దశమ స్కంధం ప్రారంభం: శ్రీకృష్ణ లీలా పరిచయం
Srimad Bhagavatam Dashama Skandha: Introduction to Krishna's Leelas
ఈ ప్రవచనంలో శ్రీమద్భాగవత దశమ స్కంధం ప్రారంభమవుతూ, భాగవతంలోని పది విషయాలు—సర్గ, విసర్గ, స్థాన, పోషణ, ఊతి, మన్వంతర, అవతార కథలు, నిరోధ, ముక్తి, ఆశ్రయం—సంక్షిప్తంగా వివరించబడ్డాయి. పదవదైన ఆశ్రయ తత్వమే శ్రీకృష్ణ భగవానుడని నిరూపించుటకు దశమ స్కంధం ఆరంభమవుతున్నదని చెప్పబడింది. పరీక్షిత్తు శుకయోగిని కోరగా, బలరాముని దేవకీ గర్భవాసం, అశ్వత్థామ అస్త్రం నుండి గర్భస్థుడైన పరీక్షిత్తును భగవానుడు రక్షించిన వృత్తాంతం ప్రస్తావించబడింది. అసుర భారంతో పీడిత భూమి గోవు రూపంలో బ్రహ్మను శరణు వేడగా, బ్రహ్మ దేవతలతో క్షీరసాగరానికేగి విష్ణువును స్తుతించగా, భగవానుడు యదువంశంలో సాక్షాత్తు మానవ రూపంలో అవతరిస్తానని వాగ్దానం చేశాడు.
This discourse marks the beginning of the Tenth Canto of Srimad Bhagavatam, focusing on Sri Krishna's divine pastimes. The speaker explains the ten subjects of the Bhagavatam—creation, secondary creation, sustenance, protection, karma, Manvantaras, avatara stories, dissolution, liberation, and the ultimate refuge (Ashraya)—with the Tenth Canto dedicated to establishing Sri Krishna as that supreme Ashraya. Parikshit requests Shuka Yogindra to narrate Krishna's birth, including how Balarama appeared in Devaki's womb and how Krishna protected Parikshit in the womb from Ashvatthama's weapon. The canto opens with the Earth, burdened by demonic kings, approaching Brahma in the form of a cow, leading Brahma and the gods to pray at the Kshirasagara, where Vishnu instructs them to take birth in the Yadu dynasty as He Himself will incarnate directly in human form.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః కాంతార పాదపానాం యథా ఫలం మానుషైరననుభోగ్యం ఏవ మనారీష్వార్తాః మనసాప్యార్వైరననుభోగ్యాః అడవి చెట్ల ఫలాలను మానవులను మానవులు అనుభవింపలేరు. అట్లాగే అసత్పురుషుల ధనాన్ని మంచివారు మనసులోనూ వాంచింపజాలరు. ఆర్యోక్తి 21. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక దశమ స్కంధం ప్రథమ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ఆచార్య అనుగ్రహం వలన పెరుమాళ కృప వలన తొమ్మిది స్కంధాలు పూర్తి చేసుకుని మనం ఈరోజు పదవ స్కంధంలో అడుగు పెడుతున్నాం. విశేషంగా పదో స్కంధంలో మనము శ్రీకృష్ణుని యొక్క లీలలు, శ్రీకృష్ణుని చరిత్రను మనం తెలుసుకోబోతాం. శుకయోగింద్రుడు చెప్పిన వంశ విస్తరము విని పరీక్షిత్తు ధర్మశీలుడగు యదువంశమున భూత భావనుడగు భగవానుడు అవతరించి చేసిన లీలలను వివరంగము చెప్పదగునని ప్రార్థించెను. భాగవతమున శ్రీకృష్ణ చరితమే ప్రధానం. ఇందు 10 విషయములు నిరూపించబడినవి. ఈ పదింటి వివరణమే భాగవతమని రెండవ స్కంధమున శుకుడు చెప్పినాడు. ఒకటి సర్గము, రెండు విసర్గము, మూడు స్థానము, నాలుగు శోషణము, పోషణము, ఐదు ఊతలు. ఆరు మన్వంతర వివరణము, ఏడు అవతార కథలు, ఎనిమిది నిరోధము, తొమ్మిది ముక్తి, పది ఆశ్రయం. మన మనస్సు ఏదో ఒక విషయమును ఆలంబనముగా చేసుకుని సాగుచుండును. ఆ వస్తువు శుభమైనది కావలెను.
