ప్రాచీనబర్హి చక్రవర్తి వృత్తాంతము - సముద్రతీర తపస్సు
The Lineage of Prithu & Kingdom of King Pracinabarhi
ఈ ఎపిసోడ్లో మహారాజు పృథువు వంశక్రమాన్ని వివరిస్తూ, ధర్మపథంలో నడచిన మహనీయ రాజుల పరంపరను శ్రీమద్భాగవతం మనకు అందిస్తుంది. ప్రాచీనబర్హి చక్రవర్తి యొక్క పరిపాలన, అతని రాజ్యంలో నెలకొన్న ధర్మబద్ధమైన జీవన విధానం గురించి విస్తారంగా చర్చించబడుతుంది. రాజ్యభారాన్ని నిర్వహించిన తర్వాత, ప్రాచీనబర్హి మహారాజు సంసార బంధాల నుండి విముక్తిని కోరుకుంటూ సముద్రతీరంలో కఠోర తపస్సు ఆచరించిన వృత్తాంతం ఈ ఎపిసోడ్లో హృదయస్పర్శిగా వివరించబడుతుంది.
This episode explores the sacred lineage descending from King Prithu, tracing the dynasty that upheld righteousness across generations. We are introduced to King Pracinabarhi, a powerful and devoted ruler whose kingdom flourished under dharmic governance. The episode also reveals how King Pracinabarhi, after fulfilling his royal duties, retreated to the seashore to engage in deep and austere tapasya, seeking liberation from worldly entanglements.
జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః నమో వ్యక్తాయ సూక్ష్మాయ ప్రధాన పురుషాయ చ చతుర్వింశత్ గుణజ్ఞాయ గుణ సంఖ్యాన హాతవే శ్రీహరి అత్యంత సూక్ష్మమగు చైతన్యమే స్వరూపముగా గలవాడు కానా? ఇంద్రియములకు గాని మనసుకు గాని గోచరము కాడు. ప్రకృతి ప్రాణులు అనే రెండింటి రూపముగా ఆయనయే ప్రకటమైనాడు. శ్రీహరియే సాంఖ్య శాస్త్రాచార్యుడుగా అవతరించి 24 తత్వములను దర్శించి పరిగణించినాడు. అట్టి శ్రీహరికి నమస్కారము. ఎయిత్ చాప్టర్ 16th క్యాంటో 16th చాప్టర్ 30th ప్రేయర్. భోద్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక చతుర్ధ స్కంధము 27వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా పృథ్వురాజు యొక్క చరిత్రను పూర్తి చేసుకుని పృథ్వురాజు యొక్క కొడుకు అయినటువంటి విశ్వజిత్తు అతనే అంతర్ధానుడు, అంతర్ధాను యొక్క పుత్రుడు హవిర్ధానును ఆయన యొక్క పుత్రుడు ప్రాచీతసులు. రుద్రుని ప్రత్యక్షము చేసుకొని రుద్రుని ప్రార్థించిన తర్వాత రుద్రుడు వారికి ఉపదేశిస్తున్నాడు. ఆ ఉపదేశాన్ని మనం ఇవాళ మనం విందాం. దీన్నే మనం రుద్రగీత అంటాము. జ్ఞానులకు రక్షకుడైన ఓ భగవానుడా, నీవు స్వరూపము చేతను గుణముల చేతను వెలుంగుచున్నావు. నీకు మంగళమవుగాక. లోకములోని ఆనందములు సాధ్యములు అనగా ప్రయత్నముచే సంపాదింపబడును. అందుచే అవి. అస్థిరములు. నీవు ఎవరి ప్రయత్నము చేతను సిద్ధించువాడవు కావు. ఎల్లప్పుడూను ఉండువాడవు. ఆనంద స్వరూపుడవు. అట్టి నిన్ను అనుభవించుట చేత కలుగు ఆనందము నిత్యము స్థిరము. ఈ జగద్రూపమగు పద్మము నాభియందు గలవాడవు నీవు. ఈ ప్రపంచమునకు కారణమైన వాడవు. భూత సూక్ష్మములకు, ఇంద్రియములకు కారణమైన వాడవు. వానిలో వ్యాపించి నియమించుచు వాని యందలి దోషములను అంటని వాడవు.
