నారద మహర్షి దివ్యోపదేశము - ద్వాదశాక్షర మంత్ర సాధన
Narada's Instruction & Om Namo Bhagavate Vasudevaya
శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ ఎపిసోడ్లో, దేవర్షి నారద మహర్షి మోక్షాన్వేషి అయిన భక్తునికి దివ్యమైన ఆధ్యాత్మిక ఉపదేశమును అనుగ్రహిస్తారు. నారదుడు పన్నెండు అక్షరాల పవిత్ర మంత్రమైన "ఓం నమో భగవతే వాసుదేవాయ"ను ఉపదేశించి, దాని అద్భుతమైన మహిమను వివరిస్తారు. మంత్ర సాధనలో ఏకాగ్రత, భక్తి, మరియు భగవంతునకు సంపూర్ణ శరణాగతి అత్యంత ఆవశ్యకమని నారద మహర్షి స్పష్టంగా తెలియజేస్తారు.
In this episode of Srimad Bhagavatham Canto 4, the great sage Narada Maharshi imparts divine spiritual instruction to the devoted soul seeking liberation. Narada graciously initiates the seeker into the sacred twelve-syllable mantra, Om Namo Bhagavate Vasudevaya, revealing its profound significance and transformative power. He explains the proper method of mantra sadhana, emphasizing unwavering devotion, mental discipline, and surrender to Lord Vasudeva as the surest path to moksha.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః తస్మై నమః పరేషాయ బ్రహ్మణేనంత శక్తయే అరూపాయోరు రూపాయ నమః ఆశ్చర్య కర్మణే దేశ కాలములకు అతీతుడైన పరమేశ్వరుడు వాస్తవముగా రూపములు లేనివాడే అయినను బహురూపములుగా ప్రకటమైనాడు. అనంత శక్తిమంతుడు అగు ఆయన చేసే లీలలు అద్భుతములు. ఆయనకు అనేక నమస్కారములు. ఎయిత్ క్యాంటో థర్డ్ చాప్టర్ ఎయిత్ ప్రేయర్. భోద్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధం 11వ పాడ్కాస్ట్ లో స్వాగతం ధ్రువపాఖ్యానంలో మనం ప్రారంభం చేసుకున్నాం కిందటి పాడ్కాస్ట్ లో ధ్రువుడికి నారదుడు ఉపదేశం చేస్తాడు ఎలా తపస్సు చేసుకోవాలి ధ్యానం చేసే ప్రక్రియ ఏమిటి అనే విషయాన్ని. చెప్తాడు. తర్వాత భాగాన్ని మనం అనుభవిద్దాం. ఇట్లు నారదుడు ఉపదేశించగానే ధ్రువుడు అట్లే అని నారదునకు నమస్కరించి ప్రదక్షిణము చేసి పూర్వము శ్రీకృష్ణ పాద సంచారముచే పవిత్రమైన మధువనమున కేగెను. అతడు అట్లు వెళ్ళగానే నారదుడు ఉత్తానపాదుని భవనమున చేరి అంతఃపునమున ప్రవేశించారు. రాజు అతనిని ఉచితముకు సత్కారములతో ఆరాధించి ఆసనముపై కూర్చుండ చేసెను. నారదుడు రాజా ఏమట్లు ముఖం వాడిపోయి ఉన్నది ఏదో ఆలోచించుచున్నావు ధర్మము గాని అర్థము గాని కామము గాని లోపించలేదు కదా. నీ ఆలోచనకు కారణమేమో చెప్పుము అనెను. నారదా, నా కుమారుడు ధ్రువుడు ఐదు సంవత్సరముల వాడు. దయలేనిదై అంతఃపుర స్త్రీలలో ప్రధానురాలైన సురుచి అతడు రాజ్యమును వదిలిపోవునట్లు చేసినది. వినయము గలవాడు, బుద్ధిమంతుడు, పసివాడు అడవిలో బడలి చిక్కి నడవలేక దిక్కులేక నేలపడి ఉండును. వాడిని తోడేళ్ళు భక్షించును. నేను అంత దుర్మార్గుడను, ఆడదాని మాటకు వశపడిపోతిని.
