నవమ స్కంధం: వైవస్వత మను వంశం మరియు సుద్యుమ్నుని కథ

Srimad Bhagavatam Canto 9: Vaivasvata Manu's Lineage & Stories

bhagavatam

ఈ ప్రవచనంలో శ్రీమద్భాగవత నవమ స్కంధం ప్రారంభమై, బ్రహ్మ నుండి కశ్యపుడు, వివస్వంతుడు, వైవస్వత మనువు వరకు వంశ క్రమం వివరించబడింది. సుద్యుమ్నుడు శివపార్వతుల విహార వనంలో ప్రవేశించి స్త్రీగా మారిన కథ, వశిష్టుని ప్రార్థనపై శివుడు ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉండే వరమిచ్చిన విషయం చెప్పబడింది. బుధునితో కలిసి పురూరవుని కన్న ఇళ కథ, పురుషద్ధుడు తెలియక గోవధ చేసి వశిష్టుని శాపానికి గురై వాసుదేవ భక్తితో మోక్షం పొందిన వృత్తాంతం వివరించబడ్డాయి. వైవస్వత మనువు పది మంది కుమారుల వంశాల సంక్షిప్త వివరణతో ముగిసి, తదుపరి పాడ్కాస్ట్‌లో సుకన్య చరిత్ర చెప్పబడుతుందని తెలియజేయబడింది.

This discourse begins Canto 9 of Srimad Bhagavatam, tracing the lineage from Brahma through Kashyapa and Vivasvaan to Vaivasvata Manu and his ten sons. Key stories include Sudyumna's transformation into a woman upon entering Shiva's forest, his alternating male-female existence granted by Shiva, and the birth of Pururavas through his union with Budha. The narrative also covers Purushaddha's accidental cow-slaughter and subsequent curse by Vasishtha, his eventual liberation through devoted worship of Vasudeva, and the brief mention of Kavi's renunciation and attainment of liberation. The episode concludes with an overview of the various sons of Vaivasvata Manu and their descendants, setting the stage for the story of Sukanya in the next podcast.

← Prev Next →
Srimad Bhagavatam Canto 9: Vaivasvata Manu's Lineage & Stories bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః సద్భాషితరత్నానాం రత్నానామివ సుదేశ జాతానాం హృదినిచయః కర్తవ్యః సజ్జన సమ్మాన కామేన మంచి గనులలో ఆవిర్భవించిన జాతి రత్నాలను సేకరించి ఎదలపై అలంకరించుకుంటున్నట్టు మంచి వారి మెప్పు కోరేవాడు పెద్దల మాటల మణులను అంటే సూక్తి రత్నాలను ఎదరిలో పదిలంగా నిలుపుకోవాలి. ఆర్యోక్తి నెంబర్ త్రీ. భగద్బంధులారా శ్రీమద్భాగవత దత్వ దీపిక నవమ స్కంధం. మొదటి పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ఆ భగవంతుని అనుగ్రహంతో ఎనిమిది స్కంధాలు పూర్తి చేసుకుని ఎనదో స్కంధంలో చివరగా వామన వృత్తాంతాన్ని, మత్స్యకు మత్స్య వృత్తాంతాన్ని, క్షీరసాగర మథనాన్ని, గజేంద్ర మోక్షణాన్ని కూడా పూర్తి చేసుకొని మనం ఈరోజు తొమ్మిదో స్కంధంలో ప్రవేశిస్తున్నాం. విషయాన్ని మనం అందరం కూడా అనుభవిద్దాం. పరీక్షిణ్ మహారాజు ప్రశ్నించగా సుఖయోగింద్రుడు వైవసుత మను వంశమును గూర్చి చెప్పుచున్నాడు. సర్వ జగత్తును ఉపసంహరించి తనలో లయము చేసుకుని శ్రీమన్నారాయణుడే మరల ఈ జగత్తుగా స్థూలమైన రూపముతో వ్యక్తమగును. ప్రళయమున సూక్ష్మదశ నొందిన విశ్వమును తనలో ఇముర్చుకొని గర్భోదకములలో శయనించిన భగవాను నాభి నుండి ప్రకాశవంతమగు ఒక పద్మము ఆవిర్భవించెను. ఆ పద్మమునందే చతుర్ముఖ బ్రహ్మ ఆవిర్భవించెను. ఆ చతుర్ముఖుని మనస్సంకల్పముచే మరీచి జన్మించెను. ఆ మరీచికి కశ్యపుడు జన్మించెను. కు ఇచ్చెను. వివసొంతునకు సౌజ్ఞ అని భార్య యందు శ్రాద్ధ దేవుడు అను మనువు జన్మించెను. ఆ వైవసత మనువునకు శ్రద్ధ యను భార్య యందు ఇక్ష్వాకువు, నృగుడు, శరియాతి, దిష్టుడు, దృష్టుడు. రురుషకుడు, నరిష్యంతుడు, పురుషద్ధుడు, నభగుడు, కవి అను పది మంది పుత్రులు జన్మించిరి. వైవస్వత మనువునకు సంతానము లేని సమయమున వశిష్టుడు, మిత్రావరణులు దేవతలుగా గల ఒక ఇష్టిని పుత్ర సంతానము కొరకు చేయించెను.