అన్నిటిని నీయందు ఉంచుకొను వాడవు. అన్నిటియందు ఉండెడి వాడవు కనుక వాసు అనబడుదువు. అన్నిటిలో ఉండియు వానియందలి దోషములు అంటకుండా ప్రకాశించు వాడవు కనుక నిన్ను దేవా అందురు. ఆ రెండు ధర్మములు గలవాడు కనుక నిన్ను వాసుదేవుడు అందురు. అట్టి నీకు నమస్కారము నీకు ఆకలి దప్పులు శోక మోహములు జరా మరణములు అనడి ఆరు ఊర్ములు అంటవు. నీవు కూఠస్తుడవు, మార్పు చెందని వాడవు. అన్ని కాలములయందు అసంకుచితముగా ప్రకాశించు ప్రకాశము గలవాడవు. ఈ జగత్తునందు నామరూప విభాగము లేకుండా చేసి నీలోనికి ఆకర్షించువాడవు. అందుచే నిన్ను సంకర్షణుడు అంటారు. సం అంటే ఒకటిగా చేసి కర్షణ తనలోకి ఉపసంహరించుకొనువాడు సంకర్షణుడు. అన్నిటినీ అంతమొందించువాడవు నీవు, నీ ముఖమే లోకమును దహించును, లోకమంతయు నీలో లయమగును. కానీ నేను నీకు వేరొక కారణము లేకపోవుటచే నీవు వేరొక దానిలో లయమందవు, లయమందవు. అట్టి నీకు నమస్కారము. విశ్వమునకు అంతకు ఉజ్జీవమును కలిగించుటకు ధర్మార్థ మోక్షములను వాని సాధనములను ఎరింగించు వేదమును ఉపదేశించుటకు ప్రద్యుమ్నుడుగా ఉండువాడవు నీవే. నీవే అందరకు అంతరాత్మగా ఉందువు. నీవే రామకృష్ణాది రూపములకు మూలమైన వాడవు. సర్వ దేశములందు సర్వకాలములయందు జగత్తున ప్రవేశించి శాసించువాడవు నీవు. కనుక నిన్ను అంతరాత్మ అందురు. అట్టి ప్రద్యుమ్న దేవుడకు నీకు నమస్కారము. ఇంద్రియములకు నియామకుడవై అంతరాత్మవై ప్రవర్తింపజేయు అనిరుద్ధ రూపివగు నీకు నమస్కారము. జగద్రూపముగా జీవాంతర్యామిగా ఉన్నను నీవు పుణ్యరూప కర్మలు అంటకుండా ఉందువు. నిన్ను ఆశ్రయించిన వారి కర్మలు నాశనము చేతువు. కావున నిన్ను పరమహంసా అని కీర్తింతురు. నీవు అంతటా ఎల్లప్పుడూ వెలుపల లోపల కూడా వ్యాపించువాడవు. కనుక నిన్ను పూర్ణుడవు అందురు. కనుకని నిన్ను ఆశ్రయించిన వారల కోరికలు వసంగజాలిన వాడవు.
ఈ జగద్రక్షణము నీ ధర్మము. స్వర్గమునకు మోక్షమునకు నీవు సాధనము. అట్టి నీకు నమస్కారము. ఎల్లప్పుడూ పవిత్రమైన చిత్తము గలవారి యందు నీవు రమించుచుందువు. అందుకే నిన్ను శుచిషద్ అందురు. నీ వీర్యము హిరణ్య రూపము. హిరణ్య వీరుడు అగ్ని. కనుక నీవు అగ్నిరూపుడవు. బ్రహ్మ, అధ్వర్యువు, ఉద్గాత, యజమానుడు అని నలుగురిచే చేయబడు అగ్నిహోత్రము చాతుర్హోత్రము అనబడును. నీవు ఆ యజ్ఞ స్వరూపుడవు. నీవే ఉర్క్ అనబడెడి పితృ దేవతలకు అన్నముకు ద్రవ్యములోను ఇష్ అనబడెడి దేవతలకు తృప్తిని కలిగించెడి అన్నమునందును అంతర్యామివై ఉండి దేవతలకు పితృ దేవతలకు తృప్తిని కలిగించుదువు. ఆ దేవతలకు అంతర్యామిగా ఉండి ఆ యజ్ఞములకు ఫలమును వసంగు చొందువు. వేదములచే ప్రతిపాదింపబడెడి వాడవు. యజ్ఞములకు ఫలమైన వాడవు. జీవులకందరకు విషయానుభవముచే కలుగు సుఖమును వసంగు వాడవు నీవు. సర్వస్వరూపుడవు నీవు. ఈ భూతలములతో సరే ఈ భూతములతో భోగోపకరణములను, భోగస్థానములను, భోగ్య పదార్థములను ఏర్పరిచి జీవులకు తృప్తిని వసంగుచొందువు. భోక్తలకు జీవులందరూ నీ శరీర భూతులు. నీవే త్రైలోక్య పాలకుడవు. ఇంద్రియములు ప్రవర్తించుటకు కలిగే సామర్థ్యము సహమనబడును. ఇంద్రియములకు జ్ఞానమును వసంగెడి శక్తికి ఓజము అని పేరు. ధరించెడి సామర్థ్యమునకు బలము అని పేరు. అదేను నీవే. నీవే ఆ రూపముతో జీవులను ఆదేశించి ప్రవర్తింపజేయుచొందువు. ఇట్లు మూడు లోకములను రక్షించువాడవు నీవు. నీవే సర్వభూత శరీరకుడవు. శబ్దము గుణముగా గల ఆకాశము నీ రూపము. అట్లే వాయువు, తేజస్సు మొదలగునవి కూడా నీ రూపములే. నీవు అన్నింటియందు లోపల వెలుపల కూడా వ్యాపించి ఉందువు. ఎల్లప్పుడూ అన్నిటిలోనూ లోపల వెలుపల కూడా వ్యాపించి ఉందువు కనుక నిన్ను ఆత్మ అందురు. యజ్ఞములు మొదలగు పుణ్యములు నీ రూపములు వాటిచే సాధింపబడు స్వర్గాదులు నీ రూపములే. జ్ఞానమే ప్రధానముగా గల జీవులు నీ రూపమే అట్టి నీకు నమస్కారము. ఓ ప్రభు, పితృ దేవతలకు ఇతర దేవతలకు ఫలమును కోరి కర్మలు చేసి వారి అనుగ్రహం పొందెడి వారికి ఆ ఫలమున సంగడి పితృ దేవాది శరీరకుడవు నీవే.
