రహూగణ మహారాజు పల్లకి మోయుట
Carrying King Rahugana's Palanquin
శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని ఈ అద్భుతమైన ఘట్టంలో, మహాజ్ఞాని జడభరతుడు సింధు-సౌవీర రాజు రఘూగణుని పల్లకి మోసే పనిలో నియమింపబడతాడు. పల్లకి సరిగ్గా నడవడం లేదని రాజు జడభరతుణ్ణి కఠినంగా మందలించగా, జడభరతుడు దేహము, ఆత్మ మరియు కర్తృత్వ భ్రమ గురించి అమూల్యమైన జ్ఞానాన్ని బోధిస్తాడు. ఒక బ్రహ్మజ్ఞాని సాంసారిక అవమానాలకు ఎంత నిర్లిప్తంగా ఉంటాడో, మరియు అత్యంత సాధారణ పరిస్థితుల్లో కూడా దైవజ్ఞానం ఎలా ప్రవహిస్తుందో ఈ కథ స్పష్టంగా తెలియజేస్తుంది.
In this profound episode from Canto 5 of Srimad Bhagavatham, the great sage Jada Bharata is engaged as a palanquin bearer for King Rahugana of Sindhu-Sauvira. When the king rebukes Jada Bharata for walking unevenly and slowing the palanquin, Jada Bharata responds with timeless wisdom about the nature of the body, the soul, and the illusion of doership. This remarkable encounter reveals how a realized soul remains undisturbed by worldly insults, and how divine wisdom can flow even from the most humble of circumstances.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తుభ్యం భగవతే బ్రహ్మణే పరమాత్మనే నయత్ర శ్రూయతే మాయా లోక సృష్టి వికల్పనా నిర్గుణ పరబ్రహ్మవు, సగుణ బ్రహ్మవు, ప్రాణులలోని అంతరంతమమగు ఆత్మవు నీవే. నీకు నమస్కారము. లోకముల సృష్టి రూపములో నుండే వివిధములగు కల్పనలకు ఆశ్రయమైన మాయాశక్తి నీయందు నీకంటే భిన్నముగా లేదని. స్తుతి చెప్పుచున్నది. టెన్త్ క్యాంటో, 28th చాప్టర్, సిక్స్త్ ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక. 15వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రియవతుడి చరిత్రంలో మనము జడభరతుడి యొక్క వృత్తాంతాన్ని, జడభరతుడు రహుగణుని మధ్యలో జరిగినటువంటి తత్వ విషయాన్ని తెలిపేటువంటి వృత్తాంతాన్ని. మనం చాలా వరకు అనుభవించాం. అయితే ఆ విషయంలో చర్చిస్తుండగా భావాటవి గురించి ప్రస్తావన మనం విన్నాము 14వ ఎపిసోడ్లో. దాని గురించి వివరణ అడుగుతున్నారు. పరీక్షిత్ మహారాజు ఆ విషయాన్ని ఇక్కడ తెలుసుకోబోతున్నాం. పరీక్షిత్తుడు ఇలా చెప్పగా విని చెప్పిన భవాటవి వర్ణము వివేకము గలవారు బుద్ధిచే గ్రహింపజాలుదురు కానీ వ్యుత్పత్తి లేని నా వంటి వారు ఎరుంగజాలరు కావున ఈ కథలోని లోపలి భావము నాకు వివరింపుడు. అని అడిగాను. జీవులందరూ సంసారమనేది ఒక అడవిలో భగవానుని అధీనమందున్న ప్రకృతిచే ప్రవేశపెట్టబడినారు. ఈ అడవి దుర్గమము. ఈ అడవిలో ప్రవేశించుటకు కారణము జీవులే. మాయ అనబడి ప్రకృతి వికారమగు మన శరీరము సత్వము, రజస్సు, తమస్సు అను గుణములు కలది. ఈ ప్రకృతిలో చేరిన జీవులు శరీరమే తాను అనుకొనుచు సప్తరస్తమో గుణములచే జీవులకు సాత్వ కర్మలయందు, రాజసమైన కర్మలయందు, తామసమైన కర్మలయందు ప్రవృత్తి కలుగుచుండును. ఈ కర్మలు సుఖములను, దుఃఖమును కలిగించును.
