సతీదేవి యోగాగ్ని దేహత్యాగ వృత్తాంతము

The Self-Immolation of Sati in Mystical Fire

bhagavatam

ఈ భాగవత ప్రవచనంలో, తన తండ్రి దక్షుడు శివభగవానుని అవమానించడాన్ని సహించలేకపోయిన సతీదేవి, తన దేహాన్ని త్యజించాలని నిశ్చయించుకున్న హృదయవిదారక సన్నివేశాన్ని తెలుసుకుంటాము. యోగశక్తి ద్వారా అగ్నిని సృష్టించి, ఆమె తన శరీరాన్ని అందులో అర్పించుకుంటుంది — ఇది పాతివ్రత్యానికి మరియు ధర్మానికి ఆమె చేసిన సర్వోన్నత త్యాగం. సతీదేవి యొక్క అచంచలమైన భక్తి, నిజాయితీ మరియు ఆధ్యాత్మిక ధైర్యం ఈ ఘట్టాన్ని భక్తులందరికీ శాశ్వతమైన స్ఫూర్తిగా నిలిపాయి.

In this profound episode of the Srimad Bhagavatham, we witness the heartbreaking moment when Sati Devi, unable to bear the insult inflicted upon Lord Shiva by her father Daksha, resolves to relinquish her body. Through the power of mystic yogic fire, she offers herself as the ultimate sacrifice, demonstrating that devotion to one's husband and dharma outweighs even the bonds of family. This sacred episode reveals the depth of Sati's love, her unwavering integrity, and the profound spiritual courage that makes her an eternal ideal for all devotees.

← Prev Next →
The Self-Immolation of Sati in Mystical Fire bhagavatam

జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమః ఆధ్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞాన మూర్తయే ప్రాణేంద్రియ మనోబుద్ధి వికారైర్వ్యక్తమీయుషే జగత్తునకు మూల కారణము పరమేశ్వరుడే శుద్ధ చైతన్య స్వరూపుడవు ఆయనయే ప్రాణుల అంతఃకరణముల యందు వివిధములకు విశేష జ్ఞానముల రూపముగా ప్రకటమగుచున్నాడు. ప్రాణము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధి అనే కార్యముల రూపముగా ఆయనయే ప్రకటమై ఉన్నాడు. అట్టి. పరమాత్మకు నమస్కారము. సెవెంత్ క్యాంటో థర్డ్ చాప్టర్ 28 ప్రేయర్. భగవత్ బంధువులారా శ్రీమద్ భాగవత తత్వ దీపికా చతుర్ధ స్కంధము. ఐదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. విదుర మైత్రేయ సంవాదంలో భాగంగా మనము దక్ష ప్రజాపతి వృత్తాంతంలో ఉన్నాము. ఇంతవరకు సతీదేవి దక్షుడు చేసే యజ్ఞానికి వెళ్తా అన్నప్పుడు రుద్రుడు వారించినటువంటి వైనాన్ని మనం తెలుసుకున్నాం. ఆ తరువాత ఏం జరిగిందో విందాం. శంకరుడు ఇంతవరకు ఆమెకు చెప్పవలసిన మాటలు చెప్పెను. ఆమెను వెళ్ళుమని అనుమతించిన అచట పరాభవము చెందును. ఆమె దేహత్యాగము చేయును. వెళ్ళవలదని వారించిన బాధచే దేహత్యాగము చేయును. ఎట్లైనను ఆమె నశించునని ఏమియు మాట్లాడక ఊరకుండెను. సతీదేవి తన తల్లిదండ్రులను చూడవలెనని కోరికతో వెళ్ళవలెనని సిద్ధపడుచున్నది. కానీ భర్త ఆజ్ఞ మీరి వెళ్ళుటచే ఏమి హాని కలుగును అని భయపడుచున్నది. ఇటు దుఃఖించుచు తన బంధువుల పైనున్న ప్రేమచే కంటనీరు పెట్టుచు మనసున బాధపడుచు అందరును సమముగా చూచెడి వృద్ధుడు వరదని వారించినాడని కోపముచే ఒడలు వణికిపోవుచు తీవ్రముగా చూచెను. దీర్ఘముగా నిట్టూర్పు వదిలెను. జ్ఞానము గల మహాయోగులకు ప్రియుడగు పరమశివుడు ఆమెకు తన అర్ధ శరీరమును ప్రేమతో వసంగినాడు.