నా తొడపై ఎక్కవలెనని కోరిన కుమారుని ఆదరించి కోరిక తీర్చలేకపోతిని దుర్మార్గుడను అని రాజు నారదునితో చెప్పెను. నారదుడు ఇలా అంటున్నాడు. రాజా, నీ కుమారుని గూర్చి విచారింపకుము. అతనిని దేవతలు రక్షింతురు. వాని ప్రభావము నీకు తెలియక వదలినావు. నీ కుమారుని కీర్తి లోకమంతా వ్యాపించును. లోకపాలురు కూడా చేయని పనిని చేసి అతడు కొద్ది రోజులలోనే నీ కీర్తి లోకమంతా వ్యాపించునట్లు చేసి తిరిగి వచ్చును. నారదుడు అట్లు చెప్పగానే ఉత్తానపాదుడు ఆ కుమారునే తలంచుచు రాజ్యమునందు ఆదరము లేనివాడై ఆలోచనతో ఉండెను. ఆ మధువనములో ధ్రువుడు యమునులో స్నానము చేసి తపస్సునకు ఉపక్రమించెను. ఋషి చెప్పిన మార్గమున మొదటి రాత్రి ఉపవాసము చేసి పరమ పురుషుడిని అర్చించినాడు. మూడు రాత్రులకు ఒకసారి వెలగ పండ్లు, రేగు పండ్లు ఆహారముగా తీసుకోనుచు శరీరమును నిలుపుకొనుటకు మాత్రమే ఆహారమును తీసుకునుచు ఒక నెల గడిపెను. రెండవ నెలలో ఆరు రోజులకు ఒకసారి ఆకులు, గడ్డి మాత్రము తినుచు భగవత్ ఆరాధన చేసెను. 3వ నెలలో 9 రోజులకు ఒకసారి నీరు మాత్రము తీసుకునుచు శ్రీహరిని అర్చించుచు ధ్యానము ధ్యానించుచు గడిపినాడు. 4వ మాసమున 12 రోజులకు ఒకసారి వాయువును మాత్రము ఆహారముగా తీసుకునుచుండెను. మిగిలిన రోజులలో ఊపిరి కూడా తీసుకోకుండా భగవానుని ధ్యానించుచు స్వామిని మనసులో నిలుపుకొనెను. ఐదవ నెలలో ఊపిరి పీల్చుట మాని భగవానుని ధ్యానించుచు ఒక్క పాదము మీద నిశ్చలముగా స్తంభము వలె కదలక నిలిచి ధ్యానించెను. మనస్సును బాహ్యమైన విషయముల నుండి వెనకకు నిలిపెను. హృదయములోనే నిలిపి. భగవానుని దర్శించుచుండెను. మరొక రూపమును అతడు చూడలేదు. సర్వభూతమును సృష్టించి నిలిపిన ప్రధాన పురుషేశ్వరుడగు భగవానుని హృదయమున నిలిపి ధ్యానించుచున్న ఆ బాలుని తేజస్సు సహింపలేక మూడు లోకములు వణికినవి. బృణవేలు మాత్రము నీలపై మోపి ఒక్క పాదముపై ధృవుడు తపస్సు చేయుచున్నప్పుడు అతని బరువుకు భూమి కుంగెను. ఏనుగు ఎక్కిన ఓడ అది ఎటు కదిలిన అటు వగినట్లు ధృవుడు ఒక పాదమును మార్చి వేరొక పాదమును మోపి నిలిపి ధ్యానము చేయుచున్నప్పుడు.
