దేవహూతి మోక్షసిద్ధి - కపిలాశ్రమ సిద్ధక్షేత్ర సమాప్తి
The Ultimate Liberation of Devahuti & Canto 3 Conclusion
తృతీయ స్కంధపు పవిత్రమైన సమాపన ఘట్టంలో, భగవాన్ కపిలుడు తన తల్లి దేవహూతికి బోధించిన సాంఖ్యజ్ఞానాన్ని ఆమె నిష్టతో అభ్యసించి, పరమపదాన్ని పొందిన మహత్తరమైన మోక్షసిద్ధిని మనం దర్శిస్తాము. దేవహూతి పరమాత్మలో లీనమైన స్థలం సిద్ధక్షేత్రంగా మహిమాన్వితమై, ఋషులు మరియు భక్తులచే నిత్యం సేవింపబడుతోంది. సముద్రతీరాన వెలసిన కపిలాశ్రమం శాశ్వతమైన పుణ్యస్థలంగా కీర్తింపబడడంతో, భాగవతం మూడవ స్కంధం సభక్తికంగా పరిసమాప్తి అవుతుంది.
In this sacred concluding episode of Canto 3, we witness the triumphant spiritual liberation of Devahuti, the devoted mother of Lord Kapila, who attained moksha through unwavering practice of the Sankhya wisdom her divine son imparted to her. The place where Devahuti merged with the Supreme is glorified as Siddhakshetra, a holy tirtha sanctified by her transcendence, and Lord Kapila's ashram on the banks of the sea becomes eternally revered by sages and seekers alike. This episode beautifully closes the profound third canto of Srimad Bhagavatham, leaving us with the timeless assurance that sincere devotion and self-inquiry lead every soul to the highest liberation.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తుభ్యం భగవతే సకల జగత్ స్థితి లయోదయేశాయ దురవసితాత్మగతయే కుయోగినాంభిదా పరమహంసాయ ఓ భగవానుడా, సకల జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు అధీశ్వరుడవు నీవే. కేవలము భేదమును మాత్రమే దర్శించే అయోగ్యులకు సాధకులు నీ యధార్త తత్వమును తెలియజాలరు. పరమహంసకు కూడా పరమహంసకు నీకు తేడా లేదు, సూర్యాదులను కూడా ప్రకాశింపచేసేది నీవే, నీకు నమస్కారము. సిక్స్త్ క్యాంటో, సిక్స్టీన్త్ చాప్టర్, ఫార్టీ సెవెన్త్ ప్రేయర్. భగవంతువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము 44వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఈ భాగంతో మనం కపిల గీత యొక్క విషయాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. దీనితో మూడవ స్కందము కూడా పూర్తి చేసుకోబోతున్నాం. ఇంతవరకు విదున మైత్రేయ సంవాదంలో భాగంగా దేవహుతికి కపిలుడు వివరిస్తున్నటువంటి గీతా భాగాన్ని మనము అనుభవించాం. ఏ వ్యక్తి అయితే ధర్మ మార్గం ప్రవర్తిస్తూ ఉంటాడో, ఎలా అర్చిరాది మార్గంలో, ధూమాది మార్గంలో ప్రయాణిస్తాడు, బ్రహ్మ యొక్క కాల పరిమితిలో బ్రహ్మ యొక్క ప్రయాణం ఎలా ఉంటుంది విషయాలని మనం అనుభవించాం. ముందు భాగాన్ని మనం అనుభవిద్దాం. ఇంతవరకు నీకు జ్ఞాన యోగము, భక్తి యోగము అనేటి రెండింటినీ ఎరింగించితిని. ప్రకృతి కంటే వేరైన పరమాత్మ ఆత్మగా గల జీవాత్మను ఉపాసించుటచే దానిని దర్శించుట జ్ఞాన యోగము అనబడును. సమస్త జగత్తు శరీరముగా గల సత్వాది గుణములు లేని కళ్యాణ గుణములు గల పరమ పురుషుని ప్రేమతో ఎడతెగక స్మరించి దర్శించుట భక్తి యోగం అనబడును. ఈ భక్తి యోగముచే జీవుడు సత్వాది గుణములు సంబంధం లేని వాడగును. ఈ రెండింటి చేతను లభించడి పరమ ప్రయోజనము భగవానుడే. పాలన పాలను మనము త్రాగుచుందుము ఆ పాలను కంటితో తెల్లగానున్నవని గుర్తింతుము నాలుకతో తీయగా ఉన్నదని చవి చూతుము చర్మముతో వెచ్చగా ఉన్నదని చల్లగానున్నదని గుర్తింతుము
