గర్భస్థ శిశువుగా నారద ఉపదేశ శ్రవణము - లీలావతి రక్షణ

Prahlada Recalls Hearing Narada's Teachings Within Womb

bhagavatam

శ్రీమద్భాగవతం సప్తమ స్కంధంలోని ఈ పవిత్రమైన ఘట్టంలో, ప్రహ్లాదుడు తన సహపాఠులకు తాను గర్భంలో ఉన్నప్పుడే నారద మహర్షి నుండి దివ్యజ్ఞానాన్ని పొందిన విషయాన్ని వివరిస్తాడు. హిరణ్యకశిపుడు తపస్సు చేయుటకు వెళ్ళిన సమయంలో దేవదానవ యుద్ధంలో లీలావతిని నారద మహర్షి రక్షించి, ఆమెకు భాగవత ధర్మోపదేశం చేశారు, అది గర్భస్థ శిశువైన ప్రహ్లాదుని హృదయంలో స్థిరపడింది. భగవద్భక్తి జన్మకు పూర్వమే సంక్రమించగలదని ఈ అద్భుతమైన వృత్తాంతం స్పష్టంగా నిరూపిస్తుంది.

In this sacred episode from Canto 7 of Srimad Bhagavatham, Prahlada reveals to his astonished classmates how he received divine wisdom from Sage Narada while still residing in his mother's womb. When the demons waged war against the demigods and Hiranyakashipu performed severe penances, Narada sheltered Prahlada's mother Lilavati and imparted the highest teachings of Bhagavata Dharma to her, which the unborn Prahlada absorbed with full consciousness. This extraordinary account affirms that devotion to Lord Vishnu transcends all worldly circumstances, even the boundaries of birth itself.

← Prev Next →
Prahlada Recalls Hearing Narada's Teachings Within Womb bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః కర చరణ సరోజే కాంతిమన్నేత్ర మీనే శ్రమముషి భుజ వీచి వ్యాకులే గాధమార్గే హరి సరసి విగాహ్యాపీయ తేజోజలౌఘం భవమరు పరు ఖిన్నః ఖేద మధ్య త్యజామి నేను ఈ సంసారమనడి ఎడారిలో ప్రయాణము చేసి చేసి బడలి నేడి హరి సరస్సును చేరితిని ఆహా ఎంత సుందరమీ సరస్సు ఆ హరి కర చరణములే ఇందలి తామరరు తామరలు శోభావంతములగు నేత్రములే మిలమిలలాడు చేపలు భుజములే అందు కదలాడు కెరటములు అది శ్రమలన్నిటినీ హరించును ఆ రేవులు అవగాహనము చేయుటకు అనుకూలముగా లోతు కలవై యుండును ముకుందమాల ప్రేయర్ 10. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపిక సప్తమ స్కంధం ఎనిమిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద చరితములో ప్రహ్లాదుడు హిరణ్యకశ్యపుడు మధ్యలో సంభాషణ ఆ సంభాషణలో భాగంగా హిరణ్యకశ్యపుడు ఎక్కడైనా ఉన్నాడా అని చెప్పేసి అడుగుతాడు ప్రతిచోట ఉన్నాడని చెప్పేసి అని విశ్వాసాన్ని కలిగిస్తాడు కలిగించినప్పుడు ఈ స్తంభములో ఉన్నాడా అని చెప్పేసి అని పగలగొట్టినప్పుడు ఒక పెద్ద ధ్వని కలుగుతుంది అంతవరకు మనం తెలుసుకున్నాం. ఆ తర్వాత భాగాన్ని తెలుసుకుందాం. తన భక్తుడగు ప్రహ్లాదుడు భగవంతుడు వ్యాపించి ఉన్నాడని చెప్పిన మాట నిజమని. చాటుటకును అన్ని పదార్థములలో కనపడకుండా భగవానుడు వ్యాపించి ఉండునని చాటి చెప్పుటకును హిరణ్యకశిపునకు బ్రహ్మ ఇచ్చిన వరము తప్పకుండా చంపుటకు వీలుగను మృగము కాక మనుష్యుడు గాక అత్యద్భుతమగు రూపముతో నరసింహము ఆ స్తంభమున కనపడెను. హిరణ్యకశపుడు చూచినాడు. అన్ని వైపులా చూచుచున్నాడు. ఆశ్చర్యముగా స్తంభమునందు నరసింహ మూర్తి వెలికి వచ్చినది. ఆ రూపము చాలా భయంకరమైనది. బంగారు వర్ణము గల నిప్పులు గక్కుచున్న కన్నులు, జూలు ముఖమంతా కప్పినది, భయంకరమైన ఆవులించిన నోరు, తీక్షణమైన కోరలు.

