బ్రహ్మదేవుని తీవ్ర తపస్సు మరియు సృష్టి సామర్థ్యము
Brahma's Severe Penance & Creative Empowerment
శ్రీమద్భాగవతం తృతీయ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, వేద జ్ఞానమును పొందిన బ్రహ్మదేవుడు సృష్టి కార్యమునకు అర్హత సాధించుటకై తీవ్రమైన తపస్సు ఆచరించిన విధానమును తెలుసుకుంటాము. ఆ అచంచలమైన తపోనిష్ఠకు మెచ్చిన పరమాత్మ శ్రీహరి, బ్రహ్మదేవునికి సృష్టి సామర్థ్యమును మరియు దివ్యదృష్టిని ప్రసాదించెను. సర్వోన్నతుడైన సృష్టికర్త సైతం ఏ కార్యమునైనా ప్రారంభించుటకు ముందు భగవంతుని శరణు పొందవలెనని ఈ ఘట్టం మనకు గొప్ప సత్యమును బోధిస్తున్నది.
In this sacred episode from Canto 3 of Srimad Bhagavatham, we explore how Lord Brahma, after receiving the divine word of the Vedas, undertook intense penance to qualify himself for the great work of creation. Through his unwavering austerities, Brahma earned the grace and empowerment of the Supreme Lord Vishnu, who endowed him with the spiritual vision and creative potency necessary to manifest the universe. This episode reveals the profound truth that even the highest created being must surrender to and draw strength from the ultimate source, Sri Hari, before undertaking any great endeavor.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమో నమః క్లేశ వినాశనాయ నిరూపితోదార గుణాహ్వమాయ మనోవచో వేగ పురోజవాయ సర్వాక్ష మార్గైరగతాధ్వనే నమః అన్ని విధముల క్లేశములను నశింపచేయడానికి ఉదార గుణ నామములు కలవానిగా నిరూపించబడిన వానికి మనోవేగమున కంటే వాగ్వేగమున కంటే అధికమైన వేగము కలవానికి అన్ని విధముల ఇంద్రియముల మార్గముల ద్వారా చేరరాని దారికి గల దారి కలవానికి నమస్కారము. ఫోర్త్ కాంటో 30th చాప్టర్ 22 ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. తృతీయ స్కంధం 63వ భాగంలో స్వాగతం. 63వ క్షమించాలి 18వ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం విదుర మైత్రేయ సంవాదనలోంచి సృష్టి విషయాలు, ఇంద్రియ విషయాలు, ఋషుల గురు విషయాలు, ఋషుల పత్నుల విషయాలు, ఛందస్సు వివరాలు. ఎన్నో సృష్టి వివరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు స్వయంభవ మను యొక్క చరిత్ర గురించి అడుగుతున్నారు విదురుడు. మైత్రుడు ఇచ్చే సమాధానం మనం ఇవాళ అనుభవిద్దాం. స్వయంభువ మనువు తాను భార్యతో కూడా బ్రహ్మకు నమస్కారము చేసి ఇట్లు పలికెను. ఓ వేదగర్భా నీవే ఈ భూతములన్నిటికీ జన్మను వసంగినవాడవు పోషించువాడవు. మేము మా శక్తికి అనురూపములగు ఏ కర్మలను చేసి నీ సేవను చేసుకొనగలవారమగుదుము? ఏది మేము వనర్చిన నాడు మాకు ఈ లోకములో అంతట కీర్తి లభించి పరలోకమును పొందగలము? అట్టి సేవను మాకు ఆజ్ఞాపింపుము. ఇట్లు స్వయంభువ మను ప్రార్థింపగా. ఓ రాజా, నీ అంతట నీవు ఏదో ఒక వ్యాపారమును చేసి సేవ చేయవలెనని కోరుకుంటివి. ఇది నాకు చాలా ఆనందము కలిగించున్నది. బిడ్డలు తండ్రి ఆజ్ఞను నెరవేర్చుటయే తండ్రికి సేవ చేయుట.
