జీవుని గర్భవాస దుఃఖములు - కాలచక్ర భయానక స్థితి
Tribulations of Living Entities & Womb Confined Misery
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, మహర్షి కపిలుడు తన మాత దేవహూతికి గర్భంలో బంధింపబడిన జీవుని తీవ్రమైన దుఃఖాన్ని వివరిస్తున్నాడు. జీవుడు పూర్తి చైతన్యంతో ఉన్నప్పటికీ, కర్మబంధాల వల్ల నిస్సహాయంగా గర్భంలో అపారమైన యాతనలను అనుభవిస్తాడు. కపిలుడు మరింత వివరిస్తూ, కాలచక్రం ఎలా అన్ని బద్ధజీవులను జనన మరణ చక్రంలో నిరంతరం తిప్పుతుందో భయానకంగా తెలియజేస్తున్నాడు. ఈ ఎపిసోడ్ మనలను ఆధ్యాత్మిక సాధన పట్ల మేల్కొలిపి, పరమాత్మను శరణు వేడుకోవడమే ముక్తికి ఏకైక మార్గమని స్పష్టం చేస్తుంది.
In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, the great sage Kapila Muni reveals to his mother Devahuti the profound suffering endured by the living entity trapped within the womb. The soul, fully conscious yet utterly helpless, experiences intense anguish through every stage of embryonic existence, bound by the forces of karma and time. Kapila Muni further explains how the terrifying wheel of time governs all conditioned souls, driving them through cycles of birth, suffering, and death with relentless force. This episode serves as a powerful reminder of the urgency of spiritual practice and the necessity of surrendering to the Supreme Lord to transcend this cycle of misery.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః ఆత్మానందానుభూత్యైక న్యస్త శక్త్యూర్మయే నమః ఋషీకేశాయ మహతే నమస్తే విశ్వమూర్తయే నీవు నీ స్వరూపమగు ఆనందం యొక్క అనుభూతి చేతనే మాయ నుండి పుట్టే రాగద్వేషములను త్రోసిపుచ్చితివి నీవు దేశ పరిచ్ఛేద రహితుడవై అయినను ఇంద్రియాధిపతివై ఉన్నావు జగద్రూపముగా ప్రకటమై ఉన్న నీకు నమస్కారము. సిక్స్త్ కాంటో, సిక్స్టీన్త్ చాప్టర్, ట్వంటీఎత్ ప్రేయర్. భగవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము. 42వ పాడ్కాస్ట్ లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దేవహూతికి బోధిస్తున్నటువంటి కపిల గీతలో భాగంగా మనం గర్భములో శిశువు ఏ రకంగా పరితపిస్తాడు, ఏ రకంగా భగవంతుని ప్రార్థిస్తాడు, జ్ఞానం ఎలా కలుగుతుంది, తర్వాత జ్ఞానం ఎలా మరిచిపోతాడు ఆ విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇంకా ముందు భాగంలో. విషయాన్ని చూద్దాం. కపిలుడు సాక్షాత్తు భగవానుడు. అతడు చెప్పుచు ఈ లోకంలో జ్ఞానమును ఆవరించి మోహమును కలిగించేది స్త్రీమాయయే అని వివరిస్తున్నాడు. ఆ మాయ నా చేతినే సృజింపబడినది, దాని సామర్థ్యము చాలా గొప్పది. కనుబొమ్మ కదలికచే దిక్కులను జయించెడి శూరులు కూడా దానికి లొంగిపోవుదురు. అందుచేత. మనస్సు భగవంతునిపై నిలుపుటకు యోగమును దాని ఫలముగా భక్తిని పొందవలెనని కోరువాడు ఆత్మ యొక్క యధార్థ జ్ఞానమును కలగవలెనని యత్నించువాడు స్త్రీలతో సంబంధము కలిగి ఉండుట వారి సాధనములో భ్రంశమును కలిగించును. మోక్షమును, యోగమును, జ్ఞానమును సాధించుట పురుషులకు, స్త్రీలకు కూడా అవశ్యకమే. కనుక పురుషులకు స్త్రీలు ఎట్లు మోహమును కలిగించి సాధన నుండి కింద పడవేయుదురే అట్లే స్త్రీలకు పురుషులు సాధనలో భ్రంశము కలిగిందురు కలిగింతురు. అందుచే మోక్షమునందు ఇచ్చగల జీవులకు స్త్రీకి పురుషుడు, పురుషునకు స్త్రీ నరక ద్వారమని చెప్పుదురు. వారి యంది మనసులో తగులాటము ఉండరాదు. సేవించుటకు వచ్చినట్లు జ్ఞాన సముపార్జనకు వచ్చినట్లు వచ్చినను.