కత్తి వలె కదలుచున్న నాలిక, ముడుబడిన కనుబొమ్మలు, నిలువుగా నిలిచిన చెవులు, కొండ గుహ వలె వెడద అయిన నోరు ముక్కు పుటములు, ఆకాశమును అంటుచున్న శరీరము. మరీ పొడవు గాని మరీ లావు గాని మెడ విశాలమైన వక్షస్థలము సన్నని నడుము చంద్ర కిరణముల వలె తెల్లని వెంట్రుకలు అన్ని వైపులా వ్యాపించిన వాడి గోళ్ళతో అంతటా వ్యాపించిన భుజములు అనేకమైన ఆయుధములు దాల్చి ఉన్నవి. రాక్షసులను అందరినీ బెదిరించుచు దరిచేరుటకు శక్యము కాకుండా ఉన్నది ఆ రూపము. దానిని చూచి హిరణ్యకశిపుడు శ్రీహరి మాయావి. అతడే నన్ను చంపుటకు ఈ రూపము స్వీకరించి ఉన్నాడని తలంచి గద చేత పట్టి మిడత అగ్నిలో దూకినట్టు తేజోరూపుడుగా నృసింహుని పై దూకెను. సృష్టికి ముందు సకల జగత్తు లయమై తమోరూపము నొందిన నాడు ఆ తమస్సును గ్రహించిన తేజస్వరూపమే ఈ నరసింహము. ఆనాడు తమస్సును గ్రహించినట్లే గదలో వచ్చిన హిరణ్యకశిపుని గరుత్మంతుడు పామును ఒడిసి పట్టినట్లు ఒడిసి పట్టుకొనెను. నరసింహుని పట్టు విడుచుకొనుటకు ఇటు నట్టు చలించగా పట్టు వదలి హిరణ్యకశిపుడు క్రింద పడెను. అది చూచి దేవతలు స్వామి విధిని వదిలినాడు వింత ప్రమాదమని భయపడిరి. హిరణ్యకశిపుడు వెంటనే తన పరాక్రమను సహింపలేక నరసింహుడు తనను జారవిడిచినాడని భావించి కత్తి డాలు పట్టుకొని నరసింహునిపై ఎగిసిపడెను. ఎగిరి వచ్చి మీద పడుచున్న ఆ అసురుని పాము ఎలుకను పట్టినట్లు శ్రీ నరసింహమూర్తి చేతితో పట్టుకొని ద్వారముపై కూర్చొని తొడలపై పరుండ పెట్టుకొని గోళ్ళతో చీల్చివేసెను. పేగులను తీసి హారములుగా ధరించెను. రక్తముతో కేసరములు పూయబడి ఎర్రనై ఉండెను. నాలికతో ఇటు అటు నాకుచుండెను. ఆ రూపము ఆ ఉద్యమము దుష్ప్రేక్షమై ఉండెను. ఇట్లు భూమిపై కాక ఆకాశములో కాక తొడలపై నుంచుకొని అతన్ని చంపెను, అతని వెంట ఆయుధములతో వచ్చి నిలిచిన అసురులను వేలకలైన మందిని హతమార్చెను, ఒక్కసారి జూలు విదల్చెను.

