విదురుని పుణ్యక్షేత్ర దర్శనములు - భూప్రదక్షిణ వైభవము

Vidura's Sacred Pilgrimages Throughout the Earth

bhagavatam

శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, మహాత్ముడైన విదురుడు హస్తినాపురపు రాజభోగాలను త్యజించి భారతదేశమంతటా పుణ్యక్షేత్రాలను దర్శించే మహాయాత్రను చేపడతాడు. పవిత్ర నదులలో స్నానమాచరిస్తూ, దేవాలయాలలో భగవంతుని సేవిస్తూ, విదురుడు తన జీవితాన్ని సంపూర్ణ భక్తికి అర్పించుకుంటాడు. తీర్థయాత్ర ద్వారా ఆత్మశుద్ధిని పొందాలనే ఉదాత్తమైన ఆదర్శాన్ని ఈ ఘట్టం మనకు స్పష్టంగా చాటి చెప్తుంది. నిజమైన భక్తుడు తన ప్రతి అడుగును పరమాత్మ సేవగా మార్చుకోగలడని విదురుని జీవనయాత్ర మనకు నేర్పిస్తుంది.

In this profound episode from Canto 3 of Srimad Bhagavatham, we follow the noble Vidura as he embarks on a sacred circumambulation of the holy tirthas across the earth. Having renounced the royal comforts of Hastinapura, Vidura dedicates himself entirely to pilgrimage, bathing in sacred rivers and worshipping the Lord at every blessed site. His journey reflects the highest ideal of detachment and devotion, as he seeks purification of the soul through tirtha-sevana. This episode beautifully illustrates how a sincere devotee transforms every step of life into an act of surrender to the Supreme.

← Prev Next →
Vidura's Sacred Pilgrimages Throughout the Earth bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః యో అంత ప్రవిష్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాంశ్చ హంత చరణ శ్రవణ త్వగాదీన్ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం ఓ భగవానుడా, నీవు సకల శక్తులను ధరించియున్న పూర్ణ పురుషుడవు. నీవే నా హృదయములో ప్రవేశించి అంతర్యామివై గట్టిగా నిద్రించియున్న నా ఈ వాక్కును మరియు చేతులు, కాళ్ళు, చెవులు, చర్మము మొదలగు ఇతర ఇంద్రియములను నీ చైతన్య జ్యోతిచే పునరుజ్జీవింప చేయుచున్నావు. నీకు నమస్కారము. ఫోర్త్ క్యాంటో, నైన్త్ చాప్టర్, సిక్స్త్ ప్రేయర్. భవద్బంధువులారా, శ్రీమద్భాగవత తత్వ దీపికా తృతీయ స్కంధంలో రెండవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతక్రితం మనం విదురుడు ఉద్ధవునితో కలిసి అక్కడి యోగక్షేమాల గురించి కొన్ని ప్రశ్నలు వేశారు. దానికి ఉద్ధవుడు ఇవ్వబోయే సమాధానం ఇవాళ మనం తెలుసుకోబోతున్నాం. విదురా, శ్రీకృష్ణుడనడి సూర్యుడు కాలమనడి మహాసర్పముచే మ్రింగివేయబడినాడు. మా ఇండ్లు, పట్టణములు కాంతివిహీనములైనవి. ఇంక నేను నీకు ఏమని కుశలవార్తను ఎరింగింపగలను? లోకము చాలా దౌర్భాగ్యము కలది. యాదవులు కృష్ణుడితో కలిసి ఉండియు అతడు భగవానుడని ఎరుంగ జాలకపోయిరి. సముద్రంలో చేపలు సముద్రమును దాటించెడి పడవ చుట్టూ తిరుగుచు అది కూడా తమ వంటి ఒక పెద్ద చేప అని అనుకొనును గాని. సముద్రమును దాటించెడి సాధనమని ఎరుంగవు కదా. బహు నిపుణులను ఇతరుల మనస్సులను ఎరుంగజాలిన వారును అగు యాదవులు కృష్ణుడితో ఒకే చోట వశించి యుండియు శ్రీకృష్ణుడు కూడా తమ వంటి జీవుడే అనుకొనిరి. ఇశుపాలాదులు కూడా భగవానుని మాయచే మోహమునంది అనుభవింపదగిన భగవానుని అనుభవింపక శబ్దాది విషయములని అనుభవింపదగని వానివిగా

