స్వాయంభువ మనువు ఆగమనం - దేవహూతి పరిణయ వార్త

Arrival of Svayambhuva Manu & Devahuti Marriage

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, స్వాయంభువ మనువు తన పత్ని శతరూపతో మరియు కుమార్తె దేవహూతితో కలిసి కర్దమ మహర్షి ఆశ్రమానికి విచ్చేస్తారు. మానవజాతికి మూలపురుషుడైన మనువు, తన ప్రియమైన కుమార్తెను కర్దమ మహర్షికి ఇచ్చి వివాహం చేయాలనే సంకల్పంతో వినయంగా వారి సమీపానికి వస్తారు. ధర్మబద్ధమైన వివాహ సంప్రదాయం, తల్లిదండ్రుల అనురాగం మరియు సద్గుణ సంబంధాల మహిమను ఈ ఘట్టం అద్భుతంగా చిత్రిస్తుంది.

In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, the great Svayambhuva Manu arrives at the ashrama of Kardama Muni along with his devoted wife Shatarupa and their daughter Devahuti. Manu, the forefather of humanity, humbly approaches the sage with the intention of offering his beloved daughter in marriage to the worthy Kardama. The episode beautifully illustrates the Vedic tradition of dharmic marriage, parental devotion, and the noble qualities that make a righteous alliance between souls.

← Prev Next →
Arrival of Svayambhuva Manu & Devahuti Marriage bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః కరోతి విశ్వస్థితి సంయమోదయం యస్యేప్సితుహు నేప్సితమీక్షితుర్నునైహి మాయాయధాయో భ్రమతే తదాశ్రయం గ్రావణో నమస్తే గుణకర్మ సాక్షిణే ఓ ఈశ్వరా, అయస్కాంత శిల సన్నిధిలోనున్న ఇనుప ముక్క ఆ శిల కారణముగా కదలును. అదే విధముగా నీ సంకల్ప మాత్రముచే మాయాశక్తి తన గుణముల ద్వారా జగత్తు యొక్క సృష్టి స్థితి లయములను చేయుచున్నది. సర్వ సాక్షివగు నీ సంకల్పములో స్వార్థ కామన లేదు. ప్రకృతి గుణములకు జీవుల కర్మాదృష్టములకు సాక్షివగు నీకు నమస్కారము. ఫిఫ్త్ కాంటో 18th చాప్టర్ 38th ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము 31వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు కర్దముని, దేవహుతి వారికి పుత్రుడు కలగటము, ఆ పుత్రుడికి కపిల అని పేరు బ్రహ్మ. పెట్టడము తరువాత కర్దముని యొక్క తొమ్మిది మంది పుత్రికలను తొమ్మిది మంది ప్రజాపతులకు వివాహము నొచ్చటము జరిగిన తరువాత వాళ్ళు వాళ్ళ ఆశ్రమానికి వెళ్ళిపోయారు తరువాత భాగాన్ని మనం ఇప్పుడు అనుభవిద్దాం. కర్దముడు జ్ఞానము, భక్తి సారీ శక్తి, బలము, ఐశ్వర్యము, వీర్యము, తేజస్సు అనడి ఆరు గుణములు గల భగవానుడే కపిలుడు అని పేరుతో తన కుమారుడుగా అవతరించినాడని ఎరింగి ఏకాంతముగా అతని సమీపమున కేగి నమస్కరించి ఇట్లు పలికెను. తాము చేసిన దుష్కర్మములముచే సంసారములో మిక్కిలి తపించుచున్న ప్రాణులకు ఎంతో కాలమునకు గాని దేవతానుగ్రహం లభింపదు. మేము అనేక జన్మలలో చేసుకునిన పుణ్య కర్మల పరిపాకముచే ధర్మ జ్ఞాన భక్తి యోగముల చేతను ధ్యానము చేతను నీ అనుగ్రహం పొందగలిగిన వారమైతిమి.

