దేవహూతి శరణాగతి - కపిలుని దివ్య తత్వోపదేశ ఆరంభము
Devahuti's Refuge & Kapila's Instruction Launch
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, దేవహూతి తన దివ్యపుత్రుడైన భగవాన్ కపిలుని చరణాలకు శరణాగతి చేసి, మాయాబద్ధమైన తన అజ్ఞానమును అంగీకరిస్తూ మోక్షమార్గమును చూపవలసిందిగా వేడుకుంటుంది. ఆమె నిష్కపటమైన శరణాగతిని గుర్తించిన కపిల భగవానుడు కరుణతో సాంఖ్య తత్త్వశాస్త్రమనే పరమజ్ఞానమును బోధించుటకు సంసిద్ధుడవుతాడు. సద్గురువు పట్ల నిజమైన శరణాగతియే ఆత్మజ్ఞానమునకు మరియు మోక్షప్రాప్తికి ప్రథమ సోపానమని ఈ ఘట్టం హృద్యంగా నిరూపిస్తుంది.
In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, we witness the deeply moving moment when Devahuti humbly surrenders to her divine son, Lord Kapila, acknowledging her ignorance and praying for liberation from the bondage of material existence. Recognizing her sincerity and readiness, Lord Kapila compassionately agrees to impart the supreme wisdom of Sankhya philosophy, marking the glorious beginning of one of the Bhagavatham's most profound spiritual dialogues. This episode beautifully illustrates how genuine surrender to a realized teacher is the essential first step on the path of self-knowledge and ultimate freedom.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తే యజ్ఞ వీర్యాయ వయసే ఉతతే నమః నమస్తే హ్యాస్త చక్రాయ నమః సుపురుహూతయే దేవతలు ఇట్లు పలికిరి కాల స్వరూపుడవగు నీవే యజ్ఞ ఫలదాతవు శత్రువులపై చక్రమును ప్రయోగించే నీకు చక్కని నామములు చాలా కలవు. నీకు అనేక నమస్కారములు. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము. 37వ పాడ్కాస్ట్ లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా కపిలుడు దేవహుతికి అంటే తన తల్లికి. బోధిస్తున్నటువంటి కపిలగీతలో భాగంగా మనము ఒక నాలుగైదు ఎపిసోడ్లు మనం పాడ్కాస్ట్ పూర్తి చేసుకున్నాం. దేవహుతి అడుగుతుంది ప్రకృతితోనే కదా ఈ గుణాలన్నీ ఏర్పడుతున్నది మరి ఈ కర్మబంధాన్ని నుంచి ఎలా త్వరగా వస్తుంది మరి తనకి తత్వజ్ఞానం కలగటము, కరోబంధం తొలగటము ఎలా సంభవిస్తుంది అని చెప్పేసి అడుగుతున్నారు. దానికి కపిలుడు ఇచ్చేటువంటి సమాధానం ఏంటో ఈ పాడ్కాస్ట్ ద్వారా మనం తెలుసుకుందాం. అమ్మా, నీవు చెప్పినది సత్యమే, కానీ ప్రకృతి పూర్తిగా వీడుటకు మార్గము ఉన్నది. ఏ ఫలమును కోరక, ఫలమునందే ఆశ లేక, తన శరీరముతో చేయదగిన ధర్మమును నిర్మలమైన మనసుతో ఆచరించవలెను. అట్లు ఆచరించుటచే మనసును అంటిన మాలిన్యమును తొలుగును. పరిశుద్ధమైన మనసుతో భగవాని కథలను వినవలెను. వినుటచే మధ్యలో విచ్ఛేదము లేకుండా నన్నే ప్రేమతో స్మరించుట ఏర్పడును. అది ఏ భక్తి. అట్టి భక్తిచే. నా దర్శనము కలుగును. దానిచే ప్రకృతి సంబంధము ఆత్మకు వీడును. ఇట్టి భక్తి యోగమునకు మరికొన్ని అంగములు ఉన్నవి. ప్రకృతి యొక్క పురుషుని యొక్క యధార్థమైన స్వరూపమును శాస్త్రములచే గురు ఉపదేశముచే ఎరుంగవలెను. ఆ జ్ఞానముచే ప్రకృతి వికారములగు విషయ సంబంధమును విడవలెననియు ఆత్మ ఎరుంగదగినదనియు తెలిసి ఆత్మజ్ఞానము కలుగును.
