ఋషభదేవుని దేహత్యాగం - దివ్య లీలలు
Lord Rishabhadeva's Departure from the Body & Divine Pastimes
శ్రీమద్భాగవతం పంచమ స్కంధంలోని ఈ పవిత్ర ఘట్టంలో, భగవాన్ ఋషభదేవుడు అవధూత వేషంలో భూమిపై సంచరించి, కొంక దేశంలో అడవిలో అగ్నిలో తన దేహాన్ని విడిచిపెట్టిన దివ్య లీలలను వివరిస్తాము. ఆయన దేహం అగ్నిలో లీనమైనప్పటికీ, ఆ దివ్య శరీరం నుండి వెలువడిన సువాసన చుట్టుపక్కల ప్రాంతాలను పవిత్రం చేసింది, ఆయన జన్మ మరణాలకు అతీతుడని నిరూపించింది. వైరాగ్యం, ఆత్మజ్ఞానం మరియు భగవద్భక్తిపై ఆయన ఇచ్చిన బోధనలు ఆ కాలపు రాజులను మరియు ప్రజలను ఎలా ప్రభావితం చేశాయో కూడా ఈ ఎపిసోడ్లో చర్చిస్తాము.
In this sacred episode from the Fifth Canto of Srimad Bhagavatham, we explore the extraordinary final pastimes of Lord Rishabhadeva, who wandered the earth as an avadhuta before relinquishing His body in a forest fire in the region of Konka. Though His physical form was consumed by flames, the divine fragrance of His body continued to purify the surrounding lands, revealing His transcendental nature beyond birth and death. We also reflect on how the kings and people of that era were influenced by His teachings on detachment, self-realization, and devotion to the Supreme.
జై శ్రీమన్నారాయణ అస్మద్ గురుభ్యో నమః నమః కృష్ణాయ రామాయ వసుదేవ సుతాయ చ ప్రద్యుమ్నాయానిరుద్ధాయ సాత్వతాంపతయే నమః వసుదేవుని పుత్రుడవై భక్తులను ఆకర్షించే కృష్ణుడవు నీవే. బలరాముడవై భక్తుల హృదయమును రమింపజేసేది నీవే. ప్రద్యుమ్న అనిరుద్ధ రూపములో ఉన్నది నీవే. యాదవులకు సత్వగుణ ప్రధానులగు భక్తులకు ప్రభువగు నీకు నమస్కారము. 10th క్యాంటో, 16th ప్రేయర్, 16th చాప్టర్, 45th ప్రేయర్. భగవత్ బంధువులారా, శ్రీమద్ భాగవత తత్వ దీపికా. పంచమ స్కంధములో తొమ్మిదవ పాడ్కాస్ట్ లో స్వాగతం. ఇంతవరకు ప్రియవర్తుని చరిత్రలో వృషభ దేవుడిది, వృషభ దేవుడి యొక్క కుమారుడైనటువంటి భరతుడి యొక్క చరిత్ర మనం చదువుతున్నాం. భరతుడు. లేడి గురించి ఆలోచన చేస్తూ చేస్తూ చేస్తూ తను మృత్యువు తరువాత ఒక మృగముగా మళ్ళీ పుడతాడు. ఆ తరువాత భాగాన్ని మనం తెలుసుకుందాం. వెనుకటి జన్మలో నిరంతరము భగవానుని ఆరాధించి ఉండుటచే ఆ ప్రభావం అతనిని వదలక లేడి జన్మలో పూర్వజన్మ స్మృతి ఉండెను. అప్పుడు అతడు చేసిన తప్పునకు కృంగిపోవుచుండెను. అయ్యో! ఎంత తప్పు పని చేసితిని? జ్ఞానుల మార్గము తప్పి చెడు మార్గమున పడితిని. సమస్త సంఘములను విడిచి పుణ్యారణ్యములో. పవిత్రమగు ఆశ్రమమున భగవానుడగు వాసుదేవుని యందే మనస్సు నిలిపి మననము చేయుచు కీర్తించుచు ఉంటినే భగదారాధనమునే సంతతము చేసితిని ఒక్క క్షణము కూడా భగదారాధనము మాని ఉండలేదే అట్టి నా మనస్సు ఆ భగవానుని వదలి ఈ లేడివే ప్రసరించినది. ఎంత పాపము, ఎంత కష్టము అని లోలోన నిర్వేద ముందుచుండి కొద్ది రోజులు తల్లి వద్ద నుండి తల్లిని వదిలి మరలా భగవత్ క్షేత్రముకు పులహాశ్రమమును చేరెను.
