వ్యాస విరాగము & నారద మహర్షి ఉపదేశము (Parts 5-9)

Vyasa's Despondency & Narada's Teachings (Parts 5-9)

bhagavatam

వేదాలు, పురాణాలు మరియు మహాభారతాన్ని రచించిన మహర్షి వ్యాసుడు, అయినప్పటికీ తన హృదయంలో ఒక లోటు భావనతో విరాగానికి లోనవుతాడు. సరిగ్గా ఆ సమయంలో దేవర్షి నారదుడు వచ్చి, శ్రీహరి యొక్క దివ్య మహిమలను సంపూర్ణంగా వర్ణించకపోవడమే వ్యాసుని అసంతృప్తికి కారణమని స్పష్టం చేస్తాడు. తన పూర్వజన్మ వృత్తాంతాన్ని వివరిస్తూ, బాల్యంలో మహాత్ముల సేవలో విన్న హరికథలే తనలో అచంచలమైన భక్తిని నాటాయని నారదుడు తెలియజేస్తాడు. నారద మహర్షి ఉపదేశంతో స్ఫూర్తి పొందిన వ్యాసుడు, శ్రీహరి లీలలను పూర్ణంగా వర్ణించే శ్రీమద్భాగవతాన్ని రచించాలని సంకల్పించుకుంటాడు.

Despite composing the Vedas, Puranas, and the Mahabharata, the great sage Vyasa finds himself gripped by a deep sense of incompleteness and spiritual restlessness. The divine sage Narada arrives at the right moment and reveals that Vyasa's dissatisfaction stems from his failure to fully glorify the Supreme Lord Sri Hari in all His splendor. Narada then recounts his own past life — how hearing the devotional teachings of great saints in his childhood sowed the seeds of unwavering bhakti within him. Inspired by Narada's compassionate guidance, Vyasa resolves to compose the Srimad Bhagavatam, a work dedicated entirely to the glories of the Lord.

← Prev Next →
Vyasa's Despondency & Narada's Teachings (Parts 5-9) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమః పంకజనాభాయ నమః పంకజమాలినీ నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంఘ్రయే భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం ఐదవ భాగం పాడ్కాస్ట్ లో స్వాగతం. రోమహర్షుని కుమారుడవు సూతుడు శౌనకాదులు అడిగిన ప్రశ్నకు సంతోషించి సమాధానం చెప్పుటకు ఉపక్రమించెను. ముందుగా తనకు భాగవతం వినిపించజేసిన శ్రీకృష్ణు సుఖునకు నమస్కరించుచున్నాడు. యం ప్రవ్రజంత మనుపేతమపేత్య కృత్యం ద్వైపాయనో విరహ కాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుహు తం సర్వభూత హృదయం మునిమానతోస్మి యస్వానుభావమహిల శ్రుతిసారమేకం అధ్యాత్మ దీపమదితి తీర్షతాం తమోధం సంసారిణాం కరుణయాహ పురాణ గుహ్యం తం వ్యాస సూను ఉపయామి గురుం మునీనాం नारायणं नमस्कृत्य नरञ्चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासम् ततो जयमुधीरयेत् సూతుడు ఈ పురాణమును మొట్టమొదట ప్రవర్తింపచేసిన మహోపకారమునకు కృతజ్ఞతగా శుకయోగిని నమస్కరించుచున్నాడు. శుకయోగి విరక్తుడై పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానమునందు పరిష్ఠుతగుటచే చేయదగినది కార్యమేదు లేనివాడై. తోడు ఎవరు లేకుంటూనే ఒంటరిగా తండ్రియగు వ్యాసమహర్షిని విడిచి వెడలిపోవుచుండగా వ్యాసుడు కుమారునెందు గల ప్రేమచే విడిచి ఉండలేక ఆర్తితో పుత్రా పుత్రా అని పిలువగా

