శౌనకాది మునుల జిజ్ఞాస - కలియుగ జీవుల రక్షణ

Questions by the Sages & Protection of Souls in Kali-Yuga

bhagavatam

ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, నైమిశారణ్యంలో సమావేశమైన శౌనకాది మహర్షులు సూత గోస్వామిని సమీపించి, కలియుగంలో జీవులకు అత్యంత శ్రేయస్కరమైన మార్గమేదో తెలుపమని వినయంగా ప్రశ్నిస్తారు. కలియుగ దోషాల వలన క్షీణించిన మానవాళికి ముక్తిని కలిగించే సాధనమేదో అన్వేషించే ఈ మహర్షుల జిజ్ఞాస అత్యంత ప్రేరణాదాయకంగా ఉంటుంది. వ్యాసదేవుని మరియు శుకదేవ గోస్వామి నుండి జ్ఞానమును పొందిన సూత గోస్వామి, శ్రీహరి నామ సంకీర్తనమే కలియుగ జీవులకు పరమ రక్షణమని ప్రేమతో బోధిస్తారు. ఈ ఎపిసోడ్ శ్రీమద్భాగవతం యొక్క దివ్యమైన పునాదిని స్థాపిస్తూ, భగవన్నామ శ్రవణం మరియు కీర్తనమే సర్వ దుఃఖాలకు సాధనము

In this sacred episode of the Srimad Bhagavatham podcast, we explore the opening of Canto 1, where the great sages assembled at Naimisharanya earnestly approach Suta Goswami with profound questions about the highest good for humanity. The sages, led by Shaunaka Rishi, inquire about the essential duty of mankind — particularly for souls struggling in the darkness of Kali-Yuga — and seek the most effective path to liberation. Suta Goswami, having received the wisdom of Vyasadeva and Shukadeva Goswami, compassionately reveals that the continuous hearing and chanting of the glories of Lord Vishnu is the supreme remedy for all afflictions of this age. This episode sets the luminous foundation of the Bhagavatham, reminding us that divine knowledge, lovingly shared among sincere seekers, is the greatest gift one can offer to suffering souls.

← Prev Next →
Questions by the Sages & Protection of Souls in Kali-Yuga bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నారాయణం నమస్కృత్య నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక ప్రథమ స్కంధం సెకండ్ పార్ట్ పాడ్కాస్ట్ లో స్వాగతం. జన్మాద్యస్య యతోన్వయాత్ ఇతరతశ్చార్ధేశ్వభిజ్ఞ స్వరాట్ తేనే బ్రహ్మహృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజోవాని మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో అమృషా ధామ్నాస్వేన సదా నిరస్త కుహకం సత్యం పరం ధీమహి ఇది భాగవతంలో ప్రథమ శ్లోకం. ఈ చేతనా చేతనమయగు జగత్తు యొక్క జన్మ స్థితి లయాదులు దేని వలన జరుగుచున్నవో అది బ్రహ్మము. ఈ జగత్తునకు బ్రహ్మము తానే రెండు విధములకు కారణమగుచున్నది. బ్రహ్మముచే నిర్మింపబడిన కార్యములగు దేవ మనుష్యాది సకల పదార్థములలో అనువర్తించి ఉండుటచే బ్రహ్మమే ఉపాదాన కారణమై ఉన్నది. తాను వ్యాపించియుండు ప్రకృతి పురుషుల కంటే వేరుగా ఉండి వాని నియమించుచుండుట వలన నిమిత్త కారణమనియు బ్రహ్మమును ఎరుంగనగును. ఏ పదార్థమును నిర్మించుటకు ఏ మూల పదార్థమును ఉపయోగింతురో దానిని ఉపాదానం అందురు. ఉదాహరణకు కుండకు మట్టి ఉపాదానం. ఆ కుండను చేసేడి ఇచ్చా, జ్ఞానము, ప్రయత్నము గల కుమ్మరి నిమిత్త కారణం. ఈ జగత్ వానడి కార్యమునకు కారణము రెండును బ్రహ్మమే. అతడు ఎల్లప్పుడూ అంతటా అన్నిటినీ ఎరుంగగలవాడు అనగా సర్వజ్ఞుడు. తానే తన సంకల్పముచే తన శరీరముగానున్న చేతనా చేతనములను జగద్రూపముగా మార్చుగల కోరిక ప్రయత్నము కలవాడు.