ఆ జ్ఞానము చేతను, వైరాగ్యము చేతను సంతతము భగవానునే స్మరించగలిగిన ఏకాగ్రత ఏర్పడును. ఇట్లు ఏకాగ్రమగు మనసుతో భగవానుని ప్రేమతో స్మరించుచుండుటచే ఆత్మను అనాదిగా అంటిపెట్టి ఉండి బంధించి దహించుచున్న ప్రకృతి మెల్లగా వీడిపోవును. రెండు కర్రలు రాపాడుటచే అగ్ని పుట్టును. అగ్ని పుట్టుటకు సాధనము సాధనమగు ఆ కర్రను అరణి అందురు. అరణి నుండి పుట్టిన అగ్నిని ఆ అరణినే దహించును ఆ అగ్ని. తత్వజ్ఞానము అగ్ని వంటిది. ప్రకృతి అరణి వంటిది. మధించుటకు ముందు కర్రలోనే కనపడకుండా ఉండి మధించిన తర్వాత వెలికి వచ్చి ఎట్లు తాను పుట్టుకకు కారణమైన అరణినే దహించునో అట్లే తత్వజ్ఞానముచే కలిగిన తీవ్రమగు భక్తి ప్రకృతిని దహించివేయును. కర్మ భోగమును అనుభవించుటకు ఏర్పడినదే శరీరము. ఆ భోగమును అనుభవించి దాని యందలి దోషములను గుర్తించి ఆత్మ దానితో నాకు ప్రయోజనము లేదని వదిలిననాడు అతడు కర్మకు వశుడు కాడు. తన సహజమగు జ్ఞాన శక్త్యాది గుణములు కలవాడగును. అట్టి ఆత్మకు ప్రకృతి సంబంధమున్నను అది అనర్థమును కలిగించదు. నిద్రపోవువాడు కలలు కనును. ఆ కలలో శిరస్సు ఛేదించబడినట్లు ఎతటి నుండో పడినట్లు ఎన్నో బాధలు కలుగును వాని వలన దుఃఖమును అప్పుడు అనుభవించును అనుభవించిన నాడు ఏ జీవుడో ఆ జీవుడే ఆ శరీరముతోనే మేల్కొనినాడు. మేల్కొనిన తర్వాత అది అంతయు తనకు చెందినది కాదని వదులుటచే మరి దుఃఖమును కలిగింపదు. తత్వజ్ఞానమును కలవాడు నాయందే మనస్సును చేర్చి ప్రకృతి వికారమగు దేహము కంటే వేరగు ఆత్మ పరమాత్మలనే ధ్యానించుచు అనుభవించు వారికి ప్రకృతి బంధకము కాదు. ఈ విధంగా.
ఆత్మ స్వరూపమునందే మనసు నిలిపిన వాడై చాలా జన్మలకు జ్ఞానము కలిగి బ్రహ్మలోకం వరకు ఉండెడి అన్ని లోకములు ఒకనాడు నశించుననే అనుబి ఎరింగి వానిని అనుభవింపవలెనని కోరిక నశించి భగవానుని యందు నిరతిశయమగు ప్రీతి కలవాడగును. దానిచే నా అనుగ్రహమును పొంది నా చేతనే ధరింపబడి నియమింపబడువాడై ఇచటనే నన్ను మానసికముగా దర్శించును. తాను అనగా ఆత్మ భగవంతునిచే ధరింపబడి నియమింపబడునదని ప్రత్యక్షముగా ఎరింగిన వాడగును. దానిచే దేహమే నేను అనడి బుద్ధి తొలుగును. భక్తి యోగమునందు నిలకడ కలుగును. అందుచే ప్రారబ్ధ కర్మము అంతము కాగానే పొందవలసిన పరమ పదమును పొంది మరల వెనకకు రాకుండా ఉండును. భక్తి యోగము పరిపూర్ణముగా ఏర్పడిన పురుషునకు మనస్సు యోగముచే సాధింపదగు అణిమ మొదలగు సిద్దుల యందు అసక్తము కాదు. నా యందే మనస్సు వేరొక ప్రయోజనము కోరక ఎల్లప్పుడూ నిలుచును దానిచే నన్ను పొందును. దానిచే సంసారము తొలగిపోవును. ఇంతవరకు అంగములతో కూడిన భక్తి యోగముచే ఆరాధింపబడి భగవత్ అనుగ్రహముచే బ్రహ్మాత్మ్యగా గల ఆత్మ సాక్షాత్కారము ముందు. కలిగి పరమాత్మను పొంది ప్రకృతి సంబంధం విడిన వాడగునని చెప్పుచు ప్రత్యగాత్మానుసంధానము చేయు విధానమును అనగా జ్ఞాన యోగమును కూడా