అడవిలోనున్న వృక్షములన్నియు తన్మయులై సమాధానముగా ఓయ్ అని పలికినవట. శుకుడు పరినిష్పన్న బ్రహ్మోపాసన కలవాడుగుటచే ముక్తుల జ్ఞానమునకు ఆవరణము తొలగినట్లే అతనికి కర్మరూప ఆవరణము తొలగినది. అందుచే తనలో నారాయణుడు ఉన్నట్లే విషమంతటను వ్యాపించి ఉండటం దర్శించి ఆ వృక్షములలో ఉన్న జీవులలో తనలో సామ్యమును భావించి పైనున్న శరీరమును ప్రకృతి వికారముగుటచే ఏకరూపంగా భావించెను. అన్ని వృక్షములలోనూ నారాయణుని నారాయణునికి శేషభూతములై తనతో సమానముగా జ్ఞానాకారములగు ఆత్మలను దర్శించెను. వృక్షములలో సర్వత్ర తానే జ్ఞానము ద్వారా వ్యాపించి ఉండెను. అందుచేత సర్వభూత హృదయుడై ఉండెను. అప్పుడు వ్యాసుడు పిలిచిన పిలుపునకు ఆ వృక్షములు స్పందించి ఓయ్ అని బదులు పలికినవట. అట్టి స్మరణశీలుడవు శ్రీ శుకయోగిని నమస్కరించుచున్నాను. శ్రీ శుకుడు తాను సకల స్తుతి సారమును అనుభవించినాడు. ఆ వేదములలో ప్రధాన ప్రతిపాద్యుడగు ఉత్తమ పురుషుడగు ఆ పరమ పురుషుని ఆరాధన రూపములుగా కర్మలను ఎరింగినాడు. సకల శ్రుతి సారము శ్రీ భాగవతము ఎరింగి అనుభవించినాడు. శ్రీమద్ భాగవతము ఆత్మ పరమాత్మ యధార్త స్వరూపం ప్రకాశింపజేయుటలో దీపం వంటిది. అజ్ఞానమును గాఢాంధకారమును తొలగించి ప్రకాశమును వసుంగునది శ్రీమద్భాగవతం. అట్టి భాగవత పురాణము అత్యంత రహస్యమగు భగవత్ స్వరూపను ప్రవచించిన భాగవతమును సంసారుల యందు తనకు గల దయచే వ్యాసపుత్రుడు మునులకు గురువగు ఏ శుకయోగి చెప్పినాడో అట్టి శ్రీ శుకయోగికి నమస్కరించుచున్నాను. ఈ పురాణమును చెప్పుటకు ముందు నారాయణునకు బద్రికాశ్రమమున భగవతవతార భూతుడై నారాయణుని నుండి అష్టాక్షరి మంత్రమును శిష్యులుగా పొందిన నరునకు నమస్కరించవలెను. ఈ లోకంలో శిష్యాచార్య పరంపరకు మొదటి వారు నరనారాయణులు. వారు ఉపదేశించిన నారాయణ తత్వమే పురాణములో విస్తరింపబడినది.

ఆ నారాయణుడు నరుని ద్వారా నరణ మంత్రమును ఉపదేశించుటయే కాక బ్రహ్మ ద్వారా నారదాదులకు భాగవతను ఉపదేశింపచేసి పురాణ వాంగ్మయమును ప్రవర్తింపచేసినాడు. కనుక నరనారాయణులకు బ్రహ్మకు నమస్కారం చేయవలెను. అధిష్టాన దేవతగా ఉండి నారదాదులకు ఉపదేశింప ప్రేరణ నొసంగిన సరస్వతీ దేవికి నమస్కారం చేయవలెను. భగవానుడిని పొందిన చతుష్లోకి భాగవతమును నారదుడు నుండి ఎరింగి వ్యాసుడు 18000 శ్లోకములు గల శ్రీమద్భాగవతమును రచించినాడు. కనుక వ్యాసుని నమస్కరించవలెను. అప్పుడు జయమును అనగా శ్రీమద్భాగవతమును చెప్పవలెను. శ్రీమద్భాగవతమునకు జయమని పేరు. సమస్త పాపమును జయించుటకు సాయపడము కనుక ఈ పురాణమునకు జయమని పేరు సార్ధకం. వ్యాసుల వారు ప్రవచించిన 18 పురాణములకు జయము అని సంగ్రహ నాము. సంస్కృతములో అక్షరములతో అంకెలను చెప్పుట పరిపాటి. క మొదలు తొమ్మిది, త మొదలు తొమ్మిది, ప మొదలు ఐదు, య మొదలు ఎనిమిది అక్షరములను వాని స్థానములను బట్టి అంకెలుగా చెప్పుదురు. జ అనునది క మొదలు ఎనిమిదవ అక్షరం. య అనునది. యా మొదలు ఎనిమిదింటిలో ఒకటి. ఎనిమిది ఒకటి వేసి అంకానాం వామతో గతిహి అను సంస్కృత పద్ధతిని అనుసరించి. ఎడమ నుంచి కుడికి లెక్కించిన ఎనిమిది ఒకటి తిరగవేసిన పదినెనిమిది అగును కావున పురాణములు పదినెనిమిది. అందుచే పురాణములన్నిటికీ జయ అని పేరు. వానిని చెప్పునప్పుడు ముందు నారాయణునకు, నరునకు, బ్రహ్మదేవునికి, సరస్వతికి, వ్యాసునకు నమస్కరించి చెప్పవలెను అని నియమం. సూతుడు ఆ నియమను అనుసరించి సంస్కారం మనరించి మునులకు చెప్పుటకు ప్రారంభించినాడు. మునులారా చాలా బాగుగా ప్రశ్నించినారు. మీరు ప్రశ్న లోకములకు మంగళమును కలిగించునది. శ్రీకృష్ణు గురించి ప్రశ్నించినారు. ఆ కృష్ణుడు నిర్దిశయ మంగళ స్వరూపుడు. కృష్ణుని మనసులో తలచించినా లేదా చెప్పినా వినినా మనసు సుప్రసన్నమగును.