అచ్చట కూడా తనను తానే సంతతం స్మరించుకొనుచు ఇతర విషయములను వదలి భగవానునే తలంచుచు శరీరావసానమునకై ఎదురు చూచుచు చివరకు ఆ మృగ శరీరమును వీడి వేరొక శరీరమును పొందు సమయం ఆసన్నమాయెను. భగవత్ అనుగ్రహముచే పూర్వజన్మ స్మరణము ఉండుటచే ఇట్లు బాధపడుచుండెను. అయ్యో నేను జ్ఞానుల మార్గము నుండి భ్రష్టుడనైతిని. అన్నిటియందు సంఘమును వెదలితిని. పుణ్యారణ్యమును ఆశ్రయించితిని. జితేంద్రియుడనై ఒంటిని. సర్వ భూతములకు అంతరాత్మయగు భగవానుడగు వాసుదేవుని యందు సకల భూతములను సకల భూతముల యందు వాసుదేవుని దర్శించితిని. అందుచే సర్వకాలములయందు భగవానుని గూర్చి శ్రవణము, మననము, సంకీర్తనము, ఆరాధనము, ధ్యానము సాగించితిని. సర్వకాలములు ఆ విధముగా భగవానునే స్మరించుచుండుటచే మనస్సు వాసుదేవుని వీడి మరొక దానిని చేరి ఎరుగదు. అట్టి స్థితిలో ఒక లేడి నేను చూచుచుండగా పిల్లను కనెను. ఆ పిల్ల నీటిలో కొట్టుకొని పోవుచుండెను. ఇది అంతయు నా ప్రారబ్ధ కర్మ. ఈ విధముగా లేడి రూపముతో ఉండియు భరతుడు మనసులో బాధపడుచుండెను. తల్లిని వదలి ఉపశమశీలురగు మునులకు ప్రియమైన సాలగ్రామమున పులహాశ్రమమును చేరి అచటనే ఉండెను. అచ్చట కొంతకాలం ఒంటరిగా తిరుగుచు శరీర అవసానం కాలమును నిరీక్షించుచుండెను. ఎవరితోనూ చేరుటకు భయపడుచుండెను. ఎండిన ఆకులు, గడ్డి మొదలగు ఆహారముతోని శరీరము నిలుపుకొనుచు ఒకనాడు నదీ జలములో స్నానము చేసి ఉండగా ఆ శరీరము వీడెను. లేడి శరీరమును విడిన తరువాత కొంత కాలమునకు మరల శ్రోత్రియులగు బ్రాహ్మణుల ఇంటిలో పుట్టెను. ఆ బ్రాహ్మణుడు అంగిరసుడు. శ్యమ, దమ, తప, స్వాధ్యాయ అధ్యయనములు కలవాడు. త్యాగము, సంతోషము, ఓరిమి, వినయము కలవాడు. ఆత్మజ్ఞానముతో సంతతము ఆనందించుచుండెడివాడు. అతనికి శీలము, ఆచారము, రూపము, ఔదార్యము గల తొమ్మండుగురు కుమారులు మొదటి భార్య యందు జన్మించిరి. రెండవ భార్య యందు ఒక మగ, ఒక ఆడ పుట్టిరి. ఆ మగ బిడ్డకి భరతుడని పేరు పెట్టెను. అతడు పరమ భాగవతుడు. రాజర్షులలో
