమస్సులు తొలగినవి. వారు ఆనంద పరవశులై గద్గద స్వరముతో భగవాన్ ఇట్లు స్తోత్రము చేయుచున్నారు. క్లేశమును తొలగించు ఉదార గుణములు కలవాడును, మనసు కంటే వాక్కు కంటే వేగముగా ముందుకు సాగగల ఇంద్రియములకు అందనట్టివాడును అగు నీకు నమస్కారము. నీవు శుద్ధుడవు, శాంతుడవు. నీవు మహాపురుషుల మనసులలో భాసించువాడవు. వారికి నిరదశయ ప్రీతి కలిగించువాడవు. జగత్ సృష్టి లయములలో సంకల్ప రూప జ్ఞానముచే స్వీకరించువాడవు. నీవే స్వేచ్ఛగా అప్రాకృత దివ్య మంగళ విగ్రహములను స్వీకరించువాడవు. సృష్టి కొరకు రజప్రధానమైన బ్రహ్మ శరీరమును లయము కొరకు తమః ప్రధానమైన రుద్ర శరీరమును స్వీకరించి రక్షణ కొరకు స్వయముగా శ్రీహరివగు నీవే నీ రూపముతోనే వెలసి ఉందువు. నీవు బంధమును హరించువాడవు. పాపములను పోగొట్టుచు మనసులో గోచరముగుచుండెడి వాడవు కావున నిన్ను హరియందురు. సర్వభూతాంతరాత్మవు ఆనందకరుడవు భక్తులకు ప్రభువైన వాడవు నీవు కమలనాభుడవు కమలమాలివి కమలపాదుడవు.
కమలేక్షణుడవు. కమల కింజలకము వలె పచ్చనైన వస్త్రమును ధరించువాడవు. సర్వభూతములలో నివసించువాడవు. అన్నిటినీ ప్రత్యక్షముగా చూచువాడవు. నీ రూపము సమస్త క్లేశములను హరించునది. అట్టి రూపము మాకు ఈనాడు ప్రకటించబడినది. మాపై గల నీ దయచే నీ దర్శనము కలిగినది. అమంగళములు నిరసించు వాడవు నీవు. ఆయా సమయములలో మేము నిన్ను స్మరించుటచే మా యందు అనుగ్రహించి. నీ రూపమును మాకు దర్శింపచేసితివి. నీ స్మరణము చేతనే దురితములు పోవును. అల్పాల్పులగు జీవులకు కూడా మీ దర్శనముచే శాంతి లభించును. మా మనస్సులలో మేము కోరెడి కోరికలు మా అంతరాత్మగా ఉండుటచే ఎరుంగుదువు. నీవు మాకు దర్శనము సంగుటయే. నీవు మాకు వరమును సంగుట నీవే మాకు. భక్తి మార్గమును ఉపదేశించిన గురువుగా మేము పొందెడి మోక్షమునకు సాధనముగా ఒంటివి. అయినను ప్రకృతి పురుషుల కంటే విలక్షణుడవు నీ నుండి ఒక వరమును కోరుచున్నాము. నీవు అనంతముల గుణములు విభూతులు కలవాడవుటచే అనంతుడవు. మకరందముతో నిండిన పారిజాతము ఎదురుగా ఉండగా తుమ్మెద వేరొక పువ్వును వాసన చూడదు కదా అట్లే మేము కూడా నిరతిశయ సుఖము కలిగించు నీ పాద మూలమును చేరి వేరొక వరమును కోరువారము కాము. ప్రకృతిచే మోహమునంది కర్మానుగుణముగా సంసారములో భ్రమించుచున్న మాకు నీ గుణములనే సంతతము చెప్పెడి భగవద్భక్తులతో సమాగమము లభించుగాక. ఇన్ని జన్మలకైనను భాగవత సంఘము మాకు లభించునట్లే అనుగ్రహించుము. భగవంతునితో సంఘము ఏర్పడిన భాగవతుల సహవాసము యొక్క సూక్ష్మాంశముతో కూడా స్వర్గము జన్మరాహిత్యము సాటి కావు. అనినచో ఇక మిగిలిన కోరికలు సాటింపరావని సాటిరావని చెప్పవలెనా? భగవత్ కథలు పాప శోధకములు అని ప్రస్తావింపబడు చోట విషయ వాంఛ ఉపశమించును. భగవత్ ప్రసంగము సాగుచోట భయము ఉండదు. సంఘ రహితులగు సత్పురుషులు నారాయణుడే శరణాగతులకు ఉపాయమని చెప్పుచున్నారు. మీ భక్తులు గంగాది తీర్థములను పవిత్రము చేయవలెననియే ఈ లోకములో సంచరించుచుందురు. సంసారము నుండి భయపడిన వారికి మహా భక్తుల సమాగమము
