మరణకాల ఆసన్న స్థితి - యమదూతల భీకర ఆగమనం
The Crucial Moment of Death & Arrival of Yamadutas
శ్రీమద్భాగవతం షష్ఠ స్కంధంలోని ఈ గంభీరమైన ఘట్టంలో, పాపజీవనం గడిపిన అజామిళుని ప్రాణాలను తీసుకెళ్ళేందుకు యమదూతలు భీకరమైన రూపంతో ఆగమిస్తారు. మరణ సమయంలో కలిగే భయంకరమైన అనుభవాన్ని మరియు యమదూతల స్వరూపాన్ని భాగవతం అత్యంత స్పష్టంగా వర్ణిస్తుంది. ఈ ఎపిసోడ్ మనల్ని మన జీవన విధానాన్ని పునరాలోచించుకొని, ఆ అంతిమ క్షణం రాకముందే భగవంతుని శరణు పొందమని హెచ్చరిస్తుంది.
In this profound episode from Canto 6 of Srimad Bhagavatham, we explore the fearsome moment of death as the Yamadutas — the terrifying messengers of Lord Yama — arrive to claim the soul of the fallen Ajamila. The scripture vividly describes the frightening form of these divine agents and the dread that accompanies the final moments of a sinful life. This episode invites us to reflect deeply on the purpose of human birth, the consequences of our actions, and the urgent need to turn toward God before that inevitable hour arrives.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నతాస్మతే నాథ పదారవిందం బుద్ధీంద్రియ ప్రాణ మనోవచోభిహి యచ్ఛింత్యతే అంతర్ హృది భావ యుక్తైహి ముముక్షిభిః కర్మమయోరుపాశాత్ ప్రభు, నిమి నీ పాద పద్మమును బుద్ధి, ఇంద్రియములు, ప్రాణము, మనస్సు, వాక్కులతో నమస్కరించుచున్నాము. కర్మ అనే గట్టి బంధము నుండి విముక్తిని కోరే భక్తియోగులు హృదయము లోపల నీ పాద పద్మమును ధ్యానము చేయుదురు. 11th క్యాంటో, సిక్స్త్ చాప్టర్, సెవెంత్ ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక షష్ట స్కంధము మూడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు అజామియుడు యొక్క వృత్తాంతంలో విష్ణుదూతలు యమదూతల మధ్యలో జరిగేటువంటి సంవాదాన్ని మనం చూసాము. సత్తరజస్తమో గుణాల యొక్క ప్రభావం ఏమిటి? మనిషిలో మార్పులు ఎలా వస్తాయి? ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ విషయాన్ని అజామిణునికి వర్తింపచేస్తూ చెప్తున్న దాన్ని మనం విందాం. అజామిరుడు వేదశాస్త్రములను అధ్యయనము చేసిన బ్రాహ్మణుడు. మంచి నడువడి ఆచారములు గలవాడు. శాంతి మొదలగు గుణములు కలవాడు. బ్రహ్మచర్యము, తపస్సు మున్నగు నియమములను పాటించినవాడు. వృద్ధువైన హృదయము గలవాడు, సత్యవాది, గాయత్రి మంత్రోపాసకుడు, పవిత్రుడు, నిత్యము గురువులకు సేవ చేయువాడు, అగ్నులకు, అతిథులకు, పెద్దలకు, వృద్ధులకు సేవ చేయువాడు. అహంకారము లేనివాడు, సర్వభూతములను ప్రేమించినవాడు, స్వార్థము లేక పరకార్యమును చేయువాడు, మితముగా మాట్లాడువాడు. అసూయ లేనివాడు ఇట్టివాడు తండ్రి ఆజ్ఞచే ఒకనాడు పండ్లను, పూలను, సమిధలను, ధర్మలను తెచ్చుటకు అడవికేగినాడు.
