వీరభద్రుని యజ్ఞశాలా ధ్వంస లీల - దక్ష శిరశ్ఛేదనము

Destruction of Daksha's Yajna & Slaying of Daksha

bhagavatam

శ్రీమద్భాగవతం చతుర్థ స్కంధంలోని ఈ మహత్తర ఘట్టంలో, పరమేశ్వరుని తేజోమయ స్వరూపమైన వీరభద్రుడు శివగణ సేనతో దక్షుని యజ్ఞశాలపై విజృంభించి విధ్వంసం సృష్టిస్తాడు. దక్షుని అహంకారమూ, శివనిందయూ సతీదేవి దేహత్యాగానికి దారితీసిన నేపథ్యంలో, వీరభద్రుడు దేవతలను, ఋషులను తరిమివేసి యజ్ఞవాటికను ధ్వంసం చేస్తాడు. ఈ లీల దక్షుని శిరచ్ఛేదనంతో పరాకాష్ఠకు చేరుకుంటుంది, ఇది అహంకారానికి తగిన శిక్ష మరియు విశ్వధర్మ పరిరక్షణకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ పవిత్ర కథ భగవంతుని న్యాయమూ, కరుణయూ ఏకకాలంలో ఎలా వ్యక్తమవుతాయో మనకు బోధిస్తుంది.

In this powerful episode from Canto 4 of the Srimad Bhagavatham, Lord Shiva's mighty warrior manifestation Veerabhadra descends upon Daksha's grand yajna with an unstoppable divine fury. Leading a vast army of Shiva's ganas, Veerabhadra wreaks devastating destruction upon the sacrificial arena, routing the gods and sages who had dishonored Lord Shiva. The episode culminates in the beheading of Daksha, whose pride and arrogance had set in motion the tragic events leading to Sati's self-immolation. This sacred narrative reveals how the Lord's grace and justice operate simultaneously, humbling the ego and upholding cosmic dharma.

← Prev Next →
Destruction of Daksha's Yajna & Slaying of Daksha bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః తస్యై నమోస్తు కాష్టాయై యత్రాత్మా హరిరీశ్వరః యద్గత్వాన నివర్తంతై శాంతా సన్యాసినోమలాః సకల ప్రాణులకు ఆత్మరూపుడు సర్వేశ్వరుడు అగు శ్రీహరి నివసించే పరమధామమునకు నమస్కారమగుగాక శాంత స్వభావులు పవిత్రులు సర్వ సంఘ పరిత్యాగులగు మహాత్ములు ఆ ధామమును పొంది మరలి రారు. సెవెంత్ క్యాంటో ఫోర్త్ చాప్టర్ 22 చాప్టర్ ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపిక. చతుర్ధ స్కంధము ఏడవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు మనం విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా దక్షిణ యొక్క వధ తరువాత దేవతలందరూ కూడాను. కైలాసానికి వెళ్ళటము, కైలాసంలో ఆ కైలాస పర్వతం యొక్క వర్ణన భాగంగా మనము తెలుసుకుంటున్నాం. ఇంకా ముందు ఆ వర్ణనలో ఉన్న విషయాన్ని తెలుసుకుందాం. దేవతలు ఒక వడవృక్షాన్ని చూశారు. చెట్టు నూరు యోజనముల ఎత్తు, డెబ్బటి యోజనముల పొడవు గల కొమ్మలతో విశాలముగా ఉండెను. దాని నీడ ఎన్నడూ తొలగదు. అచ్చట సూర్యుని ఎండ తగలదు. ముముక్షులందరూ ఆశ్రయించు ఆ వటవృక్ష మూలమున మహాయోగ పీఠమున శివుడు కూర్చొని ఉండెను. అతడు అమర్షమును వీడిన యముని వలె ఉండెను. సనందుడు. మొదలగు శాంతులకు మహాసిద్ధులు ఆ శివుని శాంతమూర్తిని ఉపాసించుచుండిరి. యక్షులకు ప్రభువు కుబేరుడు కూడా శివుని సేవించుచుండెను. ఆ మూర్తి ప్రశాంతము. అపరాధము చేసిన వారి యెడల కూడా కృప కలవాడతడు. జ్ఞాన యోగము, కర్మ యోగము ఇచ్చి అనుగ్రహింపబడిన భక్తి యోగమును అవలంబించినాడు జితేంద్రియుడు. చరాచరములు, సర్వభూతములు భగవానుని శరీరమని భావించి వాటి అన్నిటి యెడల అనుకూల భావముతో ఉండెడి వాడతడు. వాత్సల్యముచే లోకములకు క్షేమమునే కలిగించువాడు. తాపస్సులు ధరించెడి చిహ్నములకు భస్మమును, దండమును, జటలను, అజినమును, చంద్రలేఖను ధరించినవాడు.

