మూల చతుశ్లోకి భాగవత ఉపదేశము - పరమ రమ్య రహస్యము
The Core Four-Verse (Chatushloki) Srimad Bhagavatham
ఈ అద్భుతమైన ఎపిసోడ్‌లో, సమస్త శ్రీమద్భాగవతమునకు మూలాధారమైన చతుశ్లోకి భాగవతమును పరిశీలిస్తాము — ఇవి స్వయంగా శ్రీమహావిష్ణువు బ్రహ్మదేవునకు ఉపదేశించిన నాలుగు దివ్య శ్లోకములు. సృష్టికి పూర్వం పరమాత్మ స్వరూపము, మాయ యొక్క రహస్యము, మరియు సమస్త సృష్టికి ఆధారమైన పరమ సత్యము ఈ శ్లోకములలో సువ్యక్తంగా వివరింపబడినవి. ఈ పరమ రమ్యమైన జ్ఞానోపదేశము ద్వారా భగవానుడు బ్రహ్మకు — మరియు ఆయన ద్వారా సమస్త ముముక్షువులకు — మోక్షసాధనకు అవసరమైన ఉత్కృష్టమైన తత్త్వజ్ఞానమును అనుగ్రహించినాడు.
In this profound episode, we explore the Chatushloki Bhagavatham — the four essential verses that form the very heart and foundation of the entire Srimad Bhagavatham, spoken directly by Lord Vishnu to Brahma. These verses reveal the supreme mystery of the Absolute Truth, describing the nature of the Lord before creation, the illusion of Maya, and the ultimate reality that underlies all existence. Through these timeless teachings, Lord Vishnu bestows upon Brahma — and through him, upon all seekers — the highest wisdom necessary for liberation.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః సత్యం విశుద్ధం వసుదేవ శబ్దితం యదీయతే తత్ర కుమానపావృతః సత్వే చ తస్మిన్ భగవాన్ వాసుదేవః అధోక్షజోమే నమసా విధీయతే. విశుద్ధమైన సత్వము వసుదేవ నామముతో వ్యవహరించబడునది. అచటనే జగత్తునకు సంబంధము లేకుండగా పురుషుడు వేరుగా తెలియబడును. అట్టి సత్యమున వాసుదేవ భగవానుడు అధోక్షజుడు నాచే నమస్కరించబడుచున్నాడు. ఫోర్త్ క్యాంటో థర్డ్ చాప్టర్ 23rd ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక ద్వితీయ స్కంధం 14వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితము పాడ్కాస్ట్ లో పరీక్షిత్తు శుకమహర్షిని మన వైపు నుంచి మనం తెలుసుకోవలసిన విషయాలన్నీ కూడా ప్రశ్న రూపకంలో అడిగారు. దానికి శుకుడు ఇచ్చేటువంటి జవాబును మనం తెలుసుకుందాం. భగవానుడు జ్ఞాన స్వరూపుడు. అతనికి ప్రకృతి సంబంధము లేదు. మాయ అతనిచే నియమింపబడున్నది. జీవునకు శబ్దాది విషయములను అనుభవింపజాలిన శరీర సంబంధము పరమాత్మచే నియమింపబడు మాయ లేనిదే జరగదు. స్వప్నములో ఒక్కడే పురుషుడు పరుండి ఎన్నో రథములను, గుర్రములను, పట్టణములను చూచును. అవి భగవానుని యొక్క విచిత్రముకు శక్తిచే జీవుని కర్మానుభవమునకై ఎట్లు సృజింపబడుచున్నవో అట్లే జాగ్రత్త అవస్థలో కూడా శరీరము సంబంధము. జీవునకు వాని కర్మానుగుణముగా పరమాత్మ సంకల్పము చేతనే జరుగుచున్నది. జీవునకు ప్రకృతిచే తన స్వరూపము పరస్వరూపము మరుగుపడును. అందుచే అతనికి ప్రాకృతములగు విషయములందు అనుభవింపదగినవి అని బుద్ధి కలుగును. మరల పాపమును పొందుచుండును. విచిత్రమగు పరిణామమును చెందడి భగవన్ మాయ అనేటి ప్రకృతిచే మరుగుపరచబడిన జ్ఞానానందము గల జీవుడు.