మేఘములు ఎటునటు చెదిరిపోయినవి. తీవ్రమైన చూపులతో పైకి చూడగా గ్రహములు కాంతిహీనమైనవి. ఆ నృసింహుడు ఊపిరి వదలక ఆ గాలికి సముద్రములు కలత చెందినవి. ఆ సింహ గర్జనకును దిగ్గజములు భయపడి మొరపెట్టినవి. జూలు ముఖముపై పడుచుండగా పైకెగ జిమ్మినప్పుడు ఆకాశములో సంచరించుచున్న విమానములు దూర దూరముగా తూలిపడినవి. దేవతలు దుందువులు మ్రోగించిరి. గంధర్వ స్త్రీలు నృత్యము చేయుచు గానము చేయసాగిరి. బ్రహ్మ, ఇంద్రుడు, పరమశివుడు, ఋషులు, పితృ దేవతలు, కిన్నరులు, సునందాదులు. మొదలగు వారందరూ ఆ నరసింహమూర్తిని దర్శించుటకు అంజలి ఘటించి నిలిచి ఉండిరి. వారందరూ ఆ నరసింహమూర్తిని ఈ విధంగా స్తుతించిరి. బ్రహ్మ. అపారమైన శక్తి గల విచిత్రమైన వీర్యము గల అనంతుడవగు సృష్టి స్థితి లయకర్తవగు నీకు నమస్కారము. రుద్రుడు ఇలా అంటున్నారు భక్తవత్సలా నీ కోప కాలమే ప్రళయ కాలము ఈ అసురుడు నీ కోపమునకు ఎంత సాటి ఎంత పాటివాడు వానిని చంపి వాని కుమారుని ప్రేమతో కాపాడితివి. ఇంద్రుడు ఏమంటున్నాడు పురుషోత్తమా మా యజ్ఞ భాగములన్నియు ఈ హిరణ్యకశిపుడు అపహరించి మాకు హాని కలిగించినాడు. ఈనాడు మా భాగమును మాకు లభించును. మా హృదయ పద్మము ఇంతకాలము నుండి నిన్ను స్మరించుటకు అవకాశం లేకుండా వీనిచే ఆక్రమించబడినది. ఆక్రమింపబడినది. ఈనాడు మరల నీ నివాస స్థానమగు మా హృదయ పద్మం వికసించినది. నరసింహా, నిన్ను సేవింప కోరు వారలకు ముక్తి కూడా బహుమతము కాదు. ఇంద్రుడు పలికెను. ఋషులు పలుకుతున్నారు. ఆదిపురుషా, నీవే మా పరమ తపస్సు. నీ దివ్య తేజ ప్రభావముచే నీయందే లీనమై ఉన్న ఈ జగము నీ చేతనే సృజింపబడినది. ఇంతకాలము మా తపస్సులను ఈతడు భంగము చేసినాడు. మరల ఈనాడు నీవు మమ్ములను తపస్సునకు అవకాశం కల్పించి రక్షించితివి. పితరులు అంటున్నారు, మా సంతతి వారు మాకు కల్పించడి శ్రాద్ధములను తిలోదకములను ఇతడే గ్రహించడివాడు. ఈనాడు నీచే