అట్టి వానిని వదిలి వెళ్ళుట తగదు కానీ స్త్రీ స్వభావముచే ఆమె బుద్ధి కలుషితమైనది. బంధువులను చూడవలెనని ఆశ ఇంకా ఇక ఉండదని ఒకవైపు శోకము భర్త వలదనినాడని కోపము రెండింటితో బాధపడుచు ఆగలేక. తండ్రి భవమునకు భవనమునకు బయలుదేరినది. తొందర తొందరగా అడుగులు వేసుకొనుచు తోడు ఎవరును లేకనే సాగుచున్నది. రుద్రుని అనుచరులు వందల కొలది ఆమె వెంట బయలుదేరిరి. పార్షదులు, యక్షులు మున్నగు వారితో కూడి మణిమంతుడు మొదలగు వారు ఆమె వెంట నడిచిరి. రుద్రుడు తనతో రాలేదని మనసులో బాధపడుచున్నది, భయపడుచున్నది కానీ ఆగలేక బయలుదేరినది. పరిచారికలు వృషభ వాహనమును తెచ్చి వాహనమును తెచ్చి ఆమెని దానిపై కూర్చుండ చేసి గోరువంకలు మొదలగు పక్షులు, బంతులు, అద్దములు, తామర పువ్వులు, తెల్ల గొడుగులు, చామరములు, పుష్పమాలలు మొదలగు పరికరములన్నింటినీ ఆమెతో పంపిరి. అలంకరించుకొని పరివారమంతయు ఏగెను. యాగభూమిని చేరిరి. ఆ యాగభూమిలో అంతటా వేద ఘోష వినపడుచుండెను. యజ్ఞములో చేయు పశు విశసనము జరుగుచుండెను. అంతటా బ్రహ్మ ఋషులు దేవతలు నిండి ఉండిరి. మట్టి పాత్రలు ఆయా వేదికల వద్ద ఉండెను. ఆమె వచ్చినదనియు తల్లియు తోబుట్టులను చూచి పలకరించిరే కానీ ఇతరులెవ్వరూ పలకరించలేదు. ఆమె అక్కలు చెల్లెండ్రు ప్రేమతో కంఠదడి పెట్టుచు కౌగలించుకొనిరి. తండ్రి మాత్రము ఆమె వైపు చూడలేదు, ఆదరింపలేదు. అక్కలు, చెల్లెళ్ళు కుశల ప్రశ్నలు అడిగినను, మాట్లాడినను, తల్లి పినతల్లులు మాట్లాడినను తండ్రి మాట్లాడలేదన్న బాధతో. ఆమె వారు చేసిన ఆదరణం స్వీకరించలేదు. ఆసనముపై కూర్చుండలేదు. ఆ యజ్ఞములో తన భర్తయగు రుద్రునకు భాగము కల్పింపబడలేదు. తండ్రి రుద్రుని హేళనము చేసినాడు. తానై తాను వచ్చినను అతడు పలకరింపలేదు. లోకములను దహించునా అనునంతటి కోపము ఆమెకు కలిగెను. రుద్రుని అవహేళనము చేసినారని మణిమంతుడు మొదలగు రుద్ర పార్షదులు భూతగణములు ఆ దక్షుని చంపవలెనని సిద్ధపడుచుండిరి.