మిక్కిలి ప్రీతిని కలిగించును. ఓ భగవన్, సంసారమనడు రోగమునకు చికిత్స చేయువాడు పరమశివుడు. అతడు నీకు ముత్తుడు. అట్టి వానితో మాకు ఒక్క క్షణకాలము సమాగము లభించినది. అందుచే నీ దర్శనము లభించినది. నిన్ను మేము శరణముగా శరణముగా వరించుచున్నాము. మేము చేసిన వేదాధ్యయనము, గురుప్రసాదనము, బ్రాహ్మణ ఆరాధనము, వృద్ధానువర్తనము, ఆర్య సహవాసము, మిత్ర భ్రాత్రు సంతోషణము, జలములలో చిరుకాలము, ఏ విధముగు ఆహారము తీసుకోనకుండా చేసిన తపస్సు నీకు సంతోషము కలిగించునవి అవుగాక. మనువు, రుద్రుడు, బ్రహ్మ, తపస్సుచే, జ్ఞానముచే పరిశుద్ధమగు అంతఃకరణము గల పితరులు వారి వారి బుద్ధిని అనుసరించి నిన్ను స్తోత్రము చేయుదురే కానీ నీ అతిశయమునకు అంతము చూడజారరు. అట్టి నిన్ను మేము కూడా ఈనాడు స్తోత్రము చేయుచున్నాము. సముడవు, శుద్ధుడవు, పురుషుడవు, పరవాసుదేవుడవు, భగవానుడగు నీకు నమస్కారము. ఇట్లు ప్రచేతసులతే స్తోత్రము చేయబడిన శ్రీహరి తనను శరణు పొందిన వారిపై వాత్సల్యము గలవాడై సంతోషముతే అట్లాగు కాక అని అనుగ్రహించి ఎంతసేపు చూచినను తృప్తి తీరక చూచుచున్న ఆ ప్రచేతసులను వీడి తన స్థానమునకు ఏగెను. ఇంతటితో ప్రచేదస్సులు భగవానుడి మధ్యలో జరిగిన సంభాషణ మనం అనుభవించాము. భగవంతుడు వారికి ఉపదేశం చేశాడు. తర్వాత వారు తిరిగి స్తుతించారు. దీని తర్వాత భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః. Jai Srimannarayana
Jai Srimannarayana, salutations to the Guru. The destroyer of the world, the creator, the one with the power of sleep, from the faces of the Shrutis, the one who is not known by the Ganas, the one who is known by the Ganas, the one who is the cause of the Brahma Satya Vrata, I am not a Brahma, I am not a Guru, his creation Having withdrawn his power, while he was sleeping in the water during the time of destruction, the demon Hayagriva stole the Vedas that emerged from his mouth. Then Srihari killed that demon, brought the Vedas, and entrusted them to Brahma. That Srihari, who is the cause of the entire universe, assumed a disguise for the sake of Maya's play and taught the form of the Supreme Brahman to Satyavrata and the great sages. I offer my salutations to Lord Sri Hari. Devotees of God, welcome to the 38th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation with Vidura Maitreya, we have experienced the teaching that Narada imparted to the ancient Barhi, which is the Puranjano Bhashyam. Let's start with the front. Thus, Narada, the best of the Bhagavata, taught the ancient Barihi about the nature of the living and the Supreme Soul, and with him Saying that he would go and come back, he went to Brahma Loka. Rajarshi, in the ancient protection of the Barhi people, appointed his sons as Prachetas and went to Kapilashrama to perform penance. There, Govinda, meditating on the lotus feet with a single-minded focus, having left the world, attained the union with the Lord. Thus, indirectly, he explained the autobiography.
