విదురుని పరమార్థ ప్రశ్నలు - సృష్టి మూల విచారణ

Vidura's Spiritual Inquiries Into Cosmic Origin

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, మహాభక్తుడైన విదురుడు మైత్రేయ మహర్షిని సృష్టి యొక్క మూలాన్ని గురించి మరియు పరమాత్మ స్వరూపాన్ని గురించి గంభీరమైన ప్రశ్నలతో సమీపిస్తాడు. మైత్రేయుడు బ్రహ్మాండమైన సృష్టి విస్తరణ పరమేశ్వరుని సంకల్పం నుండి ఎలా ఆవిర్భవిస్తుందో అనే రహస్యమైన జ్ఞానాన్ని వివరించడం ప్రారంభిస్తాడు. వినమ్రుడైన శిష్యుడు జ్ఞానోదయం పొందిన గురువు నుండి ఉత్కృష్టమైన ఆధ్యాత్మిక సత్యాన్ని ఎలా గ్రహిస్తాడో ఈ శాశ్వతమైన సంవాదం ద్వారా మనకు స్పష్టమవుతుంది.

In this profound episode from Canto 3 of Srimad Bhagavatham, the great devotee Vidura approaches Maitreya Muni with deep and earnest questions about the origin of creation and the nature of the Supreme Lord. Maitreya begins to reveal the sacred knowledge of how the cosmic manifestation unfolds from the will of the Absolute, guiding Vidura — and all sincere seekers — toward ultimate liberation. Through this timeless dialogue, we witness how a humble and pure-hearted disciple draws out the highest spiritual wisdom from an illumined sage.

← Prev Next →
Vidura's Spiritual Inquiries Into Cosmic Origin bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో నమో నిరుద్ధాయ ఋషీకేశేంద్రియాత్మనే నమః పరమహంసాయ పూర్ణాయ నిభృతాత్మనే అనిరుద్ధునకు, ఇంద్రియ స్వరూపునకు, ఇంద్రియాధిపతికి, పరమహంసునకు, పరిపూర్ణకు, ఆనంద స్వరూపునకు నమస్కారం. ఫోర్త్ క్యాంటో 24th చాప్టర్ 36th శ్లోక 36th ప్రేయర్. భవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధం 10వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు గత కొన్ని పాడ్కాస్ట్ల నుండి విదుర మైత్రేయ సంవాదాన్ని మనం వినుకుంటూ వస్తున్నాం. దానిలో రెండు రకాల భాగవత పరంపర ఉందని ఆ భాగవత పరంపరలో సంకర్షణ రుతువుతో సనక సనానాదుల మధ్య జరిగినటువంటి భాగవతం యొక్క క్రమాన్ని వివరిస్తున్నారు. అయితే బ్రహ్మ ఉద్భవించిన తర్వాత నాలుగు వైపులా తను చూడడానికి నాలుగు ముఖాలు అందించాడు. అప్పటికి కూడా తను స్వరూపం ఏమిటి అని తెలవలేక అన్ని రకాల అన్ని వైపులా చూస్తూ తను ఏమి తెలియకుండా ఉండిపోతున్నాడు. ఆ తర్వాత భాగం ఏంటో చూద్దాం. ఈ తామర పువ్వు ఏదో ఒక దాని యందు ఆధారపడి ఉండవలెను కదా? ఈ పద్మమునకు అడుగున ఏది ఆధారముగా ఉన్నదో తెలుసుకొనవలెని ఆ తామర పువ్వు నాళములోని కన్నముల గుండా అతడు నీటిలోనికి ప్రవేశించెను. నాళము ద్వారా ఎంత క్రిందకు పోయినను దానికి అడుగు ఏదియు కనిపించలేదు. గాఢమగు అంధకారము ఏమియు కనపడకుండా ఆవరించి ఉండెను. ఆ చీకటిలో అతనికి వెయ్యి సంవత్సరములు గడిచెను. కాలమునకు త్రినేమి అని పేరు. ఆ కాలమే చక్రముగా సుదర్శనము అనేటి పేరుతో స్వామిచే ధరింపబడి యుండును. అది శరీరధారులకు భయమును గొలుపుచు ఆయువును అంతమొందించుచుండును. అతడు తానుండెడి పద్మమునకు ఆధారం ఎరంగవలెనని ప్రయత్నముతో ఎంత వెతికినను ఏమియు లభించలేదు. ఆ ప్రయత్నమును మారి మాని మరల తాను వెనక కూర్చున్న తామరపు దుద్దు పైకే వచ్చి చేరెను.