నీవు నీతో సమానము గుణములు గల సంతానమును నీ భార్య యందు కని ఈ భూమిని ధర్మముగా పాలించు పాలించుచు పరమ పురుషుని ఆరాధింపుము ఇదే నీవు నాకు చేసేడి సేవ. ప్రజలను రక్షించినచో ప్రజాభర్తయగు భగవానుడు సంతుష్టి నందును. మనము ఏ కర్మ చేసినను భగవానునకు ప్రీతి కలిగింపనిచో అది నిరర్థకము. ఇట్లు బ్రహ్మ చెప్పగానే మనువు సర్వభూతములకు ఉండుటకు స్థానమైన భూమి మహాజలములో మునిగిపోయినది. దానిని పైకి తీసి సర్వ ప్రాణులు నిలిచి ఉండుటకు స్థానమును కల్పింపుము అప్పుడు నేను వారిని రక్షించెదను అని ప్రార్థించెను. ఇట్లు మనో విజ్ఞాపన చేయగానే పరమేష్టెగు చతుర్ముఖుడు జలములలో మునిగిన భూమిని ఎట్లు వెలికితీయవలెనని చాలా కాలం ఆలోచించెను. ప్రళయకాలమందలి జలమును నేను త్రాగి భూమిని వెలికి తీసితిని. అప్పుడు దేవతలు, మనుష్యులు, పితృ దేవతలు, ప్రాకటి జంతువులు, నాగములు, భూములు మొదలగు వాడినన్నిటినీ సృజించితిని. కానీ మరల జలము భూమిని ముంచివేసినది. ఇప్పుడు ఏమి చేయవలెను? ఏ భగవాను నన్ను సృష్టించినాడో అతడే నాకు ఈ భూమిని వెలికి తీసి అనుగ్రహించుకాక అని బ్రహ్మ భావించుచుండగా. ఆ బ్రహ్మ నాసికా రంధ్రము నుండి బొటనవేలు ప్రమాణము గల ఒక వరాహము వెలికి వచ్చెను. చతుర్ముఖుడు చూచుండగానే చిన్న పిల్లగానున్న ఆ వరాహము ఆకాశమునందు నిలిచి ఏనుగంత పెరిగెను. అది చూచు వారికి ఆశ్చర్యము కలిగించెను. మరీచి మొదలగు బ్రహ్మ మానస పుత్రులకు ప్రజాపతులు సనకాది కుమారులు మనువు ఆ వరాహమును చూచి అనేక విధములుగా తలంచుండిరి. ఆ పరమ వ్యోమమునందుండెడి శుద్ధ సత్వమయము పరబ్రహ్మయే ఈ సూకరమణిడి మిషతో నాసికా రంధ్రము నుండి వెలువడినదా? ఇది మొదట బొటనవేలు అంత భాగం ఉండెను. ఒక్క క్షణములో పెద్ద పాషాణమంత అయ్యెను. దీని స్వరూపమేమో ఎరుగ శక్యము కాకున్నది. ఇట్లు బ్రహ్మ మనువు మొదలగు వారితో ఆలోచించుండగానే భగవానుడు యజ్ఞ పురుషుడు పెద్ద కొండ వలె వరాహ రూపం నిలిచి ఇట్లు పలికెను. తన గర్జన చేయ దిక్కులను నింపించు నింపుచు అచట నిలిచి మరీచి మొదలగు బ్రాహ్మణులను బ్రహ్మను ఆనందింపచేసెను. ఆ వరాహము యొక్క గురగుర ధ్వనిని విని జనస్తపస్సత్య లోకములు నివాసులందరు పవిత్రములగు మూడు వేదములలోని
సూక్తులతో స్తుతించిరి. వేదములలో ప్రతిపాదించబడిన వేద మంత్రములచే ఆచరింపబడు యజ్ఞమే తన మూర్తిగా గల భగవానుడు తన గుణములను ప్రతిపాదించిన వేదమును విని మరల గర్జించి బ్రహ్మాది దేవతల శ్రేయస్సు కొరకు జలములలో ప్రవేశించెను. అప్పుడు ఆ యజ్ఞ వరాహము ఆకాశమందు సంచరించుచు తోక పైకెత్తుకొని పరుషములు గలగు తన జూలును ఇరునడు కదలుచుండెను. దాని వెంట్రుకలు, చర్మము చాలా దళసరి ఉండెను. ఆకాశముపై ఉన్న మేఘములను తన గిట్టలతో చిందర వందర చేయుచుండెను. తెల్లని కోరలు కలిగి మెరయుచున్న చూపు గలదై భూమిని ఉద్ధరించుటకు వరాహ రూపములో వచ్చి ఉండెను. యజ్ఞము చేతన శరీర అవయయములుగా కలదై యుండియు ముక్కుతో భూమి ఎక్కడ ఉన్నదో అని వాసన చూచుచుండెను. భయంకరము కోరలతో ఇటునటు తిరుగుచు త్రిప్పుచు తన చూపులతో స్తోత్రము చేయి విప్రులను చూచుచు జలములలో ప్రవేశించెను. సముద్ర జలములలో వజ్రం పడినట్లు ధ్వని