నారద మహర్షి దివ్య ఆగమనం - సంభాషణ
Arrival of Narada Muni & Spiritual Consultation
ఈ శ్రీమద్భాగవతం పాడ్‌కాస్ట్ ఎపిసోడ్‌లో, మహర్షి వ్యాసుని ఆశ్రమానికి నారద మహర్షి దివ్యంగా విచ్చేయడం మరియు అది మొదటి స్కంధంలో ఒక కీలకమైన సంఘటనగా ఎలా నిలుస్తుందో వివరించడం జరుగుతుంది. వేదాలు, పురాణాలు మొదలైన ఎన్నో గ్రంథాలను రచించిన వ్యాసమహర్షికి అంతరంగంలో ఒక అసంపూర్ణత అనిపించడం, ఆ సమయంలో నారద మహర్షి ప్రత్యక్షమై అతనికి ఉన్నతమైన మార్గదర్శనం అందించడం ఈ ఘట్టంలో హృదయంగమంగా వర్ణించబడింది. శ్రీహరి భక్తిలో లీనమై, ఆయన మహిమలను కీర్తించే గ్రంథాన్ని రచించినప్పుడే నిజమైన ఆత్మతృప్తి కలుగుతుందని నారద మహర్షి వ్యాసునికి తెలియజేస్తారు.
In this episode of our Srimad Bhagavatham podcast, we explore the divine arrival of Narada Muni at the hermitage of Vyasadeva, marking a pivotal moment in the first canto. Vyasadeva, despite having composed numerous scriptures, feels an inexplicable sense of incompleteness, and Narada Muni's timely appearance offers profound spiritual guidance. With great wisdom, Narada reveals that true fulfillment comes only through undivided devotion to Lord Sri Hari, urging Vyasadeva to compose a work that glorifies the Supreme Lord above all else.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమో కించన విత్తాయ నివృత్త గుణవృత్తయే ఆత్మారామాయ శాంతాయ కైవల్య పతయే నమః భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తప్తదీపిక ప్రథమ స్కంధం ఆరవ పాడ్కాస్ట్ లో మీకు స్వాగతం. మనము తెలుసుకోవలసిన తత్వము బ్రహ్మము, పరమాత్మ, భగవానుడు అని మూడు విధములుగా వ్యవహరింపబడును. ఆ తత్వము జ్ఞాన స్వరూపం అనగా తనకు తానే ఎల్లప్పుడూ ఎరుంగజాలినది. జ్ఞానము అను గుణము కలది. అనగా సర్వమును పూర్ణముగా ఎరుంగగలది. దానితో సమానమైన వస్తువు గానీ అధికమైన వస్తువు గానీ రెండవది లేదు. అందుచే దానిని అద్వితీయమందురు. జాతి, గుణము, క్రియ, ద్రవ్యము మొదలగు వాటిచే కలిగెడి భేదములు గాని అవయవ భేదము గాని లేనిది. అన్నిటికంటే పరిపూర్ణముగా అధికమైన స్వరూపము గుణములు కలది కనుక బ్రహ్మము అందురు. జ్ఞాన సంకోచము కలిగి ఉన్న జీవులకు వికాసమును కలిగించునుది కనుక బ్రహ్మము అనబడును. బృహతీతి బ్రహ్మ. బ్రహ్మయతి ఇతి బ్రహ్మ అని బ్రహ్మ శబ్దమునకు రెండు వ్యుత్పత్తులు. స్వరూపముచే గుణములచే అన్నిటికంటే అతిశయించినది బ్రహ్మము. జ్ఞాన సంకోచము కలవానికి వికాసమును కలిగించునుది కనుక బ్రహ్మము. ఈ తత్వముని ఉపనిషత్తులు చెప్పును. ఇదే సర్వ జగత్ కారణము. ఇది సృష్టికి ముందుండును. తర్వాత సంకల్పముచే చేతన్యలగు జీవులను చేతన్యము లేని జడమగు ప్రకృతిని తనకంటే వేరుగా ప్రకటించి జీవుల కర్మానుగుణముగా ప్రకృతిని మలచి శరీరములను ఏర్పరచుటకు ముందు జీవుని ద్వారా ప్రకృతిలో ప్రవేశించును. అట్లు సకల చేతన అచేతనముల యందు వ్యాపించి ఉండునది కనుక ఆత్మ అందురు.