ఆ అడవిలో కాముకుడగు ఒక శూద్రుడు ఒక దాసితో మద్యము సేవించి వడలు తెలియకుండా కామ ప్రకోపముతో భోగమును అనుభవించుచుండగా చూచెను. ఆమె కూడా మద్యము సేవించి ఎర్ర వారిన కనులతో అతనిను సమముగా రమించుచున్నది. ఆమె బట్ట వీడి బయట జారిపడుచు లేచుచు. నవ్వుచు నవ్వించుచు అతనికి తినిపించుచు తాను తినుచు సిగ్గు లేకుండా విహరించుచున్న సన్నివేశమును చూచినాడు. అతడు కామముతో ఆమెను గట్టిగా అలింగనము చేసుకునట చూచి ఇతని మనసు కామమునకు వశమైనది. దానితో మోహపడినాడు. దానికి కారణము అతని కర్మయే. చదువును, నడువడిని, గురువు వద్ద విన్న దానిని గుర్తు చేసుకొని మనసును నిగ్రహించుకొనవలెను ప్రయత్నించినాడు. కానీ మనసు నిగ్రహించుకొనలేకపోయెను, లేకపోయెను. ఆమెనే తలంచుచు పిచ్చి ఎత్తిన వాని వలె తెలివి తప్పిన వాని వలె ఆమెనే మనసులో ధ్యానించుచు సంధ్యావందనాది స్వకర్మలను వదిలినాడు. ఆమెతో చేరినాడు. ఆమెకు తండ్రి ఆర్జించిన ధనమును వసంగుచు గ్రామ్యములగు ప్రవర్తనలతో ఆమె మనసును తృప్తిపరచుచు ఆమె మనసును రంజింప చేయుచున్నాడు. యథాశాస్త్రము పెళ్ళాడిన భార్య ఇంటిలో ఉన్నది. అంతకుముందు అతనికి ఆమె చాలా ప్రేమగా ఉండేడిది. సాధుశీల, సుందరి. సత్కుల సంజాత అయినను అతడు వ్యభిచారిని కనుచూపులకు లొంగిపో లొంగి ఆమెను వదలలేక తన భార్యను వదిలినాడు. ఆమెకు సంతానము కలిగెను. ఆ కుటుంబమును బుద్ధిహీనుడై న్యాయముగాను అన్యాయముగాను డబ్బు సంపాదించి పోషించుచుండెడివాడు. ఇట్లు. ఈతడు శాస్త్రములలో చేయవలెనని చెప్పిన ధర్మములను వదిలినాడు. స్వేచ్ఛా ప్రవృత్తి కలవాడై గురువులచే పెద్దలచే నిందింపబడుని కర్మలనే చేసినాడు. ఇట్లు చాలా కాలము అపవిత్రములకు జీవమును జీవనముతో ఆయువునంతను గడిపినాడు. ఇతడు చేసిన కర్మకు ఇచట ఉండగా ప్రాయశ్చిత్తం ఏమియు చేసుకొనలేదు.
కనుక యముని వద్దకు ఇతనిని తీసుకొని పోవలెను. అచర విధించిన దండముచే తప్పక ఇతనికి శుద్ధి కలగదు. దండముచే తప్ప ఇతనికి శుద్ధి కలగదు. ఇట్లు యమదూతలు అజామిణుని తీసుకొని పోవుటకు కారణం వివరింపగా వినిన భవదూతలు. న్యాయసమ్మతముగా ఇట్ల చెబుచున్నారు. మీరు చేయు పని చాలా తప్పు పని. యమధర్మరాజు ధర్మద్రష్ట. వాని సభలో అధర్మము ఉండదు. అట్టి చోట ఈనాడు అధర్మమును మీరు చేయుచున్నారు. దండింపతగని వానిని, పాపము లేని వానిని దండించుట యజమాని ధర్మమునకు విరుద్ధమైనది. మీరు శాసించు వారులు. అందరి యెడల సమబుద్ధి గలవారులు. ఎచ్చట అయినను దోషము ఉన్నచో దాని తొలగించడి వారులు. ప్రజలకు హితమును చేయువారు. మీరే ఇట్లు విషమముగా ప్రవర్తించినచో ప్రజలు ఇంకా ఎవరిని ఆశ్రయింపగలరు? మీ వంటి శ్రేష్టులు దేనిని ఆచరించినా అదే ధర్మమని ఇతరులు అనుసరింతురు. తమ అనుష్టానముచే ధర్మమును ప్రవర్తింపచేయు మీరు ఇట్లు దండింపదగని వానిని దండించుట తగదు. నమ్మదగిన వాడిని నమ్మి ఒడిలో తలపెట్టుకొని నిద్రించుచున్న వానిని ఎవరును హింసింపరు కదా? ధర్మమును అధర్మమును ఎరింగిన వాడు యమధర్మరాజు అని లోకమంతయు నమ్మి ఉండును. మీరే ఇట్లు అధర్మము చేతులను ఎవరనుకొందురు? వేరొక రక్షకుడు లేని వానికి ఎవ్వడును ద్రోహము చేయడు. పాపాత్ముడు కావున వీరిని దండించుట న్యాయమే గానీ ద్రోహము కాదని మీరు అనుకొనుచున్నారు. కానీ మీరు రహస్యమును గుర్తించలేదు. కొన్ని కోట్ల జన్మలలో చేసిన పాపములకు కూడా ప్రాయశ్చిత్తము భగవన్ నామస్మరణము. కుమారుని యందు ప్రేమచే అయినను వడలు తెలియక అయినను ఇతడు నారాయణ అని భగవన్ నామమును ఉచ్చరించినాడు కదా దానితో ఇతని పాపములు అన్నియు నశించినవి పాపములకు ప్రాయశ్చిత్తము తపస్సు యోగము ధ్యానము కాదు, భగవన్నామ స్మరణమే. పాపములకు ప్రాయశ్చిత్తము, తపస్సు, యోగము ధ్యానము కాదు, భగవన్నామ స్మరణమే. అదియే ముక్తికి సాధనము. నారాయణ.