అన్ని ఇంద్రియముల చేతను ఒకే ద్రవ్యములోని వేరు వేరు భావములను అభిభవించునట్లే శాస్త్రములను భగవానుని దర్శించుటకు భిన్న భిన్న మార్గములను చెప్పినవి. మార్గములు వేరైనను వానిచే పొందబడు ఫలము అనగా పరమార్థము ఒక్కటే. ఆ మార్గములు కర్మ యోగము, జ్ఞాన యోగము, శరణాగతి అని భిన్నములుగా ఉండును. పాంచరాత్ర శాస్త్రము భగవానుని పూజించి విధానము చెప్పినది. వేదములోని పూర్వ భాగము భగవానుని ఆరాధించు క్రతువులను చెప్పినది. స్మృతులు వ్రతములను ప్రతిపాదించినది. వేదాధ్యయనము వేదార్ధమును పరిశీలించుట కూడా భగవత్ ప్రాప్తికి మార్గమే. ఇంద్రియములను జయించుట, మనసును జయించుట, ఫలమునందు సంగము లేకుండా కర్మలను చేయుట కర్మ యోగమందురు. ఈ కర్మ యోగముచే పొందబడెడి ఫలము భగవానుడే. భగవానుడి ఆత్మగా గల ఆత్మ స్వరూపమును ఎరుంగుట కూడా జ్ఞాన యోగము. ఈ ఆత్మ జ్ఞానముచే వైరాగ్యముచే మంగళ గుణములు గలవాడగును. హేయ గుణములు లేనివాడును స్వప్రకాశుడును అగు భగవానుడే పొందబడును. భక్తి యోగము, తామసము, రాజసము, సాత్వికము, నిర్గుణము అని నాలుగు విధములుగా వివరించితిని. అట్టి భక్తి యోగము కూడా భగవానునే పొందించును. కాలము జీవులలో సకల పదార్థములలో లోన ప్రవేశించి ఉండి ఎవ్వరికీ గోచరము కాకుండా పరిమితిని కలిగించుచుండును. అట్టి ఇంద్రియములచే గుర్తింపదగినది కాదు. దానిని ఎరుంగుట భగవానుని ఎరుంగుట. అజ్ఞానము చేత, కర్మ చేత జీవుడు కూడా అనేక విధములుగా శరీరములో ప్రవేశించి జన్మించుచు, చనిపోవుచు, మరల పుట్టుచు తిరుగుచున్నాడు. ఇవి అన్నియు నీకు ఉపదేశించితిని. ఇది చాలా రహస్యమైన ఉపనిషత్సారమైన భూతమైన అర్థము. ఇది నీచమగు స్వభావము గల వారికి చెప్పకూడదు. మూర్ఖులకు, నడువడి లేని వారికి, దాంబికునకు చెప్పకూడదు. ఇల్లు, ఇల్లాలే సర్వము అని భావించు వారికి చెప్పకూడదు. వినవలెనని కోరిక తొందరగలవానికి, లోక విషయములకే ప్రాకులాడకుండా ఉండు మనస్సు గలవానికి, అన్నిటికంటే నన్ను ఎక్కువగా ప్రేమించువానికి ఒకరి
గొప్పతనమును చూచి ఓర్వగలిగిన వానికి చెప్పవలెను. అమ్మా, శ్రద్ధతో ఎవడు దీనిని ఒక్కసారి ఎనను వినునో లేదా ఒకరికి చెప్పునో అట్టివాడు నా యందు మనసు నిలిచిన వాడగును. ఇతరములగు విషయములపై కోరిక తగ్గిన వాడగును నన్ను స్మరించి ప్రేమించు వాడగును అట్టివారు నన్ను సేవించి ధరించు వారగుదురు దేవహుతి కపిలుని వలన తత్వ పురుషార్ధములను విని అజ్ఞానము తొలగినదాయను. ప్రకృతి, పురుషుడు, ఈశ్వరుడు అని మూడు తత్వములను గూర్చిన జ్ఞానము పరిపూర్ణముగా గల యోగులకు విశ్రాంతి స్థానము కపిలుడు. అట్టి కపిలుని ఆమె నమస్కరించి ఇట్లు స్తోత్రము చేయుతున్నది. కుమారుడే జ్ఞానమును ఉపదేశించిన గురువైనాడు. అందుచే గురువుగా ఆమె నమస్కరించినది. దేవా నా భాగ్యమే భాగ్యము. బ్రహ్మ కూడా నీ నాభిక మలము నుండి పుట్టి నీ దివ్య మంగళ విగ్రహమును ధ్యానము చే సమాధిలో దర్శించినాడు. అట్టిని రూపమును నేను నీ నేత్రములతో ఏ సాధనము లేకుండా చూడగలిగినాను. నీ రూపము ఆనాడు జలములలో శయనించి ఉన్నది. పంచభూతములకు ఏకాదశ ఇంద్రియములు, శబ్దాది విషయములు, ఆత్మలు, నీ జఠరములు అణిగి ఉన్నవి. కార్యవర్గమంతయు అణిగి ఉన్న కారణరూపమైన నిన్ను ఆ చతుర్ముఖ బ్రహ్మ ధ్యానముచే దర్శింపగలిగినాడు. అట్టి కారణరూపుడవైన నీవే బ్రహ్మాదులను సృష్టించి వారికి రజోగుణమును అధికముగా చేసి వారికి సృష్టి చేసేడి శక్తిని అనుగ్రహించి వారిలో అనుప్రవేశించి సృష్టి చేయించితివి. ఏ విధమగు వ్యాపారము చేయని వాడై ఉండి సంకల్ప మాత్రము చేత జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేసిన వాడవు నీవు. జీవులందరిలో వ్యాపించి నియమించువాడవై వేరొకడు నియామకుడిగా నీకు లేని ఆత్మేశ్వరుడవు. ఊహించుటకు వీలుగాని శక్తులు కలవాడవు. అట్టి నీవు విశ్వమునంతను గర్భములో ఉంచుకొని ఒక లేత మర్రి ఆకుపై పరుండి మాయా శిశువై బొటనవేలును నోటిలో పెట్టుకొని పానము చేయుచు అఘటిత ఘటనా సమర్ధుడవైన నీవు నా గర్భమున ఉండుట అసాధ్యమా? అట్లు ఉండుటకు కారణము ఏమున్నది? నా భాగ్యమే దుష్కర్మలను ఆచరించు వారిని వినాశము చేయుటకును నిన్ను ప్రేమించి నీ కొరకు నీ ఆజ్ఞలను పాలించు వారిని రక్షించుటకును దేహమును స్వీకరించితివి.
