కర్దమ ప్రజాపతి అద్భుత కామగమ దివ్య విమాన సృష్టి

Creation of the Aerial Mansion & Conjugal Pastimes

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, మహర్షి కర్దమ ప్రజాపతి తన యోగశక్తి ద్వారా అద్భుతమైన కామగమ దివ్య విమానాన్ని సృష్టించి, ప్రియతమ దేవహూతి కోరికను తీరుస్తారు. సర్వ సౌఖ్యాలతో అలంకరింపబడి, ఎటైనా సంచరించగల ఆ దివ్య విమానం మహర్షి యొక్క అసాధారణ యోగ సామర్థ్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. కర్దమ మహర్షి మరియు దేవహూతి ఆ దివ్య విమానంలో దాంపత్య జీవనాన్ని అనుభవిస్తూ, వైదిక సంప్రదాయంలో గృహస్థ ధర్మం మరియు ఆధ్యాత్మిక జీవనం ఏవిధంగా సమన్వయంగా సాగుతాయో అందంగా చాటిచెప్తారు.

In this sacred episode of Srimad Bhagavatham Canto 3, the great sage Kardama Prajapati manifests a magnificent aerial mansion through his mystic power, fulfilling his beloved Devahuti's heartfelt desire. This wondrous flying palace, adorned with every luxury and capable of traveling anywhere at will, stands as a testament to the extraordinary yogic potency of a devoted soul. Kardama Muni and Devahuti then enjoy divine conjugal pastimes within this celestial abode, beautifully illustrating how spiritual life and righteous household dharma are perfectly harmonized in the Vedic tradition.

← Prev Next →
Creation of the Aerial Mansion & Conjugal Pastimes bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమః పరాయా వితధానుభూతయే గుణత్రయాభాస నిమిత్త బంధవే అదృష్టధమ్నే గుణతత్వ బుద్ధిభిహి నివృత్తమానాయ దధౌ స్వయంభువే పరమాత్ముని అమోఘమగు చైతన్య శక్తి నుండియే త్రిగుణాత్మికయగు మాయ ప్రకటమైనది. త్రిగుణ కార్యముకు దేహేంద్రియ మనస్సంఘాతమునందు ఆ చైతన్యం యొక్క ప్రతిఫలనమే జీవుడు. ఆ విధముగా ఆ పరమాత్ముడే మాయాశక్తికి జీవులకు నియామకుడగుచున్నాడు. త్రిగుణా కార్యముకు జగత్తునందు సత్వబుద్ధి గలవారు ఆయన స్వరూపమును తెలియలేరు. ఆయన ప్రత్యక్షాది ప్రమాణములకు గోచరము కాడు. స్వయం ప్రకాశ స్వరూపుడగు అట్టి పరమాత్మ కొరకు నేను నమస్కరించుచున్నాను. సిక్స్త్ క్యాంటో ఫోర్త్ చాప్టర్. 23వ 23rd ప్రేయర్ భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక 30 మూడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా మనము దేవహుతి కర్దమ పుత్రుడు దేవహుతికి కపిల బోధ అంటాం కపిల గీత అంటాం బోధిస్తున్నాడు మోక్ష సాధనం ఏమిటి ఎలా? జీవుడికి మోక్షం లభిస్తుంది. ఏ ప్రక్రియలో వెళ్లాలని ఈ భాగం వినటానికి ముందు దీని ఇంతకుముందు ఉన్నటువంటి 32వ భాగాన్ని వినాలని ప్రార్థన. ఎందుకంటే అక్కడి నుంచి మనకి కపిల గీత ప్రారంభమైంది. ముందు భాగాన్ని మనం శవిద్దాం. భగవానుని యందు భక్తి కలుగుటకు భగవాను స్వరూపమును బాగుగా ఎరుంగవలెను. దానిని దానికి అతనిచే ధరింపబడి నియమింపబడి ఈ ప్రకృతి యొక్క జీవుల యొక్క కాలము యొక్క స్వరూపమును ఎరుంగవలెను. అందుచే ముందుగా నీకు ప్రకృతి పురుషుడు అను వాని స్వరూపమును తెలియజేసెదను. మోక్షమునందు ఇచ్చగల పురుషుడు ఇది ఎరింగిననే గాని ప్రకృతి యొక్క గుణములకు సత్వరజస్తమో గుణములచే చేయు పుణ్య పాప రూప బంధము నుండి విడువడడు. సకల జగత్తునకు ఆత్మయగు పరమ పురుషుని సాక్షాత్కారమును కలిగించెడి జ్ఞానము కలిగెన గాని మోక్షము కలగదు. అదియే అవిద్యా గ్రంథిని ఛేదించునది అట్టి జ్ఞానమును వర్ణించి చెప్పెదను.