సాత్వికమైన కర్మలు సుఖమునకు సాధనము. రాజసమైన కర్మలు దుఃఖమునకు సాధనములు. తామసమైన కర్మలు పరాగును, నిద్రను, సోమరితనమును, మోహమును కలిగించును. జీవులు అనేక రకములగు శరీరముల్లో ప్రవేశించి అనేక విధములు కర్మలు చేయుచుందురు. వానిచే శరీరముతో సంబంధము, వియోగము, మరల శరీర సంబంధము, వియోగము కలుగుచుండును. ఇదే సంసారం. అది దాటుటకు శక్యము కాని అడవి దారి. ఈ శరీరములో ఉండి సుఖములకు సాధనములని కర్మలను చేయుచొందురు. ఆ కర్మలచే కలిగెడి సుఖ దుఃఖములు అనుభవించుటకు మరల శరీరం పొందుచుండును. దీనికి అంతు లేదు. ఎప్పుడు ఈ అడవి దారిలో పడినామో తెలియదు. అంతు లేదు. మొదలు లేదు. తానే చేసుకునిన కర్మల యొక్క ఫలమును తానే అనుభవింపక తప్పదు. ఎన్నో పనులు మంచివి చేయవలెనని అనుకొనుచుండును. విఘ్నములు వచ్చి ఆగిపోవుచుండును. ఇట్టి సంసారపు టడవిలో నడిచిపోవు బాటసారులే జీవులు. వారి అడవిలో ఆధ్యాత్మిక తాపములను అనగా శరీరమునకు మనసునకు కలిగే రోగములను బెంగలను అనుభవించుచుందురు. అట్లే జంతువుల వలన తమతో సమానులగు మనుష్యుల వలన తాపములు కలుగుచుండును. అవి ఆదిభౌతికములు. పిడుగులు, తుఫానులు, భూకంపములు మొదలగు వాని వలన కలిగెడి దుఃఖములు అధిదైవికములు. ఈ విధములగు దుఃఖములను పోగొట్టుకొనుటకు మరల మరల కర్మలు చేయుట వలన ప్రయోజనము లేదు. హరి గురు చరణారవిందములయందు మనసు నిలిపి భక్తులు అనుసరించడి భక్తి మార్గమును పొందవలెను. సంసారమే ఒక అడవి. ఇందు చర్మము, కన్ను, చెవి, ముక్కు, నాలిక అనేడి ఐదు జ్ఞానేంద్రియములు. మనస్సు అనడి ఆరు ఇంద్రియములు దొంగల వలె పొంచి ఉండును. బాహ్యముగా దొంగలు చేసేడి పనిని ఇవి లోపల చేయుచుండును. దొంగల వలె దోచుకొనును. దుష్ట జంతువుల వలె హింసించును.
పురుషుడు ఎంతో కష్టపడి సంపాదించిన ధనమును దొంగలు దోచుకొందురు. అట్లే జీవుడు ఎంతో కష్టపడి అనేక జన్మల పుణ్యం వలన శరీరమును పొంది భగదారాధన అనడి ధర్మమును ఆచరించుటకు శరీరమును పొందును. ఆ ధర్మమే జీవునకు ధనము. ఆ ధనమును ఇంద్రియములు, మనసు క్షుద్రములైన విషయముల వైపు, గ్రామ్య సుఖముల వైపు మనసును మళ్ళించి దోచుకొని పోవును. ధర్మమును ఆచరించుట మరచి విషయ భోగమును అనుభవించును. అడవిలో తోడేళ్ళు క్రూర ముఖములు ఉండును. అట్లే సంసారములో గృహస్తుగా ఉన్నవానికి భార్యా బిడ్డలు క్రూర ముఖముల వలె చేరి ఉందురు. ఇష్టము లేకపోయినను చూచుండగానే భగవంతుని సేవను మరిపించి విషయ భోగముల వైపు భార్యా బిడ్డలు లాగివేతురు. భగవంతునికై ఉపయోగపడవలసిన మనస్సును ఇంద్రియములను తమ వైపు తిప్పి వీరు హింసింతురు. మనం ఉండే గృహస్థాశ్రమమునకు ముఖ్యమైనది ఇల్లు. అది కర్మక్షేత్రం. ఇది పంట పొలం వంటిది. వంట పొలములో తుప్పలను, చెట్లను నరికి, దున్ని, విత్తనములు చల్లి వ్యవసాయము చేతురు. కానీ ఈ మొక్కలకు, తుప్పలకు అడుగున ఉన్న వేరు పూర్తిగా దహింపబడకపోవుటచే మరల వ్యవసాయంతో పాటు మొక్కలు కూడా పుట్టి పెరుగుచుండును. ఇంటిలో ఉండెడి సంసారి వ్యవసాయదారుడు. ఈ గృహమే క్షేత్రం. ఇది ఒక కర్పూరపు భరణి వంటిది. కర్పూరము తీసివేసినను కర్పూరం వాసన వదలనట్లు ఇంటిలో ఉన్నంత కాలము కర్మ వాసనలు వదలవు. ఆ కర్మలకు కారణము కామములు అనగా కోరికలు. ఆ కోరికలు వాసనల వలె వదలకుండా గృహస్తును అంటి ఉండును. వదలవు. అవి ఉన్నంత కాలము కోరికలు అనేటి మొక్కలు తుప్పలు పరియుచుండును. దానిచే కర్మలు సాగుచుండును. కావున కర్మలు మానుట కాదు. వాని మూలమైన కోరికలను వాసనలను దహించి వేయవలెను.