అను నాలుగు అక్షరములు ఉచ్చరించినంత మాత్రము చేతనే ఇతని పాపములు అన్నియు నశించిపోయినవి. దొంగతనము, మద్యపానము, మిత్రద్రోహము, బ్రహ్మహత్య, గురుభార్యాగమనము. స్త్రీ వధ, రాజద్రోహము, పితృవధ, గోవధ మున్నగు మహా పాపములు చేసినను వానికి అన్నింటికీ ప్రాయశ్చిత్తము నారాయణ నామస్మరణ ఒక్కటే. దానిచే కలిగెడి శుద్ధి వేరొక దాని వలన కలగనీరదు. శాస్త్రములలో స్మృతులలో చెప్పబడిన కృచ్ఛ్రాం చాంద్రాయణాది వ్రతములు చేసినను ప్రాయశ్చిత్తములు చేసినను అవి అప్పటికి చేసిన పాపమును పోగొట్టును కానీ మరల పాపమును చేయకుండా దిద్దుపాటు చేయజాలవు. ఎన్నడూ పాపములు అంటకుండా పాపములు తొలగవలెనని కోరిన వారు భగవంతుని గుణములను ప్రతిపాదించని నామములను పలుకుటయే శ్రేష్టమైన సాధనము. ఇతడు చనిపోవుచు నారాయణ అని భగవన్ నామమును పలికినాడు. దానితో అతని పాపములు అన్నియు అతని నుండి పూర్తిగా విడిపోయినాయి. అతడు భగవన్ నామమును పలకలేదు. కుమారుని పిలిచినాడు. కుమారునికి సంకేతముగా నారాయణ అని పేరు పెట్టుకొని. దానితోనే పిలిచినాడు బిడ్డలకు పేరుగా పెట్టుకొని పలికినను ఉచ్చరించలేని వానిని ఎగతాళి చేయుటకు పలికినను ఊత పదముగా పలికినను ఒకరిని గూర్చి హెళనముగా పలికినను ఎటులైనను భగవంతుని నామం పలికినచో వాని పాపములు అన్నియు పూర్తిగా నశించిపోవును. ఎత్తు నుండి పడినప్పుడు కానీ, కాలు జారినప్పుడు కానీ, కాలు చేయి విరిగినప్పుడు కానీ. పాములు, తేళ్ళు మొదలు కరిచినప్పుడు కానీ, వడలు కాలినప్పుడు కానీ, జర తీవ్ర చిచ్చే కానీ, ఎవరైనా కర్రతో కొట్టినప్పుడు కానీ. శ్రీహరి నారాయణ అని భగవంతుని గురించి కాకుండా అయినను నామం ఉచ్చరించినను నరక యాతనం పొందుటకు తగడు తగడు మీరు ఒక సందేహము కలగవచ్చును ఇతడు చేసిన పాపము చాలా పెద్దది కొడుకు పిలుచుచు నారాయణ అనుట చాలా స్వల్పమైన పుణ్యము. అంతటి పాపము ఇంత తేలికగా పోవునా అని ఆ సందేహమునకు సమాధానం వినుడు. కొన్ని పాపములు పెద్దవి, కొన్ని పాపములు చిన్నవి.