సాధన దశలో స్త్రీ పురుషునకు పురుషుడు స్త్రీకి అనర్థము కలిగించువారుగా గుర్తించవలెను. పైన గడ్డి మొలచిన బాయు వలె వారికి ఒకనాడు కూలిపోవునట్లు చేతురు. ఈ జన్మలో పురుషుడుగా ఉండి తాను పొందవలసిన జ్ఞానమును పొందలేక కామముచే స్త్రీయందే మనస్సు లగ్నమై ఆమెనే ధ్యానించుచు శరీరమును వీడినవాడు తరువాత జన్మలో పురుషుని కొరకు స్త్రీగా జన్మించును. ఆమె డబ్బులిచ్చిన వానిని భర్త అనుకొనుచుండును. కామమును తీర్చుకొనుటయే ప్రధానముగా భావించుచుండును. అందుచే ధర్మాచరణమే కాక యోగ్యమైన సంతతి వృద్ధికి కాక కామము చేతను. ధనమందు లోభము చేతను కుపురుషునితో చేరియుండును. ప్రియుడని చేరుచున్న పురుషుడే మృత్యువును కలిగించువాడని గుర్తించవలెను. లేడికి పాట ఇష్టము. వేటగాడు దానికి ఇష్టమగు పాట పాడి దానిని వశపరుచుకొని బంధనమున పడద్రోయును. అట్లే పురుషుడు స్త్రీకి ఇష్టమైన డబ్బును, నగలను, భోగములను ఎరచూపి వశపరుచుకొని బంధమున పడత్రోయును. ఇంతవరకు కపిలుడు ఈ దేహమునందు వైరాగ్యము కలగవలెనని చాలా విస్తారముగా గర్భ, జన్మ, బాల్య, యవ్వన, వార్ధక్య, మరణ, మరణాంతర దశలో జీవుడు అనుభవించు క్లేశములను తల్లియగు దేవహుతికి వివరించి చెప్పినాడు. శరీరమును విడిన తరువాత ఈ దేహమున నుండి జీవుడు ఎట్లు విడలనో ఇంకా వివరించుచున్నాడు. జీవుడు ఇంతకాలము తాను ఆత్మ అని భావించుచున్న శరీరము నుండి ఆ శరీరముతో అనుభవించవలసిన కర్మ పూర్తి కాగానే విడివడును. అంతవరకు ఉన్న శరీరము స్థూల శరీరము. దానిలో నుండి వెలువడునప్పుడు జీవుడు సూక్ష్మ దేహముతో వెలువడును. అందు పంచభూతముల సూక్ష్మాంశములు ఉండును. ఐదు జ్ఞానేంద్రియములు మనస్సు ఉండును. ఆ శరీరముతో లోకాంతరమునకు మరియొక దేహమునకు వెళ్ళుచుండును. ఈ స్థూల శరీరములో ఉండగానే రాబోవు శరీరము ఏర్పడుటకు తగిన కర్మలను చేయుచుండును. సూక్ష్మ శరీరము లేనిదే జీవుడు పయనించలేడు. ఇప్పటి శరీరములో ఎన్ని కర్మలు అనుభవించవలెనని నిర్ణయించబడినవో వానిని అనుభవించినను ఇంకను కర్మలు మిగిలి ఉండును.