ఇటునటు ఊగుచుండెను. వేరొక విషయమును గూర్చిన తలంపు లేక మనసున భగవానుడగు వాసుదేవుని ధృవుడు ధ్యానించుచుండగా లోకపాలురు లోకులు కూడా ఊపిరి ఆడని వారై ఆ భగవాన్ని శరణు పొందిరి. హే భగవాన్. చరాచరములగు భూతకోటి అంతయు ఊపిరి ఆడగ తలెడిల్లుచున్నది. ఇట్టి పరిస్థితి ఎన్నడూ ఎరుంగము. సకల చేతనా చేతనములు శరీరములుగా శరీరముగా గల నీకు చెందిన వారము మేము. ఈ దుఃఖమును మాకు తొలగింపుము. నీవే మాకు రక్షకుడవు. దేవతలిట్లు లోకపాలులతో కూడా శరణు పొందగా మీరు బాధకు పడకుడు భయపడకుడు ఉత్తానపాదుని కుమారుడు ధ్రువుడు నాయందే మనసు నిలిపి ప్రాణ నియమనమును చేసినాడు. దానిచే మీకు అందరుకు ఊపిరి ఆడుట లేదు. అతడు మానునట్లు చేసెదను. మీరు మీ స్థానములకేగుడు అని శ్రీహరి చెప్పి వారిని వెనుకకు పంపెను. దేవతలందరూ భగవానుని మాటలను విని భయము తొలగి నమస్కరించి స్వర్గమునకేగిరి. భగవానుడగు వాసుదేవుడు కూడా ధ్రువుని చూడవలెనని కోరికతో గరత్మంతుని అధిరోహించి మధువనమునకొచ్చి బయలుదేరెను. ధ్రువుడు ధ్యానములో మునిగి ఉండెను. తన హృదయ పద్మములో భగవాను సాక్షాత్ కనింపచేసుకొని దర్శించుచుండెను. మెరుపు వలె తనలో వెలుగుచున్న ఆ మూర్తి ఒక్కసారి మాయమాయెను. ఏమి ఆయనో అని కళ్ళు విప్పి చూచుసరికి తాను హృదయములో చూచుచున్నట్లే బయట కనిపించెను. ధ్రువుడు ఆ రూపమును చూసి బెదరెను. నేలపడెను, నమస్కరించెను. లేచి నిలిచి ఆ దివ్య రూపమును చూచెను. అమృతమును త్రాగినట్లు దగ్గరగా వెళ్లి ముద్దు పెట్టుకొనునట్లు కోలించుకొనునట్లు అతనికి అనిపించి ఆనందించుచుండెను. ఏదో మాట్లాడవలెనని కోరిక కలిగినది కానీ ఐదేళ్ల వయసు వాడొకటిచే ఏమియు చెప్పలేకుండెను. అందరి హృదయములలో ఉన్న శ్రీహరి అతని మనసులోని భావమును గుర్తించినాడు. ధ్రువుడు ఏమియు చేయలేక నమస్కరించుచు నిలిచినాడు. కృపతో భగవానుడు ప్రణవ రూపముకు తన శంఖముతో అతని చెక్కిలిని తాకెను. వెంటనే అతనికి పరత్వము ఆత్మతత్వము రెండును తెలిసెను. దాని నిర్ణయించి పలకగలిగిన దైవీ వాక్కు అతని నుండి వెలువడెను. భక్తి భావముతో ఏమిను తొందరపడకుండా అన్ని వైపులా ప్రసరించిన కీర్తి గల భగవంతుని ఇట్లు స్తోత్రము చేయనారంభించెను.