వెనుక వరాహము మొదలగు అవతారము నెత్తి ఆ కార్యమును ఎట్లు నెరవేర్చితివో ఈనాడు కపిలుడవై నా గర్భము నుండి జన్మించి సత్పురుషులకు సన్మార్గమును ఆత్మమార్గమును ప్రసాదించితివి. నీ నామమును వినుటచే, కీర్తించుటచే, నీ పాదములను నమస్కరించుటచే, నిన్ను స్మరించునంత మాత్రముచే హీనమగు కృత్యములను చేసిన వారు కూడా కృతార్థులగుచున్నారు. ఇంక నేను దర్శించిన వారు పొందిడి ఫలమెట్టిదో చెప్పగలనా? ఎంతటి హీన సంస్కారము గలవారైనను నీ నామము జిహ్వాగ్రమున కదలాడిన నాడు జ్ఞానుల కంటే అధికులగుదురు. నీ నామమును చిట్టచివరి సమయంలో స్మరించి స్మరించు భాగ్యము కలుగుటకై ఎందరో పెద్దలు తపస్సు చేసిరి. హోమములు చేసిరి, పవిత్రమగు తీర్థములో స్నానములు చేసిరి, వేదములను అధ్యయనము చేసిరి. అట్టిది ఏమియు లేకయే హీనముగు జన్మనందియు నిన్ను స్మరించడి భాగ్యమును అందినవారు ఎంత ధన్యులో కదా. స్వప్రకాశ మహితుడగు జీవుడు తనకు అంతరాత్మగా ధ్యానింపదగిన వాడవు నీవు. నీవు అన్నిటికంటే స్వరూపముచే గుణములచే అధికుడవు కనుక నిన్ను బ్రహ్మ అందురు. జ్ఞాన సంకోచమునందిన జీవుల జ్ఞానము విస్తరింపజేయవాడగుటచే నిన్ను బ్రహ్మము అందురు. నీ ప్రకాశము చేతనే సత్వరజస్తమో గుణములచే ఏర్పడిన సంసారము నాశమగును. జీవునిలో అంతరాత్మగా ఉన్నను నీ ప్రకాశము తగ్గదు, మరుగుపడదు. నీ వేదములన్నియు గర్భమందు కలవాడవు, నీవు సాక్షాత్తు పరమ పురుషుడవగు విష్ణువే అని నేరెరంగితిని, నీకు నమస్కరించుచున్నాను. ఇట్లు దేవహుతి. స్తుతింపగా తల్లితండ్రులపై వాత్సల్యము గల కపిలుడు గంభీరముగు వాక్కుతో తల్లితో ఇట్లు పలికెను. అమ్మా నేను చెప్పిన భక్తి యోగ మార్గమును సుఖముగా ఆచరింపదగినది దాని నీవు ఆచరించి పొందవలసిన వానిలో చిట్టది చివరిదగు మోక్షమును నొందగలవు. నేను ఉపదేశించిన యోగము నాకు చాలా ఇష్టమైనది. దాని యందు శ్రద్ధ కలిగి ఉండుము. బ్రహ్మవేత్తలు దాని శ్రద్ధతో పరిశీలించిరి. దానిని దానికి ఎరింగి ఆచరించి నీవు అభయమును వసంగిడి నన్ను పొందెదవు. ఇది నా మతమని ఎరుంగక సంశయించిన వారు సంసారమును పొందుదురు. ఇట్లు భగవానుడు కపిలుడు తల్లికి జ్ఞానమార్గమును చూపి ఆమె అనుజ్ఞ తీసుకొని తమ ధామమునకు ఏగెను. దేవహుతి కూడా తన కుమారుడు చెప్పిన యోగ మార్గముని అనుసరించుచు సరస్వతి నదీ తీరమందున్న ఆశ్రమమున
సమాధి నిష్ఠురాలై ఉండెను. ఆమె ఆ ధ్యాన యోగ మార్గమును అవలంబించి మూడు సార్లు స్నానము చేయుచు జడలను దాల్చినదై నార బట్టలను కట్టుకొని తీవ్రమగు తపస్సు చే కృశించిన శరీరము గలదై ఉండెను. తపో యోగములచే గృహస్థాశ్రమము దేవతల చేత కూడా ప్రార్థింపదగినది. దేవహుతి కర్ధమునితో గృహస్థాశ్రమమును సాటిలేని పద్ధతిలో నిర్వహించినది. ఈ కుమారుడు తనను వదిలి వెళ్ళినాడని దిగులు పడి కలత చెందినదాయను. ఆమె గృహస్థాశ్రమమున ఉండియు ఈనాడు తపస్సు చేయుచున్నది. ఆనాడు ఆమె కర్దమ ప్రజాపతితో అనుభవించిన భోగములు అసాధారణములు. పాల నురుగు వంటి తెల్లని మెత్తని పాన్పులు, దంతములతో చేసిన బంగారుతో కూర్చబడిన పరికరములు, బంగారు ఆసనములు, మెత్తని ఆస్తరణములు, స్వచ్ఛమగు స్పటికములతో ఏర్పడిన గోడలు, వాటిలో ఇంద్రనీల మణులు అందమునకై పొదగబడినవి. ఆమె ఉండడి భవనము చుట్టూను ఉద్యానవనము, పరిమళము గల వృక్షములతో కూడిన కల్పవృక్షములపై కూయుచున్న పక్షుల జంటలు, పూలలోని మకరందమును త్రాగి మత్తెక్కిన తుమ్మెదలు, ఆ ఉద్యానవనములో ఆమె కర్దమునితో విహరించునప్పుడు కిన్నెరులు కూడా గానము చేయుచుండేవారు. అట్టి భోగమును అనుభవించి కూడా ఆమె వానిపై మమకారం పెంచుకొనలేదు. ఆమె గృహస్థాశ్రమ నిర్వాణము అంత గొప్పది. ఇప్పుడు భర్త వనములకేగినాడు, కుమారుడు. కపిలుడు కూడా తనకు జ్ఞానము చేసి జ్ఞానం ఉపదేశించి వెళ్ళినాడు. అందుచే కుమారుని ఎడబాటు ఓర్వలేక తత్వజ్ఞానం పరిపూర్ణముగా కలదైనను దూడపోయిన గోవు వలె మనసును చెదిరినదే ఉండెను. శ్రీహరియే తనకు కుమారుడిగా జన్మించినాడని ఆమె ఎరుంగును. అతనినే చాలా కాలము ధ్యానము చేయుచు గృహమునందు భోగమునందు మమకారము లేనిదై చాలా కాలముండెను. ఇట్లు ఉండి కపిలుడు ఉపదేశించిన భక్తి యోగముచే ఎట్టి రూపమును ధ్యానము చేయవలసినదిగా కపిలుడు ఆదేశించినాడో ఆ రూపమునే ధ్యానించుచు విచ్ఛేదము లేని ప్రయోజనము కోరని భక్తితో వైరాగ్యముతో భగవానుని ఆరాధనము చేసినది. ఆమెకు సత్వాది గుణముల సంపర్కముచే కలిగిన గుణ దోషములన్నియు తొలగినవి. తనకు ఆధారభూతుడైన భగవానుని యందే మనసును స్థిరముగా నిలుపుకొని ఉన్నది. ఆమె శరీరముతోనున్నను జీవ భావము ఆమెలో తొలగిపోయినది. శీతోష్ణాది ద్వంద్యములచే ఆమెకు క్లేశము కలుగుట లేదు.