అప్పుడు మొక్కలు పుట్టవు. వ్యవసాయం పెరుగును. అట్లే జీవులు హరి గురు చరణములను ఆశ్రయించి కర్మలను అన్నిటినీ భోగదారాధనగా చేసినచో కర్మలకు మూలమైన వేళ్ళ వంటి వాసనలు దహించి వేయబడును. ఆత్మ సస్యము వృద్ధి పొందును. అడవిలో దోమలు, ఈగలు పెద్ద పెద్దవి కరిచి బాధపడుచుండును. బాధించుచుండును. అట్లే మిడతలు, పక్షులు, దొంగలు ఎలుకల వదలక హింసించుచుండును. ఈ సంసారములో తొలగించుకొనుటకు శక్యముగాని నీచులగు మానవులు ఈగల వలె దోమల వలె తొలగించుకొనుటకు శక్యముగాని వారై బాధించుచుందురు. మిడతలు మొదలనవి తినినట్లు ఇంట్లో ఉండి తినివేయుచుందురు. బంధువుల వలె వదలక సస్యములను పెరగనియ్యక హింసింతురు. అడవిలో ఒకప్పుడు ఊరు లేని చోట ఊరు ఉన్నట్లు జనులు తిరుగుచున్నట్లు ఎంతో ఆదరముతో భోగములను కల్పించునట్లు భూత ప్రేతాదులచే కల్పించబడిన నగరములు కల్పించుచుండును. అట్లే మనకు కూడా సంసారములో నేను నాది అనే అభిమానముచే శరీరము శరీరముకు చెందిన బిడ్డలు. భార్య మున్నగు వారిని ఎంతో ఆనందముతో సంసారులు అనుభవించుందురు. ఇవి గంధర్వ నగరం వంటివి. కొద్దిసేపు ఉండినట్లు ఉండిపోవును. అడవిలో ఒక్కొక్క చోట ఎండమావిలో నీరు కనపడుచుండును. అట్లే మన సంసారములో ఎన్నో విషయములు అనుభవింపరాని అనుభవింపజాలనివి అనుభవించుటకు తగినట్లుగా కనపడుచుండును. వాటికై మానవుడు ప్రాకులాడుచుండును. అడవిలో కొరవి దెయ్యములు కనపడుచుండును. అవి పెద్ద మంటల వలె కనపడుచుండును. చలి వేయుచున్నప్పుడు అది నిప్పు అనుకొని చలిని పోగొట్టుకొనుటకు దాని వద్దకు పరిగెత్తి పరిగెత్తి చివరకు దాని చేతనే చనిపోవుచుండును. అట్లే మన సంసారములో బంగారము కరువి దయ్యము వంటిది. ఇది అడవిలో అగ్ని వలె కనపడి కరువి దయ్యము ఆకర్షించినట్లు మానవులను ఆకర్షించును. అఖిల దోషములకు నివాస స్థానం. దాని రంగును వెలను చూచి దైన్యము తొలుగునని లోభముతో మానవుడు బంగారమునకై ప్రాకులాడును. అడవిలో కొరవి దయ్యము వెంట వెళ్ళినవాడు.
ఎట్లు మృత్యువు వాత పడునో అట్లే వీడును బంగారమునకై ప్రాకులాడి ప్రాకులాడి ప్రాణమును వీడును. అడవిలో సుడుగాలి వంటిది ఇంటిలో భార్య. ఆ సుడిలో పడి బయట పడలేనట్లు గృహస్తు భార్య అనేటి సుడిలో పడి బయట పడజాలడు. అది ధూళిని ఎన్ని వైపులా జల్లి కంటిలో పడునట్లు చేసి కన్ను కనబడకుండా చేయును. అట్లే కామిని అవకాంత ఆగు అట్లే కామిని అగు కాంత సంసారములో పురుషునిలో రజోగుణమును వృద్ధి పొందించును. కన్ను కనబడకుండా చేసి దిక్కు చోచక నడవవలసిన దారిని తెప్పి తరిగినట్లు చేయును. ఒకసారి ఇంద్రియములచే అనుభవించడి విషయములన్నియు అనర్థమును కలిగించునని తెలిసినను దేహమునందలి కోరికచే ఆ స్మృతి నిలవదు. మరల ఎండమాయు వంటి శబ్దాది విషయములనే అనుభవింపవలెనని పరుగులెడును. చీకటి వేళ ధ్వని చేసేడి పురుగుల వలె గుడ్లగూబుల వలె శత్రువులు, రాజులు, అధికారులు వినరాని మాటలు పలికి బెదిరించి భయపెట్టుచుందురు. వానిచ్చే ఒక్కొక్కప్పుడు మనసు చెడి బాధపడుచుండును. పూర్వము చేసుకున్న సుకృతముచే ఒకప్పుడు సుఖమును అనుభవించి ఆ సుఖము సుకృతము తగ్గగానే లేకుండా పోయిన ఆహారము లేక ధనము లేక ఎవరినో ఒకరిని ఆశ్రయించి జీవించవలెనని జీవస్ఫూర్తుల వలె తనకు పై వారికి కూడా ఉపయోగపడక జీవించడి కొందరిని ఆశ్రయించుచుండును. వారి చే దుఃఖములను అనుభవించుచుండును. ఈ సంసారమనే అడవిలో కొన్ని నీళ్లు లేని నదులు ఉండును. వేదములను, దేవతలను, బ్రాహ్మణులను నిందించుటచే పాపమునందిన వారల సహవాసముచే కొందరు మతిచెడి ఉందురు. అట్టి వారు నీళ్ల లేని నదులు లాంటి వారు. అట్టి వారితో సహవాసము నీళ్ల నీళ్లని నదిలో పడుట వంటిది. అట్టి నదిలో పడుట వచ్చే దాహము తీరదు సరికదా తల పగులును. అట్లే పాషండులతో సహవాసము ఈ లోకములో పైలోకములో కూడా. దుఃఖముగానే ఇచ్చును. ఈ సంసారంలోనున్న వారు ఇతరులను పీడించి అయినను తమ పొట్ట నింపుకొనవలెను ప్రయత్నించును.
