హిరణ్యకశిపుని ఘోర తపోనిష్ఠ - బ్రహ్మదేవుని అసాధారణ వరములు

The Severe Penance of Hiranyakasipu & Brahma's Benedictions

bhagavatam

ఈ ఎపిసోడ్‌లో, హిరణ్యకశిపుడు తన సోదరుడు హిరణ్యాక్షుని మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని మరియు త్రిలోకాలను జయించాలని సంకల్పించి, మందర పర్వతంపై అత్యంత భయంకరమైన తపస్సు ఆచరించిన వృత్తాంతాన్ని వివరిస్తాము. అతని తపోశక్తి ఎంత తీవ్రంగా ఉందంటే, అతని జటాజూటం నుండి జ్వాలలు వెలువడి స్వర్గలోకాలను కంపింపజేశాయి, దేవతలు భయభ్రాంతులై బ్రహ్మదేవుని శరణు కోరారు. అసాధారణమైన ఆ తపస్సుకు మెచ్చిన బ్రహ్మదేవుడు స్వయంగా అవతరించి హిరణ్యకశిపునికి అపూర్వమైన వరములను ప్రసాదించాడు, ఇది దైవిక లీలలో ఒక మహత్తరమైన మలుపుకు నాంది పలికింది.

In this episode of our Srimad Bhagavatham series, we explore the intense and terrifying penance undertaken by Hiranyakasipu on Mandara Hill, driven by his burning desire to conquer the three worlds and avenge his brother Hiranyaksha's death. His austerities were so extreme that flames radiated from his matted hair, shaking the heavens and alarming even the demigods, who fled to Lord Brahma for refuge. Moved by the unparalleled severity of his tapas, Brahma himself descended to grant Hiranyakasipu extraordinary boons, setting the stage for one of the most dramatic conflicts between demonic pride and divine will in all of scripture.

← Prev Next →
The Severe Penance of Hiranyakasipu & Brahma's Benedictions bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః ముకుందమూర్ధ్నా ప్రణిపత్యయాచే భవంతమేకాంతమియంతమర్ధం అవిస్మృతిస్త్వచ్చరణారవిందే భవే భవేమేస్తు భవత్ప్రసాదాత్ ఓ ముకుందా నీ పాదారవిందములను జన్మ జన్మముల నేను మరోవకుండా ఉండట అనుగ్రహింపుము నీ ఎదుట శిరస్సు వంచి మోకరిల్లి నిశ్చయముగా ఈ కోరికనే కోరుచున్నాను. ముకుందమాల ఫోర్త్ ప్రేయర్. భోద్బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. సప్తమ స్కంధము రెండవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ఉపోద్ఘాతంగా పరీక్షిత్ మహారాజు శుకయోగిల మధ్యలో జరిగినటువంటి సంభాషణ తెలుసుకున్నాం. ఎందుకు దేవతలకు పక్షము వహించినట్టుగా మనకు కనబడుతుంది? భగవంతుడు ఎవరి వైపు కూడా పక్షపాతం వహించడు కదా? ఆయన అవాప్త సమస్త కాముడు కదా అని ప్రశ్నించాడు. దానికి ఒక ఉదాహరణగా శిశుపాలు యొక్క వధ గురించి కథా భాగాన్ని కొంత వివరించాడు. ఇప్పుడు మనం ప్రహ్లాద చరిత్ర ప్రారంభం చేసుకోబోతున్నాం. పూర్వము హిరణ్యకశిపుడు అనే అసురుడు హరిదాసు అయిన కుమారుని హింసించడము సహించలేక భగవానుడు హిరణ్యకశిపుని చంపిన వృత్తాంతము చాలా విచిత్రమైనది. హిరణ్యకశిపుడు ముందు అసురుడు కాడు. అతడు వైకుంఠములో ద్వారపాలకుడు. వైకుంఠ ద్వారం వద్ద జయుడు, విజయుడు అను ఇద్దరు ద్వారపాలకులు ఉండేడివారు. ఎంత వారైనను మహాపురుషులను ఎదిరిస్తే దాని ఫలితమును అనుభవించక తప్పదు. ఒకసారి వైకుంఠానికి సనక సనందాదులు ఐదు ఆరు ఏండ్ల వయసులో ఉన్నవారు ద్విగంబరులు వచ్చినారు శ్రీమన్నారాయణుని క్షమించడానికి. వారిని మహాపురుషులుగా గుర్తించలేకపోయినారు జయ విజయులు. ఎవరో పిల్లలు అనుకున్నారు. వారిని లోపలకు ప్రవేశించకుండా నిరోధించినారు.

