గంగావతరణం, ఇక్ష్వాకు వంశం మరియు శ్రీరాముని దివ్య లీలలు

Ganga's Descent, Ikshvaku Kings, and Sri Rama's Divine Leelas

bhagavatam

ఈ ప్రవచనంలో భగీరథుని తపస్సు ద్వారా గంగావతరణం, శివుడు గంగను జటాజూటమున ధరించి సగరపుత్రులను తరింపచేసిన వృత్తాంతం వివరించబడింది. సౌదాసుడు, ఖట్వాంగుడు వంటి ఇక్ష్వాకు వంశ రాజుల చరిత్ర, వారి భక్తి మరియు ధర్మనిష్ఠ వివరించబడ్డాయి. శ్రీరాముని జన్మ, విశ్వామిత్ర యజ్ఞ రక్షణ, సీతా స్వయంవరం, వనవాసం, రావణ సంహారం, పట్టాభిషేకం వరకు దివ్య లీలలు సంక్షిప్తంగా వర్ణించబడ్డాయి. శ్రీరాముని స్మరించిన వారు కర్మబంధాలు వీడి మోక్షం పొందుతారని, ఆయన పాలనా విధానం తర్వాతి రాజులకు మార్గదర్శకమైందని నొక్కి చెప్పబడింది.

This discourse covers the descent of the sacred river Ganga through Bhagiratha's penance, explaining how Shiva bore her force and how her waters liberated the sons of Sagara. It then traces the Ikshvaku lineage through kings like Soudasa, Khatvaanga, and Dasharatha, highlighting their devotion and moral trials. The session provides a detailed account of Sri Rama's life, from his birth and heroic deeds to his exile, the rescue of Sita, and his eventual return to the divine abode. The discourse emphasizes that Sri Rama's life exemplifies dharma and that remembering him frees devotees from the bonds of karma.

← Prev Next →
Ganga's Descent, Ikshvaku Kings, and Sri Rama's Divine Leelas bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః న తథా శశి న సలిలం న చందన రసో న శీతల ఛాయ ప్రహ్లాదయతిహి పురుషం యథా మధుర భాషిణీ వాణి తీపి మాటలు మనిషికి ఆనందాన్ని ఇచ్చునట్టు చందమామ, చన్నీరు, చందనం, చల్లని నీడ ఇవేవీ ఇవ్వలేవు. ఆడియోక్తి 12th. భగద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక ఏడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు అంబరీశ్వర్య భాఖ్యానము, సుకన్య చరిత్ర, ఇక్ష్వాకు వంక్షంలో భాగంగా మనం హరిశ్చంద్రుని కథ సౌభరి వృత్తాంతము, సగరుని యొక్క వృత్తాంతము తెలుసుకొని దానిలో ముందుకు వెళుతూ గంగా అవతారం గురించి తెలుసుకుందాం. గంగను తేవలెనని అంశుమంతుడు తపస్సు చేసెను. చాలా కాలం తపస్సు చేసినను గంగ దిగి రాలేదు. అతడు మరణించెను. అతని కుమారుడు దిలీపుడు కూడా ప్రయత్నించి విపులుడాయెను. అతని కుమారుడు భగీరథుడు గొప్ప తపస్సు చేసెను. అతని గంగ దర్శనం వసంగెను. అతడు తన పినతాతల మోక్షమునకై దిగి రమ్మని ప్రార్థించెను. దిగి వత్తును గాని ఆకాశము నుండి భూమికి దిగినప్పుడు నా వేగమును ఎవరు భరింతురు? ఎవరెను అడ్డు అడ్డి నన్ను భూమిపై నిలపనిచో ఆ వేగముతో నేను భూమిని ఛేదించుకొని పాతాళమునకు పోయెదను. నేను భూమిపై ఉన్నచో పాపాత్ములు తమ పాపములను నాలో కడిగి కొందురు. ఆ పాపమును నే ఎచ్చట కడువుకొనవలెను అందుచే నేను భూమికి దిగిరానని పలికెను. అప్పుడు భగీరథుడు అమ్మా లోకమునంతను పవిత్రము చేయువారు బ్రహ్మనిష్టులు ధర్మిష్టులు శాంతులు. అగు సన్యాసులు, సాధువులు నీ యందు స్నానము చేసి నీ పాపమును పోగొట్టగలరు. సాధువుల యందు శ్రీహరి నివసించి యుండును. అతడే పాపమును హరించువాడు. ఎల్ల శరీరధారులకు రుద్రుడు ఆత్మ. అతని యందు ఈ విశ్వమంతయు పడగ పేక వలె పడుగు పేక వలె అల్లుకొని ఉన్నది. అతను నిన్ను ధరింపగలడు అని చెప్పెను. గంగా నీవా పరమశివుని నా జలమును ధరించినట్లు ప్రార్థించుము నేను దిగి వస్తును అనెను.