అట్లు కూడా తిండి గడవని రోజు కొడుకుల తండ్రుల ఆస్తులనైనను దోచుకొని వారిని హింసించుచుందురు. మనము నివసించిన ఇల్లు కార్చిచ్చుతో నిండిన అడవి లాంటిది. దీనిలో పొందవలసిన వస్తువు ఒక్కటియును లేదు. దుఃఖముననే కలిగించుచుండును. అట్ ఇంటిలో ఉండి శోకాగ్నితో దహింపబడుచు తనను తాను నిందించుకొనుచు మోహమునందుచుండును. మనము ఎవరి వలన జీవించుందుమో అట్టి రాజులు, అధికారులు, రాక్షసులు వంటివారు మన ప్రాణములను కూడా అపహరించుటకు జంకరు. వారు హింసించుచు చనిపోయినట్లు ఉన్నను వదలక పీడించి బ్రతుకుచుందురు. కలలోని వస్తువులను చూచి ఉన్నవని భ్రమించినట్లే అవి తమకు ఉపయోగపడునని ప్రేమించినట్లే ఈ సంసారంలో పుత్రులు మొదలగు సుఖములు కూడా కొద్ది కాలము ఉండిపోయెడివే అని ఎరుంగక అట్టి వానిని అనుభవించుచు దుఃఖపడుచుండును. మోహమునందుచుండును. యజ్ఞయాగాది కర్మలు చేసి బ్రతికి ఉండగా శరీరాయాసము అనుభవించుచు శరీరం వీడిన తరువాత స్వర్గ సుఖము అనుభవింతుమని శ్రమపడుచుందురు. అది రాళ్లతో ముళ్ళతో నిండిన కొండను ఎక్కుట వంటిది. దుఃఖములే తప్ప సుఖముండదు. సుఖము లభించిన మరల మర వెంటనే పోవును. కొంతకాలము ఇట్లు జీవితము గడిపి శరీరములో శక్తి లేని వాడగును. ఆకలి వేయుచుండును. తాను ఏమియు చేసుకొనలేడు. అప్పుడు భార్యా బిడ్డల మీద కోపగించుచుండును. ఇట్లు సంసార మార్గములో పయనించుచు తనను గూర్చియు పరును గూర్చియు వివేకము లేక అజ్ఞానము అనేటి చీకట్లో ప్రవేశించును. అప్పుడు కేవలము శరీరముతో నేను ఉన్నాను అని మాత్రమే తెలియును. కానీ ఏమియు తెలియదు. శవం వలె ఉండును. అందరూ దూరముగా పరిహరించుచుందురు. దుర్జనులు పాముల వలె కాటు వేయుచుందురు. వారి మాటలచే చేతలచే గర్వం అంతం అయిపోవును. విజ్ఞానమంతయు కృషించిపోవును. ఊపిరి పీల్చుచు ఊపిరి పీల్చుచు ఎట్లో తిరుగాడుచుండును. చీకటి నూతిలో పడిన వాని వలె ఉండును. చివరి దశలో కూడా విషయ భోగమందు రుచి చావదు. పర స్త్రీలకై పర ధనమునకై ప్రాకులాడును. దొంగలింప ప్రయత్నించును పట్టుబడును. కారాగృహములలో బంధింపబడును. కావున సంసార క్షేత్రము ఈ లోకములో సుఖములను అందకుండా పై లోకములో సుఖములను పొందకుండా చేసేడి క్షేత్రం.