ఫలమును కోరక భగవదారాధనమును భావముతో కర్మ చేసెడి వారు పొందెడి ఫలము నీవే. ప్రవృత్తి నివృత్తి రూపముకు రెండు విధములవు కర్మలు నీవే. దుఃఖప్రదుడగు మృత్యురూపుడవు నీవే. స్వయంభువ మన్వాది శరీరములను ధరించి ఉండువాడవు నీవు. మంత్ర స్వరూపుడవు నీవు. స్వరూపముచే గుణములచే నిన్ను మించిన వారు లేని ఆధిక్యము గలవాడవు. కృష్ణుడవు నీవు, ఎచ్చటను అడ్డుపడని జ్ఞానము గలవాడవు. నీవు సాంఖ్యమును ప్రవచించిన కపిలుడవు, యోగమును ప్రవచించిన హిరణ్యగర్భుడవు నీవే. సృష్టి స్థితి లయములను మూడు కర్మలు చేయు శక్తి గలవాడవు నీవు. సూర్య స్వరూపుడవు నీవు, అహంకార తత్వము నీవే, మాటలకు ఇంద్రియములకు అందని వాడవు నీవు. ఓ భగవాన్, భాగవతులు ఆరాధించిన నీ రూపమును దర్శించవలెనని కోరుచున్న మాకు నీ దర్శనము సంగుము. నీ భక్తులకు ఇంద్రియ తృప్తిని కలిగించు రూపము నీది. సుందరములు, దీర్ఘములు అను నాలుగు బాహువులు బాహువులు గలవాడవు నీవు. సుందర, సుకుమార, ముఖమండలము గలవాడవు నీవు. తామర పువ్వులోని రేకులు బోలిన నేత్రములు గలవాడవు నీవు. సుందరము కనుబొమ్మలు, నాసిక, దంతములు, కపోలము, ముఖము గలవాడవు నీవు. కర్ణ భూషణములతో ప్రకాశించుచున్న వాడవు. ప్రీతితో నవ్వుచున్న క్రిగంటి చూపు గలవాడవు. ముంగురులతో శోభించుచున్న వాడవు. తామర పువ్వులోని పుప్పొడి వంటి వర్ణము గల పట్టు వస్త్రమును దాల్చిన వాడవు, ప్రకాశించుచున్న కిరీటము, కంకణములు, హారములు, నూపురములు, మొలనూలు కలవాడవు, శంఖ, చక్ర, గదా, పద్మములను దాల్చిన వాడవు. సింహం వంటి భుజ శిరస్సులు కలవాడవు. సుందరమగు మెడ కౌస్తుభము కలవాడవు. ఎన్నడును నిన్ను వదలి ఉండని లక్ష్మీదేవితో కూడి ఉండెడివాడవు. ఉచ్వాస నిశ్వాసములను వదులుచు పీల్చుచున్నప్పుడు సుందరమగు నీ ఉదరముపై నున్న మడతలు ప్రకాశించుచుండును. విశ్వమునంతను నీ నాభి నుండి వెలికి వదులుచు. మరల గ్రహించుచు ఉండెడివాడవు. నితంబములయందు ప్రకాశించుచున్న పీతాంబరమును దాల్చి దానిపై బంగారు మనువులును అలంకరించుకున్నవాడవు. నీ పాదములు, పిక్కలు, తొడలు పరమ సుందరములు. అట్టి నీ దివ్య మంగళ విగ్రహమును మాకు దర్శింపచేయుము. శరత్కాలములో వికసించి
నిన్ను తామర పువ్వులను బోలిన పాదములతో మా హృదయములలో ఆవరించి ఉన్న అజ్ఞానమును తొలగింపుము. నీ పాదములను దర్శించిన వారికి భయము తొలుగును. జ్ఞానులకు మార్గదర్శకుడవగు గురువు నీవే కదా? అట్టి నీ దివ్య మంగళ విగ్రహమును అంతఃకరణమునకు నైర్మల్యము కావలెనని కోరెడి వారు ధ్యానించుచుందురు. మాకు కూడా ఆ రూపమును ధ్యాన గోచరమగునట్లు చేయుము. అట్టి ధ్యానమునకు అంగముగా స్వధర్మమును నిష్కామముగా ఆచరించు వారికి నీవు పరమ భక్తి కలిగించి అభయమును సంగెదవు. నీవు భక్తి గలవారికే లభింతువు. కైవల్యము కంటే నీ దర్శనము చాలా ప్రియమై