ఎంతో శ్రమతో యోగులు దర్శింపదగిన నీవు మా భాగ్యవశమున నీ గొప్పతనమును మా తక్కువతనమును భావింపక సులభుడై నా నేత్రములకు కనపడునట్లు మా ఇంట అవతరించితివి. భక్తుల పాలిట పెన్నిది కదా నీవు ఆనాడు చెప్పిన మాటను సత్యము చేయుటకు ఇట్లు అవతరించితివి జ్ఞానమునకు సాధనమగు సాంఖ్య శాస్త్రమును లోకమున ప్రవర్తింప చేయుటకు అవతరించితివి భక్తులకు గౌరవమును కల్పించుటకు అవతరించితివి. నీవు ఒక రూపము నాది అని లేనివాడవు అయినను నిన్ను ప్రేమించిన భక్తులు ఏ రూపమును ప్రేమించినా ఆ రూపమును నీ రూపముగా స్వీకరించి వారిని అనుగ్రహించుచుందువు. తత్వమును ఎరుంగ గోరిన జ్ఞానులు నీ పాద పీఠం వద్ద నమస్కరించి జ్ఞానమును అందుచుందురు. అట్టి నిన్ను నేను శరణముగా వరించుచున్నాను. నీవు ప్రకృతి పురుషుల కంటే ప్రత్యేకమైన వాడవు. దృశ్యమానముగు ప్రకృతి అంతయు నీ శరీరము. జీవులందరూ నీ శరీరము, కాలము నీ శరీరము, అవి నీచే నియమింపబడునవి. మహత్వత్వం మొదలు సకల తత్వములు కార్యావస్థలో నీచే వ్యాపింపబడి నీచే నియమింపబడునవి. నీవు చేతనా చేతనాత్మకమగు ప్రపంచమును పాలించువాడవు. జగత్తును సంహరించి నీలో చేర్చుకొనువాడవు నీవు. అట్టి నిన్ను నేను శరణు పొందుచున్నాను. ప్రజలందరుకు నీవే స్వామివి, పాలకుడవు. నేను నిన్ను ఒక కోరికను కోరుచున్నాను, నీవు నా కుమారుడిగా జన్మించి రుణత్రయమును తీర్చిన వాడగునట్లు చేసితివి. సాంసారిక భోగములు అనుభవింపబడినవి, ఇంక నిన్నే మనసులో ధ్యానించుచు తాపత్రయముచే కలిగెడు దుఃఖమును తొలగిన వాడనై సన్యాసాశ్రమ ధర్మములను ఆశ్రయించి. సంచరించెదను అనుగ్రహింపుము. ఇట్లు కర్దముడు విన్నవింపగా కపిలుడు ఇట్లు చెప్పుచున్నాడు. నేను ఈ లోకమును ఎట్లు ప్రవర్తింపవలెనో దేనిని ధ్యానింపవలెనో ఎరుంగ చేయుటకు వచ్చితిని. ఈ లోకములో స్వర్గం మొదలగు లోకములను సాధించుటకు కర్మాచరణము, మోక్షమును పొందుటకు ఉపాసనము చేయవలెను. ఆ రెండింటిని నేను వివరింతును. అదే లోకమునకు ప్రమాణము.