సంధ్యాకాలమందరి మేఘమును పోలిన దేహకాంతి గలవాడు దర్భాసమనందు కూర్చొని ఉన్నాడు. నారదుడు దగ్గర కూర్చొని ప్రశ్నలు అడుగుచుండగా సనంద సనందనాధులు వినుచుండగా సనాతనమగు పరమాత్మను గూర్చి ప్రణవమును గూర్చి ప్రభజించుచున్నాడు. కుడి తొడపై ఎడమ పాదమును చేర్చి ఉండెను. ఎడమ కాలి ఎడమ మోకాలిపై ఎడమ బాహుమును చేర్చి ఉండెను. కుడి ముంజేతి యందు అక్షమాలను దాల్చెను. కుడి చేతితో తర్క ముద్రను దాల్చి కూర్చొని ఉండెను అట్లు కూర్చునుటకు వీరాసనమని పేరు చూపుడు వేలును బొటన వేలును నడిమి వేలును కలిపి మొగిలిన వేళ్ళతో చాచి హస్తమును ఉంచుట తర్క ముద్ర అనబడును ఆనంద స్వరూపుడై బ్రహ్మ సమాధియందు ఉండెను. యోగ మార్గమును ఆశ్రయించి ఉండెను. మునులకెల్లా ఆద్యుడు పరమశివుడు అతని వద్ద లోకపాలురు మునులు మొదలగు వారందరు చేతులు జోడించి నమస్కరించుచు నిలవబడిరి. ఇట్లు దేవతలచే రాక్షసులచే నమస్కరింపబడు పాదపద్మములు గల పరమశివుని వద్దకు దేవతలతో బ్రహ్మ వచ్చెను. బ్రహ్మ రాగానే శివుడు తన ఆసనము నుండి లేచి శిరస్సు వంచి నమస్కరించెను. వెనక వామన రూపమును దాల్చిన విష్ణువు కశ్యప ప్రజాపతికి ఎట్లు నమస్కరించెనో అట్లే నమస్కరించెను. ఆ రుద్రుని అనుసరించి ఉన్న సిద్ధ గణములు మహర్షులు కూడా బ్రహ్మకు నమస్కరించిరి. అట్లు నమస్కరించిన చంద్రశేఖరునితో మందహాసము చేయుచు బ్రహ్మ ఇట్లు మాట్లాడెను. ఈశ్వరా రుద్రా ఈ చిదచిదాత్మక జగత్తునకు అంతకు యోని బీజము లాంటి వారు ప్రకృతి పురుషులు. అట్టి వారు శివశక్తి రూపములుగా నీయందే ఉన్నారు. అట్టి ప్రకృతి పురుషులకు అందరకు ఆధారమగు బ్రహ్మయే నీవని నేను ఎరుంగుదును. నీ అంశములే శివశక్తి రూపములకు ప్రకృతి పురుషులు. నీవే నీ అంశలచే జగత్తును సృజించుచున్నావు, పాలించుచున్నావు, లయము చేసుకొనుచున్నావు. సాలెపురుగు, సాలెగూడు నిర్మించినట్లు నీలోనే ఉండి నీకంటే వేరుగాని ప్రకృతి పురుషులతో జగత్తును నిర్మించి. అందు నీవు చేరి మరల దానిని లయముననిచ్చుచున్నావు. ఇట్లు సర్వ జగత్ కారణము బ్రహ్మము నీవే అయి ఉన్నావు. అట్లు నీవే ధర్మమును అర్థమును పోషించుచున్నావు. నీవే పురుషార్థములను పొందుటకు సమర్థమగు శాస్త్రముచే యజ్ఞములను ఏర్పరిచినావు.