భగీరథుడు పరమశివుని గూర్చి తపస్సు చేసెను. అతడు ఆశుతోషుడు అల్పకాలమునని అనుగ్రహించెను. భగీరథుడు చెప్పినట్లు సర్వలోక హితమును కాంక్షించు శివుడు శ్రీహరి పాదస్పరశచే పవిత్రమైన జలములు గల గంగను తన జటామధ్యమున ధరించెను. దాని చేతనే అతడు శివుడు ఆయెను. లోక పావని గంగ శివ జటాజూటము నుండి వెలువడి భగీరథుని రథం వెంట పరువులెత్తుచు వచ్చి కపిల కోపాగ్ని దగ్ధులైన సగరపుత్రులను తడిపెను. ఆ జలస్పర్శ మాత్రముచే బ్రాహ్మణ అపచారముచే దగ్ధులైన శగరపుత్రులు స్వర్గమునకేగిరి. చూడుడు గంగ మహాత్మ్యము దహింపబడిన శరీర భస్మమునకు గంగాజలములు తగిలినంత మాత్రముచే వారు స్వర్గమునందిరి. ఈ శరీరముతోనే గంగాజలమును స్పృశించినచో ఉత్తమ గతులు కలుగుటకు సందేహము లేదు. ఇందులో ఆశ్చర్యమేమున్నది? శ్రీహరి చరణారవిందముల నుండి విడవలినది కదా? ఆ చరణామృతము సంసారములోని జనులను పావనము చేయుటలో సందేహము లేదు. శ్రీహరి చరణ పద్మములను శ్రద్ధతో మనసులో నిలిపినచో త్రిగుణాత్మకము శరీర బంధము వీడి భగవత్ సాయుధ్యము లభించును. ఇక శ్రీహరి చరణము నుండి వెలువడిన గంగలో స్నానము చేసిన వారికి భగవత్ సాయుధ్యం కలుగుటలో సందేహమేమి? అతి పవిత్రము గంగను ఈ లోకమునకు తెచ్చి మహోపకారము చేసిన భగీరథుడు మనకు చిరస్మరణీయుడు. అందుకే అతని పేరుతో గంగను భాగీరథి అని వ్యవహరింతురు. ఆ వంశములోని వాడు ఋతుపర్ణుడు. అతడు నలునకు అక్షవిద్యనొసంగి అశ్వవిద్యనొందినాడు. ఆ వంశముననే సౌదాసుడు జనించెను. అతని భార్య మదయంతి. అతడు ఒకనాడు వేటకేగి ఒక రాక్షసుని చంపెను. ఆ రాక్షసుని సోదరుడు తన సోదరుని చంపినాడని పగతో సౌదాసుని ఇంటిలో వంటవాడుగా చేరి మనుష్య మాంసమును వండి గురు వశిష్టునకు పెట్టెను. వంటవాడు పెట్టినాడని భావింపక వశిష్టుడు ఆ అపచారమునకు రాక్షసుడు కమ్మని సౌదాసుని శపించెను. కానీ రాజును తెలియకుండా వంటవాడు చేసిన తప్పుని తర్వాత గుర్తించి రాక్షసుడుగా 12 సంవత్సరములు మాత్రం ఉన్నట్లు ఏర్పరచెను. అప్పుడు సౌదాసునికి కోపం వచ్చెను. తాను చేయని పాపమునకు తను శపించినాడని గురువునకు ప్రతిశాప మోసంగవలెనని దోసులో నేను గ్రహించి మంత్రించెను. భార్య మందయతి.