మనసున ప్రసన్నత కలుగుటయే మంగళకరం. మీరు ఏది పురుషులకు నిశ్చయముగా అత్యంత శ్రేయప్రదమో దానిని పొందడి నావమేమో తెలిసిన కోరి ప్రశ్నించినారు. గర్భ, జన్మ, జరామరణాది అనర్థములు కూడికయే సంసారం. అది తొలగి నిరతిశయ ఆనంద స్వరూపుడగు భగవానుడు చేరి అనుభవించుటయే మోక్షము. అదే నిరతిశయ శ్రేయస్సు. దానికి సాధనము ధర్మము పరమాత్మ ఉపాసనం అనగా భక్తి. అది కలుగుటకు ఫలమును కోరక కర్తవ్యముగా భావించి వర్ణాసన ధర్మములను ఆచరించి దానిచే ఆత్మ స్వరూపము నిరంగి శమదమాదులు కలిగి సత్సంగతియన్ను అందు రుచిని లభించవలెను. దానిచే ఏ ఫలము కోరక మధ్యం మధ్యలో విచ్ఛేదము లేక భగవంతుని ప్రీతితో ఎడతేయక స్మరించినట్టి భక్తి కలుగును. అందుచే భక్తి సాధనము భక్తికి సాధనముగు ధర్మమే పరమ ధర్మము. దానిచే మనసు సుప్రసన్నమగును. జ్ఞాన, భక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులు అనేటి ఆరు గుణములు పూర్ణముగా గల భగవానుడగు వాసుదేవుని యందు నిరదిశయ ప్రీతితో ఎడతెగగా స్మరణ సాగించినచో అది వైరాగ్యమును కలిగించును. లౌకిక విషయముల కంటే విలక్షణమగు భగవంతునందు ప్రీతి కలుగుటచే ఇతర విషయములందు ప్రీతి తగ్గును. ఎడతెగక భగవానుని స్మరించురచే భగవత్ సాక్షాత్కారము కలుగును. శరీరధారియగు ప్రాణి కర్మ చేయుట తప్పదు. మానవుడై జన్మించిన వాడు ధర్మమును ఆచరించక తప్పదు. ఆ ధర్మాచరణము భగవత్ కథలెందు రుచిని కలిగింపవలెను. అట్లు భగవత్ కథలెందు రుచిని కలిగింపని ధర్మాచరణము శారీరకంగా శ్రమయే గానీ నిరర్ధకం. ధర్మాచరణము మోక్షమును సాధనము కావలెను. మోక్ష సాధనము కానినాడు ధర్మము అర్థమును అనగా ధనమును సంపాదించుటకు ఉపయోగపడును. ధనము ధర్మమునకు ఫలము కాదు. మోక్షమునందు ప్రవర్తింపచేయక ధన సంపాదనమునకు ఉపయోగించిన ధనము పురుషార్ధము కాదు. ధనమును ఆర్జించినందుకు ప్రయోజనం ఆ ధనము తే ధర్మమును ఆచరించుటయే గానీ ఆ ధనము చే కోరికలను నెరవేర్చుకొనుట కాదు. అన్నపానాదులను ఆర్జించుటకే ధనమైనచో అర్థము పురుషార్థము కాదు. అన్నపానాదులను సాధించి ఇంద్రియములకు తృప్తిని కలిగించుకొనుట. కామ పురుషార్ధమునకు సాధనము కాదు. శరీరమును ధర్మాసనం నిలుపుకొనుటకే అన్నపానాదులను స్వీకరింపవలెను కానీ ఇంద్రియ తృప్తి కొరకు కాదు. అన్నపానాదులను ఆర్జించి శరీరం నిలుపుకొనుట మరల ధర్మమును ఆర్జించుటకు కాదు.