సమస్త శక్తులు కలిగి ఉండి తన సంకల్పము చేతనే నాలో ఉండియు ఉన్నదని తెలియకుండా నిద్రించుతున్న నా వాక్కును మేలుకొలిపినాడు. వాక్కునకే కాదు సర్వేంద్రియములకు అతడే కదలికను వసంగినాడు. అట్టి నాలో అంతర్యామిగా ఉన్న భగవానునికి నా నమస్కారము. దేవా సృష్టికి ముందు నీవు ఒక్కడివే ఉండివి. ఇప్పుడు కనపడుచున్న ఈ జగత్తును అంతను నీ సంకల్పముచే నీతో విడదీయుటకు వీలు కాకుండా కలిసి ఉన్న దానిని మహత్తు, అహంకారము మొదలగు రూపములతో బయలుపరిచితివి. ప్రకృతిచే నానా రూపములగు పదార్థములను కల్పించి సత్వాది గుణములు గల ఆ పదార్థములతో జీవుని శరీరముగా చేసుకొని నీవు ప్రవేశించితివి. నీవు ఒక్కడివే అయి ఉండియు ఇన్ని రూపములు ఇన్ని నామధేయములు గల సకల పదార్థములలో అన్ని రకములగు పరిణామములు గల కర్రలలో చేరి ఆయా ఆకారములతో కనపడునట్లు వేరు వేరు రూపములతో కనపడుచుందువు. నిన్ను ఎరింగెడి జ్ఞానమును నీవే వసంగితివి. ప్రభు నిన్ను శరణు పొందిన చతుర్ముఖ బ్రహ్మ నిద్రపోయిన నాడు మేల్కొనినట్లు నీ అనుగ్రహము చేయ మేల్కొనినాడు. ఈ విశ్వమును రచించుటకు ఉపయోగించు జ్ఞానమును నీవు వసంగగా సృష్టించినాడు. అర్థబంధువు మోక్ష సుఖమును కోరు వారలకు నీ పాదమూలమే శరణము. సర్వేంద్రియములను ప్రవర్తింపజేయువాడవు నీవు జ్ఞానమును వసంగ గలవాడవు. చివరకు మోక్షమును వశంగ గలవాడవు నీవే. మహోపకారము చేసిన ఇట్టి నిన్ను కృతజ్ఞత వలె ఎవరు మరువగలరు? నీవు ఆశ్రితుల కోరికలను తీర్చుటలో కల్పవృక్షం వంటి వాడవు. నీ మాయచే మతి చెడిన వారు నిన్ను చేరి మోక్షమును కోరక నిన్ను పొందవలెనని కోరక ఇతరమైన ధర్మార్థ కామములను కోరుచుందురు. వారు కోరెడి సుఖములు ఇంద్రియములు విషయములతో కూడినందువలన కలిగిన సుఖములు అవి నరకప్రాయములు. ఈ శరీరము శవముతో సమానమైనది అట్టి శరీరముతో అనుభవింపదగిన సుఖములను జ్ఞానులు కోరరు. దేహధారులకు నీ పాదపద్మ ధ్యానము కంటే సుఖము అనదగినది వేరొకటి లేదు. స్వర్గములో అనుభవించెడు సుఖము ఆత్మానుభవము చే కలిగెడు సుఖము కూడా నీ పాదపద్మ ధ్యానము చే కలిగెడి నీ దాసుల సాంగత్యము కంటే వారి చరిత్రమును నీ చరిత్రమును వినుట కంటే గొప్పవి కావు. దేవత్వమును పొంది విమానముతో తిరిగేడి వారు కూడా ఒకనాడు యముని భయంకరమగు దండముచే క్రింద పడేవారే కదా. నీవు దేశ కాల వస్తు పరిచ్ఛేదనము లేనివాడవు.
నీ యందు నిరతిశయమైన భక్తి గలవారలై అంతఃకరణములో క్రోధాది గుణములు దోషములు ఏమియు లేని వారలై ఉండెడి మహాత్ములతో నాకు సంఘము కలుగునట్లు అనుగ్రహింపుము. వారితో కూడి ఉండి వారు చెప్పడి నీ కథలనెడి అమృతమును అమృతమును మఖానందమును పానము చేసి తృప్తినంది తాపత్రయము తొలగిన వాడనై. ఈ దుస్సహమగు దుఃఖముతో నిండిన ఈ జన్మ పరంపర అనేటి సముద్రమును దాటెదను. నీ దాసులగు మహాత్ములతోడి సహవాసం ఏర్పడిన వారు ఈ చనిపోయేడి శరీరమును తలంపరు. దాని సంబంధముచే ఏర్పడిన కుమారులను, భార్యను, ధనమును, మిత్రులను, ఇంటిని కూడా తలంపరు. దానిని గూర్చి ఆలోచింపరు. వారికి సంతతము భాగవత సహవాసముచే నీ పాదారవింద పరిమళమే మనస్సును ఆకర్షించుచుండును. ఈ జగత్తునందు తిరియక్కులు అనగా పశుపక్షాదులు, స్థావరములు, ప్రాకడి జంతువులు, పక్షులు, దేవతలు, రాక్షసులు