భార్య మదయంతి గురువును శపించరాదని వారించెను. అతడు ఆ శాప జలమును వదులుటకు ఎటువైపు చూసినను అంతటా జీవరాశి కనిపించుచుండుటచే వానిపై వదులుట తగదని ఆ జలమును తన పాదములపై పోసుకొని తానే ఆ శాపమును అనుభవించెను. గురువు శాపముతో రాక్షసుడైన అతని పాదములు కల్మషం అయివి కలవ్యాయను. రాక్షసత్వం పొంది అరణ్యములో తిరుగుచు అడవిలో వసించున్న విప్ర దంపతులను చూచెను. వారు సంభోగ సుఖమును అనుభవించుండిరి. రాక్షసుడుగా వారిని పట్టి తినవలెనని ఆ పురుషుని భంక్షించుటకు లాగికొనెను. భర్తకు సంభోగముచే తృప్తి కలగక మునుపే ఇతరట్లు బలాత్కరముగా లాగివేయుట చూచి ఆ బ్రాహ్మణి భార్య అటు చెప్పినది నీవు రాక్షసుడవు కావు ఇక్ష్వాకు వంశమున ఉత్తమ క్షత్రియుడవు. నీ భార్య మంద మదయంతి ఇట్టి అధర్మమును చేయుట నీకు తగదు. సంతాన వాంఛచే నేను ఆ భర్తను కూడి యుంటిని. కోరిక తీరకుండా నీవు లాగి వేసితివి. మనుష్య శరీరము సకల పురుషార్థ సాధనము. అట్టి శరీరమును భదించుటచే పురుషార్థ కాని హాని కలుగును. ఈ నా భర్త సర్వభూతాంతర్యామియగు మహాపురుషుని ఆరాధించు బ్రహ్మరిషి. రాజర్షివైన నీవు ఈతన్ని చంపుట కుమారుడు తండ్రిని చంపినట్లు అగును. పాపమెరుగని ప్రవచనశీలగు ఈ బ్రహ్మవేత్తను చంపుట గోవధ చేసినంత పాపం నీకు అతనిని తినవలెని ఉన్నచో ముందు నన్ను తినుము. అతడు లేనిదే నేను ఒక క్షణము జీవింపజాలను అని మొరపెట్టుచున్నాను. శాపముచే ఒడలెరుగక పెద్ద పులి పశువును తిన్నట్లు సౌదాసుడు ఆ బ్రాహ్మణుని తినెను. అప్పుడు ఆ భార్య దుఃఖించుచు కోపగించి సౌదాసుని క్షమించెను, క్షపించెను. కామార్తురాలనై భర్తతో కూడి ఉండగా గర్భవతిని కాకుండా విడదీసి నువ్వు నా భర్తను చంపితివి. కనుక నీవు నీ భార్యతో కలిసి గర్భాదానము కాకముందు చనిపోదువు కాక. అని ఆ సౌదాసుని శపించెను. అగ్నిని ప్రజ్వలింపచేసుకొని అందుపడి మరణించి భర్తృ సాన్నిధ్యమును ఆమె పొందెను. 12 సంవత్సరముల తరువాత గడిచిన తరువాత సౌదాసుని శాపం విడిపోయెను. అతడు భార్యతో రమించుటకు అభిలషించెను. కానీ ఆ బ్రాహ్మణి వసంగిన శాపమును ఎరింగిన మదయంతి భర్తను వారించెను.

సౌదాసుడు శాపభీతిచే శ్రీ సుఖమును విడనాడెను. సంతతి లేదు వంశకరుడవ కుమారుని అనుగ్రహింపమని వశిష్టుని ప్రార్థింపగా అతడు ఆమె యందు గర్భమును ఉంచెను. ఏడు సంవత్సరముల వరకు సంతానము కలగలేదు. గర్భమును భరించి ఓర్వలేక రాతితో తన గర్భమును ఆమె పగలు కొట్టుకొనెను. ఆ గర్భము నుండి కుమారుడు జన్మించెను. అతడే అస్మకుడు అను పేరుతో వ్యవహరింపబడెను. ఆ వంశమున ఖట్వాంగుడు అను మహారాజు ఉండెను. అతడు దేవతల ప్రార్థనపై దైత్యులను సంహరించుచుండెను. చనిపోవుటకు ఒక గడియ సమయం ఉన్నది ఎరింగి తన పట్టణమునకు తిరిగి వచ్చి ఇటు తలంచుండెను. బ్రాహ్మణ కులము కంటే నా ప్రాణములు నాకు ప్రియమైనవి కావు. భగవానుని కంటే నా బిడ్డలు నాకు ఎక్కువ కాదు. బాల్యమునందు కూడా నా మనసు అధరం వైపు ప్రసరించలేదు. భగవంతుడు లేని పదార్థమును నేను లోకమును ఎచ్చడను కాంచలేదు. దేవతలకు నాకు కావలసిన వరమును వసంగిదమనిరి. దేవతలకు నాకు కావలసిన వరము వసంగిదమనిరి. కానీ నా మనసు సకల భూతాత్ముడగు వాసుదేవుని భావించుచు ఇతర వరములను కోరలేదు. దేవతల ఐశ్వర్యములో అధికులైనను ఇంద్రియములను జయింపలేక తమ హృదయములో ఉన్న భగవానుని అన్నిటికంటే ప్రియమైన వానిగా గుర్తింపలేరు. ఇంకా ఇతరుల సంగతి చెప్పునదేమి? భగవన్ మాయా పరికల్పితములగు ఈ లోకములు ఈ శరీరములు అస్థిరములు. అందుకే వీనియందు సంఘమును వీడి భక్తితో సకల లోక భర్తయగు భగవంతునే శరణు పొందెదను. ఇట్లు నిశ్చయించుకొని మనసును నారాయణుని ధ్యానించుచు ఇతర విషయమును మరచి అజ్ఞానము వీడి సాయుధ్యము నొందెను. భగవద్భక్తులు ప్రమాణ సిద్ధము, అనంత కళ్యాణ గుణకరము, హే గుణ రహితము, బ్రహ్మమొగు వాసుదేవుని సేవింతురు. అన్యమును మరిచి యుందురు. ఇట్లు ఘట్వాంగ మహారాజు ఒక ఘడియలో దృఢమైన భావనతో నారాయణుని ఆశ్రయించి మోక్షమునందెను. ఆ వంశముననే దశరథ మహారాజునకు సాక్షాత్తు బ్రహ్మరూపుడైనటువంటి శ్రీహరి తన అంశచే నాలుగు భాగములుగా దేవతా ప్రార్థనచే కుమారులుగా జన్మించెను. రామ, లక్ష్మణ, భరత, క్షత్రజ్ఞులని వారు వ్యవహరింపబడుచుండిరి.