జీవుడు కూడా ఒక శరీరమందు వ్యాపించి ఉండగలుగును కానీ జ్ఞాన సంకోచముచే అంతట వ్యాపించి ఉండడు. కానీ పరమాత్మ నిత్యము అసంకుచితమైన జ్ఞానము కలవాడగుటచే అన్నిటియందు పూర్తిగా లోనా వెలుపల కూడా వ్యాపించి ఉండును. దానిని వ్యాపించి ఉండగల తత్వము వేరొకటి లేదు. కావున దాన్ని పరమాత్మ అందురు. ఈ తత్వము కళ్యాణ గుణములు కలది. ఏ దోషములు అంటనిది. అందుచే దానిని భగవాన్ అందురు. భగవాన్ అని భగవాన్ అని పదమును విభజించవలెను. జ్ఞానము, వీర్యము, శక్తి, బలము, ఐశ్వర్యము, తేజస్సు అను గుణములలో రెండు రెండు గుణములు భా గ వ అను మూడు అక్షరములకు అర్థము. అనగా ఆరు గుణములు కలవాడు. అన్ అనే అక్షరమును తలక్రిందులు చేసిన న్ ప్లస్ అ ఈక్వల్ టు న అగును. హేయ గుణములు లేనివాడు అని అర్థం. దోషములు అంటనివాడు, కళ్యాణ గుణములు కలవాడు అని భగవాన్ అను శబ్దం మనకు అర్థం. బ్రహ్మ పరమాత్మ భగవాన్ అను పదములచే తెలియజేయబడు తత్వము ఒక్కటే. జగత్తు యొక్క సృష్టి స్థితిలయములను చేయుచు మోక్షమును వసంగిడి తత్వము బ్రహ్మమందురు. ఆ తత్వమే జీవులలో ప్రవేశించి నియమించునది అని తెలియచేయుటకు పరమాత్మ అని వ్యవహరింతురు. కళ్యాణ గుణములు కలది హేయ గుణములు లేనిది అని భగవాన్ అను పదము తెలియజేయును. ఈ మూడు పదములచే తెలియజేయబడు తత్వము ఒక్కటే. అదే ఎరుంగదగినది. ఆ బ్రహ్మ తత్వమును శ్రద్ధ గల మునులు జ్ఞాన వైరాగ్యములతో కూడిన భక్తి చేతను శాస్త్రానుగ్రహీతమగు జ్ఞానము చేతను తమ ఆత్మలు అంతరాత్మగా ఉన్న భగవంతుని దర్శింతురు. ఋషులు వర్ణాసనం విభాగమును అనుసరించి ధర్మాచరణమును తప్పక చేయవలెను. కానీ ధర్మాచరణమునకు ఫలము భగవానునకు ప్రీతిని కలిగించుటయే. సకల పురుషార్థములలో శ్రేష్టమైనది భగవత్ ప్రీతియే. అట్టి భగవానుని గూర్చి ఏకాగ్రము మనస్సుతో ఎల్లప్పుడూ వినవలెను, కీర్తించవలెను. ప్రేమతో మనస్సులో స్మరించుటయే భక్తి.