దేవ మనుష్య శరీర సంబంధమును పొంది ఆ శరీరములనే తానుగా భావించి తాను అనేక రూపములను అందినట్లు తలంచుచుండును. సత్వాది గుణములచే జనించిన శబ్దాది విషయములను ఆసక్తితో నేను అనుభవించుచున్నాను ఈ అనుభవము నాది అని భావనతో. అనుభవించుచు బంధమును ఒందుచుండును. కాలమునకు ప్రకృతికి అవ్వలిదగు జీవుని అపహత పాప్మత్వం. మొదలగు ఎనిమిది గుణములు ఎప్పుడు ఆవర్భించునో తాను పరమాత్మచే నియమింపబడి వాని కొరకే ఉపయోగింపబడిన వాడని తెలియునో అప్పుడు అహంకార మమకారములు తొలుగును. ప్రకృతికి కాలమునకు వశుడు కాక ఉండును అప్పుడు శబ్దాది విషయములను అనుభవించవలెనని ప్రవృత్తి నివర్తించును ఇట్లు తనను తాను ఎరింగి తనకు ఆత్మయై నియమించి పరమాత్మ యొక్క అనుభవం చే నిరతిశయ ఆనందమును అనుభవించిన అనుభవించిన నాడు శబ్దాదులయందు ఆసక్తి తగ్గును. భగవానుని శరీరము జీవుడు దాల్చిన శరీరం వలె ఉండును కానీ అది కాల మాయ వశమైన కర్మాధీనమైన దేహము కాదు. అది అప్రాకృతము. తనంత తాను భగవానుడు స్వీకరించిన దివ్య విగ్రహము. ఆ జీవుని కంటే భిన్నమగు పరమాత్మ స్వరూపమును యదార్థ స్వరూపమును చతుర్ముఖను ఎరిగించుటకు తన రూపమును అతనికి చూపుచు సత్యమగు ఏ వాక్యములను భగవానుడు తెలియజేసెనో వానిని నీకు ఎరిగించెదను. పూర్వము వ్యష్టి జగత్తును సృష్టించిన ఆది దేవుడొక చతుర్ముఖుడు తాను పుట్టిన చోటగు నాభి పద్మమున కూర్చోండి దానికి ఆధారమేమో తెలుసుకొనవలెనని ఆలోచించెను. కానీ జగద్రచనా విధానము అతనికి తెలియలేదు. దానిని ఆలోచించుచు నాభి పద్మమునుని కూర్చుండెను. ఆ నీటిలో నుండి రెండు అక్షరములు అతనికి వినబడెను. తకారము. పకారము. త ప అను అక్షరములు వినపడెను. ఆ తపస్సు భౌతిక సంపదలపై మమకారమును వీడిన మునులకు ధనము. ఈ అక్షరములు వినబడినవి గానీ వాటిని పలికిన వాడు కనబడలేదు. చూడవలెనని దిక్కులు చూచినాడు. అక్కడ తన స్థానముకు పద్మమునందు కూర్చొని ఎవరో తనను నియమించినట్టు తోచి తాను తపస్సు చే సంకల్పించినాడు.