ధర్మార్థములను సాధించుటకు ఉపాయమైన శాస్త్రమును ప్రవర్తింపచేసిన వాడవు. వర్ణాశ్రమ ధర్మములనిడి కట్టుబాట్లను కల్పించిన వాడవు నీవే. నియమశీలులగు బ్రాహ్మణులు ఆ ధర్మములను పాలించుచున్నారు. మంగళకరా, మంగళములో కర్మలను ఆచరించిన వారికి స్వర్గమును మోక్షమును నీవే వసంగుచున్నావు. ఈచట సర్వ జగత్తు సృష్టి స్థితి లయములను చేయువాడును శాస్త్రములను ప్రవర్తింప చేయువాడును పురుషార్ధమును వసంగువాడును మోక్షప్రదుడును అగు బ్రహ్మతో సమానాధికరణ్యము చెప్పి వృద్ధుడు బ్రహ్మమే అని స్తుతించుచున్నాడు. శివునిలో ఆత్మయే ఉండి బ్రహ్మ సర్వము చేయుచున్నది కనుక శివుడు బ్రహ్మము అనుటకు ఉపనిషత్తులు అవకాశమును వసంగుచున్నవి. అమంగళములగు కర్మలు చేయువారులకు తీవ్రముగా అంధకారం వంటి నరకమును వసంగువాడవు కూడా నీవే. అమంగళములగు కర్మలు చేయువారికి ఆ కర్మల ఫలమే లభించును కానీ స్వర్గము మోక్షము ఎట్లు వచ్చును ఇట్లు చతుర్ముఖ బ్రహ్మ రుద్ధుని సర్వ జగత్ కారణమగు బ్రహ్మముగా శరీరాత్మ భావముచే అభేదముగా స్తుతించుచున్నాడు ఇంకా అతనికి అనుగ్రహం కలిగించుటకు రోషము తగదని చెప్పుచున్నాడు. నీ పాదారవిందములందు మనసు నిలిపి సత్పురుషులు సర్వభూతములను పరమాత్మ యందును సర్వభూతముల యందు పరమాత్మను చూచుందురు. వారికి అనర్థకరమగు దోషము కలగదు. బ్రహ్మాత్మకము కాకుండా ఏ వస్తువు ఉండనీరదు. కొందరు జ్ఞానహీనులు అంతను బ్రహ్మాత్మకముగా చూడలేక రూపభేదముచే భిన్నముగా స్వతంత్రముగా భావింతురు. వారి మనస్సు దుష్టమై ఉండును. ఒకరికి సంపద కలిగినప్పుడు వారి మనస్సు మండుచుండును. పరుషమగు మాటలతో మర్మభేదకముగా వారు హింసించుచుందురు. అట్టివారు దైవోపహతులు. అట్టి వారిని దయాళుడగు నీ వంటి వారు హింసించుట తగదు. పద్మనాభుని మాయదారుటకు శక్యము కానిది కదా, శక్యము కానిది కదా, దానిచే మనసు చెడి భేదృష్టి ఏర్పడెను. దేవ మనుష్యాది రూపములలో ఉన్న ఆత్మలన్నియు జ్ఞానము ఆకారములుగా కలవి అయి ఉన్నను ఆత్మ స్వరూపం నెరుగక వేలని తలచుకుందురు.