నీకు నేను కుమారుడనే జన్మింతునని చెప్పితిని. ఆ మాట సత్యము చేయుటకు నేను జన్మించితిని. ఈ లోకంలోని మానవులు దుష్టమైన మనస్సు గలవారు. వారి మనస్సు అవిద్య, కామ కర్మలచే మలినమై యుండును. అందుచే వారు శరీరమే తానని భావించుచుందురు. అట్లు భావింపబడే శరీరము నుండి విడువడవలెనని కోరెడి వారికి ఎరుంగదగునది ఈ కనపడుచున్న ప్రకృతి కంటే వేరైన జీవ పరమాత్మల యధార్థ స్వరూపము. దానిని ఎరుంగించుటకై నేను జన్మించితిని. ఆత్మమార్గము ఎరుంగుట చాలా కష్టం. దానిని వెనుక నేను ఉపదేశించితిని. కానీ చాలా కాలం గడిచిపోవుటచే అది నశించిపోయినది. ఆత్మ మార్గం మర లోకములో ప్రకాశింపచేయుటకై నేను ఈ శరీరమును స్వీకరించితిని. నీవు ఇచ్చ వచ్చినట్లు సన్యసించి వెడలిపొమ్ము. ఏ కోరిక కోరక ఆచరించు కర్మలచే జ్ఞానము కలుగుటకు ప్రతిబంధకముగు పురాతన కర్మను జయించవలెను. ఆ కర్మ ప్రతిబంధకము తొలగిన తరువాత నన్ను ఆశ్రయించి ధ్యానించి నన్ను పొందవలెను. నేను ఆత్మల యందే ఉన్నాను. ప్రేమతో ఎడతెగక మనసులో ధ్యానించినచో దర్శించవచ్చు. దర్శించినచో శోకమునకు కారణమగు ప్రాచీన కర్మ నశించును. భయము కలగదు. భయరహితమగు స్థానము నేను. నేను జీవులలో అంతర్యామిగా ప్రకాశించుచుందును. సర్వ భూతముల యొక్క హృదయ గుహలో వసించుచుందును. నీవు ఆ శ్రమ స్వీకారము చేసి వెడలిన తరువాత తల్లియగు దేవహుతికి ఆధ్యాత్మిక విద్యను ఉపదేశించెదను. ఇట్లు కపిలుడు చెప్పగా విని తన కుమారుడు సాక్షాత్తు భగవానుడే అని ఎరంగి అతనికి ప్రదక్షిణము చేసి వనమునకేగెను. మౌనవ్రతము స్వీకరించి పరమాత్మయే తనకు రక్షకుడని మనసులో ఎల్లవేళలా భగవానునే స్మరించుచు అగ్నిహోత్రము లేనివాడై ఒకచోట ఉండుటకు వసతి లేనివాడై భూమినంతను సంచరించుచుండెను. చేతనా చేతనములగు అవ్వలి వాడగు పరమాత్మ యందు మనసు లేపినాడు. దేహాత్మాభిమానము తొలగిన వాడాయను దేహమునందు సంతానమునందు భార్యయందు నాది అనడి బుద్ధి లేని వాడాయను. చెలి వేయుచున్నను

చలి వేయుచున్నను ఎండ కాయుచున్నను కలత చెందక ఉండెడివాడు. శరీరములో ఆకార భేదమున్నను లోనున్న ఆత్మ ఏకరూపమని సర్వత్ర సమానమగు ఆత్మను దర్శించువాడాయను. బ్రహ్మ ఆత్మగా గల తనను తాను సంతతము దర్శించువాడాయను. బ్రహ్మాత్మకముగు తన ఆత్మను అనుభవించుచుండెడివాడు. దానిచే బుద్ధిలో ఏ విధము కలత లేక ఉండెడివాడు. లోన ప్రవేశించి నియమించువాడు కళ్యాణ పరిపూర్ణుడు సర్వభూతములను ధరించువాడగు పరమ పురుషుని యందు ప్రీతి రూపకమగు ధ్యానముతో మనసు నిలకడగా నిలిచిన వాడై ఉండెను. సర్వభూతముల యందు అంతర్యామిగా భగవానుని ఆ భగవానుని యందు సర్వభూతమును దర్శించువాడాయను. రాగద్వేషములు లేనివాడై సర్వభూతములయందు సమయమున భావముతో ఉండెడివాడు. ఇట్లు సమచిత్తముతో భగవత్ భక్తి యోగముతో కర్దముడు భగవత్ సన్నిధిని పొందిన వాడాయను. విదురుడు భగవానుడు వివరించిన సాంఖ్య శాస్త్రమును ఎరుంగవలెనని కోరగా మైత్రేయుడు కపిలుడు చెప్పిన తత్వ శాస్త్రమును ఇట్లు చెబుచున్నాడు. తండ్రియగు కర్దముడు అరణ్యమునకేగిన తరువాత కపిలుడు తల్లియగు దేవహుతికి ప్రియమవును ఆచరించవలెనని ఆ బిందు సరస్సు తీరమందు వసించి ఉండెను. దేవహుతి తత్వమార్గమును పరిపూర్ణముగా దర్శించిన తన కుమారుని చేరి వెనక కర్దముడు చెప్పిన మాటలను జ్ఞాపకం చేసుకుని ఇట్లు చెప్పుచున్నది. భగవన్ ఇంద్రియముల ప్రకృతి వికారములచే ఏర్పడినవి అవి చాలా దుష్టములు. వాటిని తృప్తి పరచుటయే ఆనందమునకు సాధనము అని ఇంతకాలము జీవించితిని. కానీ ఇంద్రియములను తృప్తి పరుచుటుండుటచే నేను అంతకంతకు అజ్ఞానమును పొందితిని. అజ్ఞానమునకు ఆవలి ఒడ్డు కానరాదు. నా భాగ్యవశముచే అంధ తమస్సును దాటించెడి నీవు నా కంటికి కనపడితివి. జీవులను లోన ఉండి నియమించడి భగవానుడవు సర్వేశ్వరుడవు నీవు అని నేను ఎరుంగుదును. అజ్ఞానమనడి అంధకారమున సూర్యుని వలె నీవు ఉదయించితివి. నా మోహమనడి అంధకారము నీవే తొలగింపవలెను.

