హిరణ్యాక్ష వధ & కర్దమ ప్రజాపతి (Parts 26-34)
Hiranyaksha Slain & Sage Kardama (Parts 26-34)
ఈ పవిత్రమైన ఎపిసోడ్‌లో, శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని రెండు మహత్తరమైన కథలు వివరించబడతాయి. శ్రీ వరాహ స్వామి మరియు బలశాలి అయిన హిరణ్యాక్షుని మధ్య జరిగిన మహాసంగ్రామం పరమాద్భుతంగా ముగుస్తుంది, ధర్మం అజేయమైనదని నిరూపిస్తుంది. ఆ తర్వాత, కర్దమ ప్రజాపతి యొక్క తపోనిష్ఠను మరియు భగవంతుని అనుగ్రహంతో ఆయనకు దేవహూతితో కలిగిన వివాహాన్ని గురించి హృద్యంగా తెలుసుకొంటాము. ధర్మం యొక్క విజయాన్ని మరియు భక్తి యొక్క మహిమను చాటి చెప్పే ఈ కథలు మన జీవితానికి శాశ్వతమైన స్ఫూర్తిని అందిస్తాయి.
In this sacred episode of Canto 3, we witness the thrilling conclusion of the cosmic battle between Lord Varaha and the mighty demon Hiranyaksha, whose defeat restores peace and order to the universe. We then enter the serene story of Sage Kardama, a noble progenitor whose deep austerities and unwavering devotion to Lord Vishnu earn him divine grace and a destined marriage to the virtuous Devahuti. Together, these timeless narratives from the Srimad Bhagavatham illuminate the triumph of dharma over adharma and the sublime rewards of a life surrendered to the Lord.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమో మహద్భ్యోస్తు నమశ్శుభ్యః నమో యువభ్యః నమ ఆవటుభ్యః యే బ్రాహ్మణాగామవధూతలింగాః చరంతి తేభ్యః శివమస్తు రాజ్ఞాం పెద్దలకు, పిల్లలకు, యువకులకు, ఆటలాడుకునే బ్రహ్మచారులకు కూడా నమస్కారం. తిరస్కార యోగ్యమగు వేషముతో బ్రహ్మవేత్తలు భూమిపై సంచరించెదరు. వారి వలన రాజులకు మంగళము కలువుగాక. ఫిఫ్త్ క్యాంటో, 13th చాప్టర్, 23rd ప్రేయర్. భవద్బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధం 26th పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు స్వయంభూవును సృష్టి చేయమని అన్నప్పుడు తను బ్రహ్మను ప్రార్థించడం జరిగింది. బ్రహ్మ ఒక కన్య సాయం సంధ్య. అవతరించింది. ఆ సాయం సంధ్య రూపాన్ని వర్ణిస్తూ తనను ప్రశ్నలు అడిగారు. తర్వాత అసురులంతా కూడా చూసి ఆమెతో ఆమెను స్వీకరించారు. తర్వాత భావం జరిగిందో తెలుసుకుందాం. ఇది కూడా విదుర మైత్రేయుని యొక్క సంవాదంలో భాగమే. బ్రహ్మ నుండి ఆయా భావములు ఎట్లు బయలు వెళ్ళినాయో ఈ వృత్తాంతమును సూచించును. ఛాయ నుండి రాత్రి వచ్చినది, ప్రభ నుండి పగలు వచ్చినది, చాపల్యము నుండి సంధ్య వచ్చినది, రాత్రి అజ్ఞానము, పగలు ప్రకాశము, సంధ్యా సమయము చాంచల్యమై ఉండెను. ఇట్లు బ్రహ్మ శరీరము నుండియే ఆయా ధర్మములను సృజించెను. రాత్రి, సంధ్య, పగలు అను కాలములు అజ్ఞానమును, జ్ఞానమును, చాపల్యమును కలిగించునవి అని ఆ కాలములకు ఆయా వ్యవహారమును కల్పించెను. బ్రహ్మ అసురుల సంధ్యను స్వీకరించుట చూచి నవ్వుకొని తన దేహమునందలి కాంతితో అప్సరసలను గంధర్వులను సృష్టించెను.