వారి అజ్ఞానమునకు జాలిపడి సత్పురుషులు వారి దుఃఖమును చూచి ఓర్వలేక కృప కలిగి ఉందురు. వారు చేసిన అపరాధములు ఆత్మజ్ఞానము లేక చేసినవని వారు దోషము కాదని జాలిపడెదరు. పరమశివా, నీ పరమ పురుషుని మాయను దాటిన వాడవు నీవు. నీ బుద్ధి మాయచే ఆక్రమింపబడలేదు. నీవు అన్ని వస్తువుల యందు ఉన్న బ్రహ్మ తత్వమును ఎరుగిన వాడవు. కావున మాయచే మనసు చెడి ఉన్నవారు అపరాధములు చేసిననాడు నీవు క్షమింపతగును రుద్రా యజ్ఞ సమాప్తి కాకుండా దక్షుడు చంపబడినాడు ఆ యజ్ఞమును మరల ఉద్ధరించుట మీకు తగిన పని ఆ యజ్ఞమును చేసిన దక్షుడు కుయాజ్ఞికుడు అందు భాగమును స్వీకరించిన దేవతలు భాగార్హుడవగు నీకు భాగమును వసంగలేదు. నీవు లేనినాడు యజ్ఞము సమాప్తము కాదు. నీ యెడ అపరాధము చేయుటచే యజ్ఞము భ్రష్టమైనది. నీవు అనుగ్రహించి యజ్ఞమును సమాప్తి వందింపవలెను. యజమానుడగు దక్షుడు బ్రతుకుగాక, భృగుడు నేత్రములను పొందుగాక, భృగునకు గడ్డము మీసము మరల మొలుచుగాక, పూషకు దంతములు మరల మొలుచుగాక, ఆయుధములచే రాళ్ళచే దెబ్బలు తగిలిన దేవతల శరీరములు మరల బాధలేనివి అగుగాక, యజ్ఞము చేయగా మిగిలినదంతయు నీ భాగము. నీవు యజ్ఞమును నశింపచేసినా చేసినావు కనుక మరల నీవే ఆ భారమును స్వీకరించి యజ్ఞమును సమాప్తినెందునట్లు చేయుము. ఈ విధంగా చతుర్ముఖుడు అనునయించగా రుద్రుడు సంతసించెను. నవ్వుచు వినుడనిట్లు చెబుచున్నాడు ప్రజాపతి అజ్ఞాన మోహితులు మూర్ఖులనగు బాలులు చేసిన అపరాధమును నేను ఇప్పుడు వర్ణింపను స్మరింపను కానీ అపరాధమును చేసినప్పుడు దానికి తగిన శిక్ష అనుభవించవలెను కనుక విధించితిని దక్షిణాగ్నిలో దక్షిణి శిరస్సు దహింపబడినది. అందుచే అతనికి పొట్టేలు శిరము శిరస్సుగా అమర్చబడుగాక. మిత్రునకు నేత్రములు వచ్చుగాక. భృగుడు యజ్ఞములో తన భాగమును చూచుటకు అతని నేత్రములు ఉపయోగపడుగాక. యజమానుని యొక్క దంతములని ఉపయోగించుకొని పూషద్విష్టమును భుజించుగాక, ఈ విధముగా దేవతలకు కలిగిన లోపములన్నియు తీరుగాక, వారి యజ్ఞములో మిగిలిన దానిని నాకు భాగముగా కల్పించినందుకు సంతోషించితిని. ఋత్విక్కులు అశ్విని దేవతల బాహువులతో బాహు కలవారలై పూష హస్తములను హస్తములుగా కలవారలగుదురు గాక భృగువునకు మేక గడ్డం వచ్చు గాక ఈ విధము.

