నైమిశారణ్య ఘట్టము & మునుల ప్రశ్నలు (Parts 1-4)

Sages of Naimisharanya (Parts 1-4)

bhagavatam

ఈ ఎపిసోడ్ పవిత్రమైన నైమిశారణ్యంలో మహర్షులు సమావేశమై సమస్త లోక కళ్యాణం కోసం దీర్ఘకాలిక యజ్ఞాన్ని నిర్వహించే దివ్యమైన ఘట్టంతో శ్రీమద్భాగవతాన్ని ప్రారంభిస్తుంది. శౌనక మహర్షి నేతృత్వంలో సమావేశమైన మునులు, వ్యాస శిష్యుడైన సూత గోస్వామిని సమీపించి, ఆయనను జ్ఞాన సముద్రంగా గుర్తిస్తారు. మానవాళికి పరమ శ్రేయస్సు ఏదో, సకల శాస్త్రాల సారమేమిటో, పరమాత్మను పొందే ఉత్తమ మార్గమేదో అని మునులు అడిగిన ప్రశ్నలు సమస్త భాగవత ప్రవచనానికి పునాదిగా నిలుస్తాయి.

This episode opens the sacred Srimad Bhagavatham with the gathering of great sages in the holy forest of Naimisharanya, where thousands of seers assembled to perform a prolonged yajna for the welfare of all beings. Led by the venerable Saunaka Maharshi, the assembled sages eagerly approach Suta Goswami, the learned disciple of Vyasa, recognizing him as the ideal narrator of divine wisdom. The sages pose profound questions about the highest good for humanity, the essence of all scriptures, and the most worthy object of devotion — questions that set the stage for the entire Bhagavatham to unfold.

← Prev
Sages of Naimisharanya (Parts 1-4) bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవతం తత్వ దీపిక పాడ్కాస్ట్ లో మీ అందరికీ సుస్వాగతం శ్రీమాన్ ఉభయ వేదాంత ప్రవర్తకాచార్యులు శ్రీ భాష్యం అప్పలాచార స్వామి వారు. సంపూర్ణ భాగవతానికి అందించినటువంటి తత్వదీపిక పుస్తకాలను యథాతథంగా భక్తులందరికీ చిన్న చిన్న పాడ్కాస్ట్లలో అంటే 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలో అందించడానికి చేసే ప్రయత్నమే ఈ పాడ్కాస్ట్. ఈ 10 15 నిమిషాల్లో అందిస్తున్నటువంటి చిన్న చిన్న తత్వ అంశాలను అందరూ కూడా ఆనందిస్తూ అనుభవిస్తూ తరిస్తూ పదిమందితో పంచుకుంటూ ఆ తత్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని ఆ పరమాత్ముని అనుగ్రహంతో మీ అందరికీ ఈ విషయం అందుకొని ఆనందించే ప్రయత్నం చేస్తారని భగవంతుని ప్రార్థిస్తూ ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాను. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః శ్రీ పరాశర పుత్రుడగు వ్యాస భగవానుడు ప్రార్థనతో మనం ప్రారంభిద్దాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః శ్రీ పరాశర పుత్రుడగు వ్యాస భగవానుడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అంశచే అవతరించినాడు.

అతనిని బాధరాయణుడు అని కూడా వ్యవహరిస్తుండు. ఏ దోషములను అంటనివాడును సమస్త కళ్యాణ గుణములు కలవాడును అగు పరబ్రహ్మము. కారుణ్యముచే బ్రహ్మ మొదలు తృణము వరకు గల భూతములను సృజించినాడు. అందు దేవతలు, మనుష్యులు, తిరియక్కులు, స్థావరములు అని నాలుగు విధములగు శరీరములతో జీవులు ఉన్నారు. స్త్రీ పురుష భేదముతో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణ విభాగముచే బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస ఆశ్రమ భేదముచే జగత్తు అనేక భేదములు కలిగి ఉన్నది. ఈ జగత్తులో భగవానుడు తనను ఆరాధించి కర్మబంధమును వీడి మహదానంద ధామమగు తనని చేరుటకు ఈ శరీరములను ప్రసాదించినాడు. వారి నడువడి వారికి తెలియజేయుటకు వారు పొందదగిన ధర్మ, అర్ధ, కామ, మోక్ష రూప చతుర్విధ పురుషార్థములకు సాధనములను ఎరంగించుటకు చతుర్ముఖ బ్రహ్మ నుండి పరంపరలో వేదములను ప్రసాదించినాడు. వేదములు భగవానుని నిశ్వాసం వలె అప్రయత్నముగా అంతకు ముందున్నవే బయలుబడినవి కానీ పురుష ప్రయత్నముచే రచించబడినవి కావు. శరీరములను ఇచ్చి పొందవలసిన పురుషార్థములను పొందుటకు తగిన జ్ఞానమును అందచేసినను మానవులు తమ తమ కర్మ వాసనలకు ప్రాబల్యముచే వాని అనుసరించి ప్రవర్తించుచు బుద్ధులకు తగినట్లు కర్మలను చేసి గర్భవాసమును జన్మ జరా మరణములను పొందించి సాంసారిక దుఃఖములను అనుభవించుచు