ఆ నలుగురు లోక ప్రసిద్ధులు. దర్శకులగు ఋషులు శ్రీరామ చరితమును విస్తారముగా అనుభవించిరి. తండ్రి మాడ నిలుపుటకు రాజ్యమును వదిలి పరమ సుకుమారి అయిన సీతమ్మ స్పృశించిన కంది పెవుననంత సుకుమారమైన పాదములతో అడవిలో నడిచినాడు శ్రీరాముడు. నడిచిన బడలిక తొలగినట్లు సుగ్రీవునుచే లక్ష్మణుచే సేవింపబడినాడు. శూర్పణఖను విరూపణ చేసి ప్రియవరహమును విరహమును అనుభవింప సిద్ధపడి ఆ ఎడబాటుచే కలిగిన కోపముతో ముడిచిన కనుబొనులకు గడగడ వణికిన సముద్రమున సేతు నిర్మించినాడు. నీచులగు రాక్షసులను కార్చిచ్చు వలె దహించినాడు. అట్టి కోసలేంద్రుడకు శ్రీరాముడు, కోసలేంద్రుడకు శ్రీరాముడు మనల్ని రక్షించుగాక. విశ్వామిత్ర యజ్ఞమునకు విఘ్నకరులకు రాక్షసులను లక్ష్మణుని సాయం అక్కరలేక ఒక్కడే సంహరించిన వీరుడు శ్రీరాముడు. లోకములను వీరులందరూ చేరిన సీతా స్వయంవర సభలో 300 మంది తెచ్చిన శివ ధనుస్సును గున్నటేనుగు చెరుకు కర్రను విరిచినట్లు విరిచినాడు శ్రీరాముడు. తనకు అనురూపములకు గుణములు, శీలము, వయస్సు, సౌందర్యము గల సీతమ్మను స్వీకరించి 21 సార్లు రాజుల బీజము లేకుండా సంహరించిన పరశురాముని గర్వమును భంగపరిచినాడు శ్రీరాముడు. తండ్రి మాటను కూడా పాటించి రాజ సంపదను వదలి నిస్సంగుడగు ముని వలె అడవికెగినాడు శ్రీరాముడు. దుష్ట బుద్ధియగు శూర్పణగా కర్ణ నాసికలను ఛేదించి ఆమె మాటచే తను ఎదిరించిన ఖరదూసిన త్రిశూలులు. మొదలగున్ 14,000 మందిని కోదండ మాత్ర సహాయుడై సంహరించిన మహావీరుడు శ్రీరాముడు. సీతా కథా శ్రవణముచే కామము ఉద్దీప్తమై రావణుడు ప్రేరణ చేయగా మారీచుడు మాయామృగమై దండకారణ్యమునకు రాగా సంహరించినాడు శ్రీరాముడు. రాక్షసాధముడగు రావణునిచే తాము ఆశ్రమములో లేని ఆశ్రమములో లేని సమయమున సీత అపారింపబడగా సోదరునితో కలిసి దినుని వలె వనమున వెతికినాడు శ్రీరాముడు. దానిచే స్త్రీయందు సంఘము దుఃఖములకు మూలమని స్వామి లోకములకు చూపినాడు. శ్రీరాముడు ప్రయోజనమునకై ప్రాణములను వదిలిన జటాయువునకు దహన సంస్కారములు చేసి మోక్షమును కొసంగి కబంధుని మాటను అనుసరించి వానులతో మైత్రి చేసుకొని బ్రహ్మ రుద్రాదులచే సేవింపబడి పాదపద్మములు గల శ్రీరాముడు మనుజత్వం నిరూపించుటకై