పెద్దవానికి పెద్ద ప్రాయశ్చిత్తములు, చిన్నవానికి చిన్న ప్రాయశ్చిత్తములు. మహర్షులు చెప్పినారు, తపస్సు, దానము మొదలగు ప్రాయశ్చిత్తములు ఎంత పాపమో అంతకు తగినంత చేసి పాపమును తొలగించుకొని పవిత్రము కావచ్చు. ప్రాయశ్చిత్తముగా చేసిన తపస్సు దానము మొదలగునవి వారి అధర్మమును తొలగించును కానీ అధర్మము చేయుటకు కారణమైన హృదయమును అనగా మనస్సును పవిత్రము చేయజాలవు. మనస్సు పవిత్రమగుట భగవన్ నామస్మరణ చేతనే బుద్ధిపూర్వకముగా చేసినను అనుకోకుండా చేసినను భగవన్ నామము ఉచ్చరించినంత మాత్రమున మనస్సు పరిశుద్ధమై అధర్మమునకు యోగ్యము కాకుండా పోవును. కాల్చవలెనని అనుకొనెను అనుకొనకపోయినను నిప్పు తగులగానే కర్ర ఎట్లు కాలిపోవునో అట్లే నామము ఉచ్చరించినంత మాత్రమున మనసు పరిశుద్ధమగును. శక్తివంతమైన ఔషధము తెలియక పుచ్చుకొనెను దాని ఫలమును అది ఇచ్చును. భగవన్ నామము బుద్ధిపూర్వకముగా గాక ఏలగ పలికినెను అది మనసును అంటిన దోషములను తొలగించి పవిత్రము చేయును. సందేహము లేదు. మేము చెప్పిన విషయములో మీకు సందేహం ఉన్నచో మీ ప్రభువగు యమధర్మరాజును అడుగును. అతడు ధర్మం యొక్క రహస్యమును ఎరుంగును. చెప్పారు. దీని తర్వాత మరి విషయాన్ని మరొక పాడ్కాస్ట్ లో మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. May you be pleased, O lotus feet of the Lord. With intellect, senses, life force, and mind, may you be free from delusion. With inner feelings, may you be liberated. From the obstacles of karma, O Lord, your lotus feet, intellect, senses, With life, mind, and speech, we offer our salutations. Devotees who seek liberation from the strong bond of karma meditate on your lotus feet within their hearts. 11th Canto, Sixth Chapter, Seventh Prayer. Devotees of God, welcome to the third podcast of the sixth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, in the account of Ajamiyudu, we have seen the conversation between the Vishnu's messengers and the Yama's messengers. What is the effect of the sixteen qualities of Satrajasthamo? How do changes in a person come about? We have all the details now. Now let's listen to what is being said by applying this matter to Ajamila. Ajamirudu was a Brahmin who studied the Vedas. One who walks the tightrope. One who is endowed with peace of mind. Brahmacharyam, tapas One who kept the commandments. One with an aged heart, truthful, a worshiper of the Gayatri mantra, pure, one who always serves the gurus, one who serves the fires, guests, elders, and the elderly. One without ego, one who loves all beings, one who does not have selfishness, one who does good deeds, one who speaks moderately. A person without jealousy, such a person, by the father's command, one day went to the forest to bring fruits, flowers, wood, and dharma.
In that forest, a Shudra, who was lustful, was drinking alcohol with a maid, and unknowingly, he saw her enjoying pleasures with lust. She too, having consumed alcohol, is enjoying him equally with her red-eyed gaze. She is falling out of her clothes, jumping up and down. He watched the scene where he was laughing, making others laugh, feeding him, and eating himself, without any shame. Seeing him firmly embracing her with lust, his mind was captivated by lust. He was obsessed. The reason for that is his karmas. He tried to control his mind by remembering what he had learned and what he had heard from his guru. But he couldn 't bring himself to his senses, he hadn 't. Thinking of her, like a madman, like a fool, he meditated on her in his mind and abandoned the evening prayers and other self-care rituals. He joined her. He is satisfying her mind and pleasing her mind by living with the wealth earned by her father, and by behaving in rural ways. The lawful wife is in the house. Before this, she was in love with him. Sadhusi, Sundari. Even though he was born into a good family, he succumbed to the sight of a prostitute and, unable to leave her, he left his wife. She has been able to conceive. That family, being foolish, was earning and feeding money in a righteous and unrighteous manner. Thus. This man abandoned the laws that were said to be done in the scriptures. Being of a free nature, he was condemned by the gurus and elders, and he did the deeds. Thus, for a long time, he lived with impurity, with life, with life, for as long as he lived. He did not atone for the deeds he did here.
