ఇంద్ర సభా భంగము & విశ్వరూప విశ్వసారము (Parts 9-12)
Indra's Offense & Visvarupa's Shield (Parts 9-12)
శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, ఇంద్రుడు తన గురువైన బృహస్పతిని అవమానించిన పరిణామాలు మరియు దేవతల దుర్బలత్వం వివరించబడతాయి. గురువు విడిచివెళ్ళిన తర్వాత దేవతలు అసురుల దాడులకు గురై శ్రీమహావిష్ణువును శరణు వేడగా, ఆయన వారిని విశ్వరూపుడి వద్దకు పంపుతాడు. విశ్వరూపుడు ఇంద్రుడికి పురోహితుడిగా అంగీకరించి, సమస్త అనిష్టాల నుండి రక్షించే నారాయణ కవచమును ఉపదేశిస్తాడు. గురువు పట్ల వినయము మరియు భగవంతుని పట్ల శరణాగతియే నిజమైన బలమని ఈ ఘట్టం హృదయంగమంగా తెలియజేస్తుంది.
In this sacred episode from Canto 6 of the Srimad Bhagavatham, we explore the grave consequences of Indra's disrespect toward Brihaspati, the preceptor of the gods, whose departure leaves the heavens vulnerable to demonic forces. As the devas face spiritual and military weakness without their guru's guidance, they seek refuge in Lord Vishnu, who counsels them to approach the young and powerful ascetic Visvarupa for protection. Visvarupa graciously accepts the role of Indra's priest and introduces the mighty Narayana Kavacha, a divine armor of the Lord's holy names that shields the devotee from all evil and harm. This episode beautifully reveals how humility before one's guru and surrender to the Lord are the truest sources of strength and victory.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమస్తస్మై భగవతే వాసుదేవాయ సాక్షిణే య ఇదం కృపయా కస్మై వ్యాచ క్షేమ ముక్షవే సర్వ సాక్షియగు ఆ వాసుదేవ భగవానుని కొరకు నమస్కారం. ఆ భగవానుడు మోక్షకామియగు బ్రహ్మదేవుని కొరకు దయతో ఈ భాగవతమును వివరించెను. 12th క్యాంటో, 13th చాప్టర్, 28th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము తొమ్మిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు అజామిళ వృత్తాంతము, దక్ష ప్రజాపతి వృత్తాంతము చరిత్రాన్ని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అదే. విషయంలో భాగంగా శుకుడు పరీక్షిత్ మధ్యలో జరిగిన సంభాషణలో నారాయణ కోచం గురించి ప్రస్తావన వచ్చి ఆ విషయాన్ని అడిగారు అది మనం తెలుసుకుందాం. నారాయణ కవచం. ఈ మంత్రమును జపించుటకు ముందు కాళ్ళు చేతులు కడువుకొని ఆచమనం చేసి దర్భలతో కట్టిన పవిత్రమును. చేతికి పెట్టుకొని ఉత్తరాభిముఖుడై కూర్చొని మౌనముతో నారాయణ అష్టాక్షరి మంత్రముతోను ద్వాదశాక్షరి మంత్రముతోను విష్ణు షడక్షరి మంత్రముతోను అంగన్యాస కరణ్యాసములు చేసి కొని ఇట్లు జపింపవలెను. దైవికము గాని, భూతలము చేయి గాని, శారీరము గాని భయము కలిగినప్పుడు ఈ నారాయణ కవచమును జపించవలెను. అష్టాక్షరి మంత్రములో ఓం అను అక్షరమును ఉచ్చరించుచు పాదములు స్పృశింపవలెను. న అను అక్షరమును ఉచ్చరించుచు రెండు మోకాళ్ళను స్పృశింపవలెను. మో అను అక్షరమును ఉచ్చరించుచు తొడలను స్పృశింపవలెను. నా అను అక్షరమును ఉచ్చరించుచు ఉదరమును స్పృశించవలెను. రా అను అక్షరమును ఉచ్చరించుచు హృదయమును య అను అక్షరమును ఉచ్చరించుచు