కనుక నిమిత్త కారణం. అతడు స్వరాట్ అనగా స్వతంత్రుడు. కర్మకు అధీనమైన వాడు కాడు. తనంత తాను సర్వమును ఎరుంగగలవాడు. అట్టి జ్ఞానము అతనికి సహజము. ఆ పరబ్రహ్మమగు భగవానుడే తన సంకల్పముచే ఆది కవియగు చతుర్ముఖునకు ధర్మము మొదలగు పురుషార్ధములను దాని సాధనములను నిరతిశయ పురుషార్ధమగు భగవత్ స్వరూప రూప గుణములను ఎరింగించు ఋగ్వేదము మొదలగు వేద రాశిని ప్రకాశింపజేసెను. జ్ఞానము కలిగిన ఉపాసకులు కూడా భగవానుని వైభవము అపరిచ్ఛిన్నమగుటచే ఎరుంగలేక వ్యాకృతను చెందుచుందురు. అట్టి అపరిచ్ఛిన్నమగు బ్రహ్మ స్వరూపమును ఎరింగి అనుసంధానము చేసి వ్యాకులత తొలగవలెనని భగవానుడు వేదమును ప్రకాశింపచేసినాడు. వేదార్థములను ఎరుంగజాలిన కపిలుడు, హిరణ్యగర్భుడు, కణాదుడు, గౌతముడు, బుద్ధుడు, జినుడు, పశుపతి మున్నగు వారు బ్రహ్మ స్వరూప నిర్ణయమున సరియగు అవగాహన లేక మోహమునందిరి. సృష్టి ప్రారంభమున తేజస్సును, జలమును, అన్నమును అనగా పృథ్విని సృష్టించి ఆ మూడింటిని మరల ఒక్కొక్క దానిలో మూడేసి భాగములు చేసి అవి కలిసి ఉండునట్లుగా మిశ్రణము చేసినవాడు పరభ. బ్రహ్మో భగవానుడే అట్లు సృష్టించిన భూతములచే అండమును సృష్టించి దాని నుండి చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించినట్టు చేసినాడు. ఇట్లు సృష్టి ఆ పరబ్రహ్మము నుండే జరిగినను సప్తరజస్తమో గుణములు కల ప్రకృతి అతని శరీరమై అతని సంకల్పముచే మార్పు చెందునది కానీ మార్పు పరబ్రహ్మములో కలగదు. సత్వరజస్తమో గుణమును కల ప్రకృతి సృష్టించబడిన ఈ ప్రపంచము భగవానునకు వికారమును కలిగించదు. వికారము శరీరముకు ప్రకృతి యందు కలిగినది.

ఆత్మయగు పరబ్రహ్మం సంకల్పించినది. అట్టి పరబ్రహ్మము నిత్యము అసంకుచితమగు జ్ఞానము స్వాభావిక కలదనుటచే అతని జ్ఞానమునకు గోచరం కాకుండా మరుగుపరచగలిగినది ఏమీయు లేదు. ఎల్లప్పుడు మార్పు లేకుండా ఏకరూపముగా ఉండునది కనుక అది పరమ సత్యము. అది దేశ పరిచ్ఛేదము, కాల పరిచ్ఛేదము, వస్తు పరిచ్ఛేదము లేక అన్ని దేశముల యందు, అన్ని కాలముల యందు, అన్ని వస్తువుల యందు ఉండునది. అట్టి పరబ్రహ్మమును ధ్యానము చేయుదము అని శ్రీ భాగవతమును శుకయోగి ప్రారంభించినాడు. బ్రహ్మ స్వరూపమును ఉపనిషత్తు తెలియజేయుచు యతోవా ఇమాని భూతాని జాయంతే యేన జాతాని జీవంతి యత్ ప్రయంతి అభిసంవిషంతి తద్విజిజ్ఞాసస్వ తద్బ్రహ్మ అని ఈ కనుపట్టుచున్న వివిధములను విచిత్రములనగు భూతములన్నియు దేని నుండి పుట్టుచున్నవో, దేనిచే పుట్టి అవి జీవించుచున్నవో, దేనిని చేరుచున్నవో. మరల విడువక దేనితో కలిసి ఉండుచున్నవో అది బ్రహ్మము అని చెప్పిన వాక్యములోని యతః అనేటి పదమును తీసుకొని బ్రహ్మ సూత్రములో వ్యాసుల వారు జన్మాద్యస్య యతః అని సూత్రమున బ్రహ్మ లక్షణమును వివరించిరి. ఆ బ్రహ్మ సూత్రమును తీసుకొని జన్మాద్యస్య యతః అని శ్రీ భాగవతమును ఆరంభించిరి. అందుచే ఉపనిషత్తుల వివరణమే బ్రహ్మ సూత్రములనియు ఆ బ్రహ్మ సూత్రముల వివరణమే భాగవతమనియు తెలుచున్నది. అందుచే శ్రీ భాగవతము ఉపనిషదార్థ వివరణముకై ఆరంభింపబడిన గ్రంథము ఇందు ఆ బ్రహ్మమే శ్రీకృష్ణ భగవానుడుగా వర్ణింపబడును. ధర్మః ప్రోంగిత కైత ఊత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహాముని కృతే కింవా పరైరీశ్వరః సద్యో హృద్య వరుద్యతేత్ర కృతిభిహి సుశ్రూషభిస్తక్షణాత్ ఈ భాగవతమనందు

