గజేంద్ర మోక్ష ఘట్టము (Parts 1-3)
The Liberation of Gajendra (Parts 1-3)
శ్రీమద్భాగవతం అష్టమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, బలశాలియైన గజేంద్రుడు మొసలి పట్టు నుండి తప్పించుకొనలేక వేల సంవత్సరాలు పోరాడినా నిస్సహాయుడై శ్రీహరిని శరణు వేడుకుంటాడు. తన సమస్త అహంకారాన్ని వదిలి, గజేంద్రుడు పూర్ణ శరణాగతితో శ్రీమన్నారాయణుని స్తుతిస్తాడు, ఆ స్తోత్రం భక్తి సారాన్ని మూర్తీభవించేలా వెలువడుతుంది. భక్తుని శరణాగతికి కరిగిన శ్రీహరి తక్షణమే వేంచేసి గజేంద్రుని సంకటం నుండి విముక్తి కలిగించి, ఆయనకు మోక్షాన్ని ప్రసాదిస్తాడు.
In this deeply moving episode from Canto 8 of the Srimad Bhagavatham, we explore the timeless story of Gajendra, the mighty elephant king, who is seized by a powerful crocodile and rendered helpless despite all his strength. Unable to free himself after a thousand years of struggle, Gajendra surrenders completely to Lord Vishnu with a heartfelt prayer, recognizing that only the Supreme can deliver him from the cycle of suffering. Lord Vishnu, moved by His devotee's total surrender, rushes to his rescue and grants Gajendra the ultimate liberation, transforming this moment into one of the most celebrated examples of Sharanagati in all of scripture.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః హే మర్త్యాః పరమం హితం శృణుతవో వక్ష్యామి సంక్షేపతః సంసారార్ణవమాపదూర్మి బహుళం సమ్యక్ ప్రవిష్య స్థితాః నానా జ్ఞానమపాస్య చేతసి నమో నారాయణాయేత్యముం మంత్రం సప్రణవం ప్రణామ సహితం ప్రావర్తయధ్వంముహుహు ఉపాయములు కర్మజ్ఞాని భక్తి యోగములుగా పేర్కొనబడి ఎన్నియో ఉన్నవి కానీ అవి ప్రయాస సాధ్యములని సంక్షేపముగా ఒక ఉపాయమును ఉపదేశించుచున్నారు. ఆపదలన్నిటి కెరటముతో నిండిన సంసారమనెడి సముద్రములో చొచ్చి ఉన్న ఓ మర్త్యులారా వినుడు. మీకు సంగ్రహముగా ఒక ఉపాయమును చెప్పెదను. అనన్యమగు భక్తితో తదితర చింతనములు విడిచి మనసున నమో నారాయణాయ అను నీ మంత్రమును ఓంకార పురస్సరముగా జపించుడు. ముకుందమాల 19th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక అష్టమ స్కంధంలో స్వాగతం. అష్టమ స్కంధంలో మొదటి పాడ్కాస్ట్ మనం ఇంతవరకు ఆ భగవంతుని అనుగ్రహముతో ఏడు స్కంధములను పూర్తి చేసుకున్నాం. ఏడవ స్కంధంలో ప్రహ్లాద చరితాన్ని విశేషంగా మనం అనుభవించాం. వినగోరిన వారు ఎడస్కందంలో ఉన్నటువంటి పాడ్కాస్ట్ ని వినాలని ప్రార్థిస్తున్నాను. చక్కటి ప్రహ్లాదుని యొక్క ఉపదేశము నారదుడు యుధిష్ఠిర సంవాదంలో జరిగినటువంటి మంచి జ్ఞానోపదేశాలు కూడా అక్కడ ఉన్నాయి. ఇప్పుడు మనం ఎనిమిదవ