వివరించెను. ఇంకా భక్తి యోగమును దాని అంగములను విశదము చేయుచున్నాడు. అమ్మా, నీకు ఇంకా అంగములతో కూడిన భగవద్భక్తి యొక్క స్వరూపమును వివరముగా చెప్పెదను. భక్తి యోగము చేతనే మనస్సున రాగాది దోషములు వీడును. శుభమగు భగవత్ స్వరూపమునందు మనసు నిలుచును. ఇట్టి భక్తి యోగమునకు ముందుగా తన శక్తికి తగినట్లు తన వర్ణాశ్రమములకు తగిన ధర్మములను ఆచరింపవలెను. చేయరానివి అని శాస్త్రములు నిషేధించిన పనులను మానవలెను. దైవవశమున లభించిన దానితో సంతోషమును పొంది ఉండవలెను. శరీర సంపర్కము చేయ కలిగెడి సుఖముల యందు ధనమునందు కాంక్ష తగ్గవలెను. మోక్ష ధర్మముల యందు ఆసక్తి ఏర్పడవలెను. భక్తికి ప్రధానమైనది మనస్సు. మనస్సును పోషించునది మనము. తీసుకోనెడి ఆహారము. అందుచే ఆహారములో
నియమమును పాటించవలెను. నిమిత్తముచే దుష్టముగాని ఆహారమును తీసుకోవలెను. జాతి దుష్టములు వెల్లుల్లి మొదలగునవి, నిమిత్త దుష్టములు ఎంగిలి, పాచి, నఖములు, కేశములు పడినవి మొదలగు వానిని తినరాదు. దీని వలన రజస్తమస్తులు వృద్ధి పొందును. సత్వగుణమును వృద్ధి పొందించే ఆహారమును భగవన్ నివేదితమైన ఆహారమును మితముగా తీసుకునవలెను. ఒకరిని మాట చేయగాని, చేత చేయగాని, మనసులో గాని హింసింపకుండవలెను. ప్రాణి కోటికి మేలు కలిగింపని మాటలను పలకరాదు. తనకు చెందని వస్తువులను పొందవలెనని కోరరాదు. తనకు అవసరమైనంత వరకే ద్రవ్యములను సేకరించుకొనుచుండవలెను. బ్రహ్మచర్యముతో ఉండవలెను. భగవత్ స్వరూపమును రూపమును మనసున భావించి దానిని తలంచుట అలవాటు చేసుకొనవలెను. భగవానుని గూర్చియే తలంచుచుండవలెను. భోగములను తగ్గించుకొనవలెను. పవిత్రముగు నడవడి కలిగి ఉండవలెను. అధ్యయనము చేయవలెను. భగవత్ పూజ చేయవలెను. మెల్లమెల్లగా ప్రాణవాయువును వశపరచుకొనుటకు ప్రాణాయామమును అలవరుచుకొని ఇంద్రియములను మనస్సును విషయముల నుండి వెనుకకు మళ్ళించి ఉంచవలెను. హృదయము, కంఠము మొదలగు స్థానములలో ఒక స్థలమున ప్రాణమును మనస్సును ప్రాణములను మనస్సును నిలపవలెను. ఇట్లే ఒకే చోట కొంతసేపు ప్రాణము నిలుపుటయే ధారణము. భగవాన్ లీలలను సంతతము తలుచుండవలెను. మనస్సు ఏకాగ్రము చేయవలెను. ఈ విధమగు నియమములను పాలించుట చేతను వ్రతములు దానములు చేయుట చేతను విషయములపై పరిగెత్తెడి ఇంద్రియములను అనుసరించెడి దుష్ట మనస్సును వశపరుచుకొని భగవానుని యందు ఉండునట్లు చేయవలెను. ప్రాణవాయువును నిగ్రహించుకొనుట, పవిత్రముగ ప్రదేశమున స్థిరముగా చాలా కాలము కూర్చునుట అలవాటు చేసుకొనవలెను. అట్లు కూర్చుండుటచే శ్రమ కలగరాదు. దర్భలు, చర్మము, వస్త్రము వేసుకొని దానిపై స్వస్తికాసనమున గాని పద్మాసనమున గాని సుఖముగా కూర్చోండి ఉండవలెను. శరీరము తిన్నగా ఉండునట్లు నిలపవలెను. ప్రణవము ప్రణవమును అనగా ఓంకారమును అభ్యాసము చేయుచు ప్రాణవాయువు సంచరించని మార్గమును శోధించుకొనవలెను. ప్రాణము వశపడినచో మనసు కూడా వశపడును.