రజస్తమస్సులు కలదైనచో దానిని భావించడి మనసునకు రజస్తమస్సులు అంటును. అందుచే సర్వ జగత్ కారణమైన సర్వ జగత్ రక్షణమైన సులభమైన సుందరమైన భగవత్ తత్వమును మనసునకు ఆశ్రయముగా కల్పించవలెను. అప్పుడు మనసున అంటిన దుర్వాసనలు తొలగి మనసు విష్ణుమయమగును. ఆ ఆలంబనమగు విషయమెట్టిదో తొమ్మిదవ స్కంధంలో నిరూపించి పదవ స్కంధమున మనసునకు ఆశ్రయముగా శ్రీకృష్ణ కథా ప్రసంగమును శుఖయోగిందులు చేయుచున్నారు. సకల భూత సృష్టి వివరణము సర్గము. అది తెలిసిన నాడు వాసుదేవుడే అన్నిటికీ మూలమని తెలియును. చతుర్ముఖ బ్రహ్మ నుండి సత్తరజస్తమో గుణముల వైషమ్యముచే సాగడి వ్యష్టి సృష్టి విసర్గము. వైకుంఠవాసుడగు శ్రీమన్నారాయణుని విజయము స్థితి అనబడును. భగవానుడు చేయు అనుగ్రహణము అనుగ్రహము పోషణము. ఆయా కర్మ వాసనలు ఊతలు ఊతులు అనబడును. మన్వంతరములలో ధర్మ ప్రవర్తనము ఎట్లు జరిగినదో వివరించుట మన్వంతర కథ. శ్రీహరి యొక్క అవతారముల చరిత్రను ఆయన భక్తుల చరిత్రను వివరించుట ఈశాను కథ. ప్రళయమున సకల విశ్వము స్థూల రూపమును విడిచి సూక్ష్మ రూపముతో పరమాత్మతో చేరి యుండుట నిరోధము. ఆత్మకు ప్రకృతి సంబంధముచే కలిగిన అన్యదా రూపము పోయి సస్వరూపమును పొంది ఉందుట ముక్తి. వీటిని ఎరింగినచో వీటన్నిటికీ ఆధారమైన భగవాను స్వరూపము స్పష్టముగా గోచరించును. అట్టిది మన కొరకై ప్రకటముగు రూపముతో ఈ లోకమునకు దిగి వచ్చినది కారణ తత్వమే శ్రీకృష్ణ భగవానుడు. అతనిని మన మనసున ఆశ్రయముగా ఉంచుకొనవలెను. ఇది భాగవత ప్రయోజనము. ఇదే భక్తి. భక్తిని కలిగించునది భాగవతం. భక్తియే బంధ ముక్తి హేతువు. భక్తియే మహానంద ప్రాప్తికి సాధనము. ఇంతవరకు తొమ్మిదింటి లక్షణములను వివరించి పదవదియగు ఆశ్రయము యొక్క స్వరూప స్వభావములను వివరించుటకు దశమ స్కంధము ఆరంభించుచున్నారు. భగవానుడు ఉత్తమ శ్లోకుడు. మనచే కీర్తింపదగినవాడు. ఏ విషయమునందు తృష్ణ లేని వారు కూడా భగవత్ గుణములనే గానము చేయుచుందురు.