సౌందర్యమునకు అప్సరసలు, గంధర్వులు ప్రసిద్ధి. ఆ భావములే ఆ పేర్లతో వెలిసినవి. తరువాత కాంతి అధికముగా గల తనకు అత్యంత ప్రియమగు ప్రాతః సంధ్య అనడి తన శరీరమును గంధర్వులుగా, అప్సరసలుగా సృష్టించెను. వారిని విశ్వావసు మొదలగు వారు స్వీకరించిరి. ఆ బ్రహ్మ యొక్క సోమరితనము, బద్ధకము అను భావముల నుండి భూతములు, పిశాచములు వచ్చినవి. వారు జుత్తు విరియ పోసుకొని దిగంబరులై తిరగాడుచుండిరి. వారిని చూచి బ్రహ్మ కనులు మూసుకోయెను. ఆ బ్రహ్మ భూత పిశాచ సృష్టికి కారణమగు నాలుగు రకములగు శరీరముగా ఆలస్యము అంటే బద్ధకము, ఆవలింత, నిద్ర, నిద్రమత్తు అను నాలుగు రకముల భావములను సృష్టించెను. బ్రహ్మ చేత విడువడిన నాలుగు శరీరములకు ఆలస్యము అనగా సోమరితనము, బద్ధకము అను వాని నుండి భూత పిశాచములు వచ్చెను. రెండవది ఝృంబణము అనగా ఆవలింత. దాని వలన ఇంద్రియములలో నీరసము ఏర్పడును. ఇంద్రియములలో నీరసం ఏర్పడినప్పుడే ఆవలింత వచ్చును. నిద్ర అనడి శరీరము నుండి ఇంద్రియములు పని చేయకపోవుట అనడి స్థితి వచ్చును. ఇంద్రియములు పనిమానుట నిద్ర అనడి శరీరము నుండి వచ్చును. అపరిశుద్ధమగు వాడిని స్వీకరించుట ఉన్మాదము. అది కూడా భగవాను శరీరము నుండి వచ్చినదే. ఇట్లు ఈ ప్రాణులలో కనిపించు భావములు కాలములు కూడా ఆ బ్రహ్మ యొక్క శరీరము నుండి వచ్చినవే. తరువాత బ్రహ్మ తాము బలవంతులమని భావించు సాధ్యులను గుణములను సృష్టించెను. పితృ గణములను వాని వైపు చూడకుండా సృష్టించెను. ఇట్లు సాధ్యులను పితృ దేవతలను సృష్టించిన ఊర్జస్సు అనగా బలము కలిగిన శరీరమును వారే స్వీకరించిరి. అందుచే కర్మలచే బలమును పొందవలెనని కోరెడి వారు సాధ్యులను పితరులను బల సంపాదనకు ఆరాధింతురు. సాధ్యులను ఆరాధించు వారికి పాలించు శక్తియు పితరులను ఆరాధించు వారికి సంతతియును లభించును. బ్రహ్మ తాను ఎవ్వరికీ కనబడకుండా ఉండునట్లు తిరోధాన శక్తి గలవాడై సిద్దులను విద్యాధరులను సృష్టించెను. అంతర్ధానము అను ఆశ్చర్యకరమగు శక్తి ప్రధానముగా గల శరీరము నుండి సృజింపబడుటచే సిద్దులకు విద్యాధరులకు ఆ శక్తి కలిగెను. బ్రహ్మ తన శరీరమును చూచుకొని ఆనందించునప్పుడు తన ప్రతిబింబమును చూచి ఆనందించునప్పుడు కిన్నరులను కింపురులను కింపురుషులను సృష్టించెను. ప్రతిబింబమనడి శరీరమును కిన్నరులు కింపురుషులు స్వీకరించిరి. వారిద్దరు కలిసి ప్రతిబింబమును చూచి