అగ్నిచే లోహము శుద్ధి చేయబడినట్లు ప్రాణాయామము చేత ధారణ చేత ప్రత్యాహారము చేత మనసున అంటిన దోషములు శుద్ధి చేసుకొనవలెను. భగవాను రూపమును మనస్సులో ఎడదిగక స్మరించుచు క్లేశము మొదలగు వానిని పోగొట్టుకొనవలెను. మనస్సును పరిశుద్ధమగు భగవత్ స్వరూపమునందు నిలుపుటయే ధారణము. మనస్సు ఎడతెగక దాని తలంచుట ధ్యానము. మనస్సు దాని యందే ఎడతెగక ఉన్నదని గుర్తింపబడకుండా అవిచ్ఛిన్నమగు దర్శనము సాగుట సమాధి. మనస్సు భగవత్ రూపమందు నిశ్చలముగా నిలుచునట్లు చేసి ముక్క చివర అనగా కనుబొమ్మల మధ్యవైపు చూపు సారించుచు భగవానుని దివ్య మంగళ విగ్రహమును చూచుచు తలచుండవలెను. యోగాభ్యాసముచే మనసు ఏకాగ్రమై శుభమగు ఆశ్రయమందు నిలిచినప్పుడు కనుబొమ్మల మధ్యవైపు చూపు నిలిపి ఉంచి భగవాన్ దివ్య మంగళ విగ్రహమును ధ్యానము చేయవలెను. ఆ రూపము ఇట్లు ఉండవలెనని భావించవలెను. ప్రసన్నమగు ముఖము ఎర్ర తామర పువ్వుల లోపలి రేకుల వలె ఎర్రనైన నేత్రములు నల్ల కలువ ఆకుల వలె నల్లని శరీరము. శంఖము, చక్రము, గద, పద్మము దాల్చి ఉన్నట్లు దర్శింపవలెను. తామర పువ్వులోని పుప్పడి వలె పచ్చని పీతాంబరమును ధరించినవాడు, వక్షస్థలమున శ్రీవత్సమనెడు పుట్టుమచ్చ కలవాడు, ప్రకాశిచున్న కౌస్తుభమణి కంఠసీమను అలంకరించుకొనినవాడు మకరంద పానముచే మదించిన తుమ్మెదలు స్వామి వక్షస్థలమందున్న వనమాలయందు వృధ చేయుచున్న రూపమును ధ్యానింపవలెను. చేతులకు కంకణములు, శిరస్సుపై కిరీటము, భుజములపై అంగదములు, పాదములకు నూపురములు ఉన్నట్లు భావించవలెను. మణిమయమగు మొలనూలు మొలయందు ప్రకాశించుచున్న వానిని చూడదగిన శాంతమైన రూపమును దర్శించవలెను. దానిని చూచుచు మనస్సు నేత్రములు ఆనందింపవలెను. సర్వలోకుల చేత నమస్కరింపబడు అతి సుందరమగు మూర్తిని దర్శించుచుండవలెను. చిన్న వయస్సునందు ఉన్న రూపమును దర్శించవలెను.