మనకు కనిపించెడిది అంతయు ప్రకృతి వికారమైన శరీరము. ఈ శరీరములో జ్ఞానము గల జీవులు కర్మచే బంధింపబడి ఉందురు. జీవునికి సత్వము, రజస్సు, తమస్సు అనేటి గుణములు ఉండవు. ఆ గుణములు ప్రకృతికి చెందినవి. శరీరములో నుండి పురుషుడే ఆత్మ అనబడును. వాడు అన్ని కాలములందును ఉండువాడు. అతడు తనంత తాను ప్రకాశించువాడు అనగా తనను ఎరుంగును. వేరొక దానిని ప్రకాశింపజేయును. దీపము ఎట్లు వేరొక దాని సాయము అక్కరలేకయే తాను ప్రకాశించుచు వేరొక దానిని ప్రకాశింపచేయునో అట్లే ఆత్మ కూడా తనంత తాను ప్రకాశించును. తాను ప్రకాశించుచు మిగిలిన వానిని ప్రకాశింపజేయును. దేహము జడము. తనంత తాను ప్రకాశింపదు. దీపములను అటులనే. అందుచే దీపములను జడములే వానిని పరాక్కు అందురు అనగా ఒకరిని ప్రకాశించునవి తనకు తాను ప్రకాశించెని ఆత్మను ప్రత్యక్కు అందురు. ఆ ప్రకాశించుటయే జ్ఞానము. ఆత్మ ప్రకృతి పరిణామమగు శరీరము కంటే, బుద్ధి కంటే, ఇంద్రియముల కంటే, మనస్సు కంటే, ప్రాణము కంటే స్వరూపముచే, స్వభావముచే ప్రత్యేకత కలది. ఈ ఆత్మలోన వ్యాపించి ఉండుటచే తనే స్థూలముగా సూక్ష్మముగా ఉండు విశ్వమంతయు నిలిచి ఉండును. జడములగు వానికి ఉండెడి లక్షణములకు ఆత్మకు ఉండవు లక్షణములు ఆత్మకు ఉండవు. దేహము పుట్టును నశించును ఆత్మ పుట్టదు నశింపదు. దేహముతో కలిసి యున్నను దేహము కంటే వేరైనది ఆత్మ కానీ లావుగా ఉండుట సన్నముగా ఉండుట దేవుడు మనుష్యుడు మొదలగు లక్షణములు దేహమునకే ఉండును దేహముతో కలిసి ఉండుటచే అవి ఆత్మయందు ఉన్నవని భావింపబడుచుండును. పురుషుడు నిద్రించునప్పుడు కలలు కనును. ఆ కలలో ఎన్నో పదార్థములను చూచును. అవన్నీయు మేల్కొనగానే లేకుండా పోవును కానీ పురుషుడు మేల్కొనిన తర్వాత కూడా తాను పోక నిలిచి ఉండును అట్లే ఆత్మ కూడా ఈ శరీరములు నశించినను తాను నశింపక ఉండును