ప్రతిపాదింపబడు విషయము ధర్మము. ధర్మము అనగా సుఖమునకు సాధనము. నిరతిశయముకు సుఖము మోక్షము. అనగా ఆనందప్రదుడగు భగవానుని చేరి యుండుట. దానికి సాధనములు రెండు విధములు. సాధ్యము, సిద్ధము. సాధ్యమనగా మనచే సాధింపబడునది. అది భక్తి. అదియే పరమాత్మను అనన్య ప్రయోజనముగా ప్రేమతో ఆరాధించుట. అంతేకాక భగవానుడే నిరవదిశమైన సుఖమును పొందించు సాధనం. అందుచే భగవానుడు సిద్ధ ధర్మం అందురు. ఈ రెండింటి చేతను కలిగెడి ఫలము తాపత్రయోన్మూలనము. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆదిదైవకములగు తాపములను తొలగించుట. దీనిని భాగవతమున భాగవత ధర్మముగా ముందు వివరింతురు. ఆ భాగవత ధర్మము మన మనస్సులో ఈశ్వరుని వెంటనే స్థిరముగా నిలిపివేయగలదు. అదే ఈ భాగవతమునకు ప్రధాన ప్రయోజనము. భగవానుడు హృదయమున స్థిరముగా నిరోధింపబడి ఇతర విషయముల సంఘము లేక ఉన్ననాడు. శరీరమును కలుగు బాధలు గానీ, మానసికమైన వేదనలు గానీ, ప్రాణుల చేత కలుగు ఉపద్రవములు గానీ, దైవికంగా సంభవించు ఉపప్లవములు గానీ వారిని వికారమును అందింపజాలవు. ఇందు ప్రతిపాదింపబడిన సుఖ సాధనమైన ధర్మము పరమము. అనగా దానిని మించినది వేరొక సుఖ సాధనము లేదు. అందు ఏ విధమైన వంచన ఉండదు. ఏదో వేరొక దానిని పొందుటకు దీనియందు ప్రవర్తింపజేయుట గాక సాక్షాత్ పరమానందమును పొందింపజేయు సాధనమగు ధర్మమే ఇందు ప్రతిభాంబిబడును. శమదమాదులు కలిగి క్షుద్రముగు ఫలములనిచ్చు కామె కర్మలయందు గాని ఒకరిని హింసించుటకు నాశనము చేయుటకు చేసెడి కర్మలయందు గాని ప్రవర్తింపని వారును బ్రహ్మ స్వరూపును ఎరింగి దానిని పొందవలెనని కోరిక కలిగిన వారును అగు సత్పురుషులు ఈ ధర్మమును ఆచరించినారు. తర్వాత భాగం మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. Jai Srimannarayana. Gurubhyo Namah.

Jai Srimannarayana, salutations to the Gurus. Salutations to Narayana. Salutations to Narasimha. The best of men is Narasimha. Salutations to Goddess Saraswati. Then, Jai Udhirayet. Devotees of the Lord, welcome to the first part of Srimad Bhagavata Tattva Deepika, second part of the podcast. From the beginning of this birth, other beings, knowing the half-sound, know the beginning of Brahma's heart. Those who are brave, like the radiance of the earth, where the three worlds are, where the three realms are, we always know the endless hole, the supreme truth, the wisdom, the abode. This is in Bhagavatam The first verse. This consciousness, the birth, existence, and dissolution of the world, what causes them to happen is Brahman. Brahma is the cause of both these worlds. Because Brahma is the cause of all things, including gods, humans, and other beings, which are created by Brahma, Brahma itself is the cause of the material cause. Because he is different from the nature and men who are spread out, and because he is appointed, it is the cause of the effect, and he does not know Brahma. The material from which a substance is made is called the raw material. For example, clay for a pot The offering. That pot is made by a potter with intelligence, knowledge, and effort. The cause of this world's rainbow is both Brahma. He is always the one who knows everything, meaning omniscient. He is the one who has the desire and effort to transform his body, which is his body, into the form of the world through his determination.