వారిని ఆమె వారించినది. అతడు చనిపోయిన తరువాత ధూమాది మార్గములో వెడలి మరల జన్మించుటకే ఈ యజ్ఞం ఉపకరించును కానీ మోక్షములో సంగ జాలదు. అంత మాత్రమునకు అతడు గర్వించి శివుని ద్వేషించుచున్నాడు. ఆమె మనసు బాధపడినది. అతడు వినునట్లుగా దక్షిణ నిందించుచున్నది. రుద్రుడు సమదర్శి అతనికి ప్రీతిపాత్రులు గాని అప్రియులు గాని లేరు. విశ్వమును పరమాత్మాత్మకముగా చూచువాడతడు. సర్వభూత సుహృత్వై వైరమును ఎరుంగని అందరకూ ఆత్మ వలె ప్రియమైన శివుని యందు నీవు తప్ప వేరొకడెవ్వడు పగపట్టుకొను. నీ వంటి వారు కొందరు దుర్జనులు గుణములు కలిగిన సత్పురుషులలో దోషములనే గుర్తించి దూషించుచుందురు కానీ వృద్ధుని వంటి మహాపురుషులు దోషములను చూడరు. అల్పములైన గుణములను కూడా విస్తరింపచేసి ఆనందింతురు. వారు మహాత్ములు. అట్టి మహాత్ముల విషయమున నీపై నీవై అపరాధము చేసితివి. శివం వంటి శరీరమునే ఆత్మ అని భావించెడి నీ వంటి వారు. మహాపురుషులను నిందించుట ఆశ్చర్యము కాదు. మహాత్ముల పాద ధూళిచే సమస్తములగు అరిష్టములు తొలగిపోవును. నీ వంటి వారికి పెద్దలను నిందించుటయే సహజము. లోకములో శివ అను రెండు అక్షరములను మాట వరుసకైన ఒక్కసారి ఉచ్చరించిన నాడు పాపములు తొలుగును, శివాగ్ని ఎవరును మీరజాలరు, కానీ నీవు అమంగళకరుడవై శివుని ద్వేషించుచున్నావు, నీకు మంగళము కలగదు. రుద్రుడు బ్రహ్మానందమును ఉసంగి ఉసంగజాయినవాడు ఆ బ్రహ్మానందమనెడి మకరంద రసమును ఆస్వాదింపవలెనని మహాపురుషుడు తమ మనస్సుననెడి తుమ్మెదలతో శివుని పాదపద్మములను చేరుతుందురు. లోకములో కోరిన వారికి అభిష్టములను వర్షించువాడు అతడు. లోకులందరికీ అనుకూలుడు. అట్టివానికి నీవు ద్రోహమును తలపెట్టుచున్నావు. నీవు అతని అలవాటులను చూచి అతడు అమంగళకరుడని తలంచినావు. అతడు స్మశానంలో వసించును. అచర మాలికలను, భస్మమును, కపాలమును ధరించి పిశాచములతో సంచరించుచుండును. అతని ఆచారములను చూచియు ప్రజాపతులందరు అతని పాదస్పర్శ కలిగిన వస్తువులను శిరస్సులతో ధరింతురు.