బంధము నుండి ఒకనాడు విడువడినను తనది అని మిగిలిన దానిని కూడా ఎవడో ఒకడు అపహరించుకొని పోవును. ఒక్కొక్కప్పుడు చలిగాలి మొదలగు. అది దైవిక దుఃఖములు, రోగములు, మానసికముకు పీడలు తొలగించుకొన శక్తి లేని వాడై అంతులేని దిగులు పడుచుండును. ఈ సంసారములో ధనము చాలా ప్రమాదమును కలిగించును. ధనమునకై ద్వేషములు ఏర్పడుచుండును. పూర్తిగా తన ధనము పోయి భోగములు ఏమియు లేక కోరికలు నెరవేరక ఒకరి సొమ్మును పొందుటకై ఆశపడి అవమానములు పాలకు చొందురు. ధనముచే పగ పెరుగును, వైరముచే అప్రియము చేయుచుండును. ఇట్లు బాధలను అనుభవించి వివాదమును కల్పించే ధనమును స్త్రీని వదలలేక మరల మరల వాటికే ప్రాకులాడుచుండును. ఇట్లు ఈ సంసార మార్గములో ఎన్నో బాధలు అనుభవించుచు తమతో నున్నవారు ఎందరో చనిపోవుచుండగా చూచుచు వారిని వదిలివేయుచు మిగిలిన వారిని ప్రేమించుచు వారిని నా వారిని ఆదరించుండును. నా వారని ప్రేమించుండును అట్లే ప్రేమించిన వారు చనిపోయినచో ఏడుచును. మోహపడును మనసులో తీవ్ర వేదన నందును. పెద్ద పెద్ద శబ్దములు చేయుచు అలజడి చేయును. ఒకప్పుడు నవ్వుచుండును ఈ సంసారమును దాటుటకు ప్రయత్నించుండును. కానీ ఎవ్వరును దాటలేరు. దాని అవతల బొడ్డు చేరుటకు మార్గమును తత్వవేత్తలు చెప్పుదురు. అది ఏ యోగానుశాసనం. అనగా కర్మ జ్ఞాన యోగములతో భక్తి కలిగి భోగధారాధనగా జీవితం సాగించుట. కొందరు మనసును నిగ్రహించిన వారు. భూతములకు ద్రోహము చేయుట మానినవారు సర్వ భూతముల యెడ మైత్రి గలవారుందురు. వారు నిరతిశయ సుఖం రూపమగు పరమాత్మ ప్రాప్తికి మార్గమును ఎరుంగుదురు. దిగ్గజములను జయింపగల భయం బలము కలవారై. ఉన్నను మనసును జయింపలేని వారు భక్తి యోగమును ఆచరించి నిరదిసే ఆనందమును పొందలేరు. వారు నేను అందరును జయింపగలను ఈ భూమి నాది అని వ్యర్థములగు అహంకారముతో చనిపోవు చొందురు. ఈ సంసార మార్గములో సుఖ దుఃఖములు, రాగ ద్వేషములు, చింతా భయములు, అహంకార ప్రమోదములు, శోక మోహములు, లోభ మాత్సర్యములు, ఈర్ష్యలు, ఆకలి దప్పులు, ఆది వ్యాధులు, జననా మరణాదులు మారి మారి వచ్చి పడుచుండును.
భగవన్ మాయ ఒక విలాసవతి స్త్రీ వంటిది. ఆయన మనసు కౌగలించుకొనుచు ఉండును. వెంటనే వివేక జ్ఞానము జారిపోవును. గృహమునందు వినోదమునందు. రక్షణమునందు మనసు తత్తరపడును. కుమారులయందు, కుమార్తెలయందు, భార్యయందు మనసు తగులుకొనును. వారి చూపులు, మాటలు, చేష్టలు హృదయమును ఆకర్షించును. మనసు లొంగకుండా పోవును. అపారముగు అంధతమస్సులో పడిపోవును. భగవానుని చక్రమే కాలచక్రము. అది ఎల్లప్పుడూ తిరుగుచునే ఉండును. అందుచే వయస్సు గడిచిపోవుచుండును. మనము చూడుచుండగానే పుట్టుట, చనిపోవుట, చూచుచు మనసు చెదిరి భయము కలుగును. కానీ ఇట్టి ఆపదలు కలుగుటకు భగవంతుడే కారణమని వానిని ఆశ్రయింపవలెనని కోరిక కలగదు. రాబందులు తోడేళ్ల వంటి క్షుద్ర దేవతలను ఆశ్రయింతురు. ఎట్లో దైవవశమున బ్రాహ్మణ కులములో పుట్టినను శ్రౌత స్మార్త కర్మానుష్టానము చేయుచు భోగదారాధనమే చేయవలెని పెద్దలు చెప్పుచున్నను మనసుకు రుచింపదు. శుద్ర కులముతో చేరును. వారితో కలిసి ఉండి సంతతిని పెంపొందించుకొని వారిని పోషించుచు సంతతము పిల్లలను కనుట పోషించుటే వృత్తిగా జీవించును. వైదికాచారములని స్త్రీలతో రమించుచు గ్రామ్య ప్రవర్తనతో జీవితము గడుపుచుండును. ఐహిక సుఖములను ఆశించి ఈ లోకమునందే ఆసక్తి కలవాడై పరలోకమును గుర్తి తలంపడు. ఇట్లు తిరుగుచు సంసార మార్గములో మృత్యువు అనడి ఏనుగు తరుముకొని రాగా కొండలోయల్లో పడిపోయినట్లు. అజ్ఞానముచే ఆపదలో చిక్కును, కర్మవశముచే చనిపోవక బ్రతికి ఉండును. ఎట్లో ఆపద నుండి బయటపడి మరల సంసార మార్గమున నడుచుచు సంసారనడి బాటసారులతో కలిసి ఈ లోకంలో పై లోకంలో తిరుగుచు సాగుచుండునే గాని దాని అంతు చేరలేడు. రహుగుణ్ణుకు ఉపదేశించిన భవాటవి వివరణము భరతుడే ఇట్లు వివరించెను. రాజర్షి బ్రహ్మభరతుడు అనుసరించిన మార్గం మనసున భావించుటకు కూడా ఎవరికీ శక్యము కాదు. ఈగ గరుత్మనిని గరుత్మంతుని ఎట్లు అనుకరించలేదో అట్లే భరతుని అనుకరింప ప్రయత్నించుట మహా హాస్యాస్పదం. భరతుడు యువకుడై ఉండియు వదులుటకు శక్యము గాని భార్య బిడ్డలను మిత్రులను రాజ్యమును భగవంతుని యందు ప్రీతితో వదిలినాడు. మధుసూదని సేవయందు మనసున అనురాగం ఏర్పడినవాడు ఇల్లు ఇల్లాలు స్వర్గంలో