రుద్రుడు అనుగ్రహించి పలికిన మాటలు విని దేవతలు సంతోషించిరి. ఇంద్రుడు మొదలగు దేవతలందరూ రుద్రునితో బ్రహ్మతో కలిసి మరల వెనుక యజ్ఞము చేసిన ప్రదేశమునకు దేవ యజనము చేయునకు ఎగిరి. అచ్చట శివుడు చెప్పినట్లే యజ్ఞములో ఉపయోగించు మేక యొక్క శరీరమును శిరస్సును దక్షుని శిరస్సుతో సంబంధించి ఇట్లు కూర్చబడగానే రుద్రుడు వాని వైపు చూచెను. రుద్రుడు నిద్రపోయిన వాడు మేల్కొన్నట్లు దక్షుడు లేచి నిలిచెను. రుద్రుడిని చూచెను. వృద్ధుని కటాక్షము ప్రసరించుటచే వెనక వృద్ధుని యందు ద్వేషముచే కలుషమైన దక్షుని మనసు శరత్కాలముందరి సరస్సు వలె నిర్మలమాయెను. వృద్ధుని స్తోత్రము చేయవలెనని అనుకొనెను కానీ చనిపోయిన సతీదేవి స్మృతిలో మెదలెను. ప్రేమచే కంటనీరు వచ్చెను, గొంతు బిగుసుకుని పోయి మరి స్తోత్రము చేయలేకపోయెను. సతీదేవి యందలి ప్రేమచే కలత చెందిన మనసును దక్షుడు కొద్దిసేపటికి కుదుట పెట్టుకొని ప్రేమతో కూడిన భావముతో స్తోత్రము చేయుటకు ఆరంభించెను. ప్రభు రుద్రా నేను నిన్ను అవమానించితిని నీవు నన్ను శిక్షించితివి అది తగినదే వర్ణాసన ధర్మములను పాటించడి బ్రాహ్మణుల యందు మీరు అవమానమును ఎన్నడూ ప్రదర్శింపరు నీవే బ్రహ్మ అగు చతుర్ముఖుని సృజించితివి బ్రహ్మ రూపమున కల్పారంభమునందు ఆత్మతత్వమును ఉపదేశించితివి. ఉపదేశించి స్వయముగా అనుభవించి అందరినీ రక్షించుటకు శాస్త్రములచే జ్ఞానమును వసంగితివి. క్షమము, దమము మొదలగు తపస్సులను సృష్టించితివి. ఎవరి ధర్మములను వారు ఎట్లు ఆచరింపవలెనో తెలియచేసితివి. ఇట్లు జ్ఞానము, తపస్సు, వ్రతములు కలిగిన బ్రాహ్మణులు ఎట్లు ఆచరింపవలెనో తెలియచేసితివి. అట్టి బ్రాహ్మణులను సర్వాపదల యందును నీవే కాపాడుదువు. దండము పట్టుకొని పశుపాలుడు. పశువులను కాపాడినట్లు అపరాధము చేసిన శిక్షించు శిక్షించుతూ కాపాడెదవు. నేను తత్వజ్ఞానము లేని వాడనై నిన్ను నీ గొప్పతనమును భావింపక అనరాని మాటలతో బాణములతో పొడిచినట్లు పొడిచితిని. పరమ పూజ్యుడవగు నిన్ను నిందించుటచే నేను అధోలోకములకు పోవుదును. నేను చేసిన అపరాధమును మరిచి నన్ను ఈనాడు మరల రక్షించితివి. దానికి నేను దానికి నేను ప్రత్యుపకారం ఏమి చేయగలను క్షమించుము. ఈ విధంగా దక్షుడు వృద్ధుని ప్రసన్నుని చేసుకొని బ్రహ్మరుద్రులు ఆజ్ఞను అనుజ్ఞను సంగ సంగగా ఉపాధ్యాయుడు మొదలగు ఋత్వికులతో ఆ యజ్ఞము సాగించి పూర్తి చేసెను. ఆ యజ్ఞము చరిచినందుకు వీరభద్రుడు యజ్ఞమును అడ్డుపడినందుకు ప్రాయశ్చిత్తముగా విష్ణు దేవతాకమగు మూడు కపాలములలో సంస్కరింపబడిన పురోడాశమును

పూర్వ రాశ్యమును ఋత్విక్కులు హోమము చేసిరి. ఆ హవిస్సు ధరించి అధర్వ్యూతో యజమానుడగు దక్షుడు నిర్మలమగు బుద్ధితో శ్రీహరిని ధ్యానించెను. వెంటనే శ్రీహరి ప్రత్యక్షమాయెను. ఆ శ్రీహరి. దివ్య తేజస్సుచే అచరునున్న సదస్సుల చూపులు చీకట్లు కమ్మెను. బృహద్రదంతర సామములు రెక్కలుగా గల గరుణిపై అధిరోహించి శ్రీహరి అచ్చటికి వచ్చెను. అతడు నీలమైన వర్ణము గలవాడై బంగారు వలె మెరుగుచున్న వస్త్రముతో సూర్యుని వలె ప్రకాశించుచున్న కిరీటముతో విరాజిల్లుచుండెను. కుండలములచే అలంకరింపబడిన సుందర ముఖమండలము తుమ్మెదల వంటి నల్లని ముంగురులతో అలంకరింపబడి ఉండెను. హస్తములలో ఆశ్రయించిన వారిని రక్షించుటకు తొందరపడుచున్న శంఖము, పద్మము, శారంగము, ఖడ్గము, డాలు మొదలగు ఆయుధమును ధరించి ఉండెను. పూచిన కర్ణికార వృక్షము వలె హస్తములతో స్వామి ప్రకాశించుచుండెను. వక్షస్థలమందు లక్ష్మి అధివసించి ఉండెను. వనమాల విలులాడుచుండెను. ఉదారమగు మందహాసముతో క్రిగంట చూచుచు విశ్వమునంతును ఆనందింపజేయుచుండెను. రెండు పార్శ్వములందును చామరములు రాజహంసల వలె కదలాడుచుండెను. ఈ విధముగా శ్రీహరి వచ్చుట చూచి బ్రహ్మ, ఇంద్రుడు, త్రినేత్రుడు మిగిలిన దేవతలందరూ నమస్కరించిరి. ఆ శ్రీహరి దివ్య తేజస్సుచే వారి కాంతులు కప్పవేయబడెను, మాట వచ్చుట లేదు. తొట్రుపాటు కలిగిన వారైరి. రెండు చేతులను శిరస్సుపై జోడించి పెట్టుకొని శ్రీహరిని స్తోత్రము చేసిరి. బ్రహ్మ రుద్రాదులు కూడా భగవానుని మహిమ నిరంగజాలిన వారు కారు. అయినను తమను అనుగ్రహించుట కొరకు దర్శింప చేసిన దివ్య మంగళ విగ్రహము గల శ్రీహరిని చూచి వారి బుద్ధికి అందినంత వరకు స్తోత్రము చేసిరి. పూజా ద్రవ్యములను చేతిలో ధరించి దక్షుడు ఇట్లు స్తోత్రము చేయుచున్నాడు. శ్రీహరియే యజ్ఞేశ్వరుడు. యజ్ఞముల ఫలమును అనుభవించువాడు అతడే. ఫలమును వసంగువాడును అతడే. యజ్ఞమునే కాదు యజ్ఞమును ఆచరించిన ప్రజాపతులను కూడా కాపాడువాడు అతడే. హితమును ఉపదేశించువాడు అతడు.