సకల లోకములను జ్ఞాన నేత్రములు ప్రకాశింపజేయు తపస్సు వెయ్యి దివ్య వర్షములు చేయుచునే ఉండెను. తపస్సు చేయువారిలో అంతకంటే తపస్సు చేయువారు లేరు. అందుచే అతనికి అమోఘముగు దర్శనం ఏర్పడెను. అతడు ప్రాణవాయువును, మనస్సును, ఇంద్రియములను జయించిన వాడాయను. అట్టి తపస్సుచే భగవానుడు సంతృష్టి అందినాడు. అంతకంటే పరమైన లోకము వేరొకటి లేదు అనిడి తన లోకము ఆ చతుర్ముఖునకు చూపినాడు. అచట అవిద్య మొదలగు క్లేశములు లేవు. ఆ పరమాత్మకు తాము శరీర భూతులమని ఆ పరమాత్మనే తమకు ఆత్మగా నిత్యము దర్శనము చేయు జ్ఞానాదికులు అచట అధివసించి యుండిరి. ఆ లోకమున రజస్తమస్సులు లేవు. రజస్తమస్సులతో కూడిన సత్వగుణమచర ప్రవర్తించదు. శుద్ధ సత్వమే అచట ఉండెను. అచట కాలము తన ప్రభావమును చూపి వస్తువులను పరిణమింపచేయలేదు. సత్తరజస్తమో గుణము లేని ప్రకృతి అచట ఉన్నది. అది అప్రాకృతము. అందుచే ఈ లోకము మాయా పరికల్పితము కాదు. అచట భగవనునికి భగవంతునికి పరిచర్య చేయువారు భగవంతునే సేవించుచుందురు. వారందరూ భగవానుని వలె నల్లని వర్ణము గలవారు, ప్రకాశించెడి వారు, తామర పువ్వు రేకుల బోలిన నేత్రములు గలవారు, పీతాంబరమును దాల్చిన వారు, కాంతి గలవారు, అత్యంత సుకుమారులు, మణులు పొదగిన బంగారు ఆభరణములను దాల్చిన వారు. లావణ్యము గలవారు, పగడం వంటి వర్చస్సు గలవారు, మెరేయుచున్న కుండలములు, కిరీటములు, మాలికలు దాల్చిన వారు, ప్రకాశించుచున్న భవన శ్రేణులతో ఆ లోకమంతై నిండి ఉన్నది. అందు ముక్తులు, నిత్యులు ఉందురు. ఆ భవనులలో యోగ్యులకు స్త్రీలు మేఘములో మెరుపు మెరిసినట్లు మెరువుచుండిరి. లక్ష్మీదేవి రూపు దాల్చి ఉన్నదై ఆ భగవానుని పాదములకు తన విభూతులగు భూ, నీల, దేవి సమూహముతో పూజను చేయుచున్నది. ఆమె ఊళ్ళలో ఊగుచుండగా చిలుకలు, కోకిలలు, తుమ్మెదలు ఆమెను వెంటనంటి ఆమె గుణములను పాడుచుండెను. ఆమె భగవానుని చేష్టితములను ధ్యానము చేయుచుండును. అట్టి దివ్య లోకమున చతుర్ముఖ బ్రహ్మ లక్ష్మీపతిని దర్శించెను. అతడే యజ్ఞపతి.
యజ్ఞమును నిర్వహించువాడు, ఆరాధింపబడువాడు, ఫలములను వసంగువాడు అతడే. చేతనా చేతనాత్మకమగు జగత్తునకు స్వామి అతడే. సత్య ధర్మములయందు నిష్ట కలిగి నిష్ట కలిగిన భక్తులందరకు ప్రభు ఆయనే. సునందుడు, నందుడు మొదలగు సభాపతులచే అతడు సర్వదా శవించబడుచుండును. తన సేవకులను అనుగ్రహపూర్ణమగు చూపులతో చూచి వారికి అమృతం వంటి ఆనందమును ప్రసాదించుచుండును. ప్రసన్నమగు మందహాసము, ఎర్రని నేత్రములు, సుందరమగు ముఖము, లక్ష్మీదేవి అధిష్టించిన వక్షస్థలము అతడు కలిగి ఉండెను. అతడు ఉత్కృష్టమగు ఆసనమును అధిష్టించి ఉండెను. తత్వములకు అధిష్టాన దేవతలకు శక్తులచే పరివృత్తుడై ఉండెను. సకల ఐశ్వర్యములచే సేవింపబడుచుండెను. ఐశ్వర్యము సంసారులు ఎడ అనిత్యముగా కనపట్టును. కానీ సర్వేశ్వరుని వద్ద అవి అన్నియు నిత్యములే వెలసిల్లినట్లుండును. అట్టి సర్వ నియంతయగు పరమపురుషుడు చతుర్ముఖ బ్రహ్మ దర్శించెను. ఆ భగవాను దర్శనముచే ఆనందము వెల్లివిరిసెను. హృదయమంతయు ఆనందముతో నిండి ఒడలు గగుర్పడెచెను. ప్రేమ నిండి కన్నుల భాష్పములు జాలువారెను. పరమహంసలచే భక్తి మార్గముచే ఏ పాదపద్మ పొందబడునో అట్టి భగవత్ పాదామ్జ్యమును. నమస్కరించెను. ఆ పరమ పురుషుడు ప్రజలను సృష్టించు కార్యమునందు నియమింపబడువాడును, తన ఆజ్ఞను పాలించువాడును, తనయందు ప్రీతి గలవాడును అగు ఆ బ్రహ్మను తన చేతితో స్పృశించుచు సంతుష్టమైన మనసు గలవాడై మందహాసముతో. ప్రకాశించి వాక్కుతో ఇట్లు పలికెను. ఓ వేదగర్భుడా, సృష్టి చేయవలెనని కోరి నీవు చేసిన తపస్సుకు నేను సంతోషించినాను. కేవలం బాహ్యముగా లోకమును