ఉండును. నిన్ను భక్తిచే తప్ప వేరొక మార్గముచే ఆరాధింపజాలరు. అట్టి నిన్ను ఏకాంత భక్తితో ఆరాధించిన వారు నీ పాద మూలమును తప్ప స్వర్గమును కానీ కైవల్యమును కానీ కోరరు. నీ పాద మూలమును శరణు కూడిన వారిని వారిని తన వీర్య శౌర్యములచే కనుబొమ్మ కదల్చి లోకమునంతను ధ్వంసము చేయజాలిన యముడు. ఆక్రమింపజాలుడు. క్షణార్ధేనాపి తులయే న స్వర్గం నా పునర్భవం భగవత్ సంగి సంగస్య మర్త్యానాం కిమతాశిషః భగవానుని యందు భక్తి గల వారితో ఒక అరక్షణము కలయిక లభించినను చాలును. దానితో స్వర్గము గాని పునర్జన్మ రాహిత్యము గాని సమానములు కావు అనినచో ఇతరమైన కోరికలు మాటలు చెప్పడదేమిటి? నీ పాదముల నుండి వెలుబడిన గంగలో స్నానము చేసి పాపములను తొలగించుకొని నీ దివ్య కీర్తిని అనుభవించి పాపమును పోగొట్టుకొనవలెను. గంగలో స్నానము చేయుట బాహ్య స్నానము. నీ కీర్తిని మనసులో తలంచుట అంతరస్నానము. ఈ రెండే పాపములను తొలగింపజాలినవి. నీయందు భక్తి కలిగి భూత దయ సత్వగుణముతో నిండిన మనస్సు శీలము ఆర్జవము గలవారల సహవాసం మాకు లభించుకాక.
ఇదియే నీ అనుగ్రహము. భగవత్ భక్తుల యొక్క సహవాసము చేతనే మనసు సత్వగుణమున కలదగును. శబ్దాది బాహ్య విషయములు పొందదగినవి అను భ్రాంతిని పొందదు. ఆ భ్రాంతి మనసులో తొలగి నీ యెడల భక్తి గలవారు నీ స్వరూపమును సుఖముగా ఎరుంగగలవాడగును. ఈ చేతనా చేతనాత్మకమగు విశ్వమంతయు నీ స్వరూపమునందే నిలిచి ఉండును. నీ స్వరూపం విశ్వమునందు నిలిచి ఉండును. అట్టి నీవే పరంబ్రహ్మ, పరంజ్యోతి అని కీర్తింపబడుదువు. నీవే నీ నుండి విడదీయుటకు వీలుగాని ప్రకృతిని జీవ కర్మానుగుణముగా పరిణమింపచేసి ఈ జగత్తుగా ఏర్పరచుచున్నావు. మరల అందులో చేరి ఉండియు ఏ మార్పును చెందక పొందక నీవే ఆ జగత్తును లయము చేయుచున్నావు. ఈ జగత్తునందు ఈ రహస్యము తెలియని వారికి వేరు వేరు అనిటి బుద్ధి కలుగుచుండును. నీవు స్వతంత్రుడవు. పురుషుడు తన వర్ణాశ్రమములు కలిగిన ధర్మమును భగవదారాధనముగా రూపముగా ఆచరించి ఆత్మజ్ఞానమును దానిచే భగవత్ భక్తిని పొందగలడు. ఆత్మజ్ఞానం కలవారు శ్రద్ధతో తమ తమ వర్ణాశ్రమములకు తగిన కర్మలచే ముక్తి పొందుటకు నిన్ను ఆరాధింతురు. వారికి కర్మయోగ రహస్యము, ఆత్మజ్ఞాన రహస్యము, భగవదారాధన రహస్యము తెలియును. ఇట్టి నీవే సృష్టికి ముందు ఉండివి, అప్పుడు ఈ జీవుడు ప్రకృతి వేరుగా బయల్పడి అదియే మహత్తత్వము, అహంకారము, పంచభూతములు, దేవతలు, ఋషులు. సకల ప్రాణులుగా నీవే పరిణమింప చేయబడుచున్నది. ఈ ప్రకృతి నీ శక్తి వంటిది. నీవే నీ శక్తి అయిన ప్రకృతిచే దేవ మనుష్య తిరియక్ స్థావర దేహములతో నాలుగు విధములుగా ఏర్పరిచితివి. జీవులకు అంతరాత్మవై ఉండి ఆ జీవుల ద్వారా ఆ శరీరములో ప్రవేశించి ఒంటివి. జీవుడు ఇంద్రియములచే తేనెటీగ ఆయా పుష్పములందు తేనెను