శ్రేష్టుడు. మృగ శరీరమును వీడి బ్రాహ్మణ శరీరమును పొందినవాడు. తన వారితో సంఘమున్నచో మరల ఏ పతనం వచ్చునో అని అతడు భయపడుచుండెను. కర్మ బంధమును ధ్వంసము చేసుకొనవలెనని భగవత్ చరణారవిందములనే స్మరించుచు భగవానిని గుణములనే వినుచు విహరించుచుండెను. వెనుకటి జన్మల స్మరణ ఉండుటచే ఇతర విషయములను ఎరుగని వాని వలె పిచ్చి వాని వలె గుడ్డి వాని వలె మూగ వాని వలె లోకమును కనపట్టుచుండెను. తండ్రి కుమారుని యందు ప్రేమచే మిగిలిన కుమారులకు వలె స్నాతకము వరకు అన్ని సంస్కారములు చేయించెను. ఏది చెప్పినా దాన్ని చేయుచుండెడివాడు. ఉపనయనము చేసి నియమములను చెప్పెను. తండ్రి చెప్పవలెనని చెప్పుచుండెను. చెప్పిన దానిని అట్లే అని విని వెంటనే భరతుడు మరిచిపోవుచుండెను. వారు చెప్పిన దానిని మరిచిపోయినట్లు తప్పుగా పలుకుచు చేయవలసిన కర్మలు ముందు వెనకగా చేయుచు మూర్ఖుడని తలంచి తనను అధ్యయనమునందు కర్మల యందు నిర్బంధింపకుండునట్లు ప్రవర్తించుచుండెను. తండ్రి మాత్రము వదలలేక ప్రేమచే వ్రతములను, నియమములను, అగ్నిహోత్రములను ఆచరించుట మరల మరల నేర్పవలెను ప్రయత్నించెను. కానీ ప్రయోజనము లేకపోయెను. ప్రయత్నించి విఫలుడై బాధపడుతూ చనిపోయెను. ఆ బ్రాహ్మణుని రెండవ భార్య తన బిడ్డలను ఇద్దరినీ పెద్ద భార్యకు అప్పజెప్పి తాను కూడా భర్తతో సహగమనం చేసెను. తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోయిరి. సోదరులే ఇతనికి పోషకులైరి. ఇతని ప్రభావం వారికి తెలియదు. వారికి కర్మాచరణమునందే శ్రద్ధ కానీ ఆధ్యాత్మిక విద్య యందు పరిచయము లేదు. అందుచే వారు భరతుని జడమతి అని వదలిరి. లోకులు జ్ఞానహీనులు బాహ్యముగా అతని ప్రవర్తనమును చూచి పిచ్చివాడా, చెవిటివాడా, జరుడా అని అనుకొనుచుండిరి. ఎవరు ఏ పని చెప్పినా అతడు ఆ పని చేయుచుండెను. ఎవరైనా మాట్లాడించినా మాట్లాడిరివాడు. వారు ఎట్లు చేయమనని అట్లే చేసేడివాడు. కొంతమంది ఇతనిచే పనులు చేయించుకొనుచుండిరి. శరీరము బలముగా ఉండుటచే ఏ పనిని అయినను చేయగలిగేడివాడు. కానీ అతడు అంతర్ముఖుడై దానిని గుర్తించేడివాడు కాదు.
