తండ్రి సముఖమున ప్రహ్లాదుని నవవిధ భక్తి ప్రసంగము
Prahlada Explains the Nine Processes of Devotional Service
శ్రీమద్భాగవతంలోని సప్తమ స్కంధంలోని ఈ గంభీరమైన ఘట్టంలో, బాల భక్తుడు ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుని సమక్షంలో నిర్భయంగా నిలబడి శ్రీమహావిష్ణువుకు సంబంధించిన నవవిధ భక్తి మార్గాలను వివరిస్తాడు. శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం మరియు ఆత్మనివేదనం అనే తొమ్మిది భక్తి విధానాలు మోక్షమునకు సర్వోత్తమ మార్గమని ప్రహ్లాదుడు స్పష్టంగా నొక్కి చెప్పాడు. తండ్రి కోపమును లెక్కచేయక, ప్రహ్లాదుడు పరమ శాంతముతో నిలబడి, నిజమైన భక్తిని ఏ లౌకిక శక్తియూ అణచివేయలేదని రుజువు చేశాడు.
In this profound episode from Canto 7 of Srimad Bhagavatham, the young devotee Prahlada stands fearlessly before his wrathful father Hiranyakashipu and eloquently describes the nine forms of devotional service to Lord Vishnu. Prahlada enumerates the navavidha bhakti — hearing, chanting, remembering, serving the lotus feet, worshiping, offering prayers, becoming a servant, making friends, and complete surrender — as the supreme path to liberation. Despite his father's fury and scorn, Prahlada remains composed and steadfast, demonstrating that true devotion cannot be suppressed by any earthly power.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః దివివా భువివా మమాస్తు వాసః నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి ఓ నరకాంతకా కృష్ణా స్వర్గమునందున్నను నరకమునందున్నను లేదా ఈ భూమియందే ఉన్నను నాకేమియు వ్యధ లేదు. కానీ శరత్కాల పద్మ సుందరములగు నీ చరణారవిందములనే మరణ సమయమున కూడా ధ్యానించుచుందును. ముకుందమాల సెవెంత్ ప్రేయర్. భగవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వ దీపిక. షష్ట స్కంధము ఐదవ పాడ్కాస్ట్ లో స్వాగతం ఇంతవరకు ప్రహ్లాద హిరణ్యకశ్యప చరిత్రలో హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని వేధించటం ప్రహ్లాదుని తిరిగి పరీక్షించి గురువులను సరిన మార్గంలో తనకు అబ్బినటువంటి విద్యను వారికి తెలపమని చెప్పటం ఆ తర్వాత తిరిగి మళ్ళీ ఆయన పరీక్షించడాని కోసమని తీసుకొని రావటం జరుగుతుంది. మరి ఆ పరీక్షలో ఏం జవాబు చెప్తాడో మనం ఇవాళ తెలుసుకుందాం. ఇది మనము తెలుసుకునవలసిన విషయం. భక్తికి జ్ఞానమునకు బాహ్య శాస్త్రమును అధ్యయనము చేయుట విరోధి కాదు. కానీ ఉపకారము కాదు. వీని ఎరుంగవలెను. వీనిచే లోకాభ్యుదయము కలిగించి భగవదారాధనగా కర్తవ్యమును నెరవేర్చుచుండవలెను. భక్తితో ఉండుట వలన విశ్వమును విశ్వాంతరయామిని ప్రేమించగలడు. అది లేనివాడు స్వార్థము అహంకారము పెరుగును. అది లేనినాడు అన్ని శాస్త్రములు నేర్చిన తరువాత ప్రహ్లాదుడు తల్లి దగ్గరికి వెళ్ళెను. ఆమె పెట్టిన భోజ్య వస్తువులను ఆరంగించి అలంకరింప చేసుకొనెను తండ్రి వద్దకు వచ్చెను. భక్తితో తండ్రి పాదములపై బడి నమస్కరించెను. హిరణ్యకశిపుడు ఆశీర్వదించెను. ఆలింగనము చేసుకొనెను. పరమానందమందెను. బాహ్యమైన ధర్మములు ఆచరించవలెను. అవి మానుట భక్తి కాదు. నారాయణ తత్వమెరిగి సర్వత్ర నారాయణను దర్శించి భేదభావము లేక ఉండవలెను. బాహ్యముగా దేహ బాధచే దేహ భేదముచే