అతనిని అమంగళములగు ఆచారములు కలవాడైనను శివుడనే కీర్తింతురు. అతడు ధర్మరక్షకుడు, ఈశ్వరుడు, మహాత్ముడు. నిరంకుశములకు దూషణములతో కొందరు వానిని దూషించినప్పుడు వారిని వారింపగల సామర్థ్యం లేనప్పుడు చెవులు మూసుకునవలెను వినరాదు. శక్తి ఉన్నచో శివ దూషణము చేసిన వాని నాలుకను ఛేదింపవలెను అట్లు శిక్షింపలేనిచో తన శరీరమును విడ వీడవలెను. నీవు శంకర ద్వేషివి. నీ నుండి పుట్టినది నా ఈ శరీరము. ఈ శరీరము ఇంక నేను ధరించను. తెలియక విడువదగిన అన్నము తిన్ననాడు దానిని క్రక్కివేయుటయే ప్రాయశ్చిత్తం. పరిశుద్ధ మనస్సుతో గ్రహింపబడిడి బ్రహ్మమునందే రమించెడి వానికి మోహము కలగదు. అతని బుద్ధి కర్మలను చేయవలెనని ప్రశంసించెడి వేద వాక్యమునందు ప్రవర్తించును. బ్రహ్మనిష్ఠుడు, నివృత్తి మార్గనిష్ఠుడు అగు రుద్రునకు ప్రవృత్తి మార్గమునందు రుచి ఉండదు. ప్రవృత్తి, నివృత్తి మార్గములు భిన్నములు. దేవతల ఆకాశమునందే సంచరించుందురు. మనుష్యులు భూమిపైనే సంచరింతురు. నీవు కర్మనిష్ఠుడవు, నీకు అది గొప్ప కావచ్చును. అది నీకు ధర్మము కనుక ఆచరింపుము గాని రుద్రుని అపేక్షించి అధిక్షేపించుట నీకు తగదు. స్వర్గాది ఫలములు కోరి చేయు యజ్ఞాది కర్మ ప్రవృత్తి. బ్రహ్మమునే కోరి ఫలాకాంక్షతో ఫలకాంక్షతో విజ్ఞాదులను చేయకుండుట నివృత్తి. ఆ విషయము వేదము స్పష్టముగా చెప్పినది. ఇవి రెండు భిన్న మార్గములు అగుటచే ఒక్కసారి ఒక్కడు ఒక్కడు ఆచరించుట సంభవము కాదు. శివుడు వేద బాహ్యుడను కర్మను పరిత్యగించిన వాడును కాడు. అతను బ్రహ్మనిష్టుడు. కనుక అతనికి కర్మతో సంబంధము లేదు. అందుచేత మేము నివృత్తి మార్గ నిష్టులము కనుక మాకు అణిమాది సిద్ధులు ఉండును. కర్మనిష్టులగు మీకు ఉండవు. మీరు యజ్ఞశాలలో అన్నముతో తృప్తి చెందుచు ధూమాది మార్గమును ఇచ్చెడి కర్మలను ఆచరించి ప్రాణములను నిలుపుకొనుచు యజ్ఞశాలలో ఉందురు. మీరు పొందెడి పదవులు కొంతకాలం ఉండిపోయెడి స్వర్గాధిపదవులు. మేము పొందినది ఇట్టివని ఎవ్వరును నిర్ణయించుటకు శక్యము కాని పదవులు. జరా మరణాది సాంసారిక ధర్మములు మాకుండవు. ఇన్ని మాటలెందుకు నేను రుద్రుని విషయమును అపరాధమును చేసి నీవు రుద్రుని విషయమును అపరాధము చేసితివి. నీ నుండి నా దేహం పుట్టినది.

నేను ఈ శరీరమును విడిచెదను, మీ కుమార్తెనని చెప్పుకొనుట నాకు సిగ్గుగా ఉన్నది. వాపచారము చేసిన నీతో సంబంధము గల ఈ జన్మ నిందింపదగినది. నీ కూతురు నగుటచే నన్ను దాక్షాయణి అని వ్యవహరించును. కానీ ఇక ముందు ఎప్పుడైనా పరమశివుడు హాస్య ప్రసంగములలో చిరునవ్వులతో దాక్షాయణి అని పిలిచినచో నీ పుత్రికననే స్మరణకు వచ్చి నా మనసు బాధపడుచుండును కనుక ఈ శరీరమును ఇప్పుడే వదులుచున్నాను. విదురా ఈ విధముగా సతీదేవి దక్షునితో మాట్లాడి ఉత్తర దిక్కుకు తిరిగి మాటను లోననే నిరోధించినదై కూర్చుండెను ఆచమనము చేసెను. పత్సని పట్టుబట్టతో శరీరమునంతను కప్పుకొనెను. కనులు మూసి యోగ మార్గమున శరీరమునే వీరుటకు సిద్ధపడినది. ప్రాణాపాన వాయువులను సమానము చేసినది. నాభి వద్ద నిరోధించినది. తరువాత ఉదాన వాయువును పైకి లేపినది. హృదయములో ఉదాన వాయువు నిలిపి కంఠ మార్గమును కనుబొమ్మల మధ్యకు తెచ్చినది. మహాత్ములలో గొప్పవాడగు రుద్రుడు ఆ ఆదరముతో మరల మరల తన ఒడిలో కూర్చుండ చేసుకునిన ఈ శరీరమును దక్షుని నుండి పుట్టినది అను కోపముతో విడువ సిద్ధపడినది. అవయవములలో అనిలాగ్నులు ధారణ చేసినది. వాయువును అగ్నిని ఇంద్రియములలో ధారణచే పుట్టించినది. జగద్దురోగు తన భర్తయగు రుద్రుని యొక్క పాద పద్మ మకారాంధ ఆస్వాదమును తలంచుకొనుచు భర్తను తప్ప వేరొక దానిని తలంచకుండా ఉండెను. వెంటనే ఆమె శరీరము నుండి అగ్నిహోత్రము బయలుదేరెను. శరీరము దహింపబడెను. భూమిపై ఆకాశముపై ఉన్న వారందరూ ఆ దృశ్యమును చూచి హాహా అని ఘోషించిరి. దేవతా శ్రేష్టుడగు రుద్రుని భార్య సతీదేవి దక్షునియందు కినుకతో ప్రాణములను వీడినది. ఆహా దక్షుని యొక్క దైర్జ్యం దౌర్జన్యం ఎంతటిది. చరాచరముకు విశ్వమంతయు రుద్రునకు బిడ్డుల వలె ప్రీతిపాత్రమైనది. అతని భార్య అయి ఉండి ప్రాణములను వీడినది. విశిష్టమైన గుణములు కలది. తన పుత్రిక సమ్మానింపదగినది. తాను ప్రజాపతి అయినను దక్షుడు ఆమెను గౌరవింపలేదు.