Therefore, he should be taken to Yama. He will not be purified except by the punishment that has been inflicted. He cannot be cleansed but only excommunicated. Thus, the messengers of Yama, hearing the reason for taking Ajamila, were amazed. They are saying this in a just manner. Your kind is too evil. Yamadharma rajah dharmadhrista. In his court, there is no unrighteousness. In such a place, today you are committing injustice. Punishing the one who is not punished, punishing the one who is not sinful is against the law of the master. You're the ones who are ruling. They are people who have empathy. Wherever there is a fault, those who remove it. Benefactor. If you behave so badly, who else can the people trust? Those of noble birth like yourself will follow the same rule, and your example will be much relied upon by others. You who practice righteousness by your actions, it is not right to punish those who are not worthy of punishment. Who would not torture the one who trusts in a trustworthy person, who sleeps with his head in his lap? He who knows righteousness and unrighteousness Yamadharma raju is believed by the whole world. Who do you think is doing this unrighteous act? No one betrays a one who has no other protector. Since they are sinners, you think it is right to punish them, but not treachery. But you didn't recognize the secret. Even for the sins committed over millions of births, the atonement is the remembrance of the Lord's name. Even if he is in love with his son, even if he does not know the fruits, he uttered the name of Narayana, didn't he? With that, all his sins were destroyed. The atonement for sins is penance, yoga, and meditation, not just remembrance of the Lord's name. The atonement for sins is not penance, austerity, yoga, or meditation, but the remembrance of the Lord's name. That itself is the means to liberation. Narayana.
By uttering four letters, all his sins were destroyed. Theft, drinking alcohol, betraying friends, murder, and abandoning one's guru's wife. Even if one commits great sins such as killing a woman, treason, killing a father, or killing a cow, the only atonement for all of them is chanting the name of Narayana. The purity that is obtained by it is not obtained by something else. Even if one performs penance and atonement as mentioned in the scriptures and Smritis, it will only erase the sins committed at that time, but it will not correct the mistakes made without committing further sins. Those who wish to be free from sins without ever mentioning sins, the best practice is to utter the names that do not proclaim the virtues of God. He died, uttering the name of God, Narayana. With that, all his sins were completely separated from him. He did not chant the name of the Lord. He called his son. Narayana was named as the symbol for the son. He called them with that, naming them as children Even if you speak to mock someone who cannot be pronounced, even if you speak as an encouragement, even if you speak mockingly about someone, no matter what, if you speak the name of God, all his sins will be completely destroyed. Whether it's from a fall, a slip or a broken leg. When snakes or scorpions bite, or when fireflies light up, or when someone is severely burned, or when someone is hit with a stick. Srihari Narayana, even if you utter the name of God, you are not worthy of suffering in hell. You may have a doubt. The sin he committed is very big. Saying that the son is calling Narayana is very small A blessing. The answer to the doubt, "Will such a sin be easily forgiven?" is, listen. Some sins are big, some sins are small.
For the one who is great, there is great atonement; for the one who is small, there is small atonement. The sages said, penance, charity, and other expiations, however much sin there is, by doing as much as is needed, removing the sin, one can become pure. The penance, charity, etc., done as atonement, will remove their unrighteousness, but the heart, that is, the mind, which is the cause of doing unrighteousness, cannot be purified. The mind becomes pure by chanting the name of God, whether done deliberately or unintentionally. Just uttering the name of God purifies the mind and prevents it from becoming unworthy of unrighteousness. He thought he should be burned, even if he did not think so, just as a stick burns as soon as it is lit by fire, similarly, as soon as the name is uttered, the mind becomes pure. He took the powerful medicine without knowing its fruit. The name of God, if spoken thoughtfully, will remove the sins that have touched the mind and purify it. Of course. If you have any doubts about what we have said, ask your Lord, Yama Dharmaraja. He They revealed the secret of Dharma. They said. After this, let's learn about the matter in another podcast. Jai Srimannarayana and salutations to the Asmadgurus.