పెదవులను స్పృశింపవలెను. నా అను అక్షరమును ఉచ్చరించుచు ముఖమును య అను అక్షరము ఉచ్చరించుచు శిరస్సును స్పృశింపవలెను. ఓం ఓం నమః అని చూపుడు వేలితో కుడి చేతి బొటన వేలి మొదటి కడుపును స్పృశింపవలెను. ఓం నం నమః అని చూపుడు వేలితో కుడి చేతి బొటన వేలిపై భాగమును తాకవలెను. ఓం మోం నమః అని కుడి చేయి బొటన వేలితో చూపుడు వేలును తాకవలెను. ఓం నాం నమః అని కుడి చేయి బొటన వేలితో నడిమి వేలిని స్పృశించవలెను. ఓం గం నమః అని కుడి చేతి ఉంగరపు వేలిని స్పృశించవలెను. ఓం వం నమః అని కుడి చేతి బొటన వేలితో చిటికెన వేలిని తాకవలెను. ఓం తేం నమః అని ఎడమ చేతి చూపుడు వేలితో బొటన వేలి కింద భాగమును స్పృశించవలెను. ఓం వాం నమః అని ఎడమ చేతి చూపుడు వేలితో బొటన వేలి పై భాగమును స్పృశించవలెను. ఓం సుం నమః అని ఎడమ చేతి బొటన వెలితో చూపుడు వెలిని స్పృశించవలెను. ఓం దేం నమః అని ఎడమ చేతి బొటన వెలితో నడుమి వెలిని స్పృశించవలెను. ఓం వాం నమః అని ఎడమ చేతి బొటన వేలితో ఉంగరపు వేలిని స్పృశించవలెను. ఓం యం నమః అని ఎడమ చేతి బొటన వేలితో చిటికన వేలిని స్పృశించవలెను. ఇట్లే షడక్షరి అనేటువంటి దానితో న్యాసము చేసుకోవలెను. ఓం ఓం నమః అనుచు కుడి చేతితో హృదయమును స్పృశించవలెను. ఓం విం నమః అనుచు కుడి అరచేతిని శిరస్సుపై ఉంచుకొనవలెను. ఓం షం నమః అనుచు కుడి చేతితో కనుబొమ్మల మధ్య స్పృశించవలెను. ఓం నం నమః అనుచు శిఖాస్థానమును స్పృశింపవలెను. ఓం వేం నమః. అనుచు రెండు నేత్రములను స్పృశింపవలెను. ఓం నం నమః అనుచు సర్వ సంధులను స్పృశింపవలెను. ఓం మం నమః అనుచు అస్త్రాయ ఫట్ అని అరచేతిని అరచేతితో తాకి చప్పట్లు కొట్టినట్లు ధ్వని చేసి తన చుట్టూను అన్ని దిక్కులకు
చిటికలు వేసి చేయి తిప్పవలెను, ఇట్లు అంగన్యాస కరణ్యాసములు చేసి జ్ఞాన శక్తి బలైశ్వర్య వీర్య తేజస్సులు అన్నిటి శక్తులతో కూడిన పరమాత్మను తమ మనస్సుతో ధ్యానము చేయవలెను. ఇట్లు ధ్యానము చేయుచు విద్యా, తేజస్సు, తపస్సు శరీరముగా గల శ్రీమన్నారాయణుని గూర్చి ఈ కవచమును చదవలెను. ఆనాడు హరి అనే అవతారమును ధరించి గజేంద్రుని రక్షించినట్లు గరుత్మంతుని వీపుపై పాదపద్మమును ఉంచిన వాడై శంఖము, చక్రము, కత్తి, డాలు, గద, బాణము, ధనస్సు, పాశము అను ఎనిమిది ఆయుధములను ఎనిమిది హస్తముల యందు ధరించిన ఎనిమిది బాహువులు గల ఎనిమిది గుణములు ఆవిర్భవించి ఉండెడి నారాయణుడు నాకు అన్ని వైపులను రక్షణ కలిగించు కాక. జలములో మత్స్యమూర్తి అయిన శ్రీమన్నారాయణుడు జల జంతువుల నుండి వరుణ పాశము నుండి నన్ను రక్షించుగాక. జలము లేని నిర్జల ప్రదేశములలో మాయావటుడగు వామనుడై అవతరించిన