జయ విజయులు రజస్తమస్సులు అంటని లోకములో ఉండియు మహాపురుషులను అవమానించినట్టి రజస్వభావము అంకురించినదని అది పోవలెనని అనుగ్రహముతో శాపమిచ్చినారు సనకాదులు. ఈ శాపములే పాపక్షాలనములు. స్వామికి దూరమై అస్వజన్మ పొందుదురు గాక అని శపించిరి. వారు ప్రార్థించగా మూడు జన్మలలో మరల స్వామిని పొందుతారని కుమారులు అనుగ్రహించినారు. వారు మొదటి జన్మలో హిరణ్యకశపుడు హిరణ్యాక్షుడు పేర్లతో దితికి కుమారులై జన్మించినారు. హిరణ్యాక్షుడు భూమిని హరిస్తే వరాహమై శ్రీమన్నారాయణుడు అతనిని చంపినాడు. మహా భాగవతుడైన కుమారుని హింసిస్తే నరసింహుడై హిరణ్యకశిపుని సంహరించినాడు. రెండవ జన్మలో వారే రావణ కుంభకర్ణులై శ్రీరామునిచే హతులైనారు. మూడవ జన్మలో వారే శిశుపాల దంత భక్తుడై శ్రీకృష్ణుని చక్రముచే సంహరించబడి పాపక్షాలనమై మరణ నారాయణ సన్నిధానమును చేరిరి. ప్రజస్తమస్సులను సత్వము అనగతొక్కునట్లు తానే వారి మనసునకు ఆశ్రయమగునట్లు చేయడమే స్వామి చేసిన ఉపకారం. దీనిని ద్వేషముగాను పక్షపాతముగాను భావించుట మన పక్షపాత బుద్ధి. దానిని ఎరింగి ఉపకారముగా భావించుట అసామాన్యుల లక్షణం. ఇప్పుడు ఒక సందేహం. సాధారణముగా కొడుకులను తండ్రి ద్వేషించుట చంపించుట ఉండదు కదా? హిరణ్యకశిపుడు మహాభక్తుడైన తన కుమారుని చంపించుట ఎలా సంభవమని? పరిపూర్ణమైన రజోగుణ ప్రభావముతో అసుర భావము నిండిన వారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. అసుర భావము పెరిగితే దేవుని లేకుండా చేయాలని విశ్వాన్ని అంతను చాప చుట్టలా చుట్టి తానే స్వాధీనం చేసుకోవాలని అనిపిస్తుంది. ఈ భావమే కలిగినది హిరణ్యాక్షునకు. ఈ భూమినంతను హరించుకుపోయినాడు. అంతా నాదే అన్న భావముతో విశ్వాన్నంతటినీ గ్రహించాలన్న తత్వము గల మనలో ఎందరో హిరణ్యాక్షులు ఉంటారు.