వీడు చీల్చి చేయవేయబడినవాడు. ఇంకా సకల ధర్మములు రక్షింపబడినవి, రక్షించబడినవి. సిద్ధులు అంటున్నారు, మేము భక్తి యోగముచే ఆర్జించిన శక్తులన్నిటినీ ఈతడు తన తపోబలముచే, యోగ బలముచే కొల్లగొట్టినాడు. ఈతన్ని నీవు నీ గోళ్ళతో చేల్చితివి ఋసింహా నీకు వే మా నమస్కారములు. ఇట్లే విద్యాధరులు, గంధర్వులు, ప్రజాపతులు మొదలగు వారందరూ నరసింహమూర్తిని స్తుతించిరి. బ్రహ్మ రుద్రాదులు ఎవ్వరును తీవ్రమగు కోపముతో ఉన్న స్వామిని చేరలేక దూరముగా నిలిచి ఉండిరి. లక్ష్మీదేవి కూడా ఇదివరకెన్నడును వినని చూడని ఆ అద్భుతమగు నరసింహ రూపమును చూచి దగ్గర చేరుటకు జంకి దూరముగా ఉండెను. అప్పుడు బ్రహ్మ దగ్గరలో నిలిచిన ప్రహ్లాదుని బాబు నీవే స్వామిని శాంతింపచేయుము నీ తండ్రిపై కోపించి ఉన్న స్వామి దగ్గరగా చేరి ప్రార్థింపుము అని కోరెను ప్రహ్లాదుడు పసివాడైనను మహా భాగవతుడు కనుక భయపడక స్వామి దగ్గరకు చేరి నమస్కరించుచు స్వామి పాద సన్నిధిని పడెను. ఆ నరసింహమూర్తి దయాళువై తన పాద సన్నిధిని పడిన ఆ బాలుని పైకి లేవత్తి. లేవెనెత్తి అతని శిరస్సుపై తన హస్తమును ఉంచెను. ఆ భగవత్ హస్త స్పర్శతో ప్రహ్లాదుని సకల అశుభములు తొలగిపోయెను. ఒక్కసారిగా ఆత్మ స్వరూపము, భగవత్ స్వరూపము అతనికి సాక్షాత్కరించెను. మనస్సులో మహానందం ఒందెను. స్వామి పాదపద్మమును మనస్సును నిలిపి పొంగిన భక్తితో హృదయము నేత్రములు ఆర్ద్రములు కాగా ఏకాగ్రతతో ఇట్లు స్తోత్రము చేయన ఆరంభించెను. ప్రభు నరసింహా నేను క్రూర రాక్షస జాదికి చెందిన వాడను నిన్ను స్తోత్రము చేయుటకు నాకు ఏ విధముగాను అర్హత లేదు బ్రహ్మాది దేవతలు సత్వగుణ ప్రధానులగు మునులు కూడా నిన్ను స్తోత్రము చేయజాలరు నిన్ను సంతృష్టి పరుచుటకు ధనము, అందము, తపస్సు, పాండిత్యము, ఇంద్రియ బలము, శారీరిక బలము, పౌరుషము, బుద్ధి సమర్థములు కావు. భక్తి లేనిదే ఎంత గొప్పవారైనను నీ హృదయమును ఆకర్షించలేరు. ఒక తిర్యక్ జంతువు గజేంద్రుడు తన భక్తిచే నీ హృదయమును ఆకర్షింపగలిగినది కదా.

బ్రాహ్మణునకు 12 ఆత్మ గుణములు ఉండవలెను. ధర్మము, సత్యము, దమము, పాండిత్యము, మాత్సర్యము లేకుండుట. తప్పు పనికి సిగ్గుపడుట, ఓరిమి, అశ్వయ లేకుండుట, దానము, యజ్ఞము, ధైర్యము, వ్రతము. ఈ 12 గుణములు కలవాడైన పద్మనాభ పాదారవింద భక్తి లేనిచో అతనికి భగవత్ అనుగ్రహము లభింపదు. హీనమైన సంస్కారము గల కులములో జన్మించిన వాడైనను భగవానుని కొరకే తన మాట చేత మనస్సు ధనము ప్రాణము వినియోగింపవలెను. ప్రేమతో నిండిన వాడైనచో అతనికి భగవత్ అనుగ్రహం లభించును. భక్తి లేని అహంకారముతో నిండిన బ్రాహ్మణుని కంటే భక్తి గల నీచ కులజుడు శ్రేష్టుడు. భగవానుని పూజ చేయుట భగవంతుని కొరకు కాదు. అతడు కోరికలన్నియు ఈడేరినవాడు. పరిపూర్ణుడు. మనము చేయు ఆరాధనచే కలువు గౌరవము అతనికి అక్కర లేదు. తనను ఆరాధించు వారిని లోకమారాధించునని వారి ఆరాధనను స్వీకరించును. భగవానునికి ఆరాధన చేయుట అద్దములో అందముగా కనపడుటకు తన ముఖమును తాను అలంకరించుకొనుటయే గానీ అద్దములో కనపడు రూపమునకు అలంకారము కాదు కదా. భగవత్ ఆరాధనము ఆరాధించిన వారికి గౌరవమును కలిగించును. భగవంతుని నమస్కరించుచు వారిని లోకము నమస్కరించును. తనకు గౌరవము కావలెను అనుకొనువాడు భగవానుని ఆరాధించవలెను. ప్రభు కోపమును ఉపసంహరింపుము. ఈ అసురుడు అంతమొందింపబడినాడు. తేలును, పాలును, పామును చంపుట మంచి వారికి కూడా ఆనందమునే కలిగించును. వానిచే బాధపడు ఇతరులు సుఖముగా ఉందురు. ఈ భీకరమగు నరసింహ రూపమును అభయము కలుగుటకు లోకమంతయు స్మరింతురు. ప్రభు అతి భయంకరము గల భయంకరములగు నీ ముఖము, ముఖము, జిహ్వ, నేత్రములు, కనుబొమ్మలు, కోరలు, హారములుగా వేసుకునిన ప్రేగులు. రక్తసిక్తమైన జూలు, దిగ్గజములను కూడా కంపింపచేసిన నీ గర్జనము, శత్రువును చీల్చిన నఖములు నాకు భయమును కల్పించుట లేదు. ఈ సంసార చక్రము అంతకన్నా భయంకరముగా ఉన్నది. కర్మలచే బంధింపబడి దుస్సహమగు, తీవ్రమగు, మోహజనకమగు.