బింబము అని ఆనందించునట్లు సంధ్యా సమయంలో బ్రహ్మను ఇట్లు స్తోత్రము చేయుదురు. వారు బ్రహ్మ గుణములు గానము చేయుదురు. బ్రహ్మ భోగములను అనుభవించుచు అనేకములగులో ఆలోచనలు చేయుచు పరుండి ఉండి క్రోధముతో సృష్టి వృద్ధి నందుట లేదని ఆలోచన కలిగి. క్రోధముతో కూడిన శరీరమును విడిచెను. అప్పుడు కోపము ప్రధానముగా గల శరీరము నుండి జారిన కేశముల నుండి పాములు పుట్టెను. కాలు చాచుట, ముడుచుట మొదలగు వ్యాపారములను చేసెడి శరీరము నుండి సర్పములు పుట్టెను. భోగముచే, సౌకుమార్యముచే చాలా ఆలోచించుచు కదలలేక పరుండెడి శరీరము నుండి నాగములు అనగా పాములలో ఒక జాతి పుట్టెను. ఇవి అన్నియు బ్రహ్మ కోపము చే వదిలిన శరీరము నుండి పుట్టినవి కనుక పగ గలవై మెత్తని శరీర స్పర్శ గలవై పొడవై ఎల్లప్పుడూ నేలపై పరుండెడి జీవులైనవి. ఈ విధముగా రకరకములగు సృష్టులను చేసిన తరువాత తన మనస్సుచే సంకల్పించి ప్రజలను సృష్టించగల మనువులను సృష్టించెను. వారికి తన వలె పురుషాకారములో నుండి దేహములను కల్పించెను. శరీరమును పురము అందురు. తన శరీరముతో సమానముగు శరీరమును అనగా పురమును సృష్టించి వారికి వసంగుండచే మనువులు బ్రహ్మను స్తోత్రము చేసిరి. ఓ సృష్టికర్త పురుషాకారముగు శరీరమును చాలా బాగుగా సృష్టించితివి. ఈ పురుష శరీరమునందే స్వర్గమునకు, మోక్షమునకు, సాధనములగు కర్మలన్నియు ఆధారపడి ఉన్నవి. ఇంక మేము ఈ శరీరముతో అనుభవింపదగిన పదార్థములను అనుభవించవలెను. వానిని అనుభవించి ఆనందింతుము అనిరి. తరువాత బ్రహ్మ భగవదుపాసన తపస్సు అని వానితో కూడినవాడై ఇంద్రియములను నియమింపగలవాడై ప్రకృతి కంటే వేరైన ఆత్మ యొక్క యధార్త స్వరూపమును చిత్తైకాగ్రతతో భావించుచు ఋషులను సృష్టించెను. ఆ శరీరమునందలి తపస్సు, విద్య, సమాధి, యోగము, వైరాగ్యము మొదలగు భావములన్నింటిని ఋషులకు ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నుసంగెను. ఇట్లు భావ సృష్టి మొదలు మనుష్య సృష్టి వరకు వివరించెను. విదురుడు స్వయంభువ మనువు యొక్క వంశములను వర్ణింపవలసినదిగా మైత్రేయుని కోరెను. స్వయంభువ మనువు వంశము మహాత్ములకు అభిమతమైనది. ఆ వంశమునందు స్త్రీ పురుషుల దాంపత్య ధర్మముచే సంతానము ఆవిర్భవించుచుండెను.