భగవత్ కథా గానం వలన జన్మ లేకుండా చేయు ఔషధము. ఔషధములలోనున్న వెగటుతనం ఉండదు. చెవికి మనసుకు కూడా ఇంపుగా ఉండును. అట్టి భగవద్గుణ శ్రవణమునకు పశుఘ్నుడు అంటే కసాయి వాడు తప్ప ఎవడు విసుగు చెందును? ఇతడు అపశఘ్నుడు అని పదచ్చేదము చేసి వేరొక అర్థమును కూడా చెప్పవచ్చును. కసాయి వాని కంటే నీచుడు. ఆత్మ నాశనము చేసుకునువాడు. ఆత్మకు శోకము లేదు. కావున దానిని అపశుక్ అందురు. అట్టి శోక రహిత స్థితిలో ఉండవలసిన ఆత్మను జ్ఞానహీనులై శోకము గలదానిగా భావించు సంసారులు. ఆత్మహత్య చేసుకొనడి అపశఘ్నులు. వారే భగవద్గుణ శ్రవణమును ఒల్లరు కానీ ఇంకెవరు ఒల్లకుందురు? కావున శ్రీకృష్ణ కథను నాకు వివరింపుముడని శుఖయోగిందుడు పరీక్షిత్తును కోరినాడు. శ్రీకృష్ణ భగవానుని నౌకగా ఆశ్రయించి మా తాతలు ధర్మరాజాదులు కౌరవ సైన్యమనడి సముద్రమును సులభముగా దాటిరి. ఆ కౌరవ సైన్య సాగరము భీష్మాది మహాయోధుల నెడి తిమింగములతో నిండినది. దానిని దాటుటకు భగవానుడే మా వారికి ఆనాడు సాధనమాయెను. మా తాతలను కాపాడుటయే కాదు, మా తల్లి కడుపులో నేను ఉండగా. కౌరవ పాండవ వంశములకు బీజముగా మిగిలిన నన్ను అశ్వద్ధామ అస్త్రము దహింప చూచినది. కానీ భగవానుడు మా అమ్మ శరణాగతి చేయగా చక్రమును దాల్చి గర్భములోనున్న నన్ను కాపాడెను. సకల ప్రాణిజాతం యొక్క శరీరములోనున్న ఆత్మలే తన శరీరముగా నిలచి లోకమును నిలుపుచున్నవాడు వెలుపల కాల శరీరకుడై మృత్యువును కల్పించుచున్నవాడు మాయా మనుజుడిగా అవతరించిన శ్రీకృష్ణ భగవానుడే. వాని లీలలను వివరింపుడు. బలరాముడు రోహిణి కుమారుడు కదా, అతడు దేవకీ దేవి గర్భమున ఉండుట ఎట్లు సంభవించినది? భగవానుడు వసుదేవుని గృహము నుండి వ్రేపల్లెకు ఎందుకు వెడలెను? వ్రేపల్లెలో మధురా నీ బుద్ధి మంచి అధ్యవసాయముతో కూడి ఉన్నది. వాసుదేవ కథయందు నిష్టతో కూడిన ప్రీతి కలుగుట మహా భాగ్యం.
