నారాయణ కవచ ఉపదేశము - దివ్య రక్షా మంత్ర వైభవము
The Instruction of Narayana Kavacha (The Divine Shield)
శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, మహర్షి శుకదేవుడు దేవేంద్రునికి విశ్వరూపుడు బోధించిన నారాయణ కవచమను దివ్య రక్షాస్త్రమును వివరిస్తాడు. మత్స్యావతారం నుండి నృసింహావతారం వరకు పరమాత్మ యొక్క అనేక రూపాలను ఆవాహన చేసుకుంటూ, ఈ కవచం భక్తునికి సర్వదిశలా అభేద్యమైన రక్షణను అందిస్తుంది. ఈ దివ్య కవచమును శ్రద్ధగా పఠించువారికి సమస్త భయాలు తొలగిపోయి, మనసు నిర్మలమై శ్రీహరి పాదాలపై అచంచలమైన భక్తి కలుగుతుందని ఈ ఎపిసోడ్ తెలియజేస్తుంది. నారాయణ కవచ శ్రవణం మరియు పఠనం ద్వారా భక్తుడు భగవంతుని దివ్య సంరక్షణలో నిత్యము నిలబడగలడని శాస్త్రం చాటుతున్నది.
In this sacred episode from Canto 6 of the Srimad Bhagavatham, the great sage Shukadeva narrates the divine teaching of the Narayana Kavacha, a powerful spiritual armor revealed by Vishwarupa to King Indra and the Devas. This holy hymn invokes Lord Narayana in His many forms — from Matsya to Nrisimha — as an all-encompassing shield protecting the devotee in every direction, at every moment. The episode explores how sincere recitation of this Kavacha purifies the mind, dispels all fear, and establishes the devotee firmly under the Lord's divine protection. Listening to or chanting this sacred armor is said to bestow unshakeable courage and unwavering devotion to the Supreme Lord Vishnu.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయము ధీరయేత్ మానవులలో సర్వ శ్రేష్టులగు నరనారాయణ మహర్షులను సరస్వతీ దేవిని మరియు వ్యాస మహర్షిని నమస్కరించి తరువాత సంసారముపై విజయమును కలిగించే శ్రీమద్భాగవతమును పఠించవలెను. ఫస్ట్ క్యాంటో, సెకండ్ చాప్టర్, ఫోర్త్ ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము. 11వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం నారాయణ కవచాన్ని స్మరించుకొని ఆ కవచాన్ని ఉపదేశించినటువంటి విశ్వరూపుని యొక్క వృత్తాంతం కూడా తెలుసుకుంటూ వచ్చాం. విశ్వరూపుడు తన ఇచ్చినటువంటి హవిస్సుల్లో అంత బాగానే తన మేనమామ వైపు ఉన్నటువంటి అసురులకు ఇవ్వడం వల్ల తన యొక్క శిరస్సును ఖండించడం జరిగింది. ఆ తరువాత తను మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఒక అతనికి జన్మ ఇస్తాడు అగ్ని ద్వారా అతని పేరు వృత్రాసురుడు. ఆ వృత్రాసురుడు యొక్క వృత్తాంతాన్ని మనం కొంత భాగం తెలుసుకున్నాం. ముందు భాగాన్ని మనం ఇంకా విందాం. దేవతలు ఇలా స్తుతిస్తున్నారు. వృత్రాసురు యొక్క బాధ నుండి తప్పించుకోవడానికి వాయువు, ఆకాశము, అగ్ని, జలము. భూమి మూడు లోకముల్లో ఉండి బ్రహ్మాది దేవతలు మొదలగు మేమందరము ఏ పరమాత్మకు భయపడి శాసనములను పాటించుచు ఆరాధనమును కల్పించుచున్నామో అట్టి భగవానుడే మాకు రక్షకుడగుగాక. అందరకు మృత్యువగును వాడు కూడా ఏ భగవానుకు భయపడునో అట్టి పరమ పురుషునికి నమస్కారము. అతడే మాకు రక్షకుడు గాక.