స్వయంభువ మనువు కుమారులు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను వారు వర్ణాసన ధర్మములను అతిక్రమింపకుండా సప్త ద్వీపములతో కూడిన భూమిని ఎట్లు రక్షించిరో ఎరంగింపుడు. స్వయంభువ మనువునకు దేవహూతి అనేటి పుత్రిక కూడా కలదని చెప్పితిరి. ఆమె కర్దవ ప్రజాపతి వలన ఎందరిని కనెను? వారెవరు? రుచి, దక్షుడు అని ఇద్దరు ప్రజాపతులు మనువు కుమార్తెలగు ఆకూతిని, ప్రసూతిని భార్యలుగా పొంది సంతతిని ఎట్లు వృద్ధి చెందించిరి? వివరింపుము. విదురుడు ఇట్లు ప్రశ్నింపగా మైత్రేయుడు ముందు కర్దమ దేహోతుల చరిత్రను చెప్పుటకు ఉపక్రమించెను. బ్రహ్మ ప్రజలను సృష్టించుమని కర్దమునకు ఆజ్ఞాపించెను. అతడు సరస్వతీ నది యందు పది వేల సంవత్సరములు తపస్సు చేసెను. అతడు ఏకాగ్రము చిత్తముతో తపస్సు చేసిన తరువాత పుండరీకాక్షుడు అతని తపస్సునకు సంతుష్టుడై తన శరీరమును దర్శింపజేసెను. ఆ శరీరము పంచోపనిషణ్మయము. అది పంచోపనిషత్తులనేటి మంత్రములచే ఎరుంగదగినది. కళ్యాణ గుణములు కలది. అట్టి దివ్య మంగళ విగ్రహమును అతనికి దర్శింపజేసెను. కర్దముడు భగవానుని దర్శించెను. ఆ భగవానుడు నిర్మలముగు సూర్యుని వంటి కాంతి గలవాడై ఉండెను. తెల్లని పద్మములు, నల్లని కలవలు చేర్చి కూర్చిన మాలికలను దాల్చి ఉండెను. అలకలు అనగా ముంగురులు ముఖముపై జారుచుండెను. నిర్మలము వస్త్రమును దాల్చి ఉండెను. కిరీటము, కుండలములు, శంఖ, చక్రములు, గదను ధరించి ఉండెను. ఒక చేతిలో తెల్ల కలవను దాల్చి ఉండెను. మనసును దోచెడి మందహాసముతో చూచుచుండెను. గరుడుపై గరుడుని మూపుపై పాదములను మోపి ఆసీనుడై ఉండెను. కంఠమున కౌస్తుభ మణి ప్రకాశించుచుండెను. కర్దముడు అట్టి రూపమును ఆకాశమున దర్శించి కోరిక నెరవేరిన వాడై దండం వలె నిలబడి నమస్కరించెను. చేతులు జోడించి నిలిచెను. భగవత్ గుణములను ప్రతిపాదించు వాక్కులతో తన కోరిక కలను ఎరుక పరుచుచు స్తుతించెను. స్తోత్రము చేయదగిన వాడవు నీవు. పరిపూర్ణ సత్వమయ గుణములు కలవాడవు. నీ దర్శనం వలన మా నేత్రములకు సిద్ధి చేజెక్కినది. దానిచే నీ దర్శనమనడి ఫలము మా నేత్రములకు లభించినది. యోగారూఢులైన సాత్వికులు ఇట్టి నీ దర్శనమును చేయవలెనని కోరుచుందురు. అజ్ఞానముచే బుద్ధి చెడిన వారై సంసారమునడి సముద్రము దాటించుటలో నౌక అగు నీ చరణారవిందమును సేవించి దానినే కోరిక కోరికలు కోరుచుందురు.