ఆత్మ మిక్కిలి సూక్ష్మమైనది. ఎంత సూక్ష్మమైన దానిలోనైనను వ్యాపింపగలదు. జీవునకు ప్రకృతితో సంబంధము భగవానుడగు విష్ణువు యొక్క లీలచే కలుగును. అది జీవునకు సహజము కాదు. సత్వాది గుణములతో కూడిన ప్రకృతితో సంబంధము కర్మవశమున భగవానుని సంకల్పముచే కలుగుచుండును. ఈ ప్రకృతి ఈశ్వరునకు లీలోపకరణము. అతనిచే నియమింపబడునది. అతడే కోరిక లేక దీనిని యాదృచ్ఛముకముగా కలుపుచుండును. పురుషునకు ప్రకృతి సంబంధము కలగగానే ఆత్మ స్వరూపం మరుగపరచును. దానితో జీవుడు అదే తాను అని మోహమునంది ఉండును. భగవత్ సంకల్పముచే కర్మానుగుణముగా ఆ ప్రకృతి సంబంధముచే జీవుడు కర్మలు చేయుచు అవి తానే చేయుచున్నానని అనుకొనుచుండును. అవి సత్వరజస్తమో గుణముల సంబంధముచే కలుగును గాని జీవుడు తనంత తాను కర్మ చేయడు. సత్వరజస్తమో గుణముల సంబంధముచే జీవుడు కర్మ చేయును. ఆ కర్మ తాను చేయుచున్నానని అనుకొనును. ఆ కర్మకు తాను వశుడై బంధింపబడును. జీవుడు జీవుడు చేయువాడు కాడు. వాడు జ్ఞానమనెడి గుణము కలవాడు. ఆనంద స్వరూపుడు. అతనికి సహజము గుణములు పుణ్యాపుణ్య కర్మలచే మరుగుపడును. సహజములగు ఎనిమిది గుణములు ప్రకృతి సంబంధము తొలగగానే ఆవిర్భవించును. అదియే మోక్షము. జీవాత్ములు సహజముగా అసంకుచితము అపరిచ్ఛిన్నము నిర్మలగు జ్ఞానమే స్వరూపముగా గలవారు అజ్ఞానమును అజ్ఞానమును గుణమునకు ఆశ్రయమైన వారు కర్మ అనేడిదే అవిద్య దానిచే వారు ఆవేశింపబడుదురు దానిచే సహజమగు గుణములు సంకోచము చెందును. బ్రహ్మ మొదలు తృణము వరకు అనేక విధములగు విచిత్రములగు దేహములలో జీవుడు ప్రవేశించును. ఆ దేహమును అనుసరించి సత్వము, రజస్సు, తమస్సు యొక్క తారతమ్యముచే జ్ఞానము ప్రసరించుచుండును. దేహము కొరకు, దేహ సంబంధుల కొరకు అవసరమైన కర్మలు చేయుచుండును. దానికి తగిన సుఖ దుఃఖములను అనుభవించుచుండును. ఇదే సంసారము.

ఆత్మలకు ధర్మముగానున్న జ్ఞానము సహజమైనను కర్మచే సంకోచము ఆ కర్మ అంతముందుటచే వికాసము కలుగుచుండును. సాంసారిక ప్రవృత్తుల యందు కర్మ కర్తృత్వము జీవునకు సహజముగా లేదు. ప్రకృతి సంబంధముచే కలిగినది. శరీరము, ఇంద్రియములు మొదలగునవి చేసే వ్యాపారములను పురుషుడు ఉండుటచే శరీరము చేయుచుండును. పురుషుడు శరీరమునందుండి ఆ శరీరము తాను అనుకొని కర్మలు చేయుటచే ఆ కర్మల వలన కలిగే ఈ ఫలమును ఆ పురుషుడే అనుభవించుచుండును. ఇట్లు ప్రకృతి యొక్క పురుషుని యొక్క స్వరూపమును కపిలుడు దేవహూతికి ఎరంగించెను. ఈ ప్రకృతి పురుషులు సృష్టికి ముందు సూక్ష్మమైన అవస్థలో కూడా కారణముగా ఉండును కదా. అప్పుడు వానికి నామరూపములు ఉండవు. అవి భగవాను నుండి వేరు చేసి తెలిసి కొనుటకు వీలు కాకుండా ఉండును. కారణము పరబ్రహ్మమునకు శరీరం వంటిదే అయి ఉండును. అట్టి ప్రకృతి పురుషుల యొక్క లక్షణమును ఆ ప్రకృతి పురుషుల నుండి కార్యరూపము ఒక జగత్తు ఎట్లు ఏర్పడుచున్నదో దాని లక్షణములు నాకు ఎరంగింపుము అని దేవహుతి మరల కపిలుని ప్రశ్నించెను. ప్రకృతి కారణావస్థలో కూడా ఉండును. రెండు అవస్థలలో అది సత్వరజస్తమో గుణములు కలిగి ఉండును. దానినే ప్రధానమందురు. కారణావస్థలో పృథివి, జలము మొదలగు భేదములు లేకుండును. అందుచే నామరూప విభాగం ఉండదు. కారణావస్థలో ఉన్న ప్రకృతిని అవిశేషమందురు. కార్యావస్థలో పృథివి, జలము మొదలగు భేదములు కలిగి ఉండును. అందుచే దానిని విశేషవత్ అందురు. కారణావస్థలో ఉన్న ప్రకృతిని అవ్యక్తము అందురు. కార్యావస్థలో పృథివి, జలము మొదలగు భేదములు కలుగును. మహత్తు మొదలు పృథ్వి వరకు కారణమగును. బ్రహ్మ మొదలు గడ్డిపోచ వరకు వేరు వేరు విధములగు శరీరములతో కార్యరూపముగను సత్తు అసత్తు అని ఆ ప్రకృతియే వ్యవహరింపబడుచుండును. ప్రధానము కార్యరూపములతో పంచభూతములు, శబ్ద తన్మాత్రము, స్పర్శ తన్మాత్రము, రూప తన్మాత్రము, రస తన్మాత్రము, గంధ తన్మాత్రము ఐదు విధములుగా ఉండును. ఈ ఐదింటి నుండి స్థూలములగు ఆకాశము, వాయువు, తేజస్సు. జలము, భూమి అనటి పంచభూతములు ఏర్పడును. మనస్సు, అహంకారము, మహత్తు, అవ్యక్తము అననువి నాలుగు వీని అన్నింటికీ ముందుండును.