కలిగిన పితృత్వమును, పుత్రత్వమును పాలింపవలెను. ఇవి ఎరింగి జీవించుట సమాజమునకు వ్యక్తికి కూడా శ్రేయస్సును కలిగించును. హిరణ్యకశిపుడు ప్రేమతో కుమారుని శిరమున మూర్కొని ఆనంద భాష్పములను వదులుచు విప్పారిన ముఖముతో ఇట్లు అనెను నాయనా ప్రహ్లాద నీవు ఇంతకాలము గురువుల వద్ద నేర్పిన విద్యలో ఉత్తమమైన ఒక సూక్తిని వినిపింపు ఆనందించెదను. ప్రహ్లాదుడు ఇట్లు చెప్పెను. శ్రవణం కీర్తనం విష్ణోహో స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మ నివేదనం ఇది పుంసార్పితా విష్ణౌ భక్తిశ్చేన్నవలక్షణా క్రియతే భగవత్ యద్ధాత్ మన్మన్యే ధీతముత్తమం. విష్ణువునందు ప్రయోజనమును కాంక్షింపక ఒక కారణము లేక ప్రేమ కలిగి ఉండుట అన్ని చదువులలో ఉత్తమమైన రహస్యం. విద్య వలన కలుగు ప్రయోజనం అదియే అట్టి ప్రేమ భగవంతుని యందు కలిగిన వారు తొమ్మిది రకమైన వ్యాపారములు చేయుదురు. ఒకటి శ్రేవణం శ్రవణం భగవంతుని గుణములను నామములను కథలను వినుట రెండు కీర్తనం ఆ నామములను కథలను లీలలను అవశముగా చెప్పక ఉండలేక చెప్పుచుండుట స్మరణం మూడవది మనసులో భగవానుని స్మరించుట నాలుగు పాద సేవనం పాదములను సేవించుట ఐదు అర్చనం పూజించుట ఆరు వందనం నమస్కరించుట ఏడు దాస్యం విధేయుడై తాను చేయు కర్మలన్నియు వాని పనులే అని వాని ప్రీతికై చేయుట. సఖ్యం ఎనిమిది భగవానుడితో మైత్రి నిరపుట. తొమ్మిది ఆత్మ నివేదనం.
తాను తనది అనునది అంతయు వానిదే అనియు వాని కొరకే అనియు ఎరింగి భగవానుని అర్పించుట. ఈ తొమ్మిది విధములగు భక్తిని శ్రవణం, కీర్తనం, స్మరణం, పాద సేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం. ఆత్మ నివేదనం అని వ్యవహరింతురు. ఇది లభించుటకు ఇది లభించుటయే విద్యకు పరమ ప్రయోజనం. హిరణ్యకశిపుడు విని తీవ్రమైన కోపముతో చలించిపోయినాడు. గురువులపై మండిపడినాడు. శత్రు పక్షమునకు చెందిన పాఠములను నా పిల్లవానికి నేర్పుచున్నారు. గురువులము అను పేరుతో చెడు మార్గమును మా వానికి నేర్పుచున్నారు అని అన్నాడు. గురుపుత్రులు ఈ మాటలు విని ప్రభువు. మీ వాడు చెప్పినది మేము చెప్పినది కాదు. వేరొకరెవ్వరూ బోధించినదియు కాదు. తనంతనే ఈ బుద్ధి ఇతనికి కలిగినది. తమరు ఆగ్రహింపకుడు, మమ్ములను దూషింపకుడు. గురువులిట్టు చెప్పగానే హిరణ్యకశిపుడు కుమారుని చూచి గురువులు చెప్పని ఈ పాపిష్టిమైన పాపిష్టమైన బుద్ధి నీకు ఎట్లు కలిగినది? గృహవ్రతులై చచ్చుచు పుట్టుచు అని ప్రశ్నించాను. అప్పుడు ప్రహ్లాదుడు సమాధానం చెప్తున్నాడు అన్నమాట. గృహవ్రతులై చచ్చుచు, పుట్టుచు, మరల చచ్చుచు చర్విత చర్వణముగా ఇల్లు అనడి చీకటి నూతిలో పడి ఉండెడి వారికి విషయములందు ఆశ చావని వారికి. శ్రీకృష్ణునియందు భక్తి తనంత గాని ఒకడి వలన గాని కలగనేరదు. వారికి తాము దేనిని కోరుకొనవలెనో తమకేది హితమో తెలియదు. అన్నిటిలో ఉన్న విష్ణువును వారు గుర్తించలేరు. బయట కనపడు విషయములే పొందదగినవని వారు బొలాటపడి వానికై ప్రాకులాడుదురు. వాని పొందుటకై ఎన్నో కర్మలను ఆచరించి గ్రుడ్డి వానిచే నడిపింపబడి గోతిలో పడినట్లు మరల మరల జన్మించుచుందురు. తమకు కలిగెడి అనర్థమును తొలగించుటకు భగవంతుని పాదములను సేవించుటయే సాధనమును బుద్ధి వీరికి కలగనేరదు. ఇట్టి బుద్ధి కలుగుటకు ఏ ప్రయోజనము కోరక వాసుదేవుని పాదములు సేవించిన మహా భాద భాగవతుల పాద రజస్సుతో అభిషేకమునందుటయే సాధనం. మహాపురుష సేవనము లేక శ్రీకృష్ణ పదభక్తి కలగదు. శ్రీకృష్ణ పాదభక్తి లేనిదే అనర్థములకు మూలమైన సంసారము తొలగదు.