ఆ యాగము చేయుచుండగా మనువు భార్య శ్రద్ధ పాలని హారముగా తీసుకునుచుండెను. భార్య శ్రద్ధ పాలని ఆహారముగా తీసుకునుచుండెను. ఆమె హోత వద్దకు వెళ్లి నమస్కరించి తనకు కన్య కావాలని ప్రార్థించెను. అప్పుడు అధర్వ్యు ప్రేరణ చేయగా హోత ఆమె చెప్పిన కోరికను తలంచుచు హోమమును చేసెను. మనసులో ఆడపిల్ల కావాలని తలంచుచు హోమము చేయుటచే శ్రద్ధకు ఇళ అను కన్య పుట్టును. మను మగపిల్లడు కావలని హోమము చేయగా ఆడపిల్ల పుట్టినదని అసంతుష్టుడై గురువు వద్దకు వెళ్లి ఆచార్య ఏమిది ఒకటి సంకల్పించి యజ్ఞము చేయగా వేరొక విధముగా జరిగినది. మీరు మంత్రవేత్తలు కదా, తపశ్శాలులు కదా, సంకల్పమునకు విపరీతముగా ఇట్లు జరుగుటకు కారణం ఏమని వశిష్టుని ప్రశ్నించెను. అప్పుడు వశిష్టుడు హోత చేసిన పొరపాటును గుర్తించి మనువుతో ఇట్లెనెను ఇది హోత యొక్క పొరపాటు వలన జరిగినది అతడు ఆడపిల్లను కోరి హోమము చేసెను అయినను నా తప బలముచే ఆ బిడ్డను మగవానిదిగా చేసెదను అని సంకల్పించి భగవానుడగు ఆదిపురుషుని ఇళకు మొగతనమును కలిగించినట్టు ప్రార్థించెను. భగవానుడు అనుగ్రహించినాడు. ఇళ సుద్యుమ్నుడు అను పురుషుడుగా మారెను. ఆ సుద్యుమ్నుడు వేటకై కొంతమంది మంత్రులతో కలిసి గుర్రమునెక్కి విల్లు బాణములు ధరించి ఉత్తర దిక్కున వెళ్ళెను. మేరు పర్వతమున ప్రవేశించెను. ఆ వనమున పార్వతితో కలిసి పరమశివుడు విహరించుచుండును. సుద్యుమ్నుడు ఆ వనమున ప్రవేశించగానే స్త్రీగా మారెను. అతడు ఎక్కిన గుర్రము కూడా ఆడు గుర్రమాయెను. అనుసరించవచ్చున్న సైనికులందరూ సిల్లుగా మారిరి. దీని కారణం ఏమని ప్రశ్నించిన పరీక్షితునకు శుకుడిట్లు చెప్పుచున్నాడు. ఆ వనమునందు పార్వతీ పరమేశ్వరులు ఏకాంతముగా కామభోగమును అనుభవించుచుందురు. ఒకనాడు నిష్టాగరిష్టులగు ఋషులు తమ దివ్య తేజస్సుచే దిక్కులను ప్రకాశింపచేయుచు ఆ వనమునకు వచ్చిరి. పరమశివుని దర్శింపవలెనని వారు వచ్చుసరికి కామకేళి యందు అంబిక వివస్త్ర అయి ఉండెను. ఆమె సిగ్గుపడి పెయిను తొడ నుండి దిగి వస్త్రధారణము చేసెను.

