వరాహ హిరణ్యాక్ష ఘోర సంగ్రామము - దైత్య సంహారము
The Ultimate Battle & Slaying of Demon Hiranyaksha
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, శ్రీమహావిష్ణువు వరాహ అవతారంగా మహాబలశాలియైన దైత్యుడు హిరణ్యాక్షునితో జరిపిన భీకర సంగ్రామం వర్ణించబడింది. ఇరువురు వీరులు బ్రహ్మాండమైన యుద్ధంలో తలపడగా, హిరణ్యాక్షుడు తన రాక్షస శక్తులన్నింటినీ ప్రయోగించి భగవంతుణ్ణి జయించాలని ప్రయత్నిస్తాడు. చివరకు శ్రీవరాహస్వామి తన దివ్యమైన శక్తితో హిరణ్యాక్షుని సంహరించి, ధర్మాన్ని పునఃప్రతిష్ఠించి సృష్టిని రక్షిస్తాడు.
In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, we witness the climactic and ferocious battle between Lord Varaha, the divine boar incarnation of Lord Vishnu, and the mighty demon Hiranyaksha. The two warriors clash in a spectacular cosmic duel that shakes the heavens, as Hiranyaksha unleashes his full demonic power against the Lord. Ultimately, Lord Varaha slays Hiranyaksha with divine grace and supreme might, restoring the balance of dharma and delivering the universe from the demon's tyranny.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యద్రూపమేతన్ నిజమాయయార్పితం అర్ధ స్వరూపం బహురూపరూపితం సంఖ్యానయస్యాస్తయధోపల్భనాత్ తస్మై నమస్తే వ్యపదేశరూపిణే సర్వ పదార్థముల రూపములోనున్న ఈ జగత్తు నానా నామ రూపములుగా భాసించుచున్నది. ఇది నీ మాయా శక్తి చేతనే ప్రకాశింపజేయబడుచున్నది. వస్తు నిశ్చయమైనచో ఇది మిథ్య అని తేలును గనుక దీనిలోని నానాత్మమునకు వాస్తవము పరిగణము స్పసగదు. ఈ తీరున అనిర్వచనీయమగు జగద్రూపముగా ప్రకటమై నీకు నమస్కారము. ఫిఫ్త్ క్యాంటో 18th చాప్టర్ 31st ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక తృతీయ స్కంధము 28వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు స్వయంభువ మనువు భగవంతుడు చెప్పినట్టుగా తన కుమార్తెను తీసుకొని వచ్చి కర్దమ ప్రజాపతి ముందు ఉంచి తనను స్వీకరింపమని చెప్పేసి అని ప్రార్థిస్తాడు. తర్వాత జరిగిన విషయం ఏంటో అనుభవిద్దాం మనం. ఇట్లు స్వయంభువమును ప్రార్థింపగానే నేను వివాహము చేసుకునదలచియే ఉన్నాను. మీ కన్యను తప్పక స్వీకరింతును. ఆమెను మీరు ఇంతవరకు ఎవరికీ వసంగుటకు అంగీకరింపలేదని విన్నాను. మాకు ఇద్దరికీ వివాహం నిర్వహింపబడుగాక. ఇదే మొదటి వివాహము. వేద మంత్రములతో ప్రసిద్ధముగా వివాహము మా ఇద్దరుకు జరగవలెను. ఆమె సౌందర్యము చేత, శీలము చేత, ఆభరణము లేకపోయినను ప్రకాశించుచున్నది. అట్టి మీ కన్యను ఎవరు స్వీకరింపరు? ఈమె చిన్ననాడు మేడపై బంతితో ఆడుకొనుచుండా కాలి కదలికలో ధరించిన అందెల చప్పుడు విని ఆమె అటునటు చూచిన చూపులకు మోహబడి విశ్వావసు తన విమానము నుండి క్రింద పడినట.