అచ్చట కూర్చొని తన ప్రాణవాయువును నిరోధించెను. సమాధిలో మనసు నిలిపెను. ఆ సమాధి ఒక నూరు సంవత్సరములు సాగెను. అప్పుడు ఆ బ్రహ్మకు జ్ఞానము కలిగెను. నీటిలో మునిగి దేనిని వెదగవలెన ప్రయత్నించినచో అది తన మనస్సులోనే దర్శనం ఉసంగెను. తాను కూర్చున్న తామర పువ్వు ఎవరిపై ఆధారపడి ఉన్నదో ఆ రూపం అతనికి గోచరమాయెను. తామర తూడు వలె తెల్లని పొడువైన శరీరము గల ఆదిశేషుడు ఆ పురుషునకు పాన్పుగా ఉండెను. ఆ శేషుని పడగలు అతనికి గొడుగు వలె పైన ఆవరించి ఉండగా అతను ఆ శేష శయ్యపై శయనించి ఉండెను. ఆ శేషుని పడగలపై ఉన్న రత్నములచే కాంతులు ప్రసరించి చీకట్లు తొలగింపబడుచుండెను. ఆయన దివ్య దేహము మరకద శిలామయమగు పర్వతం యొక్క సౌందర్యమును త్రోసి త్రోసి రాదెనుచుండెను. సంధ్యాకాలమందలి పచ్చదనము వ్యాపించిన మబ్బు వంటి పీతాంబరమును దాల్చి ఉండెను. స్వామి మెడలోని పుష్పమాలలు ఆ మరకత పర్వతమందలి రత్నముల వలె భుజములు, ఆ పర్వతమందు మొలిచిన వెదుళ్ళ వలె వృక్షములు, పాదముల వలె ఔషధుల వలె నక్షత్రముల వలె రత్నములు ప్రకాశించుచుండెరు. భక్తులైన వారు తమ తమ కోరికలను పొందుటకు వరుణాశ్రమాది ధర్మములతో అతనిని ఆరాధించుందురు. ఆ భగవానుని పాదపద్మములు కోరికలను ఈడేర్చగలిగినవై ఉండెను. ఉపాసకులకు అతడు ఆర్తిని హరించు మందహాసము గలవాడై ఉండెను. కుండలముచే అలంకరింపబడిన అధరము యొక్క కాంతిచే ఎర్రనై ఉన్న అందమైన నాసికతో కూడిన సుందరము కనుబొమ్మలతో కూడిన ముఖముతో తనను సేవింపవచ్చిన వారిని గౌరవించి పలకరించుచుండెను. ఆ భగవానుని నితంబ భాగమందు పువ్వులోని కింజలికము వలె పచ్చని వస్త్రములో మొలనూలు అలంకరింపబడి యుండెను. అమూల్యమగు శ్రీవత్సమనడి పుట్టుమచ్చచే వక్షస్థలము అలంకరింపబడి యుండెను. ఆ భగవానుని దివ్యముగు శరీరము చందన వృక్షము వలె సేవింపదగినదై ఉండెను. ఆయన బాహువులే అనంతములగు శాఖ వలె ఉండెను. కేయూరములు మొదలగు భూషణములు ఆ బాహువుల యందు పూల వలె పండ్ల వలె నిండి ఉండెను.