ఇట్లు చెప్పి ప్రహ్లాదుడు విరమించగా హిరణ్యకశిపుడు కోపముతో ఒడిలో కూర్చున్న ప్రహ్లాద పిల్లవానిని క్రిందకు త్రోసివేసి వీనిని చంపుడు అని ఆజ్ఞాపించెను. వీడు ప్రేమించిన విష్ణువు నా సోదరుని చంపినవాడు. వాడు నాకు శత్రువు. ఈ అసమంజసుడు ఆ విష్ణువును సేవించుచు తండ్రికే ఎదురు తిరుగుచున్నాడు. కొడుకైనను శత్రువైనచో వాని అందమొందించవలెను. తన శరీరంలోనే పుట్టినాడని రోగమును ఆదరించి పెంచుకుందుమా? ఒక వేలికి వ్రణము కలిగినచో దాన్ని ఛేదించి మిగిలిన శరీరమును కాపాడుకొనునట్లే వీరిని చంపి మా వంశమును పదిలపరుచుకొనవలెను. ఏ విధముగానైనను వీని అంతం పొందిప్పుడు వీడు నాకు పుత్ర రూపంలో ఉన్న శత్రువు ఇట్లు ఆదేశింపగానే భీకరమైన రూపములతో ఉన్న రాక్షసులు భయంకరమగు అట్టహాసములతో దుర్భాషలతో క్రూరమగు ఆయుధములతో అతని చంపుటకు సిద్ధపడిరి. సకల ప్రయత్నములు చేసిరి. జ్ఞానము కలవారు శ్రీమన్నారాయణి సర్వవ్యాపకత్వమును గుర్తింతురు. పైనున్న శరీరము అచేతనం. దానిలో కర్మవశముచే జీవుడు ఉండును. శరీరములు భిన్న భిన్న రూపములతో మనకు కనపడును. వానిలో ఉండే ఆత్మలన్నియు జ్ఞానమే ఆకారముగా కలిగి వేరొక తెలుసుకునుటకు శక్యము కాకుండా ఉండును. పైన కన్పట్టు అచేతనములైన శరీరములకు జ్ఞాన స్వరూపములైన ఆత్మలకు లోపల వెలుపల కూడా వ్యాపించి పరమాత్మ నారాయణుడు ఉండును. ఇది ఎరిగిన వారు బాహ్యమైన శరీరముతో సంబంధమును వదిలి శరీరములలో గాని ఆత్మలలో గాని భేదమును చూడక లోనున్న నారాయణు ఏకత్వముని అనుభవించుచుందురు. అప్పుడు చంపుటకు వచ్చిన రాక్షసులు చంపుటకు వారు ఉపయోగపడ్డారు. ఉపయోగించిన ఆయుధములు చంపబడు శరీరములు నారాయణాత్మకములై ఉండును. ఇప్పుడు ఆయుధములు నారాయణుడే చంపువారు నారాయణుడే చంపబడువాడు నారాయణుడే అను భావముతో నేచిన స్థితి పూర్ణ జ్ఞానము గల ప్రహ్లాదునకు కలిగినది. ఇది ఒక ఇంద్రజాలము కాదు. ఔషధుల చేత, సిద్దుల చేత కలిగిన శక్తి కాదు. ఇది జ్ఞానముచే కలిగిన ఏకత్వ అనుసంధానం. ఇప్పుడంతయు నారాయణు శరీరమై నారాయణుడే ఆత్మ అయి నిలిచినది.
ఒక శరీరములో ఒక భాగము, ఒక భాగమునకు ఎట్లు బాధకము కాదో అట్లే రాక్షసులు ప్రహ్లాదునకు బాధకులు కారు. ఆయుధములు చంపుటకు సాధనములు కావు. ఈ భావముతో నిండిన ప్రహ్లాదుని ఏమియు చంపలేదు. దిగ్గజములను తెచ్చి త్రొక్కించిరి. పాములతో కరిపించిరి. హోమములు చేసి శక్తులను ప్రయోగించిరి. విషములు పెట్టిరి. మంచులో, పెనుగాలిలో, అగ్నిలో, నీటిలో పడవేసిరి. సముద్రములో పడవేసి వానిపై పర్వతములు ఉంచిరి. ఏమి చేసినను అతడు భావనలో నరణాత్మకుడై నిలిచినాడు. కనుక అంతయు తన శరీరముగానే కనపడుచున్నది. ఏ బాధయు తెలియలేదు. వధోపాయములన్నియు వ్యర్థములైనవి. దేహమే తానని, తాను స్వతంత్రుడనని, తాను నియమించువాడనని అన్నియు తనకే చెందినవని భావించువాడు హిరణ్యకశిపుడు. నారాయణుడే సర్వమని, నారాయణు శరీరమే తానని, బాహ్యమైన జగమును అని భావించినవాడు ప్రహ్లాదుడు. నారాయణుడు నారాయణుడు శత్రువు కాదు కదా? నారాయణుడు నారాయణుడు చంపడు కదా? ఇట్టి జ్ఞానము కలుగుటకు వయస్సు కారణము కాదు. వృద్ధుడు హిరణ్యకశ్యపుడు. బాలుడు ప్రహ్లాదుడు విద్య కారణము కాదు. సకల శాస్త్ర పారంగతులు గురువులు. ప్రహ్లాదుడు విద్యారంభమున ఉన్నవాడు. ఈ జ్ఞానము కలుగుటకు కారణము గురు అనుగ్రహం. అది నారదుని అనుగ్రహం వలనే కలిగినదే. ఇది మన సనాతన సంస్కృతిలో సారం దీన్ని నిరూపించుటయే ప్రహ్లాద్ చరిత్ర. ఏమి చేసినను నా కుమారు లొంగలేదని విచారించుచున్నాడు హిరణ్యకశిపుడు. అప్పుడు