కానీ నీవు సంసారంలో వారు కోరెడి కోరికలు వారికి నరకములు వంటివని ఎరుంగియు వారి కోరికలను తీర్చకుండా ఉండలేక వసంగు చందువు. నీ పాదపద్మముని నౌకగా ఎవరు ఆశ్రయించి సేవింపకోరుదురో వారికి దానిని కూడా వసంగుదువు. కోరికలు కోరరాదని నాకు తెలియును కానీ నేను కూడా కోరికలను కోరియే నిన్ను సేవించుచున్నాను. గార్హస్త్యమును వృద్ధి పొందించుటకు. సమానముగు శీలము గల భార్యను పొంది సంతతిని వృద్ధి పొందవలెనని అట్టి భార్యను అనుగ్రహింపమని కోరుటకు వచ్చినాను. నా మనసు దుష్టమైనదే కల్పవృక్షం వలె కోరిన కోరికలన్నింటినీ తీర్చగల నీ వద్దకు వచ్చి ఇట్టి కోరికను కోరరాదని నాకు తెలియును. ప్రభు వేదముని ఆజ్ఞారూపము. అది ముకుత్రాడు పోసి పశువును నడుపునట్లు ఈ లోకమును నడుపుచున్నది. దానిని అనుసరించి లోకమంతయు ఆయా కోరికలతో కర్మలను ఆచరించి ధర్మార్థ కామములను ఆచరించుచుండును. నేను కూడా అట్టి సంసారులని అనుసరించి ఉన్నాను. నీవు నిర్మలుడవు, కాల స్వరూపుడవు. నీకు నేను ఆరాధన చేయుటకై జన్మించినాను. మా తండ్రియగు బ్రహ్మ ప్రజలను సృజింపమని ఆజ్ఞను సంగి నన్ను సృజించెను. అందుకే నేను గృహస్తుడనై ధర్మములచే నిన్ను ఆరాధించవలెనని కోరుచున్నాను. నీవే కాల స్వరూపుడవు కాలమే మనుషులు నడుపునది నీవు అనుగ్రహించవలెనని కోరుచున్నాను నీవు అనుగ్రహించినచో ఆ కాలము నీకంటే ఇతరములైన వాటికి వెచ్చింపబడకుండా మంచిగా ఉపయోగపడును అందుచే నీవు అనుగ్రహించి నీ ఆరాధనతో నేను ధర్మాచరణ చేసి కాలమును యోగ్యముగా వినియోగపరచునట్లు అనుగ్రహించుము. సంసారులను వారిని అనుసరించి ప్రవర్తించడి వారును నిన్ను ఆశ్రయించుందురు. కొందరు నీ గుణములను కీర్తించుట అనడి మధురమగు అమృతమును పానము చేసి దేహ ధర్మములగు ఆ జరా మరణాదులను తొలగించుకొను వారుందురు. అట్టి వారికి నీ చరణములే ఆతపత్రమై ఆధ్యాత్మికాది తాపపున వేడి తరగలకుండా చేయును. సంవత్సరము అను పరిమాణ పరిమాణముతో జగత్తు యొక్క ఆయువును నరికి కొనిపోవుచున్న కాలచక్రము వారి ఆయువును నాశము చేయదు. ఆ కాలచక్రం యొక్క భ్రమణము ఎన్నడూ ఆగదు. దానిని ఇరుసు ఎన్నడూ శిథిలము కాదు. అక్షరమగు బ్రహ్మయే దానిని ఇరుసుగా ఉండును. ఆ కాలచక్రమునకు అధిక మాసముతో 13 మాసములు ఆకుల వలె ఉండును. 360 రోజులు దానికి సాయపడుచుండునవై ఉండును. ఆరు ఋతువులు ఆరు వరుసలుగా నుండు నేములుగా ఉండును. చాతుర్మాస్యములు మూడును మధ్య నుండి కొంచెం వలె ఉండును.