ఆమె స్త్రీ జాతికే ఆభరణం. ఆమె ఉత్తానపాదుని సోదరి. స్వయంభో మనువు కుమార్తె. లక్ష్మీదేవి చరణ సేవచే ధన్యతను అందిన వానికి గాని ఆమె లభింపదు. అట్టి ఆమెను మీరు వసంగిన కాదనడి వాడెవడు? అతివ్రతగు ఈమెను ఈమెయందు నాకు సంతానము కలుగు వరకు భార్యగా స్వీకరించుచున్నాను తరువాత పరమహంసల సన్యాస నియమములను సాత్వికములగు ధర్మములగు ధర్మములను ఆచరించుచు నివృత్తి ధర్మములయందు నిష్ట గలవాడనై ఉందును. ఈ దేవ తిరియక్ మనుష్య స్థావర రూపములచే విచిత్రముకు జగత్తు ఎవరి నుండి వెలువడినదో, ఎవరి వలన నిలిచి ఉన్నదో, ఏ భగవానుని యందు మరల చేరుచున్నదో. ఎవడు లోన ప్రవేశించి విశ్వమును శాసించుచున్నాడో, ఎవడు ప్రజాపతులందరకు స్వామియో అట్టి అనంతుడగు భగవానుడు ఈమెను భార్యగా స్వీకరింపమని నన్ను ఆదేశించినాడు. అని కర్దముడు చెప్పి మనస్సులో భగవానుని ధ్యానించుచు మౌనముతో ఊరకుండెను. ఆమె మందహాసముతో విలసిల్లుచు ఆ ప్రజాపతి ముఖమును చూచి పర్వశమాయెను. కర్దముడు చెప్పిన మాటలు విని స్వయంభువ మనువు తన కుమార్తె యొక్క తన పట్టపు రాణి శతరూప యొక్క అభిప్రాయమును స్పష్టముగా తెలుసుకొని గుణవంతుడు వయసుచే శీలముచే తన కుమార్తెకు తగిన వాడునగు కర్దమ ప్రజాపతికి కుమార్తెను వసంగెను. ఆ మహారాజు భార్య శతరూప వస్త్రములను ఆభరణములను క్రీడా పరికరములకు పరికరములను అల్లునకు వసంగెను. సదృశుడగు భర్తతో కుమార్తెను చేర్చి వెంగ తీరిన వాడై ఆమెయందు గల ప్రేమాతిశయముచే మనసు చెదర ఆమెను ఆలింగనము చేసుకొని ఆమె ఎడబాడును ఓర్వలేని వాడై కంటనీరు పెట్టుచు. కర్దముని వద్ద ఆజ్ఞ తీసుకొని భార్యతో కూడా రథమును ఎక్కి తన పురమునకు ఏగెను. సరస్వతి నది తీరమున కల తపోధనుల ఆశ్రమములను సేవించుచు వారు వారి పట్టణమును చేరిరి. ప్రజలందరూ వారిని ఎదుర్కొనిరి. వారి రాజధాని బర్హిష్మతి. ఆ పట్టణము సర్వ ఐశ్వర్యములతో నిండి ఉన్నది.
వరాహవతారమున భగవానుడు ఒడలు దులుపగా రోమములు అచట పడి అవియే దర్భలుగా అచట మలిచినవి. అవి ఎల్లప్పుడూ పచ్చగా నుండును. అందుచే ఆ పట్టణమునకు బర్హిష్మతి అని పేరు ఏర్పడెను. ఆ కుశకాశములతో అనగా దర్భలతో దర్భలతో రెల్లులతో యజ్ఞ విరోధులను తొలగించుకొని భగవదారాధనగా యజ్ఞములను అచట ఋషులు ఆచరించుచుందురు. మనువు కూడా అచట మొలచిన బర్హిస్సును స్వీకరించి యజ్ఞమును ఆచరించి యజ్ఞ పురుషుడగు ఆది వరాహమూర్తి యొక్క అనుగ్రహముచే తన భూమండలమునకు సామ్రాట్టు అయ్యెను. బర్హిష్మతి నగరమును ప్రవేశించి తాపత్రయములు లేని తన భవనమున ప్రవేశించిన మను చక్రవర్తి భార్యతో కుమారులతో తన ధర్మములకు భంగము కలగకుండా కామములను అనుభవించుచుండెను. అతని కీర్తి ప్రాతఃకాలముననే దేవ గాయకులగు గంధర్వ కిన్నరాదులు గానము చేయుచుందురు. అయినను అతడు అహంకరింపక ప్రేమతో భగవత్ కథలను వినుచుండును. ఎన్నో భోగములను అనుభవించుచున్నను భగవానుని సంతతము ధ్యానించుచు భగవత్ గుణములనే అనుభవించుచున్న వాడగుటచే అతనిని మనసు భోగములపై లగ్నము కాలేదు. భగవత్ కథలనే చెప్పుచు, వినుచు, భగవత్ కథలను కీర్తించుచు కాలము గడిపడి అతని జీవితము సార్ధకమై సాగుచుండెను. అట్లు భగవత్ కథా శ్రవణము, కీర్తనము, ధ్యానము, ఆరాధనము చేయుచు 71 యుగములు పరిణామము గల తన మన్వంతరమును పాలించెను. సంతతము భగవానుని యందే మనసు నిలిపిన వాడగుటచే అతనికి ఆధ్యాత్మికాది తాపములు లేకుండా పోయెను. శ్రీహరిని ఆశ్రయించి ఉండు వారిని శరీరమునకు కలిగే వ్యాధులు మనసున కలిగే ఆధులు ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపములు. బాధింపవు. అతడు సర్వభూత హితమును కోరువాడు. మానవులకు ఆచరింపదగిన ధర్మములను ఉపదేశించువాడు. స్వయంభువ మనువు ఆదిరాజు అనగా మొదటి రాజు. అతని చరిత్రము ఆశ్చర్యకరమైనది. దానిని వింటివి. ఇక వారి కుమార్తెయగు దేవహుతి చరిత్రమును చెప్పెదను వినుము అని మైత్రేయుడు విదురునకు స్వయంభువ మనువు కుమార్తెయగు దేవహుతి చరిత్రమును వివరించుచున్నాడు.