గురువులు ఇతనికి గృహస్థ ధర్మములను బోధించి ధర్మార్థ కామముల విశిష్టతను ఉపదేశించి మనసు మార్చెదమని గురుకులమునకు తీసుకొని వెళ్ళిరి. ఆ తరువాత జరిగిన భాగాన్ని మరొక పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Whether in heaven or on earth, may they reside. Whether in hell or in the realm of the destroyer of hell, I do not care. Even in death, I do not worry about the lotus feet of Sharada. Oh, destroyer of hell, Krishna, whether in heaven, in hell, or on this earth I'm not sad. But even at the time of death, I meditate on the lotus-like feet of Sharathkala Padma Sundaramulu. Seventh Prayer of Mukundamala. Oh, devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the sixth episode of the fifth podcast. Until now, in the story of Prahlada and Hiranyakashipu, Hiranyakashipu tormented Prahlada, tested Prahlada again, and to the gurus, in the right way, the knowledge he gained, to them It is said to explain, and then again, to bring it for him to examine. And let's find out what answer he gives in the exam today. This is something we need to know. Studying external scriptures is not opposed to devotion and knowledge. But it is not a favor. He must be made to do it. By this, world welfare is brought about and it is a form of devotion to God One must live up to their duty. By being devoted, one can love the universe and the other world. He who has no one to look after him will develop selfishness and arrogance. When that was not there, after learning all the scriptures, Prahlada went to his mother. She ate the food she had prepared and decorated it, and came to her father. With devotion, he fell at the feet of his father and prostrated himself. Hiranyakashipu was pleased. He embraced. He experienced supreme bliss. Outwardly, he should practice dharma. They are not devotion. Knowing the essence of Narayana, seeing Narayana everywhere, one should not have any discrimination. Externally, due to bodily suffering, due to bodily differences
The paternity leave should be given to the father. These provide livelihood for the community and also bring prosperity to individuals. Hiranyakashipu, with love, bowed his head to his son, and with tears of joy, with an open face, said thus, "My son Prahlada, I will listen to a supreme saying in the knowledge you have imparted to the teachers for so long, and I will be delighted." Thus spoke Prahlada. Listening, singing, remembering Vishnu, serving his feet, worshiping, offering salutations, friendship, self-surrender, this is the action of the one who is offered to the male deity, Vishnu. With devotion, the twelvefold actions are performed. That which is in my mind, I understand, the supreme. Without desiring the benefit of Vishnu, to have love without any reason is the