స్కందంలో అడుగు పెడుతున్నాం. ఇనిదో స్కందంలో పరీక్షిత్తు సుఖయోగింద్రుని వలన స్వాయంభవ మను యొక్క వంశమును విని ఇతర మన్వంతరముల యొక్క చరిత్రను ఆ మన్వంతరములలో మహానుభావుడగు హరి అవతారములను లీలను తెలపమని ప్రార్థించెను. అప్పుడు శుకుడు ఇటు చెబుతున్నాడు. ఈ కల్పములో స్వయంభువ మనువు మొదలు ఆరుగురు మనువుల కాలము గడిచినది. అందు మొదటివాడు స్వయంభువమనువు. అతనికి అకూతి, దేవహుతి అని ఇద్దరు కుమార్తెలు. అందు దేవహుతికి కపిలుడు అను పేరుతో భగవానుడు జన్మించినాడు. ఆ చరిత్ర ఇంతకుముందు వర్ణించబడినది. యజ్ఞుడు అను పేరుతో ఆమె యందే అవతరించిన శ్రీహరి యొక్క చరిత్రను వర్ణింతును. స్వయంభవ మనువు భార్యేగు శతరూపతో చాలా కాలము రాజ్యమును పాలించి విరక్తుడై భార్యతో తపస్సునకు ఏగెను. సునందా నది తీరమున తపస్సు చేసెను. తపస్సులో భగవానుని దర్శనము చేసెను. భగవాను గూర్చి ఉపనిషత్తులలో ప్రతిపాదించబడిన అర్థములతో నిండిన స్తోత్రము చేసెను. పరమాత్మ చేతని ఈ జగత్తంతయు ప్రవర్తించుచున్నది. పరమాత్మకు వేరొకటి వేరొకరి ప్రేరణచే ప్రవృత్తి కలగలేదు. అది సహజం. ఈ లోకమంతయు ఆత్మ స్వరూపమును పరమాత్మ స్వరూపమును ఎరుంగక. అజ్ఞానముచే నిద్రించుచున్నట్లుండగా ఆ పరమాత్మ సర్వమును సర్వజ్ఞుడై సాక్షాత్కరించుకొనును. కానీ లోకము పరమాత్మును ఎరుంగదు. సమస్త లోకమును వ్యాపించి నియమించు ఆ పరమాత్మ జగత్తులో చేతనము అచేతనముకు సకల వస్తు జాతమును అధిష్టించి ఉన్నాడు. అందుచే ఈ జగమున
ఏ వస్తువు కూడా బ్రహ్మాత్మకము కానిది అనగా లోపల వ్యాపించి నియమించి భగవత్ తత్వము లేనిది లేదు అని ఎరుంగవలెను. పరమాత్మ చేతనే ధరింపబడి నియమింపబడి ప్రవర్తించు ఈ జగమున మన శరీరములు శరీరమునకు ఉపయోగపడు ఇతర పదార్థములు కూడా. ఆ పరమాత్మకే చెందినవి గానీ మనకు చెందినవి కావు. కావున మనవిగా భావింపరాదు. ఈ లోకమున నాకు చెందినది అని భావింపదగిన వస్తువు ఏదీనూ లేదు. పరమాత్మ యొక్క జ్ఞానము ఎన్నడును సంకోచము పొందదు. నశింపదు. కర్మచే జీవుని జ్ఞానము సంకోచము నొందుచుండును. అందుచే పరమాత్మ అన్నిటినీ ఎరుంగగలడు. జీవుడు ఆ పరమాత్ముని ఎరుంగలేడు. అతడు జీవునితో కలిసి ఈ శరీరములో ఉండును. ఆ పరమాత్మయే సర్వ జగత్తునకు కారణం. అతనికి ఆది, మధ్యము, అంతము లేదు. తనవాడు, పైవాడు అను భేదము లేదు. అతడు ఈ సకల జగమున లోపల వెలుపల కూడా వ్యాపించి ఉన్నాడు. ఈ విశ్వమునకు అతడే మొదలు. పరమాత్మను గూర్చి ఈ క్రింది విషయములను తెలుసుకొనవలెను. విశ్వమంతయు తన శరీరముగా కలవాడు. దేవ మనుష్యాది శరీరములతో ఉన్న జీవుని తెలియచేయు సకల శబ్దములు ఆ పరమాత్మనే తెలియచేయును. సర్వావస్థలలో చేతనా చేతనములను నియమించెడు ఈశుడు వికారములు లేనివాడు. తనంత తాను ప్రకాశించువాడు. కర్మాధీనముకు జన్మము లేనివాడు చాలా కాలము నుండి ఉన్నవాడే అయినను మార్పు లేనివాడగుటచే క్రొత్తగా ఉండువాడు అనగా పురాణుడు. తన అంశయగు ప్రకృతిచే ఈ విశ్వమునకు జన్మాదులను కలిగించువాడు. ఏ కొరికయు లేనివాడు. తాను పొందవలసిన దేదియు లేకపోవుటచే దేనిని కోరనవసరము లేనివాడు. జీవుడు కర్మలచే సుఖమును పొందవలెనని. కర్మలు చేయుచున్నాడు కానీ కర్మానుసారముగా ప్రవృత్తిని కలిగించువాడు పరమాత్మయే. సుఖము కొరకై చేయు కర్మలచే దుఃఖములు కలుగుచుండుట చూచి జీవుడు కర్మలను చేయుటయందు కోరికలను వదలును.