లోకము, ఐశ్వర్యము మొదలు కోరదగిన వాటినే కాదు, యోగులు కోరడి క్షేమమును కూడా భగవత్ శివ కంటే కోరదగినదిగా భావింపలేదు. భగవత్ శివ కంటే కోరదగినదిగా భావించలేదు. ఆ భరతుడు రాజుగా ఉండి తర్వాత సంఘం వలన మృగమై మృగముగా ఉన్నప్పుడు కూడా నారాయణ స్మరణం మారలేదు. లేడి శరీరమును వీడుచు నారాయణాయ నమః అనుచునే ప్రాణములను వదిలినాడు. భగవత్ భక్తులందరూ ఆదరించిన గుణములను కర్మలు గల రాజర్షియగు భరతుని చరిత వినుట మంగళకరం. ఆయుష్యము కీర్తిని కలిగించును. స్వర్గమును మోక్షమును ప్రసాదించును. ఈ పరమపురుషుని సేవ కంటే వేరొకటి తనకు కావాలనే కోరిక కలగదు. దీని తర్వాత మనం భరత వంశ వర్ణాన్ని తెలుసుకుంటాం. భవాటయి వర్ణము చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఇది పూర్తిగా చేయడం కోసం కొంత పాడ్కాస్ట్ పెద్దగా అయింది. అందరూ దీనికి చదువుతా వింటారని అర్థం చేసుకుంటారని భావిస్తూ జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru, salutations to you, the Lord of the universe, the Supreme Soul, wherever this illusionary creation is heard, you are the formless, supreme Brahman, the virtuous Brahman, the soul within beings, you are the one. Namaste. The illusionary power that is the basis of various imaginations existing in the form of the creation of the worlds, is not different from you. Praise be to God. Tenth Canto, 28th Chapter, Sixth Prayer. Oh, devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to episode 15. Until now, in the history of Priyavati, we have the account of Jada Bharata, Jada Bharata, the account that tells about the philosophical matter that happened between Rahuganu. We've had plenty of opportunities. However, while discussing that matter, we heard about the sentiment in the 14th episode. They are asking me to explain it in detail. King Parikshit is about to learn this secret. When Parikshit said this, the wise, who had the knowledge of the meaning of the words, could not understand it by their intellect, but without etymology, my Those who are like that are not the reason, therefore explain the inner meaning of this story to me. I asked that. All living beings are brought into the world by nature, which is under the control of God. This forest is dangerous. The reason for entering this forest is the living beings. The body, which is called Maya, is a combination of the three Gunas (qualities) - Sattva, Rajas, and Tamas. The beings who have joined this nature consider the body itself as themselves, and through the quality of Sattva, the beings are inclined towards Sattva-karma, Rajas-karma, and Tamas-karma. These karmas give rise to material pleasures and sufferings.
“Passionate actions are the means to happiness. Royal deeds are the means to an end. Tamasic karmas cause delusion, sleep, laziness, and delusion. Living beings enter into many types of bodies and perform many kinds of actions. Through him, there is a connection with the body, separation, and again a connection with the body, separation. That is life. It's a wilderness path that is impossible to cross. They reside in this body and engage in actions that lead to pleasures and means. By those karmas, the happiness and sorrow experienced are again attained by the body. It goes on forever. I don't know when we entered the forest path. No end. No, there is no beginning. One has to experience the fruits of their own actions. I think many good things should be done. Obstacles will come and stop you. These are the travelers who walk in the path of this worldly life. They experience spiritual afflictions, that is, diseases and anxieties that affect the body and mind in their forest. Similarly, afflictions will befall you from animals and from people who are like you. They are elemental. Sadness caused by thunder, storms, earthquakes, etc., are supernatural. There is no benefit in repeatedly performing actions to get rid of these kinds of sorrows. By focusing the mind on the lotus feet of Hari Guru, devotees should attain the path of devotion. A family is a forest. These are the five sense organs: skin, eye, ear, nose, and tongue. The mind, as it were, six senses, lie in wait like thieves. These are doing the work that thieves do externally. Like a burglar. Like a beast, it's just a torturer.