అనుకొనకుండా లభించిన అల్పమో అధికమో ఆహారమును తీసుకునుచుండెడివాడు. ఎవరైనా బ్రతిమాలి పెట్టిన తినిడివాడు, మధురమైన పదార్థములను తినిడివాడు, రుచిలేని వాసన వచ్చిన పదార్థములను కూడా తినిడివాడు. రుచిగా ఉన్నది లేనిది అతనికి తెలియదు. అతనికి దేహాభిమానము లేదు. విశుద్ధమగు భగవదానంద ఆనందానుభవములో మునిగి ఉండెడివాడు. దేహాభిమానము లేకపోవుటచే అతనికి సుఖదుఃఖములు తెలియకుండెను. చలిలో, ఎండలో, గాలిలో, వర్షములో ఏమియు కట్టుకొనక ఎద్దువలె తిరిగెడివాడు. బలమైన దేహము గలవాడు. ఏమియు పరచుకొనక వట్టి నేలపై పరుండెడివాడు. తలంటుట లేదు, స్నానము లేదు, మన్ను పట్టిన మణి వలె అతని బ్రహ్మ వర్చస్సు ప్రకాశింపకుండెను. మొలకొక చిన్న గుడ్డ కట్టుకొని ఉండెడివాడు. బాగుగా మలినమైన యజ్ఞోపవీతం మెడలో ఉండెడిది. దానిచే ఇతడు ఎవరో బ్రాహ్మణ కులమునకు చెందిన వాడని అనుకొనుచుండెరి. ఒకరు ఎవరైనాను పని చేయమని అన్నం పెట్టిన తినడివాడు, తన సోదరులు కూడా పొలం పనులు చేయమని నియమించిన చేసేడివాడు. వారు ఏది పెట్టిన దానిని ఎక్కువ అనక తక్కువ అనక తినడివాడు. నూకలు పెట్టినను, పిండి వంటలు పెట్టినను, తిలక పిండి పెట్టినను, తవుడు పెట్టినను, ఉలువలు పెట్టినను, గిన్నె అడుగంటిన అన్నము పెట్టినను దివ్యములకు పదార్థములను తినినట్లై తినిడివాడు. ఇట్లు ఏదో ఒకటి తినుచు ఎచ్చటనో ఒకచోట పరుండుచు కాలమును గడుపుచుండెను. ఒకనాడు ఒక శూద్ర స్త్రీ భర్త కుమారుడు కలగవలెనని కోరికతో భద్రకాళికి ఒక మనుష్యుని పశువుగా బలి అర్పించవలెనని అట్టి మనుష్యుని కొరకు వెదుకుచుండెను. అతని అనుచరులు ఒక పురుషుని బలికి తీసుకుని వెళ్ళుచుండగా రాత్రి వేళ చీకటిలో అతడు తప్పించుకొని పారిపోయెను. అనుచరులు అతనికై వెదుకుచుండిరి. అర్ధరాత్రి సమయము అంతటను చీకటి అలుముకొని ఉండెను. వారికి ఆ పురుష పశువు ఎచ్చటను లభించలేదు. ఇతడు ఒక పొలం వద్ద వ్యవసాయమును కాపాడుచు మృగములు వరాహములు తినకుండా చూచుటకు మంచపై వీరాసనముతో కూర్చోండి ఉండెను. ఆ బలి పశువుకై వెదుకుచున్న వారికి ఇతడు కనబడెను. ఏ అవయవము లోపము లేకుండా ఉన్న పురుషుడు దొరికినాడని వారు సంతోషించి వానిని పట్టుకొని తమ ప్రభువు కోరిక నెరవేరునని సంతోషించి విప్పారిన ముఖములు గలవారై త్రాళ్ళతో కట్టి.