నారాయణుడు నన్ను రక్షించుగాక. బలి వద్ద దానము పట్టి పెరిగి మూడు పాదములతో మూడు లోకములను కొలిచిన విశ్వరూపుడైన త్రివిక్రముడగు నారాయణుడు నన్ను రక్షించుగాక. అడవులలో, యుద్ధ భూములలో, దుర్గ స్థానములలో సమర్ధుడై అసుర సేనా నాయకులను ఎదిరించి సంహరింపజాలిన నృసింహ రూపియగు నారాయణుడు నన్ను రక్షించుగాక. ఏ నరసింహము నరసింహమూర్తి యొక్క భయంకరమగు మహాట్టహాసముచే దిక్కులు ప్రతిధ్వనించి గర్భములు జారినవో అట్టి నారాయణుడు నన్ను రక్షించుగాక. తన కోరతో నీటిలో మునిగిన భూమిని ఏ యజ్ఞరూపియగు వరాహరూపియగు నారాయణుడు ఎత్తి పట్టి తనకు ఎదురుగా వచ్చిన దుర్మార్గుడవు హిరణ్యాక్షుని సంహరించినాడో అతడు మార్గమున ప్రయాణం చేయునప్పుడు రక్షించుగాక. పర్వత శిఖరముల యందు పరశురాముడుగా అవతరించిన నారాయణుడు నన్ను రక్షించుగాక. దేశమును వదలి పై దేశమునకేగినప్పుడు లక్ష్మణుడితో కూడిన భరతాగ్రజుడైన శ్రీరామ రూపమున నన్ను నారాయణుడు రక్షించుగాక.
క్రూరములగు అభిచారములు అనగా చేతబడులు మొదలగు ప్రమాదముల నుండి నారాయణుడు రక్షించు గాక. నారాయణుడును సోదరుడును శిష్యుడైన నరుడును గర్వముతో ఒకరి ఒకరు చూసి హాసము చేయుట నుండి రక్షించు గాక. దత్తాత్రేయుడుగా అవతరించిన నారాయణుడు యాగమునకు విరోధులు నన్ను ఆక్రమింపకుండా రక్షించుగాక జ్ఞానప్రదాతగు కపిలుడుగా అవతరించిన నారాయణుడు దురిత కర్మ బంధము నుండి విడిపించుగాక సనత్ కుమారుడు కామదేవుడు నన్ను ఆక్రమించిన కోరికలను పెంచకుండా కాపాడుగాక వేదములను అపహరించి దేవతలను హేళనము చేసిన మధుకైటబులను సంహరించిన హయగ్రీవుడు దేవ హేళనముచే కలిగెడి పాపము నుండి రక్షించుగాక. సంతతము భగవదారాధన పరుడగు నారదుడు భగవదారాధనలో విచ్ఛేదము కలగకుండా కాపాడుగాక. కూర్మ రూపయుగు శ్రీహరి సకల విధములగు పాపముల నుండి ఉద్ధరించుగాక. వైద్య శ్రేష్టుడగు ధన్వంతరి అను నారాయణుడు ఆరోగ్యమును పాడు చేయు అపథ్యముల నుండి నన్ను రక్షించుగాక. మనస్సును జయించిన వాడుగా శీతోష్ణాదులను సహించువాడుగా ప్రసిద్ధి నందిన వృషభ దేవుడు సుఖ దుఃఖముల నుండి శీతోష్ణాదుల నుండి కలతనందకుండా కాపాడుగాక. యజ్ఞరూపియగు నారాయణుడు లోకులు పలికెడి అపవాదముల నుండి రక్షించుగాక. బలభద్రుడు దుర్జనులు కల్పించెడి ఉపద్రముల నుండి రక్షించుగాక. శేషుడు పగపెట్టుకొని బాధించెడి సర్పముల నుండి కాపాడుగాక. జ్ఞాన పురుషుడగు ద్వైపాయన మహర్షి అజ్ఞానం నుండి కాపాడు గాక. నారదుడు, దత్తాత్రేయుడు, సనత్ కుమారుడు, నరుడు, బలుడు, అనంతుడు అను వారందరూ. నారాయణుని అంశావతారములే అందుచే వారందరి రూపముగా ఉన్న నారాయణుడు రక్షించవలెనని ప్రార్థించుచున్నారు. పరశురాముడు, కపిలుడు, ధన్వంతరి, వృషభదేవుడు అను వారలు నారాయణుని ఆవేశావతారములు అందులో వారిచే వారిలో ఆవేశించి ఉన్న నారాయణుడు రక్షించవలెనని ప్రార్థించినారు. మోహమును కలిగించడి శాస్త్ర బోధలచే మనసు చెడకుండా బుద్ధుడు కాపాడుగాక. కలి దోషమును తొలగించి ధర్మ రక్షణముకై కల్కిగా అవతరించిన నారాయణుడు.
