సుకన్య చరిత్ర మరియు నాభాగుని సత్యనిష్ఠ – నవమ స్కంధం భాగం 2

Sukanya's Story and Nabhaga's Truth – Navama Skandha Part 2

bhagavatam

ఈ ప్రవచనంలో శర్యాతి రాజు కుమార్తె సుకన్య, చ్యవన మహర్షి నేత్రములను తెలియక పొడవడం వలన ఆయనకు వివాహమవుతుంది. పతివ్రతా ధర్మానికి నిదర్శనంగా సుకన్య అశ్వినీ దేవతల అనుగ్రహంతో తన భర్తను గుర్తించి, చ్యవనుడు యవ్వనం పొందుతాడు. రైవత రాజు బ్రహ్మలోకానికి వెళ్ళినప్పుడు 27 చతుర్యుగాలు గడిచిపోయాయని తెలుసుకుని, బ్రహ్మ ఆజ్ఞపై తన కుమార్తె రేవతిని బలరామునకు ఇస్తాడు. నాభాగుడు ఆపదలో కూడా సత్యమే పలికినందుకు రుద్రుడు సంతుష్టి నొంది అతనికి బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించాడని, సత్యనిష్ఠ సర్వోత్కృష్టమైనదని ఈ కథ బోధిస్తుంది.

This discourse from the Navama Skandha covers the story of Sukanya, daughter of King Sharyati, who accidentally blinds sage Chyavana and is given to him in marriage. Through her devoted service and the grace of the Ashwini Devas, Chyavana regains his youth, and Sukanya's chastity is highlighted as she identifies her husband among three identical forms. The episode of King Raivata visiting Brahmaloka and giving his daughter Revati to Balarama is narrated, illustrating the relativity of time across lokas. Finally, the story of Nabhaga demonstrates that speaking the truth even in adversity pleases Lord Rudra, who grants him both wealth and brahma-jnana.

← Prev Next →
Sukanya's Story and Nabhaga's Truth – Navama Skandha Part 2 bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః పరపరివాదః పరిషది న కథంచన పండితేన వక్తవ్యః సత్యమపి తన్న వాచ్యం యదుక్తమ సుఖావహం భవతి. పది మందిలో కూర్చున్నప్పుడు ఎట్టి పరిస్థితిలోనూ పరనిందలు పలకరాదు. ఎందుకని అంటారా? నిజమే అయినా ఎదిరి ఎడదకు సుఖంగా ఉండటని మాటలు పలకనే కూడదట. ఆర్యోక్తి ఫోర్త్ ప్రేయర్. భగవంతులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక నవమ స్కంధంలో రెండవ పాడ్కాస్ట్ లోకి స్వాగతం. ఇంతవరకు మనం మను యొక్క సంతానాన్ని దానిలో వారి యొక్క విషయాలను తెలుసుకుంటూ అదే భాగంగా పురుషద్ధుడి యొక్క కథా భాగాన్ని తెలుసుకొని మనం ముందు భాగానికి వెళ్తున్నాం. ఇక్కడ సుకన్య చరిత్రను మనం తెలుసుకుందాం. పది మంది కుమారులలో శరియాతి ప్రసిద్ధుడగు రాజు. అతడు శ్రోత ప్రక్రియలో చాలా నేర్పు గలవాడు. అతనికి సుకన్య అని ఒక కుమార్తె కలదు. ఆమెతో కలిసి ఒకనాడు చవన మహర్షి ఆశ్రమమునకు వెడలెను. ఆమె అరణ్యమున తిరుగుచు ఒక పుట్ట కన్నము నుండి మెరుగుడు పురుగుల వలె మెరియుచున్న రెండు వెలుగులను చూచెను. బాల్య చాపల్యముచే ముల్లుతో వానిని పొడిచెను. వెంటనే శర్యాతి వెంటవచ్చిన సైనికులకు మలమూత్ర బంధనమాయెను. దానిని చూచి శర్యాతి ఆశ్రమమును ఏదో అపచారం జరిగి ఉండునని అందరినీ ప్రశ్నించెను. అప్పుడు సుకన్య తాను చేసిన తప్పిదమును చెప్పెను. ఆ వెలుగులు చవన మహర్షి నేత్రములు అని తెలియక ఆమె ముల్లుతో పొడిచినది. ఈ విషయమును తెలుసుకొని పుట్టలోనున్న చవన మహర్షిని శర్యాతి స్తోత్రములచే అనుగ్రహింప చేసుకొనెను. ముని ప్రసన్నుడై ఆమెను తనకిచ్చి వివాహము చేయమనెను. రాజు అట్లే చేసి ఆమెనిచ్చట వదలి రాజ్యమునకేగెను. శవనుడు పరమ కోపిష్టి. సుకన్య అతని మనసునెరంగి పరాకు లేక అనువర్తనతో సేవించుచుండెను.