అనుభవించిరి. కానీ ఆ భగవానుని యందు సమర్పించిన మనసులు గల మా వంటి వారము కొందరు మాత్రము వారి మాటలచే మోహము నందక భగవానుని అనుగ్రహముచే మనసు చెదరక నిలిచినాము. ఎంతో తపస్సు చేసి. జన్మించిన మానవులకు కన్నులు గలవారి చూపులకు చూడదగిన ఏదైనా తన రూపమును కనపడకుండా చేసి తన శరీరముతో తాను తన లోకమునకేగినాడు. ఆ స్వామి సౌందర్యమే సౌందర్యం. మనుష్యుని వలె నటించుటకు ఆ రూపమును తానే కల్పించుకొనెను. ఆశ్చర్యకరమగు తన దివ్యశక్తిచే దానిని కల్పించుకొనుటచే ఇట్టిదని ఎవ్వరును గుర్తింపజాలరు. ఆశ్చర్యకరమైనది. సౌందర్యమునకు పరాకాష్ట, ఆభరణములకు ఆభరణము ఆ శరీరం. అట్టి శరీరమును తనతో తీసుకొని తన లోకమునకేగినాడు. ఆనాడు యుధిష్ఠరుని యుధిష్ఠరుని రాజసూయ యాగములో స్వామి యొక్క ఆ దివ్య విగ్రహమును దర్శించి మూడు లోకముల జనము బ్రహ్మ సృష్టించిన సృష్టిలోని నైపుణ్యం అంతయు ఒకచోటనే ఉన్నట్లు అనుభవించినారు. ఆ భగవానుడు ప్రేమతో నింపిన మందహాసము, రాసలీల, విలాస దృష్టిపాతములు అనుభవించిన గోపకాంతలు ఎంతో భాగ్యమునందినారు. వారి ఇంద్రియ వ్యాపారములన్నియు ఆ భగవానునితోనే ఉండెడివి. అందుచే వారు చేయవలసిన పనులు చేయుట గానీ, చేయరాని పనులు మానుట గానీ ఎరుంగక. ఏ పనిని చేయలేక, మానలేక స్వామి యందే సర్వేంద్రియ వ్యాపారములను నిలిపి జీవించినారు. విశ్వమంతయు భగవానుని శరీరమే. అందు కొన్ని సత్య ప్రచురములగు శాంత రూపములు, కొన్ని రజస్తమస్సులు అధికముగా గల ఘోర రూపములు. ఈ ఘోర రూపములు తనవే అయినను తనవే అగు సత్వ ప్రధానమగు రూపములు వానిచే బాధించబడుచున్నప్పుడు భగవానుడు ఓర్వలేడు. అతడు సకల కళ్యాణ గుణములు కలవాడు. కర్మాధీనమగు జన్మ లేనివాడు. అయినను తన అంశమగు బలరామునితో కూడా కర్మాధీనము గాని శరీరమునే తానే తనంత స్వీకరించినాడు.