సేకరించినట్లు ఆయా విషయములను సేకరించి అనుభవించుచుండును. నీవే ఒకనాడు కాలము శరీరముగా కలవాడవై. సహింపరాని వేగము గల వాయువు మేఘ పంక్తులను చిందర వందర చేసినట్లు ఈ విశ్వమునంతను చెదరగొట్టి నామ రూపములు లేకుండా లయము చేతువు. ఆకలితో పరిగెత్తి వచ్చిన పాము ఎలుకను కవళించినట్లు తనను మరిచి పొందవలసిన నిన్ను మరిచి శబ్దాది విషయములందే కోరికలు కలిగి అవి లభించినను తృప్తి తీరక లోభముతో వాని యందు తగిలి ఉన్న వారిని
కాలరూపుడవై నీవు ఉపసంహరింతువు. కావున జ్ఞానము గలవాడు ఎవడైనను బుద్ధిమంతుడైనచో నీ పాద పద్మమును విడనాడడు. నీ పరిచర్య చేయనిని వాడు ఈ శరీరం వ్యర్థమని భావించును. అందుచేతనే మా గురువులగు పదునలుగురు మనువులు నిన్నే ఆరాధింతురు. అందుచే ఓ పరమాత్మ స్వరూపా, నిన్ను ఎరుగని వారికే రుద్రుని వలన భయముచే ప్రళయమును నాశము సంభవించును. ఆ రుద్రునికి కూడా అంతర్యామిగా ఉండి నడిపించని నిన్ను ఆశ్రయించిన మాకు ప్రళయం వలన భయము లేదు. ఈ విధంగా రుద్రుడు తనకు బ్రహ్మ ఉపదేశించిన స్తోత్రమును ప్రచేతసులకు ఉపదేశించెను. ఓ పరిశుద్ధులగు రాజకుమారులారా, ఈ స్తోత్రమును మీరు నిత్యము జపించుకొనుడు మీకు భద్రమగును. భగవంతుని యందే మనసు నిలిపి మీ ధర్మమును మీరు ఆచరించుచుందురు. అన్ని ఆత్మలలో ఉండి ఆత్మ అయి అన్నిటిని నిమించడి సర్వాంతర్యామిని పూజింపుడు కీర్తింపుడు ధ్యానింపుడు ఈ స్తోత్రమును మీరు మనసులో ధరింపుడు సమాధితో కూడిన మనస్సు గలవారై ఆధరముతో దీనిని అభ్యసింపుడు. ఓ ప్రచేతసులారా, పూర్వ మరిచ్యాది ప్రజాపతులను సృష్టించిన బ్రహ్మ కుమారులగు భృగ్వాదులకు ఈ రుద్రగీత ఉపదేశించినాడు. ప్రజా సృష్టి చేయుడని మాకు ఉపదేశించినాడు, అజ్ఞానము తొలగి ప్రజా సృష్టి చేయుటకు మేము ఆరాభించినాము. ఆ వాసుదేవుడే ప్రాప్యము, ప్రాపకము అనుజ్ఞానము గలవారలై ఈ స్తోత్రమును జపించి మీ అభీప్సితమును. మీరు పొందుదురు. అన్నీ శ్రేయస్సుల కంటే భగవద్భక్తి అధికమగు శ్రేయము. భగవద్భక్తి కలవారు వేరు ఉపాయములచే దాటుటకు శక్యముగాని ఈ దుఃఖ సాగరమును తరింతురు. నేను చెప్పిన ఆ భగవత్ స్తోత్రమును ఎవరు శ్రద్ధతో విశ్వసించి హరిని ఆరాధించునో వాడు హరిభక్తి పరాయణుడగును. ఎవరు ఏది కోరిన వారికి ఆ ఫలము దీనివలన లభించును. ప్రాతఃకాలమున లేచి శ్రద్ధతో దీనిని పఠించినచో, వినినచో, వినిపించినచో కర్మ బంధములు వీడును. ఇది పరమ పురుషుడుగా పరమాత్మ స్తోత్రము నీకు ఉపదేశించితిని నేను మీకు ఉపదేశించితిని. ప్రచేతసులారా ఏకాగ్ర మనసుతో దీని జపింపుడు మీ కోరికలు పొందుడు. ఈ విధంగా రుద్రుడు ప్రచేతసులకు ఉపదేశించి వారిచే పూజింపబడిన వాడై వారు చూచుండగానే అంతర్ధానమాయెను. రుద్రగీతము భగవత్ స్తోత్రము దీనిని ప్రచేతసులు జపించుచు పదివేల సంవత్సరములు నీటిలో తపస్సు చేసిరి.