సముద్రంలో దూరిపోయినాడు హిరణ్యాక్షుడు. శ్రీమన్నారాయణుడు విశ్వాన్ని అంతను కనబడకుండా కాపాడుతూ ఉంటాడు. అవసరమైతే తానే ఒక రూపంతో ఆవిర్భవిస్తాడు. ఆ సురభావాన్ని అంతమొందిస్తాడు. మరలా స్వస్థత కలిగిస్తాడు. వరాహ రూపం ధరించాడు. హిరణ్యాక్షుని సంహరించాడు. భూమిని మరలా యథాస్థానంలో నిలిపాడు. హిరణ్యకశిపుడు తన సోదరుని శ్రీహరి వధించాడని తీవ్రమైన ఆవేదనతో శ్రీహరిపై పగపెట్టుకున్నాడు. తమ మంత్రులను సామంత్రులను పిలిచినాడు. మాయాసూకరుడై ఆ శ్రీహరి నా సోదరుని చంపినాడు కనుక నేను వానిని సంహరించెదను. వాని సంహరించిన వాడే బలమని నమ్మియున్న దేవతలు తమంత తామే నశించెదరు. నా సోదరుని ఆత్మకు శాంతి లభించును. నేను ఆ శ్రీహరికై అన్వేషణ సాగించుచుండెదను. మీరు ఈ భూమిలో వానిని ఊర్చి తపస్సు, యజ్ఞము చేసే వారిని, వేదాధ్యయన వ్రతములు చేసేడి వారిని సంహరించుడు. ధర్మము, సత్యము, యజ్ఞము ఇవి శ్రీహరికి వాసస్థానములు. అందుచే వేదాధ్యయన పరులను, యజ్ఞకర్తలను, వేదములను దహించుడు. నాశనము చేయుడు అని ఆదేశించినాడు. వారట్లే చేయుచుండిరి. తాను సైన్యముతో దేవలోకముపై దండెత్తెను. వారి పట్టణములను ధ్వంసము చేసెను. దేవతలందరూ బెదిరి పారిపోయిరి. తన సోదరుని మరణముచే దుఃఖించుచున్న తల్లిని మరదలిని ఓదార్చుటకు హిరణ్యకశిపుడు వచ్చి వారికి తత్వజ్ఞానమును ఉపదేశించి దుఃఖమును పశింపదించ పూనినాడు. రాక్షసులు, అసురులు జ్ఞానహీనులు కారు. ధర్మము నిరంగని వారు కారు. తపస్సుని చేయని వారు కారు. కానీ రజోగుణ ప్రభావం చేత అందరిలోనూ వ్యాపించి నియమించే భగవత్ తత్వము ఒకటి ఉన్నదని గుర్తించరు. నేను నియమించువాడను. నాకంటే వేరొకడు ఈశ్వరుడు లేడని వారి భావన. ఏ కార్యమును చేసినను తానే చేసినట్టు భావింతురు గానీ. అందరిలో తనలో వ్యాపించిన ఒక తత్వం యొక్క శక్తిచే చేయుచున్నానని భావించరు. దానికి వ్యతిరేకముగా ఈశ్వరుడే అంతయు వ్యాపించి ఉన్నాడు. సర్వము వాని చేతనే నడుచున్నదని భావించువారు దేవతలు.

భగవద్గీతలో 14వ అధ్యాయంలో మన గుణములలో దైవ అసుర విభాగమును చూపించినాడు. హిరణ్యకశిపుడు అసుర సంపద గలవాడు. విశ్వమంతయు తనదేనని దాన్ని నిలబెట్టువాడు పాలించువాడు తానే అనియు తనకంటే వేరే ఈశ్వరుడు లేడనియు వాని భావన. వారి జ్ఞానము ఆ సమయమున ఇతరులకు శోకమును తొలగించుటకు కొరకు మాత్రము సాయపడును. తమకు ఉపయోగపడదు. హిరణ్యకశిపుడు తల్లికి చెప్పిన వేదాంతము ఉపనిషత్తులలోనూ భగవద్గీతలోనూ చెప్పినదే. అది అతనికి భగవత్ ప్రాప్తికి సాయపడలేదు. దేహమునకు ఆత్మ గల భేదమును వివరించినాడు. ఆత్మ నిత్యము, శుద్ధము, నాశరిహితము, జ్ఞానము కలది. శరీరము కంటే వేరైనది. కర్మచే శరీరములో బంధింపబడును. శరీర సంబంధము చేతనే మనము చేయుచున్నట్లు అనుభవించుచున్నట్లు తోచుచున్నది. కానీ చేయునది శరీరమే. కర్మ సంబంధముచే తాను అనుభవించుచున్నట్లు అనిపించునే గానీ ఆత్మకు సుఖ దుఃఖ సంబంధమే లేదు అని చెప్పినాడు. దానిని విశదపరుచు ఒకతను చెప్పుచున్నాడు ఒకతను. ఉసీనర దేశమునకు రాజు సుయజ్ఞుడు. యుద్ధములో శత్రువులకు చిక్కి చనిపోయినాడు. అతని పట్టపురాణులు దుఃఖముతో విలపించుచున్నారు. అతని శరీరమును దహనము చేయవలెనని సిద్ధపడగా సంస్కారములు చేయవలెనని వారు ఏడ్చుచు అడ్డగించుచున్నారు. వారికి మృత్యువు అనగానేమో ఆత్మ అనగానేమో తెలియజేయవలెనని యముడు అక్కడికి వచ్చినాడు. ఇట్లు చెప్పుచున్నాడు యముడు. అందరును ఒకనాడు ఎచ్చడి నుండి వచ్చినారో మరల అచ్చడికి ఎగువట తప్పదు. అయినను ముందు వెళ్ళిన వారి కొరకు తర్వాతి వారు వారి కంటే వయస్సులో పెద్దవారే ఉండినను తెలియక వ్యర్థముగా ఏడుచుందురు. ఈ లోకమంతయు సృష్టించువాడు, రక్షించువాడు, మరల చేయకుండా చేయువాడు ఈశ్వరుడే. చనిపోయిన మీ భర్త మిమ్మను రక్షించువాడు అని అనుకొనుట అవివేకము.