కనపడుటకు మాత్రము యోగము చేయు యోగులకు నా దర్శనము లభింపదు. వరములను వసంగ జాలిన నా నుండి వరమును కోరదలంచిన నీకు మంగళమవు గాక. పురుషుడు శ్రమలందుటకు అవధి నా దర్శనమే. నా దర్శనమైన తరువాత ఇక వారికి శ్రమ ఉండదు. నేను ఉండెడి వైకుంఠమైనడి లోకమును నా సంకల్పముచే నీవు దర్శించితివి. నా ప్రేరణ చేతనే నీలో తపస్సు చేయవలెనని ప్రవృత్తి కలిగినది. నీవు సృష్టి చేయుటకు తోచక శోకించుచుండగా నేను నీకు తప్ప. ఆహా అను మాటను వినిపించజేసితిని దానిని విని నీవు తపస్సు చేసితివి తపస్సు నా హృదయమును పరిపూర్ణముగా వశపరచుకొనజాలినది తపస్సే నా స్వరూపము ఆ తపస్సు చేతనే ఈ విశ్వమును పాలించుచున్నాను నా జ్ఞానమే తపస్సు అదే నా ప్రభావము
భగవానుడు ఇట్లు పలకగా బ్రహ్మ ఇట్లు పలుకుచున్నాడు. హే భగవాన్ నీవే సర్వభూతముల హృదయమున అధివసించి ఉండువాడవు. ప్రాణికోటి ఇంద్రియములతో చేయి వ్యాపారములను దర్శించువాడవు. నీ జ్ఞానమునకు అవరోధం ఉండదు. అందుచే నీవు ఎవరు ఏమి చేయదలించినను ఎరుంగగలవాడవు నాథా నీ నేను ప్రార్థించుచున్న కోరికలు నీవు పూరింపవలెను పరమాత్మకు దివ్యాత్మ స్వరూపమును దానికంటే తక్కువదగు చేతనా చేతనాత్మకము తత్వములను కర్మాధీనముకు ప్రాకృత రూపము లేని నీ యొక్క రెండు రూపములను ఎరుంగదగిన బుద్ధిని నాకు అనుగ్రహింపుము. నీవు అనేక విధములకు శక్తులతో ఈ విశ్వమును ఆశ్చర్యకరమగు సహజ శక్తిచే నీవే నీ రూపముగా సృజించుచు దానినే ఒకప్పుడు సంహరించుచు మరల కొంతకాలం నిలిపి మరల సంహరించుచు క్రీడించుచున్నావు. సాలెపురుగు తనలో మరుగుపడి ఉన్న ద్రవముచే గూడిని నిర్మించి అందులో తానుండి మరల దానిని ఎట్లు తాను గ్రహించునో నీవు కూడా అట్లే. ఈ విశ్వమును నీవు నీ నుండి వెనక్కి తెచ్చి మరల్లోని గ్రహించుచున్నావని ఎరుంగగలిగిన బుద్ధిని నాకు అనుగ్రహింపుము. నీవు నాకు నేర్పిన విధముగా ప్రజా సృష్టిని పరాకులేక చేసెదను. నీ అనుగ్రహం వలన ఈ సృష్టి చేయుటచే నాకు ఏ విధమైన బంధము కలగకుండునట్లుగా నీవు అనుగ్రహింపుము. నీవు నన్ను మిత్రుని స్పృశించినట్లుగా స్పృశించి ఆదరించితివి. నీ అనుగ్రహముచే ఈ ప్రజా సృష్టి కార్యమునందు పొరపాటు లేక జీవులను ఉత్తమ, మధ్యమ, అధమ భేదములతో విభజించి సృష్టించెదను. కానీ సృష్టి చేయుచున్న వాడను నేను అని అహంకారం నాకు కలగకుండా నీవు అనుగ్రహింపవలెను. ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ ప్రార్థింపగా పరమ రహస్యమగు ఎరుంగదగిన జ్ఞానమంతయు నిగూఢముగా చేరి ఉన్న విజ్ఞానముతో కూడిన శాస్త్రమును రహస్యమును చతుర్ముఖ బ్రహ్మకు శ్రీ భగవానుడు ఉపదేశించెను. భగవానుడు ఉపదేశించినటువంటి ఆ భాగవతాన్ని మనం మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Guru. That which is spoken of as truth, pure, and the sound of Vasudeva, there, where the mind is purified, and in that, the Lord Vasudeva, is worshiped with salutations. Pure Sattva is associated with the name of Vasudeva. There, without any connection to the world, man is known separately. In that truth, Vasudeva Bhagavan, the one who is below, is being saluted by me. Fourth Canto, Third Chapter, 23rd Prayer. Dear listeners, welcome to the second episode of the second discourse of Srimad Bhagavata Tattva Deepika. Previously, in the podcast, Parikshit asked Sukamahesh in the form of a question all the things that we need to know from our side. Let us know the answer that Shuka gives to that. The