సునందుడు మొదలగు అనుచరులకు దేవతలను దేవతలు పరివేష్టించి ఉండిరి. ఇట్లు అనుగ్రహించి దర్శనమిచ్చిన శ్రీహరిని దక్షుడు మనసు కుదుటపరుచుకొని ఇట్లు శరణాగతి చేసి స్తోత్రము చేయుచున్నాడు. దక్షుని యొక్క స్తోత్రం ఏమిటో మనం తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. Jai Srimannarayana Asmadgurubhyo Namaha

Jai Srimannarayana, salutations to the Asmadgurus. Salutations to him, to the Kashta. Wherever the soul, the Lord of Hari, is, may those who are peaceful and renunciant be saved. To the supreme abode where Sri Hari, the embodiment of all beings, the Lord of all, resides, may salutations be offered Those who are peaceful, pure, and renunciants of all associations, such great souls, do not return after attaining that abode. Seventh Canto Fourth Chapter 22 Chapter Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the seventh podcast episode of the fourth Skandha. Until now, as part of the conversation between Vidura and Maitreya, after the killing of Daksha, all the gods also... Going to Kailasam, we are learning about the description of Kailasam mountain in Kailasam. Let's explore the details of the upcoming event. The gods saw a banyan tree. The tree was as wide as a hundred yojanas in height and a hundred and twenty yojanas in length with branches. Its shadow is never cast. The sun's rays are barely touching there. All the liberated souls, under the banyan tree, on the great yoga seat, Shiva was seated. He is Amarshamunu He was like Yama, the god of death. Sanandu and others were great sages and worshippers of Shiva, the embodiment of peace. Kubera, the lord of the Yakshas, also served Shiva. The idol is serene. He is also gracious to those who have sinned. The Jitendriya followed the Bhakti Yoga, which was given by Gnana Yoga and Karma Yoga and was blessed. He is one who has a favorable feeling towards all beings, considering all living beings and all beings as the body of the Lord. He is the one who brings well-being to the world through affection. He who wears ashes, a staff, matted hair, a crown, and a crescent moon as symbols of penance.