ఆయెను. సముద్రము లోపలి భాగమంతయు కలత చెందెను. పెద్ద పెద్ద కిరటములు ఎగిరి పడెను. సముద్రము యజ్ఞేశ్వరా నన్ను కాపాడుము అని చేతులెత్తి మొరపెట్టుచున్నట్లు కనపడెను. ఆ వరాహమునకు మూపుపై మూడు చారలు ఉండెను. అవతలి ఎల్లలేని ఆ జలములను తన గిట్టలతో చిమ్ముటచే జలములను ఇటునటు చీల్చుకొని పోవుచుండెను. పూర్వ ప్రళయ సమయమున జలములలో శయనించవలెనని జీవులనందరును తన గర్భములో ధరించిన భూమిని రసాతలమునందు చూచెను. ఈ భూమిని ప్రళయములో భగవానుడు ఇతడే తన జఠరములో ధరించెను. తన కూరతో రసాతలమునకు అంటుకుపోయిన భూమిని పెకిలించెను. పెకిలించి వెలికి తీయుచుండగా సహించుటకు శక్యము గాని పరాక్రమము గల హిరణ్యాక్షుడు అని ఆది దైత్యుడు. తీవ్రమగు పగలగల పగగలవాడై గదను పట్టుకొని వరాహ రూపియగు భగవానుడిపై వచ్చి పడెను. తనను అడ్డుచున్న ఆ హిరణ్యాక్షుని సింహము ఏనుగు చంపినట్లు సంహరించెను. ఏనుగు తన దంతములతో కుండ చెరెలను కొట్టి గండస్థలమున గైరికాది ధాతువులను పూసి కొనినట్లు హిరణ్యాక్షుని శరీరము నుండి వెలుబడిన రక్తము రక్తమును వరాహము ఒంటి నిండా పూసుకొని ఉండెను. భగవానుడు తమాలము వలె నీలమగు వర్ణము గలవాడై. తెల్లనైన కోర చివరి భాగముతో భూమిని పైకెత్తుచుండెను. ఆ సన్నివేశమును బ్రహ్మ మొదలగు వారు చూచి వైదిక సూక్తములతో స్తోత్రము చేయుచుండిరి.
యజ్ఞ భావన నీవే యజ్ఞమును నెరవేర్చువాడవు. యజ్ఞములచే ఆరాధింపబడువాడవు. మూడు వేదములు నీ శరీరము నీ రోమరంధ్రములలో సముద్రములు అణిగి ఉన్నవి. అట్టి నీవు సర్వోత్కర్షతో వర్ధిల్లువుడవు కాక. సర్వ జగత్కారణమగు నీవు జగమును ఉద్ధరించుటకు సూకర రూపమును దాల్చితివి. నీకు నమస్కారము. ఏ దేవా, నీ శరీరము యజ్ఞము. దీనిని పాపములతో కూడిన మనసు గలవారు, యోగులు కాని వారు దర్శింపజాలరు. నీ శరీరము అప్రాకృతము, పంచోపనిషణ్మయమని భావింతురు. ఈ వేదములన్నియు నీ చర్మమునందు ఇమిడి ఉన్నాయి. యజ్ఞమున ఉపయోగించే దర్భలు నీ రోమములందు అణిగి ఉన్నవి. హోమము చేయు నేయి నీ దృష్టియందు ఉన్నది. నీ నాలుగు పాదముల యందు చాతుర్హోత్రం అనబడే కర్మ వెలై ఉన్నది. హోమము చేయు శృక్ నీ తుండమునందు ఉన్నది. శ్రువము నీ నాసిక యందున్నది. హవిస్సును భక్షించు పాత్రయగు ఇడ నీ ఉదరమునందుంది. చమసములనెడి సోమపాత్రలు నీ కణరంధ్రమునందున్నవి. బ్రహ్మ భాగమున ఉంచెడి పాత్రయగు పాశ్రితము నీ ముఖమందున్నది. సోమమును గ్రహించెడి గ్రహములనెడి పాత్రలు నీ నోటి భాగమందున్నవి. అగ్నిహోత్రమనబడెడి కర్మయే నీ నమలుట అయి ఉన్నది. ఉపసదమలనడి ఇష్టి నీ మెడయై ఉన్నది. ఆరంభమందు చేసెడి ప్రాణ ప్రాయనిష్టి, అంతమందు చేసెడి ఉదయేష్టి అనునవి రెండును నీ కొరలుగా ఉన్నవి. ప్రవర్గ్యము నీ జిహ్వముగా ఉన్నది. హోము చేయుటకు ఉపయోగింపబడని సభ్యమనడి అగ్ని, అవసద్యమనడి ఔపాసనాగ్ని కృతురూపుడవగు నీ శిరస్సు అయి ఉన్నది. నీ ప్రాణములే చయనములై ఉన్నవి సోమము నీ రేతస్సు ప్రాతః శ్రవణము మొదలగునవి నీ అవస్థ భేదములు అగ్నిష్టోమము అత్యగ్నిష్టోమము ఉక్త్యము షోడశి, వాజపేయము, అతిరాత్రము, అప్తోర్యాము అనేటి ఏడు సంస్థాభేదములు నీ శరీరమందలి చర్మము, మాంసము మొదలగు ఏడు ధాతువులుగా ఉన్నవి.