శరీరము నిలుపుకొని దానిచే తత్వ విచారము చేయుటకు అట్లు ఉపయోగించని వాడు అన్నపానాదులచే శరీరము నిలుపుకొని జీవించుట వ్యర్థము. అందుచే మానవుడు శరీరంతో ఆచరించి ధర్మమును ఆచరించి తత్వజ్ఞానమును సంపాదించుటకే జీవించవలెను కానీ ధనమును ధనమును ఆర్జించి అన్నపానాదులను సంపాదించుకొని ఇంద్రియ తృప్తితో సుఖముగా జీవించుటకు మాత్రము కాదు. దీని తర్వాత భాగాన్ని మనం నెక్స్ట్ పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శివనారాయణ అస్మద్గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Asmadgurus, salutations, salutations to Pankajanabha, salutations to Pankajamalini, salutations to Pankajanetraya, salutations to Pankajangrahe. Devotees of Srimad Bhagavata, welcome to the first part, fifth part of the Padcast of Srimad Bhagavata Tatva Deepika. Suta, the son of Romaharshana, began to answer the question asked by Shaunaka and others, being pleased. First, Srikrishna, who had narrated the Bhagavatam to him, is paying his respects to Sukha. Those who are born, those who are not born, those who are born, those who are not born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born, those who are born The ancient secret, Vyasa, I invoke the Guru, the sage Narayana, saluting the best of men, the best of women, the goddess Saraswati, Vyasa, then victory to the ocean, the sage. This Purana, for the great service it first initiated, as gratitude, Shukayogini He is greeting. Shukayogi, being detached, being established in complete Brahma knowledge, being without any work to do. Who is there to accompany, alone While leaving his father, Vyasa, Vyasa, unable to bear the separation from his son, called out with longing, "Son, son!"

It is said that all the trees in the forest, being absorbed, spoke 'Oye' in peace. Because he is one who has attained the state of Brahman, just as the covering of knowledge of liberation is removed, so too is the covering of karma removed for him. Therefore, seeing that Narayana was in him, spreading throughout the poison, and considering the similarity in the beings in those trees to himself, he considered the body above to be of one form because of the nature of nature. In all the trees, Narayana, being the Shesha Bhuta (the serpent of the Lord), along with himself, saw the souls in the form of knowledge. In the trees, he was everywhere, pervading through knowledge. Therefore, he was the heart of all beings. Then, to the call made by Vyasa, those trees responded and replied, 'Hey'. I am paying my respects to that virtuous woman, Sri Sukayogi. Sri Sukudu has experienced all the essence of praise. In those Vedas, he has described the actions as forms of worship to that supreme being, who is the chief performer and the best man. Sri Bhagavatam, the essence of all Vedas, was experienced by Eringi. Srimad Bhagavatam Atma The Supreme Being is like a lamp in illuminating the form of the manifest. The Srimad Bhagavatam is that which removes ignorance and darkness and illuminates. Such is the Bhagavata Purana, which propounds the most secret form of the Lord. I bow to that Shri Sukayogi, who, as the son of Vyasa, taught the sages, and who, among the worldly, has compassion for himself. Before narrating this Purana, one should salute Narayana, who is the incarnation of God in Badrikashrama, and who received the Ashtakshari mantra from Narayana as disciples. Narayana is the first of the lineage of disciples in this world. The Narayana Tattva that they preached is elaborated in the Puranas.