He who hears or narrates this Puranjnopakhyanam will abandon relationships with a mind that is the cause of much sorrow. Presenting Bhagavad Gita. Holy in this world. This story that Narada told, that these worlds are sanctified. He who controls his mind will abandon all attachments and wander in the world. If one listens to this anecdote that indirectly explains spirituality, desires to experience the fruits in this world and the higher world will be abandoned. Having heard this entire story, the ancient sons of Barhi, the Prachetas, praised Srihari with the Rudra Gita, and what accomplishment did they attain? There is no doubt that the Prachetas, who were blessed by Rudra, who is dear to Sri Hari, attain salvation, but he prayed to explain what kind of Siddhis they attained before attaining salvation in this world. Thus goes Maitreyi. Following their father's command, the Prachetas performed penance to please the Supreme Being. The Supreme Being, after ten thousand years, removed their penance and suffering with His light Forgiving, with a calm body, appeared before them. He had mounted Garuda. A blue cloud seemed to have occupied the peak of Mount Meru. The dhoti is worn. Wearing the Kaustubha jewel, he dispelled the darkness in all directions. She was shining with gold ornaments. He was holding the crown, conch, chakra, lotus, mace, bow, arrow, and sword in eight hands. Brahma and his servants were singing along. The Vedas themselves, becoming Garuda, were praising and singing his glory like Kinnaras. In the vast expanse between the eight arms, Lakshmi Devi shone. The Supreme Being, the cause of the universe, spoke with compassion, as if thundering with a solemn sound. Oh, princes, I am pleased to have come with the harmony of all of you. You're welcome.
Ask for a favor. If anyone remembers you in the evening, they will have love for you and for their brothers and sisters. May thou have at all times the devotion of all beings. Friendship will be established among all beings. If you pray to me in the morning and evening with this Rudra Geetham, I will fulfill all their desires. I will put wisdom in the auspicious ceremony. You obeyed your father's command and performed penance in the ocean. Therefore, your fame can spread in the world. You shall have a son, who shall be like unto thee, full of all virtues. He will be honored in the world. And his offspring will rule the world. Vishruddhudu and his son Kanduvu. While he was doing penance, Indra sent Pramlochana, an apsara, to disrupt his penance. She gave birth to a virgin who had eyes like lotuses. Because of the pain, she left the virgin who was in her and went back to heaven. She took the tree as her daughter. She was crying because her mother left her. Then, the forest deities, meaning the king of the trees, Somudu, rained nectar and placed his finger in her mouth. She was born from an Apsara, and because she drank the nectar of the moon's union, her body was radiant with beauty, without sweat, bad odor, etc. He desired that through her, you become a father, and that you may increase the world's offspring and increase the progeny. Therefore, O gods, accept Meera as your wife. It is not right to think that being a wife to so many people is a sin. Since morality and righteousness are equal to all of you, she considers you all as one, but does not look with discrimination.