అనేకమంది యజమానులతో చేయబడి సత్రయాగములన్నియు నీ శరీర సంధులై ఉన్నవి. నీవు సర్వ యజ్ఞములు, సర్వ క్రతువులు శరీరముగా కలవాడవే ఉన్నావు. సోమరసమును ఉపయోగించేటివి ఉపయోగించేటివి యజ్ఞములు, సోమరసము ఉపయోగం లేనివి క్రతువులు. అవి రెండును నీ రూపములే. యజమానుడు చే ఇష్టి నీ శరీరములోని మధ్యభాగమైనది. ఇట్లు వేదములోని పూర్వ భాగములోని యజ్ఞములు ఆ యజ్ఞములోని అవయవములు భగవాను శరీరముగా స్తుతించిరి. సమస్తమైన మంత్రములు, దేవతలు, ద్రవ్యములు నీవే అయి ఉన్నావు. సర్వక్రతు స్వరూపుడవు నీవు. అందరి రహస్యములన్నియు నీ శరీరము. ఇట్లు పూర్వభాగమంతయు యజ్ఞ వరాహం యొక్క రూపమని వర్ణించి వేదములోని భాగము కూడా ఆ భగవత్ స్వరూపమే అని స్తుతిస్తున్నారు. ఇంకా ఏమని స్తుతిస్తున్నారో మనము బ్రహ్మ దేవతనందరు చేసే స్తుతిని మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Guru. Salutations, salutations. To destroy suffering, to uplift, to bestow virtues, to speed up the mind and speech, to remove obstacles from all paths, salutations. To destroy all kinds of suffering, as one with generous qualities Salutations to the one who has speed greater than the speed of the mind and the speed of speech, to the one who has a path to the path that cannot be reached through all the senses. Fourth Canto 30th Chapter 22 Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to Part 63 of the Third Canto. Welcome to episode 63 of the 18th Podcast. Until now, from the conversation of Vidura Maitreya, creation matters, sensory matters, matters of the guru of sages, matters of the wives of sages, details of prosody. We have learned many details about the creation. Now Vidura is asking about the history of Swayambhava. Let us experience the answer that the friend gives us today. Svayambhuva Manu, along with his wife, offered salutations to Brahma and spoke thus. Oh, Vedagarbha, you are the birth of all these beings The one who has the house, the one who nurtures. What actions can we perform that are in accordance with our abilities, so that we may serve you? When we are created, will we receive fame throughout this world and attain paradise? Command us to do so. Thus, when the self-existent man prayed. Oh king, you wished to do some business on your own and serve. This is something that really excites me. Children obeying their fathers is serving their fathers.