ఋషులు ఆ సన్నివేశనమును చూచి అచటి నుండి మరల నరనారాయణ ఆశ్రయమునకు ఎగిరి. ప్రియురాలి మనసుకు ఖేదము కలిగినని పరమశివుడు ఆ వనమున పురుషులు ఎవరు ప్రవేశించినా స్త్రీలుగా మారుతుందురు. అని నియమనము చేసెను. అప్పటి నుండి పురుషులు ఎవ్వరూ ప్రవేశింపరు. శుద్యుమ్నునకు తెలియక ప్రవేశించెను. పరివారంతో కూడా స్త్రీలుగా మారిరి. మొదట ఇళ అను స్త్రీగా ఉండి సుద్యుమ్నుడుగా మారి మరల స్త్రీ ఆయనను. చెలికత్తెలతో ఆమె సంచరించుచుండెను. చంద్రుని కుమారుడగు బుధుడు ఆ ప్రాంతమునకు వచ్చెను. ఆమె అతనిని చూచి ప్రేమించెను. వారిద్దరూ అన్యోన్య ప్రేమించుకొని కలిసిరి. వాయికి పురూరవుడు అను కుమారుడు కలిగెను. ఇట్లు స్త్రీత్వమును పొందిన సుద్యుమ్నుడు స్త్రీత్వం పొందినందుకు బాధపడి తమ కుల గురువగు వశిష్టుని ధ్యానించెను. అప్పుడు వశిష్టుడు అతని యందు కృపచే మరల పుంసము కలుగునట్లుగా చేయమని శంకరును స్తుతించెను. శంకర భగవానుడు సంతోషించి తన మాట వ్యర్థము కాకుండా ఒక నెల పురుషుడుగా ఒక నెల స్త్రీగా ఉండునట్లు అనుగ్రహించెను. ఇట్లు పుంశ్యమును పొందిన అతడు రాజ్యమును పరిపాలించుండెను. కానీ ప్రజలు ఒకనెల స్త్రీత్వముతో దాగియుండెడి రాజును రాజుగా అభినందించలేకపోయిరి. అతనికి ఉత్కలుడు మొదలగు ముగ్గురు కుమారులు జన్మించిరి. ఆ సుజ్యుమ్నుడు కొంతకాలము రాజ్యమును పాలించి తన కుమారుడగు పురూరవునకు రాజ్యమును సంగి అడవికేగెను. ఇట్లు సూర్యవంశము నుండి చంద్రవంశమునకు రాజ్యము సంక్రమించెను. సూర్య వంశం మరల వృద్ధి పొందవలెనని యమునా తీరమున వైవసత మనువు కుమారుని పొందవలెనని నూరు సంవత్సరములు తపస్సు చేసి శ్రీహరిని ఉద్దేశించి యజ్ఞము చేసెను. ఆ యజ్ఞముచే అనుగ్రహించిన శ్రీహరి కృపచే ఇక్ష్వాకు మొదలగు పది మంది కుమారులను కుమారులు కలిగిరి. అందుడు అందు పురుషద్ధుడు అనునతనని గోవులను కాపాడుచుండవలని వశిష్టుడు నియమించెను. రాత్రి ఖడ్గము దాల్చి

అతడు గోవులను కాపాడుచుండెను. ఒకనాటి రాత్రి చీకటిలో వర్షం పడుచుండగా ఒక పెద్ద పులి అలమందలో ఆలమందలో ప్రవేశించి ఒక ఆవును పట్టుకొనెను. ఆ ఆవు అరుపు విని వెంటాడి పురుషద్ధుడు చీకటిలో పొరపాటుగా పెద్ద పులికి బదులుగా ఒక ఆవు తలను నరికెను. పెద్ద పులి చెవి మాత్రం తెగెను. చెవి తెగిన పెద్ద పులి పారిపోయెను. చీకటిలో కారిన రక్తమును చూచి పెద్ద పులియే చనిపోయినదని అనుకొనినాడు. కానీ తెల్లవారగానే చనిపోయినది గోవు అని తెలిసెను. తెలియక చేసినను గోవధ మహా పాపము కనుక క్షత్రియులు చేయదగని పని నీ వలన జరిగినది కనుక శృద్రుడు గమ్మని గురువు వ్యశిష్టుడు శపించెను. పురుషద్ధుడు ఆ శాపమును అనుభవించుచు ఊర్ధ్వరీతస్కుడై వాసుదేవుని యందే మనసు నిలిపి సర్వభూతముల యెడ మైత్రి గలవాడై భగవదుపాసన చేయుచుండెను. తెలియక చేయుట ఫలమును అనుభవించుటకు ప్రతిబంధకము కాదు. తెలియక చేసినను పాప ఫలము అనుభవించవలసినది ధర్మమునకు దయ ఉండదు. ఈ విధంగా పురుషద్ధుడు తన ఆత్మను పరమాత్మ యందే నిశ్చలముగా నిలిపి లోక వ్యవహారములను ఎరుంగక జడుని వలె తిరుగుచుండెను. ఒక వనమున తిరుగుచుండగా దావాగ్ని ఆ వనమును దహించుచుండెను. అందున్న ఈతడు కూడా దహింపబడి పరవపదము నొందెను. 10 మంది కుమారులలో కవి చివరి వాడు. అతనికి బాల్యము నుండియు విషయాభిలాష లేదు. రాజ్యమును వదలి మనసున పరమ పురుషుడినే ధ్యానించుచు అతడు పరమగతిని పొందెను. 10 మందిలో కురూషుడు అనువానికి ముగ్గురు కుమారులు. వారు ఉత్తర దేశమునకు పాలకులై వేద ధర్మ రక్షకులై ఖ్యాతి నొందిరి. దృష్టుడను వానికి దారిష్టి అను పేరు గల కొందరు కుమారులు కలిగిరి. వారు కూడా బ్రహ్మనిష్టులై పరబ్రహ్మ సాయుధ్యమును పొందిరి. వైవస్తుత మను కుమారులలో నృగుడు ఒక కుమారుడు. అతనికి సుమతి మొదలగు కుమారులు జన్మించిరి. మరియు కుమారుడు నరిష్యంతుడు. అతని వంశము కూడా చాలా వరకు విస్తరించెను.