అందుకై మరల మరణించుట, మరల పుట్టుట లేదా లోకాంతరమునకు ఏగుట జరుగుచుండును. ఈ స్థూల శరీరమును విడిచి సూక్ష్మావస్థను పొందుట మరణము. సూక్ష్మావస్థతోనున్న శరీరము స్థూలావస్థను పొందుట పుట్టుట. ఈ శరీరమును బట్టి పుట్టినాడు చనిపోయినాడు అందురు కానీ శరీరమున్న జీవునకు పుట్టుట చనిపోవుట లేదు. ప్రకృతి పురుషుడు ఎల్లకాలము ఉండునవి. అవి రెండును నిత్యములు. ప్రకృతి వికారముకు శరీరము స్వరూపముచే మార్పు చెందుచుండును. పురుషుడు అనగా జీవుడు మార్పు చెందడు. పై ఆకారములో మార్పు కలిగినను మూలద్రవ్యము ఎప్పుడును ఉండును. కనుక ప్రకృతి నిత్యము పురుషుడు అనగా జీవుడు స్వరూపములో మార్పు చెందడు గాని కర్మ వశముచే ప్రకృతి సంబంధము ఏర్పడగానే జ్ఞానము కలవాడుగా యుండియు జ్ఞానము లేని వాని వలె ఆనందము కలవాడై యుండియు నేను దుఃఖమును అనుభవించుచున్నాను అనుకొనును. అందుచే జీవునకు స్వభావములో మార్పు ఏర్పడుచుండును. జీవునకు జ్ఞానం ఉండును. ప్రకృతి వికారము శరీరముకు జ్ఞానం ఉండదు. వస్తువును నిలింగగల జీవుడు ఆ వస్తువులను గుర్తించునట్లు ఉండుట పుట్టుట. స్థూలముగా వస్తువును గుర్తించలేకపోవుట మరణించుట. శరీరము ఆత్మ కాదు జ్ఞానములో లేనిది మారునది కనుక మనకు రూపము కనపడునట్లు చేయు ఇంద్రియములు కన్ను అనబడును. ఆ కన్ను ఇంద్రియము. అది మన గ్రుడ్డు అనేటి గోళములో ఉండును. కానీ ఈ గ్రుడ్డును గాని గ్రుడ్డులో నుండి కన్ను అనేటి ఇంద్రియమును గాని చూడవు. వానికి రూపమును ఎరుంగెడి శక్తి లేదు. దాని వెనక ఉన్న ఎరుంగగల జీవుడే వాని ద్వారా ఎరుంగుటయే నేత్రగోళమే కన్ను అనియు కన్ను చూచుచున్నదనియు అనుకొంచుందురు. అందుచేత చూచెడివాడు జ్ఞానము కలవాడు ఆత్మ చూడగల జీవునకు ఈ స్థూల రూప శరీరము సంబంధం ఉన్ననాడే ఆయా ద్రవ్యములను ఎరుంగగల శక్తి బయలుపడును. ఆ శక్తి బయలుపోవుటయే పుట్టుట, అది పోవుటయే చనిపోవుట. అందుచేత ఇంద్రియములు ఆత్మ కావు, శరీరము కాదు. జన్మ జరా మరణములు శరీరమునకు కలుగుచున్నవి కానీ ఆత్మకు కలుగుట లేవు కానీ శరీరము నేను అనుకొనుటచే
చనిపోవుదును అని భయము ఏర్పడును. పిల్లలు, బంధువుల వియోగములో శోకము కలుగును. కుమారులు కలిగిన సంతోషము కలుగును. కానీ ఇవన్నియు శరీరమునకే చెందినవి. నేను అనేటిదే ఆత్మ ఇతరములు నాకు సంబంధించినవి కావు అని వదలి దైన్యము లేక తొట్రుపాటు లేక దేహమందు దేహ సంబంధుల యందు సంబంధము విడిచి ప్రవర్తించుచుండవలెను. ముందుగా శాస్త్రము చెప్పిన శరీరము కంటే వేరైన ఆత్మ యొక్క యధార్థ జ్ఞానమును ఎరుంగవలెను. అజ్ఞానముతో శరీరముతో అనుభవించడి విషయములకై తాపత్రయపడి అవి లేనుచే బ్రతకలేనని కామువు తొలగి వైరాగ్యము ఏర్పడవలెను. నేను పొందవలసినది బ్రహ్మ ఒక్కటియే అని ఎరింగి దానికంటే ఇతరములగు వస్తువులకై ఆరాడపోవుట తగ్గవలెను. వీనిచే భగవంతుని ఎడతెగక ప్రేమతో స్మరించడి ఉపాసనము భక్తి అనేటి బుద్ధి కలుగును. దానితో ఈ మాయామయమగు లోకమందు ఈ శరీరమందు ఆసక్తి తగ్గి ప్రవర్తించవలెను. ఇంతవరకు తాను చేయదగిన ధర్మములను ఆచరింపక పాపములను చేసిన వారు ఎట్టి బాధలను పొందుదురో వివరించినాడు. ఇంకా పుణ్య కర్మలు చేయువారును, తమ ధర్మములను తాము ఆచరించువారును, పరబ్రహ్మమును ఉపాసించువారును మరణానంతరం ఎట్లు ఏగుదురో వివరించుచున్నాడు. గృహస్థాశ్రమం స్వీకరించి గృహములోనే ఉండి గృహస్థ ధర్మములను ఆచరించుచున్న వారు తమ తమ ధర్మములను ఆచరించి దానిచే కామములను ధనమును పొందుదురు. మరల ధర్మమును ఆచరించుచుందురు కానీ గృహస్తుడు ఆ ధర్మములను ఆచరించుటయే ప్రధానమని భావించి ఆయా కోరికలను సాధించుకొని విషయ భోగములను అనుభవింపవలెనని భగవత్ సేవనము ప్రవర్తింపక శ్రద్ధతో కోరికతో ధర్మములనే ఆచరించుచు క్రతువులచే దేవతలను శ్రాద్ధములచే పితృ దేవతలను ఆరాధించుచుండును. ఇట్లు దేవతలను పితృ దేవతలను ఆరాధించువారు మరణానంతరము చంద్రలోకనుకేగుదురు. అచటి నుండి దూమాది మార్గము అనబడి మార్గము పైకి పైకి పోయి చంద్రుని స్థానమున కొంతకాలం ఉండి ఆ పుణ్య కర్మలే చేసిన వారు పైలోకమునకు ఏగిన ప్రళయములో ఆ
లోకమును రక్షించినప్పుడు మరల వెనకు వచ్చుందురు. సో ఈ ధర్మ మార్గంలో ప్రవర్తించేటువంటి వారు జరిగేటువంటి వారికి జరిగేటువంటి విషయం ఏమిటి అనేది మనము ఆ ఆత్మ గురించి మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the one who is the power of the experience of self-bliss. Salutations to Rishikeshaya, the great one. Salutations to the universal form. You, through the experience of the bliss that is your form, have cast away the attachment and aversion that arise from Maya Even though you are without the defect of the country, you are the lord of the senses, salutations to you who is proclaimed as the form of the world. Sixth Canto, Sixteenth Chapter, Twentieth Prayer. Oh, devotees of the Lord, the third book of the Srimad Bhagavata Tattva Deepika. Welcome to episode 42. As part of the conversation between Vidura and Maitreya, as part of the Kapila Gita teaching Devahuti, how does the baby in the womb suffer, how does he pray to God, how does knowledge come, Then how does he forget the knowledge, we have learned that in the next part. Let's focus on the issue. Kapila is the actual God. He is explaining that in this world, the illusion of women is what covers knowledge and causes delusion. The magic was created by my hands and its power is immense. Even the heroes who conquer directions by the movement of their eyebrows will succumb to it. Therefore. One who desires to fix his mind on God, to attain devotion as its fruit, and to attain the true knowledge of the self, one who strives for it, having relations with women, causes distraction in their practice. Attaining salvation, yoga, and knowledge is essential for both men and women. Therefore, just as women cause attachment to men and bring them down from their practice, similarly, men cause distortion in women's practice. Therefore, it is said that for those beings who can attain liberation, a woman is a gateway to hell for a man, and a man is a gateway to hell for a woman. There should be no conflict in their hearts. As if they came to serve, as if they came to gain knowledge.