పరమాత్మానుభవముతో ఆనందమును అనుభవించుచున్నది. నిత్యము ప్రత్యగాత్మ అనగా జీవాత్మ శరీరముగా గల పరమాత్మ యందే మనసు నిలుపుచున్నది. సత్వాది గుణములచే కలిగెడి దేహమే ఆత్మ అనడి భ్రాంతి, తాను స్వతంత్రురాలం అనడి భ్రాంతి తొలగిపోయినది. శరీరము శరీరముకు సంబంధించిన సుఖ దుఃఖములను స్మరించుట లేదు. కలగని లేచిన పురుషుడు మేలుకొనిన తరువాత కలలో అనుభవించిన వస్తువులచే కలిగిన సుఖదుఃఖములను తలంచి ఎట్లు పొంగిపోక కృంగిపోక ఉండునో దేహము దేహముతో అనుభవించినవి అనిత్యములని ఎరంగి ఆమె వానిచే కలతనందనిదే ఉండెడిది. ఆమె ఆహారమునకై ప్రయత్నము చేయుట మానినది. ఎవరో వసంగిన దానిని తిని జీవించుచున్నది. అయినను కృషించలేదు. శరీరమును ఎట్లు పోషించుకొందును అనేటి మానసికమైన ఆలోచన లేకపోవుటయే ఆమె కృషించకపోవుటకు కారణము. స్నానము లేక, నలుగు లేక ఆమె శరీరం మలినముగా ఉన్నను, పొగ చుట్టూ ఆవరించినను జ్వాల అను కాంతి తగ్గక లోన ప్రకాశించుచున్నట్లు ఆమె శరీరం ప్రకాశించుచున్నది. ఆమె తపోభాగము అధికమాయెను, ఆమె శరీర స్పృహ స్ఫూర్తిగా కోల్పోయెను. సంతతము ఆమె బుద్ధి భగవంతునే తలంచుచు భగవత్ అనుభవముచే ఆనందమునే పొందుచుండుటచే శరీర స్పృహ లేక జుట్టు వీడిపోయెను వస్త్రములే జారిపోయెను ఎరుంగట లేదు. ఈ విధంగా కపిలుడు ఉపదేశించిన జ్ఞాన మార్గమును ఆచరించి అనుభవించి నిరతిశానంద స్వరూప భగవానుని పొందెను. ఆమె ఇట్టి తపస్సు చేసి సిద్ధి పొందిన క్షేత్రము మూడు లోకములలోనూ ప్రసిద్ధి ప్రసిద్ధమాయెను. ఆమె ముక్తి పొందిన క్షేత్రము కనుక ఆ క్షేత్రమునకు సిద్ధి క్షేత్రము సిద్ధాశ్రమం అని పేరు వచ్చెను. ఆమె యోగ మార్గమును అవలంబించిన తగుటచే ఆమె శరీరం ముడతలు పడలేదు, జుత్తు పండలేదు. మర్ద్య ధర్మములు కానిపింపలేదు. ఆమె వదిలిన ఆ శరీరము జలప్రవాహమున మధ్యలో సిద్దులచే సేవింపబడే సిద్ధిద అనే నదిగా మారెను. మహాయోగియగు కపిలుడు తల్లి అనుమతి తీసుకొని తన తండ్రి గారి ఆశ్రమం నుండి ఈశాన్య దిక్కుగా వెడలెను. సిద్ధ చారణ గంధర్వులచే అప్సరసలచే ఆ భగవానుడు స్తోత్రము చేయబడుచుండెను. సముద్రుడు అతనికి తనలో స్థానమును వసంగెను. కపిలుడు చెప్పిన సాంఖ్య మార్గమును ప్రవర్తింపజేయు యోగులు అతనిని ఆరాధించి స్తుతించుచుందురు.
మూడు లోకములకు శాంతి కలుగుటకై కపిలుడు సమాధినంది ఉండెను. ఇట్లు మైత్రేయుడు విదురునకు కపిల దేవహుతి సంవాదం వినిపించెను. ఇది పరమ పవిత్రము ఇది చాలా గుహ్యతమము. ఈ కపిల మతమును ఎవరు వినునో ఎవరు చెప్పునో అట్టి మానవుడు గరుడ ధ్వజుడు శ్రీ మహావిష్ణువునందు భక్తి యోగము ఆవర్భవించిన వాడై భగవత్ పాదారవిందమును చేరును. ఇంతటితో తృతీయ స్కంధం మనకు పూర్తి అవుతుంది. దీని తర్వాత మనం చతుర్ధ స్కంధములో అడుగు పెడతాం. కృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru, salutations to you, the Lord. You are the cause of the creation, preservation, and destruction of the entire universe. You are the supreme controller. Oh Lord, you are the master of all the creations, preservations, and destructions of the universe. Those who are unworthy of seeing only the difference cannot understand your true nature. There is no difference between Paramahamsa and Paramahamsa, you are the one who illuminates even the sun and other stars, salutations to you. Sixth Canto, Sixteenth Chapter, Forty-seventh Prayer. Oh Gods, welcome to the third episode of the Srimad Bhagavata Tattva Deepika, in the 44th podcast. With this part, we are going to complete the topic of Kapila Geeta. With this, we are going to complete the third Skanda. Until now, as part of the Viduna Maitreya conversation, we have experienced the Gita part that Kapiludu is explaining to Devahuti. The person who follows the path of Dharma, how does he travel in the path of Arjuna, in the path of Dhuma, within the time limit of Brahma, how is Brahma's journey, the subjects We’ve experienced it. Let's experience the front part. Until now, I have taught you both Jnana Yoga and Bhakti Yoga. Worshipping the soul that is different from nature, as the supreme soul, and seeing it, is called Jnana Yoga. The love of the Supreme Being, who is the embodiment of the entire universe, without the qualities of goodness, and with the qualities of auspiciousness, is called Bhakti Yoga. Through this Bhakti Yoga, the individual becomes detached from the qualities of goodness and righteousness. The ultimate benefit is obtained through these two. We drink milk. We recognize that milk is white with our eyes. We taste it sweet with our tongue. We recognize that it is warm with our skin and cold with our skin
Just as all the senses enjoy different feelings in the same substance, the scriptures have told different paths to see God. Although the paths are different, the fruit obtained by them is the same, that is, the ultimate meaning. Those paths are Karma Yoga, Jnana Yoga, and Sharana Yoga, which are different. The Pancharatra Shastra describes the method of worshipping the Lord. The earlier part of the Veda describes the rituals to worship the Lord. The Smritis are the founding texts of the scholastic tradition. Studying the Vedas and contemplating their meaning is also a path to attain God. To conquer the senses, to conquer the mind, to perform actions without attachment to the fruits, is called Karma Yoga. The fruit obtained by this Karma Yoga is the Lord himself. Knowing the soul form that is the soul of God is also the yoga of knowledge. This soul, through knowledge and detachment, will be one with auspicious qualities. He who is without evil qualities and self-illuminating, that Lord is attained. I have explained Bhakti Yoga, Tamasic, Rajasic, Sattvic, and Nirguna in four ways. Such devotion Yoga also helps in attaining a state of inner peace. Time, entering into all substances in living beings, and being invisible to everyone, limits them. It is not something that can be recognized by the senses. To erase it, to erase the Lord. Due to ignorance and karma, the living being enters the body in many ways, is born, dies, is reborn, and wanders. These are all the things that I have instructed you. This is a very secret, esoteric meaning of the Upanishads. This should not be told to those with a vile nature. Should not be told to a fool, unsteady, or duplicitous person. One shouldn't tell those who think that a house is everything. To those who have a desire to listen, to those who have a mind that does not crave worldly matters, to those who love me more than anything, one