అతని మహిమ సహజమగుటచే ఆశ్చర్యకరము కాదు. అతడు పరిపూర్ణకాముడు. వేరొక దానిని పొంది అతడు ఆనందించనవసరము లేదు. స్వానుభవం చేతనే అతడు ఆనందించుచుండును. రాగద్వేషాదు లేనివాడు అట్టివాడు అశరణములగు మాకు శరణమగుటకు తగినవాడు వానిని విడిచి క్షుద్ర దైవమును రక్షణకై అనువర్తించు మూర్ఖుడెవడు కుక్క తోక పట్టుకొని సముద్రమును దాటుటకు యత్నించువాడు ఎంత అవివేకియో పరమ పురుషుని విడిచి ఇతర దేవతలను ఆశ్రయించి తమ దుఃఖమును తొలగించుకొనుటకు ప్రయత్నించువాడు అంత మూర్ఖుడు. అతడు మత్స్య రూపము దాల్చి తన కొమ్మునకు నావగా కల్పించబడిన కల్పింపబడిన భూమిని తగలుచుకొని దానియందు సత్యవ్రతుడను మనువుకు సకల పదార్థములను ఉంచి ప్రళయ సముద్రము దాటించెను. అట్టి మత్స్యమూర్తియగు భగవానుడు శరణు పొందిన మమ్ములను వృత్రాసురి భయము నుండి రక్షించువాడు కాగలడు. తీవ్రమవు గాలిచే పెద్ద పెద్ద కెరటములు గల ప్రళయ సముద్రమునందు ఇటునటు ఊగిపోవుచున్న తన ఆసన పద్మము నుండి క్రింద పడిపోవువాడై చతుర్ముఖుడు ఆ భగవానుని చేతనే రక్షింపబడినాడు. అతడే మమ్ములను కూడా రక్షించు కాక. తనతో సమానుడు, అధికుడు, వేరొకడు లేనివాడు. వేరొక కారణము తనకు లేని వాడగు ఆ పరమ పురుషుడు తన సంకల్ప రూప జ్ఞానముచే మమ్ములను సృష్టించెను. అతని అనుగ్రహము చేతని మేము వ్యష్టి సృష్టి చేయుచున్నాము. మా హృదయ కుహరములో తానుండి అంతరాత్మయే నియమించువాడు అతడే. మేము స్వతంత్రులమను భావము గలవారమై వాని దివ్య మంగళ విగ్రహమును దర్శింపలేకున్నాము. శత్రువులు మమ్ములను పీడించుచున్నప్పుడు అతడే మమ్ములను రక్షించువాడు. ఎల్లప్పుడూ మమ్ములను తన వారినిగా భావించి మాకు కలిగిన ఆపదలను తొలగించి రక్షించుట కొరకు వామన, పరశురామ, మత్స్య, కూర్మాది రూపములను దాల్చి. అవతరించి రక్షించుచున్నవాడు అతడే. అతడే మాకు పరదైవము. అతడే చేతన చేతనములు శరీరముగా కలవాడు. వానికంటే ఉత్కృష్టుడు వానితో సముడు వేరొకడు లేడు.