ఎవ్వరు కాపాడినను ఇంటిలో దాచిన వస్తువు కనబడకుండా పోవును. దారిలో జారిపోయినను ఒకప్పుడు ఎవ్వరూ కాపాడనక్కరలేక దైవముచే రక్షింపబడును. భద్రముగా ఉండును. అడవిలో ఉన్నను సుఖముగా ఉండును. ఇంటిలో ఉన్నను ఆపదలు కలుగును. దీనికి కారణమే. కారణము దైవమే కానీ వేరొకరు కారు అని చెప్పి చనిపోయిన స్వేజ్ఞుని ఆత్మను శరీరము కంటే వేరైన దానిగా యముడు వారికి నిరూపించినాడు. ఒకసారి వేటగాడు ఒక పావురం యొక్క భార్యను వేటాడి తీసుకుని పోవుచుండగా మగపావురం వచ్చి ఏడ్చి బాధపడుచుండెను. కానీ ఆ పావురము కూడా తర్వాత ఆ వేటగాని చేతిలోనే పడినది. శోకము, వియోగము అనునవి కర్మచే కలుగునవి అని తెలియక మోహముచే శోకము కలుగుచుండును. కానీ జ్ఞానముచే తగ్గించుకొనవలెను. తొలగించుకొనవలెను అని హిరణ్యకశిపుడు తన తల్లికి మరదలికి చెప్పి వారి శోకమును శాంతింపచేశాడు. ఈ యొక్క స్వభావమును హిరణ్యకశిపుడు విశదంగా వివరించినాడు. అంతయు దైవాధీనమని చెప్పినాడు. కానీ ఇది ఉపదేశమునకు మాత్రమే ఇది వారి శోకమును తగ్గించుటకు పనికి వచ్చినది. కానీ తన సోదరుని చంపినవాడు శ్రీహరి అనియు అతనిని తాను లేకుండా చేయవలెననియు భావించెను. పగ తగ్గలేదు. జ్ఞానం ఒకరికి ఉపదేశించుటకు మాత్రమే కానీ తమ నడవడిలో మార్పును తెచ్చుటకు ఉపయోగపడని వారు అసురులు. తానే అంతా సాధించగలనని భావించి తనకంటే శక్తిమంతుడైన చతుర్ముఖ బ్రహ్మను గూర్చి తపస్సు చేసి తనకు చావు లేకుండా వరమును సాధించుటకు బయలుదేరుచున్నాడు. తపస్సును చేయుచున్న వారిని నాశనము చేయించిన వాడే తపస్సునకు బయలుదేరుచున్నాడు. మృత్యువు లేదని ఉపన్యసించిన వాడే మృత్యువు లేకుండా చేసుకొనుటకు ప్రయత్నించుచున్నాడు. ఇదంతయు అసురత్వం.