The cause is the reason. He is Swarat, meaning independent. He is not a slave to his actions. He who knows everything by himself. Such wisdom was natural to him. That Supreme Being, the Lord, through His will, made the original poet, the four-faced one, realize the Purusharthas, including Dharma, and their means, and illuminated the Vedas, including the Rigveda, which is the form of the Supreme Being, the form of the quality of virtue. Even those devotees who have knowledge, unable to understand the unparalleled glory of the Lord, are subject to delusion. Thus, the unbroken form of Brahma, by connecting the ear, the Lord has illuminated the Vedas so that the anxiety may be removed. Those who could not understand the meanings of the Vedas, such as Kapila, Hiranyagarbha, Kanada, Gautama, Buddha, Jinna, Pashupati, etc., were deluded by ignorance without proper understanding of the Brahma Swaroopa. In the beginning of creation, the one who created light, water, and food, that is, the earth, and again divided those three into three parts each, and mixed them together in such a way that they remain together, is Parabha. Brahmo The Lord himself created the universe through the beings created accordingly, and from that, the four-faced Brahma manifested. Thus, even though creation happened from that Supreme Brahman, the nature with the qualities of Saptharajastamo, becoming his body, is subject to change by his will, but change does not occur in the Supreme Brahman. The nature that has the qualities of Sattva, Rajas, and Tamas, this world created by nature, does not cause any distortion to God. Vikaram is the body that is in nature.

It is the will of the supreme being, the Aatma. That supreme Brahman, being eternal and naturally unconcealed, is such that nothing can conceal it from his knowledge. Because it is always uniform without change, it is the ultimate truth. That is the country's distinction, the time's distinction, the object's distinction, or that which exists in all countries, in all times, in all objects. Thus, Shuka Yogi started the Sri Bhagavatam, saying that one should meditate on the Supreme Brahman. The Upanishads explain the form of Brahma, saying, 'From whom these beings are born, by whom they live, and by whom they depart, knowing that, examine that, that is Brahman.' Thus, all the various and strange beings that are seen, from what are they all Which are being born, Born of what, and living, what are they reaching for? Again, without releasing, what is united with, that is Brahmam, taking the word 'yathaha' in the sentence that said, in the Brahma Sutra, Vyasula they explained the characteristics of Brahma in the sutra 'janmadyasya yathaha'. That Brahma Taking the sutra, they began the Sri Bhagavatam, saying 'Janmadyasya Yatah'. Therefore, it is understood that the explanation of the Upanishads is the Brahma Sutras, and the explanation of those Brahma Sutras is the Bhagavata. Therefore, the book that began to explain the meaning of the Upanishads, in this, that Brahma is described as Sri Krishna Bhagavan. Dharma, which is spoken of, is the supreme among the non-self, the knowable of all knowable things. The truth is that the object is Shiva, the remover of the sufferings of the three kinds of suffering. Is it the creation of the great sage, or is it the creation of another god? Immediately, it is pleasing and beautiful. From the works, there is a moment of well-being. In this Bhagavatam

The subject matter proposed is dharma. Dharma is the means to happiness. Perpetual happiness and liberation. That is, to be united with the Lord, the giver of bliss. There are two types of exercises for that. Possible, possible. It is possible that it can be achieved by us. It is Bhakti. That is to say, to worship the Supreme Being with love and unconditional benefit. Besides that, God is the means to attain the unceasing happiness. Therefore, the Lord is Siddha Dharma. The fruit obtained by combining these two is the cessation of suffering. The spiritual, the material, and the divine sufferings. This is described as Bhagavata Dharma in the Bhagavata. That Bhagavata Dharma can immediately and permanently establish God in our minds. That is the main purpose of this Bhagavatam. The Lord is firmly established in his heart, and there is no union of other things. Neither the physical pains, nor the mental anguish, nor the calamities caused by creatures, nor the divine upheavals, can cause them to be distressed. The Dharma which is proposed here is the ultimate happiness. That is, it surpasses it There is no other means of achieving happiness. There is no pretense. Instead of merely acting upon it to attain something else, the means to attain direct supreme bliss is the Dharma itself, which is reflected in this. Those who do not have anger, who do not act in actions that cause poverty and fruitless results, or in actions that cause harm and destruction, and those who desire to attain the form of Brahma The saints have practiced this dharma. We can learn about the next part in another podcast. Jai Srimannarayana. Gurubhyo Namah.