కొంత కాలమునకు వారి ఆశ్రమమునకు అశ్విని దేవతలు వచ్చిరి. అప్పుడు చవనుడు తనకు యవ్వనం ఇమ్మని వారిని కోరెను. అశ్విని దేవతలు దేవ వైద్యులు. తనకు యవ్వనమును ఇచ్చినందుకు బదులుగా అశ్విని దేవతలకు అతడు యజ్ఞమున సోపానమున భాగమును కల్పించెను. అశ్విని దేవతలు చెవనుని కోరికను అనుసరించి ఒక చెరువులో చెరువులో అతన్ని స్నానము చేయమనిరి. స్నానము చేసి లేచి చూసేసరికి స్త్రీలను మోహపరిచే రమణీయమైన రూపము గల ముగ్గురు పురుషులు ఆ చెరువు నుండి వెలువడిరి. ముగ్గురును ఒకే విధముగా ఒకే విధముగు రూపము ఆభరణములు వస్త్రములు కలిగి ఉండిరి. సుకన్య ముగ్గురిలో తన భర్త ఎవరో ఎరుంగలేక ఆ అశ్విని దేవతలనే తన భర్తను తనకు ఎరుగునట్లు చేయునట్లు ప్రార్థించి వారి అనుగ్రహముచే తన భర్తను తాను మరల పొందెను. భారతీయమైన పతివ్రతా ధర్మమునకు దృష్టాంతముగా ఈమెను చెప్పుచుందురు. వృద్ధుడైనను అంధుడైనను తన భర్తను పొందవలెనని కోరినది కానీ అందముచా మోహపడలేదు. దేవతానుగ్రహముచే తన భర్తను తాను మరల తెలుసుకునగలిగినది. కొంతకాలము తరువాత శర్యాతి యజ్ఞము చేయదలచి చవన మహర్షి ఆశ్రమమునకు వెళ్ళెను. తన పుత్రిక సుకన్య పక్కన సుందరుడైన యువకుని గాని కాంచెను. ఆమె లేచి వచ్చి నమస్కరించెను. శర్యాతి ఆశీర్వదింపలేకపోయెను. ఇదేమి పని? నీ భర్తను అంధుడు, వృద్ధుడు అని వదిలి వంచించి వేరొకరితో వెర్రవించుచున్నావా? ఇది వంశము కళంకము కదా? నిన్ను కరిన మా వంశము, నిన్ను చేపట్టిన చివనుని వంశము కూడా నశించిపోవును కదా? ఇట్టి పని ఎలా చేసితివి అని కుమార్తెతో పలికెను. అప్పుడు సుకన్య తండ్రి ఇతడు మీ అల్లుడు చవన మహర్షియే తన దివ్యశక్తిచే అశ్వినీ దేవతల అనుగ్రహమును పొంది యువకుడు ఆయన అని విన్నవించెను. బృగవంశ సంజాతుడగు చవనుడు అశ్వినీ దేవతలకు యజ్ఞములో సోపానమున భాగము కల్పించినాడని ఇంద్రుడు కోపం వచ్చి చెవనుని చంపుటకు వజ్రము నెత్తెను. కానీ చెవనుని ప్రభావముచే ఆ ఎత్తిన చేయి కదలక ఉండిపోయెను. అప్పుడు ఇంద్రాది దేవతలందరూ అశ్విని దేవతలకు భాగమును అంగీకరించిరి.