భగవంతుడు కర్మానుగుణముగా జీవులచే ఆయా కర్మలను చేయించువాడైనను అతనికి కర్మలంటవు. జీవ కర్మానుగుణముగా ప్రేరణ చేయువానిని అహంకార రహితుని సర్వజ్ఞుని కోరిక లేని వానిని భక్తులను సరైన మార్గములో నడిపి తన సాయుధ్యమును ప్రసాదించు వానిని సకల ధర్మ పాలకుని శరణముగా సర్వముగా తలంచుచున్నాను. స్వయంభువ మనువు ఇంతవరకు చెప్పినది మంత్రోపనిషత్తు అనబడును. సంహితా భాగములోనున్న ఈశావాస్య ఉపనిషత్తు యొక్క సారమును స్వయంభువ మనువు ఈ విధముగా చెప్పినాడు. మంత్రోపనిషత్తు చెప్పుచున్న స్వయంభువ మనువును రాక్షసులు ఆకలిచే తినవలెని పైబడివి. ఆ అసురులను యజ్ఞుడు అనురూపమున అవతరించియున్న భగవానుడు తన పుత్రులతో కలిసి చంపెను. తానే ఇంద్రుడై స్వర్గమును పాలించెను. ప్రతి మన్వంతరమును మనువు, మనుపుత్రుడు, ఇంద్రుడు, ఋషులు, అంశావతారము, దేవతలు అను ఆరు విధములుగా ఉండి భగవానుడు లోక రక్షణము చేయుచుండును. మొదట మన్వంతరము స్వయంభువ మన్వంతరము. రెండవ మన్వంతరము స్వరోచిషము. స్వయంభువ మనువునకు ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అని ఇద్దరు కుమారులు. ప్రియవర్ధుని కుమారుడు ఉత్తముడు. మూడవ మన్వంతరమున మనువాయిని. నాలుగవ మన్వంతరము తామస మన్వంతం. ప్రియవ్రతుని కుమారుడు ఉత్తముని సోదరుడగు తామసుడు ఈ మన్వంతరమున మనువాయను. ప్రతి మన్వంతరమునకు భగవానుడు అవతరించుచుండును. ఈ నాలుగవ మన్వంతరమున హరిమేధసునకు హరిణి అను భార్య యందు హై అను పేరుతో భగవానుడు అవతరించెను. అతడే గజేంద్రుని రక్షించినవాడు సుఖయోగి పరీక్షిత్తు కొరకై సుఖయోగి పరీక్షిత్తు కోరికపై గజేంద్ర మోక్ష వృత్తాంతమును వివరించుచున్నారు.
గజేందుని యొక్క వృత్తాంతాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. ఇంతవరకు మనము అష్టమ స్కంధములో వివరణగా కొంత పరిచయం చేసుకున్నాం. మనువులు, మన్వాంతరాలు, ప్రకృతి, భగవంతుడు, మంత్ర మనుష్య యొక్క విషయాలని మిగతా భాగం గజేంద్ర మోక్ష వృత్తాంతం. మనము మరియు పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. O mortals, listen to the supreme good, I will explain it briefly. The ocean of worldly existence is destroyed by the multitude of various kinds of knowledge. O mind, I bow to Narayana. This is the mantra, with every breath, I bow Along with that, there are many methods mentioned as the knowledge of karma, devotion, and yoga, but they are all difficult to practice, and in brief, they are teaching one method. Oh mortals, listen, you who are in the ocean called family, which is full of the waves of all calamities. I will give you a summary of a trick. With unique devotion, abandoning other thoughts, chant the mantra 'Namo Narayanaya' in your mind, chanting it repeatedly with Omkara. Mukundamala 19th Prayer. Devotees of the Lord, welcome to the eighth canto of the Srimad Bhagavata Tattva Deepika. In the eighth Skandha, the first podcast, we have completed seven Skandhas so far with the grace of that God. In the seventh book, we experienced the story of Prahlada in detail. Those who are interested should listen to the podcast in Edaskandam I am praying. The excellent teachings of Prahlada, Narada, and Yudhishthira's conversation, the good teachings that took place, are also there. Now we are eighth
We're entering the Skandam. In this Skanda, Parikshit, having heard of the lineage of Swayambhuva Manu through Sukha Yogindra, requested that the history of other Manvantaras be told, and that the pastimes of Hari, the great one, who incarnated in those Manvantaras, be revealed. Then Shuka says this. In this kalpa, the time of the first six Manus, starting with Swayambhuva Manu, has passed. The first one is Swayambhuva Manuva. He had two daughters, Akuti and Devahuti. Therefore, the Lord was born as Kapila to Devahuti. That history has been described earlier. I will describe the history of Srihari, who incarnated in that place with the name Yagnudu. Swayambhava Manu, with his wife, Shatarupa, ruled the kingdom for a long time, became detached, and engaged in penance with his wife. Sunanda went to the bank of the river and started doing penance. Tapasvini saw the God. He sang a hymn filled with the meanings propounded in the Upanishads about the Lord. This entire world is functioning by the will of the Supreme Being. The Supreme Being is not influenced by another's action. That's natural. This Without knowing the form of the soul and the form of the Supreme Soul throughout the world. As if sleeping in ignorance, that Supreme Being, being omniscient, will realize everything. But the world does not know the Supreme Soul. That Supreme Being, who pervades the entire world and governs it, is present in the world, both conscious and unconscious, and is the source of all creation. Therefore, in this world