తన సేవకులను అనుగ్రహింపవలెనని ఆర్తితో ఉన్నట్లు ఆ నేత్రములను దర్శింపవలెను. కీర్తింపదగిన కీర్తి గలవాడు పుణ్యమగు కీర్తి గల బలి భీష్మాదులకు కూడా కీర్తి కలిగించువాడును అగు ఆ పరమ పురుషుని సర్వావయవమును ప్రేమతో మనసులో ధ్యానించుచుండవలెను. ఆ మూర్తి నిలిచి ఉన్నట్లు గాని, కూర్చున్నట్లు గాని, శయనించి ఉన్నట్లు గాని, తన హృదయంలో ఉన్నట్లు గాని భావించి ధ్యానించవలెను. అట్లు ధ్యానించినప్పుడు ఇతర భావము విషయములను గూర్చిన రాగాదులు కలగకూడదు. అట్లు రూపమును ధ్యానించిన ధ్యానించుచు మనసున. మనసు నిశ్చలముగా నిలిపి ఒక్కొక్క అవయవమునే స్థిరముగా ధ్యానములో నిలుపుచున్నట్లు భావించవలెను. ఈ ధ్యాన ప్రక్రియ ఎలా ఉంటుంది? ఏ క్రమంలో మనం ధ్యానం చేసుకోవాలో మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః Jai Srimannarayana
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the one who is born from the strength of Yagnya and the age. Salutations to the one who has a hand and a chakra. The gods spoke thus, 'You are the embodiment of time, you are the giver of the fruit of Yagnya, you are beautiful to you who wield the Chakra against the enemies.' There are many names. Many salutations to you. Oh, devotees of the Lord, the third book of the Srimad Bhagavata Tattva Deepika. Welcome to episode 37. As part of the Vidura Maitreyi conversation, Kapila said to Devahuti, that is, to his mother. As part of the Kapil Gita that is being taught, we have completed four or five episodes of the podcast. Devahuti is asking, isn't it, that all these qualities are being formed by nature, so how does one quickly come out of this bondage of karma? And how does one attain the knowledge of the self, and how does the bondage of karma be removed? That's what they are asking. Let's find out what Kapilu's answer is through this podcast. Mother, what you said is true, but there is a way for nature to completely recede. Without desiring any fruit, without any hope in the fruit, what can be done with one's body Dharma must be practiced with a pure heart. By practicing that, the impurity that has touched the mind will be removed. We should listen to the stories of God with a pure heart. By listening, without any interruption, remembering me with love will happen. What a devotion. Devotion. I will have a vision. It is the nature of that which is related to nature, the soul. This Bhakti Yoga has some more aspects. The true form of nature and the man should be understood by the scriptures and through the Guru's teachings. Knowing that one should abandon worldly matters related to the distortions of nature by that knowledge, and that the soul is knowable, leads to self-knowledge.
That knowledge, and through detachment, one can constantly remember the Lord. Such concentration is established. Thus, by constantly remembering the Lord with a focused mind and love, the nature that has been holding and burning the soul since time immemorial will slowly depart. Fire is produced by striking two sticks together. The fire is the means to be born, the means is the firewood. The fire that is born from the forest, that fire burns the forest itself. Philosophy is like fire. Nature is like a forest. Before grinding, it remains hidden in the stick, and after grinding, it comes out and burns the forest that is the cause of its birth. Similarly, the intense devotion born of knowledge of the essence burns the nature. The body is the instrument by which actions and experiences are carried out. Having experienced that pleasure, recognizing the faults in it, when he leaves it saying that he has no benefit from it, he is not subject to karma. He possesses the qualities of knowledge, power, and other natural abilities. Even though such a soul is related to nature, it does not cause misfortune. The sleeper's dreams. In that dream, the head From wherever it is cut off, from wherever it falls, many sufferings occur because of him, he experiences sorrow then. When he experiences it, that being wakes up with that body. After waking up, it does not cause sorrow by giving up that which is not entirely his. He who has the knowledge of the essence, fixing his mind on me, and contemplating and experiencing the soul and the Supreme Soul, which is different from the body, which is the distortion of nature, is not bound by nature. Like this.