అతడే మాకు రక్షకుడు కాగలవాడు. అట్టి భగవానుని మేమందరము శరణుగా ఆశ్రయించుచున్నాము. శరణముగా స్వీకరించిన వారికి ఆ మహాత్ముడు సుఖమును తప్పక కల్పింపగలడు. అని ఇంద్రాయ దేవతలు అందరూ పరమ పురుషుని శరణాగతి చేసిరి. ఇట్లు దేవతలందరూ స్తుతించుచుండగా శంఖ చక్ర గదాధరుడై భగవానుడు తమ ఆత్మలలో వారికి దర్శనం వసంగి తరువాత వారికి ఎదురుగా నిలిచి వారికి దర్శనం వసంగెను. శ్రీవత్స కౌస్తవములు తప్ప మిగిలిన ఆయుధములతో ఆభరణములతో ప్రకాశించుచు శరత్కాలమందలి పుండరీకమును పోలిన నేత్రములతో పది మంది అతనిని అనుసరించి ఉండిరి. ఆ పురుషుని దర్శించగానే దేవతలు ఆనందముచే పరవశులై దండం వలె నేలపడి మెల్లగా లేచి ఇట్లు స్తుతిస్తున్నారు. ఏ పరమ పురుషుడు యజ్ఞము ద్వారా సమస్త లోకమును సృజించినాడో యజ్ఞములన్నియు ఎవరి ఆరాధనములో ఎవడు తన ఆరాధన రూపమగు యజ్ఞము చేయుట కొరకు ప్రాణులకు ఆయువును వసంగును, యజ్ఞ ఫలమును వసంగి అనిష్టములను తొలగించును, చేతిలో ఎల్లప్పుడూను చక్రమును ధరించి తనను శరణు పొందిన వారి విరోధులను స్మరణ మాత్రము చేతనే ఎవడు తొలగించునో అట్టి వానికి నమస్కారము. అతడే స్వర్గమును, మోక్షమును, నరకమును కూడా వసంగ జాలిన జాలినవాడు. అతని స్వరూపము ప్రకృతి పురుషుల కంటే విలక్షణమైనది. ప్రభు, నీ స్వరూపము నీచే సృజింపబడిన వారిలో ఒక రకమై ఉన్న మా వంటి వారు ఎరుంగుటకు శక్యమైనది కాదు. ఓ భగవన్నారాయణ, వాసుదేవ, ఆదిపురుష, మహానుభావ, పరమ మంగళ, పరమ కారుణిక, జగద్ధారక, లోకైకనాథ, సర్వేశ్వర, లక్ష్మీనాథ, నమస్కారము. పరమాత్మ జ్ఞానము కలిగి భక్తి యోగ రూపముకు ధర్మముచే అవిద్య అనడి కవాటము తొలగిన పరమహంస పరివ్రాజకుల చిత్తములో దర్శనము సంగువాడవు నీవు నీవు సర్వజ్ఞుడవు సర్వశక్తిమయుడవు. నీకు లోకములో వస్తు నిర్మాణము చేయువారి వలె శ్రమపడి సృష్టి చేయ ఆవశ్యకత లేదు. ఆధారము లేకుండా నీవే ఆధారముగా ఉండి లోకమంతను సృష్టించుచుందువు. సహకారిగా ఏదీయు ఉండవలసిన అవసరము లేదు.
గుణత్రేయ రహితుడవు. ఏమియు మారకుండనే నీ శరీరములో మార్పును కలిగించు. కలిగించి నీవు ఈ సకల పదార్థములను సృజించుచుందువు. నీవు సత్వరజస్తమో గుణములు లేనివాడవై సత్వరజస్తమో గుణములు గల పదార్థమును సృజించి రక్షించి లయము చేయుచున్నావు. లోకములో కర్మలు చేయువారు కర్మల ఫలమును అనుభవించుందురు. కానీ నీవు జగత్తు యొక్క సృష్టి లయములను చేసినను దాని వలన ఎట్టి ఫలితమును అనుభవింపవు. లోకములో నుండి చేతనులు కర్మ భావన బ్రహ్మ భావన గలవారు. వారికి అంతరాత్మము నీవు. నీవు జ్ఞాన శక్త్యాది గుణములు గలవాడవు. అసంఖ్యాతములగు కళ్యాణ గుణములు గలవాడవు. భావనాత్రేయ రహితుడవు. నీ మహాత్మ్యము ఎవ్వరికినీ ఎరుంగ శక్యము కాదు. ఎందరో నీ స్వరూపమును గూర్చి వాద ప్రతివాదము చేయుచుందురు. నీవు కర్తవై శాసించువాడవై ఉందువు. సాక్షివై ఫలమునిచ్చువాడవై. ఫలమును అనుభవించు వాడవగుచొందువు, ఒకప్పుడు ఉదాసీనుడవై ఉందువు. ఇవి