He who has a body glowing like the clouds of the evening, is sitting in the middle of Darbhasam. While Narada was sitting near and asking questions, Sananda Sanandanadulu were listening, praising the eternal Supreme Soul and the Pranava. The left foot was placed on the right thigh. The left leg was placed on the left knee, and the left arm was placed on the knee. He/She wore the Akshamalam on the right forearm. He was sitting with the Tarka Mudra on his right hand. To sit like that, it is called Veera Sana. Showing the index finger, thumb, and middle finger, spreading them with clasped fingers, placing the hand is called Tarka Mudra. Brahma, being the embodiment of bliss In the grave. Yoga was based on the path. Among the sages, the first one is Parameshwara. The worldly people, sages, and others stood with folded hands, paying their respects. Thus, Brahma came with the gods to the supreme Shiva, who had lotus feet and was worshipped by demons. As soon as Brahma arrived, Shiva rose from his seat, bowed his head, and offered his salutations. Vishnu, who assumed the form of a dwarf He greeted Kasyapa Prajapati in the same way he would greet him. The Siddha Ganas and the great sages who followed Rudra also bowed to Brahma. Thus, Brahma spoke to Chandrashekara, who had greeted him, with a smile. Eshwara, Rudra, to this Chidachitatmaka world, the yoni is like a seed, the nature is the male. They are in your care as the forms of Shiva and Shakti. I understand that Brahma is the basis for all nature and men. You are the elements, the forms of Shiva and Shakti, the natural and the masculine. You are creating the world with your parts, you are ruling, you are destroying. Like a spider, a spiderweb, being within you, different from you, having created the world with nature and man. And you, reaching out, again giving it the dissolution. Thus, you are the cause of the entire universe, Brahman. Thus, you are nurturing both dharma and artha. You have established sacrifices through the scriptures that are capable of attaining the Purusharthas.

You are the one who implemented the scripture that is the means to achieve righteousness and wealth. You are the one who established the rules of Varna and Ashrama Dharma. The Brahmins, who are righteous, are following those dharmas. Oh auspicious one, you are the one who bestows heaven and salvation upon those who perform rituals in auspicious times. Here, the one who performs the creation, preservation, and destruction of the entire universe, the one who makes the scriptures function, the one who grants the purpose of life, and the one who bestows liberation, is equal to Brahma, and the old man is praising Brahma. Since Shiva has the soul and Brahma is doing everything, the Upanishads provide an opportunity to say that Shiva is Brahma. You are also the one who will cause a darkness-like hell for those who do inauspicious deeds, severely. Those who perform inauspicious deeds will receive the fruits of those deeds, but how will heaven and salvation come? Thus, the four-faced Brahma, praising the Brahma who is the cause of the entire universe, as the body and soul, as non-duality, to him Anger is not appropriate to bestow grace He is saying. With their minds fixed on the lotus feet of the Lord, the virtuous see the Supreme Being in all beings and the Supreme Being in all beings. They will not have any harmful defects. Nothing can exist without being part of the universe. Some ignorant people, unable to see the universe as one, consider it different due to differences in form and independently. Their minds are evil. When someone has wealth, their mind burns. With harsh words, they torment in a way that is mysterious. They are God's gifts. It is not right for those who are compassionate like you to oppress those who are like them. Padmanabha's illusion is impossible, isn't it? It is impossible, isn't it? Because of that, the mind is corrupted and a different vision is formed. All the souls in the forms of gods, humans, etc., are united in the form of knowledge, but they think that they do not know the form of the soul.

Pity for their ignorance, the righteous, unable to bear their sorrow, are compassionate. They feel that the crimes they committed were due to lack of self-awareness and not as a result of their own fault. Oh Lord Shiva, You are the one who transcends the illusory nature of the Supreme Being. Your mind is not controlled by illusion. You are the one who knows the Brahma Tatva that is in all things. Therefore, those whose minds are corrupted by illusion, when they commit sins, you will forgive them. Daksha was killed before the completion of the Rudra Yagnya. It is appropriate for you to redeem that Yagnya. Daksha, who performed that Yagnya, is a Kuyajnikudu The gods who accepted the share, being the sharer, did not take a share for you. When you are not there, the Yagna will not be completed. The sacrifice is corrupted by your committing a crime. You should perform the Yagna and offer your prayers. May Daksha, the master, live, may Bhrigu receive the eyes, may Bhrigu's beard and mustache not grow again, may Pusha's teeth not grow again, may the bodies of the gods who have been struck by weapons and stones be free from suffering again, Yagnamu cheyaga The rest is yours. Even if you have destroyed the sacrifice, since you have done it, again you yourself accept that burden and make the sacrifice conclude. In this way, when the four-faced one pleased, Rudra was pleased. Prajapati, laughing and saying, "I will not now describe or remember the offense committed by the ignorant, deluded, and foolish children. But when an offense is committed, one must experience the appropriate punishment for it. Therefore, I have ordained it." The head of the South was burnt in the Southern Fire. Therefore, let the ram be placed on his head. May the friend have eyes. Bhrigu, may his eyes not be of use in seeing his share in the Yagnya. May you consume the offering made to the gods, using the teeth of the master, so that all the defects of the gods may be removed in this way, and I am pleased that you have given me a share of what remains in their sacrifice. The Ritvikas, being the arms of the Ashwini deities, may be the arms of the Pusha Hastas, may be the Hastas, may be the Bhrguvuna, may have a goat's beard, in this way.