నాకు కలిగిన మోహము నేను కాని యందు నేను అనడి భావము, నాది కాని యందు నాది అనడి భావము అనడి రెండు రూపములుగా ఉన్నది. ఆ నేను నాది అనే అభిమానము నన్ను బంధించుచున్నది. దాని నుండి విడదీయు వాడవు నీవే. తన భక్తులకు సంసారమనడి వృక్షమును ఛేదించేడి గొడ్డలి వంటి వాడవు నీవు. నివృత్తి ధర్మమును ఎరింగిన వారలలో శ్రేష్టుడవు. ఆ జీవుని యొక్క పరమాత్మ యొక్క ప్రకృతి యొక్క స్వరూపమును స్వభావమును ఎరుంగ గోరి నిన్ను శరణు పొందుచున్నాను. ఇట్లు తల్లి మోక్షమందు రుచి కలిగి మాట్లాడిన మాటలను విని మనసున సంతసించి మనోనిగ్రహము గల వారలకు మోక్షోపాయము అయిన కపిలుడు చిరునవ్వు నవ్వుచు ఇట్లు పలికెను. కపిలుడు తన తల్లి దేవహితో ఏం పలికాడు ఆ విషయాన్ని మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. May the world's stability be established, may he who desires it be fulfilled, may he who desires to see it be seen, may he who is deluded by Maya be saved. Salutations to the one who is the refuge. O Lord, witness to the virtues and actions, O God The iron piece in the vicinity of the magnetic rock will move due to that rock. Similarly, by your mere will, the power of Maya, through its qualities, is creating, sustaining, and destroying the world. In your all-seeing will, there is no selfish desire. Salutations to you, who are the witness to the qualities of nature and the actions of living beings. Fifth Canto, 18th Chapter, 38th Prayer. Devotees of God, welcome to the 31st podcast of Srimad Bhagavata Tatva Deepika, Third Canto. Until now, Kardamuni and Devahuti had a son, and that son was named Kapila, Brahma. After placing, after the marriage of the nine daughters of Kardamunu to the nine Prajapatis, they went to their ashram. Let us now experience the next part. Kardamudu is knowledge, devotion, sorry, power, strength, Aishwaryam, viryam, tejassu, the one with six qualities, the Lord himself, with the name Kapiludu, incarnated as his son, and Eringi went alone to his vicinity, bowed, and spoke thus. Those who are suffering greatly in the world due to the misdeeds they have committed will not receive the grace of God for a long time. We have been able to receive your grace through the accumulation of meritorious deeds done in many births, through the knowledge, devotion, and yoga of righteousness, and through meditation.

You, who are worthy of being seen by yogis with great effort, by our good fortune, without considering your greatness or our inferiority, you have incarnated in our house so that you may appear to my eyes as an easy one. You are the one who is fulfilled for the devotees, aren't you? You incarnated to make the words you said that day true. You incarnated to make the Sankhya Shastra, which is the means to knowledge, prevalent in the world. You incarnated to give honor to the devotees. Even though you are not in the form that I have, the devotees who love you, whatever form they love, accept that form as your form and bless them. The wise who desire to understand the essence, bow at your feet and receive the knowledge. I surrender to you. You are beyond nature and man. Your body is the visible manifestation of nature. All living beings are your body, time is your body, they are appointed by you. From the beginning of greatness, all the elements are pervaded by you in the state of action, and are appointed by you. You are the one who rules the world, which is full of senses. You are the one who destroys the world and takes it into yourself. I surrender to you. You are the Lord, the Sovereign, the King of all. I ask you for a wish, you were born as my son and made him pay off the debt. Having experienced worldly pleasures, and meditating on you in my mind, having relieved the suffering caused by worldly anxieties, I, being the one who has been relieved, take refuge in the principles of renunciation and the order of monastic life. Please grant me permission to proceed. Thus, when Kardamudu requested, Kapiludu said thus. I have come to understand how to behave in this world and what to meditate on. In this world, to achieve heaven and other worlds, one must perform actions, and to attain salvation, one must worship. I will explain both. That is the standard by which the world is judged.