చతుర్ముఖ బ్రహ్మ కన్నా అధికుడను వానిలో అందరిలోను వ్యాపించిన వాడును నారాయణుడని ఎరుంగడు. ఆ ఎరుక లేకపోవుటయే అసురత్వం. ఆ అసురత్వమును మనము హిరణ్యకశిపునిలో చూడవచ్చును. మృత్యువనిన ఏమియో ఇతనికి తెలియదు. ఈ శరీరము లేకుండా పోవుటయే అని వాని భావం. అన్నిటిలో వ్యాపించిన అన్నిటికీ ఆధారమైన అన్నిటినీ నియమించగల ఒక తత్వం ఉన్నదని గుర్తించవలెను. దానిని అన్ని పదార్థములలో లోపల బయట ఎల్లవేళలా దర్శించుచుండవలెను. ఇది అమృతత్వం. చావు లేకుండుట. అనగా మృత్యురహిత స్థితి. హిరణ్యకశిపుడు ఈ స్థితిని ఎరుంగడు. అందుచే ఒకనాడు మృత్యు వాద పడక తప్పదు. కానీ తప్పించుకొనవలెని ప్రయత్నించుచున్నాడు. గురు ఉపదేశముచే నారాయణ తత్వ జ్ఞానము అలవడదు. ఇతనికి అట్టి గురువు లేడు. శరీరము స్థిరముగా ఉండుట మృత్యురహిత స్థితి అని దాన్ని కాంక్షించుచు బ్రహ్మను గూర్చి తపస్సు చేయుటకు మందర పర్వతమునకు బయలుదేరినాడు. ఆ తర్వాత జరిగిన కథా భాగాన్ని మనము మరొక పాడ్కాస్ట్ లో తెలుసుకుందాము. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Asmadgurus. By bowing to Mukunda Murthy, may I attain the state of being one with you. May I not forget the lotus feet of your lotus feet. By your grace, O Mukunda, may I not be without you in every birth I humbly bow my head before you and earnestly ask for this very wish. Mukundamala fourth prayer. Oh, brothers and friends, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the second podcast in the Saptama Skandha. Until now, as an introduction, we have learned about the conversation that took place between King Parikshit and Shukayogi. Why does it appear to us as if we have taken sides with the gods? God ain't white, is he? He questioned whether all of his desires were unfulfilled. He explained a story part about the killing of Shishupala as an example. Now we are going to start the story of Prahlada. In the past, Hiranyakashipu, an Asura, could not bear to be tormented by the son who was a Haridasu, and the story of the Lord killing Hiranyakashipu is very strange. Hiranyakashipu was not a demon in the classical sense. He is the gatekeeper of Vaikuntha. At the entrance of Vaikuntha, there were two gatekeepers named Jayudu and Vijayudu. No matter how many years pass, if you oppose great people, you will have to experience the consequences. Once, Sanaka and Sanandadas, who were five or six years old, came to Vaikuntha to forgive Srimannarayana. Jaya and Vijaya could not recognize him as a great man. Somebody thought they were kids. They were prevented from entering.

Jaya and Vijaya, being in a world where there are no Rajas and Tamas, having insulted great men, having sprouted a Rajasic nature, Sanakadulu cursed with the blessing that it should go away. These curses are the offspring of the Fall. They cursed, saying that they would be separated from their master and would be born again. The sons blessed them that they might be reborn and attain the Lord in three lifetimes of prayer. They were born as twins, Hiranyakashipu and Hiranyaksha in their first birth. Hiranyaksha was killed by the boar Srimannarayana, who took the form of a boar and bit off his tusks. Narasimha, the mighty son, slayed Hiranyakashipu, who was a great devotee. In their second birth, they became Ravana and Kumbhakarna, who were killed by Sri Rama. In the third birth, they became Shishupala's tooth devotee, were killed by Sri Krishna's chakra, became sinners, and reached the abode of Narayana. The Swami's favor was to make the people's minds, so that they would be able to accept the truth, and to make them dependent on him. Considering this as hatred and prejudice is our prejudiced mind. Considering it as a favor The characteristic of the extraordinary. Now I'm confused. Generally, fathers don't kill their sons, do they? How did Hiranyakashipu have his own son killed, who was a great devotee? Those filled with demonic feelings, with the complete Rajoguna influence, are Hiranyaksha and Hiranyakashipu. If the feeling of demonic nature increases, it feels like one should want to destroy the universe without God, to wrap the entire universe like a mat, and to take control of it. Hiranyaksha is thus driven to his senses. He who devoured the earth. With the feeling that everything is mine, many of us who have the philosophy of understanding the universe, Hiranyaksha, exist.