అహంకారము నుండి జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అనునవి 10 ఏర్పడును. ఇట్లు ప్రధానము నుండి 24 తత్వములు ఏర్పడును. మహాభూతములు 5, తన్మాత్రులు 5, శబ్ద స్పర్శాదులు 5, ఇంద్రియములు 10. ఇవి కాక లోన మనస్సు, బుద్ధి, అహంకారము, అవ్యక్తము అనునవి నాలుగు ఉండును. ఇంద్రియములలో చెవి, చర్మము, కన్ను, నాలిక, ముక్కు అనునవి ఐదు జ్ఞానేంద్రియములు. వాక్కు, చేయి, కాలు, మూత్ర ద్వారము, మల ద్వారము అనునవి ఐదు కర్మేంద్రియములు. అంతఃకరణము వ్యాపార భేదముచే నాలుగు విధములగు పేర్లతో వివరింపబడును. చింతను కలిగించునది చిత్తము. సంకల్ప వికల్పమును కలిగించునది మనస్సు. నిశ్చయమును కలిగించునది బుద్ధి, శరీరము నేను అనిపించునది అహంకారము. సత్వాది గుణములు కల ప్రధానము యొక్క విభాగము ఇంతవరకు తెలియజేసితివి. తెలియజేసితిని. ఇవి 24. 25వ తత్వము కాలము. కొందరు దానిని వేరే తత్వమని చెప్పుదురు. పరమ పురుషునకు సంబంధించిన ప్రభావమే కాలము అందురు. ఆ ప్రభావం వలనే జగత్తు యొక్క సృష్టి సంహారము జరుగుచున్నవి. ఆ ప్రభావము చేతనే జగత్తు నియమింపబడుచున్నది. అట్టి భగవత్ శక్తికి కాలమని కొందరందురు. అంతేకాక కాలము భగవత్ స్వరూపమే. ఆత్మ కాని దానిని ఆత్మ అనుకొనుటయే అహంకారము. దీనిచే పురుషుని స్వరూపము తిరోహితమై ఉండును. ఈ ప్రకృతి అనగా ప్రధానము కారణమగు తమస్సు అనబడిడి మిక్కిలి సూక్ష్మమగు దశను చేరును. అప్పుడు జీవుడు కూడా వేరు చేయుటకు వీలు కాక దానిలో చేరిపోయి ఉండును. అప్పుడు సత్వరజస్తమోగుణములు హెచ్చుతగ్గులు లేక సమముగా ఉండును. అదియే సంహార దశ. ఈ దశలో నామరూపములు ఉండవు. ఆ నామరూప విభాగము లేని సూక్ష్మావస్థలో ఉన్న ప్రకృతి పురుషులు పరమాత్మతో చేరి ఉండి వేరుగా గుర్తింప వీలు కాకుండా కలిసి ఉందురు. ఒకప్పుడు అట్టి ప్రకృతి పురుషులు ఈ జగద్రూపముగా గుర్తింప వీలు కాకుండా కలిసి ఉందురు. ఒకప్పుడు అట్టి ప్రకృతి పురుషులు ఈ జగద్రూపముగా మారుటకు వీలగు సత్వరజస్తమో గుణములలో హెచ్చుతగ్గులు కలుగును. ఆ కదలిక కారణమైనది కాలము. ప్రకృతి పురుషులు సృష్టికి ముందు భగవానుని కంటే వేరుగా కనపడక భగవానుడుగానే ఉండును. అందుచే