That which is not of the nature of Brahman, that is, pervading within and governing, is not without the essence of the divine, it should be understood. This world, which is governed and directed by the Supreme Soul, our bodies are useful to the body, and other substances too. They belong to the Supreme Being and not to us. Therefore, it should not be considered as ours. There is nothing in this world that I consider mine. The knowledge of the Supreme Being never diminishes. It does not perish. The knowledge of the living being through karma diminishes. Therefore, the Supreme Being can know everything. The individual soul cannot know the Supreme Soul. He is with the living being in this body. The Supreme Soul is the cause of all this. He has no beginning, no middle, and no end. There is no distinction between his being a man and a man. He is pervading all of this world, both inside and outside. He is the beginning of the universe. One should know the following things about the Supreme Being. He who is in his body is the universe. All the sounds that reveal the being with a body like a god, man, etc., reveal that Supreme Being. The Lord, who appoints the faculties of the intellect in all circumstances, is without blemish. Self-reliance. He who is without birth and dependent on karma, even though he has been there for a long time, because he is unchanging, he who is new is called Puranudu. He is the one who gives birth to this universe through his elemental nature. One with no stomach. He is one who has nothing to gain, so he does not need to ask for anything. The living being should attain happiness through karma. He is performing actions, but the Supreme Being is the one who causes the actions to be performed according to their nature. Seeing that sorrows arise from the actions done for the sake of happiness, the soul abandons desires in doing actions.
God, being the doer of karma, even though he makes the living beings do those karmas, he is not called karma. I consider as the one who inspires according to the nature of life, the one without ego, the all-knowing, the one without desire, the one who guides the devotees in the right path, and the one who grants his union. I consider as the protector of all righteousness, I consider everything. The Swayambhuva Manuva has thus far spoken, and is called the Mantro-Nishtha. Swayambhuva Manuva said this way the essence of the Ishavasya Upanishad, which is in the Samhita part. The Manvantara, as the Mantra Upanishad says, the demons, out of hunger, should eat the self-existent Manu. That Asura was killed by the Lord, who had incarnated in the form of a Yagnya, along with his sons. He himself became Indra and ruled the heaven. In every Manvantara, the Lord protects the world by being in six forms: Manu, Manu's son, Indra, sages, the incarnation of the part of Manu, and the gods. The first Manvantara is the Swayambhuva Manvantara. The second Manvantara is called Svargooshimu. Swayambhuva Manu had two sons, Priyavrata and Uttanapada. Priyavardhuni's son The best. In the third Manvantara, Manu's son. The fourth Manvantara is the Tamasic Manvantara. Priyavrata's son, Uttama's brother, Tamasu, will be Manu in this Manvantara. For every Manvantara, the Lord incarnates. In this fourth Manvantara, Lord appeared to Harimedhasuna with the name Hai, in the wife Harini. He is the one who saved Gajendra. For the sake of Sukha Yogi Parikshit, Sukha Yogi Parikshit is explaining the story of Gajendra's liberation.
We will learn about the story of Gajendra in the next podcast. Until now, we have made some introduction as an explanation in the eighth book. Humans, the end of the world, nature, God, mantra, the subject of humans, the rest of the part is the story of Gajendra Moksha. Let's find out in our podcast. Jai Shri Srimannarayana.