He who has placed his mind in the form of the soul, having gained knowledge for many births, and all the worlds up to Brahmaloka, thinking that they will be destroyed one day, and the desire to experience him, and the immense love for the Lord Kalwadagunu. Having received my grace through him, being appointed by me, he will visibly visit me here. He is the one who directly knew that he is the soul, being ordained by God. By that, the intellect that says, 'I am the body' will be destroyed. Devotion is the key to success. Therefore, as soon as the end of the accumulated karma is reached, one attains the supreme state and does not return. For a person who is perfectly established in Bhakti Yoga, the mind is not attached to the siddhis like Anima, etc., which can be attained through yoga. My mind is always there, not seeking any other purpose, it always stands by me. By that, I mean that the household will be cleansed. Until now, the self-realization that is in Brahmattvam, which is worshiped by devotion yoga with limbs, by the grace of God, is the first. Having attained the Supreme Being, nature He explained the method of self-realization, that is, Jnana Yoga, by saying that it is the way to break the relationship. Furthermore, he is explaining the Bhakti Yoga and its aspects. Mother, I will explain to you in detail the form of devotion to God with your body. Through Bhakti Yoga, the defects of the mind, such as laziness, are removed. The mind is fixed in auspicious form of God. Before such devotion, one should practice the dharmas appropriate to their caste and stage of life, according to their capacity. Things that are forbidden by the scriptures are things that humans do. May we be filled with the joy of the gift of grace. The desire for pleasure and wealth should decrease in the pleasures that are attained through physical contact. There should be an interest in the Dharmas of Moksha. The mind is the primary locus of devotion. It is our nurturing of the mind. Food that is taken in. Therefore, in food
3. Respect the rules. For the occasion, one should not eat food that is bad. Caste-based evil things like garlic, etc., and cause-related evil things like rotten, stale, nails, hair, etc., should not be eaten. This will increase the Rajasthans. The food that enhances the quality of goodness should be taken in moderation. Do not oppress anyone in word, deed, or spirit. One should not speak words that do not benefit a crore of living beings. One should not ask for things that do not belong to one. One should collect money only as much as is needed. One must live a celibate life. One should cultivate the habit of contemplating the form and nature of the divine in one's mind. One should always remember God. Consumption of narcotics should be reduced. Purity of conduct is to be maintained. The study should be done. The worship of a god or goddess is called a Bhagavata. Slowly, to master the life force, one should practice pranayama, withdraw the senses and mind from worldly matters, and keep them back. Heart, throat, etc In the places, in one place, one should establish life, mind, and lives, mind. It is like this, to sustain life in one place for some time is concentration. One should constantly remember the Lord's divine plays. The mind must be concentrated. By following these prescribed rules, by performing vows and donations, and by subduing the evil mind that runs after worldly matters, one should be in the state of being in the Lord. Controlling the breath, sitting steadily in a sacred place for a long time, should be made a habit. Sitting like that, there is no strain. Having worn darbha grass, skin, and cloth, one should sit comfortably on either a swastika posture or a lotus posture. The body should be kept straight. Pranavamu, Pranavamunu, meaning Omkaramu, while practicing, one should investigate the path where the life air does not circulate. When the life force is controlled, the mind is also controlled.
Just as metal is purified by fire, similarly, through pranayama, through dharana, through pratyahara, the impurities attached to the mind should be purified. Remembering the form of God in your mind without forgetting, you should get rid of suffering and other things. The act of holding the mind in the pure form of the divine is called Dharanam. Meditation is the constant remembrance of the heart. The mind, without being recognized as being constantly in it, the uninterrupted vision continues, that is samadhi. Make the mind stand still in the form of God, and looking towards the end, that is, towards the middle of the eyebrows, and looking at the divine auspicious idol of God, one should be thinking. When the mind is focused and stable in auspicious refuge through the practice of yoga, one should meditate on the divine auspicious idol of the Lord, keeping the gaze fixed between the eyebrows. That form should be like this, it should be thought. A face that is pleasant, eyes that are as red as the inner petals of a red lotus flower, a body that is as black as the leaves of a black lotus. One should be able to see the conch, the discus, the mace, and the lotus. Green like the pollen of a lotus flower He who wears the yellow robe, with a mole on his chest, One who adorns the neck of the radiant Kaustubha gem should meditate on the form of the honeybees intoxicated by the nectar of the flower, which is on the garland of flowers on the chest of the Lord. One should imagine that there are bangles on the hands, a crown on the head, armlets on the shoulders, and anklets on the feet. One should see the peaceful form of the one who shines in the gem-like pearl, which is the beginning. The mind and eyes should rejoice in seeing it. One should behold the most beautiful idol, who is worshipped by all the worlds. One should see the form that is in childhood.
He should be seen with those eyes as if he is desiring to be blessed by his servants. One who is worthy of praise, one who has glorious fame, one who also brings glory to the virtuous like Bhishma, that Supreme Being should be meditated upon with love in the mind. One should meditate, thinking that the idol is standing, sitting, reclining, or in one's heart. When meditating like that, one should not have any feelings or emotions related to other thoughts or subjects. Thus, meditating on the form, meditating in the mind. The mind should be kept steady, and each limb should be fixed in meditation. How does the meditation process look like? We will find out in the podcast later in what order we should meditate. Asmad gurubhyo namah Jai Srimannarayana