వానరులతో కలిసి సీతాన్వేషణకై నడిచి సముద్రమును చేరెను. స్వామి కోపముచే చలించిన సముద్రుడు స్వరూపముతో ఎదురుగా వచ్చి ఇట్లు పలికెను మేము జడబద్ధులము నీ రూపమెరంగలేకపోతిమి నీవు కూటస్తుడవగు ఆదిపురుషుడవు జగదీశుడవు నేను స్వతంత్రుడని భావించితిని. నేనే కాదు రజోగుణముచే బ్రహ్మాదులు కూడా అహంకరించుందురు. ఈనాడు నేను కూడా అహంకరించి అపచారపడితిని. క్షమింపుము. లంకకేగుము, నాపై సేతువును బంధింపుము. యుద్ధమున రావణుని చంపి పత్నిని పరిగ్రహింపుము. నీ కీర్తిని లోకమునందరూ గానము చేయుచుందురు అని సముద్రుడు పలికిన పలుకులు విని. సముద్రముపై సేతువును బంధించి విభీషణుడు మార్గదర్శనము చేయుచుండగా ముందే హనుమంతునిచే దహింపబడిన లంకకు చేరెను. లంకాపురము కపి సైన్యముచే కలచబడి ఏనుగులచే క్షోభనొందిన మడుగు వలె కనపడెను. రవణాసురుడు నికుంభ, కుంభ, ధుమ్రాక్షాదులను పంపి చివరకు కుంభకర్ణుని కూడా యుద్ధమునకు పంపెను. రాక్షసులకు, వానరులకు తీవ్రమగు యుద్ధము జరిగెను. రాక్షస సైన్యం నశించెను. రావణాసురుడు తన సైన్యము నష్టమగుటను ఓర్వలేక శ్రీరామును ఎదిరించెను. మాతలి ఇంద్రుని పేరైనచే తెచ్చిన రథమును శ్రీరాముడు అధిరోహించెను. రావణుడు యుద్ధము చేయుచుండగా శ్రీరాముడు మేము ఆశ్రమం లేనప్పుడు దొంగతనముగా సీతను అపహరించిన దుష్కార్యమునకు ఫలమును అనుభవింతువు గాక అని అతని హృదయమును ఛేదించెను. రావణుడు చనిపోయెను. మండోదరి పరివార స్త్రీలతో వచ్చి భర్తకై విలపించెను. విభీషణుడు రామచంద్రుని ఆజ్ఞచే సోదరుని సంస్కారములు చేసెను. విరహముచే కృషించిన ప్రియతమయమగు సీతమ్మను విమానముపై ఆరోహింపచేసుకొని విభీషణునకు రాజ్యము సంగి అయోధ్యకు మరలి వచ్చెను. భరతు నందిగ్రామంలో చూసి అతడు అర్పించిన పాదుకలను స్వీకరించి గాఢ లింగనము చేసుకుని బాష్పములను వదులుచు అయోధ్య చేరి సోదరులతో గురువులతో ప్రకాశించెను.

దీక్షా విసర్జనము చేసుకొని గురువాగ్యచే పట్టాభిషక్తుడు ఆయన. రాముడు రాజుగా ఉండగా లోకమంతయు ఆనందముతో నుండెను. తరువాత యజ్ఞమును అనుసరించి యజ్ఞమును అనరించి తనకున్న రాజ్యమునంతను మృత్విక్కులనొక సంగెను. వారు మరల ఆ రాజ్యమును రామునకు అర్పించిరి. ఒక రాత్రి గూఢముగా సంచరించుచు శ్రీరాముడు సామాన్యుడు ఒకరు తన భార్యను దూషించుచు సీతను గూర్చి పలికిన మాటలు విని సీతమ్మను వాల్మీకి ఆశ్రమనుకు పంపెను. అచ్చట ఆమెకు కుషుడు, లవుడు అని ఇద్దరు కుమారులు కలిగిరి. లక్ష్మణునకు అంగదుడు, చిత్రకేతుడు అని ఇద్దరు కుమారులు కలిగిరి. భరతునకు తక్షుడు, పుష్కరుడు అని ఇద్దరు కుమారులు కలిగిరి. శత్రుఘ్నునకు సుబహువు. సుబాహువు, శృతసేనుడు అని ఇద్దరు కుమారులు కలిగిరి. భరతుడు దిగ్విజయము చేసి గంధర్వులకు చెందిన ధనమును తెచ్చి శ్రీరామునకు అర్పించెను. శత్రుజ్ఞుడు మధువను రాక్షసిని కుమారుడగు లవణుని చంపి మధువనమున మధురను పట్టణమును నిర్మించెను. సీతాదేవి వాల్మీకి మహర్షికి తన కుమారులను అప్పచెప్పి శ్రీరామును పాదములని ధ్యానించుచు భూమిలోకి పోయెను. భూమిలోకి ఏగెను. శ్రీరామచంద్రుడు సీతాదేవి భూప్రవేశ వార్త విని శోకముతో కృంగిపోయెను. సర్వేశ్వరుడుగా శ్రీరామునికి భార్యయందు ప్రేమ సహింపలేని బాధ కలిగించెను. స్త్రీ పురుషుల మధ్య సంఘము భయంకరముకు బాధను కలిగించు కలిగించునని నిరూపించుచు శ్రీరాముడు తాను దుఃఖమును అనుభవించెను. తరువాత సీతా వియోగముతో బాధపడుచు కొన్ని వేల సంవత్సరములు రాముడు గడిపి పరమ పదమునకేగెను. దండకారణ్యమున కంటకములచే వేధించబడిన పాదములను స్మరించు వారి హృదయములలో ఇప్పటికిని నిక్షేపించి రాముడు తన దివ్య మామును దివ్య ధామమునకేగెను. మానవుల కొరకే శ్రీరాముడు దిగి వచ్చి తాను పడరాని పాట్లు పడి ధర్మాచరణము చేసి లోకమునకు శ్రీరామచంద్రుడు చేసిన ఉపకారము ఏనాటికిని ఈ మానవ జాతి మరవలేదు. ఆ ప్రభువునకు శత్రుహరణమున కపులు సహాయభూతులు అనుకొనుట విడంబనము కాని స్వామికి వేరొకరి సహాయము కావలెనా? అట్టి శ్రీరామచంద్రుని స్మరించిన వారు, అనుసరించిన వారు కూడా తమ యోగ్యతలతో నిమిత్తము లేకుండా, చరాచర విభాగము లేకుండా కర్మ బంధములను వీడి మోక్షము నొందిరి.