ఆమె చనిపోవుచుండగా చూచి ఊరుకొనునాడు. ఎంతటి దౌర్జన్యమో చూడుడు. ఆ దక్ష ప్రజాపతి బ్రాహ్మణుడు కాడు. బ్రహ్మ బంధువు అనగా బ్రాహ్మణుడు అని. పిలువబడి నీచ బ్రాహ్మణుడు అతడు దక్షిణ లోకములో అపకీర్తిని పొందును. రుద్రుని విషయంలో తాను చేసిన అపరాధం వలన తన కుమార్తె ప్రాణములను వీడుచున్నదని చూచియు తాను ఆమెను వారించిన వాడు కాదు. ఎంతటి పాపాత్ముడు. గర్వము ఎంతటి పనినైనను చేయును, అహంకారం వినాశ హేతువు. ఈ రకంగా జనులందరూ ఘోషించుచుండగా దక్షుడు చూచుచుండగా సతీదేవి దేహమును వీరుట ఆశ్చర్యము జరిగినది. దీనిని ఆమె వెంట వచ్చిన పరివారము చూసి ఆయుధములనెత్తి దక్షుడు చంపుటకు విజృంభించిరి. ఇట్లు వారు దక్షుడిపై వచ్చి పడుచునుట చూచి భృగువు దక్షిణాగ్నిలో రక్షోఘ్న మంత్రముతో హోమము చేసి యజ్ఞమును పాడు చేయుచున్న వారిని చంపెడి వారిని సృష్టించెను. భృగువు హోమము చేయగనే బుభువులు అనేటి దేవతలు వేల కొలది వారిని చంపుటకు చేతిలో కొరోల పట్టుకొని రుద్ర పార్షదులను కాల్చి వేయుచుండిరి. భయపడి వారందరూ అన్ని దిక్కులా పారిపోయిరి. తర్వాత జరిగిన భాగాన్ని తర్వాత పాడ్కాస్ట్ లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః.

Jai Srimannarayana, salutations to the Guru. Salutations to the seed of the chapter. The embodiment of knowledge and wisdom, the life force, the senses, the mind, and the intellect, the manifested form. The root cause of the world is the Supreme Lord, the embodiment of pure consciousness. He is in the inner instruments of the beings He is being declared as the form of special knowledge for various things. Life, senses, mind, intellect, in the form of actions, He is declared. Such. Salutations to the Supreme Soul. Seventh Canto, Third Chapter 28 Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika, Fourth Canto. Welcome to the fifth podcast. As part of the conversation between Vidura and Maitreya, we are in the context of Daksha Prajapati. Until now, we have learned about the way Rudra refused when Sati Devi said that he would go to Daksha's Yagnya. Let's hear what happens next. Shankar had told her all the things that he had to tell her so far. She will be defeated there, who allowed her to go. She will commit suicide. He will commit suicide because of the pain of being forbidden to go. However, she is destined to perish, nothing He was at a loose end. Sati Devi is preparing to go with the desire to see her parents. But she is afraid of what harm will befall her for going against her husband's orders. While grieving, with tears in his eyes, grieving in his heart, the old man, who looked equally upon everyone, said that he had refused the boon, and his shoulders trembled with anger, and he looked intensely. A long sigh. The supreme Shiva, who is dear to the great yogis who have knowledge, lovingly took his half-body for her.