దాని మూలము అవ్యక్తమై యుండెను. ఆ అవ్యక్తమగు మూలము నుండి ఆ భవనముల నెడి భవనముల నెడి వృక్షములు బయలు వెడలెను. ఆ శేషుని శరీరము ఫణములతో శరీరమంతయు ఆవరింపబడి యుండెను. చందన వృక్షము సర్పములతో కూడి ఉన్నట్లు ఆ దేహం ఒప్పుచుండెను. ఆ భగవానుడే ఒక పర్వతం వలె ఉండెను. ఆ శరీరము చరాచరములకు స్థానమై ఉండెను. పర్వతమునందు చరాచరముగు జంతుజాలము ఉన్నట్లు భగవానుని దివ్య శరీరమందు కూడా చరాచరములు వశించి ఉండెను. పర్వతము సర్పములకు ఆశ్రయమై ఉన్నట్లే స్వామి శరీరము కూడా ఆదిశేషునకు ఆధారమై ఉండెను. పర్వతము జలములతో కూడి ఉన్నట్లు స్వామి శరీరము చుట్టూను జలము ఆవరించి ఉండెను. కిరీటములతో శిఖరములతో ప్రకాశించుచున్నట్లు ఉండెను. పర్వత గర్భమునందు రత్నములు ఆవిర్భవించినట్లు ఆ దివ్య దేహమునందు కౌస్తుభ రత్నము ప్రకాశించుచుండెను. ఆ దివ్య మంగళ విగ్రహమునందు వనమాల అనేటి మాల ప్రకాశించుచుండెను. వేదములే దానియందు తుమ్మెదల వలె ప్రకాశించుచుండెను. ఆ వనమాల స్వామి కీర్తి రూపమై ఉండెను. ఆ కీర్తిని గానము చేయు వేదములనేటి తుమ్మెదలు ఆ కీర్తి వనమాల యందు వ్యాపించి గుణములను అనుభవించి ధ్వని చేయుచుండెను. ఆ శరీరము సూర్యునిచే గాని చంద్రునిచే గాని వాయువుచే గాని, అగ్నిచే గాని వ్యాపింప శక్యము కానిదై ఉండెను. మూడు లోకములయందు రక్షణకై పోరు సరుపుచున్న సుదర్శనాది ఆయుధములచే ఎవ్వరును దగ్గరకు చేరే శక్యము కానిదై ఉండెను. ఇట్టి శ్రీహరి రూపమును బ్రహ్మ దర్శింపగానే లోకములను సృజించుటకు తగిన జ్ఞానం అతనికి కలిగెను. జగత్ సృష్టికర్తయగు ఆ భగవాను యొక్క నాభి అనడి సరస్సులో మలిచిన తామర పువ్వును ప్రళయకాల వాయువును అచట వ్యాపించి ఉన్న జలమును అతడు చూచెను. వేరొకటి ఏదియు కానరాలేదు. సృష్టి చేయవలెనని జ్ఞానము అతనికి కలిగెను. సృష్టి చేయుటకు అవశ్యము రజోగుణముతో కూడినవాడై గుర్తించుటకు వీలు గాని స్వరూపములు గల పురుషోత్తముని యందు మనసు నిలిపి జగత్కారణమగు భగవానుని ఇట్లు స్తోత్రము చేయనరంభించెను. ప్రప్రథమంగా బ్రహ్మ సృష్టి చేయడానికి ముందు చేసినటువంటి స్తోత్రం ఏమిటి? ఎలా తన స్తోత్రం చేశారో మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Salutations, salutations to Niruddhaya, to the one with the senses. Salutations to the complete self, to the one who is full of the enemy of the supreme ego, to the one with the senses, to the lord of the senses, to the supreme ego, to the complete, Salutations to the Divine Joy. Fourth Canto, 24th Chapter, 36th verse, 36th prayer. Dear relatives, welcome to the third episode of the Srimad Bhagavata Tattva Deepika, the 10th podcast. Until now, we have been listening to the conversation between Vidura and Maitreya from the last few podcasts. In that, there are two types of Bhagavata Parampara, and in that Bhagavata Parampara, they are explaining the order of the Bhagavatam that took place between Sanaka and Sananadu with the Sankarshana Ritu. However, after Brahma originated, he provided four faces to see from all four sides. Even then, not knowing what his true form was, he was looking in all directions, and he remained unaware of what was happening. Let's see what happens next. This lotus flower must depend on something, right? We need to find out what is the basis under this lotus He entered the water through the holes in the lotus flower's stem. No matter how far down it went through the tube, it could not see a bottom. A deep darkness was enveloping, preventing anything from being seen. In the darkness, a thousand years passed for him. The name of the time is called Trinemi. That time, as a chakra, with the name Sudarshanam, was worn by the Swami. It torments the embodied beings and destroys their lives. He searched in the lotus pond where he was, with the effort that it was the base, but he did not find anything. That attempt, changing, again he came and reached the lotus-like seat behind.