ఆ కాలమున అశ్విని దేవతలు దేవతలు దేవతలైనను వైద్యులు కనుక వారికి భాగము లేదు. శరియాత్కి ముగ్గురు కుమారులు. అందు ఆర్తునకు రైవతుడును కుమారుడు కలిగెను. అతడు సముద్రములో కుశస్థలి అను నగరమును నిర్మించెను. అదియే తరువాతి కాలమున ద్వారవతి అని వ్యవహరింపబడిన పట్టణం. ఆ పట్టణమున నివసించి రైవతుడు ఆనర్తమ్ము మొదలగు రాజ్యములు పాలించెను. అతనికి నూరుగురు కుమారులు, ఒక కుమార్తె కలిగిరి. రైవతుడు తన కుమార్తెయగు రేవతికి భర్త ఎవరు కాగలరని విచారించి బ్రహ్మని అడుగుదామని బ్రహ్మలోకమున కేగెను. అతడు బ్రహ్మలోకమునకేగు సరికి అచర గానసభ జరుగుచుండెను. అది పూర్తయిన తరువాత బ్రహ్మను అడగవలెనని కొద్ది కాలం నిరీక్షించి పూర్తయిన తరువాత ఈమెకు భర్త ఎవరు కాగలరు అని బ్రహ్మను ప్రశ్నించెను. అప్పుడు బ్రహ్మ నవ్వి నీ విసటికి వచ్చినప్పటి నుండి ఇప్పటికి 27 సార్లు నాలుగు యుగములు సాగిపోయినవి కానీ నీవు బయలుదేరిన నాడు నీకు తెలిసిన వారు నీవు అనుకున్న వారు ఎవ్వరును ఇప్పుడు లేరు. ఇప్పుడు శ్రీ మహావిష్ణు వంశచే మహాబలుడగు అనంతుడు బలదేవుడుగా భూమియందు అవతరించి ఉన్నాడు. భూభారమును తొలగించుటకు విష్ణువుతో బలరాముడు అవతరించి ఉన్నాడు. కనుక అతనికి రేవతిని వసంగుమని చెప్పెను. రైవతుడు బ్రహ్మ ఆజ్ఞానుసారము రేవతిని బలరామునకు సంగెను. తాను నరనారాయణ ఆశ్రమమునకు ఏగెను. వైవస్తమును కుమారులలో ఒకడగు నభగుని కుమారుడు నాభాగుడు. అతని సోదరులు గురుకులమున విద్యను అభ్యసించుచున్న నాభాగుని మరిచి. ఆస్తిని పంచుకొనిరి. అతడు తిరిగి వచ్చి సోదరులను ఆస్తిలో తనకు భాగము కల్పించకపోవుటకు కారణం అడిగెను. వారు తండ్రిని అడగమని చెప్పిరి. అప్పుడు తండ్రి వారిచ్చు భాగమునకు ఆశపడకుము అంగిరసులు 12 రోజులలో సత్రయాగమును చేయుచున్నారు. వారు ఆరు రోజులకు ఆరు రోజులకు చేయు చేయు కర్మలలో వైశ్వదేవము అను కర్మలో వినియోగింపవలసిన రెండు సూక్తములు వారికి తెలియవు. వాటిని నీవు చెప్పుము. దానికి సంతోషించి వారు స్వర్గమునకు పోవుచు ఆ సత్రమున మిగిలిన ధనమును నీకు వసగదురు అని చెప్పెను. అతడు అట్లే చేసెను. వారు ధనమును వసంగిరి.