It should be told to someone who can bear the greatness. Mother, whoever listens to this once with attention, or tells it to someone, such a person will have their mind fixed on me. He who has less desire for other things, he who loves me by remembering me, such people will serve me and wear me. Having heard the essence of the Supreme Being from Kapila, the ignorance will be removed. The abode of the yogis who are fully knowledgeable about the three elements, namely nature, man, and God, is Kapiludu. She is praising Kapil by offering her salutations. The son is the guru who has given knowledge and is the guru. She bowed to him as her guru. My Lord, what a good fortune. Brahma also, born from your navel's dirt, meditated and saw your divine auspicious idol in Samadhi. I was able to see that form with your eyes without any means. Your form was lying in the waters that day. The five elements, the eleven senses, the objects of sound, etc., and the souls are contained in your stomach. He was able to see you, the form of the cause that is contained within the assembly, through the meditation of that four-faced Brahma. You, who are the embodiment of such causes, created Brahma and others, increased their quality of passion, bestowed upon them the power to create, entered into them, and caused them to create. Being one who does not do any kind of business, you are the one who, with just resolve, has created, sustained, and destroyed the world. You are the one who is appointed to pervade and rule over all living beings, and you are the self-existent one without a designated agent. You are the one who can imagine. Is it impossible for you, who keep the entire universe in your womb, to lie on a tender banyan leaf, to drink with your thumb in your mouth, to be an unparalleled event, and to be in my womb? What is the reason for that? My fortune is to have taken on my body to destroy those who practice evil deeds, to love you and to protect those who obey your commands.
How you fulfilled the task of the incarnations like Varaha and others, today, being Kapila, you were born from my womb and bestowed the right path and the path of the soul upon the virtuous. By hearing your name, by praising you, by bowing to your feet, by remembering you, even those who have done vile deeds are made worthy. Can I tell you what the result of the Podi fruit is that I have seen? Even those with such vile culture, when your name is spoken on the tip of the tongue, will be greater than the wise. Many elders performed penance to have the fortune of remembering your name at the very end. They performed homams, bathed in the sacred water, and studied the Vedas. Without any such thing, even after being born in a wretched life, those who have attained fortune by remembering you, how blessed they are, isn't it? You are the one who is self-illuminating and the one who is worthy of being meditated upon as the inner