In the practice stage, men should be identified as those who cause harm to women. Like a grass sprouting above, they will one day be destroyed. In this birth, being a man, unable to attain the knowledge he should have, and with lust, the mind is attached to a woman, and he who leaves the body, thinking of her, will be born as a woman for a man in the next birth. She considers the one who gave her money as her husband. The main thing is to satisfy the desire. Therefore, not only for the practice of dharma, but also for the growth of a worthy progeny, and also for lust. Money is associated with greed and association with a bad person. It must be recognized that the man who is attached to the beloved is the one who causes death. The lamb loves the song. The hunter sings a song to it, captivates it, and subdues it in bondage. Similarly, a man, tempting a woman with money, jewelry, and pleasures of the flesh, enslaves her and falls into bondage. Until now, Kapiludu, in this body, should have detachment, in a very extensive way, in the womb, birth, childhood, youth, old age, death, post-death stages The creator explained the sufferings experienced by the living beings to the goddess Devahuti. After separating the body, he is still explaining how the soul separates from this body. The being, for so long, considering itself as the soul, separates from the body from which it has to experience, as soon as the karma to be experienced with that body is completed. The body that is, is the gross body. When it emerges from within, the living being emerges with a subtle body. It contains the subtle elements of the five elements. Five sense organs and mind exist. With that body, to the other world, to another body, he is going. While being in this gross body, one performs actions suitable for the formation of the coming body. The soul cannot travel without the subtle body. Even after experiencing the karmas that have been decided to be experienced in the current body, there will still be karmas remaining.
Therefore, again dying, again being born, or going to the other world, will happen. Death is the departure from this gross body and the taking-up of the subtle body. The body, which is in a microstate, acquires a macroscopic state, that is, it is born. They say he was born and died according to this body, but for a being with a body, there is no birth or death. Nature and the elements are eternal. They are eternal. The body changes according to the nature of the disorder. The male, the being, does not change. Even if there is a change in the shape, the core substance will always be there. Therefore, nature is eternal, and the man, that is, the living being, does not change in form, but as soon as a relationship with nature arises due to karma, even though he is knowledgeable, even though he is happy like one without knowledge, I am sorrowful I think I am experiencing it. Therefore, the nature of the living being changes. The living being has knowledge. The body is not conscious of the changes of nature. The object is to be recognized by the nail-like creature. Grossly The inability to recognize an object is death. The body is not the soul, it is not in knowledge, it is not changing, therefore, the senses that make us see the form are called the eye. The eye is the sense organ. It is in a sphere called the egg. But they do not see this egg or the eye, which is the sense organ, from within the egg. He has no power to know the form. The creature behind it, through it, is the eye, the eye is the eye, and they think that the eye is seeing. Therefore, the one who sees, the one with knowledge, the soul, to the being who can see, even when this gross form of body is related, the power to know those substances will be revealed. That power is born only to be destroyed, and it is destroyed only to be born. Therefore, the senses are not the self, nor the body. Birth, old age, and death occur to the body, but not to the soul. But because I consider the body to be mine
There is a fear that I will die. Grief is felt when children and relatives die. You will be blessed with children. But all these belong to the body. I, that is, the soul, others are not related to me, abandoning poverty, without stumbling, in the body, in the body's relations, leaving the relationship, one should behave. First, one must understand the true knowledge of the soul, which is different from the body as described in the scriptures. Do not be anxious about the things you experience with the body through ignorance; do not live without them. The desire should be removed, and detachment should be established. I should only seek Brahma, and I should not search for anything other than that. By constantly remembering God with love, worship and devotion will bring wisdom. With that, in this illusory world, in this body, interest should decrease and one should behave. Until now, he has explained what kind of suffering those who have committed sins by not practicing the righteous deeds they should have done will suffer. And those who perform good deeds, those who practice their own dharma, and the Supreme Being He is explaining how those who worship will be resurrected after death. Those who accept the householder's life, stay in their homes, and practice the duties of a householder, by practicing their respective duties, attain desires and wealth. Again, they practice Dharma, but the householder, considering it paramount to practice those Dharmas, should fulfill those desires and experience worldly pleasures, without engaging in the service of God, but with devotion and desire, practicing Dharmas The gods are worshipped by the rituals, and the ancestors are worshipped by the shraddhas. Thus, those who worship gods and ancestors will go to the lunar world after death. From there, the path called Dumadi, going upwards, staying in the position of the moon for some time, those who did those virtuous deeds ascended to the upper world, in the deluge, that
When the world is saved, they will come back again. So, what is the matter that happens to those who behave in this path of Dharma, let us know about that soul in another podcast. Jai Srimannarayana Asmat Gurubhyo Namaha