అతడు ఆ ధనమును స్వీకరింపబోవుచుండగా ఉత్తర దిక్కు నుండి ఒక పురుషుడు వచ్చి యజ్ఞభూమిలో మిగిలిన ధనము నాది అనెను. అప్పుడు నాభాగుడు తన కొసంగిరి అని చెప్పెను. అప్పుడు వారిద్దరూ తండ్రి నభవుడి వద్దకు వచ్చి వివాదమును తెలియజేసిరి. యజ్ఞ భూమియందు మిగిలినదంతయు రుద్రుని భాగముగా పూర్వము కల్పించబడినది. అందుచే అది రుద్రునిదే అని చెప్పెను. అప్పుడు కుమారుడు నాభాగుడు ఈశ్వరునికి నమస్కరించి నాకు జీవిక లేదు కనుక నేను స్వీకరింప సిద్ధపడితిని క్షమింపుము అని ప్రార్థించాను. అప్పుడు రుద్రుడు సంతోషించి నా భాగా నీ తండ్రి ధర్మమును చెప్పును. నీవు సత్యమును పలికితివి. కావున వైశ్వదేవ మంత్ర ద్రష్టవగు నీకు బ్రహ్మజ్ఞానమును సంగుచున్నాను. ఈ సత్రములో మిగిలినదంతయు నీవే స్వీకరింపుమని చెప్పెను. దీనిచే ఎంత ఆపద కలిగినను అసత్యం ఆడరాదు. సత్యమే పలికిన నాడు పరమేశ్వరుడు సంతుష్టి నొంది కావలసిన కోరికలు ఈడేరుచును అని గ్రహింపవలెను. ఈ వృత్తాంతము నిత్యము స్మరించిన శాస్త్ర జ్ఞానము, మంత్ర జ్ఞానము కలిగి. పరగతి లభించును. ఇంతటితో సుకన్య చరిత్ర మనకు పూర్తవుతుంది. దీని తరువాత అంబరీషోపాఖ్యానాన్ని మనం తరువాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. ఓం అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. The one who is beyond comparison, the one who is the teacher of all teachers, should not be spoken of by any other, even if he is truthful. What is spoken of by him is spoken of by him, and what is spoken of by him is spoken of by him. When sitting among ten people, one should not speak ill of others under any circumstances. Why do you ask? It is true, but one shouldn't speak words that would cause harm to others. Aarohi Ki Pahaad. Oh Gods, welcome to the second podcast in the ninth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, we are going to the front part, learning about the descendants of Manu, their matters, and also learning about the story part of Purushadhvu as a part of it. Here we will learn about the history of Sukanya. Shariati was the most famous of the ten sons of the king. He is very skilled in the listening process. He has a daughter named Sukanya. One day, he went to the hermitage of Chavana Maharshi with her. She was wandering in the wilderness and saw two lights shining like fine stars from a hole in the ground. Due to childhood innocence, he was poked with a thorn. Immediately, Sharyati The soldiers who came along were tied up. Seeing that, Sharyati questioned everyone that some kind of mischief had happened to the ashram. Then Sukanya told her mistake. Unaware that those lights were the eyes of the sage Chavana, she pierced him with a thorn. Having learned this matter, he pleased Chavana Maharshi, who was in the burrow, with his hymns. The sage was pleased and gave her to him to marry. The king did so, left her there, and went back to the kingdom. Shavukanu param kopishthi. Sukanya was serving him with care and without any distraction.