10 మంది కుమారులలో దిష్టుడు అను వానికి నాభాగుడు అను ఒక కుమారుడు కలగెను. కలదు. కలడు అతనికి వైశ్యవృత్తి యందు అభిరుచి కలుగుటచే వైశ్యుడాయెను. వారి వంశము కూడా ప్రసిద్ధమగు వంశమే దిష్టి వంశము. అతి విశాలం. దీని తర్వాత భాగంలో మనము సుకన్య చరిత్రాన్ని తెలుసుకుందాం. ఇది. మనువుల యొక్క విషయాలు వారి యొక్క సంతానం గురించి విషయాలు ఉన్నాయి. దీన్ని మరొకసారి వింటూ అర్థం చేసుకుని ప్రార్థి అర్థం చేసుకుంటారని ప్రార్థిస్తూ మరొక పాడ్కాస్ట్ లో మళ్ళీ మనం కలుసుకుందాం. ఓం అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana. Salutations to the Guru. Like the jewels of good speech, the jewels of good words, the good people are the ones who should be in the hearts of the born in good places. Like collecting the jewels of the caste that has emerged in good places with the desire for good respect, the good people are the ones who are decorating themselves One who seeks approval should keep the jewels of the words of elders, that is, the gems of proverbs, safely in their heart. Rule number three. Oh, devotees of Bhagavan, Srimad Bhagavata, the ninth book of the Dvaita philosophy. Welcome to the first podcast. Until now, with the grace of that God, having completed eight cantos, in the eighth canto, finally, the story of Vamana, the story of Matsya, the churning of the ocean of milk, Having completed the Gajendra Mokshana, we are entering the ninth Skandha today. Let's experience the subject together. When Parikshit Maharaja asked, Sukha Yogindra was explaining about the Vaivasvata Manu dynasty. Having withdrawn the entire universe, merging into oneself, Srimannarayana himself will again manifest as this world in a gross form. The universe that attained the subtle state during the deluge The Lord, who resides within and sleeps in the wombs, a radiant lotus emerged from his navel. In that lotus, the four-faced Brahma manifested. By the will of that four-faced one, Marichi was born. Kashyapa was born to Marichi. Gave to. A man named Manu, who was a son of Vivasvanta and a relative, was born to a wife. To that Vaivasvata Manu, Ikshvaku, Nrugu, Shariati, Dishtudu, Drushtudu are the wives who are devoted to him. Rushrukudu, Narishyantudu, Purushadhudu, Nabhagudu, Kavi, these ten sons were born. When Vaivasvata Manu had no children, Vasishta and Mitravaruni performed an Ishti (a ritualistic offering) for the sake of a son.