మొదలగు రకరకముల రూపములతో నిండిన విశ్వమంతయు నీ స్థూల రూపమని నేను ఎరుంగుదును. ఆ స్థూల రూమగు రూపము కంటే విలక్షణమగు నీ అప్రాకృత దివ్య మంగళ విగ్రహమును మీ అనుగ్రహముచే నేను దర్శించితిని. కానీ దీనిని దర్శింపని వారు ఇట్టి రూపమే ఉన్నదని ఇట్టి రూపము లేదని వాదించుకొనుచుందురు. ఈ చేతనా చేతనాత్మకమగు జగత్తునంతను ప్రళయములో నీటిలోకి నీలోకి తీసుకొని ఆనంద స్వరూపమగు నిన్నే నీవు భావించుకొనుచు అనంతుడు తోడుగా ఉండగా ఆ శేశ శయనమునందు నిద్రించుచుందువు. నీ నాభి ఒక సముద్రము, దాని నుండి బంగారు తామర పువ్వు లేచినది. దాని దుద్దునందు విశ్వమును సృజింపచాలిన బ్రహ్మ ఆవిర్భవించినాడు. అట్టి కారణమైన నీకు నమస్కారము. నీవు ఈ జగత్తును రక్షించుటకై కర్మచే కాక అనుగ్రహముచే మంగళ గుణ పరిపూర్ణమగు రూపమును స్వీకరింతువు. ఈ యజ్ఞములచే ఆరాధింపబడు వాడవు. యజ్ఞములకు ఫలమును ఇచ్చు వాడవు. ప్రకృతి పురుషుల కంటే వేరైన వాడవు నీవే. నీ జ్ఞానము ఎన్నడూ సంకోచమును అందదు. అట్టి సంకల్ప రూప జ్ఞానముచే ఈ జగత్తును సృష్టింతువు. అన్ని పదార్థములలో జీవుని ద్వారా ప్రవేశించి ఉన్నను వాని దోషములు నీకు అంటవు. నీవు నిత్య ముక్తుడవు. నీకు శరీరమునందు ఈ శరీరమునకు చెందిన వాని యందు నేను నాది అని అభిమానం ఉండదు.
అందుచే నీవు నిత్యముక్తుడవు. దానికి కారణము నీవు కర్మకు వశుడవు కాకపోవటమే. కర్మకు వశుడవు కాకపోవటచే నీ జ్ఞానమునకు ఎన్నడును అవిద్యచే సంకోచం ఏర్పడదు. అన్ని పదార్థములలో నీవు ప్రవేశించి ధరించి నియమింతువు కనుక నిన్ను ఆత్మ అందురు. స్వరూపముచే గాని స్వభావముచే గాని నీలో మార్పు కలగదు. నీవు కూటస్తుడవు అనగా నిర్వికారుడవు. జీవునకు స్వభావములో మార్పు కలుగును. ప్రకృతి స్వరూపములో మార్పు కలుగును. నీకు రెండింటా మార్పు కలగదు. నీవు ఆది పురుషుడవు. అందరికీ కారణమైన తత్వము నీవు. నీకు మూలోకములు. మూడు లోకములను సత్వరజస్తమో గుణములు కల ప్రకృతి వికారములను సకల పదార్థములను అధీనమై యుండును. కనుక నిన్ను త్రిధీషుడందురు. ఇతరులలో కూడై ఉండుటకు విరుద్ధములుగా కనిపించడి సమస్త భూతములు సకల పదార్థములు నీ యందు కూడి ఉండును. జ్ఞానము, అజ్ఞానము, వైరాగ్యము, అవైరాగ్యము, ఐశ్వర్యము, అనైశ్వర్యము. ధర్మము అధర్మము నిన్ను ఆశ్రయించి ఉండును అవి అన్నియు శక్తి గలవాని శక్తి వలె నీ నుండి విడదీయుటకు వీలుకానివై నీతో చేరి ఉండును అందుచే నీవు సర్వశక్తివి, నీవే బ్రహ్మము అనబడుదువు, నీవే సమస్త జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణమైన వాడవు, నీవు ఒక్కడివే సర్వ జగత్తుకు కారణమైన వాడవు. బంగారు నగల నగలన్నిటికీ బంగారం వలె మట్టితో చేసిన ద్రవ్యమనెంటికీ మట్టి వలె నీవే కుమ్మరి వలె నిమిత్త కారణము. నీవు బంగారున గల అన్నిటికీ బంగారం వలె మట్టితో చేసిన ద్రవ్యము అన్నిటికీ మట్టి వలె నీవే ఉపాదాన కారణము క్షమించాలి. నీవే జ్ఞానము ప్రయత్నము కలవాడగుటచే కుండకు కుమ్మరి వలె నిమిత్త కారణము. నీవు ఈ దేశములో ఉందువు, ఈ దేశములో ఉండవు అనేది మాట ఉండదు. ఈ కాలములో ఉందువు, ఈ కాలములో ఉండవు అను మాట ఉండదు. ఈ వస్తువులో ఉందువు, ఈ వస్తువులో ఉండవు అను మాట లేదు.