అన్నియు జీవులలో ఒకచోట ఉండటానికి కుదరవు గానీ నీ యందు ఇవన్నీ సంగతములే. నీవు సర్వేశ్వరుడవై ఉండియు ఎందరు నిన్ను గూర్చి ఎన్నెన్ని వాదములు చేయుచున్ననో వానికి అన్నిటికీ సరిపడినట్లే ఉందువు. కాదని నిషేధించవు. త్రాడును చూచి పామును కొన్న వాడికి త్రాడు వచ్చి పామును కానని చెప్పదు. పాముగానే కనపడుచుండును. అట్లే చైతన్యము గల నీవు కూడా వారి వారికి కలిగిన అజ్ఞానముచే భిన్న భిన్నముగా భావించినప్పుడు అట్టే గోచరముల ఆగుదువు కానీ ఆ భ్రమను తొలగింపవు. ఈ జగత్తుకు అంతకు నిమిత్త కారణమైన వాడవు. ఉపాదాన కారణమైన వాడవు కూడా నీవే. నీ ఉపాదాన కారణముగా ఉండియు వికారము చెందని స్వరూపము గలవాడవు. వికారములన్నియు నీ శరీర భూతములగు చేతనా చేతనము లేందే గాని నీయందుండవు. నీతో సముడు గాని అధికుడు గాని లేనివాడవై. ప్రకాశించుచుందువు. ఓ మధుసూదనా, పరమ భాగవతులు వేరొక ప్రయోజనము కాంక్షింపని వారు నీ పాదపద్మ సేవనము వీడజాలరు.
వారు ఏది పరమ పురుషార్ధమో ఎరింగిన వారు వారికి నీవే ఆత్మ. వారి సర్వాభీష్టములను సాధించువాడవు నీవు. వారి ప్రియుడవు మిత్రుడవు నీవు. నీ మహిమ అమృతరస సముద్రము అందరి ఒక బిందువు అయినను ఒక్కసారి ఆస్వాదింపబడినచో నిరతిశయమగు సుఖము సంతతము అనుభవించుచుండునే ఉండును. అందుచే వారు సుఖముల వలె కనపడు ఐహిక ఆముష్మిక సుఖములను మరచి ఉండురు. సర్వాంతరాత్మవగు నీయందు మనసు నిలిచి సుఖించుచున్నవారు ఈ సంసారంలో పరిభ్రమింపరు. మూడు లోకములు భవనముగా గలవాడా నీవు ఎరుంగజాలనిది లేదు. మూడు లోకములను ఆక్రమించిన నీకు అసాధ్యము లేదు. చంద్ర సూర్య అగ్నులు మూడును నేత్రములుగా గల నీకు ఎరుంగా రానిది లేదు. నీవే వారి కోరికలను నెరవేర్చగలవాడవు. దైత్యులు, దానవులు కూడా నీ విభూతులే. అందుచే వారిని చంపుటకు ఉపాయమును భావించుట నీకు తగదు. అయినను నీ సంకల్పము చేతనే ఆయా అవతారమును ఎత్తి చేసిన తప్పులకు తగిన దండమును విధింతువు. ఇప్పుడు మమ్ములను హింసించుచు లోకములన్నిటిని ఆవరించి ఉన్న ఈ త్వాష్ట్రుని అనగా వృత్రుని సంహరింప సంకల్పింపుము. ఇది చేయదగినదని లోక హితమును కాంక్షించు నీకు తోచినచో చేయుము. రక్షకా మేము నీ వారము మా హృదయములు నీ పాదపద్మ ధ్యానముచే బంధింపబడినవి. దయచేయు దయతో ప్రకాశించు నిశితము మధురము శిశిరమగు నీ చూపులతో మా మనసులలో కలిగిన తాపమును ఉపశమింపచేయుము. మేము నీకు విన్నవింపనవసరము లేదు. ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, స్థితి, లయములకు నిమిత్తమగు దివ్యమాయ నీ వినోద సామగ్రి. జీవులందరి యొక్క హృదయములలోను వెలుపల కూడా నీవే బ్రహ్మగా జీవుడుగా ప్రధానముగా వ్యాపించి ఉన్నావు. ఎవరికి ఏ దేశములో ఏ కాలములో ఏ అవస్థలో ఎట్టి జ్ఞానము కలిగినను ఆ జ్ఞానములన్నిటికీ నీవు సాక్షివై ఉందువు. సకల జీవ చిత్తవృత్తులకు సాక్షివి నీవు. ఎల్లప్పుడూ అంతట పరిపూర్ణముగా ప్రకాశించు. అపరిచ్ఛిన్నముగు జ్ఞానము నీ ఆకారము.