కాలము భోగదాత్మకము. భగవానుని శరీరం వలె ఉండెది కాలము. కదలిన కదలికకే కాలమని పేరు. ఈ విధముగా ప్రకృతి, పురుషులు, కాలము ఎట్టి స్వరూపము గలవియో. నీకు వివరించితిని. ఇంకా ముందు భాగాన్ని మరొక ఎపిసోడ్లో పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. ఈ విషయాన్ని మళ్ళీ మళ్ళీ విని అర్థం చేసుకోవాలని. భగవద్బంధువులకు మనవి. ముందు పాట్కాస్ట్లో మళ్ళీ కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the one who is pleased with others. For the sake of the manifestation of the three qualities, for the sake of the bondage, for the sake of the unseen, for the sake of the intellect that is filled with the essence of qualities, may it be established. From the unparalleled power of the Supreme Soul, the three-fold nature of Maya It has been revealed. The soul is the manifestation of consciousness in the body, mind, and senses, which is the result of the three gunas. In that way, that Supreme Being is the controller of the Maya power and the living beings. Those with a Sattvic intellect in the world do not know His form for the sake of the three functions. He is not visible to direct evidence. I offer my salutations to the supreme being, who is self-illuminating. Sixth canto, fourth chapter. 23rd 23rd prayer, dear devotees of God, welcome to the 30th podcast of Srimad Bhagavata Tattva Deepika. As part of the conversation between Vidura and Maitreya, we call Devahuti the son of Kardama, the son of Kapila, the Kapila Gita. He is teaching what is the means to liberation, how? The liberated soul is the one who is released. Before listening to this part about which process to go, this, before this Prayer is to listen to the 32nd part. Because from there, our Kapila Geeta began. Let's focus on the front part. To have devotion to God, one must understand the nature of God well. It should be known that it is appointed to it, and that it is appointed to it, and that it is the form of the time of these creatures of nature. Therefore, first I will tell you the form of the one who is both nature and man. A man who can give liberation, even if he knows this, will not be freed from the bondage of merit and sin caused by the qualities of nature, namely Sattva, Raja, and Tama. Even if one attains the knowledge that bestows the realization of the Supreme Being, who is the soul of the entire universe, one will not attain liberation. That is the one that cuts through the ignorance. I will describe and explain such knowledge.

Everything we see is a body of nature. In this body, beings with knowledge are bound by karma. A living being does not have the qualities of sattva, rajas, and tamas. Those qualities belong to nature. The male is called the soul from the body. He is the one who exists in all times. He is the one who shines on his own, meaning he shines on his own. Illuminate. How a lamp shines without needing another's help, shining by itself, and makes another shine, similarly, the soul also shines by itself. He will make the one who remains bright. The body is inert. It’s not that he’s living up to it. The lights are still on. Therefore, they call the lamps as mere inert matter, meaning they call the one who illuminates others as the self-illuminating soul. It is the luminous energy of God. The soul is distinct from the body, intellect, senses, mind, and life force that are the result of evolution, and is distinct in nature. Because it pervades the soul, it is both gross and subtle It will remain, the whole universe will remain. The characteristics that exist for those who are in the matted hair do not exist for the soul, and the characteristics that do not exist for the soul do not exist for the soul. The body is born and dies, the soul is neither born nor dies. Even though united with the body, the soul is distinct from the body, but being of the same flesh, God, man, and the beginning are of the same nature, being united with the body, they are considered to be in the soul. The man who sleeps has dreams. In a dream, he sees many things. All of them will disappear as soon as they wake up, but even after the man wakes up, he will remain unchanged. Similarly, the soul also, even though these bodies perish, will not perish