self. You are superior to all in form and qualities, therefore Brahma calls you. The knowledge of beings who have attained wisdom Because you are the one who expands, you are called Brahma. By your light, the world formed by the gunas of Sattva, Rajas, and Tamas will be destroyed. Even though you are the inner self of the living being, your light will not diminish, it will not be hidden. You are the one who resides in the womb of all the Vedas, I declare that you are none other than the supreme being Vishnu himself, I salute you. Thus, the deity. Praising, the monkey, full of affection for his parents, spoke thus to his mother with a solemn voice. Mother, the path of devotion and yoga that I have told you is a path that can be practiced happily. By practicing it, you can attain the ultimate salvation. The yoga that I have been teaching has become very close to my heart. Have patience. The Brahmins carefully examined it. Having performed the rituals for it, you will obtain refuge and be saved, and you will attain me. Those who doubt, without believing that this is their religion, will attain worldly life. Thus, the Lord Kapila showed the path of knowledge to his mother, and taking her permission, he ascended to his abode. Devahuti also followed the path of yoga as told by her son Following, in the ashram located on the banks of the Saraswati river
She was devoted to her work. She, following the path of meditation and yoga, bathes three times, wears matted hair, wears cotton clothes, and performs severe penance, having a body that is emaciated. The Grihastha stage of life is also prayed by the gods through Tapasya Yoga. Devahuti conducted the Grihastha stage of life in an unparalleled manner. He is worried and distressed that his son has left him. She, while remaining in her household life, is performing penance today. In those days, the pleasures she experienced with Kardama Prajapati were extraordinary. White, soft, foam-like, milky white, with pannulu, instruments made of gold with teeth, golden seats, soft, comfortable seats, walls formed with pure crystals, in which Indranila gems are adorned for beauty. Around her hut, a garden, pairs of birds perching on the Kalpavriksha trees with fragrant trees, bees intoxicated by drinking nectar from flowers, In that garden, when she was wandering with Kardamuni, the kinnaras also sang They were doing it. Even after experiencing such pleasures, she did not develop affection for him. Her householder’s life was of supreme importance. Now the husband has gone to the forests, the son. Kapiludu also gave him knowledge and left after imparting knowledge. Therefore, unable to bear the separation from his son, even though he had complete knowledge of the truth, he remained as if his mind had been separated from a cow that had lost its calf. She was angry that Srihari was born to her as a son. He was meditating for a long time, and he was in the house, in pleasure, without attachment, for a long time. Thus, having been, Kapila, by the Bhakti Yoga preached, whatever form should be meditated upon, Kapila ordered, that form itself, meditating, without any separation, without seeking benefit, with devotion, with detachment, having worshiped the Lord. All the virtues and vices caused by her contact with the good qualities were removed. She has fixed her mind on the Lord, who is the basis for her. Even though she was with her body, the feeling of life in her was gone. She is not suffering from the duality of cold and heat.