ఇట్టి నీ స్వరూపము అగు కాలచక్రము సంసారులో ఆయుర్దాయమును ఛేదించుకొనుచు సాగుచుండును. నీ గుణానుభవము చేయువారికి ఆ ఈ కాలము ఆయుర్దాయమును హరింపదు. నీవు ఒక్కడివే అన్నింటినీ నీలో శక్తి రూపముగా ఉంచుకొని అద్వితీయుడవై సృష్టికి ముందు వంటివి. అప్పుడు చేతనులకు పురుషులు అచేతనము ప్రకృతి కాలము నీ శరీరముగా నీతోనే చేరి ఉండెను అట్టి నీవే ఈ జగత్తును సృష్టించవలెనని సంకల్పము గలవాడై నీ శరీరముగా నీకంటే వేరుగా ఉండని ప్రకృతిచే జీవులనే ఈ చేతనా చేతనాత్మకమగు నామరూప విభాగములు గల జగత్తును సృష్టించుచున్నావు. నీవే రక్షించుచున్నావు. మరల నీవే నీలోనికి ఉపసంహరించుకున్నావు. సాలిడు తన శరీరములోని తనకంటే వేరుగాక ఉన్న జిగురు పదార్థముతో దారములను సృజించుచు దానిలో తాను కొంత కాలము ఉండి మరల తనలోకి ఎట్టు ఉపసంహరించుకొనునో అట్లే నీవు ఈ జగత్తునకు మూలమై రక్షకుడవై మరల ఉపసంహరించు వాడవై ఉందువు. కనుక నీవే కోరికలను నెరవేర్చగలవాడవని నేను భార్యను కోరి నిన్ను ఆశ్రయించితిని. నీవు నీ శరీరమగు ప్రకృతిని నీ సంకల్పముచే మార్చి అహంకారం మొదలగు వానిని అన్నిటినీ సృష్టించితివి. నీ మాయ ఆవరించి నీ అనుగ్రహముచే దర్శనము లభించిన నీ నుండి నిన్నే కోరిక. వేరొకటి కోరవలెనటి కోరిక కలిగినది. నీవు మమ్ములను అనుగ్రహించుటయే ప్రధానమని భావించువాడవు. నీవు ఆనంద స్వరూపుడవు, ఆనందము గలవాడవు. నీకు ఈ జగత్తు సృష్టించుట చేతను, రక్షించుట చేతను ఒక ప్రయోజనము లేదు. వినోదమునకై సృష్టించుచొందువు. నీ పాద మూలమునే ఆరాధించు వారికి కోరికలను వర్షింపుచుందువు అట్టి నీ పాదపద్మమును నమస్కరించుచున్నాను అనుగ్రహింపుము అని ప్రార్థించాడు కర్దముని తర్వాత విషయాన్ని మనం మళ్ళీ ఇంకా తెలుసుకుందాం కర్దముని యొక్క స్తుతి. విన్నాం మనం జై శ్రీమన్నారాయణ స్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus, salutations to the great ones, salutations to the auspicious ones, salutations to the young ones, salutations to the ascetics. Those Brahmins who are followers of Ganga, who are the embodiments of Shiva, may they be blessed. To the elders, children, and youths, to the kings, Greetings to all the bachelors who play too. With a rejectable appearance, Brahma scholars roam on earth. And may good fortune befall the kings through them. Fifth Canto, 13th Chapter, 23rd Prayer. Dear devotees, welcome to the 26th podcast of Srimad Bhagavata Tatva Deepika, Third Canto. Until now, when it was said to create the self-existent, he prayed to Brahma. Brahma, a virgin, appeared at dusk. Describing the form of dusk, they asked him questions. Then all the Asuras saw and accepted her. Let's see what happened next. This is also part of the conversation between Vidura and Maitreyi. This account indicates how the various feelings manifested from Brahma. From the shade came night, from the light came day, from the matted hair came evening It came, night was ignorance, day was brightness, evening time was restless. Thus, from the Brahma body itself, those Dharmas were created. Night, evening, day, these times cause ignorance, knowledge, and fickleness, thus it created those times with their respective affairs. Seeing Brahma accepting the evening of the demons, he laughed and created apsaras and gandharvas with the light in his body.