ధర్మాచరణ నేర్పగలవారు ఆ ధర్మముచే భక్తిని పొంది తాము ఆచరించు కర్మలచే బంధింపబడకుండా వీడని ముడిని కత్తితో ఛేదించినట్లు కర్మ గ్రంథిని ఛేదించుకొందురు. కర్మ బంధనము తెగ కోసెడి కృష్ణ భక్తిని ఎవడు కోరకుండును? ధర్మము ఆచరించుచున్నను భవత్కథ లేని రుచి సాక్షాత్తుగా కలగదు. దానికి తోడుగా మహాపురుషుల సేవనము పుణ్యతీర్థ సేవనము చేయుచుండవలెను. పుణ్యముకు కృష్ణ కథా శ్రవణము సత్పురుషుల హృదయమునందు నిలచి భక్తి యోగం పుట్టుటకు ప్రతిబంధకములకు పాపములను తొలగించును. నిత్యము భగవద్భక్తులను సేవించుచు భగవద్గుణములను వినుచుండుటచే అమంగళములు నశించును. భగవానుని యందు దృఢమైన భక్తి కలుగును. భక్తి కలుగగానే మనసుకు చాంచల్యమును కలిగించెడి రజస్తమ గుణములచే కలిగెడి కామము, లోభము మొదలగు వికారము నశించును. వాటిచ్చే మనకు మనసు ఆక్రమింపబడక సత్వగుణము స్థిరముగా కలిగినదై ఉండును. ఈ విధముగా మనసు ప్రసన్నము కాగా భగవత్ భక్తి యోగము వలన భగవత్ స్వరూపం యొక్క సాక్షాత్కార రూపము జ్ఞానము కలుగును. అట్టి జ్ఞానమే పరభక్తికి ఫలము. తనలో సర్వ నియామకుడగు భగవానుడు మానసికంగా దర్శింపబడుచుండును. అప్పుడు భగవత్ ప్రాప్తికి ప్రతిబంధకములగు పూర్వాగములు. ఉత్తరాగములు అనగా అంతకుముందు నిలిచియున్న సంచిత పాపములు ముందు అనుభవింపదగినవైయుండు ఆగామి పాపములు నశించును. పాపములు నశించుటచే భగవత్ స్వరూప రూప గుణములయందు కలిగెడి అన్యధా జ్ఞానము, విపరీత జ్ఞానము, అజ్ఞానము అనువానిచే కలిగెడి సంశయములు దూరమగును. అట్టి సంశయములు ఉన్నంతవరకు హృదయమును పట్టి వదలకుండా పీటముడి వలె పెనవేసుకుయి ఉన్న అహంకార మమకారములు వదిలిపోవును. అందుచే నిరతిశమైన శ్రేయస్సును పొందెడి సాధనమును ఎరంగిన వారు ఆత్మ నైర్మల్యమును కలిగించు వాసుదేవుని యందు భక్తిని అలవరచుకొందురు. ప్రకృతికి సత్వము, రజస్సు, తమస్సు అనేటి మూడు గుణములు సహజముగా నుండును.
ఈ అచేతనముకు ప్రకృతి సృష్టికి ముందు సూక్ష్మ రూపములో నామరూప విభాగము లేనిదై జీవులతో పాటు పరమాత్మను చేరి యుండును. సృష్టించవలెనని సంకల్పము కలిగిన పరమాత్మ సృష్టికి అనుగుణమగు కాలము రాగానే రజోగుణము ప్రధానముగా గల బ్రహ్మ యను పేరు గల శరీరంలో ఉన్న జీవునిలో చేరియుండును. జగత్తును సృష్టించును. తమోగుణం ప్రధానముగా గల శరీరముతో ఉన్న హరుడు అనేటి జీవునిలో చేరి లయము చేయును. వారి మధ్యలో పరమ పురుషుడగు నారాయణుడై స్వయముగా జగత్తు యొక్క రక్షణకై విష్ణువు అని పేరుతో ఉండును. అందుచేత ఒకే పరమ పురుషుడు సృష్టి స్థితి లయములకై బ్రహ్మ, విష్ణు, శివ అను పేర్లను పొందుచున్నాడు. అందు విష్ణువు సత్వగుణం ప్రధానముగా గల శరీరము కలవాడవుటచే జ్ఞానమును వృద్ధి పొందుచును. అతడే సర్వ జగత్ కారణముగుటచే ఆయనను భజించిన వారులకు జ్ఞానము కలుగును. సంసారము వీడును. పరమధామము లభించును. మూడు గుణములు ప్రకృతికి చెందినవే అయినను సత్వగుణం ప్రధానముగా గల మూర్తిని ధ్యానించుట చేతనే జ్ఞానము మోక్షము లభించును. కాష్టములు పృథ్వి పరిణామములు. కాష్టము నుండియే అగ్నికి ముందు పొగ ఉత్పన్నమగును. తరువాత అగ్ని బయలుబడును. ధూమము ప్రకాశింపదు, ప్రకాశింపచేయదు. అగ్ని తాను ప్రకాశించును, ఇతరములను ప్రకాశింపచేయును. అది వేద స్వరూపమగుటచే స్వర్గము ప్రసాదించును. అందుచేత తమోగుణం ప్రధానముగా గల శరీరము కంటే రజోగుణం ప్రధానముగా గల శరీరము కంటే ప్రత్యేకమైన సత్వగుణమే ప్రధానముగా గల శ్రీ మహావిష్ణు స్వరూపమే మోక్షప్రదము. అందుచేతనే పూర్వకాలంలో మునులు రజస్తమో గుణముల సంబంధము లేని సత్వగుణమే ప్రధానముగా గల శరీరము గల భగవానుడగు అదోక్షజుని ఉపాసించిరి. ఎవరు అట్టి ఉపాసన చేయుదురో వారే శ్రేయస్సును అందగలవారగుదురు. మోక్షమందు ఇచ్చగలవారు సత్వగుణ ప్రధానులై అసూయ లేని వారై ఘోర రూపములు గల భూతపతులగు రుద్రాదులను