Hearing the words spoken by Rudra's grace, the gods were pleased. Indra and all the other gods, along with Rudra and Brahma, flew to the place where they had performed the Yagnya again to perform the Deva Yajna. There, as Shiva said, as soon as the goat's body and head, used in the Yagnya, were placed together in relation to Daksha's head, Rudra looked towards him. Rudra, as if someone who had fallen asleep woke up, Daksha stood up. I saw Rudra. By the grace of the old man, the mind of Daksha, which was tainted by hatred towards the old man, became as pure as a lake on a rainy day. He thought to praise the old man, but he was moved by the memory of his dead wife. Love brought tears to my eyes, my throat choked up and I couldn't praise. Daksha, disturbed by the love for Sati Devi, composed his mind after a while and began to praise with a feeling filled with love. Lord Rudra, I have insulted you, you have punished me. That is appropriate, the dharma of the color line You never show disrespect to the Brahmins who follow you. You created the four-faced Brahma. In the form of Brahma, you preached the essence of the soul at the beginning of creation. Having preached, having experienced it yourself, you have established knowledge through scriptures to protect everyone. Forgiveness, self-control, and other penances were created. You have taught how everyone should practice their own dharma. Thus, you have explained how Brahmins with knowledge, penance, and vows should practice. You protect such Brahmins in all matters. The herdsman with the garland. You will be punished for protecting the animals, even if you have protected them. I, being without wisdom, pierced you, your greatness, without considering, like piercing with unspeakable words and arrows. By blaspheming you, the most revered one, I will go to the lower worlds. Forgive me for the offense I have committed, and you have saved me again today. For that, what compensation can I do for that? Forgive me. In this way, Daksha pleased the old man Brahma and Rudra, following the order and permission, along with the teacher and other priests, completed the yagna. For having performed that Yagnya, and for having obstructed the Yagnya, as atonement, the Purodasham, which was sanctified in three Kapalas, which are the deities of Vishnu

The priests performed a ritual sacrifice in the ancient country. Daksha, the master, with a clear mind, holding the oblation, meditated on Srihari with a pure intellect. In an instant, Srihari appeared before him. That's Srihari. The sight of the assemblies, adorned with divine splendor, dispelled the darkness. Srihari, riding on Garuda, who had wings like the wings of the Brihadratha Samhita, arrived there. He was of a blue color, and shone like gold, with a crown that shone like the sun, adorned with a garment that was as fine as gold. A beautiful face adorned with earrings, decorated with black curly hair like a swarm of bees. He was wearing weapons like the conch, lotus, sword, spear, and shield, and was eager to protect those who had taken refuge in his hands. Like a blossomed karnikara tree, the Lord shone with his hands. Lakshmiļa dwāṇṣṭhaṇa dwāṇṣṭhaṇa. The forest's music plays. With a generous smile, he looked around and made the whole universe happy. On both sides, the fan-like structures were moving like swans. This Seeing Srihari coming in this way, Brahma, Indra, and all the other gods bowed down. Oh, Srihari's divine light covered their bodies, and they couldn't speak. They were a bit disoriented. They joined both hands on their heads and praised Srihari. Brahma, Rudra, and others are not the ones who know the glory of the Lord. However, seeing Srihari, who has the divine auspicious idol to bless them, they praised him as much as their minds could. Daksha is praising thus holding the worship items in his hands. Srihari is Yagneshwar. He who has experienced the fruits of his actions. He is also the one who brings the fruit. Not only Yagnyamun, but he is the one who protects the people who practice Yagnyamun. He is the one who preaches good.

Sunandu and other followers were surrounded by gods. Thus, Daksha, having blessed and given darshan to Srihari, is pacifying his mind and thus, having surrendered, is praising. We will learn about Daksha's Stotram in the next podcast. Jai Srimannarayana Asmadgurubhyo Namaha