వాసుదేవ కథ వినవలెనని అడిగిన వానిని చెప్పిన వానిని వినువారిని కూడా గంగాజలం వలె పవిత్రము చేయును. అసుర సంపద నిండి మదించిన రాజులు వందల కొలది భూమిని ఆక్రమించి పరిపాలించుచుండిరి. భూమి అసుర భారము భరింపలేక గోవు రూపమున బ్రహ్మ వద్దకేగి స్తోత్రము చేసి తనకు కలిగిన ఆపదను నివేదించెను. బ్రహ్మ దానిని ఎరింగి దేవతలతో రుద్రునితో కలిసి క్షీర సాగరమునకేగెను. దేవదేవుని జగన్నాథుని పురుష సూక్తముతో స్తుతించెను. దానిచే సంతసించి బ్రహ్మకు ధ్యానములో అశరీర వాణి వినిపింపజేసెను. భగవానుడు అనిరుద్ధ రూపమున లోక రక్షణకు క్షీర సాగరమున శయనించి ఉండెను. అతడికి బ్రహ్మ రుద్రాదులు కూడా చేరలేరు. ధ్యానములో దర్శించి అనుగ్రహముచే అతడు పలికిన పలుకులు విందురు. బ్రహ్మ విని దేవతలకు ఇట్లు చెప్పెను. భగవానుడు ఇట్లు చెప్పుచున్నాడు వినుడు. భూమిపై అసుర సంపద నాకు తెలియును. దానిని ఈశ్వరేశ్వరుడనగు నేను అవతరించి నా శరీర కాలముచే అంతమొందించగలెను. ఈలోగా మీరు యదువంశమున మీ అంశలతో జనింపుడు. నేను జీవులలో ఆవేశించుట గానీ వారిని నా శరీరముగా స్వీకరించుట గానీ చేయక సాక్షాత్తు మనుష్య రూపమును దాల్చి జన్మింతును. దేవతా స్త్రీలు కూడా గోపికలుగా జనింతురు గాక. వాసుదేవుని అంశమగు అనంతుడు నాకంటే ముందుగా కర్మవశుడు గాక శ్రీహరికి ప్రియము నొందించుటకై నాకు అగ్రజుడిగా జన్మించును. మాయాధిష్టాన దేవత నాచే ఆజ్ఞాపింపబడి ప్రభువునగు నా కార్యము నిర్వహించుటకు జన్మించును అని విష్ణువు చెప్పిన వాక్యములను బ్రహ్మ దేవతలకు వినిపించగా వారందరూ తమ తమ స్థానములకు వెడలిరి. బ్రహ్మ భూమిని ఓదార్చి తన లోకమును తానేగెను. ఇంతటితో మనకు చిన్న ఉపోద్ఘాతం మనకు పూర్తయింది. దీని తర్వాత భాగాన్ని మనం మరొక పాడ్కాస్ట్లో.
తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.
Jai Srimannarayana, salutations to the Guru. The fruits of drinking the water of the lotus feet are not to be enjoyed by humans. The fruits of the forest trees are not to be enjoyed by humans. Humans cannot enjoy the fruits of the forest trees. Similarly, good people cannot desire the wealth of evil people in their hearts. Aarooki 21. Devotees of God, welcome to the first podcast of the tenth book of Srimad Bhagavata Tattva Deepika. Until now, by the grace of Acharya, by the grace of Perumal, having completed nine cantos, we are stepping into the tenth canto today. Especially in the tenth canto, we are going to learn about the pastimes of Sri Krishna, the history of Sri Krishna. Parikshit, having heard the lineage expansion told by Shukayogindra, prayed that the divine being who was the embodiment of Bhuta in the Yadu dynasty, who was righteous, should be described in detail. The Bhagavata Purana is the primary source of the story of Lord Krishna. These 10 points have been proven. The second book, Shuka said that the explanation of these ten is the Bhagavata. One is Sargam, two is Visargam, three is Sthana, four is Shoshana, Poshana, five is Utha. Six, the explanation of the Manvantara; seven, the stories of the incarnations; eight, the obstruction; nine, liberation; ten, shelter. Our mind is constantly relying on something. The item will be a good one.
If there are no Rajasic qualities, then Rajasic qualities will cling to the mind. Therefore, the simple and beautiful divine essence that is the cause of the entire universe and the protector of the entire universe should be established as a refuge in the mind. Then, the bad feelings that have touched the mind will be removed, and the mind will become Vishnu-like. What is the subject of that support, having proved it in the ninth Skandha, in the tenth Skandha, as a refuge to the mind, Srikrishna's story is being narrated in Sukha Yogindas. The explanation of all the elements of creation is the creation. When that is known, it is understood that Vasudeva is the root of everything. From the four-faced Brahma, due to the difference in the qualities of Sattarajastoma, the separation of the individual creation. The victory and status of Srimannarayana, who is the abode of Vaikuntha, is being discussed. The grace of God, the grace of blessing, the nourishment. Those karmic residues are called oopas or oopas. The Manvantara story describes how Dharma's conduct took place in the Manvantaras. The story of Ishanu is to describe the history of the incarnations of Srihari and the history of his devotees. In the deluge, all the universe, leaving the gross form, joins the Supreme Soul in the subtle form. Moksha is the state of being free from the other forms that are caused by the nature of the soul and attaining the true form. If these are erased, the form of the Lord, which is the basis for all of these, will clearly be visible. That is, for us, having descended into this world in the form of a manifestation, the cause of that is Sri Krishna Bhagavan. We should keep him in our hearts as a refuge. It is for Bhagavatam's benefit. This is the devotion. The Bhagavatam is the one which inspires devotion. Devotion is the means to liberation. Devotion is the means to the Great Bliss. Until now, explaining the characteristics of nine, the tenth, the tenth Skandha is beginning to explain the nature of the shelter. Bhagwan is the best singer. Our Lord is ever-Merciful, Who forgives upon the believers. Those who are without thirst for anything else also sing the praises of the Lord's virtues.