అగ్ని గడ్డితో కూడినను కర్రతో కూడినను తన స్వభావమును ఎట్లు వీడదో అట్లు భగవానుడు వసుదేవుని ఇంట చెరసాలలో జన్మించుట మనుష్యత్వమును నటించుటకే వెంటనే కంసుని వలన భయపడినట్లు రేపళ్ళకు విడలుట కూడా ఒక నటనే. తరువాత కాళయవనునకు భయపడి మధురను వీడిపోవుట కూడా ఒక నటనమే. స్వామి, సర్వశక్తిమంతుడవైన నీవు మానవ మాత్రుని వలె చెరసాలలో పుట్టుట, భయపడి పారిపోవుట ఏమి అని నా మనసును బాధపడుచున్నది. ఆనాడు శ్రీకృష్ణ భగవానుడు తన తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులకు నమస్కరించి తండ్రీ అమ్మా కంసుని వలన భయపడుచు మీరు మధురలో ఉన్ననాడు నేను ఉండి మీకు సేవ చేయలేకపోతిని క్షమింపుడు అన్నాడు ఆ మాటలను తలంచుకొని నా మనస్సు ఇప్పుడు ఎంతో బాధపడుచున్నది. స్వామి, నీవా క్షమాపణ చెప్పవలసిన వాడవు. స్వామి, సామర్థ్యం ఆశ్చర్యకరమైనది. నీ కనుబొమ్మ కదలికను అనుసరించి యముడు ఈ భూభారమును తొలగించుండును. అట్టి సామర్థ్యము కలవాడు ఏమియు చేతకాని వాని వలె నటించినాడు ఏమి ఆశ్చర్యం. అప్పుడు పరమపురుషుని పద పద్మ పరాగమును ఒకనాడు వాసన చూసిన మానవుడు ఎవడు దానిని మరువగలడు? ఆనాడు రాజసూయ యాగములో స్వామి దివ్యశక్తిని మీరు చూచి ఉన్నారు కదా? తనను ద్వేషించి దూషించుచున్న శిశుపాలునకు యోగులు యోగాభ్యాసముచే సాధించవలసిన సిద్ధిని అనుగ్రహించుట ఎంత ఆశ్చర్యకరము. వాని ఎడబాటును ఎవరు ఓర్చి ఉండగలరు? ఆనాడు యుద్ధములో అర్జునుని రథమునకు సారధిగా ఉన్న శ్రీకృష్ణుని ముఖారవిందమును దర్శించుచు అర్జునుడితో యుద్ధము చేసిన రాజులు ఆ అర్జుని అస్త్రములచే కర్మలచే ఏర్పడిన శరీరములు పోయి పవిత్రతనంది ఆ భగవల్లోకమును పొందినారు కదా.

ఇట్లు మనుష్యుడిగా ఉండియు భూభారమును తొలగించి ఎందరికో మోక్షమును సంగి తన సర్వేస్వత్వమును ప్రకాశింపచేసిన లీలామానుషుడు భగవానుడు. అతనితో సమానులు కానీ అధికులు కానీ లేరు. అతడు ప్రకృతికి, జీవులకు, కాలమునకు కూడా నియామకుడు. మూడు లోకములకు తానే నియంత. సత్త రజస్తమస్సులను ప్రవర్తింపజేయువాడు అతడే. ఒకరి అధీనము లేని స్వతంత్రముగు ఐశ్వర్యము, వీర్యము, యశస్సు మొదలగు సంపద కలిగి సర్వ కామములు ఈడెలిన వాడతడు. ఎందరో చక్రవర్తులు తమ కిరీటముల చివరలతో స్వామి పాదపీఠమును తాకి సేవ చేసి పూజించినారు. అట్టివాడు. సార్వభౌమ సింహాసనముపై ఉగ్రశనుని కూర్చుండ చేసి తాను నిలిచి ఉండి ప్రభువు చిత్తగింపుడని విజ్ఞాపన వాక్యములు పలికినాడు. దీనిని ఆ భగవాను స్వరూపమునకు ఎరింగిన వారు ఎవరు సహించగలరు? ఒకనాడు వ్రజములోనుండగా పూతన స్థనముల యందు కాలకూట విషయమును ఉంచుకొని వచ్చి తల్లి వలె పాలిచ్చినది. అట్లు తన్ను చంపవలెనని వచ్చిన ఆమె స్వామి తల్లి వలె నటించినది కదా అని సంతోషించి పాలిచ్చిన తల్లికి ఏ పదము లభించునో ఆ పదవినే వసంగినాడు. అట్టి దయాళువుగా పరపురుషుని శరణు పొందెదను. మూడు లోకములకు అధిపతియగు భగవానుని యందు కోపముతో ఆవేశముతో ఎదిరించి ఎందరో తమ ప్రాణములను వదిలిరి. వారికి దయాళులగు ఆ భగవానుడు గరుడునిపై అధిరోగించి చక్రాయుధమును దాల్చిన దర్శనమును అనుగ్రహించినాడు. స్వామి లీలలు ఎంత విచిత్రములు. సర్వలోకేశ్వరుడగు స్వామి కంసుని చెరసాలలో వసుదేవునకు దేవకి యందు పుట్టినవాడు. జ్ఞాన శక్తి బలైశ్వర్యములో తోనిండిన భగవానుడు బ్రహ్మ ప్రార్థించినాడని ఈ భూమికి అసుర భారమును తొలగించుటకు సుఖమును కలిగించుటకు మనుజ బాలుడుగా పుట్టినాడు. వసుదేవుడు తానే కన్నతండ్రి అగుటచే కంసుని వలన కుమారునకు ఆపద కలుగునని భయపడినాడు. ఆ భయముచే తాను తన తేజస్సును మరుగుపరుచుకొని బలరామునితో కలిసి 11 సంవత్సరములు నందవ్రజంలో పెరిగినాడు. దూడలను మేపుచు దూడలను కాచెడి గోపు బాలులతో తుమ్మెదలు, పక్షులు వృద చేయుచున్న లతలతో వృక్షములతో నిండిన యమునా తీర వనమందు సర్వాంతర్యామిగు తాను సంచరించినాడు.