భద్రకాళి మందిరమునకు తీసుకొని వచ్చిరి. ఆ భృత్యులు భరతునకు పశువుగా అర్పించుటకు ముందు చేయదగిన స్నానము చేయించిరి. నూతన వస్త్రములను ధరింపచేసిరి. ఆభరణములు పెట్టిరి. చందనములు పూసి హారములను వేసి బొట్టు పెట్టిరి. పుష్టిగా ఆహారమును పెట్టిరి. ధూపము, దీపము, మాలికలు, లాజలు, చిగుళ్ళు, అంకురములు, పండ్లు మొదలగునవన్నీయు పళ్ళెములతో పట్టుకొని భరతుని యధా వధాస్థానమునకు తీసుకొని వెళ్లిరి. దేవికెదురుగా పాటలు పాడుచు స్తోత్రము చేయుచు మద్దెలలు డప్పులు మ్రోగించుచు భద్రకాళి ఎదుట ఆ పురుష పశువును నిలిపిరి. అచట పూజారి ఈ పురుష పశువును చంపి అతని రక్తముతో భద్రకాళిని అర్చించవలెనని భద్రకాళి మంత్రములతో మంత్రించి కత్తి పట్టి నిలిచెను. అచర పూజారులు అందరూ రజస్తమో స్వభావము గలవారు. ధనముచే మదించి గర్వించిన మనస్సు గలవారు. బ్రాహ్మణులను హీనముగా భావించి చెడు మార్గముల యందు యధేచ్ఛగా విహరించువారు. హింస వినోదముగా గలవారు. అట్టి బ్రహ్మర్షి అయిన అంగిరసుని కుమారుడు అయిన భరతుడు తనను చంపుచున్నారని తెలిసియు వద్దని అనలేదు. బ్రహ్మ తేజస్సుతో ప్రకాశించుచున్నాడు. ఆ రూపమును చూచి భద్రకాళి ఆ విగ్రహము నుండి వెలకి వచ్చెను. తీవ్రమగు అమర్షముతో ఓర్వరాని కోపముతో, ఆవేశముతో కనుబొమ్మలు ముడుచుచు చెట్టు కొమ్మల వలె ఉన్న కోరలతో, ఎర్రని కన్నులతో, అతి భయంకరమగు ముఖముతో వారిని చంపదలంచినదై మిక్కిలి సమరంభముతో మహాట్టహాసము చేయుచు భరతుని చంపుటకు ఎత్తిన కత్తులను లాగికొని ఆ కత్తితో వారందరి కంఠములను ఛేదించెను. స్రవించుచున్న వేడి రక్తమును తన పరివారముతో పానము చేసెను. రక్తం ఎక్కువ తాగి మత్తెక్కి తన భృత్యులతో కలిసి పాడుచు నృత్యము చేయసాగెను. వారి తలను బంతుల వలె ఆడుచుండెను. దీనిచే మనం ఎరంగవలసిన ఎరంగవలసినది మహాపురుషులను హింసించుట అనడి అపచారము సంకల్పించిన వారిని ఎదురు తిరిగి చంపును. భరతునకు తనను చంపవలెనని అనుకొనిన వారిపై ఏమియు మనసున కినుకువు లేకుండెను. తాను చనిపోవుదన్న భయము కలగలేదు. ఈ ఆశ్చర్యము చూడుడు. భగవత్భక్తులైన పరమహంసలు తమ శిరస్సు తెగిపోవుననటి సన్నివేశం ఏర్పడినను ఏమియు కలత చెందరు. వారికి దేహాత్మ అనేటి భావము వాసనా మాత్రంగా కూడా ఉండదు.
వారికి ఎవ్వరి యందు వైరం ఉండదు. వారు భగవానుడి చేతనే రక్షింపబడుచుందురు. చేతిలో చక్రము దాల్చి శ్రీ మహావిష్ణువు ఎల్లప్పుడూ కాపాడుచున్నట్లు వారికి భాసించుచుండును. భద్రకాళి యందును తనను చంపుటకు తీసుకుని వచ్చిన వారి యందును భగవానుడుకు వాసుదేవుడే చూచుచుండెను. అందుచే అతనికి భయ భయము ద్వేషము కలగలేదు. తర్వాత భాగాన్ని మరొక ఎపిసోడ్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమః
Jai Srimannarayana, salutations to the Gurus. Salutations to Krishna, the son of Vasudeva, and to Pradyumna, the son of Nandaka. Salutations to the lord of Satvata. Being the son of Vasudeva, you are the Krishna who attracts devotees. You are the one who is like Balarama, pleasing the hearts of devotees. You are the one who is in the form of Pradyumna and Aniruddha. Salutations to you, the Lord, who is the foremost of the virtuous and the lord of the devotees. 10th Canto, 16th Prayer, 16th Chapter, 45th Prayer. Devotees of the Lord, Srimad Bhagavata Tattva Deepika. Welcome to the ninth podcast in the fifth book. Until now, in the history of Priyavartuni, we are reading the history of Bharata, the son of Vrishabha Deva. Bharata. Thinking about the lady, thinking, thinking, thinking, he will be reborn as an animal after death. We will learn about the next part. Because he had been constantly worshiping God in his previous birth, that effect did not leave him, and in the birth of a deer, he had a memory of his previous birth. Then he was depressed because of the mistake he had made. AGH! How wrong a deed I have done! I have strayed from the path of the wise and fallen into the path of evil. Leaving all the congregations in the sanctuary. In the sacred abode, keeping my mind on Lord Vasudeva, I have always been meditating and praising. I have never abandoned the worship of the Lord even for a moment. Such is my mind, abandoning that Lord, this deer The broadcast. How much sin, how much suffering, thinking in her heart, for a few days, leaving her mother, she left her mother and again reached the Bhagavat Kshetram and Pulahashram.