You, with your wife, see offspring with equal qualities, and rule this earth righteously, and worship the Supreme Being. This is the service you ask me to do. If he protects the people, the Lord, who is the husband of the people, is pleased. Whatever karma we perform, if it does not please God, it is meaningless. Thus, as soon as Brahma spoke, the earth, the abode of all beings, was submerged in the great water. Pluck it up and create a place for all creatures to live, then I will protect them, she prayed. Thus, as soon as the request was made, the supreme being, the four-faced one, pondered for a long time how to bring out the earth that had been submerged in the waters. I drank the waters of the time of destruction and brought up the earth. Then I created gods, humans, ancestral gods, wild animals, serpents, lands, and all that is used. But again the waters covered the land. What should I do now? Oh God, the one who created me, may he bring this earth to me and bless me, says Brahma While contemplating, a boar with a thumb-sized nose appeared from the nostrils of Brahma. As the four-faced one watched, that boar, which was a small child, stood in the sky and grew as big as an elephant. It surprised everyone who saw it. The Prajapatis, the sons of Brahma, the sons of Manasa, and Manu, seeing that boar, were thinking in many ways. Is it pure, Sattvic, and supreme Brahman that resides in that supreme space? Did it emerge from the nostrils with this pigment? It was originally the part of the thumb. In one fleeting moment, he had become as big as a stone. Its form is unknown. Thus, while Brahma, Manu, and others were contemplating, the Lord, the Yagnya Purusha, stood like a large mountain in the form of a boar and spoke thus. Filling the directions to his roar, he stood there and made the Brahmins and Brahma happy. Hearing the roaring sound of that boar, all the inhabitants of the three sacred Vedas, which are sacred, of the world of truth and righteousness
Praised with rhymes. The Yagnya performed by the Vedas, which is the Veda mantra propounded in the Vedas, the Lord who is his idol, hearing the Veda that propounded his qualities, roared again and entered the waters for the welfare of Brahma and other gods. Then that Yagnya Varaha, while moving in the sky, lifting its tail up, with its hoods, was moving with its hoods, and its tail was moving. It had a very thick fur and skin. He was scattering the clouds above the sky with his wings. Having white tusks and a radiant gaze, it came in the form of a boar to save the earth. The yajna, being a conscious body and limb, was smelling the earth with its nose, wondering where it was. Frightening, with tusks, turning here and there, floundering, with his eyes, praising, looking at the Brahmins, he entered into the waters. The sound of a diamond falling into the sea water. The entire inside of the sea was disturbed. Big big gongs flew. The ocean appeared to be pleading, raising its hands and saying, "Yagneshwara, protect me." The boar had three stripes on its head. The other unending waters, by splashing them with his hips, were tearing the waters apart. At the time of the primeval deluge, all the living beings saw the earth, which was held in his womb, in the abyss of the waters. In the deluge, the Lord himself wore this earth in his stomach. He uprooted the land that had stuck to the earth with its curse, and with his curse. While being uprooted and pulled out, the first demon, Hiranyaksha, who had the strength to endure but was also mighty, said. Being a terrible, fierce, and fiery being, he seized the mace and fell upon the Varaha-like Lord. He killed the lion of Hiranyaksha, who was blocking him, just as a lion kills an elephant. Like an elephant, with its tusks, breaking the pot's edges, and applying the clay and other materials in the Gandhasthala, the blood that emerged from Hiranyaksha's body, the Varaha was covered in blood all over its body. The Lord is like a blue color, having a color like a dark blue. The white-clothed corpse was raising the earth with its last part. Brahma and others saw that scene and praised it with Vedic hymns They were doing.
You are the Yagnya Bhavana, you are the one who fulfills the Yagnya. You are worshipped through yajnas. The three Vedas are like oceans hidden in the pores of your body. Instead of you being so full of pride. You, the cause of all the world, have assumed the form of a pig to uplift the world. Namaskar. Oh God, your body is a sacrifice. Those who have a sinful mind and are not yogis cannot see this. They consider your body to be unmanifest, panchopanishadmayam. These Vedas are all embedded in your skin. The darbha grass used in the yajna is contained within your hair. The ghee used for the homam is in your sight. In your four feet, there is a karmic stream called Chaturhothram. The offering is in the form of a trident of Shri Krishna. The sound is in your nose. Here is the vessel that consumes the offering, in your belly. The Somapatra of Chamasamula is in your veins. The vessel that holds the Brahma part is dependent on your face. The vessels that receive the moon are in the part of your mouth. The action that is called Agnihotra is yours It's been swallowed. The sub-sadamarana is your neck. The life-giving breath at the beginning, and the rising sun at the end, both are for your sake. The glory is your tongue. The fire that is not used for cooking, the fire of the house, the fire of the offering, is your head, which is the form of the sacrifice. Your life is like a sacrifice, your semen is morning, your hearing is morning, and so on are your state differences. Agnishtoma, Atyagnishtoma, Uktyam, Shodashi, Vajapeya, Atiratram, The seven types of body parts called 'Aptoryamu' are the skin, flesh, and other seven elements in your body.
Many are the sacrifices made with many masters, all the sacrifices are your body joints. You are the one who has all the sacrifices and all the rituals as a body. Those that use Somaras are Yagnyas, and those that do not use Somaras are Kratus. Those two are your forms. The center of your body is your ayamaka. Thus, the sacrifices in the former part of the Vedas, and the organs in that sacrifice, were praised as the body of the Lord. You are all the mantras, the gods, and the wealth. You are the embodiment of Sarvakratus. Your body is the key to everyone's secrets. Thus, describing the entire eastern part as the form of Yagnya Varaha, and also praising that part of the Vedas as the form of that Bhagavat. Let's find out in another podcast what else they are praising in the praise done by Brahma Devatanandar. Jai Srimannarayana. Salutations to the Gurus