దేవహుతి చరిత్రాన్ని మనము తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.
Jai Srimannarayana, salutations to the Gurus. The form that is truly known, the form that is the essence, the form that is manifested in many forms, the number of forms that exist, to that, salutations. To the form of separation, this world, which exists in the form of all substances, in various names and forms It's fading. This is being illuminated by your magical power. If the object is determined, it is false, therefore, the reality of the multiplicity within it is not considered. In this way, as the indescribable form of the universe, I salute you. Fifth Canto, 18th Chapter, 31st Prayer. Devotees of God, welcome to the 28th podcast of Srimad Bhagavata Tatva Deepika, Third Canto. Until now, the self-existent Manu, as the Lord said, brings his daughter and places her before Kardama Prajapati, praying to him to accept her. Let's experience what happened next. Thus, as soon as I prayed to Swayambhuva, I was determined to get married. I will definitely accept your virgins. I heard that you haven't agreed to let her stay with anyone until now. For us May they both be married. It's the first one. With the Vedic mantras, the famous marriage should happen between the two of us. She shines with beauty, virtue, and without ornaments. Who will not accept your virgin? In her childhood, while playing with a ball on the terrace, hearing the sound of the anklets worn in her foot movement, Vishravasu fell down from his plane, captivated by the gazes of her looking this way and that way.
She is the ornament of womanhood. She is the sister of Uttanapada. The daughter of Svayambho Manu. Lakshmi Devi's service at her feet is the only way to attain her blessings. Who is the one who refused to let you marry her? I accept this very virtuous woman as my wife until I have children. Afterwards, I will observe the vows of the Paramahamsas, the virtuous Dharmas, and the virtuous Dharmas, and I will be devoted to the Nivritti Dharmas. This divine, temporary, human, and stable form, from whom the world emerged, from whom it is sustained, and to which it returns. Who is entering within and ruling the universe, who is the lord of all the kings, such an infinite God has ordered me to accept her as my wife. And Kardamudu said, meditating on the Lord in his mind, he remained silent. She, with a smile, swaying, saw the face of that Prajapati and was amazed. Hearing the words of Kardamudu, Swayambhuva Manuu clearly understood the opinion of his daughter, his crowned queen, Shatarupa Knowing and being virtuous, by age and character, he settled his daughter to Kardama Prajapati, who was worthy of his daughter. That Maharaja's wife, Shatarupa, gave clothes, ornaments, and sports equipment to Alun. Having brought his daughter with a similar husband, he, being satisfied, with the overflowing love in her, losing heart, embraced her, and unable to bear her separation, shed tears. Taking the order from Kardamuni, he also mounted the chariot with his wife and went to his town. They served the hermitages of the ascetics who were on the banks of the Saraswati River and reached their town. The people resisted him. Their capital was Berhūshmatī. The town is full of all kinds of wealth.
In the Varaha avatar, when the Lord shook his body, the hairs fell there, and they were transformed into darbha grass. They are always green. Therefore, that town was named Barhishmati. With those Kusha grasses, that is, with Darbha grasses, with reeds, removing the enemies of Yagya, as Bhagavadaradhana, Yagyas are performed there by the sages. Manu also accepted the sprout that grew there, performed the Yagnya (sacrifice), and by the grace of Adi Varahamurthy, who is the Yagnya Purusha, became the emperor of his world. Manu Chakravarthi, having entered the city of Barhishmati and entered his palace without any anxieties, was enjoying his desires with his wife and sons without violating his dharma. His fame is sung in the early morning by the gods, the Gandharvas, and the Kinnaras. However, without being arrogant, he listens to the stories of the Lord with love. Even though he is experiencing many pleasures, and constantly meditating on the Lord, and experiencing the Lord's qualities, his mind is not attached to pleasures. While telling and listening to the stories of God, the stories of God His life was going on fulfillingly, spending time in praise. Thus, while listening to the stories of the Lord, singing, meditating, and worshiping, he ruled his Manvantara, which had 71 eras of evolution. Because he kept his mind on the Lord forever, he was free from all spiritual afflictions. Those who take refuge in Srihari, the diseases that affect the body, the sufferings that affect the mind, the spiritual, divine, and physical afflictions. They do not trouble. He is the one who desires the welfare of all beings. He is the one who teaches the righteousness that is to be practiced by man. Swayambhuva Manu was the first king. His story is amazing. You heard it. Now, I will tell the story of their daughter, Devahuti, listen, thus Maitreya is explaining the story of Devahuti, the daughter of Swayambhuva Manu.
We will learn about the history of Devahuti in the next podcast. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.