Lord is wisdom itself. He has no sense of the relation of nature to himself. The illusion is imposed by him. Without the body-related illusion that the soul cannot experience the objects of sound and other senses, which is ordained by the Supreme Soul, nothing will happen. In a dream, a man sees many chariots, horses, and cities, all at the same time. Those are God's How the power of the difference is being created for the experience of the karma of the living being, similarly, even in the state of care, it is related to the body. For a being, according to its karma, it happens only by the will of the Supreme Soul. For a living being, its form and its supreme form are hidden by nature. Therefore, he will have the wisdom to experience things that are natural to him. Again he merits sin. The one who is covered by the knowledge and bliss of the divine Maya, which is the illusion, is the one who undergoes a strange transformation.
Having attained a divine human body, considering those bodies as himself, he thinks that he has attained many forms. I am experiencing the sounds and other things that are born of the qualities of truth, with interest, with the feeling that this experience is mine. Experiencing and embracing the bond. The imperishable nature of the being that is subject to time and nature. When one realizes that he is appointed by the Supreme Soul and is used for His purpose, then ego and possessiveness are removed. If one is not subject to time and nature, then one should cease the tendency to experience sounds and other things. Thus, having established oneself by making oneself one's own, having experienced the supreme soul, one experiences the infinite bliss When experienced, interest in sounds decreases. The body of God is like the body assumed by a living being, but it is not a body subject to the influence of time and illusion, dependent on karma. It is aprakrita. The divine idol that the Lord himself accepted. The form of the Supreme Being, different from that of the living being, and the true form To reveal the four-faced one, I will reveal to you the true words that the Lord revealed to him, showing him his form. In the past, the original God, who created the individual world, was a four-faced one. He thought, 'Sit in the navel lotus where I was born, and let's find out what the basis is.' But he did not know the Jagadrachana method. Thinking about it, she sat down with a lotus-like navel. From that water, two letters were heard by him. The letter 'ta'. The letter 'pa'. The letters 'ta' and 'pa' were heard. That penance is wealth for those sages who have abandoned attachment to material possessions. These letters were heard, but the one who spoke them was not seen. He looked around to see. There, sitting in the lotus, as if someone had appointed him to his place, he performed penance and resolved.