మేము మిమ్ము గూర్చి మీకు విన్నవించుట అగ్ని నుండి బయలు పడిన మేనుగురులు అగ్నికి దాని స్వరూపం వివరించుటయే నీవే మాకు పరమ గురువు నీ పాద పద్మ పత్ర ఛాయను మాకు వసంగుము. ఆ ఛాయను ఆశ్రయించి మేము ఈ సంసార పరిశ్రమను ఉపశమింప చేసుకుని అనుగ్రహింపుము, మేము ఏ కోరికతో నిన్ను ఆశ్రయించితేమో ఆ కోరిక నెరవేర్చుము. ప్రభు పృత్రుడు మూడు లోకములను మూడు లోకములోనున్న ఆయుధములను సకల తేజస్సులను మ్రింగి వేయుచున్నాడు లోకమంత నిర్వీర్యమగుచున్నది అందుచే వాని సంహరింపుము నీవు ప్రణతుల ఆర్తులను హరించువాడవు కనుక నిన్ను హంసాందురు. దహ్రము అనేటి హృదయ పుండరీకమున నివసించువాడవు. మా దుఃఖములన్నియు నీకు తెలియును. మా చిత్తవృత్తులకు సాక్షిగా ఉండుటచే మేము చెప్పునది సత్యమో కాదో మీకే తెలియును. లోక భారమును తొలగించుటకై కృష్ణుడై వచ్చి లోకమునకు సుఖమును కలిగించిన వాడవు. విశుద్ధముగు కీర్తి గలవాడవు. నిన్ను శరణు పొందిన వారు వేరొక ప్రయత్నము చేయనవసరం లేకుండా రక్షించువాడవు. సత్పురుషులను నీ వారిగా స్వీకరించి అనుగ్రహించువాడవు. సంసార మార్గగాములను వారికి చేరి నివసించదగు భవనమునగువాడవు నీవు. నిరదిశే పరమార్థ పురుషార్థ రూపుడవు తాపత్రయమును హరించువాడవు నీకు నమస్కారము ఇట్లా దేవతలు స్తోత్రం చేశారు ఆ తరువాత శ్రీహరి వారికి ఇచ్చినటువంటి సమాధానాన్ని మరి ఒక పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to Narayana. Salutations to Narasimha. Salutations to Devi Saraswati. Then, with courage, one should conquer. Among humans, the best of all, Naranarayana, the sages, Saraswati Devi, and Vyasa Maharshi, salutations to them After that, one should recite the Srimad Bhagavatam, which brings victory over the world. First Canto, Second Chapter, Fourth Prayer. Oh, devotees of the Lord, the sixth book of the Srimad Bhagavata Tattva Deepika. Welcome to episode 11. Until now, we have been remembering the Narayana Kavacham and also learning about the story of Vishwaroopa, who taught that Kavacham. Vishwaroopudu, because he gave his offerings so well to the demons who were with his maternal uncle, his head was severed. After that, he tries again and gives birth to a son through fire, his name is Vritrasura. We have learned a part of the story of Vritrasura. Let's hear the first part. The gods sing their praises. From the suffering of Vritrasura Air, sky, fire and water to escape. May that Lord be our protector, who resides in the three worlds, and who, along with Brahma and other gods, fears the Supreme Soul, obeys the commands, and bestows worship upon us. He who is the cause of death to all, even he, who is afraid of which God, salutations to such a supreme being. He is our saviour.