ప్రాచీన బర్హి కర్మలయందు ఆసక్తి కలవాడై యజ్ఞముననే చేయుచుండెడివాడు. ఆత్మతత్వం నిరంగిన నారదుడు అతని యెడ దయగలవాడై అతనికి జ్ఞానం ఉపదేశించెను. ఓ రాజా, నీవు కర్మలను ఆచరించుచున్నావు. నీవి కర్మలచే దుఃఖము తొలగి సుఖము లభించునని తలంచుచున్నావా? ఆ రెండును కర్మచే లభింపవు. నారదుడు ఇట్లు చెప్పగా ప్రాచీన బర్హి అనడి రాజు మహానుభావా నా మనస్సు కర్మలచే ఆకర్షింపబడినది. అన్నిటికంటే గొప్పదియగు జ్ఞానమును నేను ఎరుంగను. జ్ఞానమే అంతఃకరణమునకు నైర్మల్యమును కలిగించునది. కర్మ బంధమును విడిపించునది అని చెప్పుదురు. దానిని నాకు ఉపదేశింపుము. పసిపిల్లల వలె విడుచుటకు వీలు గాని ఈ సాంసారిక ధర్మమునందు నేను తగులుకొని పుత్రులు, భార్య, ధనము అన్నివే పొందదగినవని పురుషార్థమును మరిచి మూఢునై ఉన్నాను. నా వంటి వారికి శ్రేయస్సు లభింపదు. ఇట్లు ప్రాచీన బరిహి కోరగానే నారదుడు అతనికి కర్మలయందు వైరాగ్యము కలిగించుటకు ఇంతకాలం యజ్ఞములను చేసి ఆ యజ్ఞములలో వధించిన పశువులను ఒక్కమారు చూపించెను. ఓ రాజా, నీవు యజ్ఞములో చంపిన పశువులను చూడుము. నీవు దయమాలిన వాడవై ఎన్నో పశువులను వధించితివి. వానికి నీవు కలిగించిన బాధను తలవంచుకొని నీవు ఈ శరీరమును వీడి. ఈ ఆ లోకమునకు ఎప్పుడు వత్తువాని ఎదురు చూచుచున్నవి, నీపై పగతో ఉన్నవి, ఇనుముతో చేయబడిన ఆయుధముల వంటి వాని కొమ్ములతో నిన్ను ముక్కలు ముక్కలు చేయును. నీ పురుషార్థం ఏదియో దానికి సాధనము ఏదియో తెలియదు. అందుచే నీకు తత్వమును, హితమును, పురుషార్ధమును రింగించెడి పురాతనమైన పురంజనోపాఖ్యానమనెటి చరిత్రను చెప్పెదను శ్రద్ధగా వినుము. ఇంతటితో రుద్రగీత పూర్తయింది. నారదుడు. ప్రాచీన బర్హిహి చెప్పినటువంటి పురంజనోపాఖ్యాన్ని మనం మరో ఎపిసోడ్లో తెలుసుకుందాం. రుద్రగీత పూర్తి చేయడానికి కోసం కొంత సమయం ఎక్కువగా అయింది. అందరూ కూడా దాన్ని రోజు నిత్యం వినడానికి ప్రయత్నిస్తారని భావిస్తూ జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to the manifest, subtle, and the supreme being. The one who is the cause of the fourteen qualities, the number of qualities, and the destruction of the qualities, Sri Hari, is he not the one who is the very subtle consciousness? It is not visible to the senses or the mind. He is declared as both the form of the living and the form of the non-living. Srihari, as a Sankhya Shastraacharya, manifested and considered 24 Tattvas. Salutations to Shri Hari. Eighth chapter, 16th canto, 16th chapter, 30th prayer. Dear listeners, welcome to the 27th podcast of Srimad Bhagavata Tatva Deepika, the fourth book. Until now, as part of the conversation between Vidura and Maitreya, after completing the history of Prithu Raja, Prithu Raja's son, Vishwajit, is the one who is the inner support, The son of Antaradhanu was Havirdhanu and his son was Prachitasu. After having made a direct appearance and prayed to Rudra, Rudra is imparting some teachings to them. Let's listen to that teaching today. This is what we call the Rudra Geetha. To the wise Oh God, the protector, you shine with your form and qualities. May you be blessed. The joys of the world are possible, that is, they can be earned through effort. Therefore, they are unstable. You are not prepared by anyone's efforts. You're always the one that's there. You are the embodiment of bliss. That which is experienced by you, the joy that arises from it is eternally stable. You are the one who resides in the lotus, which is the form of the world. You are the cause of this world. You are the cause of the subtle elements and the senses. You are the one who spreads and appoints in them, and you are the one who does not touch the faults in them.
You are the one who keeps everything. Because they are present in everything, they are called Vasu. Because you are the one who is in everything and shines without the faults in it, they call you God. Because you have both dharma, they will call you Vasudeva. Offering salutations to you, you have hunger, thirst, sorrow, delusion, old age, death, and six diseases. You're stubborn, you know you are. You are the light that shines brightly, without any defect, in all times. You are the one who, without any division of name and form, draws into yourself. Therefore, you are called a Sankaracharya. Sanka means one who makes one and withdraws into himself, the one who is in contact. You are the one who ends everything, your face burns the world, the whole world is dissolved in you. But I, because you do not have another reason, you will not be dissolved in another, you will not be dissolved. Greetings to you. You are the one who is the bestower of Dharma, Artha, and Moksha, and the one who teaches the Vedas, to give life to the universe, to make them their means. You are everyone You are the inner spirit. You are the origin of all forms like Ramakrishna. You are the one who enters and rules the world in all countries and at all times. Therefore, your inner self will be understood. Salutations to Lord Pradyumna. Salutations to you, who are the controller of the senses and the inner self, who inspires to act. Even though you are the embodiment of the universe and the indweller of the soul, you remain without performing meritorious deeds. The deeds of those who have sought you are destroyed. Therefore, they praise you as the supreme ascetic. You are everywhere, always, outside, inside. Therefore, they say you are complete. Therefore, you are the one who is bound by the desires of those who have sought refuge in you.