There also, remembering himself as the progenitor, leaving other things, thinking of the Lord, waiting for the end of the body, finally, the time has come to leave that animal body and get another body. By the grace of God, because of the remembrance of his past life, he was suffering like this. Oh, I have strayed from the path of the wise. I have searched for the church in all of them. I have taken refuge in the Punyaranyam. Jitendriya, the one with the mind. I have seen Vasudeva, the Lord who is the inner soul of all beings, in all beings, in all beings, in Vasudeva. Therefore, I have been engaged in listening, contemplation, singing, worship, and meditation about the Lord at all times. For all time, by remembering the Lord in that way, the mind does not leave Vasudeva and reach another. In that situation, while I was watching a deer, I gave birth to a baby. The child was swept away by the water. This is all my bad karma. In this way, even though he was in the form of a deer, Bharata was suffering in his mind. Leaving the mother, dear to the sages who are at peace He reached the Pulahashrama in Salagrama and stayed there. There, for some time, he wandered alone, waiting for the end of his body. Afraid of getting close to people. The body, which was sustained by food like dried leaves and grass, one day while bathing in the river water, that body was lost. After separating the female body, after some time, he was born again in the house of Brahmins who were Shrotriyas. The Brahmin was Angiras. One who has Shyama, Dam, Tapa, Swadhyaya and studies. One who is full of sacrifice, happiness, humility and modesty. He who is always delighted with self-knowledge. He had three sons, born to his first wife, who were virtuous, cultured, beautiful, and generous. A son and a daughter were born to the second wife. The male child was named Bharata. He is a jolly good fellow. In the Rajarshi
The best. He who left the body of a beast and obtained a Brahmin body. He was afraid that if he had a church with them, what fall would come again. He was remembering the lotus feet of the Lord, listening to the virtues of the Lord, and reveling in destroying the bondage of karma. Because of the remembrance of past lives, like a madman, like a blind man, like a mute man, who knows nothing of other things, who is blind, he was captivating the world. The father, out of love for his son, had all the rites performed until graduation for the remaining sons. He would do anything that was asked. He performed the Upanayana and told the rules. Father was saying that he would tell. Hearing that it was as told, Bharata immediately forgot. He was behaving as if he had forgotten what they had said, speaking incorrectly and doing the deeds that had to be done, considering himself a fool and acting in such a way that he would not be bound in study and deeds. Father, unable to let go, should teach them again and again to perform vows, rules, and Agnihotra with love He tried. But it was of no use. He tried, failed, and died. The Brahmin's second wife entrusted both her children to the elder wife and she also committed Sati with her husband. Both parents died. Brothers are his patrons. They don't know his influence. They have only devotion to the performance of karma, but no acquaintance with spiritual education. Therefore, they left Bharata's head as it was. People, being ignorant, externally observed his behavior and thought, 'Is he mad? Is he deaf? Is he lame?' Whoever told him to do what, he kept doing it. Someone who made them speak. He did what they told him to do. Some people were getting work done by him. He is able to do any work because his body is strong. But he was a loner and didn't want to be found.