Sitting there, he blocked his breath. I have my mind in the grave. The tomb lasted for about a hundred years. Then the Brahma attained knowledge. If one tries to search for something while submerged in water, it appears in their mind. The form of the lotus flower on which he was sitting appeared before him. Like a lotus stem, with a white, long body, Adiseshu was a bed for that man. While Shesh's hoods covered him like an umbrella, he was lying on that Shesha bed. The light emanating from the jewels on Sheshu's wings was dispelling the darkness. His divine body was pushing away the beauty of the marble mountain. In the evening, she was wearing a yellow silk garment, like a cloud spread with greenery. The garlands around the Swami's neck, like the gems in that emerald mountain, are the shoulders; like the vines that sprouted on that mountain, are the trees; like the feet, are the medicines; like the stars, are the jewels shining. The devotees, their desires They worship him with Varunashrama and other dharmas. Those lotus feet of the Lord were capable of fulfilling all desires. He was a sorrowful smiling one to the worshippers. She was beautiful, with a face adorned with beautiful nostrils, a beautiful face with beautiful eyebrows, with a face adorned with beautiful eyebrows, and with a face adorned with beautiful eyebrows, she was honoring and greeting those who came to serve her. In the nimba part of that Bhagavan, like the bud in a flower, a sprout was adorned in a green cloth. The precious Sri Vatsa's birthmark adorned the chest. That divine body of the Lord was like a sandalwood tree that could be served. His arms were like branches of the infinite. The earrings and other ornaments were filled like flowers and fruits on those arms.

Its origin was hidden. From that invisible source, trees have emerged near those buildings, near those buildings. That Sheshu's body was covered with hoods all over. The body seemed to be like a sandalwood tree surrounded by snakes. The Lord was as big as a mountain. The body became the dwelling place for the celestials and the terrestrial beings. Just as there is a moving and non-moving fauna in the mountain, similarly, the moving and non-moving were also subdued in the divine body of the Lord. Just as the mountain is a shelter for the serpents, the body of the Lord was also the basis for Adiseshu. The mountain was surrounded by water, as if it were filled with water, around the body of the Lord. It was as if they were shining with crowns and scepters. As if jewels were manifested in the womb of the mountain, in that divine body, the Kaustubha jewel was shining. In that divine auspicious idol, a garland called Vanamala was shining. The Vedas themselves were shining like fireflies in it. That Vanamala was the form of the glorious Swami. Those bees of the Vedas that sing of that fame, spread in that garland of fame He was experiencing the qualities and making a sound. That body was not able to be spread by the sun or the moon or the air or the fire. In the three worlds, it was impossible for anyone to approach with the Sudarshana and other weapons that were wielding for protection. When Brahma saw this form of Sri Hari, he gained the knowledge necessary to create the worlds. He saw the lotus flower that was withered in the lake called Nadi, the navel of that God, the creator of the world, the cosmic wind, and the water that was spread there. Nothing else is visible. He had the wisdom to create. To create, it is necessary to recognize the one who is united with the quality of passion. Having fixed his mind on the Supreme Personality of Godhead, who has forms that are difficult to recognize, he began to praise the Lord of the universe. What is the hymn sung before Brahma created the universe? We will find out how he did his praise in the podcast later. Jai Srimannarayana, salutations to the Asmadgurus