The money that a man has earned with so much hard work is stolen by thieves. Similarly, a living being, after struggling a lot and acquiring a body through the merit of many births, attains a body to perform the duty of worshiping God. Righteousness is wealth. That wealth, senses, and mind, turning the mind towards trivial matters and worldly pleasures, will steal away. Forgetting righteousness, he indulges in sensual pleasures. In the forest, wolves have cruel faces. Similarly, for a householder in the world, his wife and children will be like cruel faces. Even if they do not like it, while watching, they forget the service to God and pull towards worldly pleasures, wife and children. They turn their minds and senses that should be useful to God towards themselves and torture them. The most important thing in the Grihastha Ashrama is the house. It is a karmayogastha. It's like a farm. In the kitchen garden, they cut, plow, and sow seeds, and do farming. But because the root at the bottom of these plants and bushes is not completely burnt, along with agriculture again Plants also grow. The householder was an agriculturalist. The house is the field. It's like a camphor tablet. Even if camphor is removed, just as the smell of camphor does not leave, as long as it is in the house, the smell of karma does not leave. The cause of those karmas are kamas, that is, desires. Those desires, like the smells, will not leave the householder. They will not leave. As long as they are there, the desires will be like plants, scattered. Through it, actions are carried out. Therefore, it is not that we should give up karma. One must burn away the desires and cravings that are their roots.
Then there will be no plants. Agriculture will increase. Similarly, if living beings, taking refuge in the feet of Hari Guru, perform all actions as enjoyment, the roots that are the origin of actions, like roots, will be burned away. The soul will grow. In the forest, mosquitoes and flies, the big ones, bite and cause suffering. Similarly, locusts, birds, thieves, and rats inflict violence without sparing anyone. In this world, those who are lowly and unable to be removed, like flies and mosquitoes, are afflicted by those who are unable to be removed. They eat as if they are eating from the beginning of the grasshoppers and eat while staying at home. Like relatives, without letting go, they torture the crops without letting them grow. In the forest, in a place where there was once no village, as if a village exists, as if people are wandering, with great reverence, as if providing pleasures, cities created by ghosts and spirits are being created. Similarly, in our family life, due to the ego of 'I' and 'mine', the body is like a child belonging to the body. Wives and others will experience their families with great joy. These are more like a Gandharva city. It seems to have been there for a while It will remain. In the forest, at each place, water is visible in the dew. Similarly, in our family life, many things seem to be inaccessible, unexperienced, and unexperienced. For them, mankind is suffering. In the forest, ghosts of the Koravi are seen. They look like big flames. When it is cold, it thinks it is fire and runs to it to get rid of the cold, and finally dies by its own hands. Similarly, in our family life, gold is like a demon. This appears like a fire in the forest, attracting humans as if a demon is attracted. The dwelling place of all evil. Seeing its color, man, with greed, covets gold, thinking it will remove poverty. The one who went after the Koravi ghost in the forest.
Just as death strikes, so too does he strive for gold, and so too does he lose his life. The wind in the forest is like the wife in the house. Just as one cannot get out of a whirlpool, a householder cannot get out of the whirlpool of his wife. It makes the dust fall into the eye in so many ways that it makes the eye invisible. Similarly, Kamini, the one who is not capable, similarly, Kamini, the one who is not capable, in the world, in the man, increases the Rajoguna. It makes the eye disappear and makes the path to be followed clear. Once, even knowing that all the things experienced by the senses cause misfortune, that memory does not remain due to the desire within the body. Again, one runs to experience things like the sunset, which are sensory experiences. Like insects that make noise in the dark, like eggs, enemies, kings, and officials utter unheard words, threaten and frighten. Sometimes, the things he gives, my heart gets hurt. Due to the good deeds done in the past, once happiness was experienced, and as soon as that happiness diminished, due to lack of food Without money, some live by depending on someone else, like living spirits, without being useful to others, some depend on others. They will experience their sorrows. In this world, like a forest, there are some rivers without water. Some people lose their minds by associating with those who condemn the Vedas, gods, and Brahmins, and by associating with those who commit sins. Such people are like rivers without water. Associating with such people is like falling into a river. Falling into such a river will not quench your thirst, but will only cause your head to break. Similarly, association with hypocrites, in this world and in the next world as well. Giving sorrow only. Those who are in this world, even if they torment others, should try to fill their stomachs.
Even on days when they don't have enough food, they rob the sons and fathers of their property and torture them. The house where we lived was like a forest full of wildfires. There is not a single item to be obtained in this. It causes sadness. Being at home, burning with the fire of sorrow, blaming himself, being in delusion. Those kings, officials, and demons by whom we live, do not hesitate to seize our lives as well. They torture and kill as if they are being tortured, without letting go. Just as one who mistakenly believes that the things in a dream are real, and loves them as if they are useful to them, similarly, without realizing that the pleasures of sons and others in this world will also be temporary, one who experiences such a person suffers. They are in delusion. While living by performing sacrifices and rituals, they experience physical exertion, and after leaving the body, they strive to experience heavenly bliss. It's like climbing a mountain full of thorns and stones. "...and only sorrow marches. Again, happiness is attained And then it goes away. After some time, having spent life like this, one becomes weak in the body. Hungry. He couldn't do anything. Then the wife will be angry with the children. Thus, traveling in the path of worldly life, without wisdom about oneself and about others, one enters the darkness called ignorance. Then only I am known to be with the body. But I don't know anything. It looks like a corpse. Everyone is distancing themselves. The wicked are like snakes in their venomous bites. Pride in their words and deeds will be destroyed. The whole world will be exhausted. Breathing, breathing, how does it revolve? Like one who has fallen into a dark well. Even in the final stage, the taste of worldly pleasures does not die. He is greedy for other women and other wealth. The thief will try to deceive and will be caught. Imprisoned in dungeons. Therefore, the field that prevents happiness in this world and prevents attaining happiness in the higher world.