శ్రీరామచంద్రుడు పాలించిన పాలనా విధానమే ఆ తరువాతి రాజులందరుకును మార్గదర్శకమాయెను. ఈ విధముగా ఇక్ష్వాకు వంశము సుమిత్రుడను రాజు వరకు సాగి కలియుగములో అంతమాయెను. దీనితో ఇక్ష్వాకు వంశం యొక్క చరిత్ర మనం ముగుస్తుంది. కొంత సమయం ఈ పూర్తి కథ చదువుకోవడానికి ఎక్కువగా తీసుకోవాల్సి వచ్చింది. తర్వాత భాగంలో మళ్ళీ మనం కలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. Like the moon, the stream, the sandalwood essence, and the cool shade, it pleases the man. Just as the sweet-speaking tongue gives joy to a person, so does the moon, coolness, sandalwood, The shade of a cool one could not be further from the reality. Audio 12th. Oh, devotees, welcome to the seventh podcast of Srimad Bhagavata Tattva Deepika. Until now, as part of the Ambarisha's story, Sukanya's story, and the Ikshvaku dynasty, we learned about the story of Harishchandra, the story of Soubhari, and the story of Sagara, and moving forward in that, let's learn about the incarnation of Ganga. Anshuman performed a penance to bring Ganga. Even after doing penance for a long time, Ganga did not descend. He's dead. His son Dilipa also tried but failed. His son Bhagiratha performed a great penance. His Ganga Darshan was completed. He prayed that he would descend to save his paternal grandfather. Even if I descend, when I descend from the sky to the earth, who will bear my speed? Who can stop me? If I am placed on the earth, with that speed I will break through the earth and go to the underworld. I am on the earth, sinners wash away their sins in me. Where should I bury that sin? Therefore, I have descended to the earth, he said. Then Bhagiratha said, Mother, those who purify the entire world are Brahmins, righteous people, and peaceful ones. Then the monks and ascetics, after bathing in you, can get rid of your sins. Sri Hari resides in the saints. He is the remover of sin. Rudra is the soul of all embodied beings. In him, the whole universe is interwoven like a mattress, like a mattress. He said he could wear you. Ganga, you are the supreme Shiva, pray that you accept my water. I will come down, he said.

Bhagiratha performed a penance for Lord Shiva. He blessed him with a short life. As Bhagiratha said, Shiva, desiring the welfare of all the worlds, held the Ganges, which was sacred water, in the middle of his matted hair, by touching the feet of Sri Hari. It is by that very thing that he became Shiva. The sacred Ganga, born from the matted hair of Shiva, came along with Bhagiratha's chariot, carrying the embers, and extinguished the anger of Kapila, and wiped away the sons of Sagara who were burnt. Those sons of Shagaraputra, who were burnt by the touch of water and the insult of Brahmins, went to heaven. See, the greatness of Ganga, just as Ganga water touches the ashes of a burnt body, they reached heaven. If one touches the Ganges water with this body, there is no doubt that one will attain the best of destinations. Is there anything surprising about this? Isn't it from the lotus feet of Srihari that we are separated? There is no doubt that that verse's nectar purifies the people in the world. If one keeps the lotus feet of Sri Hari in their mind with devotion, they will be freed from the three-fold bondage of the body and attain the union with the Divine. Now, having taken a bath in the Ganges that emerged from the feet of Srihari What is their doubt in attaining the state of being one with the divine? Bhagiratha, who brought the most sacred Ganga to this world and did great service, is immortal to us. Hence, the Ganges is also known as Bhagirathi after him. Rituparna is the name of a descendant of the lineage. He gave up the art of archery and took up the art of horse riding. The lineage descended through the male line. His wife's name is Madayanthi. One day he went hunting and killed a demon. That demon's brother, out of revenge, joined Saudas's house as a cook and cooked human flesh and gave it to Guru Vasishta. Vasishta, not considering that the cook had done it, cursed Saudas, the demon, for that misdeed. But without the king knowing, the cook realized the mistake he made and then established that he was a demon for 12 years. Then the anger of Saudas appeared. I realized in my heart that the curse of the guru, that he had cursed for a sin he did not commit, would be deceptive, and I chanted a mantra. The wife is a chorus girl.