best secret in all studies. The benefit derived from education is that. Such love, those who have it in God, will do nine kinds of businesses. One is listening, listening to the virtues, names, and stories of God. Two is singing praises. Fourth is remembering, which means not being able to avoid telling those names, stories, and plays. Fifth is remembering God in the mind. Fourth verse Sevanam, serving the feet, five, worshiping, six, saluting, seven, being obedient to slavery, all the deeds he does are his own deeds, and doing for his pleasure. Sakhyam 8. Maitri with God. Nine. Self-reporting.
He offers everything that is his own, saying it is his, and for him. These nine types of devotion are listening, chanting, remembering, serving the feet, worshiping, salutations, servitude, and friendship. It is referred to as Atmanivedanam. This is the ultimate benefit of education for obtaining this. Hiranyakashipu, hearing this, was driven to a frenzy. He was furious with the gurus. They are teaching my child lessons belonging to the enemy. He said that they are teaching him the bad path under the name of gurus. The Guru's sons heard these words and became angry. What your guy said is not what we said. No one else has taught either. This intelligence came to him on its own. You are not angry, you are insulting us. As soon as the gurus said this, Hiranyakashipu, seeing his son, said, "How did you get this sinful, sinful, wicked mind that the gurus did not tell you?" I asked if they are dying and dying while observing the Gruhavrata. Then Prahlada was answering. Observing the vows of the householder, dying, being born, again For those who are dying, for those who are being churned, for those who are in the darkness of the house, for those who do not have hope in matters, for those who do not die. Devotion to Lord Krishna cannot be attained by oneself or through anyone else. They don't know what they want, nor do they know what is good for them. They cannot identify Vishnu, who is in everyone. They are deluded into believing that only external things are attainable and pamper themselves for it. To attain him, they perform many deeds, are led by a blind man, and are born again and again as if falling into a pit. To remove the calamity that befalls you, serving the feet of God is the only means, they do not have the wisdom to understand. To attain such wisdom, without seeking any other benefit, it is the means to be bathed in the dust of the feet of the great devotees of Vasudeva, who served at his feet. Service to a great person or devotion to the feet of Lord Krishna is not possible without it. Without devotion to the feet of Sri Krishna, the cycle of life, which is the root cause of misfortunes, will not be removed.