కలిదోషం అంటకుండా కాపాడుగాక. దినములో ఆయా భాగములలో కేశవాది మూర్తులు రక్షించవలెనని రక్షపెట్టుచున్నారు. పగలు ఆరు భాగములు, రాత్రి ఆరు భాగములు అయి ఉండును. కేశవాది ద్వాదశ మూర్తులు ఆయా భాగములలో రక్ష కల్పింపవలెని కోరుచున్నారు. కేశవుడు గద, కేశవుడు గద దాల్చి నన్ను ప్రాతఃకాలమున రక్షించుగాక. సంగమ కాలమున వేణువు దాల్చిన గోవిందుడు నన్ను రక్షించుగాక. సూర్యోదయము నుండి ఐదు గడియలు కాలము దాటిన తరువాత సంగమ కాలం. శక్తి నడి ఆయుధమును ధరించి ఉన్న శ్రీమన్నారాయణుడు పూర్వాన్నమునందు రక్షించుగాక. చక్రము చేతిలో దాల్చిన విష్ణువు మధ్యాహ్న కాలమందున రక్షించుగాక. ఉగ్రముకు ధనస్సును దాల్చిన మధుసూదనుడు అపరాహ్న కాలమును రక్షించుగాక. మూడు స్థానములందు ప్రకాశించు మాధవుడు సాయంకాలమందు రక్షించుగాక. ప్రదోష కాలమందు ఋషికేశుడు రక్షించుగాక. అర్ధరాత్రమునందు అనగా నిషీధమునందు పద్మనాభుడు అపరరాత్రమునందు రక్షించుగాక. ప్రత్యూష కాలమందు ఖడ్గమును ధరించిన జనార్ధనుడు రక్షించుగాక ప్రాతః సంధ్యా సమయమునందు దామోదరుడు కాపాడుగాక కాలమూర్తియగు భగవానుడు విశ్వనియంత అయి ప్రభాతమును నన్ను కాపాడుచుండుగాక ప్రాతఃకాలము ప్రత్యూషము ప్రభాతము అనవి మూడును ప్రాతఃకాలమునందలి ముందు వెనక భాగములు. భగవానుని యొక్క అస్త్రములు రక్షింపవలెనని ప్రార్థించుచున్నారు. ప్రళయ కాలమందలి అగ్ని వలె తీక్ష్ణమైన అంచు కలిగి చుట్టూను తిరుగుచు శత్రువులను సంహరించు భగవానుడు ప్రయోగించిన చక్రము. వాయు సహాయముగా గల అగ్ని ఎండుగడ్డిని దహించినట్లు శత్రు సైన్యమును దహించుగాక. పిడుగు వలె మిడుగురులు వెదులుచున్నవో గదా నీవు అజితుడగు భగవానునకు. ప్రియమైన దానవు, నేను ఆ భగవానుని దాసుడను. కావున కుష్మాండ, వినాయక, యక్ష, రాక్షసులను, భూతములను, గ్రహములను బాగుగా పిండి చేయుము. శత్రువులను చూర్ణము చేయుము. ఓ శంఖరాజమా, శ్రీ మహావిష్ణువుచే పూరింపబడి భయంకరమగు ధ్వనిని ధ్వనించుచు నీవు శత్రువుల యొక్క హృదయములను వణికించుచు
యాతు ధాన ప్రమధ ప్రేత మాతృగణములను పిశాచ బ్రహ్మ రాక్షసాది ఘోర దృష్టి గల వారి నుండి వారిని నా నుండి దూరముగా పరిగెత్తిపోవునట్లు చేయుము. వాడి అయిన అంచు గల నందకము అను ఓ ఖడ్గమా భగవానునిచే ప్రయోగింపబడి నీవు నా శత్రువులను ఛేదింపుము. ఓ శతచంద్ర మనడి డాలు పాపాత్ములకు శత్రువుల తీవ్రముగు చూపులు నాపై పడకుండా నీవు అడ్డగించుచుండుము. గ్రహముల వలన కేతువుల వలన అనగా తోక చుక్కల వలన మనుష్యుల వలన పాముల వలన కోరలు జంతువు కోరలు గల జంతువుల వలన భూతముల వలన నాకు కలిగే ఉపద్రవములు అన్నియు భగవాను నామములను రూపములను కీర్తించుట వలన వెంటనే వినాశము నందుగాక. శ్రేయస్సు కలగకుండా అడ్డగించెడివి అన్నియు వెంటనే నశించుగాక. బృహత్సామ బృహత్సామ ఆదంతరసామ మొదలగు స్తోత్రములతో స్తోత్రము చేయునట్టి ఛందోమయుడగు సమర్ధుడైన గరుడు సమస్త ఆపదల నుండి మమ్ములను రక్షించుగాక. విశ్వక్సేనుడు తన నామములచే మమ్ములను రక్షించుగాక. శ్రీహరి నామములు, రూపములు, వాహనములు, ఆయుధములు, ఆభరణములు, పారిషధులు మున్నగునవి అన్నియు ఏ విధములకు ఆపదలు రాకుండా నా బుద్ధిని ఇంద్రియములను, మనస్సును, ప్రాణములను కాపాడుగాక. లోకములో చేతనా చేతనాత్మకమగు జగత్వంతయు వాస్తవముగా భగవానుడే. జగత్తు అంతయు భగవాత్మ భగవదాత్మకమే అనుట సత్యమైన విషయము. అబాధితమగు ఈ సత్యముచే నా ఉపద్రములు అన్నియు నాశనమగుగాక. భగవానుడు చేతనా చేతనాత్మకమగు జగత్తునకు అంతరాత్మ ప్రాకృతమగు దేవ మనుష్యాది నామరూప భేదము లేనివాడు తన సంకల్పము చేతనే తాను తనంతగా భూషణములను ఆయుధములను విగ్రహములను సృష్టించి సత్యముగా ధరించుచున్నాడు కనుక అట్టి సత్య సంకల్పం గల భగవానుడు తన సర్వ విధములకు స్వరూపములతో ఎల్లప్పుడూ అన్ని దేశములందు అన్ని కాలములయందు అంతటా తానుండి సర్వజ్ఞుడై సర్వరూపములతో మమ్ములను రక్షించుగాక.