వేదార్ధములను ఎరుంగక చెడిపోవుచున్నారు. అట్టి ప్రాణికోటిని చూచి భగవానునికి మనస్సులో కృప కలిగింది. వారిని ఎట్లయినను జీవితంలో ఉన్నతమైన స్థితిని పొందునట్లు చేయవలెనని సంకల్పించినాడు. వారికి వేదమును వసంగినాడు. ఆ వేదము రెండు భాగములు. మొదటి భాగము దుఃఖములను తొలగించుకొని సుఖముగా జీవించుటకు చేయదగిన కర్మలను ప్రతిపాదించెను. రెండవ భాగము జీవుడు తానెవరో తానెరింగి తాను పొందవలసిన ఆనంద స్వరూపుడగు భగవానుని ఎరింగి వానిని పొందుటకు ఉపాయమేమో. వాని స్వరూపమెట్టిదో ప్రతిబంధకమేమో వేదము పొందుటచే కలిగెడు లాభమేమో ఎరింగించెడి జ్ఞానమును వివరించింది. వేల కొలది తల్లిదండ్రుల కంటే మనపై వాత్సల్యం కలది. కానీ ఆ వేదం ప్రతిపాదించిన జ్ఞానమును మానవులకు ఎరుంగుటకు శక్తి చాలదు. అప్పుడు భగవానుడే వ్యాసుడే అవతరించి ఆ వేదమునకు వ్యాఖ్యానం వ్రాయవలెనని సంకల్పించి తన శిష్యుడగు జైమినిచే వేదములోని పూర్వభాగమగు కర్మకాండమునకు వ్యాఖ్యానం వ్రాయించెను. దానిని పూర్వ మీమామసా అంతర్ జ్ఞానమును ప్రసాదించడి వేదములోని ఉత్తర భాగమునకు తానే వ్యాఖ్యానము చేదలంచి బ్రహ్మ సూత్రములను పేరుతో వివరించెను. దానిని ఉత్తర మీమాంస అంటారు. అందు సూక్ష్మమైన విషయములను సామాన్యులు ఎరుంగలేరని విస్తరించి స్పష్టంగా చెప్పవలెనని పూర్వభాగ వివరణముగా పంచమ వేదమని ప్రసిద్ధి చెందిన శ్రీ మహాభారతం అని ఇతిహాసమును తాను రచించెను. ఉత్తర భాగము జ్ఞాన భాగము కనుక ఉపనిషతార్థమును వివరించు శ్రీమద్భాగవతమనడి పురాణమును కూడా తాను రచించెను.

ఈ భాగవతము పురాణములలో అత్యంత శ్రేష్టమైనది. ఇది పరమ సాత్వికమైన పురాణం. ఇది అశేష జగత్తున పరమ నిశ్రేయసమును కోరెడి వారందరూ అధ్యయనము చేయదగినది. వ్యాసుల వారు తమ కుమారుడగు శ్రీ సుఖులకు అధ్యయనము చేయించిరి. శ్రీ సుఖయోగి పరీక్షిత్తునకు ప్రవచించుటచే లోకమున ప్రచారము వచ్చురచే భాగవతమును శ్రీ సుఖయోగియే రచించెనని కొందరు భావింతురు. కానీ బహు పురాణ ప్రావీణ్యముచే శ్రీ వ్యాస భగవానుడే దీని రచించెనని పెద్దలు నిర్ధారించినారు. భాగవతము 18000 శ్లోకములు గల గ్రంథము ఇందు 12 స్కంధములు హయగ్రీవ బ్రహ్మ విద్య. రుద్రవధ ప్రతిపాదింపబడినవి. ఈ భాగవతము గాయత్రీ మంత్రముతో ఆరంభించబడినది. ఆ విషయాన్ని వచ్చే పార్ట్స్ కాస్ట్ లో తెలుసుకుందాం. అస్మద్ గురుభ్యో నమః జై శ్రీమన్నారాయణ.