తమ ప్రధానులను విడిచి శుద్ధ సత్వమును ప్రవర్తింపజేయు నారాయణ రూపములనే భజించుచుందురు. తర్వాత భాగం మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to Kinchana Vittaya Nivrutta Gunavrittaye, Atmaramaya Shantaye, Kaivalya Pataye. Devotees of the Lord, welcome to the first Skandham of Srimad Bhagavata Taptadeepika, sixth podcast. The essence we need to know is Brahma, the Supreme Soul, and the Lord, as it is described in three ways. That principle is the form of knowledge, meaning that it is something that one cannot always understand oneself. It is the quality of knowledge. It means that it can fully understand everything. There is no other object or object of greater magnitude. Therefore, it is called unique. That which is not differentiated by caste, qualities, actions, substances, etc., or by differences in parts. Because it has the most perfect form and qualities of all, it is called Brahma. Because it causes development to beings who have a lack of knowledge, it is called Brahmam. Brihati is Brahma. Brahmaayati iti brahma, thus Brahma, the word Brahma has two etymologies. Brahman is the supreme, beyond all attributes, in terms of its own nature. For one who has a lack of knowledge Brahma is the one that causes development. This philosophy is what the Upanishads talk about. This is the cause of the entire universe. It existed before creation. Then, through determination, the beings who are conscious, declare the unconscious, inert nature as separate from themselves, and before shaping nature according to the karma of the beings, they enter nature through the being. Thus, the soul is pervading in all animate and inanimate beings.
Even a living being can be pervaded by a body, but due to the contraction of knowledge, it does not pervade everything. But the Supreme Being is eternally unbiased, having knowledge of everything, completely within and without. There is no other element that can spread it. Therefore, the Supreme Being is called that. This essence is full of auspicious qualities. It doesn't say anything about faults. Therefore, the Lord accepts it. The word Bhagavaan should be split into Bhagavaan. Knowledge, virility, strength, power, wealth, radiance, these qualities have two qualities each, meaning three letters have meaning. That is, one who has six virtues. The letter 'an' is inverted to 'n' plus 'a' equals 'na'. It means one without any vices. He who does not speak of faults, he who has auspicious qualities, that is the meaning of the word Bhagavan. The essence that is revealed by the words Brahma, Paramatma, and Bhagavan is one and the same. The creator, preserver, and destroyer of the universe, the essence of which is in Brahma. That principle itself enters and regulates the living beings They use the term Paramatma to refer to the Awakener. The Lord explains that it has auspicious qualities and is devoid of evil qualities. The essence that is revealed by these three words is one. That is the one worth emulating. Those who are devoted to the essence of Brahma, with knowledge and detachment, through devotion, through the knowledge bestowed by the scriptures, their souls, as inner selves, behold the Lord. The sages must follow the division of the Varna system and the practice of Dharma. But the fruit of righteous conduct is to bring joy to God. The best of all human endeavours is the love of God. One should always listen and praise such a God with a focused mind. Devotion is remembering with love in the heart.