I told you that I would give birth to a son. I was born to TRUTH. The people of this world are evil-minded. Their minds are polluted by ignorance and lustful actions. Therefore, they think that the body itself is the self. That which is seen, the true form of the supreme souls, is different from this visible nature, which is desired by those who wish to be freed from the body that is thought of as such. I was born to tear it up. It is very difficult to find the path of the soul. I preached it from the pulpit. But it was destroyed because it took too long. I have accepted this body to illuminate the path of the soul in this world. You should leave as soon as you can. Without desiring any desire, one must conquer the ancient karma that hinders the attainment of knowledge through the actions performed. After the obstacle of karma is removed, one should take refuge in me, meditate on me, and attain me. I'm under my own spirit. With love, without ceasing, meditate in your heart, and you will see. If seen, it is the ancient karma that causes grief It will be destroyed. There is no fear. I am a fearless place. I shine as an inner light among living beings. He dwells in the heart of all beings. After you accept that suffering and depart, I will impart spiritual knowledge to Mother Devahuti. Thus, hearing Kapila say, his son, seeing that he was none other than the Lord himself, circumambulated him and went to the forest. Having taken the vow of silence, he remembered the Supreme Being in his mind as his protector, always remembering the Lord, being without the fire sacrifice, without accommodation to stay in one place, he was wandering all over the earth. He who is conscious of the consciousness of the self, the supreme being, has placed his mind in him. He who has lost the ego of the body, he who has no sense of 'mine' in the body, in the offspring, in the wife. Cheli vayuchunnadu

He who is not disturbed whether it is cold or hot. Even though there is a difference in shape in the body, the soul within is of one form, the one who sees the soul that is everywhere equal. He who is always seeing himself as the Brahma soul. He who experiences his soul as divine. He was one who was free from any mental disturbance. He who enters and appoints is perfect in marriage, the supreme being who assumes all beings, he was steadfast in his mind with meditation, which is a form of love, and was stable. He is the one who sees all beings in all beings, being the inner controller of all beings, in that Lord. He who is free from attachment and aversion, is in all beings with a sense of time. Thus, with equanimity, with devotion to God, with yoga, Kardamudu attained the presence of God. When Vidura asked to understand the Sankhya Shastra explained by the Lord, Maitreya is saying this about the Tattva Shastra told by Kapila. After the father Kardamudu went to the forest, Kapiludu became dear to Devahuti, the mother, and that Bindu Saraswati The coastline was very crowded. Devahuti, having fully seen the path of truth, reached her son and, remembering the words spoken by Kardamudu, is saying this. The Lord is formed by the nature and disorder of the senses; they are very evil. Satisfying those things is the means to happiness, I have lived like that for so long. But because I am satisfying my senses, I have gained increasing ignorance. The shoreline of ignorance is never found. By my good fortune, you, who transcended the darkness of ignorance, appeared before my eyes. I understand that you are the one who is within the beings, the one who is appointed, the Lord, the Lord of all. Like the sun, you rose in the darkness of ignorance. You must dispel the darkness that is my desire.

The attachment I have is in what is not mine, the feeling of 'I' in what is not mine, and the feeling of 'mine' in what is not mine. The feeling of 'I' exists in two forms. That pride of mine is binding me. You are the ones who are separated from it. You are like an axe that cuts down the tree of family life that is called worldly for his devotees. You are the best among those who have practiced the religion of renunciation. I, knowing the form and nature of the Supreme Being of that being, and the nature of the nature, I surrender to you. Thus, hearing the words spoken by the mother, who had a taste for liberation, and being pleased in their hearts, Kapiludu, who had mental control, spoke thus with a smile. What did Kapilu say to his mother Devahito? We will find out about that in the next podcast. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.