అందుచే నీవు అనంతుడవు, నీలో ఎక్కడనూ ప్రకాశించని భాగము ఉండదు, అనుకూలించని భాగము ఉండదు. కావున జ్ఞానానంద స్వరూపుడవు, అట్టి నిన్ను శరణు పొందుచున్నాను. హే భగవాన్, ఎవరు ఏ కోరిక కోరినా ఆ కోరికను ఫలించినట్లు చేసెడివాడవు నీవు, నీవే పురుషార్థమైన వాడవు. అట్టి నీ పాప పద్మమును పాద పద్మమును శవించు వారులు దైన్యము చే ధర్మార్థ కామములు కోరి నిన్ను కోరక మానినను వారు నిన్ను కోరలేదని వారి తప్పును చూచి వారికి నువ్వు దూరముగా ఉండవు. క్రొత్తగా దూడను ఈనను ఆవు ప్రేమచే దానిపై నున్న తినదగని పదార్థమును కూడా తినినట్లు దానిని కాపాడినట్లు నిన్ను వదలి ఇతరుములను కోరిన వారిని కూడా వారి అభిమతమును ఇచ్చి కాపాడుచుందువు. ఇట్లు ధ్రువుడు స్తోత్రము చేయగా భృత్యునిపై అనురాగం గల భగవానుడు ధ్రువుని దృఢమైన సంకల్పమును అతని భక్తిని చూచి ఎక్కువ ప్రితితో ఆనందించి ఇలా పలుకుతున్నాడు అని మనం తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇంతటితో ధ్రువ స్తుతి పూర్తి అయింది. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations to that one. Salutations to the formless one, the one with infinite power, the one with formlessness, the one with form. In the act of wonder, the Supreme Lord, who is beyond country, time, and space, is truly without form, yet He manifested in many forms. The infinite powerful one, the miracles he performs are wonderful. Many salutations to him. Eighth Canto, Third Chapter, Eighth Prayer. Friends, welcome to the fourth episode of Srimad Bhagavata Tatva Deepika, in the 11th podcast. We have started in the Dhruva story. In the previous podcast, Narada preaches to Dhruva how to do penance The process of meditation is all about. He will tell. We will experience the next part. Thus, as Narada preached, Dhruva also did the same. Narada bowed to him, circumambulated, and went to Madhuvanam, which was sanctified by the past visit of Sri Krishna's feet. As soon as he went there, Narada reached Uttanapada's palace and entered the inner chambers. The king worshiped him with gifts and honors and made him sit on the throne. Naradudu Raja, why is your face so pale? You are thinking about something. Neither dharma, nor artha, nor kama is lacking, is it? He said, tell me the reason for your thought. Narada, my son Dhruva is only five years old. Being unkind, Suruchi, the chief among the women of the harem, caused him to leave the kingdom. A humble person, an intelligent person, a child, if he is stranded in the forest, unable to walk, without direction, will fall to the ground. He'll be eaten by wolves. I was so naive I couldn't understand the woman.