Experiencing bliss through the supreme being. Daily, the mind is fixed on the Supreme Being, which is the soul, the body, and the self. The body, which is formed by the qualities of goodness, is the illusion of the soul, the illusion of thinking oneself independent, has been removed. The body does not remember the pleasures and pains associated with the body. The man who has not awakened, after waking up, considering the pleasures and sorrows caused by the things experienced in the dream, how he should not be overjoyed or depressed, the body, she said, is experienced with the body, and she said that it would be like a dream to him. She gave up trying to get food. Someone is eating what was planted. But it didn't work. The lack of a mental thought on how to nourish the body is the reason for her not working hard. Even though her body is impure without bathing or anointing, even though smoke surrounds it, as if a flame, the light does not diminish, her body is shining as if it is shining within. Her aura of penance was high, her bodily consciousness lost. She is always in the mind of God By contemplating and experiencing the divine, one attains bliss. Without bodily awareness, hair falls out, clothes slip, and one doesn't realize it. In this way, Kapila, having practiced and experienced the path of knowledge preached by him, attained the formless, blissful Lord. She performed such penance and attained success, and the place became famous and renowned in all three worlds. Since that place is the place where she attained salvation, that place came to be known as Siddhi Kshetram, Siddhashramam. Because she followed the path of yoga, her body did not wrinkle, and her hair did not turn gray. The morals are not violated. The body she left became the river Siddhida, which was served by the Siddhas in the middle of the water stream. The great yogi Kapila, taking his mother's permission, left his father's hermitage and went towards the northeast. The Lord was praised by the Siddha, the Gandharvas, and the Apsaras. The sea gave him his place in the world. The yogis who practice the Sankhya path told by Kapila, they worship and praise him.
For the peace of the three worlds, Kapila was in meditation. Thus, Maitreyi narrated the conversation between Kapila and Devahuti to Vidura. This is the most sacred, this is very mysterious. Whoever listens to or tells about this Kapila religion, such a human being, Garuda Dhwajudu, having attained devotion yoga in Sri Maha Vishnu, will reach the lotus feet of the Lord. With this, the third book concludes. After this we will step into the fourth book. Krishnarpanamastu. Jai Srimannarayana. Salutations to our Gurus