Hiranyakashipu fell into the ocean. Srimannarayana is the guardian of the universe. He manifests itself whenever it needs to. He'll be through. He will heal again. Varaha assumed a human form. Hiranyaksha is slain. He restored the earth to its original position. Hiranyakashipu, with intense grief, held a grudge against Sri Hari, who had killed his brother. He summoned his ministers and officials. Being a magician, that Srihari killed my brother, therefore I will kill him. The gods who believe that the one who killed him is strong, will perish on their own. And may the soul of my brother rest in peace. I will continue my search for Srihari. You, in this earth, by placing him, those who do penance, sacrifices, those who do Veda study vows, destroy them. Dharma, Satya, Yajna, these are the abodes of Sri Hari. Therefore, he burns those who study the Vedas, those who perform sacrifices, and the Vedas. He ordered that he would destroy it. They were doing it. He is with the army on the heavens He invaded. He destroyed their towns. All the gods were frightened and ran away. Hiranyakashipu came to console his mother, who was grieving over her brother's death, and to teach them the knowledge of the truth and to quell their sorrow. Demons and Asuras are not unintelligent. They are not the ones who are righteous. Those who have not done penance are not considered to be. But they do not recognize that there is one divine element that pervades and governs everyone due to the influence of Rajoguna. I am the one who is appointed. Their belief is that there is no God other than me. They think that whatever work is done, they do it themselves. They do not think that they are doing it through the power of a principle that has spread among everyone. In opposition to that, God himself is pervading everything. Those who believe that everything is happening by him are gods.

In the 14th chapter of the Bhagavad Gita, he showed the divine and demonic divisions in our qualities. Hiranyakashipu was a demon. He who establishes and rules that the whole universe is his, his own, and that there is no other God than him, is his feeling. Their wisdom will only help to remove the sorrow of others at that time. It's no use to you. The philosophy Hiranyakashipu preached to his mother is the same as preached in the Vedas and Upanishads and the Bhagavad-gita. It did not help his attainment of bhagavat. He explained the difference between the body and the soul. The Self is eternal, pure, and indestructible, and is full of knowledge. Different from the body. Karma is what binds the body to the body. It seems as if we are experiencing it through bodily contact. But what the body does. He said that although it seems as if one is experiencing it through karma, the soul has no connection to happiness or sorrow. Someone is explaining it, someone is explaining it. Suyajna was King of the Usinara country. He died in battle, struck down by the enemy. His royal dignitaries with sorrow They are lamenting. As they prepare to cremate his body, they cry and obstruct, saying that rituals should be performed. Yama came there to inform them that death or the soul, as they may know it. Thus spoke Yama. Everyone, once they came from Echadi, will have to go back to Acchadi. However, for those who went before, the later ones, even if they are older than them, unknowingly cry in vain. The one who created this entire world, the one who protects it, and the one who makes it happen again is God. It is foolish to think that your dead husband will protect you.

No one will find the things hidden in the house if they are not protected. Even if you slip on the road, you will be saved by God, because no one will be able to save you at one time. It will be fine. Even if it is in the forest, it will be happy. Even if you are at home, you will face difficulties. This is the reason. The reason is God, but not someone else, saying that Yama proved to them that the soul of the dead Shwetnu is different from the body. Once upon a time, a hunter was hunting and taking away a dove's wife. A male dove came and cried and was in distress. But the dove too was caught by the hunter later. Grief and separation are caused by karma, not by ignorance, but by delusion. But it should be reduced by knowledge. Hiranyakashipu told his mother's sister-in-law that they should be removed, and pacified their grief. Hiranyakashipu explained this nature in detail. He said that everything is in the hands of God. But this is only for advice; this is only useful to reduce their grief. But the one who killed his brother is Srihari and him He also decided to make it so that he would not be present. The wrath of the vengeance did not diminish. Knowledge is only for teaching someone, but those who do not bring change in their behavior are Asuras. Thinking that he himself can achieve everything, he is undertaking penance to obtain a boon to not die, concerning the four-faced Brahma who is more powerful than him. He who destroyed those who were performing penance is now setting out for penance. The one who preached that there is no death is trying to make death disappear. This is all demonic.

He who is superior to the four-faced Brahma, who is pervading in all of them, is Narayana, he does not know. Lack of awareness is demonic. We can see the demonic nature in Hiranyakashipu. He doesn't know what death is. His feeling is that this body will disappear. It must be recognized that there is a principle that governs everything that is pervaded by everything, that is the basis of everything. It should be seen inside and outside all the substances. It's nectar. The unlikeliness of death. Immortality, essentially. Hiranyakashipu did not understand this situation. So, one day, I will have to face death. But he is trying to escape. By the Guru's teachings, the knowledge of the essence of Narayana is not attained. He doesn't have a guru. Desiring that the body be stable and immortal, he set out to Mandara mountain to perform penance concerning Brahma. We will find out the next part of the story on another podcast. Jai Srimannarayana and salutations to the Gurus.