ఈ విధంగా నారాయణుని యొక్క ప్రార్థన ప్రార్థించుచు నారాయణుని అవతారముగు నృసింహుని మరల ప్రార్థించుచున్నారు. ఈ విషయాన్ని మనం తర్వాత భాగంలో మళ్ళీ తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Gurus. Salutations to the Lord. To the witness of the Lord Vasudeva, this is by your grace, may I be protected and liberated. Salutations to that Vasudeva Bhagavan, who is the witness to all. That Lord explained this Bhagavatam with kindness for Brahma, the lord of liberation. 12th Canto, 13th Chapter, 28th Prayer. Devotees of God, welcome to the ninth podcast of the sixth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, we have learned about the story of Ajamila and the story of Daksha Prajapati. That's the stuff they are now. As part of the matter, in the conversation between Shukudu and Parikshit, Narayana Kocham was mentioned and that matter was asked. Let's find out about that. Narayana Kavacham. Before chanting this mantra, wash your feet and hands, perform Achamanam, and the sacred thread tied with darbha grass. Holding it in your hand, sit facing north, and with silence, chant the Narayana Ashtakshari mantra, the Dvadashakshari mantra, and the Vishnu Shadakshari mantra, and perform Anganyasa Karanyasasam and chant like this. Divine or earthly When there is fear of hand or body, this Narayana Kavacham should be chanted. In the Ashtakshari mantra, while uttering the letter 'Om', one should touch their feet. While pronouncing the letter 'na', one should touch both knees. While pronouncing the letter 'mo', one should touch their thighs. One should touch the stomach while pronouncing the letter 'Na'. While pronouncing the letter 'ra', pronounce the letter 'ya' and while pronouncing the letter 'ya'
The lips should be touched. While pronouncing the letter 'Na', one should touch the face, and while pronouncing the letter 'Ya', one should touch the head. Om Om Namah, with the index finger, the first stomach of the right hand's thumb should be touched. Om Nam Namah, touch the part of the right hand's thumb with the index finger. Om, with the thumb of the right hand, touch the index finger. Om Namo Namaha, and with the thumb of the right hand, one should touch the middle finger. One should touch the ring finger of the right hand to the Om Gam Namah. Om Vam Namah, and touch the little finger with the thumb of the right hand. Om Tam Namah, and with the index finger of the left hand, the part below the thumb should be touched. Om Vam Namah, and with the index finger of the