While the yagamu was being performed, Manu's wife was taking the Shraddha as an offering. The wife was taking Shraddha Palani as food. She went to Hotha, greeted him, and prayed for a virgin. Then, inspired by Atharvya, Hota, considering her wish, performed the homam. By thinking of having a girl child in mind and performing the homam, a virgin girl is born to the devotion. When a man performed a homam (fire ritual) wishing for a son, he became dissatisfied that a daughter was born. He went to the guru and, with a determination, performed a yagna (sacrifice). A different outcome occurred. You are magicians, aren't you? You are ascetics, aren't you? What is the reason for this happening so adversely to the resolve? he asked Vasishta. Then Vasishta, recognizing the mistake made by Hota, said to Manu, "This happened because of Hota's mistake. He desired a girl and performed the homam (fire ritual), but with my penance, I will make that child a male," thus resolving He prayed to the Lord Adipurush, asking for the groom's grace. The Lord be merciful. Ila Sudyumnu became a man. That Sudyumna, along with some ministers, mounted a horse, wielded bows and arrows, and went north. Entered Mount Meru. In that forest, along with Parvati, Parameshwara is wandering. Sudyumnu became a woman as soon as he entered the forest. The horse he rode was also a horse. All the soldiers who could follow turned into silk. He is telling Shuka about the reason why Parikshit questioned him. In that forest, Parvati and Parameshwara enjoy their sexual pleasures in solitude. Once upon a time, the sages, who were devoted to their goals, came to that forest, illuminating the directions with their divine radiance. When they came to see Parameshwara, Ambika was naked in Kama Keli. She was shy and took off her pants and got dressed.

The sages, seeing that scene, flew away from there again to the refuge of Narayana. Because the beloved's heart was saddened, Parameshwara said that whoever enters that forest, they will transform into women. And appointed. No man has ever entered there since. Shudhyumnu kevalam telusukoni vellithu. With the family, they also became women. First, being a woman, Ila, and becoming Sudyumna, again a woman, him. She was wandering around with her maids. Mercury, the son of the Moon, came to that region. She fell in love with him. They fell in love and got married. Vaikki pururavanudu anu kumarudu kaligenu. Thus, Sudyumna, having attained womanhood, grieved over having attained womanhood and meditated on Vasishta, who was the guru of their clan. Then Vasishta praised Shankara, saying that he should have the male organ back in him with grace. Shankara Bhagavan, being pleased, granted that he should be a month a man and a month a woman, so that his words would not be in vain. Thus, having obtained the Punsyamu, he the kingdom He ruled. But the people, hiding behind a month of womanhood, could not congratulate the king as king. He had three sons, Utkala, and others. Sujyumnudu ruled the kingdom for some time, and then he handed over the kingdom to his son, Pururavu, and went to the forest. Thus, the kingdom passed from the Suryavamsha to the Chandravamsha. So that the Surya dynasty may be re-grown, and so that Manu's son may be born on the banks of the Yamuna, he performed penance for a hundred years and performed a Yagnya, addressing Srihari. By the grace of Srihari, who was blessed by that Yagnya, Ikshvaku and the ten sons had sons. Then, that man, that man, Vasishta appointed him to protect the cows. Night sword worn

He was protecting the cows. One night, while it was raining in the darkness, a big tiger entered the herd and caught a cow. Hearing the cow's cry, the man chased it and mistakenly cut off a cow's head in the dark instead of a tiger's. The big tiger only opened its ear. The big tiger with the broken ear. Seeing the blood that had spilled in the dark, he thought that a big tiger had died. But it was found out that the cow died as soon as it was morning. Even if done unknowingly, slaughtering cows is a great sin, therefore, since you have done something that Kshatriyas should not do, Shrudhru, Guru Vyashishta cursed. The man, experiencing that curse, became upward-facing, fixing his mind on Vasudeva, having affection for all beings, and was engaged in the worship of the Lord. Experiencing the consequences of unknowingly doing something is not a hindrance. Even if done unknowingly, the consequences of sin must be experienced; righteousness has no mercy. In this way, the Purusha, keeping his soul steadfastly in the Supreme Soul, without understanding the affairs of the world, was wandering like a drowsy person. In a forest While turning, the fire of the law was burning that forest. The one who was there also burned and attained ecstasy. The poet was the youngest of 10 sons. He has no desire for life. Leaving the kingdom, meditating on the Supreme Being in his mind, he attained the supreme state. Kurush had three sons to his wife Kurusha. They became rulers of the northern country, protectors of the Vedic Dharma, and gained fame. Drustudanu vani vaniyandi daridri anu perunnidi konasagina kumarulu unnaru. They too, being Brahmanists, attained the identity of the Supreme Brahman. Nruga was one of the sons of Vaivasvata Manu. He had sons named Sumati and others. And the son, Narishant. His lineage also spread quite a bit.

Among the 10 sons, Dishtudu, a son named Nabhagudu was born. It is. He was born because he had an interest in the Vaishya profession, and he became a Vaishya. Their lineage is also a famous lineage, the Dishti lineage. Over-the-top. In the next part, we will learn about the story of Sukanya. This is about the matters of humans, about their children. Praying that they listen to this once again, understand it, and understand the prayer, let's meet again in another podcast. Om Asmat Gurubhyo Namah Jai Srimannarayana.