It is not appropriate to leave such a person, but due to her nature, her intellect is impure. The hope that relatives should be seen is no longer there, on one hand, sorrow, and on the other hand, anger, suffering from both, unable to stop. The father set out for the palace. It is proceeding rapidly, taking steps without anyone with it. Hundreds of Rudra's followers left to follow her. Along with the Parshadas, Yakshas, and others, Manimanthudu and others followed her. Rudra, feeling sad and scared that he couldn't come with her, set out without stopping. The maids brought the bullock and the vehicle, and made her sit on it. Birds like the korangavakkalu (a type of bird), balls, mirrors, lotuses, white umbrellas, and chameeras (a type of fan) She was sent all the equipment including the flower garlands. The family gathered, dressed up. Reached the sacrificial ground. In that sacrificial land, the sound of the Vedas was heard everywhere. The animal sacrifice was taking place in the Yagna. All around were sages and gods. Earthen pots on the respective platforms It was not there. She came, but her mother and siblings greeted her, but no one else greeted her. Her sisters and brothers hugged each other, with love and affection. The father never looked at her, never cared for her. Sisters, sisters-in-law, asked about well-being, spoke, and spoke to the mother and paternal aunts, but the father did not speak with the sorrow. She did not accept the hospitality they offered. He is not sitting cross-legged. In that yagna, her husband Rudra was not given a share. Father ridiculed Rudra. He came on his own, but he didn't speak. She had such anger that she could burn the worlds. Because they mocked Rudra, Manimanthudu and other Rudra's associates, the ghosts, were preparing to kill that Daksha.

She had stopped them. After he dies, this Yagnya helps to go out in the path of smoke and to be reborn again, but it is not possible to be in liberation. At that very moment, he is proud and hates Shiva. She was hurt. He is accusing the south as if he is listening. Rudra is a seer, he has no favorites or disfavors. He sees the universe as divine. Knowing that all beings are well-wishers and that there is no enmity, who else but you, except for you, will take revenge on Shiva, who is dear to all? Some wicked people like you, who have virtues, recognize the faults in the virtuous and criticize them, but great men like the old do not see the faults. They expand even the smallest virtues and rejoice. They are saints. Regarding such great souls, you have committed a crime against yourself. Those who consider a body like Shiva as the soul. It is not surprising to see great men condemned. By the dust of the feet of the great souls, all the misfortunes will be removed. It's natural for people like you to blame the elders. In the world, when the two letters Shiva are uttered once in a row, sins are removed, no one can overcome Shiva's fire, but you are inauspicious and hate Shiva, you will not have good fortune. Rudra, who has relinquished the bliss of Brahman, the great man, with the intention of relinquishing, with the intention of relinquishing, to taste that nectar called Brahmananda, reaches the lotus feet of Shiva with the bees in their minds. He is the one who rains down desires on those who desire in the world. Well, a sympathetic person. You are trying to harm such a person. You saw his habits and thought he was inauspicious. He'll have to stay in the morgue. Wearing a garland of skulls, ashes, and a skull, he roams with demons. Seeing his customs, all the people worship the things touched by his feet with their heads.