సంసారములో పొందుచున్న భయము వర్ణించుటకు అలవి కానిది. ప్రభు దీని నుండి విడిపించుటకు ఉపాయము నీ పాద సన్నిధి. దాన్ని చేరునట్లు నీవు నన్ను ఎప్పుడు పిలుచుకొందువు. హే నృసింహా నీవు ఉపేక్షించిన నాడు బాలునకు రక్షకులు తల్లిదండ్రులు కారు. రోగ పీడితునకు ఔషధము శరణము కాదు. సముద్రములో మునుగుచున్న వానిని నీవు అపేక్షించినచో నావ రక్షకము కాదు. ఈ జగమునందు భిన్న భిన్న స్వరాపము స్వరూప్ స్వభావములుగా భిన్న భిన్న స్వభావములు గలవిగా కనిపించు పదార్థములన్నియు నీ చేతనే నీ యందే నీ వలననే నీకై చెందినవై నీ కొరకే నీవే అయి ఉన్నవి. నీవు లోపల వ్యాపించి నియమించని వస్తువు ఏదీయు లేదు. అట్టి నీవే ఉపాయమని మనసారా నమ్ముట తప్ప ఈ సంసార చక్రము నుండి బయలుపోవుటకు వేరొక మార్గము లేదు. ఈ సంసారమును చక్రమునకు ఈ సంసారమును చక్రమునకు మధ్య నాభి మనసు అనాది అయిన భగవంతుని మాయాశక్తి కర్మేంద్రియ జ్ఞానేంద్రియ వ్యాపారములను ఈ మధ్యనున్న మనసు అనడి నాభికి ఆకుల వలె అతికినది కాలము. సత్తరజస్తమోగుణముల సహకారముతో ఈ చక్రము తిరుగుటకు నేమి వలె సాయపడుచున్నది. ఈ సంసార చక్రమున పడి ఉన్న జీవుడు. దాని తిరుగుడు నుండి బయటపోవుటకు నీ పాదములను ఆశ్రయించుట తప్ప వేరొక మార్గము లేదు. తర్వాత ఇంకా ప్రహల్లాద్ చేసినటువంటి స్తుతిని మనం మరొక పాడుకాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః

Jai Srimannarayana, salutations to the Guru. In the lotus feet of the hands and feet, the radiant eyes, the one who is the tormentor of the tired, the one who is the one who scatters the armies, the one who is the one who is seen in the lotus of Hari, the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is Having done, having done, I reached the Hari lake. Aha, how beautiful is this lake! Those hands and feet of Hari are lotus-like. The lotus-like eyes are like lotuses, the fish are like shoulders. The waves are like the shores, it removes all the troubles. Those shores Mukundamala Prayer 10, which is deep and conducive to understanding. Devotees of God, welcome to the seventh canto, eighth podcast of Srimad Bhagavata Tatva Deepika. Until now, in the story of Prahlada, Prahlada and Hiranyakashipu have a conversation in between. As part of that conversation, Hiranyakashipu asks if he is anywhere. He tells him that he is everywhere and instills faith When it is struck, it is said that he is in this pillar, and when it is broken, a loud sound is produced, until then we have learned. After that Let's take the part. That the word of his devotee Prahlada that God is pervading is true. To proclaim that the Lord is pervading in all substances without being visible, and to proclaim that Hiranyakashipu was given a boon by Brahma, to be able to kill him without being a beast or a human, with an extraordinary form, Narasimham The pillar was revealed. Hiranyakashipu looked. He's watching all sides. Surprisingly, Narasimha Murthy appeared on the pillar. The form is indeed terrifying. Eyes that gleam with golden color, a face covered with a tuft of hair, a mouth that roared terribly, sharp fangs.

A tongue that moves like a knife, curled eyebrows, upright ears, a mouth that is as wide as a mountain cave, and a body that touches the sky. Not too long, not too fat, a broad neck, a slim waist, white hair like moonbeams, with nails spread all over, shoulders spread all over, many weapons are holding. That form is such that it is impossible to approach and threaten all the demons. Seeing that, Hiranyakashipu became enchanted by Srihari. Thinking that he had assumed this form to kill me, he seized the mace and, like a scorpion jumping into the fire, he rushed upon Narasimha with a radiant aura. Before creation, when all the worlds were dissolved and attained the form of darkness, this Narasimha is the radiant form that perceives that darkness. Just as Garuda caught Hiranyakashipu, who had come in the mace, in his grip, so he caught and held him. As Narasimha was about to release his grip, he was compelled to do so, and Hiranyakashipu fell down. Seeing that, the gods, Swami He abandoned fate, fearing a strange danger. Hiranyakashipu, unable to bear his own valor, thought that Narasimha had abandoned him and, holding a sword and shield, pounced on Narasimha. Having flown and come, Sri Narasimhamurthy, holding the demon lying on the ground like a snake holding a mouse, sat on the door, laid down on his lap, and tore him apart with his nails. The intestines were removed and worn as necklaces. The blood was stained and was red with clots. I was feeling like this with my tongue. That form, that movement, was a bad spectacle. Thus, not on earth, not in the sky, but standing on his thighs, he killed him, and he killed thousands of demons who came with weapons and stood behind him, and he shook his tail once.

The clouds have scattered. The planets looked dim with intense gazes. That Narasimha, without letting go of breath, the oceans were disturbed by that wind. The lions roared, and the elephants cried out in fear. As the moon was setting on the face, when it rose, the airplanes flying in the sky were scattered far apart. The gods sounded the drums. Gandharva women began to dance and sing. Brahma, Indra, Parameshwara, sages, ancestors, Kinnaras, Sunandadi. All those who began to do so, stood in awe, having paid their respects to that Narasimha Murthy. They all praised that Narasimha Murthy in this way. Brahma. Salutations to you, the infinite one with immense power, with a wondrous and virile nature, the creator, preserver, and destroyer of the universe. Rudra is saying this, O devotee-loving one, your anger is like the time of destruction. This demon, how much can he match your anger? How much is he worth? You killed him and saved his son with love. What is Indra saying, O Supreme Being? All the portions of our Yagnya (sacrificial fire) have been stolen by this Hiranyakashipu, causing us harm He met. Today, our share will be available to us. Our heart's lotus, for so long, without the opportunity to remember you, has been occupied by this. Occupied. Today, once again, our heart's lotus, which is your abode, has blossomed. Narasimha, even salvation is not a reward for those who desire to serve you. Indra spake. The sages recite. Oh, God of gods, You are our supreme penance. This world, which is absorbed in you by the power of your divine light, was created by you. For so long, he has been disrupting our penance. Again, today you have given us the opportunity for penance and protected us. The ancestors are saying, may this one accept the shraddhas and tilodakas that our descendants have bestowed upon us. Eenadu neechi