He who eats food, whether small or large, without thinking. Someone who is fed by begging, someone who is fed sweet substances, someone who is fed even tasteless, smelly substances. He knows no one knows what is good or bad. He has no body. He was immersed in the bliss of divine pleasure. Due to the lack of ego of the body, he did not know happiness and sorrow. In the cold, in the sun, in the wind, in the rain, without wearing anything, he roamed like an ox. Of strong build. He lay on the bare ground, not moving at all. He had no head, no bath, and his divine splendor did not shine like a gem embedded in the earth. He was wearing a small piece of cloth. The consecrated thread was finely twisted and went around the neck. Therefore, they thought that he belonged to the Brahmin caste. One who was hungry because someone gave him food to work, his brothers also appointed him to do farm work. He would not eat what they put on him, but would only eat what he could find. Even if I put in the pieces, Even if you put flour dishes, even if you put sesame flour, even if you put bran, even if you put lentils, even if you put rice, even if you put food, he eats like he has eaten divine things. Thus, eating something or the other, she was spending her time somewhere. Once upon a time, a Shudra woman, with the desire to have a husband and son, was searching for a man to sacrifice to Bhadrakali as an animal. While his followers were taking a man for sacrifice, he escaped and ran away in the darkness of the night. The followers were looking for him. It was midnight, and darkness had fallen. They did not find that male animal anywhere. He was sitting on a bed with a Veeraasana posture near a field to protect the agriculture and to see that the animals and Varahas do not eat. He appeared to those who were seeking the sacrificial animal. They rejoiced that they had found a man without any defect in any limb, and they took him, rejoiced that they had fulfilled the Lord's desire, and with open faces, with ropes Tied up.
They brought it to the Bhadrakali temple. Those servants made Bharata perform a bath before offering him as a sacrifice. They were made to wear new clothes. Jewelry was put on. They applied sandalwood paste, put garlands, and applied a dot. They provided nutritious food. Incense, lamps, garlands, jewels, sprouts, buds, fruits, and all such things were taken along with plates and taken to Bharata's place of execution. Singing songs and praising in front of the goddess, playing drums and cymbals, they stopped that male animal in front of Bhadrakali. There, the priest, after killing this male animal, chanted with the Bhadrakali mantras, saying that Bhadrakali should be worshipped with his blood, and stood holding the sword. The Acharya priests are all of the Rajasthani style. Those who are proud and arrogant because of money. Those who consider Brahmins inferior and freely roam in bad paths. People who enjoy violence. Bharata, the son of Angirasa, who was such a Brahmarshi, did not say no even after knowing that he was being killed. With the splendor of Brahma He is shining. Seeing that form, Bhadrakali came out of that idol. With intense anger, unable to control, with rage, with fervor, closing eyebrows, with fangs like tree branches, with red eyes, With a very frightening face, intending to kill them, with great enthusiasm, laughing loudly, pulling out the knives raised to kill Bharata, she severed the throats of all of them with that knife. He drank the hot blood that was flowing, with his family. He drank a lot of blood, became intoxicated, and started dancing with his servants. He was playing with his head like a ball. By this, what we have to erase, what we have to erase is to oppose those who have committed the crime of torturing great men and kill them. Bharata had no desire in his heart for those who thought he should be killed. He had no fear of death. Look at this surprise. The supreme saints, who are devotees of the Lord, do not be disturbed even when a scene occurs where their heads are about to be severed. They do not even have the feeling of a body or a sense of self.
They do not have enmity with anyone. They are protected by God. Sri Maha Vishnu, with a discus in his hand, always protects them, shining on them. In Bhadrakali and among those who brought him to kill him, Vasudeva was watching the Lord. Therefore, he did not have fear, dread, or hatred. We will find out the rest in another episode. Jai Srimannarayana. Salutations to the Asmadgurus