ఆ వనములో వసించి వారందరితో ఒకప్పుడు నవ్వుచు ఒకప్పుడు ఏడ్చుచు ఒకప్పుడు అందముగా బాలసింహం వలె జుత్తు విదల్చి ఇటునటు తిరుగుచు నవ్వుచు తన కుమార లీలలను దర్శింపచేసి ఆనందింపచేసినాడు. ఆ కంసుడు వంచకులగు కామ రూపమును దాల్చగలిగిన శకటాసురుని, ధేనుకాసురుని, అరిష్టాసురుని ఇంకను కొందరిని పంపినాడు. బాలుడు తన ఆట వస్తువులను ఇటునటు త్రోయుచు ఆడుచు బద్దలు కొట్టినట్లు వారిని అంతమొందించినాడు. కాళీయ మడుగులో విషము కలిపిన నీరు తాగి మూర్ఛనందిన గోవులను గోప బాలులను రక్షించి అందున్న కాళీయుని శిక్షించి వెడలగొట్టి గోవుల విషయం గోవులు విషము పోయిన ఆ జలములను తాగునట్లు చేసినాడు. ఇంద్రునకు యాగమును చేయవలెనని సంపాదించిన ద్రవ్యములను అర్థవంతముగా వినియోగపరుపవలెనని తలంచి నందుడు బ్రాహ్మణుల సాయముతో గోవర్ధనమునకు యాగము చేయునట్లు చేసినాడు. తన ఆరాధనమునకు విఘ్నము చేసినాడని ఇంద్రుడు కోపించి వర్షించగా అనుగ్రహముతో వర్షముతో చెదిరిన గో గోపాలునును గోవర్ధన పర్వతమును విలాసమును పడగొట్టిన పట్టుకొనిన గొడుగు వలె దాల్చి కాపాడినాడు. చరత్కాలములు చంద్రుని కిరణములతో రాత్రివేళ ఆకాశమంతయు ప్రకాశించుచుండగా గోపికల జీవితమునకు కృతార్ధతను కల్పింపదలచి గోపికల బృందముచే అలంకరించుచు అందరికీ అందరూగా అందరిలో తానుండి అలరింపచేసి ఆనందించినాడు. ఇట్లు ఎన్నో లీలలు. ఏమి ఆశ్చర్యం. నంద వ్రజములో బృందావనములో చేసిన లీలలే కాదు మధురకు వచ్చిన అచ్చట నుండి ద్వారకకు ఏగి భగవానుడు చేసిన లీలలను స్మరించిన మనసు నిలుచునా ఎంత ఆశ్చర్యజనకమైన లీలలు. 11 సంవత్సరములు నంద వ్రజములో బృందావనములో గడిపి తల్లిదండ్రులకు దేవకీ వసుదేవులకు సుఖమును కలిగించవలెనని సోదరుడితో మధురకు వచ్చినాడు. తనను చంపుటకు ఏర్పరిచిన రంగస్థలమున మల్లులతో పోరాడి వారిని చంపి విలాసముగా చూచి ఆనందింటకై ఎత్తైన మంచంపై కూర్చునిన కంసుని పడద్రోసి చంపినాడు