The king told Narada that he was a wicked man for not being able to fulfill the wish of the son who asked to climb on his thigh. Narada says so. My lord, do not inquire about your son. He is protected by the gods. You've let yourself be walked on. Your son's fame will spread throughout the world. He will do a work that even the world's rulers have not done, and in a few days, he will make your fame spread throughout the world and return. As soon as Narada said that, Uttanapada, remembering that son, was without respect in the kingdom and was in thought. In that forest, Dhruva bathed in Yama and began his penance. The sage, following the path he had shown, fasted the first night and worshipped the Supreme Being. Once every three nights, he took walnuts and jujubes as food, and only took food to sustain his body, and spent a month. In the second month, for six days a week, he ate only leaves and grass and performed the worship of the Lord. In the third month, once every 9 days, water is taken for Srihari He spent time meditating and praying. In the fourth month, once every 12 days, she was taking air as food. In the remaining days, without even taking a breath, he meditated on the Lord and kept the Lord in his mind. In the fifth month, he stopped breathing, meditated on the Lord, and stood still on one foot, like a pillar, without moving or stopping. The mind is put out of gear by external objects. "HOLD ON THERE, IN MY BODY. He was visiting the God. He had not seen a second form. The three worlds trembled, unable to bear the radiance of that boy who was meditating, keeping the main Lord, the Lord of all beings, who created and sustained the universe, in his heart. Brunvelu, placing only one foot on the earth, when Dhruva was doing penance, the earth sank under his weight. As the ship that was ridden by the elephant moved in whichever direction, Dhruva changed one foot and placed another foot, and while meditating.
It was swaying from side to side. Without any thought about another matter, while Dhruva was meditating on Vasudeva, the Lord of the Universe, the rulers of the world and the people also, unable to breathe, took refuge in that Lord. Hey Bhagwan. The entirety of the countless beings, including the animate and inanimate, are breathing. Such a situation is never known. We belong to you, who have all consciousness and being as bodies. Please take away this grief from us. You are the savior. Even with the gods and the world, when you sought refuge, you did not suffer, you did not fear, the son of Uttanapada, Dhruva, kept his mind on the leader and performed the regulation of life. It's making you all breathless. I'll get him to stop. Srihari told them to go to their places and sent them back. All the gods, hearing the words of the Lord, removed their fear, bowed down, and went to heaven. Vasudeva, the Lord, also, with a desire to see Dhruva, ascended Garamantu and came to Madhuvanam and departed. Dhruva was in deep meditation. Having seen the Lord himself in the lotus of his heart He was watching. Like a flash of lightning, that form, which was shining within him, disappeared. What is he? When he opened his eyes and looked, he appeared outside as if he was looking inside his heart. Dhruva was startled by the sight. The floor, and greeted. He stood up and saw the divine form. She felt like she was drinking nectar, like she was going close and kissing him, like she was kissing him. There was a desire to speak, but a five-year-old child could not say anything. Srihari, who is in everyone's heart, recognized the feeling in his heart. Dhruva stood there, unable to do anything, and was bowing. With grace, the Lord touched his lotus-like form with his conch shell. Immediately, he understood both the transcendental and the self-existent. The divine word that could be spoken by deciding it came out of him. With devotion, without any haste, he began to praise the Lord, who has spread fame in all directions.
Having all powers, without knowing that it is in me by His will, He awakened my word that was sleeping. Not only by speech, but he also instilled movement in all the senses. My salutations to the God who resides within me. You existed before God created you. Now, to separate this visible world from you by your will, you have revealed the united one with forms such as greatness, ego, etc. By nature, creating various forms of substances, with those substances having the qualities of goodness, you entered by making the body of the living being. Even though you are alone, you join all kinds of transformations in all substances with so many forms and names, and you appear with different forms, appearing with those shapes. You have enriched yourself with the knowledge of the tree. Lord, as the four-faced Brahma, who had taken refuge in you, awoke when he was asleep, may your grace awaken him. The knowledge used to create this universe You were created as a vessel. To those who seek the happiness of liberation, your feet are the refuge. You are the one who makes the senses function, you are the one who instills knowledge. You are the one who is finally master of the liberation. Who can forget you, who have done such a great favor? You are like a wish-fulfilling tree in fulfilling the desires of your devotees. Those who are deluded by your illusion, without seeking you, without desiring to attain you, desire other dharma, artha, and kama. The pleasures they desire, the pleasures derived from the senses and worldly matters, are like hell. This body is like a corpse. The wise do not desire the pleasures that can be experienced with such a body. For the embodied being, there is nothing more pleasurable than the meditation of your lotus feet. The happiness experienced in heaven, the happiness gained by self-realization, even that is greater than the company of your servants, who are gained by meditating on the lotus feet of your feet, than listening to their stories and your stories. Those who, having attained divinity, roamed the earth on airplanes, were also once brought down by Yama's terrible rod The ones that fell, did they? You are beyond time and space.