This fellow has had a breakup. And all righteousness is preserved, and protected. The Siddhas are saying that he has looted all the powers earned by us through Bhakti Yoga with his penance and Yoga strength. You made him with your nails, Rishimaha, we salute you. Thus, the Vidyadhars, Gandharvas, Prajapatis, and all others praised Narasimha Murthy. Brahma, Rudra, and others, unable to reach the Lord who was in intense anger, stood at a distance. Lakshmi Devi also, having never heard or seen such a wonderful Narasimha form before, was hesitant to approach him and stayed at a distance. Then Brahma said to Prahlada, "You are the one who stood nearby. Swami, please calm him. Prahlada, who is angry with your father, go near him and pray." Prahlada, being a child, was a great devotee, so he did not fear, Swami Approaching, he prostrated himself before the Lord's feet. That Narasimha Murthy, being merciful, lifted up the boy who had fallen at his feet. Laying down, placing his hand on his head He placed it. With the touch of that divine hand, all the inauspicious things of Prahlada were removed. Suddenly, the form of the soul, the form of the divine, manifested to him. My heart is filled with joy. With the mind fixed on the lotus feet of the Lord, with overflowing devotion, with a heart and eyes moist, he began to sing praises with concentration. Lord Narasimha, I belong to the cruel demon race. I am not qualified to praise you in any way. Even the gods like Brahma and the sages who are predominated by the quality of goodness cannot praise you. To satisfy you Wealth, Beauty, penance, scholarship, sensory strength, physical strength, virility, intellectual capabilities are not. Without devotion, no matter how great you are, they cannot attract your heart. A tigress, Gajendra, was able to attract your heart through her devotion, wasn't she?

The Brahmin should have the following 12 soul qualities. Righteousness, truth, self-control, wisdom, and absence of envy. Shame on wrong work, Orimi, Aswaya not being there, charity, Yagnya, courage, vow. Padmanabha, who has these 12 qualities, will not receive God's grace unless he has devotion to the lotus feet. Even if one is born in a lowly family, one should use his word, mind, wealth, and life for the sake of God. He who is full of love will receive God's grace. A low-caste person with devotion is superior to a Brahmin filled with ego without devotion. Worship the Divine One is not for worshipping God. He is the one who has fulfilled all desires. He is perfect. He does not need the honor we give him through worship. He will accept those who worship Him, and those who worship the world will worship Him. To worship God, it is to adorn one's own face to appear beautiful in a mirror, but it is not an ornament to the form that appears in the mirror, is it? The worship of God bestows honor on those who worship. Bhagavantani And the world shall worship them. He who desires honor should worship God. “Take back the wrath. The demon is killed. Killing a scorpion, a milk, or a snake brings joy even to the best of people. Others, who are suffering because of him, will be happy. They remember the entire world to have the form of this terrifying Narasimha to have fear. Lord, your face, mouth, tongue, eyes, eyebrows, fangs, and intestines, which are very terrible and frightening. Your roar, which shook even the blood-soaked tigers and giants, and your nails that tore through the enemy, do not cause me fear. This cycle of life is more terrible than anything else. Bound by karmas, it is unbearable, intense, and delusional.

The fear that one experiences in life is beyond description. Lord, the way to free from this is at your feet. When will you call me to reach that? Hey Nrusimha, when you neglected, the protectors of the child are not the parents. Medicine is not a refuge for the sick. If you desire the one who is drowning in the sea, the boat is not your protection. In this world, all the substances that appear as different sounds, forms, and natures, having different natures, have become yours through you, through you, and have become yours for your sake, and you have become yours for your sake. There is nothing inside that you have not ordained. It is only by wholeheartedly believing that you are the only solution that there is another way to escape from this cycle of life. This world, to the wheel, this world, to the wheel, in the middle, the navel, the mind, the beginningless God, the illusionary power, the actions of the senses, the knowledge of the senses, the business of the senses, this mind in the middle, like leaves to the navel, time is attached. With the cooperation of the sixteen gunas, what helps this chakra to rotate? Ee samsara The creature on the wheel. There is no other way but to take refuge in your feet to get out of its whirlpool. After that, let's learn about the praise that Prahlad did in another podcast. Jai Srimannarayana. Salutations to the Gurus