Even if one day he is freed from bondage, someone will steal what is left of his. Sometimes it's just the cold air. He who is unable to remove divine sorrows, diseases, and mental afflictions will be in endless sorrow. In this world, money causes a lot of danger. Jealousy is a sin of money. Completely losing their wealth, having no pleasures, desires not being fulfilled, hoping to get someone's money, they suffer insults. Revenge is fueled by money, and hatred is fueled by disgust. Thus, having experienced suffering and created disputes, unable to leave the woman, he repeatedly falls into them. Thus, in this path of life, enduring many sufferings, while many who are with you are dying, seeing them, abandoning them, loving the rest, cherishing them, and protecting them. Those who love me will be in love, and if those who love me die, they will cry. He is fascinated, experiencing intense pain in his mind. Making loud noises and causing a commotion. Once upon a time, he/she used to laugh He is trying to overcome the world. But no one can beat him. Philosophers explain the path to reach the other side of the navel. It is the Yoga Shastra. That is, to live life with devotion, with the knowledge of karma and yoga, and to enjoy pleasures. Someone who has control of the mind. Those who have ceased to harm ghosts are those who have friendship with all beings. They will understand the path to the attainment of the supreme soul, which is the form of unconditional happiness. Those who are strong in fear and power to overcome the giants. Those who cannot conquer their mind by devotion cannot attain unconditional bliss. They, I, and everyone, will die with the arrogance that I can conquer this earth. In this path of worldly life, happiness, sorrow, attachment and aversion, worries and fears, egoistic delusions, sorrows and attachments, greed and envy, jealousies, hunger and thirst, and the initial diseases, births, deaths, and other such things keep changing and coming.
The Goddess Maya is like a luxury lady. He is one to embrace the heart. Instantly losing the wisdom of discretion. In the house, in the entertainment. The mind is apt to wander in defense. The mind is attached to sons, daughters, and wives. Their looks, their words, their actions, attract the heart. The heart does not allow itself to be subdued. Falling Into Great Darkness. The wheel of time is the cycle of time. It's always moving. Therefore, age is passing by. As we watch, birth, death, watching our minds are scattered and fear arises. But there is no desire to seek refuge in him, thinking that God is the reason for such calamities. The ravens are associated with the evil spirits, like wolves. Even though born in a Brahmin family by divine will, even though elders say that one should perform Shrauta and Smrita rituals and only indulge in pleasure, it does not please the mind. He joins the Shudra caste. Living with them, nurturing offspring, and taking care of them, nurturing children, and raising them, living as a profession. Vaidikacharamulani He spends his life enjoying himself with women and behaving in a village manner. Desiring worldly pleasures, being engrossed in this world, he does not recognize or consider the afterlife. Thus, wandering in the path of worldly life, death, like an elephant chasing, falls into the mountain valleys. By ignorance, one gets entangled in trouble, and by the power of karma, one lives on without dying. Even after escaping from any danger and again walking on the path of family life, along with those who travel the path of family life, he keeps wandering in this world and the next, but he cannot reach its end. Bharata himself explained the description of the Bhavatavi that was given to Rahugana. The path followed by the sage Brahmabharata is beyond the power of anyone to understand even in their mind. Just as an eagle cannot imitate Garuda, similarly, trying to imitate Bharata is utterly ridiculous. Bharata, being young, was unable to give up his wife, children, friends, and kingdom with love to God. He who has developed affection in his mind for the service of Madhusudana, his house, wife, and children are in heaven
The world, wealth, etc., not only those that are desirable, but yogis also did not consider the well-being of the desirable to be greater than the divine Shiva. He did not consider it to be inferior to Bhagavan Shiva. Bharata, being a king, and then, even when he was a beast due to the association, the remembrance of Narayana did not change. He gave up his life, chanting 'Narayanaaya Namaha' while abandoning his body. It is auspicious to listen to the story of Bharata, the king of kings, who is a royal sage with virtues and deeds that are cherished by all the devotees of God. May it bring glory and honor. Bestowing Heaven and Salvation. There is no desire for anything else that he desires, other than the service of this Supreme Being. After this, we will learn about the Bharata Vamsha Varna. The color is very, very important. This has been made possible by a significant increase in podcasts. Hoping that everyone will read and listen to this, Jai Srimannarayana Asmatgurubhyo Namaha