వేద వేద్యుడగు భగవానుడు శాంతిపనుడను గురువు వద్ద విద్యనును అభ్యసించినాడు. అతడు ఒక్కసారి చెప్పిన వేద వేదాంగములను సకల శాస్త్రములను సర్వ కళలను పూర్ణముగా గ్రహించి వారికి గురుదక్షిణగా వరమును వసంగి చనిపోయిన కుమారుని పంచజనుడను రాక్షసుని ఉరమున చీల్చి తెచ్చి వసంగినాడు. లక్ష్మితో సమానమగు రూపముగా రుక్మిణీ దేవి తనను పొందవలెనని కబురంపగా కుండిన దేశమునకు వెడలినయి స్వయంవరమున ఆహుతులగు శిశుపాలాది రాజులందరు చూచుండగా వారిని ధిక్కరించి ఆమెను చేపట్టెను. ఇంకా ముందు. కృష్ణుడు చేసిన లీలలను ఉద్ధవుడు విదురునికి ఏ రకంగా వినిపించాడో మరో పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. You are the one who resurrects me from sleep, the sustainer of all. You are the one who is the essence of all. I bow to you, the one who is the essence of all. Those who kill others, those who are the essence of the tongue, those who are the essence of the ears, salutations to the life force. Salutations to the Lord, to you. Oh Lord, You are the perfect being, the one who possesses all powers. You are entering my heart and being the inner light, you are reviving my words, hands, feet, ears, skin, and other senses that are sleeping deeply. Namaskar. Fourth Canto, Ninth Chapter, Sixth Prayer. Dear devotees, welcome to the second podcast in the third book of Srimad Bhagavata Tattva Deepika. Previously, Vidura, along with Uddhava, asked some questions about the well-being there. We are going to learn the answer that Uddhava is going to give to that today. Vidura, Srikrishna was swallowed by the serpent Kalama, the sun and the time. Our homes and towns are enveloped in gloom. What more can I do to please you? The world is very unfortunate It is a dream. The Yadavas, being with Krishna, did not understand that he was God. In the sea, the fish, around the boat that carries the sea across, it also thinks that it is a big fish like them. You don't know what a means to cross the sea, do you? The Yadavas, who were experts in understanding the minds of others, and who were not able to understand, were under the control of Krishna in one place, and even Sri Krishna thought that he was a being like them. Even the Ishupalas, being deluded by the illusion of the Lord, do not experience the Lord, but consider the objects of sound and other senses as if they are not to be experienced

They experienced. But some of us, who have minds dedicated to that God, did not be deluded by His words, but stood firm by the grace of God, not wavering. With the lavishness of the ascetic. Having made his form invisible to the sight of those who have eyes, born of man, he came down to his own world. The beauty of the Lord is beauty. He created that form to act like a human. It is astonishing that no one can recognize it as such by creating it with his divine power. It is astonishing. The pinnacle of beauty, the ornament of ornaments, that body. He took that body with him and went to his world. In those days, Yudhishthira, in the Rajasuya Yaga, after seeing the divine idol of the Lord, the people of the three worlds experienced that all the skill in the creation created by Brahma was in one place. The Gopa women who experienced the smile filled with love of that Lord, the Rasaleela, and the lustful glances, were very fortunate. All their sensory activities are with that Lord They are there. Therefore, they do not understand whether to do the things they should do or to refrain from doing the things they should not do. Unable to do any work, unable to give up, they lived by stopping all the activities of their senses to the Lord. The whole universe is the body of the Lord. And some are peaceful forms that are truthful, some are terrible forms that are excessively full of passion and desire. Even though these terrible forms are his own, when the forms that are predominantly of goodness, which are his own, are being tormented by him, the Lord cannot bear it. He is the one with all the auspicious qualities. One who is free from karmic dependence. However, even with his part, Balarama, being dependent on karma, accepted the body himself.

Even though Agni is made of grass and wood, just as he does not abandon his nature, similarly, just as he is born in the prison of Vasudeva's house and pretends to be human, similarly, even the separation from the bed of Ripadalu is also a pretense. Later, fearing Kalayavan, Madhura also left. It was also an act. Swami, O almighty one, my mind is troubled by the fact that you, being born in a prison like a mere human, are afraid and run away. That day, Sri Krishna Bhagavan, after saluting his parents, Devaki and Vasudeva, said, "Father, being afraid of Kamsa, I could not stay in Madhura and serve you. Please forgive me." Thinking of those words, my mind Now she's the one who's suffering. Swami, you are the one who should have apologized. Wow, that's an amazing feat, sir. Following the movement of your eyebrows, Yama removes this burden of the earth. What a wonder that someone with such abilities acted like someone incapable of doing anything! Then, who is the human who tasted the lotus nectar of the feet of the Supreme Being one day? Aanadu In the Rajasuya Yagna, you saw the divine power of the Lord, didn't you? How surprising is it that the yogis bestow the accomplishment that should be attained through the practice of yoga upon Shishupala, who hates and insults him? Who can bear his absence? In that day, the kings who fought with Arjuna, seeing the lotus-like face of Sri Krishna, who was the charioteer of Arjuna's chariot, went away, and that Bhagavala Lokam (the abode of God) attained purity You have received it, right?