His glory is not a wonder, because it is natural. He is a perfectionist. He doesn't need to be happy after getting something else. He is enjoying it through self-realization. He who is free from attachment and aversion, such a person is worthy of being surrendered to us, who is worthy of being surrendered. Leaving him, who is a fool who adopts a petty deity for protection, how foolish is he who tries to cross the ocean holding the tail of a dog One who abandons and seeks refuge in other gods is a fool. He, assuming the form of a fish, crossed the created earth, which was made a boat for his horn, and placed all the substances in it for Manu, who was a truthful ascetic, and crossed the ocean of destruction. That Matsya-murti (fish-faced deity), the Lord, who has taken refuge in us, can protect us from the fear of Vritrasura. Becoming intense, in the ocean of destruction with great waves, as he fell from his lotus seat, the four-faced one was saved by that Lord. Not even he can save us. With him The one who is equal, the one who is superior, the one who is not there. Another reason is that the supreme being, who is without himself, created us through the knowledge of his will. By his grace, we are creating individual creation. He is the one who rules the inner soul residing in the cave of our hearts. We, who have the feeling of being independent, have not been able to see his divine auspicious idol. He who protects us when the enemies torment us. Always considering us as his own people, to remove and protect the calamities we have, assuming the forms of Vamana, Parashurama, Matsya, Kurma, etc. He is the one who came and protected. He is our God. He is the one with the consciousness, the one with the body. There is no one superior to him, no one equal to him.
He's our saviour. We all seek refuge and take refuge in such a God. For those who accept refuge, that great soul will surely provide happiness. Thus, all the gods and Indra surrendered to the Supreme Being. Thus, while all the gods were praising, the Lord, who was holding the conch, discus, and mace, appeared to them in their souls, and after that, he stood before them and appeared to them. Except for the weapons and ornaments, shining with the rest of the weapons, with the eyes like the lotus in the autumn season, ten people followed him. As soon as they saw that man, the gods, overjoyed, fell at his feet, slowly rose, and praised him thus. Which supreme being created the entire world through Yagnya? In whose worship are all the Yagnyas? Who, in whose worship, performs the Yagnya that is the form of his worship, grants life to beings, grants the fruit of Yagnya, and removes desires One who always wears a discus in his hand and, by merely remembering, removes those who oppose him, to such a person Greetings. He is the one who can conquer heaven, salvation, and hell. His form is more unique than the male counterparts. Lord, it is not possible for us, who are of the same kind as those who are created by you, to understand your form. Oh Lord Narayana, Vasudeva, Adipurusha, great being, supreme auspiciousness, supremely beautiful, savior of the world, Lord of the Universe, Lord of Lakshmi, salutations. Having the knowledge of the Supreme Being, in the form of devotion, through Dharma, the door of ignorance is removed, you are the supreme ascetics, you are the one who has the vision in their minds. You are omniscient, you are omnipotent. You do not need to labor and create like those who make things in the world. Without any basis, you yourself are the basis and create the whole world. There is no need for anything to be cooperative.