Apsaras and Gandharvas are well-known to the world of beauty. Those are the same feelings that surface when names are mentioned. Then, the one with abundant light, his most beloved morning and evening, created his body as Gandharvas and Apsaras. They were accepted by Vishvavasu and others. From the laziness and inertia of that Brahma, ghosts and demons came. They were wearing matted hair and were wandering around naked. Brahma closed his eyes seeing them. That Brahma created four types of bodies as the cause of the creation of ghosts and demons, namely delay, meaning lethargy, drowsiness, sleep, and sleepiness, creating four types of emotions. The four bodies released by Brahma, delay, meaning laziness, lethargy, from him, ghosts and demons came. The second is Jhumeranam, which means yawning. Because of that, lethargy is formed in the senses. Yawning occurs when the senses are depleted. Sleep, the state of not being able to function from the body's sensory organs, comes. The senses are the body's means of sensation and perception. Accepting a person who is impure is madness. That too is from the body of the Lord. Thus, the feelings and times seen in these beings also came from the body of that Brahma. Then Brahma, considering himself strong, created the qualities of the weak. He created the paternal clans without looking at him. Thus, they accepted the body with strength, which was created by the ancestors and the gods, as the energy. Therefore, those who desire to gain strength through actions worship the ancestors who are capable and the fathers for strength acquisition. Those who worship the possible will have the power to rule, and those who worship the ancestors will have descendants. Brahma, being capable of creating Siddhas and Vidyadharas, created them in such a way that they would not be visible to anyone. Because it is created from a body that has the surprising power of disappearance, the Siddhas and Vidyadharas attained that power. When Brahma rejoiced seeing his body, when he rejoiced seeing his reflection, he created Kinnaras, Kimpurus, and Kimpurushas. The body that reflected was accepted by the Kinnaras and the Kimpurushas. Both of them together saw the reflection
They praise Brahma at dusk, as if rejoicing in the image. They perform the Brahma Guna Gana. Experiencing the pleasures of Brahma, contemplating various things, being separate, and having the thought that creation is not increasing with anger, having that thought. He released the body, which was full of rage. Then, from the body that was predominantly angry, from the hair that slipped, snakes were born. From the body that performs actions such as stretching and contracting, serpents were born. From the body that was lying still, unable to move, thinking a lot about pleasure and modesty, a species of snakes, that is, in the snakes, was born. These are all born from the body left by Brahma's anger, therefore they are full of vengeance, have a soft body touch, are long, and are always living beings lying on the ground. After creating various creations in this way, he created humans who could create people by his mind. He created bodies for them, in the form of men. The body is called the city. A body equal to his body, that is, a city Having created, the Manus praised Brahma, who was residing with them. Oh creator, you have created a body in the form of a man very well. In this male body, heaven, salvation, and all the actions that are the means are dependent. And we must experience the things that can be experienced by this body. They said that they would experience it and be happy. Then, Brahma, being united with him in the worship of God and penance, being able to control the senses, contemplating the true form of the soul, which is different from nature, with single-minded attention, created the sages. The penance, knowledge, samadhi, yoga, and detachment in that body, all those feelings were each one extinguished for the sages. Thus, it explained from the beginning of creation to the creation of mankind. Vidura asked Maitreyi to describe the lineage of Swayambhuva Manu. The Swayambhuva Manuva dynasty was favored by the Mahatma. In that lineage, through the dharma of marriage between men and women, offspring were born.