The wife, Madayanthi, forbade her guru from cursing her. He, to release that curse water, wherever he looked, all living beings were visible, so he thought it was not right to release it on him, and pouring that water on his feet, he himself experienced that curse. With the curse of the guru, the feet of the demon became impure, Kalvayanu. Having attained the demonic nature, he saw the Brahmin couple wandering in the forest and residing in the forest. They were enjoying the sexual pleasure. He wanted to devour the man to devour them as demons. Seeing that the other one was forcibly pulled before the husband was satisfied with intercourse, that Brahmin's wife said, you are not a demon, you are an excellent Kshatriya in the Ikshvaku dynasty. Your wife, Madam, is not worthy of doing such unrighteousness. I was with my husband because of the desire for children. You've pulled the trigger on your own desire. The human body is the instrument of all human activity. Such a body, by being maintained, causes harm that is not considered as a purpose of life. This is my husband, a Brahma Rishi who worships the great being who is the controller of all beings. You are a Rashi Killing this person will be like killing the son killing the father. To kill this Brahmin, who is without sin and is full of prophecy, is as sinful as slaughtering a cow. If you want to eat him, eat me first. I am pleading that I cannot live even for a moment without him. Unable to bear the curse, like a big tiger eating an animal, Saudas ate that Brahmin. Then the wife, grieving and angry, forgave Saudas, forgave him. While she was pregnant with her husband, you separated her from him and killed my husband. Therefore, you, along with your wife, will die before conceiving a child. And cursed the Saudas. She ignited the fire, fell into it, and died, and she attained the presence of her husband. After 12 years had passed, Saudas's curse was lifted. He desired to enjoy himself with his wife. But Madayanti, knowing the curse of the Brahmin woman, stopped her husband.

The merchant, fearing a curse, lost his wealth. There was no offspring, so when she prayed to Vasishta to bless her son, he placed the fetus in her womb. They did not have children until they were seven years old. Unable to bear the pregnancy, she beat her womb with a stone day and night. And the Son of the Eternal Feminine was born. He was known by the name Asmakudu. In that lineage, there was a great king named Khatvangudu. He was slaying the demons in response to the prayers of the gods. There was a time before death. Erngi returned to his town and thought this way. Nothing but my life shall ever be considered sacred in comparison with a Brahmin. My children are dearer to me than God. Even in my childhood, my mind did not turn towards the base. I have never seen the world without God. They said that they would grant me the boon I desired for the gods. The gods asked for a boon from me. But my mind, considering Vasudeva, the embodiment of all beings, did not ask for any other boons. Even though they are the lords of the gods' wealth, they cannot conquer their senses They cannot recognize the Lord who is dearest in their heart. What about others? Oh Lord, these worlds and bodies, which are imagined by Maya (illusion), are unstable. Therefore, leaving the church in this world, I will surrender to the Lord, the Lord of all the worlds, with devotion. Thus, having decided, meditating on Narayana, forgetting other things, abandoning ignorance, he attained union. The devotees of the Lord are established in the Lord, the infinitely auspicious, the one without qualities, they serve the one who is Brahman. They forget the other. Thus, King Ghatvanga, with a firm resolve, took refuge in Narayana and attained salvation in a moment. In that lineage, Srihari, who is the direct form of Brahma, was born as sons to Dasaratha Maharaja through his part, in four parts, through the prayer of the deities. Rama, Lakshmana, Bharata, and Kshatriyas, they were being treated as.