They praise him as Shiva, even though he has unclean customs. He is the protector of dharma, the lord, the great soul. When some people insult him with abuses, when they do not have the ability to stop them, one should shut their ears and not listen. If there is strength, the tongue of one who has blasphemed Shiva should be cut off; if he cannot be punished in that way, his body should be torn apart. You are a Shankar Doshi. This body of mine was born of you. I will not wear this body anymore. If one eats food that is not known to be unclean, then the only atonement is to throw it away. He who is purified in mind, who is absorbed in Brahman, will not have delusion. His intellect acts in accordance with the Vedic words that praise him for performing his karmic duties. Rudra, who is devoted to Brahman and steadfast in the path of renunciation, has no taste for the path of activity. The paths of inclination and descent are different. The gods roam in the sky. Mankind inhabits the Earth. You are a dutiful one, and it may be a great thing for you. That is your dharma, therefore practice it, but Rudra's It is not appropriate for you to criticize by expecting. The tendency to perform actions like yajna etc., desiring the fruits of heaven etc. Desiring Brahman, without desire for fruits, without desire for fruits, not doing Vijnanadulu is cessation. The Vedas have clearly established this fact. These are two different paths, therefore, it is not possible for one person to follow both at the same time. Shiva is not external to the Vedas, nor is he external to karma. He is a Brahminsit. Therefore, he has no connection with karma. Therefore, since we are determined to be the path of renunciation, we will have the perfections of the first stage. You're not going to be a cynic about your duty. You, being content with food in the sacrificial hall, perform the rituals that give the path of smoke, sustain your lives, and stay in the sacrificial hall. The positions you have attained are heavenly positions that last for some time. What we have received are positions that no one can decide. Death and dying are not part of our family's religion. Why so many words? I have committed a sin regarding Rudra, and you have committed a sin regarding Rudra. From your body, my body was born.

I will leave this body, I am ashamed to say I am your daughter. This birth, which is related to you, who has done business, is blameworthy. Your daughter, because of her beauty, treats me like a Dakshayani. But from now on, whenever Parameshwara calls Dakshayani with smiles in humorous speeches, remembering your daughter, my mind will be saddened, therefore I am giving up this body now. Vidura, in this way, Sati Devi spoke to Daksha and, returning to the north, sat down, having prevented the word from entering her mind, and performed Achamanam. Patsani covered her entire body with a silk cloth. Closing the eyes, they are ready to abandon the body in the path of yoga. It made the vital air equal. It was blocked at the navel. The next one lifted the air up. It brought the upana vayu to the throat and between the eyebrows in the heart. Rudra, the greatest among the great souls, with that respect, repeatedly made this body sit in his lap, and this body, born from Daksha, was ready to be released with anger. In the organs It is the analog that is being held. It is the one which creates the air and fire by holding them in the senses. Jagadrogu, remembering the lotus-like feet of her husband, Rudra, without thinking of anything other than her husband, was without thinking of anything else. Instantly, a flame arose from her body. The body is incinerated. Everyone on Earth and in the sky witnessed the spectacle and exclaimed 'Haha'. The wife of Rudra, the best of gods, Sati Devi, with compassion, gave up her life in Daksha. Aha! How much of a heroic, brutal person Daksha is. The universe is pleasing to Rudra, like a biddu to the world. His wife, being a widow, had given up her life. It's unique. His daughter is worthy of respect. Even though he was Prajapati, Daksha did not respect her.

He was watching her die and he was just sitting there. Look at the violence. Daksha Prajapati is not a Brahmin. Brahma's relative means a Brahmin. Called a vile Brahmin, he will gain infamy in the southern world. Seeing that he was sacrificing his daughter's lives because of the crime he committed in Rudra's matter, he was not the one who forbade her. What a sinner. Pride does not do any work, arrogance is the cause of destruction. In this way, while all the people were shouting, while Daksha was watching, it was surprising to see Sati Devi's body being torn apart. Seeing this, the family that came with her, raised their weapons and rushed to kill Dakshudu. Thus, seeing them come and lie down on Daksha, Bhrugu, after performing a homa with the Rakshoghna mantra in the southern fire, created those who were destroying the yagnya and those who were killing them. As Bhrigu performed the homam, the gods called Bubhuvulu, thousands of them, were holding a korola in their hands to kill them, and were burning Rudra and Parshad. They were so frightened that they all ran away from all sides. The next part, then Let's learn together in our podcast. Jai Srimannarayana and salutations to the Ashmadguru.