Those who can teach the path of righteousness, having attained devotion through that righteousness, without being bound by the karmas they practice, they cut the knot of karmas as if severing a thorn with a knife. Who would seek Krishna devotion, having broken the bonds of karma? Even though one practices dharma, one cannot directly experience the taste of the story of the Lord. In addition to that, one should serve great men and perform the service of holy places. Listening to the Krishna story for merit removes obstacles and sins for the birth of devotion yoga in the hearts of virtuous people. By constantly serving devotees of God and listening to the virtues of God, inauspicious things will be destroyed. Devotion to the Lord is the source of strength. As devotion arises, the fickle nature of the mind, caused by the qualities of passion and passion, and the distortions like lust and greed are destroyed. When we are not distracted by what they give us, and when we are steadfast in our good qualities, then we will be content. In this way, when the mind is pleased, through Bhagavat Bhakti Yoga, the form of the divine, the form of realization, knowledge is attained. Such wisdom is the fruit of supreme devotion. He is the Lord who is the master of all It is being seen mentally. Then, the obstacles to the attainment of God. Uttaragamulu means the accumulated sins that have been accumulated before will be experienced first, and the future sins will be destroyed. By the destruction of sins, the doubt arising from other knowledge, erroneous knowledge, and ignorance that is attached to the form, qualities, and attributes of the divine being will be removed. As long as there are such doubts, without holding on to the heart, the ego and attachment that are clung to like a peg will be abandoned. Therefore, those who have attained the means to attain immense prosperity, cultivate devotion to Vasudeva, who bestows self-purity. Nature has three qualities: Sattva, Rajas, and Tamas. These three qualities are inherent.
This unconsciousness, before the creation of nature, in a subtle form, without the division of name and form, is united with the souls along with the Supreme Soul. The Supreme Soul, having the intention to create, as soon as the time corresponding to creation arrives, the one with the predominance of Rajoguna, named Brahma, joins the being in the body. Creator of the world. The one who is with a body dominated by tamoguna, Harudu, joins in the living being and dissolves. Among them, as the supreme being, Narayana, himself, exists in the name of Vishnu, for the protection of the world. Therefore, the one supreme being assumes the names Brahma, Vishnu, and Shiva for the creation, preservation, and destruction. Therefore, because you have a body with the quality of goodness, which is predominant in Vishnu, you will increase your knowledge. He is the cause of the entire universe, therefore those who worship him will attain knowledge. He will leave the family. The supreme abode is the goal. Though the three qualities belong to nature, it is only by meditating on the form that has the predominance of the quality of goodness that knowledge and liberation are attained. The Kashtamus and the Predominance of Earth. From the beginning, before the fire It produces smoke. Then the fire will be lit. Smoke doesn’t light, it doesn’t make light. Fire illuminates, and others are illuminated. That which is the form of the Vedas, by that heaven is granted. Therefore, the form of Sri Maha Vishnu, which is predominantly of Rajoguna, rather than the body, which is predominantly of Tamoguna, and which is predominantly of Sattvaguna, is the bestower of liberation. Therefore, in ancient times, the sages worshiped Adhokshaja, who was the Lord with a body possessing the quality of goodness, without any association with Rajas and Tamas. Those who worship such a deity will be able to attain prosperity. Those who can grant salvation are predominated by the quality of goodness, are without envy, and are the ghosts with terrible forms, Rudra and others
They worship the forms of Narayana, abandoning their chiefs and acting with pure essence. We will find out in the next episode. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.