The sons of Swayambhuva Manu, Priyavrata and Uttanapada, how they protected the land consisting of seven islands without transgressing the rules of Varna, is described by Erengupudu. They said that Swayambhuva Manu also had a daughter named Devahuti. Who did she give birth to from Kardava Prajapati? Who are they? How did Ruchi and Daksha, two Prajapatis, who were the daughters of Manu, obtain Akuti and Prasuti as wives and how did they increase their lineage? Please explain. When Vidura asked this, Maitreya began to tell the story of Kardama's body. Brahma ordered Kardama to create humans. He performed penance for ten thousand years in the Saraswati river. After he performed penance with a single-minded focus, Pundarikaksha, pleased with his penance, granted him a vision of his body. The body is pseudo-pancreas. It is known by the mantras of the Panchonishad. It's full of good qualities. He was shown such a divine auspicious idol. Kardambuva met with the Lord. That God He was as pure as the light of the sun. She was wearing a garland made of white lotuses and black bangles. The cries, meaning the curls, were sliding on the face. Nirmalam was wearing a garment. He was wearing a crown, earrings, a conch shell, a discus, and a mace. He was holding a white cloth in one hand. He was looking at me with a wry smile. Garuda was seated on Garuda's hump, with his feet resting on it. A saffron-coloured gem shone on his throat. Kardamudu, having seen such a form in the sky, as if his wish had been fulfilled, stood like a staff and bowed. With folded hands he stood. He praised with words that propose the virtues of God, revealing his desire and dream. You deserve praise. You are endowed with the qualities of purity of heart and selfless service. Through your darshan (divine vision), our eyes have been blessed. Through that, the fruit of your darshan (vision) has been obtained by our eyes. The yogis, who are accomplished in yoga, wish to have such a vision. Those who have lost their wisdom due to ignorance, in crossing the ocean of worldly life, are like a boat Therefore, they serve your lotus feet and desire them.
But you, in the world, they do not know the desires they ask for are like hells, they cannot help but fulfill their desires, Vasangu Chanduvu. Those who do not seek refuge in you as the boat of the lotus feet, you will also destroy them. I know that desires should not be desired, but I too desire desires and serve you. To the increase of the household. I have come to ask for such a wife, who has a virtuous wife and is worthy of increasing progeny. My mind is wicked, like a wish-fulfilling tree. I know that I should not come to you and ask for such a wish. The Lord is the form of the Vedas. It is like pouring mud and making the animal walk, thus ruling this world. Following that, the whole world performs actions with those desires, and practices dharma, artha, and kama. I've been a member of such families. You are purity, you are the form of time. I am a child of a god, who came to worship you. My father, Brahma, commanded me to create the people He created. Therefore, I, being a householder, desire to worship you through righteousness. You are the embodiment of time. I pray that you grant that time is what humans walk on. If you grant it, that time will be used well without being spent on other things than you. Therefore, grant it, and with your worship, I Grant me the ability to practice my religion and use my time in a proper manner. Those who do not act according to the world and those who follow them will seek refuge in you. Some praise your virtues, drink the sweet nectar, and remove the aging, death, and other bodily ailments. For such people, your feet are the penance, and they will not suffer the heat of spirituality. The clock of time, which cuts and takes away the lifespan of the world with a measure of years, will not destroy their lifespan. The wheel of time is eternal. Its iron will never rust. The Akshara-magu Brahma is the one who is the hammer. In that cycle of time, with an extra month, 13 months will be like leaves. 360 days It will be helpful for that. The six seasons are in six rows. The three Chaturmasyas are a little bit from the middle.
Thus, the wheel of time, which is your form, continues to tear away the life span in worldly affairs. This time will not diminish the life of those who experience your virtue. You are the only one, keeping everything in you as a form of power, being unique, like before creation. Then, to the senses, the men are unconscious, nature, time, you are with you as your body, you are the one who has the intention to create this world, as your body, being different from you, by nature, the living beings, this is the conscious, the cognitive You are creating the world with its manifold forms. You are protecting. Again you retreat into yourself. Salidu, creating threads with the sticky substance that is different from himself in his body, and how he stays in it for some time and withdraws into himself again, in the same way, you, being the root of this world, being the protector, again being the one who withdraws You will. Therefore, I sought you as a wife, asking if you could fulfill my desires. You change your body, which is nature, by your will, and those things like ego You created from nothing. Your illusion, covering you, by your grace, having received a vision, from you, the desire is for you alone. There is a desire to ask for something else. You are the one who considers it important to grant us. You are the form of bliss, the one with bliss. You have no purpose in creating this world, nor in protecting it. You are the creator of entertainment. You will shower desires on those who worship at your feet. I am bowing to such lotus feet of yours. Please grant it, he prayed. Then we will learn about the matter again. The praise of Kardamuni. We heard, Jai Srimannarayana, salutations to the Sadguru