The four are world famous. The sages, the directors, have extensively experienced the story of Sri Rama. To sustain his father, Sriram walked in the forest with the tender feet of Sitamma, who was very delicate and touched the kingdom, with the tender feet of a pigeon. As if the fatigue of walking was removed, he was served by Sugriva and Lakshmana. Having disfigured Surpanakha and prepared to experience separation from Priyavaraha, he built a bridge in the sea with the terrified eyebrows that were clasped with the anger caused by that separation. He burned the vile demons like a firebrand. May Lord Rama protect us, for we are the protectors of Kosalendra and Sri Rama. Sriramudu is the hero who killed the obstacles, the demons, and Lakshmana, without needing anyone's help, for the Vishwamitra Yagna. In the Sita Swayamvara assembly where all the heroes of the world gathered, Sriram broke the Shiva bow brought by 300 people, like a mace breaking a sugarcane stick. Having accepted Sita, who possessed qualities, character, age, and beauty similar to herself, he took the seed of the king 21 times Without that, Sriramu destroyed the pride of Parashurama who had destroyed. Following his father's words, abandoning his royal wealth, Sriram went to the forest like a detached sage. The wicked Shurpanakha, with her evil mind, pierced the ears of Karna, and with her words, she defeated the Kharadusa, who had three tridents. Sriram, the great warrior who killed 14,000 people including Kodanda Mata. By listening to the story of Sita, lust was ignited, and Ravana inspired him. Maricha, disguised as a magical deer, came to the Dandaka forest, and Sriram killed him. When Sita was abducted by Ravana, who was a demon, at a time when they were not in the hermitage, Sriramudu searched in the forest with his brother like a hunter. By that, the Swami showed the world that the church is the root of sorrows in women. Sri Rama, after performing the cremation rites for Jatayu, who sacrificed his life for the benefit of Sri Rama, attained salvation. Following Kabandhudu's words, he befriended the Vanas, was served by Brahma, Rudra, and others, and attained human birth To prove

He set out with the monkeys to search for Sita and reached the ocean. The ocean, moved by Swami's anger, came in front of him in the form of a voice and said thus: We are bound by chains, we cannot see your form, you are the original being, the lord of the universe, I thought I was independent. It is not only me, even Brahma and others are egoistic due to Rajoguna. Today, I too, having been arrogant and wronged, ask for forgiveness. Go to Lanka, and bind the bridge over me. In the war, kill Ravana and take his wife. Hearing the words spoken by the ocean, that your fame will be sung by all the world. While Vibhishana was building the bridge over the sea and guiding, he reached Lanka, which was already burnt by Hanuman. Lankapura was like a pond, shaken by the army of monkeys and disturbed by elephants. Ravanasura sent Nikumbha, Kumbha, and Dhumraksha, and finally sent Kumbhakarna to the war. A fierce battle took place between the demons and the monkeys. The monstrous host is destroyed. Ravanasura, unable to bear the loss of his army, confronted Sri Rama. Sri Rama rode the chariot brought by the name of Matali Indra. While Ravana was fighting, Sriram said, "When we are not in the ashram, may you experience the consequences of the evil deed of stealing Sita secretly," and he pierced his heart. Ravana died. Mandodari came with her family and women and lamented for her husband. Vibhishana performed the last rites of his brother by the orders of Rama. Having endured separation, she ascended the airplane with her beloved Sita and returned to Ayodhya after the kingdom was given to Vibhishana. Bharata, seeing in Nandigramam, accepted the sandals offered by him, performed deep Lingam, shed tears, reached Ayodhya, and shone with his brothers and gurus.

He is the one who was crowned by Guru Gyaan after taking the Diksha. When Rama was the king, the whole world was filled with joy. After that, following the Yagnya, having performed the Yagnya, he gave away all his kingdom to Mrutvikkuna. They again offered that kingdom to Rama. One night, secretly wandering, Sriramudu, a common man, hearing the words spoken by someone insulting his wife and Sita, sent Sitamma to Valmiki's ashram. There, she had two sons, Kushudu and Lavudu. Lakshmana had two sons, Angada and Chitraketu. Bharata had two sons, Takshaka and Pushkara. Subahu for the enemy. Subahu and Shrutasena were two sons. Bharata, after achieving victory, brought the wealth belonging to the Gandharvas and offered it to Sri Rama. The enemy, having killed Madhuvanu, the son of the demon, Lavanu, built the city of Madhuranamu in Madhuvanam. Sita Devi, handing over her sons to Valmiki Maharshi, meditated on Sriram's feet and went into the earth. Into the earth It happened. Sriramachandrudu, hearing the news of Sita Devi's invasion of the land, was deeply saddened. As the supreme being, he caused unbearable pain to Sri Rama's wife for not being able to love her. Sriramudu, proving that the association between men and women causes terror and pain, experienced sorrow himself. After that, Rama spent thousands of years suffering from the separation from Sita and reached the supreme abode. Remembering the feet afflicted by thorns in Dandakaranya, Rama, who had deposited them in their hearts even now, ascended to his divine abode. For the sake of humans, Sri Rama came down and endured unbearable hardships, practiced righteousness, and the favor that Sri Ramachandrudu did to the world has never been forgotten by this human race. It is a disgrace to consider the helpers of the Lord as enemies, but does the Lord need someone else's help? Those who remembered and followed that Sriramachandra, without any merit of their own, without any division between the animate and inanimate, renounced the bonds of karma and attained liberation.

The governance system followed by Sri Ramachandra served as a guideline for all subsequent kings. In this way, the Ikshvaku dynasty continued until the king Sumitra, and ended in the Kali Yuga. With this, the history of the Ikshvaku dynasty comes to an end. It took a while longer to read through the whole thing, but I knew I had to get to the end. We will meet again in the next episode. Jai Srimannarayana. Salutations to the Gurus