You are devoid of virtues. Change your body without changing anything. Creating, you create all these substances. You, being without the qualities of Sattva, Rajas, and Tamas, create, protect, and destroy the substance that has the qualities of Sattva, Rajas, and Tamas. In the world, those who perform actions experience the fruits of their actions. But even if you create and destroy the world, you will not experience any result from it. Those who are from the world, those who have the feeling of karma and Brahma. You are their conscience. You are endowed with qualities like wisdom, power, etc. Oh! You are the one with innumerable auspicious qualities. You are devoid of emotion. Your greatness is beyond the power of anyone to understand. Many people argue about your form. You are the doer, the one who enacts it. Being a witness, being the one who gives fruit. You will be the one to experience the fruit, you will be the one to be patient. These are not possible for all living beings to be in one place, but all these are possible in you. Even though you are the Lord of all, how many arguments are there about you It will be enough for him. They don't prohibit it. The one who bought the snake by seeing the rope will not say that the rope did not come and the snake did not bite. It looks like a snake. Similarly, even you, with consciousness, when you consider each person's ignorance as different, you will stop the apparent things, but you will not remove that illusion. You are the cause of this world and everything in it. You are also the cause of the result. You are the cause of the cause, and you are the form that does not change. All the distortions are not in you unless you have the body, mind, and consciousness. You are the one who has no equal or superior. You shine. Oh Madhusudana, the supreme devotees, those who do not desire another purpose, cannot abandon the service of your lotus feet.
Those who have understood what is the ultimate goal, you are their soul. You are the one who fulfills all their desires. You are her beloved, her friend. Your glory is like an ocean of nectar. Even if it is a single drop for everyone, if it is enjoyed once, it will be immensely blissful and will continue to be experienced forever. Therefore, they appear like pleasures, forgetting worldly and otherworldly pleasures. Those who are content with their minds fixed on the all-pervading You, do not wander in this world. Oh, you who are the abode of three worlds, there is nothing that you do not know. It is not impossible for you, who have conquered the three worlds. You, who have the moon, sun, and fire as your eyes, have no one who is not your enemy. You are the one who can fulfill their desires. Daityas and demons are also part of your identity. Therefore, it is not appropriate for you to think of a way to kill them. However, by your will, you will inflict the appropriate punishment for the mistakes made by lifting those incarnations. Now, let us resolve to destroy this Tvashtri, who is tormenting us and encompassing all the worlds, that is, Vritra. This is something that can be done, the welfare of the world Do what you want, as long as you desire it. Protector, we are yours, our hearts are bound by your lotus feet's meditation. Please, with kindness, shine brightly, sweetly, with your winter-like gaze, alleviate the suffering in our hearts. We are not here to complain. This world's creation, preservation, and dissolution are the divine illusion that is the entertainment material. In the hearts of all beings, and also outside, you are the Brahma, the living being, and are primarily pervading. To whom, in which country, in which time, in what state, whatever knowledge you have, you will be a witness to all those knowledges. You are the witness to all the activities of the living beings. May thee shine ever more brightly. The indivisibility is your form.
We, regarding you, request you. The beings that emerged from the fire, you are the one who explains the form of the fire to them. You are our supreme guru. Grant us the shade of the lotus petal of your lotus feet. Relying on that shade, we will alleviate this household industry, please bless us. Whatever desire we have taken refuge in you, fulfill that desire. Lord, the enemy is swallowing the three worlds and all the weapons in the three worlds, making the world powerless. Therefore, destroy him. You are the one who destroys the offerings of devotion, therefore the swans praise you. Dahamru is the one residing in the lotus-like heart. You know all my sorrows. Being witnesses to our thoughts, you alone know whether what we say is true or not. You came as Krishna to remove the burden of the world and you are the one who brought happiness to the world. Oh, glorious and pure one. You are the one who protects those who have taken refuge in you without needing any other effort. You are the one who accepts and blesses the saints. Reaching the path of worldly life You are the one who is going to live in the building. You are the embodiment of the ultimate purpose, the remover of suffering. Salutations to you. Thus, the gods praised. After that, let us learn about the answer given to Srihari in another podcast. Jai Srimannarayana, salutations to the Gurus