That Narayana, not only by means of man, taught the Narana mantra, but also by Brahma, made Narada and others teach the Bhagavata and made the Puranas and Vangmayas prevalent. Therefore, one should offer salutations to Brahma and Narayana. Salutations to Goddess Saraswati, who is the presiding deity and inspires Narada to impart teachings. Narada composed the Bhagavatam, a four-legged animal, and the Srimad Bhagavatam, which contains 18,000 verses, from Vyasa. Therefore, one should bow down to Vyasa. Then, Jayamunu, that is, Srimad Bhagavatam should be told. Srimad Bhagavatam is known as Jaya. Therefore, this Purana is called Jaya, as it helps to conquer all sins. The 18 Puranas propounded by Vyasa are collectively known as Jayam. It is customary to express numbers using letters in Sanskrit. Ka, starting with nine, Ta, starting with nine, Pa, starting with five, Ya, starting with eight, these letters are called numbers based on their places. Ja is the eighth letter of the Gujarati alphabet. Ya Anunnadi. Yes, one of the eight in the beginning. Eight one is the number Vamato Gathihi following the Sanskrit method. Counting from left to right, eight plus one equals nine, so the Puranas are nine. Therefore, all the Puranas are called Jaya. When mentioning him, it is a rule that one should first offer salutations to Narayana, Naru, Brahmadeva, Saraswati, and Vyasa. The sage, following the rules, began to tell the sages about the culture. You have asked a great question. You are the one who brings blessings to the world of questions. They asked about Lord Krishna. Krishna is the embodiment of Nirvichara (absolute) aesthetic. If one thinks of Krishna in one's mind, or if one speaks or hears about him, one's mind becomes happy.

A pleasant heart is auspicious. You asked what is definitely the most beneficial for men, and what I am, knowing that, you questioned. The union of the sufferings of pregnancy, birth, old age, and death is called worldly life. That is the removal of the obstacles, and the experience of the Lord, who is the embodiment of unconditional bliss, is liberation. That is the endurance. Its means, dharma, the worship of the Supreme Soul, that is devotion. To attain that, without desiring the fruits, considering it as a duty, practicing the virtues of Varna and Ashrama, and by that, having the form of the self, having self-control, having self-control, one should attain the taste of Satsangati. Without desiring any fruit from it, without cutting it in the middle, without seeking it with the pleasure of God, one attains devotion by remembering it. Therefore, the means of devotion, the means to devotion, is the ultimate dharma. It brings peace of mind. Knowledge, devotion, strength, wealth, vigor, and radiance, these six qualities, with complete devotion to Lord Vasudeva, if one constantly remembers, it will cause detachment. More than worldly matters, having love for God, other Affection for objects can be a hobby. By constantly remembering the Lord, one attains the Lord's realization. The embodied being is bound by karmic cycles. A human being is bound to practice dharma. That conduct of righteousness, the stories of God, should be pleasing. Thus, the practice of dharma, which does not give taste to the stories of the Lord, is physically laborious but meaningless. The practice of dharma is the means to the end of liberation. When the means of liberation are not available, dharma and artha (wealth) are useful for earning. Money is not the source of all good. The wealth used for earning money, without acting in the path of liberation, is not purushartha. The benefit of earning wealth is to practice righteousness with that wealth, not to fulfill desires with that wealth. If wealth is the only means to acquire food and drink, then it is not dharma or purushartha. Achieving satisfaction of the senses by fulfilling the needs of food and drink. Sexual intercourse is not the only means to achieve the purpose of sexual intercourse. The body should be kept in a state of meditation, and only food and drink should be accepted, not for the sake of sensory gratification. The body obtains food and drink Retention is not for earning merit again.

It is useless for one who does not use it to sustain the body and contemplate the essence through it to live by sustaining the body with food and drink. Therefore, a human being should live to practice dharma with the body, practice dharma, and acquire knowledge of the truth, but not merely to acquire wealth, acquire food and drink, and live happily with sensory gratification. We will learn about the next part in the next podcast. Jai Shivanarayana Asmatgurubhyo Namaha