left hand, the upper part of the thumb should be touched. Om Sum Namah, with the thumb of the left hand, touch the index finger. One should touch the left thumb and ring finger of the left hand with the ring finger. Om Vam Namah, and with the ring finger, touch the ring finger. Om yam namaha, with the little finger of the left hand It should be touched. Similarly, one should do Nyasam with the Shadakshari. Om Om Namah, saying this, one should touch the heart with the right hand. Om Vin Namah, saying this, the right palm should be placed on the head. One should touch between the eyebrows with the right hand, chanting Om Sham Namah. One should touch the peak while chanting Om Namo Namah. Om Vaange Namah. Thus, both eyes should be touched. Om Namo Namah, thus all the sandhis should be touched. Saying "Om Man Namah" and clapping his hands together, making a sound like "Astraya phat", around him and in all directions
One should make a gesture with their fingers, and having performed the Anganyasa and Karanyasa, one should meditate on the Supreme Soul, which is united with the powers of knowledge, strength, wealth, and radiance. Thus, while meditating, one should read this armor about Srimannarayana, who has knowledge, splendor, and penance as his body. That day, having assumed the incarnation of Hari, as if protecting Gajendra, having placed the lotus feet on Garuda's back, he held the conch, the discus, the sword, the shield, the mace, the arrow, the bow, The eight weapons called Pasha, having eight arms, having eight arms, having eight qualities, Narayana, who has eight arms, may he protect me from all sides. May Lord Srimannarayana, who is the fish-embodied form in the water, protect me from the Varuna noose, from the aquatic animals. May Narayana, who incarnated as Vamana, the formless one, protect me in the deserted, waterless places. May Narayana, the universal form, who took the offering at Bali, grew, measured the three worlds with three feet, and protected me. In the woods, in the battle, May Narayana, the embodiment of Narasimha, who is capable in the Durga places, confronts the leaders of the Asura army and can destroy them, protect me. Oh Narasimha, may Narayana, who made the directions echo with the terrible great laughter of Narasimha Murthy, and whose wombs slipped, protect me. May Narayana, who is the embodiment of Yagnarupi, who is the Varaharupi, who submerged the earth that was submerged in the water with his hooves, protect him when he comes in front of him, who killed Hiranyaksha. May Narayana, who incarnated as Parashurama on the mountain peaks, protect me. When I leave this country and go to another country, may Narayana protect me in the form of Sri Rama, who is the elder brother of Bharata, along with Lakshmana.