Jai Srimannarayana, salutations to the Guru. Devotees of the Lord, welcome to all of you in the Srimad Bhagavatam Tattva Deepika Podcast. Sriman Ubhaya Vedanta Pravartakacharyulu, Sri Bhashyam Appalachara Swamy Varu. This podcast is an attempt to provide the Tattvadipika books, which have been given to the complete Bhagavata, in their original form to all the devotees in small podcasts, that is, in a period of 10 to 15 minutes. In these 10-15 minutes, everyone enjoys, experiences, and shares the small philosophical aspects that are being provided, and tries to understand that philosophy. With the grace of that Supreme Being, to all of you, this I am starting this effort praying to God that they will try to enjoy the subject. Krishnaya Vasudevaya, Devaki Nandanaya, Cha Nandagopa Kumaraya, Govindaya, Namo Namah. Let us begin with the prayer of Vyasa Bhagavan, the son of Sri Parashara. Vyasaya Vishnu Rupaya Vyasa Rupaya Vishnave Namo Vai Brahmanidhaye Vasisthaya Namo Namah Sri Parashara Putra Vyasa Bhagavan incarnated as an aspect of Srimannarayana himself.

He is also referred to as Vyatharayan. He who does not touch any faults, he who has all the auspicious qualities, is the Supreme Brahman. By compassion, he created beings from Brahma to the smallest grass. Therefore, there are beings with four types of bodies: gods, humans, giants, and creatures. With the distinction of male and female, the world has many distinctions such as Brahmachari, Grihastha, Vanaprastha, and Sanyasa Ashrama distinctions based on the division of Brahmin, Kshatriya, Vaishya, and Shudra castes. In this world, the Lord has granted these bodies to worship Him, to break free from the bonds of karma, and to reach Him, the abode of great bliss. To make them aware of their conduct, to remove the means for the fourfold Purusharthas of Dharma, Artha, Kama, and Moksha, which they can attain, the Vedas were bestowed upon them from the four-faced Brahma. The Vedas, like the breath of God, were unintentionally revealed beforehand, but they were not composed by human effort. Humans, even though they are given bodies and are provided with the necessary knowledge to attain the goals of life, Following their respective karmic influences, acting accordingly, performing actions appropriate to the Buddhas, causing them to experience pregnancy, birth, old age, and death, and experiencing worldly sorrows

They are getting spoiled without understanding the meaning of Vedas. Seeing such a creature, the Lord felt compassion in his heart. He resolved to enable them to reach a higher state of life, by any means. He who has established the Vedas. The Vedas are divided into two parts. The first part proposed actions that can be done to remove sorrows and live happily. The second part is, the soul, knowing who it is, knowing that it is the embodiment of bliss that it should attain, the way to attain that God. What is his form, what is the obstacle, what is the benefit of attaining the Vedas, it explained the knowledge of explaining. Thousands of times more affectionate than their parents. But the knowledge that the Veda proposes is not enough for humans to understand. Then, the Lord himself, Vyasa, incarnated and resolved to write an explanation for that Veda, and through his disciple Jaimini, he had the Karmakanda, the former part of the Veda, written as an explanation. It is to grant the inner knowledge of the past, to interpret the Uttara part of the Vedas He explained it in the name of the Brahma Sutras. It is also known as Uttara Mimamsa. Therefore, to explain the subtle matters in detail and clearly, as an explanation of the former part, he composed the Sri Mahabharatam, which is famous as the fifth Veda, as an epic. The northern part is the part of knowledge, therefore, he also composed the Srimad Bhagavatam, which explains the meaning of the Upanishads.

This Bhagavatam is the most excellent among the Puranas. It is a very spiritual and pure legend. This is worth studying by all those who desire the ultimate perfection in the infinite universe. Vyasa taught his son, Sri Sukha, to study. Some believe that Sri Sukha Yogi composed the Bhagavatam because it spread throughout the world by preaching to Sri Sukha Yogi. But, due to his vast knowledge of the Puranas, the elders have determined that Sri Vyasa Bhagavan himself wrote this. Bhagavatam is a book with 18000 verses, in this, 12 chapters, Hayagreeva Brahma Vidya. Rudra's offerings are made. This Bhagavatam was begun with the Gayatri Mantra. Let's find out about that in the next part of the cost. Asmad Gurubhyo Namah Jai Srimannarayana.