After some time, the Ashwini Devas came to their ashram. Then Chavanudu asked them to give him youth. Ashwini Devas are the divine physicians. In return for giving him youth, he granted the Ashwini Devas a share in the sacrificial steps. The Ashwini Devas, following the request of Chevanun, made him bathe in a pond. After bathing and waking up, three men with beautiful forms that captivate women emerged from that pond. Three of them were of the same kind, of the same form, with ornaments and clothes. Sukanya, unable to recognize who her husband was among the three, prayed to the Ashwini deities to make her recognize her husband, and by their grace, she regained her husband. They mention her as an example of the Indian virtuous wife's dharma. Even though she was old and blind, she desired to have her husband, but she did not be enchanted by beauty. She was able to regain her husband by the grace of the goddess. After some time, Chavana Maharshi decided to perform a Sharyati Yagna He went to the ashram. He is not a handsome young man beside his daughter Sukanya. She stood up and greeted. Sharyati could not be seated. What the fuck? Are you deceiving someone else by abandoning your husband, who is blind and old? Is this a blemish on the lineage? Our lineage, which has been cut off from you, and the lineage of the one who took you over, will also perish, won't they? He said to his daughter, "How did you do this?" Then Sukanya's father said, "This is your son-in-law, Chavana Maharshi. By his divine power, having received the blessings of the Ashwini Devas, he is a young man," and he pleaded. Chavanudu, who was born in the Brihadrishta dynasty, was given a part in the Yagnya by the Ashwini Devas. Indra, angered, raised a Vajra to kill Chevan. But due to the effect of the ear, that raised hand remained still. Then all the Indra and other gods accepted the share for the Ashwini gods.

In those days, the Ashwini Devas, even though they were gods, were physicians, so they had no share. Shariat has three sons. Then Arthunala had a son with Raiwatu. He built a city called Kushasthali in the sea. It is the town that was later known as Dwaravati. The Raivata king, residing in that city, ruled the kingdoms of Anarta and others. He had a hundred sons and a daughter. The Raivatudu, wondering who would be the husband for his daughter Revati, went to Brahma Loka to ask Brahma. He was going to Brahma Loka, and a great assembly was taking place. After that was completed, after waiting for some time to ask Brahma, after it was completed, he asked Brahma who could be her husband. Then Brahma laughed and said, since you came to Visati, 27 times four eras have passed, but when you left, no one you knew, no one you thought of, is there now. Now, Anant, the mighty one, born of the lineage of Sri Maha Vishnu, as Baladeva, on earth He has arrived. Balarama incarnate with Vishnu as an ally, to relieve the burden of the earth. So he told Revati to marry him. The messenger, following Brahma's command, entrusted Revati to Balarama. He went to the Narayana Ashram. Vaivasvata is the son of Nabhagraha, who is one of the sons of Krishna. His brothers forgot my nephew, who was studying in a gurukulam. The property was divided. He came back and asked the reason why his brothers did not give him a share in the property. They told him to ask his father. Then, do not expect the share that the father gives. Angirasulu are performing Satrayagamu in 12 days. They do not know the two hymns to be used in the Vaishvadeva rituals for the six days of the six-day ritual. You can tell me those. Being pleased with that, they will go to heaven and will give you the remaining wealth in that inn, he said. He did the same. They have accumulated wealth.

As he was about to accept the money, a man came from the north and said, "The remaining money in the sacrificial ground is mine." Then Nabhagudu said that he was for Kosangiri. Then both of them came to their father Nabhavudu and explained the dispute. All that remained on the sacrificial ground was previously created as a part of Rudra. Therefore, it is said to belong to Rudra. Then the son, my partner, bowed to Ishwar and prayed, "I have no livelihood, so I am ready to accept, please forgive me." Then Rudra, pleased, will tell my share, your father's dharma. You have spoken the truth. Therefore, I am imparting the knowledge of Brahman to you, who are the seer of the Vaishvadeva mantra. He said that you are the one who should accept everything that remains in this inn. No falsehood should be used in this context. When the truth is spoken, Parameshwara is pleased and understands that the desires that are needed will be fulfilled. This story is always remembered, having the knowledge of scriptures and the knowledge of mantras. You'll get the thrill. With this, the story of Sukanya is for us It is completed. After this, we will learn about the story of Ambarisha in the next podcast. Om Asmad Gurubhyo Namah Jai Srimannarayana.