The penance that illuminates all the worlds with the eyes of knowledge was constantly performing a thousand divine showers. There is no one greater than those who perform penance. Therefore, he had a wonderful vision. He is the one who conquered the life-force, mind, and senses. By such penance, the Lord attained satisfaction. There is no other world beyond that, he said, and showed his world to that four-faced one. There is no suffering like ignorance. To that Supreme Being, that they are the embodied beings, that Supreme Being itself is their soul, the knowers of knowledge and others, residing there. There are no rajas in the world. The quality of goodness, which is associated with Rajas and Tamas, does not manifest. Pure Sattva is present there. There, time did not show its effect and did not cause things to change. The nature without the quality of Satrajasthamo is there. It is aprakrita. Therefore, this world is not a creation of illusion. Those who serve the Lord there, serve the Lord. All of them, like the Lord, were of dark color, radiant, like the petals of a lotus flower Those with lion-like eyes, those who wear yellow robes, those who are radiant, extremely gentle, those who wear gold ornaments that are worthy of pearls. Those who are beautiful, those who have radiance like saffron, those who wear earrings, crowns, and garlands, with the buildings shining, that world is filled. And the liberated ones, the eternal ones, are there. In those worlds, the women, like lightning flashing in the clouds, shone brightly for the worthy ones. Lakshmi Devi, having taken the form, is worshiping that Lord's feet with her consorts, Bhu, Neela, and Devi. While she was swaying in the village, parrots, cuckoos, and bumblebees followed her, ruining her qualities. She meditates on the Lord's glories. In that divine world, the four-faced Brahma saw Lakshmi. He is the Yajna-pati.
He is the one who performs the sacrifice, is worshiped, and is the one who grants the fruits. Swami is the one who is conscious and the world is conscious. The Lord is the one who is devoted to truth and righteousness, and to all the devotees who are devoted. Sunandu, Nandudu, and other chief ministers, he is always being questioned. He looks at his servants with a benevolent gaze and bestows upon them a joy like nectar. A cheerful smile, red eyes, a beautiful face, and a chest adorned by Lakshmi Devi were possessed by him. He was seated on a splendid seat. He was surrounded by powers, the presiding deities of the principles. She was served with all kinds of wealth. Wealth and family life appear impermanent. But to the Lord of all, all those things are eternally present. The supreme being, the absolute controller, the four-faced Brahma, was seen. The Lord's presence was a great joy. My heart is filled with joy and my body trembles. Tears flowed like love. By the Paramahamsas, through the path of devotion, which lotus feet May I receive such a divine grace. He/She/It offered salutations. That Supreme Being, who is appointed in the work of creating people, who obeys His command, who is pleased with Himself, touching that Brahma with His hand, being content, with a smile. He spoke thus with the light. Oh, Vedagarbha, I am pleased with the penance you performed, desiring to create the universe. Only those yogis who practice yoga to see the world externally will not receive my vision. May auspiciousness be upon you, who desired a boon from me, who was caught in the trap of boons. My vision is the limit to a man's suffering. After my darshan, they will not have any trouble. I, the abode of Vaikuntha, you have seen the world by my will. It is because of my inspiration that I have a tendency to do penance in you. While you grieve not being able to create, I am there for you. Aha, I made you hear the word, and you did penance after hearing it. Penance is able to completely control my heart. Penance is my form. It is by that penance that this I am ruling the universe. My knowledge is penance. That is my influence
When the Lord spoke thus, Brahma spoke thus. Hey Bhagavan, you are the one residing in the hearts of all beings. You are the one who sees the handiwork of the living being with senses. There will be no hindrance to your knowledge. Therefore, you, who can understand what anyone intends to do, O Lord, may you fulfill the desires I am praying for. Can the divine form of the Supreme Being be less than that, or is it conscious, is it intellectual, or is it to the nature of action, to the unpraised Grant me the wisdom to understand your two forms, which are formless. You, with powers of many kinds, are creating this universe with a wondrous natural power, you are creating it as your form, destroying it once, stopping it for a while, destroying it again, and playing. The spider, by the liquid hidden within itself, builds a nest and, remaining in it, how it grasps it again, you too, in the same way. Grant me the wisdom to understand that you are bringing this universe back from yourself and grasping it in the return. The way you taught me, people I will create the universe without any purpose. By your grace, grant me such a state that I do not have any kind of bondage in doing this creation. You have touched me like a friend, you have touched and cherished me. By your grace, in this creation of the world, without error, I will divide and create beings into superior, medium, and inferior categories. But I am the one who is creating, so you should not let me have the arrogance. Thus, as the four-faced Brahma prayed, the supreme secret, the knowledge to be understood, the knowledge that is secretly contained, the scripture and the secret were taught by Sri Bhagavan to the four-faced Brahma. Let us learn about that Bhagavatam, which was preached by the Lord, in another episode. Salutations to Asmadguru, Jai Srimannarayana.