Thus, being a human, removing the burden of the earth, attaining salvation for many, the divine being who illuminated his sovereignty, is the Lord. No one could rival him. He is the one who is the regulator of nature, living beings and time. He is the lord of the three worlds. He is the one who makes the powers of the Rajasic to function. One who possesses independence, wealth, virility, fame, and other riches without being under anyone's control, is the one who fulfills all desires. Many emperors touched the lotus feet of the Lord with the ends of their crowns, served and worshipped. Such a person. He made Ugrasena sit on the sovereign throne and, standing there, he uttered words of request that the Lord would grant his wish. Who can tolerate this, who has embraced the form of that Lord? Once upon a time, while in Vraja, Putana, keeping the matter of the calf in her breasts, came and breastfed like a mother. Thus, the one who came to kill him, she acted like a mother to the Swami, and being happy, he gave the same position to the mother who gave milk. So kind I will surrender to the other man. Many have given up their lives in anger and rage, opposing the Lord who is the lord of the three worlds. That compassionate God, seated on Garuda, holding the Chakra weapon, bestowed the vision. The wonders of God are so strange. The Lord of all the worlds, the one born to Vasudeva and Devaki in Kamsa's prison. The God who resided in the power of knowledge and wealth, Brahma prayed, and to remove the burden of demons from this earth, to bring happiness, he was born as a human child. Vasudeva, being his own father, feared that his son would be harmed by Kamsa. Due to that fear, he hid his radiance and together with Balarama, he grew up in Nandavrajam for 11 years. He wandered in the Yamuna forest, which was filled with trees, lata trees, and vines, with the lamas who grazed the calves and protected the calves, and with the birds and bees.

Residing in that forest, laughing with all of them once, crying once, and beautifully, like a lion cub, spreading its mane, wandering here and there, laughing, showing his cub's plays, and making them happy. That Kamsa sent Shakatasura, Dhenukasura, Arishtasura, and some others who were capable of assuming the form of a crocodile. The boy, throwing his toys here and there, played as if breaking them, and ended them all. Having drunk the poison-mixed water in the Kaliya pond, he saved the cows and calves that fainted, punished Kaliya who was there, removed him, and made the cows drink the water in which the poison was gone. Nandu, thinking that Indra should perform a Yagam (sacrifice) and that the wealth he had earned should be used economically, performed a Yagam for Govardhana with the help of Brahmins. Indra, angered that he had obstructed his worship, rained down with wrath. With grace, with rain, he protected the cowherds who were scattered, the Govardhana mountain, and the beauty, like an umbrella that held them. The phases of the moon While the night sky was illuminated with rays, he decorated the group of Gopikas, adorned with them, and shone in everyone, in everyone, and made everyone happy, intending to fulfill the lives of the Gopikas. Such are the plays of the world. What a surprise. Not only the Leelas performed in Nanda Vrajamu and Brundavanam, but also the Leelas performed by the Lord from the place where he came to Mathura to Dwaraka, remembering the mind, how wonderfully amazing are those Leelas. Having spent 11 years in Nanda Vrajam and Brundavan, he came to Madhurak with his brother to bring happiness to his parents, Devaki and Vasudeva. He fought with the wrestlers in the arena prepared for his murder, killed them, and, enjoying the spectacle, sat on a high cot and killed Kamsa

The Vedic knower, the Lord, is peaceful and has learned the knowledge from the Guru. He, having fully understood the Vedas, Vedangas, all the scriptures, and all the arts, as a Guru Dakshina, granted a boon and brought the dead son, the Panchajanuda, and the demon, torn from their chests. As Rukmini Devi, who was equal to Lakshmi, sent word that she should be obtained, they left for the Kundina country. While all the kings, including Shishupala, who were the sacrifices in the Swayamvara, were watching, she defied them and took her. Even further. Let's find out in another podcast how Uddhava narrated the Leelas performed by Krishna to Vidura. Salutations to Asmadguru, Jai Srimannarayana.