May Narayana protect us from cruel acts, such as being possessed, and other dangers. May Narayana, the brother, the disciple, and the servant, be protected from laughing at each other out of pride. May Narayana, who incarnated as Dattatreya, protect me from those who oppose the Yagam, may Narayana, who incarnated as the giver of knowledge, Kapiludu, be freed from the bondage of sins and misdeeds, Sanat Kumara, Kamadeva, me May Hayagriva, who protected the Vedas from being stolen and ridiculed the gods, and who destroyed the Madhukaitabhas who plundered the Vedas, protect us from the sin caused by the mockery of the gods. May Narada, who is devoted to the worship of the Lord, protect us from any obstacles in the worship of the Lord. May Srihari, who is in the form of a tortoise, liberate us from all kinds of sins. Oh Narayana, the best of physicians, may you protect me from the unhealthy things that ruin health. The bull god, who is famous as the one who conquers the mind and endures the heat and cold, without being disturbed by happiness and sorrow, by the heat and cold May Narayana, who is the embodiment of sacrifice, protect us from the slanders spoken by the people. May Balabhadra protect us from the evil designs of the wicked. May Sheshudu protect from the serpents who are causing pain. May the sage Dwaipayana, the knower of the Vedas, protect us from ignorance. Narada, Dattatreya, Sanat Kumara, Narada, Baludu, Anantudu, all of them. They are the incarnations of Narayana. Therefore, they pray that Narayana, who is in the form of all of them, should protect them. Parashurama, Kapila, Dhanvantari, Vrishabhadeva, and others, in their fervent incarnations of Narayana, prayed that Narayana, who is enraged within them, should be protected. May the Buddha protect us from the mind, without causing it to be corrupted by the teachings of science. Narayana, who incarnated as Kalki to remove the Kali dosha and protect Dharma.
May thou be free from the fault of anger. In the daytime, in those parts, they protect the Kesavadi idols. The day has six parts and the night has six parts. The Kesavadi Dwadasha Murthy is requesting that protection be provided in those parts. Keshavudu Gada, Keshavudu Gada, wearing the Gada, may he protect me in the morning. May Lord Govinda, who played the flute during the Sangam period, protect me. The Sangam is the time when five days have passed since sunrise. May Lord Srimannarayana, who holds the mace, protect us in the previous offering. May Lord Vishnu, who holds the chakra, protect us in the afternoon. May Madhusudana, who wore the bow for Ugra, protect the afternoon time. May Lord Madhava, who shines in three places, protect us in the evening. May Lord Ganesha protect us from all evil during this auspicious time. May Padmanabha protect in the midnight, that is, in the night, and in the other night, may he protect. May Janardhana, who holds the sword in the time of dawn, protect us. May Damodara protect us in the evening twilight. May the Lord, the embodiment of time, protect us May the universe be filled and protect me in the morning. Morning, dawn, and morning are all three parts of the morning. Praying to God to protect them. The discus used by the Lord, which has a sharp edge like the fire during the time of destruction, and which, while revolving around, destroys the enemies. May the fire, which is like the wind's support, burn the enemy army as if dry grass is being burned. Like lightning, you are the one who is searching for the lightning bolt, O Lord, who is unconquerable. Beloved Lord, I am a servant of the Lord. Therefore, Kushmanda, Vinayaka, Yaksha, Rakshasas, ghosts, and planets, make them well-grounded. Pummel your enemies. Oh, King of the Conch, filling the sound with the terrible sound made by Sri Maha Vishnu, you make the hearts of the enemies tremble
Make the demons, Brahmins, and ghosts run away from me, so that they will run away from me. Oh sword with a sharp edge, Nandaka, which was used by the Lord, pierce my enemies. Oh, O hundred-crested one, shield of protection, may the intense gazes of enemies not fall upon me, may you prevent it. May all the calamities that befall me from the planets, from the Ketus, that is, from the tail stars, from the humans, from the snakes, from the fangs, from the animals with fangs, from the ghosts, may all the calamities that befall me not immediately lead to destruction by praising the names and forms of the Lord. May all things that hinder prosperity be destroyed immediately. May Garuda, who is skilled in meter and capable of praising with hymns like Brihat Sama, Brihat Sama, Adantarasama, protect us from all dangers. May Vishwaksen protect us by our names. Srihari's names, forms, vehicles, weapons, ornaments, medicines, and all such things, so that no calamities come to any of them, my intellect and senses, Take care of your mind and your body. In the world, the worldly and conscious is truly God. It is true that the entire world is full of God, God-like. May all my endeavors be destroyed by this unholy truth. The God, who is the cause of the causal world, the inner self, the unmanifested, the God, man, and other names and forms, without any difference, by His own will, He Himself creates ornaments, weapons, and idols, and wears them truthfully. Therefore, such truth May the God with determination, with all his forms, always be present in all countries, in all times, and be omniscient, protect us with all forms, and be with us.
In this way, praying to Narayana, praying to Narasimha, the incarnation of Narayana, they are again praying. We will learn about this in the next part. Jai Srimannarayana and salutations to the Ashmadguru.