Thousands of divine rains, thousands of times, you will experience the pleasures of being with her on earth in this world. By my grace, they experience divine pleasures. Do not doubt, if you are interested in the pleasures of this earth, how can we have devotion to you? Even if you are in the household stage, without any fruit-bearing contact, you are performing your duties as my worship. He spends his time listening to my stories. If it is like this, then your Grihastha Ashrama (householder stage of life) will not be binding. Family and children will not bind you. When you listen to the stories of the Lord, when the knowers of Brahman tell those stories, that Supreme Being, the embodiment of the Lord, enters your heart and shines eternally and newly. Those who are constantly present in such a sacrifice are all deluded. They experience both sorrow and joy. In this way, hearing Janardhana say so, the Prachetas stood still with folded hands. By the sight of the Lord, their passions were dispelled. They are overjoyed and with a choked voice, Bhagavan is praising thus. He who removes suffering, possessing generous qualities, mind I bow to you, who can move forward faster than speech, who is beyond the reach of the senses. You are pure, you are at peace. You are the one who shines in the minds of great men. You are the one who can bring them peace. You are the one who accepts the form of knowledge in the creation and destruction of the world. You are the one who freely accepts the unmanifested divine auspicious forms. For creation, you accept the Rajapradhanam Brahma body, and for dissolution, you accept the Tamapradhanam Rudra body. For protection, you yourself, Srihari, exist in your form. You are the destroyer. You are the one who is visible in our hearts, removing sins, therefore they call you Hari. You are the soul of all beings, the giver of bliss, the lord of devotees, you are Kamalanabhu, you are Kamalamali, you are Kamalapadudu.
You are the lotus-born one. You are the one who wears a green garment like a lotus bud. Oh, you who dwell among all beings. You see everything. Your form removes all sufferings. Such a form has been revealed to us today. Your grace and your vision upon us. You are the one who rejects the inauspicious. At those times, by remembering you, grant us grace. You have shown us your form. By your remembrance, sins will be removed. Even the creatures of small stature will find peace through your vision. We cannot understand the desires we have in our hearts, as they are our inner selves. It is only for your visit. You are the giver of us all, you are ours. We are the means to the salvation we attain by being the guru who preached the path of devotion. However, you are more unique than nature and men. We ask for a boon from you. You are infinite because you possess infinite qualities and attributes. Just as a bee does not smell another flower while being surrounded by a jasmine flower full of nectar, similarly, we too provide immense happiness We do not ask for another boon by reaching the base of your feet. May we, who are deluded by nature and act according to karma, and who are wandering in the world, attain union with the devotees of God who constantly speak of your virtues. Grant us the Bhagavata Sangha, even for as many births as possible. Even the subtle aspects of the association of the devotees who have formed a community with God, heaven and birthlessness do not match. If so, should I say that the remaining desires cannot be fulfilled? Where the stories of God are mentioned as the destroyers of sins, the desires of the mind are pacified. Where the Word of God prevails, there is no fear. The saints who are free from association say that Narayana is the means for those who seek refuge. Your devotees wander in this world to purify the sacred waters of the Ganges and other pilgrimage sites. For those who are afraid of the world, the meeting of great devotees
It will bring great pleasure. Oh Lord, the one who treats the disease called worldly life is the Supreme Lord Shiva. He is your son-in-law. With such a person, we have had a moment of reconciliation. Therefore, your darshan (vision) has been attained. We seek refuge in you, we seek refuge. The Veda study we did, the Guru's blessing, the Brahmin's worship, the old man's guidance, the Aryan's association, the friend's joy, the short time in the waters, May the penance of not taking any kind of food be pleasing to you. Manu, Rudra, Brahma, those ancestors who have a pure inner self through penance and knowledge, they praise you according to their respective intellects, but they do not see the end to your pride. Thus we also sing your praises today. You are equal, you are pure, you are male, you are the supreme God, salutations to you, the Lord. Thus, Srihari, who is praised by the gods, being affectionate towards those who seek refuge in him, being happy, not like that, having blessed, even after watching for a long time, not satisfied, watching, that He left the Prachetas and went to his place. With this, we experienced the conversation that took place between the divine beings and the Lord. God has given them the message. They then praised again. We will learn about the next part in another podcast. Asmad Gurubhyo Namah. Jai Srimannarayana