This is your dharma to protect the world. You are the means to the salvation and the heaven. Greetings to you. Always delight in those who have a pure heart. That is why they call you Shuchishad. Your semen is the form of Hiranya. Hiranyavaruṇa is the fire god. So you are fire. Brahma, Adhwaryuva, Udgata, and Yajamana, the fire sacrifice performed by these four is called Chaturhotra. You are the embodiment of the yajna. You are the one who is called Urk, in the food and wealth of the ancestors, you are the one who is called Ish, being the inner controller in the food, you are the one who gives satisfaction to the gods and ancestors. Being the inner witness of the gods, you are the one who receives the fruits of those sacrifices. You are the one who is proposed by the Vedas. You are the fruitful one for the sacrifices. You are the one who gives the pleasure of experience to all living beings. You are the one who is all-pervading. With these worlds, with these beings, you will establish enjoyment objects, enjoyment places, enjoyable substances, and bring satisfaction to the beings. All beings are the embodiment of energy for the enjoyers. You are the three worlds You are the ruler. The ability to act through the senses is considered cooperation. The power that gives knowledge to the senses is called Ojam. It is called the strength of the ability to wear. That's you. You are the one who commands and makes the beings act in that form. Thus, you are the one who protects the three worlds. You are the embodiment of all entities. The sky, which is the quality of sound, is your form. Similarly, air, light, etc., are also your forms. You are pervasive, present in all things, both inside and outside. Because you are always pervading in everything, inside and outside, they will call you the soul. Yagnyamulu and other merits, your forms, and the heavenly abodes attained through them are your forms. The beings who have knowledge as their main attribute, your form is like that, salutations to you. Oh Lord, you are the one who is the treasure in that fruit for those who perform actions desiring fruit for the ancestors and other gods, and you are the body of the ancestors and gods.
Those who perform devotion to God without seeking fruit, you are the fruit they obtain. The nature of the cessation of the tendency is of two kinds; you are the karmas. You are the embodiment of death, my sadist. You are the one who holds the bodies of the self-existent Manavas. You are the embodiment of the mantra. You are the one who has no superior, who has the supremacy of being beyond attributes and qualities. You are Krishna, the one without any obstacles, the one with knowledge. You are Kapila, who propounded Sankhya, and Hiranyagarbha, who propounded Yoga. You are the one who has the power to perform three actions: creation, preservation, and destruction. You are the embodiment of the Sun, you are the essence of ego, you are beyond words and senses. Oh Lord, grant us your darshan (vision) so that we may see your form, which is worshipped by the Bhagavatas. Your form is one that provides sensory gratification to your devotees. Beautiful, long, and four arms, you have arms. Beautiful, tender, with a face. You have eyes like the petals of a lotus flower. Beautiful are the eyebrows, nose, teeth, and cheeks You're a face. Oh! You are a shining star among stars. You are the one with a smiling gaze, full of love. You're a darling with a head full of raves. You are the one who wears a silk cloth with a color like the pollen of a lotus flower, a radiant crown, bangles, necklaces, anklets, and a conch, disc, mace, and lotus. You have shoulders like a lion. Oh! You have a beautiful neck and a garland of gold. You are always with Lakshmi Devi, who never leaves you. When you exhale and inhale, the folds on your beautiful belly will shine. Releasing the universe from your navel. You are the one who is going to understand again. You are adorned with a yellow garment shining in the nimbhas, wearing golden ornaments on it. Your feet, calves, and thighs are extremely beautiful. O Divine Auspicious One, please grant us your darshan. Blooming in autumn
With your lotus-like feet, remove the ignorance that is enveloping our hearts. Fear falls away from those who have seen your feet. You are the guru who guides the wise, aren't you? Those who desire that your divine auspicious idol should be pure in their hearts, they meditate. Make that form also visible to us. To such a meditation, as an element, you will give supreme devotion and grant fear to those who practice their own duty selflessly. YOU ARE THE ONLY ONES WHO ARE GOING TO BE AFFECTED. Your darshan (sight) is more beloved than liberation (kaivalya). Nothing but devotion can worship thee. Those who worship you with solitary devotion do not desire heaven or liberation except at the base of your feet. Yama, who can destroy the entire world by turning the eyebrows of those who surrender to the base of your feet with his virility and valor. He is not able to occupy. Even in an instant, even in a moment, there is no heaven, nor rebirth. What is the use of the disciples of the Lord in the company of the mortals? One moment in devotion to the Lord A combination would be fine. If it is said that heaven and rebirth are not equal to that, then what is the point of saying other desires? Bathe in the Ganges that flows from your feet, remove your sins, experience your divine glory, and get rid of sin. Bathing in the Ganges is an external bathing ritual. Remembering your glory is like taking a bath in the mind. These are the only two sins that can be eliminated. May we not attain the company of those who are full of devotion, compassion, and the quality of goodness, and who have a mind filled with the quality of goodness, and who have good character.