The soul is subtler than the humble ‘mat’ (a type of floor covering). It can spread in the most intimate of relationships. The connection between a living being and nature is due to the play of Lord Vishnu. It is not natural for a being to exist. The connection with nature, which is endowed with the qualities of goodness, is caused by the will of God through the agency of karma. Nature is a tool for God. Appointed to it. He is adding this randomly without any desire. As soon as a man is connected with nature, he hides his soul. With that, the being is deluded into thinking that it is itself. By the will of God, according to the nature of karma, the living being performs actions, and he thinks that he is doing them himself. They are caused by the association of the three qualities of Sattva, Rajas, and Tamas, but the individual soul does not perform actions on its own. The soul performs actions due to its association with the gunas of Sattva, Rajas, and Tamas. The karma thinks that it is doing. He becomes a slave to that karma and gets bound. The doer is not the shaker. He is endowed with the quality of wisdom. The joyous one. His natural qualities and merits are hidden by his good and bad deeds. Natural Eight qualities are inherent in nature and manifest spontaneously. It is liberation. Living beings are naturally unqualified, imperishable, and pure. Those who have knowledge as their form are dependent on ignorance and ignorance as their quality. Karma is ignorance. They are agitated by it. Natural qualities are contraction I'll get it. From Brahma to the smallest particle, the living being enters into many different and peculiar bodies. Following that body, knowledge is spread by the gradation of Sattva, Rajas, and Tamas. For the sake of the body, for the sake of relatives, he performs the necessary actions. He experiences the happiness and sorrow appropriate to it. This is life.

The knowledge that is the righteousness of the souls, even if it is natural, is constrained by karma, and the development occurs before the end of that karma. In worldly tendencies, the karmic responsibility is not natural to the being. It is caused by natural factors. The body, senses, etc., the activities they perform, are done by the body because of the presence of the male. The man, being in the body, and that body, doing the actions that he thinks, that man himself experiences the fruit that comes from those actions. Thus, the form of nature and the form of man were revealed to Devahuti by Kapila. These natural beings were also the cause, even in the subtle state before creation, weren't they? Then he has no name or form. They are not possible to separate from the divine and know them. The reason is that the Supreme Being is like a body. Thus, the nature of the men, the characteristics of that nature, how a world is formed from those men, tell me its characteristics, thus Devahuti again questioned Kapila. It also exists in natural forms. Two In states, it has the qualities of Sattva, Rajas, and Tamas. That's what the main thing is. In the state of causality, there is no difference between earth, water, etc. Thus there cannot be a name-form division. They are in a state of nature. In the functioning, there are differences like earth, water, etc. Therefore, they call it special. The nature that is in a state of causality is called the unmanifest. In the functioning, there will be differences like earth, water, etc. The greatness begins from the earth and ends at the moon. From Brahma to the blade of grass, with different forms of bodies, in a functional manner, as good and bad, that nature itself is being discussed. The main forms are the five elements, sound, touch, form, taste, and smell, which are of five kinds. From these five, the gross, the sky, the air, the light. Water, earth, and other five elements are formed. Mind, ego, greatness, and unmanifest are all before these four.

From ego, the sense organs of knowledge and the sense organs of action, these are 10. Thus, from the main one, 24 elements are formed. Mahabhutamulu 5, Tanmatramulu 5, Shabda Sparshadulu 5, Indriyamulu 10. Besides these, there are four more: the inner mind, intellect, ego, and the unmanifest. The five sense organs are the ear, skin, eye, tongue, and nose. Speech, hand, leg, urinary opening, and anal opening are the five organs of action. The inner self is described with four different names due to the difference in business. The mind is the source of worry. The mind is the cause of resolve and choice. The intellect that causes certainty, the body that makes me feel like I am, is ego. The main division of the qualities of truth, etc., has been explained so far. I have explained. These are 24. The 25th Tattva is the Time. Some say it is a different philosophy. Time is the effect of the Supreme Being. It is because of that effect that the creation and destruction of the world are happening. The world is being governed by that influence. Atti bhagavat Some say time is energy. Moreover, time is the form of the divine. To consider something as the soul that is not the soul is ego. By this, the form of the man disappears. This nature, which is the main cause of darkness, reaches a very subtle state. Then the soul also, unable to separate itself, is included in it. Then the sattva, rajas and tamas gunas will be in equilibrium. That is the stage of destruction. At this stage, there is no name or form. Those subtle beings who are in a state of non-duality, without a name or form, united with the Supreme Soul, remain together without being able to be distinguished separately. Once upon a time, such natural men were united in such a way that they could not be recognized as this world. Once upon a time, such natural beings would experience fluctuations in the qualities of Sattva, Rajas, and Tamas, which could lead to the transformation into this worldly form. The cause of that movement is time. The natural beings, before creation, appeared different from God, but they remained as God. Therefore

Time is a bribe. The time when it was like the body of God. The name for moving motion is time. In this way, nature, men, and time, whatever form they may have. I explained it to you. We'll learn more about the front part in another episode, in the podcast. I want to hear it again so I can understand better. Greetings to the esteemed devotees. We'll catch up in the next podcast. Jai Srimannarayana and salutations to the Ashram Guru.