Grant me the grace to associate with those great souls who are full of unparalleled devotion to you, who are without any qualities of anger and other faults in their hearts. Being with them, they told, drinking the nectar of your stories, drinking the nectar, the intoxication, and being satisfied, I became one who has removed the suffering. I will cross this ocean of births, filled with this unbearable sorrow. Those who have formed a fellowship with the great souls who are your servants do not consider this dying body. They do not consider the sons, wives, wealth, friends, and even the house that were created through that relationship. Don't think about it. For them, through the association of the Bhagavata, the fragrance of your lotus feet attracts the mind. In this world, the wandering ones, that is, animals, birds, inanimate objects, wild animals, birds, gods, demons, and all kinds of forms, the entire universe is filled with your gross form, I understand. I have seen your unique, divine, auspicious form, more distinct than the gross form of the room, by your grace. But those who have not seen it are like this They argue that there is a form and that there is no such form. Taking this conscious world into the water and into yourself in the deluge, taking you into yourself, and while the infinite is with you, you will be sleeping in that bed of ashes. Your belly is an ocean, and from it a golden lotus flower has risen. In its tip, the Brahma who created the universe manifested. Greetings to you, who are the cause of such a situation. You accept the form that is auspicious and complete with good qualities, not by karma, but by grace, to protect this world. You are the one who is worshipped by these sacrifices. You are the giver of the fruits of sacrifices. You are different from men in nature. Your wisdom will never be hindered. By such a form of resolve, you create this world. Even though it enters through the living being in all substances, its faults do not affect you. You are eternally saved. You will not have pride in this body, in the one who belongs to this body.
Thus you are eternally liberated. The reason for that is that you are not subject to karma. Because you are not subject to karma, your knowledge will never be hindered by ignorance. Because you enter and wear all substances and appoint, they will receive you as the spirit. Neither by form nor by nature is there any change in you. You are a fool, you are a fool. The soul undergoes a change in its own nature. There will be a change in the nature of things. You can't change both at the same time. You are the original. You are the cause of the universe for everyone. You have a mouth. The three worlds are subject to the qualities of Sattva, Rajas, and Tamas, and the distortions of nature, and all substances. So you will be blessed with three daughters. Do not appear contrary to being in others, all beings, all substances are united in you. Knowledge, ignorance, detachment, non-detachment, wealth, non-wealth. Righteousness and unrighteousness will abide; they are all powerful, but they cannot separate from you, they are joined to you. Therefore, you are almighty, you are You are called Brahma, you are the cause of all the creation, preservation, and destruction of the universe, you alone are the cause of the entire universe. Like gold for all the gold jewels, like clay for all the clay-made objects, you are the cause, the instrument, like a potter. You are like gold to all that is made of gold, and like clay to all that is made of clay, you are the cause of the material, forgive. You are the cause of the cause, being the one with knowledge and effort, like a potter to a pot. There is no saying that you will be in this country, that you will not be in this country. There is no saying that it won't be there at this time, that it won't be there at this time. There is no such thing as a non-existent object.
Therefore, you are infinite; there is no part of you that does not shine, no part that does not favor. Therefore, you are the embodiment of bliss, I seek refuge in you. Hey Bhagavan, whoever desires any wish, you are the one who makes that wish come true, you are the one who is the purpose of man. Those who kill your lotus-like feet, those who kill your lotus-like feet, even if they do not desire you out of misery, out of dharma, or desire you, seeing their mistake, you will not be far from them. Like a newborn calf, you have protected it with your love for it, and like it, you have protected it, and you will also protect those who have left you and asked others, giving them their preferences. Thus, as Dhruva praised, the Lord, who has affection for his devotee, seeing Dhruva's firm determination and his devotion, rejoiced with great affection and is speaking thus, we will learn in the next episode. With this, Dhruva The Praise has been completed. Jai Srimannarayana. Salutations to the Guru