Thus, after saying this, Prahlada stopped. Hiranyakashipu, in anger, threw Prahlada's child, who was sitting in his lap, down and ordered him to kill him. This lover- Vishnu- killed my brother. He's my enemy. This inconvenient fellow is flirting with Vishnu and interfering with his father. Even if he is a son or an enemy, he should be made beautiful. Should we nurture and grow the disease that he was born with in his body? Just as a wound on a finger is sealed and the remaining body is protected, so too, by killing them, we must secure our lineage. In whatever way, when he was destroyed, he was an enemy to me in the form of a son. As soon as he was ordered, the demons with terrible forms, with terrible laughter, with harsh words, with cruel weapons, were ready to kill him. They made every effort. Those who have knowledge recognize the omnipresence of Srimannarayana. The body above is immobile. In it, the soul exists due to karma. The bodies appear to us in different forms. In him All souls have knowledge as their form and are not able to be known by another. Above, the unconscious bodies appear, and the souls, which are the embodiment of knowledge, pervade both inside and outside. The Supreme Soul, Narayana, resides. Those who have realized this, abandoning the external body, without seeing any difference between bodies or souls, experience the oneness of the inner Narayana. Then the demons came to kill, they were useful for killing. The weapons used, the bodies killed, are Narayanistic. Now, with the feeling that the weapons are Narayana, the one who kills is Narayana, the one who is killed is Narayana, the state of mind that was experienced by Prahlada, who had complete knowledge, occurred. It's not black magic. It is not the power of drugs or siddhas. It is the unity of knowledge that is connected. Now, everything is Narayana's body, and Narayana himself is the soul.
Just as a part of a body is not hurt, similarly demons are not hurters to Prahlada. Weapons are not the only means of ending lives. Nothing killed Prahlada, who was full of this feeling. They brought the giants and trampled them. With a curtain of deadly venom. Homa performs and emits energy. Poison was thrown. Thrown in the snow, in the wind, in the fire, in the water. They cast him into the sea, and raised upon him mountains. Whatever he did, he remained in the state of being a person of the mind. Therefore, everything appears to be his body. I'm not aware of any issues. All the tricks up his little sleeve. Hiranyakashipu is one who thinks that the body is himself, that he is independent, that he is the one who appoints, and that everything belongs to him. Prahlada thought that Narayana is everything, that Narayana is the body, and that the external world is nothing. Narayana is not an enemy, is he? Narayana, Narayana doesn't kill, right? Age is not a reason for gaining such knowledge. The old man is Hiranyakashipu. The boy Prahlada's education was not for nothing. Master of all sciences Teachers. Prahlada was one who was in the beginning of his education. The reason for this knowledge to be attained is the grace of the Guru. It is only by the grace of Narada that I have been able to do this. This is the essence of our Sanātana culture, to prove this is the story of Prahlāda. Hiranyakashipu is worried that his son is not submissive to him, no matter what he does. Then the gurus taught him the duties of a householder, instructed him on the distinction between dharma, artha, and kama, and took him to the gurukula to change his mind. We will find out what happened next in another podcast. Jai Srimannarayana, salutations to the Gurus