The Bhagavata Katha is a panacea for those who have not been born. There is no bitterness in the medicines. It's pleasing to the ears and also to the mind. Who, except for a butcher, would be bored of listening to such divine qualities? He is inauspicious, and by analyzing the word, another meaning can also be given. A butcher is a butcher. Self-destructive. The soul has no sorrow. Therefore, they call it inauspicious. Those worldly people who consider the soul that should be in such a state of unaffected sorrow as being affected by sorrow because of being ignorant. Suicide is never a good idea. They do not listen to the divine qualities, but who else would? Therefore, Shukayojinudu requested Parikshit to explain the story of Sri Krishna to him. Taking refuge in Sri Krishna Bhagavan, our ancestors, including Dharmaraja, easily crossed the ocean of the Kaurava army. That Kaurava army was filled with whales, the great warriors like Bhishma. To overcome that, God himself became the means for our people that day. Not only my grandparents are saved, I was also born in my mother's womb. As the seed of the Kaurava and Pandava dynasties The remaining Ashwatthama tried to burn me. But the Lord, as my mother surrendered, took the chakra and protected me in the womb. The one who is the soul residing in the body of all living beings, who stands as his body and sustains the world, who is the external body of time, who creates death, Sri Krishna Bhagavan, who incarnated as Maya Manujudu. Describe his miracles. Balarama is the son of Rohini, right? How did he happen to be in the womb of Devaki Devi? Why did the Lord leave Vasudeva's house and go to Vrepalle? In Vrepalle, Madhura's intellect is accompanied by good study habits. It is a great fortune to have such a devotion with sincerity in the story of Vasudeva.
He who asks to hear the story of Vasudeva, he who tells it, and he who listens to it, will purify them like the water of the Ganges. The kings, intoxicated by the wealth of demons, were occupying and ruling hundreds of lands. Unable to bear the burden of the earth's demonic weight, she went to Brahma in the form of a cow, praised him, and reported the calamity that had befallen her. Brahma, along with the goddesses and Rudra, went to the ocean of milk. He praised the Lord Jagannath, the presiding deity of Vrindavan. Pleased by that, Brahma was made to hear an ineffable sound in his meditation. The Lord, in the form of Aniruddha, was sleeping in the ocean of milk for the protection of the world. Even Brahma, Rudra, and others cannot approach him. Having seen in meditation, by grace, they listen to the words spoken by him. Brahma heard and told the gods this. The Lord is saying this, listen. I know the treasures of the demon world on Earth. I, the Lord God, have come and can destroy my body and time. In the meantime, you are born with your parts in the Yadu dynasty. I am passionate about living beings or accepting them as my body Without doing that, I will take the form of a human and be born. May the goddesses also be born as gopikas. Anantudu, who is a part of Vasudeva, will be born as my elder brother to Srihari, so that he may be dear to him before me, due to karma. Mayadhishta Devata, being commanded by me, will be born to perform my duty as Lord, and when Vishnu's words were made known to the Brahma Devas, they all departed to their respective places. Brahma consoles the earth and ascends to his own world. With this, our short introduction is complete. We'll pick up where we left off in the next episode.
Let's find out. Jai Srimannarayana, salutations to the Asmadgurus.