This is your blessing. Only through the association of devotees of God can the mind be filled with the quality of goodness. It does not get the illusion that external things like sounds are attainable. That delusion will be dispelled in the mind, and those who have devotion towards you will be able to know your form happily. This conscious, all-pervading universe exists only in your form. Your form will remain in the universe. You are the supreme Brahman, the supreme light, thus you are praised. You are the one who, by enabling separation from yourself, transforms nature into the law of life and creates this world. Again, being in it, without changing or gaining anything, you alone are destroying that world. In this world, those who do not know this secret will have a different kind of intellect. You are independent. A man, having his Varnaashramas, can attain self-knowledge and devotion to God through the practice of his Dharma as a form of worship. Those who have self-knowledge, with devotion, worship you to attain liberation through actions appropriate to their respective Varna Ashramas. For them, the secret of Karma Yoga, self-knowledge The secret, the mystery of the Lord's worship is known. Thus, you were before creation, then this being emerged as separate from nature, that itself is the great element, ego, the five elements, gods, sages. You are being transformed into all living beings. This nature is like your power. You have created the four types of stable bodies with divine and human forms, with your power, the nature. Being the inner soul of living beings, entering the body through those beings, it is the body. A living being, like a honeybee collecting honey from various flowers, collects and experiences those things. You were once a time and body. Like a wind with unbearable speed scattering the lines of clouds, scattering this entire universe and dissolving without name or form. The snake that came running with hunger, like a mouse, forgetting itself and forgetting you, who should be remembered, having desires only in words and matters, even if they are obtained, without satisfaction, with greed, those who are attached to him
You are the time, you are the time. Therefore, if anyone is wise, if he is intelligent, he will not abandon your lotus feet. He who does not serve you will consider this body as waste. Therefore, our gurus, the ten-fold men, worship you. Therefore, O Supreme Being, even those who do not know you will be destroyed by Rudra due to fear. We, who have taken refuge in you, who are also an inner guide to Rudra, have no fear of destruction. In this way, Rudra preached the hymn that Brahma had taught him to the Prachetas. Oh, holy princes, may this hymn be chanted by you daily, it will be a blessing to you. Keeping your mind on God, you will practice your dharma. Being in all souls, being the soul, filling all, the omnipresent one, worshiping, praising, meditating, you should cherish this hymn in your mind, be one with a mind full of meditation, practice this with faith. Oh, Brahma's sons, the creators of the Prachetasula, Bhrugvadu, to them this Rudra Gita upadesinchaadu. He taught us to create the people, we have awaited to remove ignorance and create the people. That Vasudeva himself is the recipient, the giver, and those who have the knowledge, chant this hymn and fulfill your desires. You will receive it. Devotion to God is superior to all other good things. Those who have devotion to God are able to cross this ocean of sorrow, which is impossible to overcome by other means. Whoever believes in the Bhagavat Stotram I have spoken with devotion and worships Hari will be devoted to Hari. Whatever anyone desires, they will receive that fruit from this. If you wake up early in the morning and recite this with devotion, if you listen to it, if you make it heard, you will be freed from the bonds of karma. This is the supreme being, the supreme soul. I have preached to you, I have preached to you. Oh, disciples, chant this with a focused mind, and you will receive your desires. In this way, Rudra, having preached to the Prachetas, and being worshiped by them, disappeared as they watched. Rudra Geethamu, Bhagavata Stotramu. The Prachetas chant this, ten thousand times Years of penance in water.
He was interested in ancient Burhi rituals and performed sacrifices. Narada, who was full of self-realization, was kind to him and imparted knowledge and wisdom to him. Oh King, you are performing the rituals. Do you think that sorrow will be removed by your actions and happiness will be attained? Those two are not obtained by karma. Narada, having said this, the ancient king of Barhi, the great one, my mind is drawn by actions. I do not know the greatest wisdom of all. Knowledge itself is what brings purity to the inner self. They say that it liberates from the bondage of karma. Teach me that. Like a baby, unable to leave, in this worldly dharma, I am stuck and forgetting my purpose, thinking that sons, wife, wealth, all are attainable. People like me don't get the best. Thus, as soon as the ancient Barihi asked, Narada, to cause detachment from karmas in him, had performed yagnas for so long and showed the animals killed in those yagnas once. Oh King, behold the cattle you are slaughtering in the yajna. You are kind You have slaughtered many animals. Bear the pain you have caused him, and leave this body. These are the ones who are always waiting for you, who are enmity towards you, who will cut you into pieces with the horns of those who are like iron weapons. I don't know what your purpose is, nor what your means are. Therefore, I will tell you the history of the ancient Purananopakhyanam, which narrates the essence, welfare, and purpose to you. Listen carefully. With this, Rudragita is completed. Narada. Let's learn about the Puranjanoopakhyanu told by the ancient Barhihi in another episode. It took a while before Rudragit was finished. Hoping that everyone will try to listen to it daily, Jai Srimannarayana Asmat Gurubhyo Namaha